1 ENS Live Breaking News

యూనివర్శిటీల కోసం మాట్లాడే అర్హత టిడిపికి లేదు..

ఆంధ్రప్రదేశ్ లో యూనివర్శిటీల కోసం మాట్లాడే అర్హత టిడిపి నాయకులకు లేదని వైఎస్సార్సీపి విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు బి. కాంతారావు అన్నారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, టిడిపి హయాంలో యూనివర్శిటీలు వీసిలకు నోచుకోలేదన్నారు. అలాంటిది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ యూనివర్శిటీలకు విసిలను నియమిస్తే తట్టుకోలేని టిడిపి అవ్వాకులు, చెవ్వాకులు పేలుతోందన్నారు. విద్యార్ధుల కోసం వారి భవిష్యత్తు కోసం ఆలోచించి వారి పక్షాన నడిచిన ఘనత వైఎస్సార్సీపీ పార్టీకే దక్కుతుందన్నారు. ఒక ఉన్నత విద్యావంతుడు, దళితుడు అయిన ఆదిమూలపు సురేష్ ను రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యాశాఖ మంత్రిగా చేస్తే దానిని కూడా టిడిపి జీర్ణించుకోలేకపోతుందన్నారు. దళితులంటే టిడిపికి చులకనగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మంత్రిగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే విద్యావిధానంలో సమూల మార్పులు ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. టిడిపి హయాంలో ప్రైవేటు విద్యాసంస్థలు అభివ్రద్ధి చెందితే తమ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ విద్యాసంస్థల కంటే దీటుగా ప్రభుత్వం నాడు నేడు కింద అభివ్రుద్ధి చేసిందన్నారు. చంద్రబాబు తన హాయంలో కీలకమైన పదవులు కమ్మసామాజిక వర్గానికి ఇవ్వలేదా అని ప్రశ్నించారు. టిడిపి నోటికొచ్చినట్టు ఊరుకునేది లేదని హెచ్చరించారు..

ఆంధ్రాయూనివర్శిటీ

2020-12-07 19:28:00

తిరుపతి పోలీస్ స్పందనకు 28 దరఖాస్తులు..

తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందన పై సత్వరం పరిష్కారం చూపించాలని సిబ్బందిని ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో స్పందనలో అడ్మిన్ ఎస్పీలు సుప్రజ, ఆరిఫుల్లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అడ్మిన్ ఎస్పీలు మాట్లాడుతూ, ఈరోజు స్పందనలో  జిల్లా యస్.పి కార్యాలయానికి 28 ఫిర్యాదులు వచ్చాయన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని ప్రజలు నేరుగా వచ్చి కలిసి తమ యొక్క సమస్యల తెలియజేశారన్నారు. వారి యొక్క సమస్యలకు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరిని కేసు విషయాలు అడిగి తెలుసుకొని సంబందిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసినట్టు వివరించారు. అంతేకాకుండా   ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకార విచారణ జరిపి, నిర్దేశించిన గడువు లోగా ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు వారికి సమాచారం కూడా అందిస్తామన్నారు. ముఖ్య సమస్యలపై పోలీసు అధికారులను కూడా యస్.పి స్పందన కార్యక్రమానికి పిలిపించి ఇక్కడే స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్టు అడ్మిన్ ఎస్పీలు వివరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tirupati

2020-12-07 19:05:14

పతాక నిధికి విరివిగా విరాళాలివ్వండి..

మాజీ సైనికులు, అమ‌ర వీరుల కుటుంబాల సంక్షేమం ల‌క్ష్యంగా చేప‌ట్టే కార్య‌క్ర‌మాలకు ఉద్దేశించిన సాయుధ ధళాల పతాక దినోత్సవ నిధికి విరివిగా విరాళాలు అందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. సోమ‌వారం భార‌త సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వం సంద‌ర్భంగా కాకినాడ‌లోని క్యాంపు కార్యాల‌యంలో క‌లెక్ట‌ర్‌.. సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వ నిధిని ప్రారంభించి, విరాళం అందించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ దేశ ర‌క్ష‌ణ‌కు అహ‌ర్నిశ‌లు కృషిచేసిన సైనికుల త్యాగాల‌ను గుర్తుచేసుకుంటూ వారి కుటుంబాల‌కు అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌రం ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌న్నారు. మాజీ సైనికులు, అమ‌ర‌వీరుల కుటుంబాల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త‌న్న విష‌యాన్ని గుర్తుంచుకొని, ప‌తాక దినోత్స‌వ నిధికి విరాళాలు అందించాల‌ని పిలుపునిచ్చారు. జేసీ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జేసీ (సంక్షేమం) జి.రాజ‌కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) సీహెచ్ స‌త్తిబాబు త‌దిత‌రులు కూడా విరాళాలు అందించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ పి.స‌త్య‌ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-12-07 18:58:28

ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించే నిమిత్తం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిందని వినూత్నమైన  మార్పులు తీసుకువచ్చిందని జాయింట్ కలెక్టర్ మహేష్. కుమార్  పేర్కొన్నారు.   జాయింట్ కలెక్టర్ సోమవారం తన పర్యటనలో భాగంగా కొమరాడ మండలం విక్రంపురం, కంబవలస సచివాలయాల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు, అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోటే నివాసం ఉండాలన్నరు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా ఆనుసరించాలని, సేవల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ విధిగా సమయానికి విధులకు హాజరు కావాలని సమయ పాలన పాటించాలని అన్నారు.  పిర్యాదుల సేకరణలో పరిష్కారంలో ఆలసత్వం ప్రదర్శించ వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హజరుపట్టి, ప్రగతి నివేదికల పట్టిక పరిశీలించారు, అనంతరం కంబవలస   అంగన్వాడీ కేంద్రం సందర్శించి కేంద్రంలో నిర్వహిస్తున్న పనులపై ఆరా తీసి సూచనలు అందించారు. అనంతరం రాజ్యలక్ష్మి పురం ఎం.పి.పి.స్కూల్లో నిర్వహిస్తున్న నాడు - నేడు పనులను పరిశీలించి నిర్వహిస్తున్న పనుల పై ఆరాతీశారు.  అనంతరం జాయింట్ కలెక్టర్  మాట్లాడుతూ పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఆత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు, నాడు నేడు పనులు వేగవంతం చేయాలన్నారు.         అనంతరం కొమరాడ APGVB బ్యాంకులో వై.ఎస్.ఆర్.భీమా, జగన్నన్న తోడు పనుల అమలుకు     సంబంధించిన పనులు పరిశీలించారు.

Vizianagaram

2020-12-07 18:32:20

అభివ్రుద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలి..

విజయనగరం జిల్లా కొమ‌రాడ మండ‌లంలో జ‌రుగుతున్న ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను, స‌చివాల‌యాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్ సోమ‌వారం త‌నిఖీ చేశారు. మండ‌లంలో ఆయ‌న సుడిగాలి ప‌ర్య‌ట‌న జ‌రిపారు. విక్ర‌మ‌పురంలో నిర్మిస్తున్న స‌చివాల‌య భ‌వ‌న నిర్మాణాన్ని ప‌రిశీలించారు. రాజ్య‌ల‌క్ష్మీపురం మండ‌ల‌ప‌రిష‌త్ ప్రాధ‌మిక పాఠ‌శాల‌లో జ‌రుగుతున్న నాడూ-నేడు ప‌నుల‌ను త‌నిఖీ చేశారు. అలాగే కంబ‌వ‌ల‌స గ్రామానికి వెళ్లి, అక్క‌డ నిర్మితం అవుతున్న స‌చివాల‌య భ‌వ‌నాన్ని, అంగ‌న్‌వాడీ కేంద్రం భ‌వ‌నాన్ని ప‌రిశీలించారు. అభివృద్ది ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని, స‌కాలంలో పూర్తి చేయాల‌ని ఆదేశించారు. అనంత‌రం దుగ్గి గ్రామంలో నిర్మిత‌మ‌వుతున్న అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని సంద‌ర్శించారు. ఇదే గ్రామంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామీణ వికాశ్ బ్యాంకు శాఖ‌కు వెళ్లి, వైఎస్ఆర్ బీమా, జ‌గ‌న‌న్న‌తోడు కార్య‌క్ర‌మాల అమ‌లుపై ఆరా తీశారు. అర్హులంద‌రికీ త్వ‌ర‌గా ప‌థ‌కాల‌ను అంద‌జేయాల‌ని కోరారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఇన్‌ఛార్జి తాశీల్దార్ సూర్య‌నారాయ‌ణ‌, ఎంపిడిఓ గోపాల‌కృష్ణ‌, ఎంఇఓ నారాయ‌ణ‌స్వామి, మండ‌ల ఇంజ‌నీర్ జి.చంద్ర‌మౌళి త‌దిత‌ర అధికారులు పాల్గొన్నారు.

Komarada

2020-12-07 18:13:20

త్వరలోనే యన్ఐడియం కార్యకలాపాలు..

క్రిష్ణాజిల్లాలో త్వరలోనే యన్ఐడియం కార్యకలాపాలు ప్రారంభం కావాలన్న ఆశాభావాన్ని కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ వ్యక్తం చేసారు. స్ధానిక జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జాతీయ విపత్తుల నివారణ సంస్ధ (యన్ఐడియం) కృష్ణాజిల్లాలో ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రకృతి విపత్తుల నివారణాసంస్ధ మేనేజింగ్ డైరెక్టరుతో చర్చించి యన్ఐడియం త్వరితగతిన ఏర్పాటుకు ప్రభుత్వపరంగా సానుకూల ఉత్తర్వులను జారీ చేయడం జరుగుతుందన్నారు. యన్ఐడియం ఏర్పాటు కోసం అభివృద్ది నిధుల చెల్లింపులు నిలుపుదల చేయాలని, ప్రభుత్వం నుండి సానుకూల ఉత్తర్వుల కోసం ప్రభుత్వానికి లేఖ వ్రాయడం జరుగుతుందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వంతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నందున అధికారులు నిర్మాణపనులకు ఎ టువంటి ఆటంకం లేకుండా సహకారం అందిస్తారని కలెక్టరు తెలిపారు. విద్యుత్తు కనెక్షన్లు, నీటిసరఫరా, రహదారుల అనుసంధానంకు సంబందించి సంబంధిత శాఖల అధికారులు నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న కలెక్టరు యన్ఐడియంపై ఎ టువంటి అదనపు భారం లేకుండా శాఖాపరంగా వీలైనంత మేరకు సహకారాన్ని అందిస్తామని కలెక్టరు ఇంతియాజ్ పేర్కొన్నారు. ఈసమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు కె. మాధవిలత, సబ్‌కలెక్టరు ప్రతిష్టామాంగైన్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, యన్ఐడియం జాయింట్ డైరెక్టరు లెఫ్టెనెంట్ కల్నల్ బి.సి. వశిష్ట, యన్ఐడియం అధికారి అశోక్, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు, విద్యుత్తు, ఆర్ డబ్ల్యుయస్, ఆర్అండ్‌బి, పంచాయతిరాజ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Vijayawada

2020-12-07 18:08:50

పెండింగ్ కార్డులు మ్యాపింగ్ పూర్తిచేయాలి..

తూర్పుగోదావరి జిల్లాలో పెండింగ్ లో ఉన్న బియ్యం కార్డుల మ్యాపింగ్ తక్షణమే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.జి.లక్ష్మీశ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.  సోమవారం పౌరసరఫరాల  శాఖ కమిషనర్ కోన శశిధర్ విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి జేసి లక్ష్మీ శ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ  బియ్యం కార్డుల మ్యాపింగ్ పై సబ్ కలెక్టర్లు, డివిజనల్ స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు లక్ష 30 వేల బియ్యం కార్డులు పెండింగులో ఉన్నాయని వీటిని వెంటనే పూర్తిచేయాలని ఆయన తెలిపారు. వి ఆర్ వో లాగిన్ లో ఉన్నవి,వాలంట్రీలు లాగిన్ లో ఉన్నవి బియ్యం కార్డు దారుని లొకేషన్ వివరాలు మొబైల్ యాప్ లోవివరాలు నమోదు చేయాలని జేసి తెలిపారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల డీఎం ఇ. లక్ష్మీ రెడ్డి, డిఎస్ వొ పి. ప్రసాదరావు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-12-07 17:59:13

సామాజిక బాధ్యతగా వ్యర్ధాలపై యుద్దం చేయాలి..

వ్యర్థాలతో అనర్థాలు కలుగుతాయని ,వాటిపై పోరాటం చేసి ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని,తద్వారా జిల్లాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటు అందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మాత్యులు మాల గుండ్ల శంకర్ నారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం గోరంట్ల మండలకేంద్రం,గోరంట్ల పంచాయతీలో“ వ్యర్థాలపై వ్యతిరేక పోరాట పక్షోత్సవాలు ” జిల్లా స్థాయి కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు లతో కలిసి మంత్రి పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి పార్వతి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ఈనాటి నుండి ఈ నెల21 వ తేదీ వరకు 15 రోజులపాటు వ్యర్థాలపై వ్యతిరేక పోరాట పక్షోత్సవాలద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను రూపొందించిందన్నారు. ప్రజలంతా సామాజిక బాధ్యతతో మనం- మన పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. మనం వాడిపడేసిన వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడ పడేసి రోగాల బారిన పడరాదన్నారు.మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వ్యర్ధాలను తడి,పొడి చెత్తగా వేరుచేసి చెత్త కుండీలలో వేయాలన్నారు. గ్రామపంచాయతీ, మునిసిపల్ సిబ్బంది ఆ వ్యర్ధాలను చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలకు తరలించాలన్నారు.ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలిగినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఆరుబయట  మలవిసర్జనకు స్వస్తి పలకండి :జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, ఆరుబయట  మలవిసర్జనకు స్వస్తి పలికి మరుగుదొడ్లను వాడాలని  కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నప్పటికీ వాటిని ఉపయోగించకుండా ఈనాటికీ చాలామంది  బహిరంగ ప్రదేశాలలో  మల విసర్జన చేయడం జరుగుతోందన్నారు.తద్వారా అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు.నిర్మించుకున్న మరుగుదొడ్లను వాడటమే కాకుండా ,చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. అపరిశుభ్రంగా ఉండటం వలన పలురకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితోపాటు, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఇంట్లోని వ్యర్థాలను తప్పనిసరిగా చెత్త కుండీలలో లోనే వేయాలన్నారు . ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలంతా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ప్లాస్టిక్ ను వివిధ రూపాలలో వాడి పడేయడం వలన పర్యావరణానికి హాని కలుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ, వ్యర్థాలపై వ్యతిరేక పోరాట కార్యక్రమంలో స్వయం సహాయక బృందాలు, రైతులు, విద్యార్థులు, అధికారులు ,ఎన్జీవోలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు .ప్రతి ఒక్కరూ రోజుకు రెండు రూపాయలు చెల్లించి తడి చెత్త ,పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు. డిసిసిబి చైర్మన్ పామిడి వీరాంజనేయులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాలలో ప్రజలతోపాటు ,ప్రజాప్రతినిధులు, అధికారులందరూ పాల్గొనాలని ఆయన సూచించారు.  కార్యక్రమం ప్రారంభానికి మునుపు మనం- మన పరిశుభ్రత, వ్యర్థాల పై యుద్ధంనకు సంబంధించి ప్లకార్డులను చేతబూని పట్టణంలోని ప్రధాన వీధుల్లో, స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి సభావేదిక వద్దకు వరకు  కర్ణాటక మంగళూరు ప్రాంతం విచిత్ర వేషధారణ కళాకారులు,గురవయ్యలు ,కీలు గుర్రాలు, చెక్కభజన లాంటి కళారూపాలతో నిర్వహించిన ర్యాలీ ఎంతగానో ఆకట్టుకుంది.  ఈ సందర్భంగా చెత్త నుండి సంపద తయారుచేసే కేంద్రాన్ని మంత్రి ,ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్ లు ప్రారంభించారు .అనంతరం అక్కడే వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్ లను వారు పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం మరియు ఆసరా) గంగాధర్ గౌడ్ ,జడ్పీ సీఈఓ శోభా స్వరూపరాణి,  జిల్లా అధికారులు ,మండల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Gorantla

2020-12-07 17:41:07

విశాఖలో 3కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం..

ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు అందరూ మొక్కలు నాటుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  సోమవారం పనోరామ హిల్స్ వద్ద మొక్కలు నాటు కార్యక్రమంలో రాష్ల్ర పర్యాటక శాఖ మంత్రి, రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటుటకు ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో 3 కోట్లు మొక్కలు నాటుటకు లక్ష్యమన్నారు.  మొక్కలు నాటడం వలన వాతావరణ కాలుష్యం నివారణ, ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుందన్నారు. రాజ్యసభ సభ్యులు వి. విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో 3 కోట్ల మొక్కలు నాటాలన్నారు.  రాష్ట్రంలో విశాఖపట్నం సిటీ అంతా మొక్కలు నాటి కాలుష్యనివారణకు అందరూ సహకరించాలని చెప్పారు.  విమానాశ్రయంనకు వెళ్లే మార్గంలోనూ మొక్కలు నాటాలన్నారు.  ప్రతి ఒకరూ మొక్కలు నాటాలని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో జివియంసి కమీషనర్ జి. సృజన, విఎంఆర్డిఎ కమీషనర్ కోటీశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ వి. వేణుగోపాల్ రెడ్డి, డిఎఫ్ఓలు డి. లక్ష్మణ్, శాంతిస్వరూప్, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-07 17:30:29

శ్రీకాకుళంలో స్పందనకి 58 వినతులు..

శ్రీకాకుళంజిల్లాలో స్పందన కార్యక్రమానికి 58 వినతులు వచ్చినట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన కార్యక్రమం జరిగింది. కరోనా నేపధ్యంలో ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా వినతులు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఫిర్యాదులు అందాయి. ఫోన్  స్పందన, ఎలక్ట్రానిక్ స్పందన ద్వారా ప్రజలు వివిధ రకాల అర్జీలు తెలియజేసారని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు బదలాయించి వాటికి వారంరోజుల్లో పరిష్కారం చూపించాల్సింది ఆదేశించినట్టు డిఆర్వో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం హెచ్ సెక్షన్  నుండి చలమయ్య, స్పందన విభాగం  సూపర్ వైజర్ బి.వి.భాస్కరరావు, హెచ్.సెక్షన్ డి.టి.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-07 17:29:18

విశాఖలో ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం..

భారత ఉప రాష్ట్రపతి  ఎం .వెంకయ్య నాయుడుకి విశాఖలో ఘనస్వాగతం లభించింది. జిల్లా పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం  10.20 గంటలకు ప్రత్యేక విమానం ఆయన విశాఖపట్నం  చేరుకున్నారు.  విమానాశ్రయంలో ఆయనకు ఘన ప్రజాప్రతినిధులు, అధికారులు, బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి  ముత్తం శెట్టి శ్రీనివాసరావు,  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, నగర పోలీస్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా, పార్లమెంట్ సభ్యులు  ఎం .వి.వి.సత్యనారాయణ, బి.వి.సత్యవతి, శాసన మండలి సభ్యులు  పి.వి.ఎన్ మాధవ్,  శాసన సభ్యులు  పి జి. వి ఆర్ నాయుడు, మాజీ శాసన సభ్యులు  పి.విష్ణుకుమార్ రాజు, జాయింట్  కలెక్టర్  గోవిందరావు, తదితరులు ఉన్నారు. 

విశాఖ ఎయిర్ పోర్టు

2020-12-07 17:14:10

వ్యర్ధాలపై వ్యతిరేకపోరాటం ఉద్యమంలా చేయాలి..

వ్యర్థాలపై వ్యతిరేఖ పోరాటంను విజయవంతానికి అందరూ శ్రద్థతీసుకోవాలని అరకు పార్లమెంటు సభ్యురాలు జి. మాధవి పేర్కొన్నారు.  సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వ్యర్థాలపై వ్యతిరేఖ పోరాటం కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంపై యువతను ఉత్తేజ పరచాలని, మన ప్రాంతంను మనమే శుభ్రం చేసుకోవాలని చెప్పారు. ప్రతీ కుటుంబ సభ్యులందరూ మరుగుదొడ్డిని ఉపయోగించుకొనేలా చూడాలన్నారు.  స్నానానికి ఉపయోగించే నీరు, పాత్రలు శుభ్రపరచడం, బట్టలు ఉతకడర వంటి వ్యర్థ జలాలను మురుగు నీటి పారుదల వ్యవస్థ ద్వారా లేదా ఇంకుడు గుంతలకు మళ్ళించడం ద్వారా మురుగునీరు రొడ్లపై ప్రవహించకుండా అందరూ బాధ్యత వహించాలని పేర్కొన్నారు.  పర్యాటక ప్రాంతాల్లో చెత్త ఉండకుండా అందరూ తగు జాగ్రత్తలు వహించాలని చెప్పారు.  అందరమూ ఒక బాధ్యతగా తీసుకొని వ్యర్థాలపై వ్యతిరేఖ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.  ఇందుకు అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు.  పాయకరావుపేట శాసన సభ్యులు గొల్ల బాబూరావు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్నవారంతా వ్యక్తిగత పారిశుధ్యం గురించి తెలుసుకొని ఉండాలని కనీసం వారు  ఆహారం తినే ముందు, మలవిసర్జన తరువాత సబ్బుతో చేతలు కడుగుకోవాలని చెప్పారు.  ప్రతి గ్రామంలోను వ్యర్థాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.  మన గ్రామాలను మనం శుభ్రం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు.  పాడేరు శాసన సభ్యులు జి. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వ్యర్థాలపై పోరాటానికి ఒక ప్రణాళికను తయారు చేసుకొని ప్రణాళిక ప్రకారం పరిశుభ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.  ప్రతీ ఒక్కరూ తమ తమ గ్రామాలను పరిశుభ్రం చేసుకునేందుకు సహకరించాలన్నారు.  అరకు శాసన సభ్యులు శెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ  గ్రామాలను శుభ్రం చేసుకోవడానికి అందరమూ నడుం బిగించాలన్నారు.  జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగార్జున సాగర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో వ్యర్థంపై పోరాటంను పటిష్టంగా అమలు చేయాలన్నారు. అంతకు ముందు జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్.ఇ. రవి కుమార్, డిపిఓ కృష్ణవేణి, సెట్విస్ సిఇఓ శ్రీనివాసరావు, ఎస్.సి., బి.సి. కార్పొరేషన్ ఇ.డి.లు శోభారాణి, పెంటోజిరావు, ఎంపిడిఓలు, ఇఓఆర్.డి.లు, తదితరులు పాల్గొన్నారు.     అనంతరం డిఎల్.పి.ఓ.లు, ఎంపిడిఓలు, ఇఓఆర్.డి.లు, తదితర అధికారులతో వ్యర్థాలపై వ్యతిరేఖ పోరాటంను విజయవంతానికి అందరూ కృషిచేయాలని జిల్లా పరిషత్ సి.ఇ.ఓ. నాగార్జున సాగర్ పిలుపునిచ్చారు.  కార్యక్రమాలను నిర్వహించినపుడు స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులను పిలవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాలపై తీసుకోనున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.  ఈ సమావేశంలో ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్.ఇ. రవి కుమార్, డిపిఓ కృష్ణవేణి, సెట్విస్ సిఇఓ శ్రీనివాసరావు, ఎంపిడిఓలు, ఇఓఆర్.డి.లు, తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2020-12-07 17:00:40

వీర జవానుల కుటుంబాలకు చేయూత..

వీర జవానుల కుటుంబాలకు చేయూతను అందించాలని  జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపు నిచ్చారు.  సోమవారం సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమం సందర్భంగా  జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్  మాట్లాడారు. దేశ రక్షణలో అమరులైన, క్షతగాత్రులైన సైనిక కుటుంబాలకు, మాజీ సైనిక కుటుంబాలకు సహాయ పడవలసిన ఆవశ్యకత ప్రతీ ఒక్కరి పైన వున్నదన్నారు.  సాహసోపేత వీర జవానులకు వందనం సమర్పించేందుకు, వారి కుటుంబాలకు చేయూతను అందించుటకు సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నదని చెప్పారు. భారత సైనిక దళాలు, చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశం గర్విస్తోందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ సైనికుల ధైర్య సహాసాలకు, తెగువకు మరో పేరుగా నిలుస్తుందని ఆయన వివరించారు. ఎంతో మంది సైనికులు దేశ రక్షణకు ప్రాణాలు అర్పంచారని ఆయన అన్నారు. ఆయా కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. పతాక దినోత్సవం సందర్బంగా ప్రతీ ఒక్కరూ ఉదారంగా విరాళాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి జి.సత్యానందం, జిల్లా పంచాయితీ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-07 16:58:15

అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి స్థలం..

అర్హులైన లబ్ధిదారులందరికీ డి–ఫామ్‌ పట్టా ఇచ్చి, ఇంటి స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి ఇటీవల  స్పష్టం చేశరని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని) పేర్కొన్నారు. వింత వ్యాధితో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు  రానున్న నేపథ్యంలో ఆ జిల్లా ఇంచార్జ్ మంత్రి పేర్ని నాని  సోమవారం ఉదయం ఏలూరు కు హడావిడిగా  ప్రయాణమయ్యారు . ఆ సమయంలో సైతం తన  కార్యాలయానికి వచ్చిన పలువురు ప్రజలను పలకరించి వారి ఇబ్బందుల గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తొలుత తమకు నివేశన స్థలాలు రాలేదని జాబితాలో తమ పేర్లు లేవని కొందరు గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు . ఏ కారణంగా స్థలం ఇవ్వలేదోననే వివరణ సంబంధిత విఆర్వో , రెవిన్యూ ఇన్స్పెక్టర్ , తహసీల్దార్ ఇస్తారని చెబుతూ , ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్‌ 25వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారన్నారు . కోర్టు స్టేలు ఉన్న చోట మినహా, మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమం పకడ్బందీగా  అమలుకానున్నట్లు తెలిపారు. పేదలకు నివేశన స్థలాలు  తొలుత ఈ ఏడాది  మార్చి 25న ఉగాది రోజు ఇవ్వాలనుకున్నామని . ఆ తర్వాత ఏప్రిల్‌ 14, అంబేడ్కర్‌ జయంతి రోజున, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా మే 30న, దివంగత నేత వైయస్ఆర్‌ జయంతి రోజు జూలై 8న, ఆ తర్వాత ఆగస్టు 15న, చివరగా అక్టోబరు 2  గాంధీ జయంతి  రోజున పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నామని కానీ, అన్నీ వాయిదా పడ్డాయన్నారు. ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందన్నారు.  ఇళ్ల స్థలాల కోసం 66,518 ఎకరాలు సేకరించామని మార్కెట్‌లో వాటి విలువ రూ.23 వేల కోట్లు అని , డిసెంబర్ 25 వ తేదీన  మొత్తం 30,68,821 మంది పేదలు ఇళ్లస్థలాలు సంతోషంగా అందుకోనున్నట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు.  ఇక కొత్త దరఖాస్తుల నేపథ్యంలో 80 వేల మందికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉందని, డిసెంబరు 10వ తేదీ లోగా భూసేకరణతో పాటు, ప్లాట్ల గుర్తింపు 100 శాతం పూర్తి కానున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఇంకా ఎక్కడైనా మిగిలిపోతే, వారినీ కొత్తవారి జాబితాలో చేర్చాలని వివరించారు. ఈ నెల 25న ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే నాటికి ఇంటి నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారుల‌ జియో ట్యాగింగ్ అధికారులు ‌పూర్తి చేస్తారని. పథకాన్ని అమలు చేసేందుకు ఆరోజున కలెక్టర్లు  సిద్ధంగా ఉంటారని మంత్రి పేర్ని నాని చెప్పారు. తన పది చక్రాల లారీకి పన్ను కట్టలేదని 40 వేల 500 రూపాయల జరిమానా తుని ఆర్టీవో విధించారని డిసెంబర్ 31 వ తేదీ వరకు గ్రేస్ పిరియడ్ ఉందని గూడూరు కు చెందిన కె .వెంకటేశ్వరరావు మంత్రికి తెలిపారు. పామర్రు మండలం జమీగొల్వేపల్లి గ్రామానికి చెందిన బాల శ్రీలక్ష్మి తమ కుటుంబం ఎంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నామని, డిగ్రీ చదివిన తన కుమారుడు బాల షడ్ చక్రవర్తికి ఏదైనా ఉద్యోగం వచ్చేలా సహాయం చేయాలనీ ఆమె మంత్రి పేర్ని నానిని అభ్యర్ధించింది.

Machilipatnam

2020-12-07 16:55:58

కలెక్టరుకు సైనిక సంక్షేమ సంఘం సత్కారం..

విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ కు ఇటీవల మ్యాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చిన సందర్భంగా సైనిక సంక్షేమ సంఘం సభ్యులు సోమవారం సత్కరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సంఘం సభ్యులు కలెక్టర్ ను దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ, అహర్నిశలూ శ్రమించి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని, ప్రజలకు ఎన్నో సేవలు అందించారని ఈ సందర్భంగా సభ్యులు కలెక్టరుని కొనియాడారు. విజియనగారాన్ని పచ్చదనంతో నింపాలని కంకణం కట్టుకున్న ఏకైక కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్ మాత్రమేనన్నారు. కలెక్టర్ ను సత్కరించిన వారిలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు, సైనిక సంక్షేమ సంఘం సభ్యులు, మాజీ సైనికులు ఉన్నారు.

కలెక్టరేట్

2020-12-07 14:57:48