1 ENS Live Breaking News

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

విశాఖ నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దే బాధ్యత నగర ప్రజలపై ఉందని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన పేర్కొన్నారు. పరిశుభ్రత పాటించకుండా బహిరంగ ప్రదేశాలల్లో మలమూత్ర విసర్జన చేసేవారికి జరిమానా తప్పదని జివిఎంసి కమిషనర్ హెచ్చరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో  ఉత్తమ ర్యాంకు సాధించడానికి చేపడుతున్న పలు పనులు పురోగతిని మంగళవారం, వి.ఎం.ఆర్.డి.ఏ. చిల్ద్రెన్ ఎరేనా థియేటర్ లో అదనపు కమిషనరు, సి.ఎం.ఓ.హెచ్., ఏ.ఎం.ఓ.హెచ్.లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ స్పెక్టర్లు, వార్డు శానిటరీ కార్యదర్శులతో కూడుకొని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో ఉత్తమ ర్యాంకు సాధనకు నగర ప్రజలతో పాటూ, అధికారులు, చిరు ఉద్యోగులు కూడా కృషి చేయాలన్నారు. నగరంలో బహిరంగ మల మూత్ర విసర్జన నిషేదమని, ఆరుబయట ఎవ్వరైనా మల మూత్ర విసర్జన చేస్తే అపరాధ రుసుం వసూలు చేయాలని శానిటరీ ఇన్స్ స్పెక్టర్లను, వార్డు శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు. ప్రజా మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, వాటికి కావలసిన పరికరాలు, బ్లీచింగు, ఫినాయల్ వంటివి అందుబాటులో ఉంచాలన్నారు. కాలువలలో చెత్త వేయరాదని, కాలువలలో చెత్త వేసిన వారికి కూడా జరిమానా విధించాలన్నారు.  పెద్ద కాలువలలో పూడికలు తీసే చర్యలు చేపట్టి, ప్లాస్టిక్ వంటివి పారకుండా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, కాలువలపై చెత్త వేయరాదని బోర్డులు పెట్టాలన్నారు. ప్రతీ రోజూ వార్డు శానిటరీ కార్యదర్శులు ఉదయం 6.00గంటల నుండే వీధులను తనిఖీ చేయాలని, ఎక్కడా చెత్త లేకుండా దగ్గరుండి చెత్తను తరలించాలని ఆదేశించారు. ప్రతీ ఇంటి నుండి చెత్త నేరుగా సేకరించి, వాహనాల ద్వారా డంపింగు యార్డుకు తరలించాలన్నారు. ఇంటి నుండి సేకరించిన చెత్తను వేయకుండా వాహనాలకు అందించే ఏర్పాట్లు చేసుకొని ఆయా ప్రాంతాలలో ఉన్న డంపర్ బిన్సు ను తొలగించాలన్నారు. విధి నిర్వహణలో అంతరాయం ఏర్పడితే వార్డులో కొంత మంది శానిటరీ సిబ్బందిని, మినీ వాహనాన్ని రిజర్వులో ఉంచాలని సూచించారు. నిషేదిత ప్లాస్టిక్ సామగ్రిని అమ్మే వర్తకులపైన, ప్లాస్టిక్ బ్యాగులు వినియోగదారుల వద్ద నుండి ఎక్కువ మొత్తంలో జరిమానా విధించాలని ఆదేశించారు. డబ్ల్యూ+ క్రింద నగరం గుర్తింపునకు గాను రాబోయే స్వచ్ఛ సర్వేక్షణ్ లో దరఖాస్తు చేయబోతున్నందువలన, ఆయా అనుబంద ప్రమాణాలను అనుసరించి, ఇంటి నుండి యు.జి.డి. కనక్షనులు ఏర్పాట్లు చేయడం, సెప్టిక్ ట్యాంకులు, క్లీనింగ్ చేయడం వంటి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని నీటి సరఫరా విభాగపు పర్యవేక్షక ఇంజినీరును ఆదేశించారు.  స్వచ్చతా యాప్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేయుటకుగాను అనువుగా, ప్రజలకు అర్ధమయ్యేటట్లు  పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలలో తగు అవగాహన కార్యకమాలు చేపట్టాలని సూచించారు. ఆయా వార్డులనుండి చెత్తను తీసుకుపోయే వాహనాలు గాని, ట్రై సైకిళ్ళకు గాని రిపేర్లు ఎదురైతే, వెంటనే చేయించాలని చెత్తను తీసుకుపోవడానికి ఎటువంటి వాహన అవరోధం కాకుండా చూడాలని కార్యనిర్వాహక ఇంజినీరు (మెకానికల్)  వారిని ఆదేశించారు. ఆయా వార్డుల్లో ఇంటి నుండి చెత్తను నేరుగా సేకరించడానికి ఏర్పాటు చేసిన ప్రైవేటు వాహనములు సరిగా వినియోగించుకునే బాధ్యతా, ఆయా వార్డుల శానిటరీ ఇన్స్ స్పెక్తర్లు, ఏ.ఎం.ఓ.హెచ్.లదే అన్నారు. విధి నిర్వహణలో నిర్లిప్తత కనబరిచిన సిబ్బందిపై తగుచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జోనల్ కమిషనర్లు నుండి అసిస్టెంట్ మెడికల్ అధికార్లు, మెకానికల్ విభాగపు ఇంజినీర్లు,  శానిటరీ ఇన్స్ స్పెక్తర్లు, శానిటరీ కార్యదర్శులు అందరూ శత శాతం దృష్టి సారించి పారిశుద్ధ్య విభాగపు పనులు క్రమ పద్దతిలో చేపట్టాలన్నారు.ఈ సమావేశంలో అధనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, పర్యవేక్షక ఇంజినీరు(నీటి విభాగం) వేణుగోపాల్, అందరు జోనల్ కమిషనర్లు, ఏ.ఎం.ఓ.హెచ్.లు, కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్), శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ స్పెక్తర్లు, శానిటరీ కార్యదర్శులు, మెకానికల్ ఇంజినీరింగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2020-12-15 22:07:27

వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి..

ఆం‌ధ్రవిశ్వవిద్యాలయం ఉద్యోగులు తమ వృత్తి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచుకోవాలని ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ అన్నారు. మంగళవారం ఉదయం ఏయూ అకడమిక్‌ ‌స్టాఫ్‌ ‌కళాశాలలో ఏయూ ఉన్నతాధికారులు, సిబ్బందికి అందిస్తున్న వారం రోజుల నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ ‌క్రిష్ణమోహన్‌ ‌మాట్లాడుతూ ఉద్యోగులు పనితీరుపై సంస్థ పనితీరు, ప్రగతి ఆధారపడి ఉంటుందన్నారు. వ్యక్తి ప్రయోజనాలకంటే వ్యవస్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సాంకేతికతను లాభదాయకంగా నిలుపుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు.  కేంద్రం సంచాలకులు ఆచార్య పి.విశ్వనాథం మాట్లాడుతూ వర్సిటీ డిఆర్‌, ఏఆర్‌, ‌సూపరిండెంట్‌ ‌స్థాయి బోధనేతర సిబ్బందికి ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారం రోజుల శిక్షణలో భాగంగా సిబ్బందికి అవసరమైన విభిన్న నైపుణ్యాలను వృద్ధిచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కేంద్రం సహాయ సంచాలకులు ఆచార్య ఎన్‌.ఏ.‌డి పాల్‌ ‌తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల శిక్షణ కార్యక్రమంలో  40మంది వివిధ స్థాయి బోధనేతర ఉద్యోగులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2020-12-15 22:01:55

ఆ మూడు పథకాలకు ప్రత్యే ప్రణాళిక..

జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత ప‌థ‌కాల అమ‌లుకు జిల్లా యంత్రాంగం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను సిద్దం చేసింది.  యుద్ద‌‌ప్రాతిప‌దిక‌న యూనిట్ల‌ను స్థాపించేందుకు వ్యూహాత్మ‌క కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు. దీనిలో భాగంగా ప‌థ‌కం అమ‌లును ప‌ర్య‌వేక్షించేందుకు జిల్లా అధికారుల‌తో కూడిన మూడంచెల బృందాల‌ను నియ‌మించారు. నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌కు జిల్లా కేంద్రంలో వార్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా అధికారుల‌తో కూడిన కోర్‌టీమ్‌ ఇక్క‌డినుంచి ప‌ర్య‌వేక్షిస్తుంది. అదేవిధంగా క్షేత్ర‌స్థాయిలో మండ‌లాల‌కు సైతం ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్షణాధికారుల‌ను నియ‌మించారు. ఎప్ప‌టిక‌ప్పుడు క్షేత్ర‌స్థాయిలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు వీలుగా మ‌రో అధికారుల బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు.              ప్ర‌ణాళిక‌ అమ‌లు కోసం స్థానిక డిఆర్‌డిఏ స‌మావేశ మందిరంలో జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక వ్యూహాత్మ‌క‌ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత ప‌థ‌కాల అమ‌లును ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంద‌న్నారు. నిర్లిప్త‌త‌ను, నిర్ల‌క్ష్యాన్ని విడ‌నాడి, ఈ నెల 20 లోగా  ఈ ప‌ధ‌కాల ల‌క్ష్యాల‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. దీనికోసం  ప్ర‌త్యేక వ్యూహాత్మ‌క కార్య‌క్ర‌మాన్ని రూపొందించామ‌ని, దీనిలో భాగంగా మంగ‌ళ‌వారం నుంచీ ప్ర‌తీ గంట‌కూ దీనిపై స‌మీక్ష ఉంటుంద‌న్నారు.   క్షేత్ర‌స్థాయిలో మండ‌లాల‌కు ఐటిడిఏ పివో, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా), స‌బ్ క‌లెక్ట‌ర్‌, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్‌, ఆర్‌డిఓ, డివిజ‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అధికారుల‌ను  ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణాధికారుల‌ను నియ‌మించామ‌ని, వీరు నేరుగా ఆయా బ్యాంకు అధికారుల‌తో మాట్లాడి, యూనిట్ల గ్రౌండింగ్‌కు కృషి చేస్తార‌న్నారు. అలాగే క్షేత్ర‌స్థాయిలో ఏమైనా స‌మ‌స్య‌లు ఎదురైతే, వాటిని విశ్లేషించి,  ప‌ర్య‌వేక్షించేందుకు జిల్లా కేంద్రం నుంచి ఒక కోర్‌టీమ్ ఉద‌యం 9 నుంచి రాత్రి 9 గంట‌లు వ‌ర‌కూ సిద్దంగా ఉంటుంద‌న్నారు. వివిధ‌ శాఖ‌ల ప‌రంగా ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి, సాంకేతిక స‌హ‌కారాన్ని అందించేందుకు క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ ఆధ్వ‌ర్యంలో, ఆయా శాఖ‌ల సిబ్బంది సైతం కంట్రోల్ రూములో అందుబాటులో ఉంటార‌ని చెప్పారు. వీరంతా బ్యాంక‌ర్ల‌తో అనుసంధాన‌మై, యూనిట్ల‌ను స్థాపించేందుకు కృషి చేస్తార‌ని చెప్పారు. మొత్తం కార్య‌క్ర‌మాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌ ప‌ర్య‌వేక్షిస్తార‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.             ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది)  డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ కె.సింహాచ‌లం, డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు, మెప్మా పిడి కె.సుగుణాక‌ర‌రావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ ఎస్ వ‌ర్మ‌, డిఆర్‌డిఏ అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-12-15 22:00:54

ఏయూ సిఎస్‌ఓగా మహమ్మద్‌ ‌ఖాన్‌..

ఆంధ్రవిశ్వవిద్యాలయం చీఫ్‌ ‌సెక్యూరిటీ ఆఫీసర్‌(‌సిఎస్‌ఓ)‌గా విశ్రాంత ఏడిసిపి మహమ్మద్‌ ‌ఖాన్‌ ‌నియమితులయ్యారు. మంగళవారం ఉదయం ఆయన తన నియామక ఉత్తర్వులను వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నుంచి స్వీకరించారు. వర్సిటీ వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ఆస్థులు పరిరక్షణ పటిష్టం చేయడం సాధ్యపడుతుందనాన్ర. విశ్వవిద్యాలయంలో పూర్తిస్తాయిలో  బద్రత చర్యలు చేపట్టాలని సిఎస్‌ఓకు సూచించారు. అనంతరం  వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ ‌నుంచి సిఎస్‌ఓగా ఖాన్‌ ‌బాధ్యతలను  స్వీకరించారు. రూసా 2.0 పథకంలో భాగంగా వర్సిటీకి చీఫ్‌ ‌సెక్యూరిటీ ఆఫీసర్‌ను నియమించాలని ప్రభుత్వం సూచించింది. దీనిలో భాగంగా విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి మహమ్మద్‌ ‌ఖాన్‌ను నియమించినట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ ‌తెలిపారు. విశ్వవిద్యాలయం ఆస్థుల పరిరక్షణకు పూర్తిస్థాయిలో కృషిచేస్తానని సిఎస్‌ఓగా నియమితులైన మహమ్మద్‌ ‌ఖాన్‌ ‌తెలిపారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-12-15 21:59:01

‌ప్రతిభతోనే అపూర్వ అవకాశాలు..

ప్రతిభతో విద్యార్థులు అపూర్వ అవకాశాలను సొంతం చేసుకోవచ్చునని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో అమెజాన్‌ ‌సంస్థకు భారీ వేతనంతో ఎంపికై 16 మంది విద్యార్థులను ఆయన  అభినందించారు. ఒకే కళాశాల నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు 16 నుంచి 31.5 లక్షల వేతనాలతో అమెజాన్‌ ‌సంస్థకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి భారీ వార్షికవేతనాలో ఉపాధిని సాధించిన విద్యార్థులు విశాఖ నగరానికి బ్రాండ్‌ అబాసిడర్లుగా నిలుస్తారన్నారు. తమ ప్రతిభను ప్రస్పుటం చేస్తూ సంస్థ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విజ్ఞాన్‌ ‌విద్యా సంస్థల రెక్టార్‌ ‌డాక్టర్‌ ‌వి.మధుసూధన రావు మాట్లాడుతూ తొలి దశలో తమ విద్యా సంస్థల నుంచి 135 మంది విద్యార్థులు అమెజాన్‌, ‌సిస్కో. ఇన్ఫోసిస్‌, ‌టిసిఎస్‌ ‌తదితర సంస్థలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఒకే కళాశల నుంచి అమెజాన్‌కు 16 మంది ఎంపిక కావడం విశేషమన్నారు. దేశంలో మరెక్కడా ఇంత ఎక్కువ మంది ఈ సంస్థకు ఎంపిక కాలేదన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ‌బి.అరుంధతి, ప్లేస్‌మెంట్స్ ‌డీన్‌ ‌డాక్టర్‌ ‌కె.ఆర్‌ ‌సత్యనారాయణ, శిక్షణ విభాగాధిపతి డాక్టర్‌ ‌రోజీ, కంప్యూటర్‌ ‌సైన్స్ ‌విభాగాధిపతి డాక్టర్‌ ‌దినేష్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-12-15 21:41:18

రైతుల భీమా ప్రభుత్వమే చెల్లిస్తుంది..

బీమా ప్రీమియం రైతుల తరపున ప్రభుత్వం చెల్లిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వై.యస్.ఆర్ ఉచిత పంటల బీమా కార్యక్రమంను మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీమా ప్రీమియం రైతుల తరపున ప్రభుత్వం చెల్లింపు చేస్తుందన్నారు. రైతులకు అండగా ఉండే ప్రభుత్వం మనది అని పేర్కొన్నారు. గతంలో అందరికీ బీమా పరిహారం అందే పరిస్థితి లేదని దానిని అధిగమించి అందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రతి రైతుకు మంచి జరగాలని చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69.80 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్ల పంటను బీమా చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాలు వలన పూర్తి పారదర్శకత వచ్చిందని ఆయన తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు వద్ద ఇ క్రాప్ వివరాలతో సహా లబ్ది పొందిన రైతుల జాబితా ప్రదర్శించడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో 10 వేల మంది రైతులకు రూ.3.20 కోట్లు చెల్లింపు జరిగింది.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, శాసన సభ్యులు కంబాల జోగులు, డిసిసిబి అధ్యక్షులు పాలవలస విక్రాంత్, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపా రాణి, జిల్లా కలెక్టర్ జె నివాస్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, డిడి రాబర్ట్ పాల్, ఉద్యాన శాఖ ఎడి పి.ఎల్.ప్రసాద్, సిపిఓ ఎం.మోహన రావు, రైతులు సీపాన రామారావు, బుక్క కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-15 21:35:04

రైతులకు లబ్ది కలిగే పరిశోధనలు చేపట్టాలి..

 రైతులకు లబ్ది కలిగే పరిశోధనలు చేపట్టాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లలర్ డా.ఎ.విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం  నైర అగ్రికల్చర్ కాలేజీ లో  పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  విద్యార్థులు మంచి పరిశోధనలు చేసి జాతీయ, అంతర్జాతీయ శాస్త్ర వేత్త లుగా ఎదగాలని అన్నారు.  కొత్త రకాల వంగడాలను, అధునాతన సాంకేతిక నైపుణ్యాలను మేళవించి  వ్యవసాయం, అనుబంధ రంగాలను  అభివృద్ధి చేయాలని తెలిపారు . రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో దిగుబడి తక్కువగా వస్తున్నదన్నారు.   అధిక దిగుబడి కోసం పరిశోధనలు చేపట్టలన్నారు. నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో వర్క్ షాప్ నిర్వహించనున్నామని తెలిపారు. కాలేజీ అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు.  అంతర్జాతీయ ప్రమాణాల స్ధాయిలో  మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు. కళాశాలను  అత్యున్నత పరిశోధనా కేంద్రంగా   తీర్చి దిద్దే చర్యలు తీసుకోవాలన్నారు.  అన్ని సబ్జెక్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్ పెట్టడానికి యోచిస్తున్నామని, సిబ్బంది కొరతను తీర్చనున్నామని తెలిపారు.   విద్యార్థులకు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు రావడం హర్షదాయకమన్నారు. జాతీయస్థాయి జర్నల్స్ లో ప్రచురణ అయ్యే పేపర్ తయారు చేయాలని తెలిపారు.  కాలేజీ 35 నుండి 13వ స్థానానికి చేరుకొవడం హర్షదాయకమని తెలిపారు. అనంతరం డా.నటరాజ్  తయారు చేసిన పబ్లికేషన్ ను రిలీజ్ చేసారు.   అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, స్టూడెంట్స్ ఓపెన్ జిమ్  ను ప్రారంభించారు.   అనంతరం వైస్ ఛాన్స్లలర్ ను ఘనంగా సన్మానించారు.

Srikakulam

2020-12-15 21:33:51

ఘనంగా అమర జీవి వర్ధంతి..

 అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి మంగళ వారం ఘనంగా జరిగింది. శ్రీకాకుళం ఒబిఎస్ కూడలి వద్ద అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపా రాణి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ కార్యాలయంలో అమర జీవి చిత్ర పటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ జె నివాస్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరజీవి సేవలను కొనియాడారు. అమరజీవి మనోనిబ్బరంగల వ్యక్తని, ధైర్యసాహాసాలకు మారు పేరు అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుటకు 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసిన ఘనుడు అన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి, అంకితభావం, కార్యశీలత ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ కిషోర్, నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, లయన్స్ సభ్యులు నటుకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-15 21:32:26

కాంపోనెంట్ పనులు పూర్తి కావాలి..

ఉపాది హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. ఎంజిఎన్ఆర్ఈజిఎస్ మెటీరియల్ కాంపోనెంట్ పనులపై కలెక్టర్ నివాస్ మండల అధికారులు, పనులు చేపడుతున్న ఇంజినీరింగ్ శాఖల అధికారులు, ఇంజనీరింగు అసిస్టెంట్లతో  మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ, నియోజకవర్గాలలో  వారానికి రూ.15 కోట్లు ఖర్చు చేయాలని ఆయన స్పష్టం చేసారు. కొన్ని నియోజక వర్గాలలో రూ.13 కోట్లు ఖర్చు వరకు చేసారని, లక్ష్యాలను శత శాతం పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేసారు. అందరూ సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. మండలాలలో పూర్తి స్ధాయిలో సిబ్బంది ఉన్నప్పటికి పనులు ఎందుకు పూర్తి కావడం లేదని పేర్కొంటూ సమన్వయలోపమా లేకా సమస్యలు ఉన్నాయా అని గుర్తించి అధిగమించి పనులు చేయాలని అన్నారు. వారంలో రోడ్ల పనులు ప్రారంభించాలని, సీసీ రోడ్లు వారానికి ఒక కోలో మీటరు ప్రాతిపదికన పూర్తి చెయ్యాలని, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ ల పనులు  త్వరితగతిన పూర్తి చెయ్యాలని అన్నారు. ఇసుక, సిమెంటు సరఫరాలో సైతం లోటు లేదని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, ఆర్ డబ్ల్యూ పర్యవేక్షక ఇంజనీరు టి.శ్రీనివాసరావు, పంచాయితీ రాజ్ పర్యవేక్షక  కె.భాస్కర రావు, ఆర్.డబ్ల్యూ.ఎస్ కార్యనిర్వాహక ఇంజనీరు పి.సూర్యనారాయణ, జిల్లా నీటియాజమాన్య సంస్ధ ఏపిడి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-15 21:21:50

బహిరంగ మల విసర్జనకి స్వస్తి చెప్పాలి..

ఆరోగ్య పరిరక్షణకు బహిరంగ మల విసర్జన అలవాటును మానుకోవాలని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు పిలుపునిచ్చారు.  మంగళవారం జె.సి. బహిరంగ మల విసర్జన పై అవగాహన కలిగించు నిమిత్తం గార మండలంలోని రంప చోడవరం, గొంటి గ్రామాలను, శ్రీకాకుళం మండలం  ఒప్పంగి గ్రామాలలో  పర్యటించారు.  గ్రామాలలో గ్రామ సెక్రటరీలు, వాలంటీర్లతో వీధులలో పర్యటించారు.  ఆ యా గ్రామ ప్రజలతో మాట్లాడారు.  ఆరోగ్య పరిరక్షణ సంపూర్ణ పారిశుధ్ధ్యంతోనే సాధ్యపడుతుందని వారికి తెలిపారు.  బహిరంగ మల విసర్జనను చేయరాదనన్నారు.  ప్రతీ ఒక్కరూ మరగుదొడ్డిని నిర్మించుకుని వాడుకోవాలని తెలిపారు.  అనంతరం  శ్రీకాకుళంలోని  బగ్గు సరోజినీ ఆసుపత్రిని  సందర్శించారు.  ఆరోగ్యశ్రీ సేవలపై   ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి వి.రవికుమార్, వాలంటీర్లు, తదతరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-15 21:07:14

సహకరించని బ్యాంకర్లపై ఫిర్యాదు..

విజ‌య‌న‌గ‌రం ‌జిల్లాలో జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం అమ‌లుకు స‌హ‌క‌రించని బ్యాంక‌ర్ల‌పై రాష్ట్ర స్థాయి అధికారుల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ చెప్పారు. జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కంలో అర్హులైన నిరుపేద కుటుంబాల‌కు బ్యాంకుల ద్వారా రుణ‌ స‌హాయం అందించాల‌ని ప‌దేప‌దే బ్యాంకు అధికారుల‌ను కోరుతున్న‌ప్ప‌టికీ వారి నుండి త‌గినంత‌గా స్పందన వ్య‌క్తం కావ‌డం లేద‌ని, అందువ‌ల్లే రాష్ట్ర స్థాయి అధికారుల‌కు ఫిర్యాదు చేయాల్సి వ‌స్తోంద‌న్నారు. పొరుగు జిల్లాల‌తో పోల్చిచూస్తే మ‌న జిల్లాలో జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం కింద‌ రుణాల మంజూరులో బ్యాంకులు ఎంత‌గా వెన‌క‌బ‌డి వున్నాయో స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని పేర్కొన్నారు. బ్యాంకులు పేద‌ల గురించి ఆలోచ‌న చేయకుండా, సామాజిక బాధ్య‌త తీసుకోకుండా వుంటే స‌హించేది లేద‌ని  స్ప‌ష్టంచేశారు. జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం అమ‌లుపై జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ సోమ‌వారం క‌లెక్ట‌ర్ ఆడిటోరియంలో ఎంపిడిఓలు, మండ‌ల ప్ర‌త్యేకాధికారులు, బ్యాంకుల జిల్లాస్థాయి అధికారుల‌తో స‌మీక్షించారు.  బ్యాంకుల స‌హ‌కారం లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ ప‌థ‌కం అమ‌లులో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచామ‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని, అర్హులైన వారంద‌రికీ రుణాలు ఇవ్వాల‌ని, రుణాల మంజూరుకు సంబంధించి డాక్యుమెంట‌ష‌న్‌లో గ్రామ స‌చివాల‌య సిబ్బంది నుండి పూర్తిస్థాయి స‌హ‌కారం అందిస్తున్నా వారు స్పందించ‌క‌పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. అత్యంత త‌క్కువ‌గా రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల అధికారుల నుండి వివ‌ర‌ణ కోరారు. రుణాల మంజూరుకు స‌హ‌క‌రించిన ఆయా బ్యాంకుల బ్రాంచి మేనేజ‌ర్ల‌తో క‌లెక్ట‌ర్ నేరుగా ఫోనులో మాట్లాడి ఏ కార‌ణంతో రుణాలు మంజూరులో జాప్యం జ‌రుగుతున్న‌ద‌ని ప్ర‌శ్నించారు. అదేవిధంగా ఇప్ప‌టికే రుణాలు మంజూరు చేసిన ల‌బ్దిదారుల‌కు సంబంధించిన స‌మాచారం వెంట‌నే వెబ్‌లో అప్‌లోడ్ చేయాల‌ని ఆదేశించారు.  బ్యాంకులు ఇదే విధంగా వుంటే జిల్లాలోని బ్యాంకులు ధ‌నికుల కోస‌మే అన్న భావ‌న ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డుతుంద‌ని, ఈ ధోర‌ణి మంచిది కాద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా.ఆర్‌.మ‌హేష్ కుమార్ అన్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు స‌హ‌క‌రించని బ్యాంకు బ్రాంచిల జాబితా త‌మ‌కు అంద‌జేస్తే వారితో ప్ర‌త్యేకంగా మాట్లాడి కార‌ణాలు తెలుసుకుంటామ‌న్నారు. ఏపి గ్రామీణ వికాస్ బ్యాంకు వంటి అధిక బ్రాంచిలు వున్న బ్యాంకులు త‌గిన సామ‌ర్ధ్యం ప్ర‌ద‌ర్శిస్తేనే అధికంగా రుణాలు అందించ‌గ‌ల‌మ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ఏపిజివిబి ద్వారా ఈ ఒక్క‌రోజే 500 మందికి రుణాలు అందించ‌నున్నామ‌ని విజ‌య‌న‌గ‌రం ప్రాంతీయ మేనేజ‌ర్ చెప్పారు. స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు,  డి.ఆర్‌.డి.ఏ. ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ కె.సుబ్బారావు, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ కె.సింహాచ‌లం, జిల్లాప‌రిష‌త్ సి.ఇ.ఓ. టి.వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-12-14 23:02:44

నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారులు..

పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో  ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ  కార్యక్రమాన్ని  పర్యవేక్షించడానికి   జిల్లా స్థాయి అధికారులను  నియోజక వర్గ  ప్రత్యేక అధికారులుగా  నియమిస్తున్నట్లు  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్  ఒక ప్రకటనలో  తెలిపారు.  ఈ అధికారులు సంబంధిత నియోజక వర్గాలలో  డిసెంబరు 25వ తేది  నుంచి జనవరి 7వ తేది వరకు  జరగనున్న  పట్టాల పంపిణీ కార్యక్రమానికి  సంబందించి  తహసీల్దారులు  తయారు చేసే  జాబితాలను  పర్యవేక్షిస్తారని  తెలిపారు.   అలాగే రీ సర్వే (వై ఎస్ ఆర్ జగనన్న శాశ్వత  భూ హక్కు 2021 ) కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తారని  తెలిపారు.  పాడేరు అసెంబ్లీ  నియోజక వర్గానికి  ప్రత్యేకాధికారి గా  ఐటిడిఎ  ప్రాజెక్టు  అధికారి  డా. ఎస్. వెంకటేశ్వర్ ను , నర్సీపట్నం నియోజక వర్గానికి  సబ్ కలెక్టర్  ఎన్   మౌర్యను ,  అరకు  నియోజక వర్గానికి  రెవెన్యూ  డివిజినల్ అధికారి  ఎల్ . శివజ్యోతి ని , భీమునిపట్నం నియోజక వర్గానికి రెవెన్యూ డివిజినల్  అధికారి   కె.పెంచల  కిశోర్ ను ,  అనకాపల్లి నియోజక వర్గానికి రెవెన్యూ డివిజినల్  అధికారి  జె.సీతారామరావు ను ,   మాడుగుల  నియోజక వర్గానికి   స్పెషల్ డిప్యూటి కలెక్టర్ సి.హెచ్ రంగయ్యను ,  చోడవరం  నియోజక వర్గానికి   స్పెషల్ డిప్యూటి కలెక్టర్  ఎం .వి   సూర్యకళ ను ,  ఎలమంచిలి  నియోజక వర్గానికి  స్పెషల్ డిప్యూటి కలెక్టర్  ఎస్ డి అనితను , పాయకరావుపేట  నియోజక వర్గానికి  డి ఆర్ డి ఎ ., ప్రాజెక్టు  అధికారి  వి.విశ్వేశ్వరరావును , పెందుర్తి  నియోజక  వర్గానికి  స్పెషల్ డిప్యూటి కలెక్టర్  కె.పద్మలతను ,  జి.వి.ఎం .సి పరిధిలోని  5 అసెంబ్లీ  నియోజక వర్గాలకు  ప్రత్యేక అధికారిగా   జివి.ఎం సి కమిషనర్ జి. సృజనను నియమిస్తున్నట్లు తెలిపారు.ఈ అధికారులు  తక్షణమే  బాధ్యతలు స్వీకరించి  పేదలందరికి  ఇళ్లు , రీ సర్వే   కార్యక్రమాలను  విజయవంతం చేయాలని  తెలిపారు. 

Visakhapatnam

2020-12-14 22:58:13

స్వచ్ఛభారత్ మిషన్ లో భాగస్వాములు కావాలి..

విశాఖపట్నంజిల్లా గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛభారత్ మిషన్ పై ప్రచారం నిర్వహించేందుకు సోమవారం జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ రెండు స్వచ్ఛభారత్ మిషన్ ప్రచార రథాలను  కలెక్టరు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ జెండా వూపి ప్రారంభించారు.  నేటి నుండి ఈ రథాల ద్వారా బహిరంగ మల విసర్జన లేకుండా చేయడం, వ్యర్ధ పదార్ధాల నిర్వహణ, ప్లాస్టిక్ వాడకం నిషేదం తో పాటు కోవిడ్-19 పై అవగాహన కార్యక్రమాలను  వీడియో సినిమాల ద్వారా ప్రచారం చేస్తారని, రోజుకు 3 గ్రామాల చొప్పున ప్రచార కార్యక్రమాలు 15రోజులు నిర్వహిస్తారని గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీరు రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు పి.అరుణ్ బాబు, జిల్లాపరిషత్ సిఈఓ నాగార్జునసాగర్ జిల్లా పంచాయితీ అధికారి కె.కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.   

Visakhapatnam

2020-12-14 22:52:31

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు..

విశాఖ జిల్లాలో అర్హులైన వారందరికీ వైయస్ఆర్ భీమా జగనన్నతోడు పధకాలు వేగంగా అందే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు.  సోమవారం జివియంసి, డి.ఆర్.డి.ఎ.,యు.సి.డి., బ్యాంకు అధికారుతో ఈ వియమై తన ఛాంబర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ నిర్ణయించిన లక్ష్యాలను సకాలంలో సాధించాలన్నారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పేదల సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన  పథకాలను అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలన్నారు.  ఏ మాత్రం అలసత్వం వహించినా చర్యలు తప్పవన్నారు. లబ్దిదారులకు ముందుగా అవగాహన కల్పించాలని, బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అందరికీ భీమా సౌకర్యం వర్తించేలా చేయాలన్నారు. అదే విధంగా  జగనన్నతోడు  కార్యక్రమంలో చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వారి వివరాలు సేకరించి  వారందరికీ జగనన్నతోడు పథకంద్వారా ప్రభుత్వం ఇస్తున్నరూ.10 వేల ఆర్ధిక సహాయం అర్హులందరికీ అందించాలన్నారు.  ఈ సమావేశంలో జి.వి. యం.సి. కమిషనరు  జి.సృజన, జే.సి. పి.అరుణ్ బాబు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్.వెంకటేశ్వర్,  డిఆర్ డిఎ  ప్రాజెక్టు డైరక్టర్ వి.విశ్వేశ్వరరావు,  జిల్లా పంచాయితీ అధికారి కె.కృష్ణకృమారి, లీడ్ బ్యాంకు మేనేజరు ప్రసాద్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2020-12-14 22:40:52

28న శ్రీకాకుళంలో తపాలా అదాలత్..

 తపాలా శాఖకు చెందిన వ్యక్తిగత ఫిర్యాదులు, వినియోగదారుల సమస్యలను పరిష్కరించుటకు ఈ నెల 28న తపాలా అదాలత్ ను నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్  వై.యస్. నర్సింగ రావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. విశాఖపట్నం పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా వినియోగదారుల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 28న ఉదయం 11.00గం.లకు విశాఖపట్నం యం.వి.పి.బస్ స్టేషన్ ప్రక్కన గల పోస్ట్ మాస్టర్ జనరల్ వారి కార్యాలయంలో పోస్ట్ మాస్టర్ జనరల్ వారిచే  ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పారు. ఇది 101వ తపాలా అదాలత్ అని, తపాలా సర్వీసులకు చెందిన ప్రత్యేక, వ్యక్తిగత ఫిర్యాదులు మాత్రమే ఈ అదాలత్ నందు స్వీకరించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని తపాలా వినియోగదారులు తమ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఫిర్యాదులు, సమస్యలు తెలియజేయు వినియోగదారులు 101వ తపాలా అదాలత్ అనే శీర్షికతో పి.ఆనందరావు, అసిస్టెంట్ డైరక్టర్, పోస్ట్ మాస్టర్ జనరల్ వారి కార్యాలయం, విశాఖపట్నం – 530 017 చిరునామాకు డిసెంబర్ 17లోగా  పంపాలని, గడువు తేదీ ముగిసిన తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.   

Srikakulam

2020-12-14 22:28:03