విశాఖజిల్లాలో 230 ఆశా కార్యకర్తల పోస్టులను భర్తీచేయడానికి ఉద్యోగ ప్రకటన విడుదల చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పీఎస్.సూర్యనారాయణ తెలియజేశారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభ్యర్ధులు స్థానికంగా ఉండి, 25-45 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. నోటిఫికేషన్ వివరాలు www.visakhapatnam.nin.in లేదా www.visakhapatnam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా నిర్ణీత దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకొని 12వ తేది సాయంత్రం 5గంటల లోగా దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని పీఓడిటిటి విభాగంలో అందజేయాలని ఆయన కోరారు. ఆశక్తి వున్న మహిళా అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కొత్త నోటిఫికేష ద్వారా భర్తీ అయ్యే ఆశ కార్యకర్తలతో మరింతగా ప్రజలకు వైద్యసేవలు అందించడానికి వీలుపడుంతని డీఎంహెచ్ఓ తెలియజేశారు.
రాష్ట్రంలో పాఠశాల విద్యా రంగానికి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహం అపారమని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గురువారం ఉదయం వర్సిటీ పాలక మండలి సమావేశ మందిరంలో ఏయూ తెలుగు మాధ్యమం పాఠశాల విద్యార్థుల•కు జగనన్న విద్యా కానుకను అందించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ విద్యార్థులు ఉన్నతంగా రాణించాలన్నారు. ప్రతీ వ్యక్తి విద్యావంతుడు కావడం వలన సమా ప్రగతి సాధ్యపడుతుందన్నారు. నాడు-నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసారన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా పాఠశాలల అభివృద్ధికి నిధులను కేటాయిచి చిన్నారులపై తన అపార అభిమానాన్ని ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా చూపారన్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు ప్రతీ స్థాయిలో విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు రాష్ట్రంలో విద్యా వంతుల సంఖ్యను గణనీయంగా పెంచుతాయన్నారు. తద్వారా ప్రతీ కుటుంబం పూర్తిస్థాయిలో ఆర్ధిక, సామాజిక పరిణితి సాధించడం వీలవుతుందన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు నిర్ధిష్ట లక్ష్యంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, ఇంచార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.వి రవీంధ్రనాథ్ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయిని డి.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గీతంతో సహ దేశవ్యాప్తంగా 123 కాలేజీలకు యూజిసి ఇచ్చిన యూనివర్సిటీ హోదాను రద్దుచేసినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని గీతం రిజిస్ట్రార్ డి . గుణశేఖరన్ పేర్కొన్నారు . గీతం టుబీ డీమ్డ్ విశ్వవిద్యాలయం పై సోషల్ మీడియాలో తప్పుడు , నిరాధార , సత్యదూర కథనాలను ప్రసారం చేస్తున్న వారిని గుర్తించి శిక్షించాలని విజ్ఞప్తి చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఇవి తప్పుడు కధనాలని పలువురు వాటిని యధాతధంగా ఇతరులతో పంచుకోవడం వల్ల అది గీతం ప్రతిష్ఠ , గౌరవాలకు భంగం కలిగించడంతో పాటు పలువురు విద్యార్థులు , వారి తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తోందని పేర్కొన్నారు . దీనిపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపి , దురుద్దేశ పూరితంగా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి , ఐపిసి 1860 , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం శిక్షించాలని విజ్ఞప్తి చేశారు . ఇక మీదట వారు అనవసర , తప్పుడు కథనాలను ప్రచురించకుండా , గీతం ప్రతిష్ఠను భంగపరచకుండా చూడాలని కోరారు . దేశంలోని డీమ్ విశ్వవిద్యాలయాలు తమ పేరు చివరన యూనివర్సిటీ అని వినియోగించేవి . దీనిపై గౌరవ సుప్రింకోర్టు చేసిన సూచినల మేరకు గత మూడు సంవత్సరాలుగా డీమ్ టూ బీ యూనివర్సిటీగా మార్పు చేయడం జరిగింది . గీతం జారీచేసే అధికారిక ధ్రువపత్రాలలో సయితం గీతం డీమ్ టూ బీ యూనివర్సిటీ అనే వాడటం జరుగుతోంది . పలు దినపత్రికలకు జారీచేసిన ప్రకటనలను గమనించినా ఈ వాస్తవం బోధపడుతుంది . అయితే దేశంలోని కొన్ని డీమ్ విశ్వవిద్యాలయాలు ఇంకా పాత పద్ధతినే అనుసరిస్తూ ఉండడంతో యూజిసి మరోమారు ఈ ఏడాది మే 27 న సర్క్యులర్ జారీచేసింది . దీనిని పూర్తిగా అర్ధం చేసుకోని కొందరు , ఆ సర్క్యులరను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు . ఈ విధమైన నిర్లక్ష్యపు , నిరాధార వార్తలను ప్రచారం చేయడం వెనుక గల దురుద్దేశాలను ప్రజలు , విద్యావంతులు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాము . ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల పై సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి అసత్య కథనాల్లోని నిజానిజాలను నిర్ధారించుకోవడానికి యూజిసి , ఏఐసీటీఈ వంటి చట్టబద్ధ నియంత్రణ సంస్థలనో లేదా విశ్వవిద్యాలయ వర్గాలతో సంప్రదించగలరని విజ్ఞప్తి చేస్తున్నామని యూనివర్శిటీ సిబ్బంది మీడియాని కోరారు..
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిరుపేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారని ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు. గురువారం గురువారం వై.రామవరం, అడ్డతీగల ప్రాంతాల్లో జగనన్న విద్యా కానుక కిట్లను డిసిసిబి చైర్మన్ అనంతబాబుతో కలిసి గిరిపుత్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించడానికి నాడు-నేడు కింద అన్ని పాఠశాలలను నిత్యనూతనంగా తయారు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ పథకాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు నిత్యనూతనంగా మారాయని, ఈ ప్రభుత్వంలో విద్యార్ధులందరికీ నాణ్యమైన విద్య అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా పాఠశాలలను సర్వాంగ సందరంగా మునుపెన్నడూ లేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తయారు చేశారన్నారు. త్వరలోనే ఇంగ్లీషు మీడియంలో కూడా విద్యనందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కార్పోరేట్ స్థాయి కంటే మెండుగా నిరుపేద విద్యార్ధులకు విద్య అందించేందుకు సీఎం వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. గురువారం విశాఖలోని క్వీన్ మేరీ పాఠశాలలో ఎమ్మెల్యే వాసుపల్లి వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండారాజీవ్ గాంధీతో కాలిసి విద్యార్ధులకు జనగన్న విద్యా కానుక కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులకు ఎవరికీ ఎటువంటి తేడా లేకుండా అందరికి ఒకే రకంగా 3 జతల యూనిఫారం, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్ లు బెల్టులు, షూలు, సాక్సులు, స్కూల్ బ్యాగ్స్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. విద్యార్థుల కొలతలు తీసుకుని వారి సైజుకు తగినట్లుగా అన్ని సిద్ధం చేసి వారికి అందిస్తున్నామన్నారు. కొండా రాజీవ్ గాంధీ మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక కింద పిల్లలను చదివించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నాడునేడు కింద అన్ని పాఠశాలలు కార్పోరేట్ స్థాయి పాఠశాలలుగా మార్పు చేసిందన్నారు. దేశంలోనే అత్యున్నత విద్యను అందించే లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వైఎస్సార్సీపీ మహిళా నేత గరికిన గౌరి మాట్లాడుతూ, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందితే పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో నిర్ణీత కాలవ్యవధిలోగా ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ అన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టులు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూసేకరణకు సంబంధించి, కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి కిశోర్ మాట్లాడుతూ, తోటపల్లి తదితర కొన్ని ప్రాజెక్టుల భూసేకరణలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏ ప్రాజెక్టుకు భూసేకరణ చేస్తున్నా, కొన్ని రకాల సమస్యలు ఎదురుకావడం సాధారణ విషయమని అన్నారు. వాటిని సానుకూలంగా పరిశీలించి, పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. దీనికోసం అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి, సంబంధిత రైతులతో మాట్లాడాలని సూచించారు. అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న విఆర్ఓలు, విఆర్ఏలు, జెఇల సేవలను వినియోగించుకోవడం ద్వారా వీటిని త్వరగా పరిష్కరించవచ్చునని చెప్పారు. అప్పటికీ పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే, తన దృష్టికి తీసుకురావాలని, వాటిని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు. ప్రతీ పనికీ నిర్ణీత కాలవ్యవధిని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలని జెసి కిశోర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భానుప్రకాష్, భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్.వెంకటేశ్వర్లు, హెచ్‌వి జయరామ్, సాల్మన్ రాజు, కె.బాలాత్రిపుర సుందరి, టిటిపిఆర్, బొబ్బిలి ఇరిగేషన్ ఎస్ఇలు కె.పోలేశ్వర్రావు, ఎన్.వి.రాంబాబు, పలువురు ఇంజనీర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో కొత్త రైస్ కార్డుల జారీ ప్రక్రియలో వేగం పెంచేందుకు.. జాప్యతను నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా పౌరసరఫరాల అధికారి పాపారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ సుబ్బారావులు స్వయంగా జిల్లాలో ఉన్న వివిధ గ్రామాల విఆర్వోలకి కాల్ సెంటర్ ద్వారా ఫోన్లు చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్డుల జారీ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం రెండు విభాగాల అధికారులు గ్రామ స్థాయి అధికారులతో సంప్రదింపులు చేశారు. ఇప్పటి వరకు జారీ చేసిన, పెండింగ్ లో ఉన్న కార్డుల వివరాలను తెలుసుకున్నారు. పెండింగ్ లు లేకుండా త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలని వీఆర్వొలని ఆదేశించారు. లబ్ధిదారుకు కార్డ్ జారీ చేసిన వెంటనే సంబంధిత అక్నాలెడ్జిమెంట్ ని విధిగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న కార్డుల అందుబాటులో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరంలో ఈ ఏడాది శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్‌లాల్ తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, పట్టణంలోని పలు స్వచ్ఛందసంస్థలు, సాంస్కృతిక సంస్థలు, వర్తక, వాణజ్య సంఘాలు, వైద్యులు, పాత్రికేయులు, జిల్లా అధికారులు తదితరులంతా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. కోవిడ్ ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఉత్సవాలను ఎలా నిర్వహించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించి ఉత్సవాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ విదివిధానాలుపై ఆదేశాలు జారీచేస్తారని వివరించారు.
రాష్ట్రంలో సినిమా ఘాటింగ్ లకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరువులు జారీచేసినట్లు రాష్ట్ర ఫిల్ము, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ స్థలాలు, ప్రాంగణాల్లో సినిమా ఘాటింగ్ లు నిర్వహించుకొనే అమమతులను తమ సంస్థ మంజూరు చేస్తుందని, చిత్ర దర్శకులు, నిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా ఘాటింగ్ లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే అన్నారు. అయితే భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆగస్టు 21 న జారీచేసిన మార్గదర్శకాలు మరియు స్టాండర్డు ఆపరేటింగ్ ప్రొసీజర్ కు అనుగుణంగా రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం జరిగిందన్నారు. సినిమాల చిత్రీకరణ సమయంలోఈ మార్గదర్శకాలను మరియు స్టాండర్డు ఆపరేటింగ్ ప్రొసీజర్ను తప్పక పాటించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మార్గదర్శకాల ప్రకారం టెక్నీషియన్లు అందరూ తప్పక మాస్కులు దరించాల్సి ఉందని, అయితే ఘాటింగ్ సమయంలో నటీనటులు మాస్కులు ధరించే విషయంలో కొంత మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. సినిమాల చిత్రీకరణ సమయంలో సినిమా చిత్రీకరణ పరికరాలు, యూటినిట్లు, సెట్లు అన్నీ కూడా తరచుగా శానిటైజ్ చేయాల్సి ఉంటుందన్నారు. చేతులు కడుక్కునే సౌకర్యం లేని పక్షంలో అందరు టెక్నీషియన్లు, నటీ నటులు వ్యాండ్ శానిటైజర్లను తప్పక వినియోగించాలని ఆయన తెలిపారు. సినిమాల చిత్రీకరణ సమయంలో సాంకేతికంగా అవకాశం లేని పరిస్థితుల మినహా మిగిలి సమయాల్లో టెక్నీషియన్లు అందరూ ఆరు అడుగుల దూరాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకై ప్రేక్షకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపర్చే బహిరంగ సందేశాన్ని చిత్రప్రదర్శన ప్రారంభం మరియు విరామ సమయాల్లో తప్పక ప్రదర్శించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సినిమాల చిత్రీకరణకు అవసరమైన అనుమతులు, నియమ, నిబందనలు మరియు ఇతర వివరాలను రాష్ట్ర ఫిల్ము, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ www.apsftvtdc.in నుండి పొందవచ్చని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుకను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని జివీఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అన్నారు. గురువారం ఆమె, జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల చిన్నవాల్తేర్ లో 30మంది విద్యార్థినీ విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద యూనిఫాంలు, మాస్కులు, బూట్లు, సాక్సులు, బెల్టులు, పాఠ్య పుస్తకములు మరియు నోటు పుస్తకములు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్లను అందజేస్తున్నామన్నారు. ప్రతీ విద్యార్ధి ఉత్తమ ర్యాంకులు తెచ్చుకునే విధంగా భోదనలో మార్పులు తీసుకు రావాలని ఉపాద్యాయులను కోరారు. విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేసి ప్రభుత్వ ఆశయాలను సఫలీకృతం చేయాలన్నారు. మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణవేణి, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జివీఎంసీ పరిధిలోని వార్డు సచివాలయ మౌళిక వసతుల(ఎమినిటీ) కార్యదర్శులు క్రమశిక్షణతో పనిచేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఆదేశించారు. గురువారం వీఎంఆర్డీఏ థియేటర్ లో ఏర్పాటు చేసిన కార్యదర్శిలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని ఆయన ఆశయ సాధనకోసం మనం ఎంతో కృషిచేయాలన్నారు. ప్రతీ రోజు హాజరు పట్టిక, మూమెంట్ రిజిస్టర్, డైరీ విధిగా రాయాలన్నారు. ఉద్యోగ విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని కార్యదర్శులను హెచ్చరించారు. మీకు గతంలో శిక్షణా తరగతులు నిర్వహించమని, ముఖ్యంగా ప్రణాళికా బద్దంగా నిర్ణయాలను తీసుకోవాలన్నారు. పర్మనెంట్ రికార్డులైన పబ్లిక్ ట్యాప్, కంప్లైంట్ రిజిస్టర్, యు.జి.డి. స్టాక్ రిజిస్టర్, క్వాలిటీ మూమెంట్ రిజిస్టర్, బోరవెల్ మెటీరియాల్ రిజిస్టర్ మొదలైనవి తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రతీ రోజు ప్రజలకు ఇచ్చే మంచి నీటిని క్లోరిన్ టెస్ట్ చేయించాలన్నారు. అలాగే కొళాయిలు, వీధిలైట్లు, రోడ్లు, కాలువలు, పార్కులు, ఖాళీ ప్రదేశములు, ప్లే గ్రౌండ్స్, యు.జి.డి. కనక్షన్లు మొదలైన వాటి వివరాలు మీ వద్ద తప్పని సరిగా ఉండాలన్నారు. వార్డు ప్లానింగ్ మ్యాప్ చలా అవసరం కాబట్టి, మీరు తప్పనిసరిగా దానిపై అవగాహన పెంచుకొని, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైన్స్ ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్తున్నాయో తెలుసుకోవాలన్నారు. పనులను సకాలములో పూర్తీ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడలన్నారు. ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, వార్డు సచివాలయ కార్యదర్శులకు ఒక సంవత్సరం పూర్తీ అయినందున, మీరు ఇంకా విద్యార్ధులు కారని, మంచి క్రమశిక్షణతో పనిచేసి ప్రజలకు దగ్గరగా పరిపాలన అందించాలన్నారు. లాక్ డౌన్ లో చాల బాగా పనిచేసారని, నాడు – నేడు పనులు చాల వరకు పూర్తీ అయినందున, వాటి రికార్డులను పొందుపరచాలన్నారు. వీధి లైట్లు ఇంకా కంప్లైంట్స్ వస్తున్నందున, ప్రతీ రోజు సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు పరిశీలించి సహాయక ఇంజినీరులకు రిపోర్టు చేయాలన్నారు. తదుపరి ప్రయవేక్షక ఇంజినీర్లు అందరూ, శిక్షణా తరగతులపై పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజినీర్లు వినయ కుమార్, ఇంజినీరు వేణుగోపాల్, రాజా రావు, శ్యాంసన్ రాజు, శివ ప్రసాదరాజు, గణేష్, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయక ఇంజినీరులు, వార్డు ఎమినిటీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసి పరిధిలోని స్మార్ట్ సిటీ పధకం కింద చేపడుతున్న పనులను పురపాలక శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ, జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలసి గురువారం పరిశీలించారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డులో జిందాల్ కంపనీ చేపట్టిన చెత్త నుండి విద్యుత్ తాయారుచేసే ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పనులు డిశంబర్ నెలాఖరకు త్వరితగతిన పూర్తిచేయాలని కంపనీ ప్రతినిధులకు సూచించారు. పర్యటనకు గుర్తింపుగా ఆ ప్రాంతంలో మొక్క నాటారు. తదుపరి ఎం.వి.పి. కాలనీలో ఏ.ఎస్.రాజా గ్రౌండ్స్ లో నిర్మాణం లో ఉన్న స్మార్ట్ సిటీ పధకంతో నిర్మిస్తున్న ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా పనులు, ఉడా పార్కులో చేపట్టిన ఆధునీకరణ పనులు, పాత మున్సిపల్ కార్యాలయం, టౌన్ హాలు ఆధునీకరణ పనులు పరిశీలించారు. ఈ పనులన్నింటిని కూడా డిశంబర్, జనవరి నెలల నాటికి సూచించిన విదంగా పనులు పూర్తీ చేయాలని స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ఇంజినీరులను ఆదేశించారు. ఈ పర్యటనలో జివిఎంసి కమిషనర్ ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, పర్యవేక్షక ఇంజినీర్లు కె.వి.ఎన్. రవి, వినయ కుమార్ ఇతర ఇంజినీరింగు అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సేవల పరిష్కారంతో పాటు సెక్టోరల్ అధికారులు, అడ్మిన్ కార్యదర్శులు ప్రతిరోజు అటెండెన్స్ తప్పనిసరి వేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ గిరీష ఆదేశించారు. గురువారం సంస్థ కళాప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రభుత్వ సేవలు ప్రజలకు సత్వరమే అందించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న వాటిని మొత్తం నిశ్చితమైన సమయానికి పూర్తి చేసి, మీ లాగిన్ లో ఉన్న ఫైల్స్ అన్నీ మీ పై అధికారులకు (ముందుకు) ఫార్వర్డ్ చేయాలని ఆదేశించారు. నగరంలో 50 వార్డులలో వార్డు కార్యదర్శులు ప్రతి షాపును రీ సర్వే చేసి వాటికి ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా పరిశీలించాలని, లేని వాటికి కొత్తగా దరఖాస్తులు చేయించి కార్యాలయానికి రావాల్సిన ఆదాయాన్ని సమకూర్చాలన్నారు. నగరంలో కొత్తగా కడుతున్న గృహాలు వాటి అనుమతులు ఉన్నాయా లేవా పరిశీలించాలని, లేని వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అడ్మిన్ కార్యదర్శులతో పాటు సిబ్బందిని కలుపుకొని అన్ని పనులు చూడాలని, సమస్యల తో వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు, ప్రతి దరఖాస్తులు గడువులోపు పరిష్కరించాలని, వివిధ ప్రభుత్వ పథకాలు సకాలంలో సమర్థవంతంగా ప్రజల ముంగిటకు అందజేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో కమిషనర్ వారితోపాటు అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి,సూపర్డేటింగ్ ఇంజనీర్ చంద్ర శేఖర్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, మేనేజర్ హసిమ్,సెక్టోరల్ ఆఫీసర్లు సేతు మాధవ్, గాలి సుధాకర్, రవి, నీలకంటేశ్వర రావు, మధు బాబు, రవికాంత్, రమణ, అడ్మిన్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగా జగనన్న విద్యా కానుక కింద జిల్లాలో 3,61,488 మంది విద్యార్థులకు 3,93,262 కిట్లను పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. గురువారం హిందూపురంలోని మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక పథకం కింద జిల్లాలో 3844 పాఠశాలలో 3,61,488 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 1600 రూపాయలు ఖర్చు చేసి 63 కోట్ల రూపాయలతో కిట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎవరూ బెంగ పడాల్సిన అవసరం లేకుండా జిల్లాకు మొత్తం విద్యార్థులకు 8 శాతం అదనంగా 31,774 కిట్లు వచ్చాయని, జిల్లాకు మొత్తం 3,93,262 కిట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఒక విద్యార్థికి 3 జతల యూనిఫామ్ లు అందిస్తామన్నారు. విద్యార్థులకు ఎవరికీ ఎటువంటి తేడా లేకుండా అందరికి ఒకే రకంగా 3 జతల యూనిఫారం, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్ లు బెల్టులు, షూలు, సాక్సులు, స్కూల్ బ్యాగ్స్ అందిస్తున్నామన్నారు. విద్యార్థుల కొలతలు తీసుకుని వారి సైజుకు తగినట్లుగా అన్ని సిద్ధం చేసి వారికి అందిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక కింద పిల్లలను చదివించేందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా కానుక ప్రవేశపెట్టడం జరిగిందని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే వారి భవిష్యత్తు బాగుంటుందని, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందితే పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నిశాంతి, సమగ్ర శిక్ష ఏపీసి తిలక్ విద్యాసాగర్, మున్సిపల్ కమిషనర్ చెన్నుడు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంజీఎం పాఠశాల హెచ్ఎం సామ్రాజ్యం, ఎంజీఎం పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ సంధ్యారాణి, విద్యార్థులు పాల్గొన్నారు.