చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురువారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాడు పేదరికం కనబడేది, నేడు కార్పొరేట్ స్థాయి బడులు కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ను జగనన్న తీర్చిదిద్దుతున్నారు అని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ప్రభుత్వం అందించిన కానుక పై సంతృప్తి వ్యక్తం చేశారు. జగనన్న సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను మరియు అత్యున్నత బోధన అందజేయడం జరుగుతుందని వివరించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకురావడంతో కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ భువనేశ్వరి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం పురుషోత్తం రెడ్డి, స్థానిక వైసిపి నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో నాడు-నేడు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్ధులకు మంచి మెరుగైన సౌకర్యాలను కలిగించాలని, పనులలో నాణ్యత పాటించాలని చెప్పారు. పాఠశాలలు ప్రారంభించే నాటికి నాడు-నేడు పనులు పూర్తి కావాలన్నారు. అదేసమయంలో పాఠశాల ప్రాంగణాల్లో మొక్కలు పెంపకం, సుందరీకరణ పనులు కూడా పూర్తిచేయాలన్నారు. విద్యార్ధుల సౌకర్యార్ధం మరుగుదొడ్లు, మంచినీరు, ఆట పరికరాలు ఇలా అన్నివసతులను సమకూర్చాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, సర్వ శిక్ష అభయాన్ ప్రాజెక్టు అధికారి పైడి వెంకట రమణ, ఉప విద్యా శాఖాధికారి పగడాలమ్మ, ఎ.పి.ఇ.ఐ.డి.సి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కె.భాస్కరరావు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలోని ప్రతీ విద్యార్ధి ఉన్నత చదువులు చదివి ఉన్నతస్థాయికి ఎదగాలనేదే ముఖ్యమంత్రి ధ్యేయమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. అందులో భాగంగానే అమ్మఒడి, విద్యార్ధులకు పూర్తి ఫీజు రీఎంబర్స్ మెంట్, జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన, నాడు – నేడు వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేసారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతీ విద్యార్థి ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడి ఆ కుంటుంబానికి ఆసరా కావాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి ధ్యేయమని అన్నారు. ఆ చదువుతో కుటుంబం ఏ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో మన ముఖ్యమంత్రి ప్రజల బాగు కోరే విధంగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో కార్పొరేట్ చదువుల కోసం తల్లితండ్రులు తమ సంపాదనలో ఎక్కవగా ఖర్చుచేయాల్సివచ్చేదని, కాని నేడు ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా విద్యార్ధి కోరుకున్న ఉన్నత చదువులను సైతం చదువుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించిదన్నారు. విద్యార్ధులు ఆహ్లాదకర వాతావరణంలో ఉండి విద్యను అభ్యసించేవిధంగా నాడు – నేడు కార్యక్రమంతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్పుచేసిన సంగతిని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు. అలాగే పాఠశాలలు తెరవకముందే విద్యార్ధులకు అవసరమైన 3 జతల యూనిఫారాలు, స్కూల్ బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్ , సాక్స్, షూస్ అందించడం జరుగుతుందని చెప్పారు. యూనిఫారాలను కుట్టించుకొనేందుకు తల్లుల ఖాతాల్లో నగదును కూడా జమచేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే విద్యార్ధులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, 1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలకు బడికి పంపే పేద విద్యార్ధుల తల్లులకు అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నగదు జమ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో నాణ్యమైన పౌష్టికాహారం, పాఠశాలల్లో విద్యను అభ్యసించేవారికి జగనన్న గోరుముద్ద క్రింద ప్రతి రోజూ మెనూ మార్చి రుచికరమైన మధ్యాహ్న భోజనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కళాశాలల్లో చదివే విద్యార్ధులకు పూర్తి ఫీజు రీఎంబర్స్ మెంట్ ను కూడా అందిస్తున్న సంగతిని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదొక సువర్ణధ్యాయమని కొనియాడారు. అనంతరం విద్యార్ధులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందించారు. రానున్న వారం రోజులు పండుగలా పాఠశాలల్లో కిట్ల పంపిణీ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. తొలుత రాష్ట్ర శాసనసభాపతితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రాష్ట్రానికి అభివృద్ధి పధంలో నడిపించే ముఖ్యమంత్రి మనకు ఉన్నారని కొనియాడారు. జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో తాను పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని, జగనన్న విద్యా కానుక ఒక అద్భుతమైన కార్యక్రమమని కితాబిచ్చారు. ఈ కార్యక్రమం వలన పేద ,బడుగు విద్యార్థుల తల్లితండ్రులకు ఎంతో ఊరట కలిగిస్తుందని, గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివించాలంటే ఏదో చిన్నచూపు ఉండేదని, అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైన ప్రైవేట్ పాఠశాలల్లో అప్పులు చేసి మరీ చదివించేవారని తెలిపారు. కాని ఇపుడు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలకు జాయిన్ చెయ్యడానికి ఉత్సాహ పడుతున్నారని, ఎందుకంటే గతంలో చదివించాలంటే ఏడాదికి సుమారు రూ.20వేలు ఖర్చు అయ్యేదని, ఇది కాకుండా పుస్తకాలు, బట్టలు,బ్యాగు,షూ లాంటివి అధిక ఖర్చు చేయాల్సి వచ్చేదని చెప్పారు. కాని ఇపుడు జగనన్న తల్లి ఖాతాలోకి అమ్మఒడి క్రింద రూ.15వేలు, జగన్నన్న విద్యా దీవెన కింద స్కూల్ యూనిఫామ్ ,బ్యాగు,షూ,పుస్తకాలు ఫ్రీ గా అందజేయడం జరుగుతుందన్నారు. ఇంకా నాడు – నేడు కార్యక్రమంతో పాఠశాల స్థితి గతులు పూర్తిగా మార్చేయడం జరిగిందని, ఇంత కన్నా అద్భుతం ఇంకా ఏం కావాలని సభాపతి అన్నారు. అనంతరం జగనన్న విద్యాకానుకలను విద్యార్ధులకు అందజేసారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ జగనన్న విద్యాకానుక ద్వారా జిల్లావ్యాప్తంగా 3300 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2,49,405 మందికి లబ్ధిచేకూరనుందని చెప్పారు. రానున్న వారం రోజుల్లో జిల్లాకు రూ.38.16 కోట్లు విలువ గల జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ప్రతీ కిట్ లో ఒక స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫాం, బూట్లు, సాక్సులు, బెల్టు, నోటు, పాఠ్యపుస్తకాలు అందజేయడం జరుగుతుందని, యూనిఫారాలు కుట్టించుకునేందుకు తల్లుల ఖాతాలకు నగదును జమచేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కె.నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, సమగ్ర శిక్షణ అధికారి పథక సంచాలకులు పైడి వెంకటరమణ, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
పేదలందరికీ విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ధ్యేయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కార్పొరేట్ విద్యావ్యవస్థకు ధీటుగా, ప్రభుత్వ విద్యావ్యవస్థను తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. చీపురుపల్లిలోని జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాకానుక పంపిణీకి మంత్రి బొత్స గురువారం శ్రీకారం చుట్టారు. వివిధ తరగతుల విద్యార్థులకు విద్యాకానుక కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలలు తెరిచేనాటికి విద్యార్థులకు అన్ని సౌకర్యాలూ సిద్దంగా ఉండాలన్న ఉద్దేశంతో, ముందుగానే ప్రభుత్వం విద్యాకానుక అందజేస్తోందన్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 43లక్షల మంది విద్యార్థులకు, రూ.650కోట్ల వ్యయంతో కిట్లను రూపొందించి, పంపిణీ చేస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా జిల్లాలోని 2,083 పాఠశాలలకు చెందిన 2,09,345 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందజేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో కిట్ విలువ సుమారుగా రూ.1530 అని తెలిపారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారి కొలతలు తీసుకొని, వారికి సరిపడే యూనిఫారాలను కుట్టించి ఇస్తున్నామన్నారు.
ప్రజలకు మేలు చేయాలన్ని కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి పరిపాలన సాగిస్తున్నారని మంత్రి అన్నారు. ఏ ఒక్క పేద విద్యార్థీ ఆర్థిక కారణాలతో చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో, ముఖ్యమంత్రి విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. జగనన్న విద్యాకానుకతోపాటుగా జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన తదితర పథకాలను విద్యకోసం అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా రూపొందించేందుకు నాడూ-నేడు పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. చదువువల్లే ఎవరికైనా సమాజంలో మంచి గుర్తింపు, స్థాయి, స్థోమత లభిస్తుందని అన్నారు. ప్రతీ విద్యార్థీ చిన్నతనంలోనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, చదువు ద్వారా దానిని సాధించేందుకు కృషి చేయాలని మంత్రొ బొత్స కోరారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ చదువు వల్లే ఏ వ్యక్తికైనా గౌరవం లభిస్తుందని అన్నారు. ఎంతో పేదరికంలో, మారుమూల గ్రామంలో పుట్టినప్పటికీ చదువుద్వారా ఉన్నత స్థానాన్ని సాధించవచ్చని చెప్పడానికి తన జీవితమే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. చదువుకున్నవారు ఏరంగంలోనైనా ఉన్నత స్థాయికి ఎదుగుతారని స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యనిస్తోందని, దానిలో భాగంగానే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. విద్యలనగరంగా పేరుగాంచిన విజయనగరం జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా, వినూత్నంగా విద్యాకానుకను అందించడం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డికే చెల్లిందన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు మౌలిక వసతుల కొరతతో , శిధిలావస్థలో ఉండేవని, ఇప్పుడు నాడూ-నేడు పథకం ద్వారా వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. వసతులను కల్పించడంతోపాటుగా, పేదలు సైతం ఇంగ్లీషు చదువులు చదవాలన్న ఉద్దేశంతో, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లబోధనను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, కరోనా కష్టకాలంలో సైతం ప్రజలను నిరంతరం ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డికే చెల్లిందని కొనియాడారు. జగనన్న విద్యాకానుక పథకంపై జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష రూపొందించిన కరపత్రాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులు విద్యాకానుకపై నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, వైకాపా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, డిఇఓ జి.నాగమణి, ఎస్ఎస్ఏ పిఓ జె.విజయలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ డిడి కె.సునీల్‌రాజ్ కుమార్, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, పశుసంవర్థకశాఖ జెడి ఎంవిఏ నర్సింహులు, డిపిఎం బి.పద్మావతి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ పప్పు రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, స్థానిక నాయకులు కె.వి.సూర్యనారాయణరాజు, పెదబాబు, ఇప్పిలి అనంత్, ఒలిరెడ్డి శ్రీనివాసరావు, కొణిశి కృష్ణారావు, పొన్నాడ వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
డ్రైవింగ్ శిక్షణతో ఉపాధి అవకాశాలు ఎక్కువగా పొందవచ్చుసని సంయుక్త కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం ) శ్రీరాములు నాయుడు అన్నారు. గురువారం ప్రజా రవాణా శాఖ కార్యాలయంలో హెవీ వెహికల్ లైసెన్స్ శిక్షణ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జె.సి. ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. అదే విధంగా యువతకు మంచి ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రజా రవాణా శాఖ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు. ప్రజా రావాణా శాఖలో మంచి నిపుణులైన డ్రైవర్ల ద్వారా డ్రైవింగ్ పై శిక్షణ నివ్వడం జరుగుతుందన్నారు. తద్వారా డ్రైవింగ్ లో మెళుకువలు నేర్చుకోవచ్చునన్నారు. డ్రైవర్లకు ఎక్కువ డిమాండ్ వుందన్నారు. ప్రతీ గ్రామంలో నిరుద్యోగ యువత అధికంగా వున్నారని, ఇటువంటి ట్రైనింగులు ద్వారా స్వయం ఉపాధికి మంచి అవకాశాలు వుంటాయన్నారు. నిబధ్ధతతో శిక్షణ పొందాలని, రహదారి ప్రమాదాలు జరుగకుండా డ్రైవింగ్ చేసి ప్రజా రవాణా శాఖ కు, జిల్లాకు మంచి పేరు తీసుకురావలని హితవు పలికారు. ట్రైనింగ్ అభ్యర్ధులలో జలుమూరు మండలం, చల్లవాని పేట నుండి చల్లా ఆశ అనే మహిళ పాల్గొనడం సంతోషదాయకమన్నారు.
ప్రజా రవాణా శాఖ రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ, ప్రస్తుతం హెవీ వెహికల్ డ్రైవర్ల కొరత ఎక్కువగా వుందని, ప్రజా రవాణా శాఖ లాభాపేక్ష లేకుండా సేవలందిస్తున్నదని అన్నారు. 2008-09 సం.లో లైట్ వెహికల్ డ్రైవింగ్ లో తమ శాఖ ద్వారా శిక్షణ నివ్వడం జరిగిందని తెలిపారు. అద్దె బస్సులకు డ్రైవర్లు అవసరం చాలా వుందన్నారు. ఈ శిక్షణ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయన్నారు. 40 రోజుల పాటు అందించే శిక్షణ ద్వారా డ్రైవింగ్ మెలుకువలు నేర్చుకోవాలని చెప్పారు. ట్రైనింగ్ అనంతరం సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి బ్యాచ్ లో 16 మందికి శిక్షణ నిస్తున్నామన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పి.శివరాం గోపాల్ మాట్లాడుతూ, ఇది మంచి శుభ పరిణామమని అన్నారు. ముఖ్యంగా డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా వుండాలన్నారు. ఓర్పు, సహనం కలిగి వుండాలని సూచించారు. అనంతరం డ్రైవింగ్ శిక్షణ, రహదారి సంకేతాలు అనే రెండు బ్రోచర్ లను విడుదల చేసారు. జెండా ఊపి డ్రైవింగ్ శిక్షణ బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా రవాణా శాఖ రీజనల్ మేనేజర్ ఎ.అప్పల రాజు, డివిజనల్ మేనేజరు జి.వరలక్ష్మి, 1,2 వ డిపో మేనేజర్లు వి.ప్రవీణ, టి.కవిత, ఎ.డి.సి. బిడ్డిక మంగ, ట్రైనింగ్ అభ్యర్ధులు, తదితరులు పాల్గొన్నారు.
భారత వాతావరణ కేంద్రం సూచనల ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రం దాని అనుసంధానంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఆ అల్ప పీడనం తదుపరి 24గంటల్లో వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని కూడా కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 3 రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు , పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని కనుక మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని విపత్తుల శాఖ కమీషనర్ హెచ్చరించారు. రాగల పరిస్థితి ని ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తుగా చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు కోరారు.
నటరత్న ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ తూర్పుగోదావరి జిల్లాలో కూడా బలంగా వినిపిస్తోంది. విశాఖలోని డాక్టర్ ఎన్టీఆర్ కళరాధ న పీఠం ఫౌండర్ చైర్మన్ ఎస్. ఎల్.ఎన్. స్వామి పిలుపుతో ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా తమ వాణి బలంగా వినిపిస్తూ..పోస్టు కార్డు ఉద్యమంలో పాల్గొంటున్నారు. గురువారం కాకినాడ లో ఎన్టీఆర్ కళారాధ నా పీఠం కన్వినర్ తురగా సూర్యారావు నటరత్న ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన మంత్రికి లేఖలు పంపారు. అంతేకాకుండా పోస్టల్ శాఖలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులంతా ఈ విషయంలో కలసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వలేదని ఆరోపించిన ఆయన బీజెపీ ప్రభుత్వం ఈ విషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేకాకుండా స్థానిక బి జె.పి కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న కూడా తమ బి. జె.పి పార్టీ మీటింగ్ లో అన్న ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి ప్రధాని మోడీకి లేఖలు పంపుతామని చెప్పినట్టు ఆయన వివరించారు. రాష్ట్రాలు, ప్రాంతాలు అనే భేదం లేకుండా ఎన్టీఆర్ అభిమానులంతా చురుగ్గా ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ పోస్టల్ శాఖ అభిమానులు పాల్గొన్నారు.
మధర్ థెరిస్సా సిస్టర్స్ మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అందిస్తున్న సేవలు శ్లాఘనీయమని శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ అభివర్ణించారు. గురువారం ఉదయం స్థానిక ఆర్ట్ కళాశాలలోని గిరిజన యువత శిక్షణ కేంద్రంలో నర్సింగ్ శిక్షణ పొందిన రెండవ బ్యాచ్ విడుదల కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మథర్ థెరిస్సా సిస్టర్స్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని, సహనం,ఓర్పుతో అన్ని కార్యక్రమాలు చేపడుతుంటారని కితాబిచ్చారు. ప్రతీ రోజూ తమ సంస్థ అందిస్తున్న సేవలను వెబ్ సైట్ నందు వీక్షిస్తుంటానని చెప్పారు. ప్రస్తుతం కరోనా నేపధ్యంలో కరోనా పేషంట్లకు సేవలు అందించేందుకు నర్సులు ఆవశ్యకత ఎంతైనా ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని నర్సింగ్ నందు శిక్షణ ఇచ్చిన ఆరుగురు శిక్షకులను (థెరిస్సా సిస్టర్స్) జె.సి అభినందించారు. మీరిచ్చిన శిక్షణ వలన ముందుగా ఒక బ్యాచ్ వెళ్లిందని, వారు ఇప్పటికే సేవలు అందిస్తున్నారని, అలాగే రెండవ బ్యాచ్ శిక్షణను పూర్తిచేసుకొని బుధవారం విడుదలై సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నందున ఆనందంగా ఉందన్నారు. మరో బ్యాచ్ నకు శిక్షణ ప్రారంభించడం గర్వకారణమని ఇందుకు మీరు అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా నర్సింగ్ కోర్సుపై రెండు బ్యాచ్ లకు శిక్షణ ఇచ్చిన సిస్టర్స్ దీపాళీ, రాఫాలిట్, జెన్నీ అగస్టైన్, క్రిష్ జాన్, మేరీ ఏంకెల్, అన్నిక్ లకు జె.సి దుశ్శాలువ, జ్ఞాపిక, పుష్పగుచ్ఛాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప తహశీల్ధార్ కె.సతీష్, గ్రామ రెవిన్యూ అధికారులు డి.వరలక్ష్మీ, పి.శ్రావణి, బి.రాంజీ, పర్యవేక్షకులు టి.హరిసూర్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, ఆయన ఆశయ సాధనకు మనవంతు కృషి చేయాలని వార్డు కార్యదర్శిలను ఆదేశించారు. బుధవారం వీఎంఆర్డీఏ థియేటర్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రముఖంగా వార్డు సేక్రటరీలకి రెండు బాధ్యతలు ఉంటాయన్నారు. ప్రతీ రోజూ హాజరు పట్టిక, మూమెంట్ రిజిస్టర్, డైరీ విధిగా రాయాలన్నారు. పలు సచివాలయాలలో కార్యదర్శులు విధులు సక్రమంగా నిర్వహించడం లేదని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చాలా వార్డులలో సేవల దరఖాస్తులు పెండింగులో ఉండడాన్ని గమనించామని వాటిపై వెంటనే చర్య తీసుకోవాలన్నారు. సచివాలయాలలో బిల్లు కడుతున్నప్పుడు సొంత బ్యాంకు ఖాతా ఏ.టి.యం. కార్డులను ఉపయోగించరాదని అన్నారు. ముఖ్యంగా రేషన్ కార్డు, ఫించన్, ఇల్లు లేని వారికి ఇళ్ళు మొదలైన సేవలను మనం ప్రజలకు అందించిననాడు మనల్ని ప్రజలు గుర్తించుకుంటారని అన్నారు.
అనంతరం, ఒకటవ జోనల్ కమిషనర్ రాము మాట్లాడుతూ, చాలామంది సరిగా సమయానికి విధులకు రావడం లేదని ఇకపై అలా జరగకూడదని అన్నారు. 2వ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం పూర్తి అయిందని ఇంకా మీరు విద్యార్థి దశలో లేరని మీకున్న వనరులతోనే వ్యవస్థను నడపాలని, మీ సర్వీసుతో ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. మూడవ జోనల్ కమిషనర్ బి. సన్యాసినాయుడు మాట్లాడుతూ మొదట అడ్మిన్లు సబ్జెక్టు నేర్చుకోవాలని, ముఖ్యమంత్రి మంచి ఉద్దేశ్యంతో సచివాలయ వ్యవస్థను స్థాపించారని లక్షా 50వేల కుటుంబాలకు ఆయువు పోసారన్నారు. దీనిని మనం నిర్వీర్యం చేయకూడదని హితవు పలికారు. 5వ జోనల్ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ సెలవు అనేది మీ ప్రాథమిక హక్కు కాదని ప్రత్యేక కారణం, ముందస్తు అనుమతి లేకుండా సెలవు పెట్టకూడదని మనం ప్రజలతో మమేకమై ఉన్నామని, వారికి సర్వీస్ ఎంత బాగా చేస్తే అంత పేరు వస్తుందన్నారు. 6వ జోనల్ కమిషనర్ రమణ మాట్లాడుతూ ప్రజలకు పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా ఏదో ఒక సర్వీసును ఇస్తున్నామన్నారు. ఇష్టంతో పనిచేస్తే కష్టం అనేదే ఉండదని అన్నారు. సరిగా విధులు నిర్వహించని కారణంగా 47మంది వార్డు సెక్రటరీలకు మెమోలు జారీ చేస్తే, ఐదు మంది మాత్రమే సమాధానం ఇచ్చారని అన్నారు. అనకాపల్లి జోనల్ కమిషనర్ మూర్తి మాట్లాడుతూ, రెవెన్యూ సెక్రటరీలు మా వద్ద బాగానే పనిచేస్తున్నందువలన ఈ ఆర్థిక సంవత్సరం 50 లక్షలు అదనంగా రెవెన్యూ వసూలు చేయగలిగామన్నారు. భీమిలి జోనల్ కమిషనర్ గోవిందరావు మాట్లాడుతూ మీకు రెండు నెలల వ్యవధిలోనే ఉద్యోగాలు వచ్చాయని, మీకు ఇచ్చిన గుర్తింపు ఎవ్వరికీ దక్కదని, అందువలన అందరూ శ్రద్ధతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ కమిషనర్(రెవెన్యూ) ఎం.వి.డి.ఫణిరాం, జోనల్ కమిషనర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, టేక్స్ కలక్టర్లు, వార్డు సచివాలయ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల కొరకు ఈ నెల 20లోగా నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ పేర్కొన్నారు. అక్టోబర్ 20లోగా నమోదుచేయని లేదా రెన్యూవల్ చేయని విద్యార్ధులకు MHRD న్యూఢిల్లీ వారి నుండి స్కాలర్ షిప్ మంజూరుచేయబడదని ఆమె స్పష్టం చేసారు. గతేడాది నవంబర్ లో జరిగిన జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష ( NMMS ) నందు సెలక్ట్ అయి ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్ధులు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని ఆమె చెప్పారు. నేషనల్ ప్రతిభా పత్రముల వెనుక సూచించిన మార్గదర్శకాలకు అణుగుణంగా విద్యార్ధి వివరాలను సంబంధిత వెబ్ సైట్ నందు నమోదుచేసుకోవాలని తెలిపారు. అలాగే నవంబర్ 2017 మరియు 2018 సం.లలో జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్షలలో సెలక్ట్ అయి ప్రస్తుతం 10వ తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్ధులు కూడా నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చేసుకోవాలని ఆమె సూచించారు. రెన్యూవల్ కొరకు గతేడాది విద్యార్ధి యొక్క యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ లను ఉపయోగించి లాగిన్ కావచ్చన్నారు. విద్యార్ధి లాగిన్ నందు రెన్యూవల్ తర్వాత వచ్చిన దరఖాస్తును విద్యార్ధి మరియు ప్రధానోపాధ్యాయులు లేదా ప్రిన్సిపాల్ సంతకం చేసి జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం, శ్రీకాకుళంనకు సమర్పించాలని కోరారు. విద్యార్ధి లాగిన్ లో అప్లై లేదా రెన్యూవల్ చేసిన తర్వాత స్కూల్ లాగిన్ నందు ప్రధానోపాధ్యాయులు అప్రోవల్ చేయాలని, ఈ ప్రక్రియను ఈ నెల 20లోగా పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేసారు.
శ్రీకాకుళం జిల్లాలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాల ఎంపిక లాటరీ ద్వారా పూర్తయిందని గురుకుల పాఠశాలల కన్వీనర్ జల్లు లక్ష్మణ మూర్తి బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టర్ నియమించిన ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 6 న బాలికలకు, 7 న బాలురకు లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తయిందని అన్నారు. టెక్కలి లో 80 ఖాళీలను గాను 79 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. మిగిలిన ఒక్క సీటు ను ఆర్ఫన్ కేటగిరి లో ఖాళీ ఉందని తెలిపారు. శ్రీకాకుళం కు 40 ఖాళీ లకు 39 మంది విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక చేశామని ఆర్ఫన్ కేటగిరీలో ఒక్క ఖాళీ ఉందన్నారు. ఆమదాలవలస 80 ఖాళీ లకు 76 మంది విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. ఆర్ఫన్ కేటగిరి లో ఒకటి, ST కేటగిరి లో మూడు సీట్లు ఖాళీ గా ఉన్నాయన్నారు. పలాసా కు 40 సీట్ల కు 39, పాతపట్నం 40 కి 39 మంది విద్యార్థులను ఎంపిక చేశామని మిగిలిన ఒక్క సీటు ను ఆర్ఫన్ కేటగిరి లో ఖాళీ ఉందని తెలిపారు. మొత్తం 280 సీట్లకు 272 మంది బాలిక విద్యార్థినులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. బాలుర ఖాళీలను సంబందించి అంపోలు పాఠశాలకు 80 సీట్ల కు 79, నరసన్నపేట 40 కి 39 మంది విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. సంతబొమ్మాళి 80 కి ఖాళీ లకు 73 మంది విద్యార్థులను ఎంపిక చేశారని వివరించారు. ST కేటగిరి లో రెండు సీట్లు, ST కేటగిరి లో ఐదు సీట్లు ఖాళీలున్నాయన్నారు. మొత్తం 200 సీట్లకు 191 మంది విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తొమ్మిది సీట్లు ఖాళీ గా ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా విద్యాశాఖాధికారి చంద్ర కళ, బీసీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు, జిల్లా బీసీ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపాల్స్, శ్రీకాకుళం డిబిసిడబ్ల్యూ, విద్యార్థుల తల్లిదండ్రుల తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా లో ఈ నెల 8 న "జగనన్న విద్యా కానుక" పంపిణికి సర్వం సిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా బుధవారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 న ఉదయం 10 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టా త్మకంగా జగనన్న విధ్యా కానుక కిట్లను విధ్యార్ధులకు పంపిణి చేసిన అనంతరం జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో మరియు పాటశా లల్లో జగనన్న విధ్యా కానుక కిట్లను పంపిణి చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా "జగనన్న విధ్యా కానుక " కింద 4,857 పాటశాలల్లో 1,86,958 మంది బాలురు, 1,93,382 మంది బాలికలు మొత్తం 3,80,340 మంది విధ్యార్ధిని, విధ్యార్ధులకు జగనన్న విధ్యా కానుక కింద కిట్లను పంపిణి చేయనున్నట్లు తెలిపారు.ఈ కిట్ నందు పాటశాల బ్యాగ్,ఘా మరియు సాక్స్, మూడు జతల యూనిఫాం, బెల్ట్, నోటు పుస్తకాలు అంద జేయడం జరుగుతుందని తెలిపారు. కోవిడ్ నేపధ్యం లో ఈ కార్యక్రమంలో పాల్గొ నే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరించాలని, శ్యానిటైజర్ ప్రతి పాటశాలల్లో ఉండే టట్లు చర్యలు తీసుకోవా లని విధ్యా శాఖ అధికా రులను ఆదేశించడం జరి గిందని, విధ్యార్ధుల తల్లి బయో మెట్రిక్ గుర్తింపు తీసుకొని జగనన్న విధ్యా కానుక కిట్లను అంద జేయాలని తెలిపారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమానికి సంబం దించిన జిల్లా స్థాయి కార్యక్రమం బి.ఎస్.కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాటశాల చిత్తూరు నందు ఉదయం 10 గంటలకు జరుగునని, ఈ కార్యక్రమానికి చిత్తూరు శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ పరిధిలో ప్రజా ప్రతినిధులచే నిర్వహించడం జరుగు తుందని కలెక్టర్ తెలిపారు.
పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను హెచ్చరించారు . బుధవారం క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా కమిషనర్ రెండు, మూడు జోన్ల లోని ప్రాంతాలైన ఆర్.కె. బీచ్ రోడ్డు, కలక్టర్ ఆఫీసు, జగదాంబ, మున్సిపల్ స్టేడియం, డైమండ్ పార్కు తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. పలుచోట్ల కాలువల్లో చెత్తపేరుకుపోయి వుండటాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బందికి పలు సూచనలు చేసారు. కాలువలు పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాలువలలో, చెత్త వెస్తే జరిమానా విధించాలన్నారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రత పై శ్రద్ద వహించాలని కోరారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందు వలన కలువల యు.జి.డి. కనక్షన్లు పొంగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబందిత జోనల్ కమిషనర్లు, శానిటరీ సూపెర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల ఆరోగ్య పరమై అంశాలతోపాటు ప్రభుత్వ ఆరోగ్యసేవలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం తన చాంబర్ లో ప్రభుత్వం మంజూరు చేసిన ట్యాబ్ లను ఆరోగ్య సిబ్బందికి కమిషనర్ గిరీష అందజేశారు. ఆర్ సి హెచ్ రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్, ప్రభుత్వ కార్యక్రమములు ఆన్ లైన్ ప్రక్రియ చేయడానికే వీటిని పంపిణీ చేశామన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 102 వార్డ్ సచివాలయం లో 120 మందికి ఆరోగ్య కార్యదర్శులకు, ఏఎన్ఎంలు కు మొదలగు వారికి క్షేత్రస్థాయిలో నిర్వర్తించే ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమంలో అయిన, మత శిశు సంరక్షణ, పునరుత్పత్తి శిశువు ఆరోగ్యం, కరోనా కు సంబంధించిన మొదలైన కార్యక్రమాలన్నింటినీ ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా 100% వ్రుద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక ఆరోగ్య అధికారి డాక్టర్ సుధారాణి, నగరపాలక ఉప గణాంక అధికారి నీలకంటేశ్వర రావు, ఆరోగ్య విస్తరణ అధికారి మోహన్, మధుసూదన్, వార్డ్ ఆరోగ్య కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ప‌్రజలకోసం నిజాయితీగా పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ప్రజల అభిమానం ఆశీస్సులు అందించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తూ మాట నిలబెట్టుకునేలా పనిచేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వంటి నాయకుడిని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేందుకు వచ్చే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలన్నారు. గజపతినగరం మండంల మరుపల్లిలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం నూతన భవనాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. గ్రామీణులకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ఒక్క సి.ఎం. జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమయ్యిందన్నారు. రాష్ట్రంలో విద్యార్ధులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, రైతులు తదితర అన్ని వర్గాలకు పథకాలను రూపొందించి నవరత్నాలు పేరుతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. స్వయంశక్తి మహిళల బ్యాంకు రుణాలు తీర్చేందుకు ఆసరా పథకాన్ని తీసుకువచ్చామని, విద్యార్ధులకు ఫీజుల తిరిగి చెల్లింపు, అమ్మ ఒడి పథకాల ద్వారా ఆదుకుంటున్నామని, సాగునీటి సదుపాయం లేని వ్యవసాయ భూములక సాగునీటిని అందించేందుకు జలకళ పథకం తీసుకువచ్చామని, సాగునీటి సౌకర్యంలేని పొలాలకు ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేసి, మోటార్లు బిగించి ఉచితంగా కరెంటు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రతిఏటా రూ.60 వేల కోట్లు పన్నులు రూపంలో చెల్లిస్తుంటే అంతే మొత్తాన్ని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొన్ని లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ఎందరో యువతీ యువకులు ఉత్సాహంగా సచివాలయాల్లో ఉద్యోగులుగా, వలంటీర్లుగా చేరి తమ ప్రాంతానికి, ప్రజలకు సేవలందిస్తూ సంతృప్తి పొందుతున్నారని చెప్పారు.
జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పాలకులంతా ఈ వ్యవస్థ వైపు చూస్తున్నారని చెప్పారు. అవినీతి, లంచగొండితనానికి తావులేకుండా ప్రభుత్వ సేవలన్నీగ్రామస్థాయిలోనే అందించే లక్ష్యంతో ఈ వ్యవస్థకు ముఖ్యమంత్రి రూపకల్పన చేశారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జిల్లా ముందంజలో నిలుస్తోందన్నారు. శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ మంచి పాలన అందించే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రైతులు గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు పొందడంతోపాటు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను కూడా గ్రామంలోనే విక్రయించుకొనే అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదేనని చెప్పారు. గత ఏడాది మొక్కజొన్న ధర మార్కెట్‌లో పడిపోయినపుడు రూ.1700 చెల్లించి రైతుల నుండి కొనుగోలు చేశామన్నారు. ఈ సందర్భంగా పలువురు వికలాంగ బాలలకు మూడు చక్రాల సైకిళ్లను మంత్రి బొత్స సత్యనారాయణ పంపిణీ చేశారు. అంతకుముందు మరుపల్లి గ్రామస్థులు మంత్రి బొత్సకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌లు డా.జి.సి.కిషోర్ కుమార్, జె.వెంకటరావు, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, డ్వామా పి.డి. నాగేశ్వరరావు, సిపిఓ విజయలక్ష్మి, సాంఘికసంక్షేమశాఖ డి.డి. సునీల్ రాజ్‌కుమార్, మండల ప్రత్యేకాధికారి మహరాజన్ తదితరులు పాల్గొన్నారు.