1 ENS Live Breaking News

APGEAతోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం..

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం మాత్రమే పరిష్కారం చేయగలదని యూనియన్ రాష్ట్ర నాయకులు చొప్పా రవీంద్రబాబు అన్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో APGEA అధ్వర్యంలో ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల జిల్లా సదస్సు జిల్లా అధ్యక్షులు బషీర్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగులంతా కలసి మెలసి ఒకే కుటుంబంలా ఉండాలన్నారు. ఏ సమస్య వచ్చినా సంఘం రాష్ట్ర నాయకత్వం ద్రుష్టికి తీసుకువస్తే..దానిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం  జిల్లా వ్యాప్తంగా వచ్చిన గ్రామ / వార్డ్ ఉద్యోగులు పలువురు ప్రసంగిస్తూ సచివాలయంలో వారికి ఉన్న సమస్యల గురించి వేదిక దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలన్నింటీని రాష్ట్ర నాయకత్వం పరిష్కరించడానికి చర్చించి నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో APGEA జిల్లా అధ్యక్షులు  రమణారెడ్డి, సహాధ్యక్షులు  చేజర్ల సుధాకర్ రావు, కార్యదర్శి  మల్లికార్జున, ఆర్గనైజింగ్ సెక్రటరీ మునెయ్య, కోశాధికారి రాంప్రసాద్,నెల్లూరు సిటీ కార్యదర్శి  నాగరాజు, వెంకటగిరి అధ్యక్షుడు  సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Nellore

2020-10-10 19:07:13

నెల్లూరులో సచివాలయ ఉద్యోగుల అడ్ హాక్ కమిటీ..

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గ్రామసచివాలయ ఉద్యోగుల సమస్యలను యూనియన్ ద్వారా పరిష్కరించుకోవడానికి అందరు ఉద్యోగులు సహకరించాలని నెల్లూరు జిల్లా గ్రామసచివాలయ ఉద్యోగుల సంఘం అడ్ హాక్ కమిటీ చైర్మన్ sk.బషీర్ అహ్మద్ అన్నారు. APGEA రాష్ట్ర నాయకులు  చొప్పా రవీంద్రబాబు పర్యవేక్షణలో జిల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సంఘం అడ్ హాక్ కమిటీని శనివారం ఏర్పాటు అయ్యింది. శ్రీ జెట్టి శేషారెడ్డి విజ్ఞానకేంద్రం లో ఈ కమిటీని ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఈ కమిటీకు చైర్మన్ గా Sk.బషీర్ అహ్మద్ , కన్వీనర్ గా S.బాబూరావు, శాధికారిగా I. మణికోను ఎన్నుకున్నారు. వీరితో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన  మరో 18 మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు కో చైర్మన్ లు గాను, కో కన్వీనర్ లు గాను ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యూనియన్ కి సంబంధించిన ఏ అంశమైనా కమిటీ ద్వారా చర్చించుకునేలా సమావేశంలో తీర్మాణించారు. కమిటీలన్నీ రాష్ట్రనాయకత్వం ఆధ్వర్యంలో పనిచేస్తాయని చొప్పారవీంద్రబాబు కమిటీకి తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ సచివాలయాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. 

Nellore

2020-10-10 19:00:29

అనంతలో రేపు కరోనా పరీక్షలు చేసేది ఇక్కడే..

అనంతపురం జిల్లాలో రేపు (11.10.2020)  కోవిడ్ నమూనాలు సేకరించే ప్రాంతాల జాబితాను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రకటించారు. ఆ కేంద్రాలు వరుసగా.. హిందూపురం మున్సిపాలిటీ,  పుట్టపర్తి మున్సిపాలిటీ,  ధర్మవరం మున్సిపాలిటీ, తాడిపత్రి మున్సిపాలిటీ,  గుంతకల్లు మున్సిపాలిటీ,  గుత్తి మున్సిపాలిటీ, రాయదుర్గం మున్సిపాలిటీ,  కదిరి మునిసిపాలిటీ,  కళ్యాణదుర్గం మునిసిపాలిటీ,  కల్లుమర్రి పి.హెచ్.సి తోపాటు ఫిక్స్డ్ లొకేషన్స్ గా మునిసిపల్ గెస్ట్ హౌస్, అనంతపురము, జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్, అనంతపురము, సి.డి.హాస్పిటల్, ఓల్డ్ టౌన్ ప్రాంతాలతో పాటు పిహెచ్సీ లు, సిహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల నుండి కూడా శాంపిల్స్ సేకరించనున్నారు. ఈ  అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రించేందుకు ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. వైరస్ తో ఉన్నవారు హోమ్ ఐసోలేషన్ లోనే చికిత్స తీసుకోవాలన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కులు ధరించి ఎప్పటి కప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

కలెక్టరేట్

2020-10-10 18:43:41

24 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

విశాఖజిల్లాలో  తీవ్ర అల్పపీడనం కారణంగా రాగల 24 గంటలలో భారీ వర్షాలు పడతాయని, వాతావరణ శాఖ సూచన మేరకు  ముందస్తు చర్యగా జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తీర ప్రాంతాలలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లకుండా మత్స్యశాఖ అధికారులు అప్రమత్తం గావించాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెం . 0891 – 2590102 , 0891- 2590100 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం గావించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత మండలాలలో మత్స్యశాఖ అధికారులు , ఎఫ్.డి.ఒ.లు, ఎ.డి.లు. పర్యటించి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జాయింట్ డైరెక్టర్, ఫిషరీస్, ఆ మేరకు తగు చర్యలు చేపట్టాలన్నారు. తీర ప్రాంత మండాలలోని గ్రామ సచివాలయాలలోని మత్స్యశాఖ మరియు పశుసంవర్థక శాఖ అసిస్టెంట్స్ అప్రమత్తంగా వుండాలన్నారు. ఎవరైన సముద్రంలోకి వేటకి వెళ్లివుంటే వారిని సత్వరమే వెనక్కి రప్పించాలని చెప్పారు. వారంతా సురక్షిత ప్రాంతాలలో వుండేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు సముద్రం అల్లకల్లోలంగా వుంటుందని మత్స్యకారులెవరూ సముద్రంలోకి పోరాదన్నారు. తేది 11.10.20, 12.10.20 లలో పరిస్థితి ఇలాగే కొనసాగుతూ వుంటుందని. జిల్లా అధికారులంతా అందుబాటులో వుండి అవసరమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం కలెక్టరు కార్యాలయంలో కంట్రోల్ రూం 24 గంటలు పని చేసేలా తగు చర్యలు చేపట్టాలని డి.ఆర్.ఒ.ని ఆదేశించారు.

కలెక్టరేట్

2020-10-10 18:34:06

మీసేవలకు మా సలాం..

మీరు జీవితాలను పణంగా పెట్టారు... మీ సేవలు మరువలేం ... అన్నారు జిల్లా కలెక్టర్ జె నివాస్. జెమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ 19 సేవలలో పాల్గొని విధులు ముగించు కుని ఇళ్ళకు తిరిగి వెళుతున్న కోవిడ్ వారియర్స్ కు శని వారం జెమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. మార్చి నెల నుండి కరోనాతో పోరాడుతున్నాం. కరోనా వైరస్ సోకిన వారికి సేవల కోసం మూడు నెలలకు తాత్కాలికంగా ఉద్యోగాల్లో నియమించామని, మీరు అందరూ జీతాల కోసం కాకుండా జీవితాలను పణంగా పెట్టి సేవలందించారని ప్రశంసించారు. మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. కరోనా సమయంలో బంధువులు కూడా దగ్గర చేరని  సమయంలో, అంత్యక్రియలకు కూడా రాకుండా ఉన్నటువంటి పరిస్థితిలో కోవిడ్ వారియర్స్ గా మీరు అందించిన సేవలు మరువలేనివి అన్నారు. అనవసర భయంతో, అవగాహన లోపంతో సరైన సేవలు వినియోగించు కోలేకపోయారని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న మీరందరూ ధైర్యంగా సేవ చేయాలనే దృక్పధంతో  పని చేశారని, ప్రజల ప్రాణాలు కాపాడడానికి ముందుకు వచ్చిన మీ అందరికి జిల్లా రుణపడి ఉంటుందని అన్నారు. మిగతా వ్యాధుల వేరు - కరోనా వ్యాధి వేరు. ఏ జబ్బుకు అయినా సేవ చెయ్యడానికి బంధువులు వచ్చేవారు కానీ కరోనా వ్యాధి వస్తే బంధువులు ఉన్నారో లేరో అన్నటు వంటి పరిస్థితి అటువంటి సమయంలో మీరే వీరికి అండా దండాగా ఉంటూ బంధువులు, ఆప్తులు కూడా మీరే అయ్యారని కొనియాడారు. కరోనా రోగులకు ముఖ పరిచయం లేని బంధువులుగా మిమ్మల్ని వారు గుర్తు తెచ్చుకుంటారని పేర్కొన్నారు. రోగులకు సిబ్బంది తమ చేత్తో తినిపించే సందర్భాలు కూడా నాకు తెలుసు అన్నారు. రోగుల ప్రాణాలు కాపాడడంలో ప్రత్యేక పాత్ర మీ అందరిదీ అని కొనియాడారు. కరోనా సమయంలో ఎఫ్.ఎన్.ఓ, ఎమ్.ఎన్.ఓలు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని పేర్కొన్నారు. రోగులు రాగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వీల్ చైర్లో  బెడ్ వరకు తీసుకువెళ్లి అవసరమైన సపరిచర్యలు అందించడంలో ముందున్నారని ప్రశంసించారు. అనేక ప్రాంతాల్లో రోగులు చెట్లకింద, వరండాలో, అంబులెన్స్ లో చనిపోయిన దుర్ఘటనలు చూసామని,  ఇలా శ్రీకాకుళం జిల్లాలో జరగ కూడదు అని నిర్ణయించుకొని జిల్లా అధికారులకి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. మన జిల్లాలో ఉన్న డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సహాయ సహకారాలతో కోవిడ్ నుండి కాస్త ఉపశమనం పొందడం జరిగిందన్నారు. కోవిడ్ సమయంలో సేవలు అందించి, కోవిడ్ సర్టిఫికెట్ పొందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ సమయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వమని ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేస్తున్నామని, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. ప్రతీ రోగిని కూడా నా బంధువులానే చూసుకున్నానని,  మీరు కూడా అలానే చూసుకున్నారని పేర్కొన్నారు. తద్వారా అన్ని జిల్లాల కంటే కోవిడ్ నివారణలో మనం ముందున్నామని, మీ అందరూ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాకు మంచి పేరు సంపాదించి పెట్టారని అంటూ మరోసారి మీ అందరికి ప్రేత్యేక ధన్యవాదాలు తెలుపారు. రెవిన్యూ విభాగం జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా గత నాలుగు నెలల నుండి ఆసుపత్రి సిబ్బంది అందించిన కోవిడ్ సేవలు గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. జిల్లా అధికారులు మీ సేవలు గుర్తించారని, మీకు ఈ కోవిడ్ సర్టిఫికెట్ అన్నది మున్ముందు ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. వార్డు, గ్రామ పంచాయతీ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా కోవిడ్ మహమ్మారికి భయపడి స్వంత కుటుంబ సభ్యులే రోగుల దగ్గరికి చేరడానికి ధైర్యం చేయలేదని, అటువంటి సమయంలో మీరు అందరూ కలసి  ప్రాణాలకు తెగించి కోవిడ్ సేవలు అందించారని అన్నారు. మనందరం ఇలా పనిచేయడానికి మన జిల్లా కలెక్టర్ కృషి మరువలేనిది అని అన్నారు. కలెక్టర్ ముందు చూపు వలన కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరగకుండా జిల్లాని మీ అందరి సహాయ సహకారాల వలన  నెరవేరింద అని అన్నారు.  కోవిడ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్  హేమంత్ మాట్లాడుతూ మొట్ట మొదటి గా ఏప్రిల్ 23 న మొదటి కోవిడ్ కేసుతో ప్రారంభమైన జెమ్స్ ఆసుపత్రి సేవలు ఇప్పటి వరకు  5 వేల 2 వందల మందికి సేవలు అందించిందన్నారు. ఇప్పటి వరకు 4900 మంది కోవిడ్ తగ్గు ముఖం పట్టి తమ ఇళ్లకు క్షేమంగా చేరుకున్నారని తెలిపారు. ఏ సమయానికి ఏమి కావాలో, ఎలాంటి సహాయ సహకారాలు కావాలో ప్రతీ క్షణం రాత్రనక, పగలనక మాకు సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సాహించిన కలెక్టర్ నివాస్ ,జాయింట్ కలెక్టర్లు శ్రీనివాసులు, సుమిత్ కుమార్  లకు ధన్యవాదాలు తెలిపారు.  ఈ సందర్భంగా కోవిడ్ వారియర్స్ కు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్రనాయక్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్, జెమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ, జెమ్స్ వైద్యులు డాక్టర్ సుధీర్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డిప్యూటి ఆర్.ఎం.ఓ డాక్టరు ప్రవీణ్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Srikakulam

2020-10-10 18:28:42

గణపతి రావుకు నివాళులు అర్పించిన కలెక్టర్..

శ్రీకాకుళం జిల్లా వీరఘాట్టం తహసిల్దార్ గా పనిచేస్తూ అస్వస్తతతో మృతి చెందిన ఎం.గణపతి రావు భౌతిక కాయంపై పుష్ప గుచ్చాలు పెట్టి జిల్లా కలెక్టర్ జె నివాస్ నివాళులు అర్పించారు. శుక్ర వారం మృతి చెందిన గణపతి రావు భౌతిక కాయానికి కుటుంబ సభ్యులు శనివారం ఉదయం శ్రీకాకుళం నాగావళి తీరాన ఉన్న రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న కైలాస భూమిలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ గణపతి రావు ఆత్మకు శాంతి కలగాలన్నారు. గణపతి రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులు అందరూ ధైర్యంగా ఉండాలని, ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు. గణపతి రావు విధుల పట్ల అంకిత భావం కలిగిన వ్యక్తి అన్నారు. జిల్లా యంత్రాంగానికి ముఖ్యంగా రెవెన్యూ శాఖకు అతని మృతి తీరని లోటు అన్నారు.

Veeraghattam

2020-10-10 18:24:26

శ్రీనివాస్ లేరనే తలచుకుంటే నోటిమాట రావడం లేదు..

ద్రోణంరాజు శ్రీనివాస్‌ మరణవార్త విన్నాక బాధని వ్యక్తపరిచేందుకు తనకు మాటలు రావడం లేదని రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక మంత్రి  బొత్స సత్యనారాయణ గారు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం  డాక్టర్స్ కాలనీలో గల స్వర్గీయ  ద్రోణంరాజు శ్రీనివాసరావు గృహాన్ని సందర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా ద్రోణంరాజు  శ్రీనివాస రావు సతీమణి, ఆయన కుమారుడు శ్రీవాస్తవను కలిసి పరామర్శించి మాట్లాడారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ద్రోణంరాజు శ్రీనివాసరావు తండ్రి వారసత్వంతో పాటు నిబద్ధత గల, మచ్చ లేని నాయకుడిగా రాజకీయ విలువల్ని కొనసాగించారని అన్నారు.  ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఉత్తరాంధ్ర ప్రజలకు తీరనిలోటని అన్నారు. ఉత్తరాంధ్ర రాజకీయ చాణుక్యుడు ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు వీఎంఆర్డీఏ తొలి చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఇక లేరనే వార్త అందరినీ కలచివేసిందని, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పిలిచే ఆ పిలుపు మూగబోయిందంటూ ఆవేదన వ్యక్తం  చేశారు.  ఈ విపత్కర పరీక్ష సమాయాన్ని ఎదుర్కొనేలా  ద్రోణంరాజు కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఎస్.ఏ. రెహమాన్,  భరణీకాన రామారావు తదితరులు  ద్రోణంరాజు శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు. 

Visakhapatnam

2020-10-10 17:45:53

గ్రామంలోనే మెరుగైన పశువైద్య సేవలు..

పాడిపరిశ్రమకు ప్రభుత్వం పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.  పద్మనాభం మండలం ,రెడ్డిపల్లి గ్రామంలో సుమారు 32 లక్షల వ్యయంతో నిర్మించిన పశు వైద్య శాల భవనాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో పశువైద్యానికి వీలుగా గ్రామసచివాలయంలో వెటర్నలీ సహాయకులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఇకపై పశువైద్యానికి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించే పనిలేదన్నారు. పశు వైద్య శాల లో సిబ్బందికి అవసరమైన కంప్యూటర్, ఫర్నిచర్ లాంటి మౌలిక వసతుల కల్పనకు సంబంధిత శాఖ మంత్రి తో మాట్లాడి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద , బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న దనీ అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని వీటిని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా  ప్రభుత్వ సేవలను సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల  ద్వారా ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ రామకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ కరుణాకర్, వ్యవసాయ శాఖ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జయ శేఖర్, ఇతర అధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రి రెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల లో గ్రామస్తులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  పాల్గొన్నారు. 

Padmanabham

2020-10-10 17:12:38

శ్రీవారికి కానుకగా బంగారు శఠారి విరాళం..

తిరుమలలోని శ్రీవారి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు  కృష్ణమూర్తి వైద్యనాథన్ శనివారం   రూ.35.89 లక్షల విలువైన బంగారు శఠారిని కానుకగా సమర్పించారు. ఈ మేరకు ఈ కానుకను శ్రీవారి ఆలయంలో టిటిడి ఈవో(ఎఫ్ఏసి)  ఏవి.ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా క్రుష్ణమూర్తి మాట్లాడుతూ, స్వామివారికి శఠారిని కానుక ఇవ్వడం తమ పూర్వజన్మ సుక్రుతమన్నారు. స్వామివారి పూజలో వినియోగించే పూజా సామాన్లు తయారుచేయించి ఇచ్చే అవకాశం తమకు దక్కడం చాలా ఆనందంగా వుందన్నారు. శ్రీవారి కరుణా కటాక్షాలతో కరోనా వ్యాప్తి పూర్తిగా నియంత్రణ జరగాలని స్వామిని వేడుకున్నట్టు వివరించారు. మహమ్మారి కారణంగా స్వామి చూడటానికి భక్తులు భయపడే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణ జరిగితే భక్తులు, ముసలివారు, పిల్లలు కూడా స్వామివారిని తనివితీరా చూసే భాగ్యం కలుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. 

Tirumala

2020-10-10 17:01:13

శ్రీ ఖాద్రీ నృసింహుశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు..

అనంతపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఖాద్రీ నృసింహుశుని శనివారం భక్తులు పోటెత్తారు. నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా వెలశియున్న క్షేత్రమే కాకుండా చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రశిద్దిమైన వైష్ణవ క్షేత్రమిది. దానికితోడు అధిక ఆశ్వయుజ మాసం బాహుళ  పక్షం అష్ఠమి  పునర్వసు  నక్షత్రం రెండవ శనివారము, శెలవు దినము సందర్భంగా  శ్రీ ఖాద్రీ నృసింహుని దర్శనమునకు విచ్చేసిన భక్తుల రద్ది అధికమైంది. లాక్ డౌన్ తొలగించినప్పటి నుంచి క్రమంగా ఆలయమునకు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. భక్తుల సంఖ్య అనుగుణాంగా నేటి నుండి ప్రత్యేక దర్శనము, శీఘ్రదర్శనము క్యూలైన్ల్ ద్వారా కూడ భక్తులకు స్వామి వారి దర్శనమునకు కల్పించినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తాదులు ముఖ్యంగా స్వామి వారి ఇంటి ఇలవెల్పుగా వుండే భక్తులు,  కర్నాటక రాష్ట్రములోని వివిధ ప్రాంతముల  నుంచి  అధికముగా వస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ రోజు తలనీలాలు కూడా సమర్పించడం విశేషం. 

Kadiri

2020-10-10 16:51:13

వార్డు సచివాలయ సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి..

ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హులైన ప్రతీ వ్యక్తికీ అందాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. శనివారం VMRDA ఎరీనా చిల్డ్రన్ థియేటర్ లో వార్డు సచివాలయ సంక్షేమ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ, సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిపాలన, సంక్షేమం, ప్రతీ పేద ఇంటికి చేరాలని ఉద్వేగంతో వార్డు సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టారన్నారు. వార్డు సచివాలయ సిబ్బంది బాగా పనిచేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదవారి కోసం వై.ఎస్.ఆర్. చేయూత, జగనన్న తోడు, రైస్ కార్డు, వై.ఎస్.ఆర్. భీమా, జగనన్న విద్యా దీవన, హౌసింగ్ స్కీము, అమ్మ ఒడి, ఆసరా, నేతన్న నేస్తం, పెన్షన్ కానుక వంటి మొత్తం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని, ప్రతీ పధకం అర్హులైన పేదవారికి అందించే బాధ్యత, సంక్షేమ కార్యదర్శులపై ఉందన్నారు. నగర పరిధిలో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం సాగిస్తున్నారని వారు మనల్ని నమ్ముకొని ఉన్నారని, ప్రజలకు హక్కుగా అందవలసిన అన్ని పధకాలు వారికి చేరాలని, వారికి ఆర్ధిక భరోసా కల్పించి ఆర్ధికంగా పైకి తీసుకురావలసిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం, ప్రాజెక్టు డైరెక్టర్(యు.సి.డి.) వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ, వార్డు సచివాలయ సంక్షేమ కార్యదర్శులు నిబద్దతతో పనిచేయాలన్న ఆయన ముఖ్యంగా, రైస్ కార్డు, పించన్ మొదలైన అర్హులను గుర్తించాలన్నారు. ప్రజలు పెట్టుకున్న ఆర్జీలు పెండింగులో ఉండకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్(యు.సి.డి.) వై. శ్రీనివాస రావుతో పాటూ, ఏ.పి.డి.లు, వార్డు సంక్షేమ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.  

వీఎంఆర్డీఏ థియేటర్

2020-10-10 16:40:06

పోలీసుల సేవలు ప్రశంసనీయం..

సమాజ ప్రగతి లో పోలీసులు అందిస్తున్న సేవలు  ప్రశంసనీయమని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివీ  సత్యనారాయణ కొనియాడారు.  విశాఖలో శనివారం డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో  నేవల్  డాక్ యార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన, పోలీస్ అధికారులు పదవీవిరమణ సభలో ఎంపీ ఎంవీవీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 38 ఏళ్ళ పాటు పోలీస్ అధికారులు గా ఎటువంటి రిమార్కులు లేకుండా  సేవలు అందించిన సనపల సింహాచలం .ఉమా మహేశ్వర రావు డేవిడ్ కిషోర్ దంపతులను ఎంపి ఎంవీవీ ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ, నిరంతరం సమాజ అభివృద్ధి కోసం పోలీసులు చేస్తున్న కృషి అభినందనీమన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పోలీసులు నిరంతర శ్రామికులు గా ప్రజలు కి అందుబాటులో ఉంటూ సేవలు కొనసాగించారని ఎంపీ  అభివర్ణించారు. ఉద్యోగ విరమణ చేసినప్పటికీ వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో సేవలు అందించే అవకాశం ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన నేవల్ డాక్ యార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్  గౌరవ అధ్యక్షులు,  జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, తమ అసోసియేషన్ ద్వారా  నిజాయితీ తో సేవలు అందించిన ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులును  సత్కరించుకోవడం తమకు  దక్కిన అవకాశంగా భావిస్తున్నామన్నారు.  భవిష్యత్తులో  మరింతగా మరిన్ని సేవలు అందించాలని పదవి విరమణ తర్వాత కూడ  వారి వారి కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. పోలీస్ లు ,కోవిడ్ లో అందించిన సేవలు నిరుపమాన మన్నారు. ప్రతీ ఒక్కరు సమాజ సేవ లో తమ వంతు భాగస్వామ్యం అందించాలని శ్రీనుబాబు పిలుపునిచ్చారు.  సమన్వయకర్త గా పోలీస్ విభాగానికి చెందిన ఏఎస్ఐ  కొత్తపల్లి గోవిందమ్మ వ్యవహరించారు. నేవల్ డాక్ యార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి, కార్యదర్శి భాస్కర్ రావు, సన్యాసిరావు, కృష్ణారావు, రవి, జీకే ప్రసాద్, నాగార్జునరావు, శ్రీను, పోలీస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

విజెఎఫ్ ప్రెస్ క్లబ్

2020-10-10 14:29:49

జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయం పండుగ..

ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తోందని, రైతులకు ఇంటిముంగిట సేవలు చేయడానికి రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిందని రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వురు ఎం.పి.డి వో కార్యాలయలో కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మండలాలకు సంభందించిన వ్యవసాయ సలహా మండలి  మొదటి సర్వ సభ్య సమావేశం లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండగ గా మారిస్తే... దానిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా చేయాలనే ఉద్దేశ్యంతో గ్రామసచివాలయాల ద్వారా సిబ్బందిని నియమించి మరీ రైతులకు మేలు చేస్తోందన్నారు. ఇపుడు మండల స్థాయి కార్యాచరణ ప్రణాళిక చేయడం ద్వారా సమస్యలు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల సలహా మండలి అధ్యక్షులు పామేర్ల నగేష్ కుమార్,వల్లభని శ్రీహరి,ఉండవల్లి వెంకటేశ్వరరావు మరియు వ్యవసాయ శాఖ అధికారులు, మండల డెవలప్మెంట్ అధికారులు జగదాంబ,రాంప్రసాద్ తో పాటు పెద్దఎత్తున,రైతులు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Kovvur

2020-10-10 12:45:07

ఇ-పంట (క్రాప్) లో నమోదు కావాలి..

శ్రీకాకుళం జిల్లాలో రైతులు తమ పేర్లను ఇ – క్రాప్ లో నమోదు చేయించుకోవాలని జిల్లా  కలక్టర్ జె.నివాస్ విజ్ఞప్తి చేసారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో వరి, మొక్క జొన్న, ప్రత్తి, వేరుశనగ, పెసర, గోగు, చెరకు, రాగి మొదలగు పంటలు పండించడం జరుగుతుందని ఆయన పేర్కొంటూ పంటలు సాగు చేస్తున్న రైతులు తమ పేర్లను గ్రామ వ్యవసాయ సహాయకులు (వి.ఏ.ఏ) ద్వారా ఇ-పంటలో నమోదు (రిజిస్ట్రేషన్) చేయించుకోవాలని అన్నారు. అక్టోబరు 11 నుండి 15 వ తేది వరకు పంట నమోదు చేసుకున్న రైతుల జాబితాను రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. జాబితాలో తమ పేరు నమోదు అయినది లేనిది రైతులు పరిశీలించుకోవాలని, జాబితాలో పేర్లు లేని వారు వెంటనే నమోదు చేయించుకోవాలని కోరారు. అక్టోబరు 15 వ తేది నాటికి మార్పులు చేర్పులు ఉంటే సరిచేసి తుది జాబితా రూపొందిస్తారని ఆయన స్పష్టం చేసారు. ఇ - పంట నమోదు కార్యక్రమం ఈ నెల 10వ తేదీతో ముగుస్తుందని, ఇ - పంటలలో నమోదు చేసుకున్న రైతులకు ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్ట పోయినప్పుడు నష్ట పరిహారం చెల్లింపు, ఉచిత పంటల బీమా, పంట కొనుగోలు తదితర సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అదే విధంగా పంట ఋణాలు పొందుటకు, ఇతర ప్రభుత్వ పథకాలను పొందుటకు, ఇ - పంటలో నమోదు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. జిల్లా రైతాంగం ఇ - పంట నమోదు కార్యక్రమాన్ని తప్పక వినియోగించుకుని ప్రభుత్వం కల్పించే సదుపాయాలను పొందాలని ఆయన సూచించారు. 

Srikakulam

2020-10-09 21:08:14

కేన్సర్ ఆసుపత్రికి రెండు ఏసీలు విరాళం..

సేవా ద్రుక్పదంలో ఆసుపత్రి సౌకర్యార్ధం ఏసిలు బహుకరించడం అభినందనీయమని డా.ఏ.సిరి అన్నారు. శుక్రవారం  అనంతపురంలోని ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రికి   మరో రెండు (2 టన్స్) ఎయిర్ కండీషనర్లు విరాళంగా కే పి ఆర్ కన్స్ట్రక్షన్స్, హేమ ఇండస్ట్రీస్  సహకారంతో   రెండు ఎయిర్ కండీషనర్లు విరాళంగా అందజేశారు. నగరంలోని శారదా నగర్ లో ఉన్న ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రిలో జాయింట్ కలెక్టర్ (విలేజ్ మరియు వార్డు సచివాలయం డిపార్ట్మెంట్)  ఏ సిరి  ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కమీషనర్  పి వి వి ఎస్ మూర్తి విజ్ఞేప్తి మేరకు వీటిని అందజేశారు. మొత్తం నాలుగు ఏసిలను వీరు అందజేశారు.   వాటితో పాటు అదే ఆసుపత్రి లో కరోన నుంచి కొలుకున్న రామ్మోహన్ రెడ్డి ఫర్నిచర్ ని విరాళంగా ఇచ్చారు. సేవా దృక్పధం తో ముందుకు వచ్చి ఇల తమ వంతు సాయంగా ఆసుపత్రికి కి కావాల్సిన పరికరములు సమకూరుస్తున్నందుకు చాల సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో నగరపాలక ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేష్ , కాన్సర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు దాతలు పాల్గొన్నారు..

కేన్సర్ ఆసుపత్రి

2020-10-09 20:56:22