భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల గీతం డీమ్డ్ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయ న ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నట్టు ప్రకటించారు. గత ఏడాది ఆగష్టు నెలలో జరిగిన గీతం 39వ వ్యవస్ధాపక దినోత్సవంలో ప్రణభ్ ముఖర్జీకి గీతం ఫౌండే షన్ అవార్డును అందజేసిన స్మృుతులు ఇంకా మరచిపోలేదన్న ఆయన గీతం వేదికగా ఉన్నత విద్యారంగానికి పలు సూచనలు చేశారని వైస్ ఛాన్సలర్ గుర్తు చేసు కున్నారు. గీతం అవార్డును స్వీకరించడం ద్వారా ప్రణభ్ ముఖర్జీ ని గీతం కుటుంబంలో సభ్యుడిగా భావించామని పేర్కొన్నారు. గీతం ఆవిధంగా గొప్ప ఆప్తుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం తరపున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
చిన్నారిపై లైంగిక వేధింపులను టిడిపి నేత లోకేష్ సమర్థిస్తున్నాడా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుగారు చదువుకున్న రాజకీయ స్కూల్‌లోనే లోకేష్‌కూడా చదువుకోవడం వలన ఈ తరహా ఆలోచనలు వస్తున్నాయా అని ఎద్దేవా చేశారు. అబద్ధాలు, విషప్రచారాలు, ఆధారాల్లేని ఆరోపణలతో రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు, తన కొడుకును కూడా అదే దారిలో నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. చిత్తూరులో ఒకరి ఇంటిపై కొందరు వ్యక్తులు దాడిచేసిన ఘటనను నాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, వారికి చెందిన ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. వీరిద్దరి వ్యవహార శైలి ఈ రాష్ట్రానికి శాపంగా మారిందన్న మంత్రి ఇలాంటి విష రాజకీయాలు చేస్తే ప్రజలు చెప్పులతో కొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబే కాదు.. లోకేష్‌బుర్రకూడా విషంతో నిండిపోయిందని చిన్నారిని లైంగికంగా వేధించిన కేసులో ఒక హెడ్‌మాస్టర్‌పై చట్టప్రకారం చర్య తీసుకున్నా అది వీరికి కనిపించలేదన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత పత్రికా విలేఖరి వ్యవహారం నడపాలని చూస్తే ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహించి దాడికి దిగితే, పోలీసులు చర్య తీసుకుని, దాడికి దిగిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. నిర్మాణాత్మక విమర్శలు చేయండి, స్వాగతిస్తాం అంతే తప్పా ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే... తండ్రీ కొడుకులిద్దరికీ ప్రజలు బడితె పూజ చేస్తారని మంత్రి హెచ్చరించారు.
కోవిడ్ వైరస్ కేసులు పెరగడానికి సెప్టెంబరు నెల కీలకమని ఈవిషయంలో అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల నోడల్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ ఆసుపత్రులలో రోగులకు అందుతున్న సేవల పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ ఆసుపత్రులు గా గుర్తించబడిన ప్రైవేటు ఆసుపత్రుల్లో మానవ వనరుల కొరత అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం తన నిధులతో డాక్టర్లు, నర్సులు, హెల్ప్ డెస్క్ మేనేజర్లు, ఇతర సిబ్బందిని రిక్రూట్ చేసిందని తెలిపారు. వారి అటెండెన్స్ ను నోడల్ అధికారు లు ధృవీకరించాలని, అప్పుడే జీతభత్యాలు చెల్లించగలమని తెలిపారు. ప్రతి ఆసుపత్రి లో హెల్ప్ డెస్క్ ను నిర్దిష్ట ప్రమాణాల మేరకు నిర్వహిణ జరగాలన్నారు. అడ్మిషన్లు, డిస్చార్జిల డేటా, ఖాళీ గా ఉన్న బెడ్ల వివరాలు ఎప్పటికప్పుడు మాతా, శిశు సంరక్షణ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని, ఆసుపత్రిలో డిస్ ప్లే బోర్డు లపై ప్రదర్శించాలన్నారు.
ప్రతీ ఆసుపత్రిలోనూ 2 ల్యాండ్ లైన్ టెలిఫోన్ లు ఏర్పాటు చేసుకోవాలని, ఒక ఫోన్ తో ఆసుపత్రి వార్డుల్లోని సిబ్బందితో సంప్రదించి, రోగి బంధువులకు సరియైన సమాచారాన్ని అందించాలని, ఇంకొక టెలిఫోన్ ద్వారా బయటి నుండి వచ్చే కాల్స్ కు సమాధానమిచ్చి, వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయించాలని కోరారు. కోవిడ్ ఆసుపత్రులను జాయింట్ కలెక్టర్ గోవింద రావు ఆసుపత్రులను తనిఖీ చేయాలని, ప్రతిరోజూ టెలికాన్ఫరెన్సు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోవింద రావు, డిఆర్ఓ ఎ.ప్రసాద్, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, అడిషనల్ డిఎంహెచ్ఓ విజయలక్ష్మి, ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ భాస్కరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా విశాఖ జివిఎంసిలో నిర్వహిస్తున్న ఈ-స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన అధికంగానే వస్తుందని కమిషనర్ డా. జి. సృజన అన్నారు. ఈమేరకు ఈ-స్పందన ద్వారా 146 ఫిర్యాదులు స్వీకరించినట్టు ఆమె మీడియాకి వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు ఏవిధంగా ఫిర్యాదులు చేసినా వాటి పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలన్నారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదులపైనా తక్షణమే స్పందించి పరిష్కా రాలు చూపాలన్నారు. వీటిలో 59 సాధారణ ఫిర్యాదులు కాగా, 87 వివిధ విభాలకు చెందినవిగా వచ్చాయన్నారు. 26 ప్రజారోగ్య విభాగానికి సంబందించినవి, 12 పబ్లిక్ వర్క్స్ విభాగానికి సంబందించినవి, 13 పట్టణ ప్రణాళికా విభాగానికి సంబందించినవి, 08 నీటి సరఫరా విభాగానికి సంబందించినవి, 12వీధి లైట్ల విభాగానికి సంబందించినవి, 02 రెవెన్యూ విభాగానికి సంబందించినవి, 08 యు.సి.డి విభాగానికి సంబందించినవి, 03 యు.జి.డి. విభాగానికి సంబందించినవి, 02 ఐ. టి. విభాగానికి సంబందించినవి ,01 సాధారణ పరిపాలనా విభాగానికి సంబందించినవి ఉన్నాయన్నారు. ఈ స్పందన కార్యక్రమంలో పలుచోట్ల క్రొత్తగా రోడ్ల నిర్మాణం కొరకు, వీధి దీపాలు కొరకు, పందులు నివారణ కొరకు, ఆక్రమణలు, అనధికార నిర్మాణాలపై ఫిర్యాదులు ఉన్నాయన్నారు. వీటిని ఆయా విభాగాలకు పరిష్కారం కోసం బదలాయించడం జరిగిందని కమిషనర్ వివరించారు.
విశాఖలోని జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 24 ఫిర్యాదులు వచ్చాయని జి.వి.ఎం.సి. కమీషనర్ డా. జి. సృజన చెప్పారు. సోమవారం జివిఎంసిలోని టోల్ ఫ్రీ నం. 1800-4250-0009 ద్వారా ప్రజల నుంచి కమిషనర్ వినతులు స్వీకరించారు. వాటిని శాఖల ఆధారంగా అధికారులకు బదలాయించిన ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వయంగా పరిష్కరించి నివేదికలు అందజేయాలని అధికారులను/జోనల్ కమిషనర్లను ఆదే శించారు. ఇందులో 1వ జోనుకు సంబందించి 03 ఫిర్యాదులు, 2వ జోనుకు సంబందించి 02, 3వ జోనుకు సంబందించి 05, 4వ జోనుకు సంబందించి 03, 5వ జోనుకు సంబందించి 07, 6వ జోనుకు సంబందించి 02, పి.డి. (యు.సి.డి) సంబందించి 01, సి.ఇ. నకు సంబందించి 01, మొత్తము 24 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ డా. జి. సృజన ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు 03రోజులలో పరిష్కరించాలని అధికారులను కోరారు. ఒక సమస్య పదే పదే ఫిర్యాదు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కూడా కమిషనర్ హెచ్చరించారు. ప్రజా సమస్యలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
విశాఖజిల్లా పెందుర్తిలో సుజాత నగర్ ప్రాంతంలో దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం కేసు విషయంలో పోలీసులు పురోగది సాధిస్తున్నారు. నూతన్ నాయుడి ఇంట్లో దళిత యువకుడిని కొడుతూ, శిరోముండనం చేయించిన ఘటనలో మరో కీలక విషయాన్ని పోలీసులు గుర్తించారు. శిరోముండనం చేసిన ఇంటి సీసీటీవీ ఫుటేజీలో ఓ మహిళ ఎవరికో వీడియో కాల్ చేసి శిరోముండనాన్ని చూపించే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె ఎవరికి కాల్ చేసింది? ఈ కేసులో ఇంకెవరి ప్రమేయ మైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇదే విషయమై చుట్టుపక్కల వారిని కూడా విచారించారు. నూతన్ ఇంటి నుంచి అరుపులు వినిపించాయని, శ్రీకాంత్‌కు గుండుకొట్టించి బయటకు తీసుకురావడాన్ని తాము చూశామని ఇరుగుపొరుగువారు పోలీసులకు తెలిపారు. దీంతో నూతన్ నాయుడు ఈ వ్యవహారంలో పూర్తిగా ఇరుక్కున్నట్టేనని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుం శిరోముండనం చేస్తున్నప్పటి వీడియోను సదరు సిసిటివిలోని మహిళ ఎవరికి ఆ వీడియోకాల్ చేసిందనే విషయం బయటకొస్తే ఈ కేసు విషయంలో పూర్తి ఆధారాలు లభ్యం అయినట్టేనని పోలీసులు భావిస్తున్నారు. అయితే నిన్న మంత్రి నేరుగా బాధితుడి ఇంటికి పరామర్శించిన తరువాత కేసు చిక్కుముడి వీడుతుండటంతో అనుమానితుడిగా భావిస్తున్న నూతన్ నాయుడు ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఓ నేత ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది...
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వైఎస్ఆర్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 30 ఫిర్యాదులు అందాయని కమిషనర్ గిరీష తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చాలా వరకూ ప్రజలు వారి యొక్క కాలనీల సమస్యలు, వ్యక్తిగత సమస్యలతోపాటు అన్ని రకాల సమస్యలు ఈ కార్యక్రమంలో విన్నవించారన్నారు. వాటన్నింటినీ సంబంధిత అధికారులకు బదిలీ చేసి వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించామన్నారు. ప్రతీవారం ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రజలు నేరుగా అధికారులకు తమ సమస్యలు చెప్పడానికి అవకాశం వుంటుందన్నారు. డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, మేనేజర్ హసిమ్, డిప్యూటీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ దేవి కుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసులు, షణ్ముగం, రెవెన్యూ ఆఫీసర్లు సేతు మాధవ్, సుధాకర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవీందర్ రెడ్డి, రఘు కుమార్, విజయ్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీధర్, దేవిక, గోమతి, రీజినల్ ఫైర్ ఆఫీసర్ జ్ఞాన సుందర్, డివైఈవో జనార్దన్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు గోవర్ధన్, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లా సుజాత నగర్ లో శిరోముండనం భాదితుడు శ్రీకాంత్, కుటుంబసభ్యులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు , స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజు ఆదివారం పరామర్శించారు. అనంతరం సంఘటన ఎలా జరిగింది బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, బాధితుడు శ్రీకాంత్ ను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే , బాధితుడీకి 50 వేల రూపాయలు ఆర్ధిక సహా యం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంతో మాట్లాడి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకోవడంతోపాటు, ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు వచ్చే విధంగా చేస్తామన్నారు. దళితులపై ఇలాంటి సంఘటనలు జరగడం దారుణమన్న మంత్రి సెల్ ఫోను పోయిందనే నెపంతో శిరోముండనం చేయడంతోపాటు, దారుణం కొట్టడం బాధకలిగించిందన్నారు. అయినా దోషులను 24 గంటల్లోనే పట్టుకొని కేసులు పెట్టామన్నారు. ఇలాంటి సంఘటనలను సీరియస్ గానే ప్రభుత్వం తీసుకుంటుందన్న ఇలాంటి విషయాల్లో అవతలి వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతోపాటు, ఈ ప్రాంతంపై పోలీసు నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విశాఖ మహానగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్, వార్డు అధ్యక్ష కార్యర్శిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విశాఖ బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో పవిత్రోత్సవములు ఘనంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారికి విశ్వక్సే నారాధనము, పుణ్యాహవచనము, పవిత్ర అభిమన్త్రణము, అగ్నిధ్యానములు, ఉక్తహోమము, అష్టకళాశారాధనము, అమ్మవారికి విశేష ఆరాధనము, అష్టకలశస్న పనము, పవిత్ర సమర్పణము, నీరాజనం, మంత్రపుష్పములు అర్పించారు. అదేవిధంగా సాయంత్రం అగ్నిధ్యానములు, ఉక్త హోమములు, నీరాజన మంత్రపుష్ప ములు సమర్పించారు. ఈ కార్యక్రమములో ఉపకలక్టర్ , కార్యనిర్వాహణాధికారిణి యస్. జె. మాధవి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల మేరకు సామాజిక దూరం పాటిస్తూ, అమ్మవారికి ఏకాంతంగానే పవిత్రోత్సవములు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సహాయ కార్యనిర్వాహణాధికారి వి. రాంబాబు, వి.బి.వి. రమణమూర్తి, పర్యవేక్షకులు, ఎన్.వి.వి.ఎస్.ఎస్.ఏ.ఎన్. రాజు, & ఆలయ వేదపండితులు, అర్చకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశాఖలోని పెందుర్తిలో ఈ నెల 27న దళితయువకుడైన కర్రి శ్రీకాంత్‌కు శిరోముండనం చేయించిన నూతన్నాయుడుని తక్షణమే అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాంత్‌కు తగిన న్యాయం చేయాలని, నూతన్నాయుడుని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం డాబాగార్డెన్స్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా లోకనాధం మాట్లాడుతూ, ఒక దళితయువకుడిపై సెలబ్రిటీ, సినీనిర్మాత నూతన్‌నాయుడు కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. ఈయన జనసేన పార్టీ నాయకుడునని చెప్పుకోవడానికి సిగ్గుపడాలన్నారు. దళితులైన ఇంత దారుణంగా వివక్షపూరితంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినెట్లు వ్యవహించి అసలై దోషులను వదిలేయడం సరికాదన్నారు. ఇంటి యజమాని అయిన నూతన్‌నాయుడుపై ఎటువంటి కేసులేకుండా, అరెస్టు చేయకుండా కేసును పక్కదారి పట్టించడం తప్ప మరొకటి కాదు.
శిరోముండనంతో అవమానపడిన దళిత బాధితుడికి చట్ట ప్రకారం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇచ్చి ఆ కుటుంబానికి ఎటువంటి ప్రాణ నష్టం కలుగకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేసారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి డాక్టర్ బి.గంగారావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, బి.జగన్, నాయకులు ఎం.సుబ్బారావు, చంద్రమౌళి, చంటి, కుమారి, వెంకటరావు, చంద్రశేఖర్, ఎస్.ఎఫ్.ఐ నాయకురాలు ఎల్.చిన్నారి, కెవిపిఎస్ నాయకులు సుబ్బన్న, జ్యోతి, ఆదిలక్ష్మి, రమ, లలిత తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం పట్టణంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టుటలో ప్రజ లు భాగస్వామ్యం కావాలని కోరడంతోపాటు అనవసరంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగరాదని సూచిస్తున్నారు. అనవసరంగా బయట తిరిగే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారంటే పరిస్థితి ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చు. శ్రీకాకుళం పట్టణంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్, పట్టణ పర్యవేక్షణ అధికారి టి.వేణుగోపాల్ నగర పాలక సంస్ధ అధికారులు, పోలీసు అధికారులు, పట్టణ ప్రత్యేక అధికారులు తదితర కోర్ కమిటి ఈ మేరకు నిర్ణయించింది. సోమ వారం నుండి రోజు వారీ వ్యాపార కార్యకలాపాలు యధావిధిగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసారు. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత మందుల దుకాణాలు మినహా ఏ ఇతర దుకాణాలు, చిల్లర దుకాణాలతో సహా, తెరవడానికి వీల్లేదని స్పష్టం చేసారు. అమలులో ఉన్న 144 వ సెక్షన్ ను మరింత పకడ్బందీగా అమలు చేయుటకు నిర్ణయించారు. ఒంటి గంట తరువాత ఏ ఒక్క వ్యక్తి కూడా అనవ సరంగా బయట తిరగరాదని స్పష్టం చేసారు. కంటైన్మెంటు జోన్లలో తిరగడాన్ని మరింత కఠినంగా పర్యవేక్షించాలని సమావేశంలో నిర్ణయించారు. శ్రీకాకుళం పట్ట ణంలోకి ప్రవేశాన్ని మధ్యాహ్నం ఒంటి గంట నుండి మరుచటి రోజు ఉదయం 6 గంటల వరకు మరింత పక్కాగా పర్యవేక్షించుటకు సంకల్పించారు. శ్రీకాకుళం పట్ట ణంలోకి ప్రవేశించే ముఖ్యంగా ఆరు మార్గాలు – తోటపాలెం జంక్షన్, బలగ ఏసిబి కార్యాలయం మార్గం, పొన్నాడ బ్రిడ్జి, అరసవల్లి జంక్షన్, రామలక్ష్మణ జంక్షన్, కిల్లిపా లెం జంక్షన్ ను గుర్తించి, పనులు లేకుండా అనవసర రాకపోకలను నిరోధించుటకు చర్యలు చేపడుతున్నారు.
విశాఖ స్మార్ట్ సిటీని అందరూ పగలు చూసుంటారు...లేదంటే రాత్రి సమయంలో చూసుంటారు...కానీ విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు విహంగ వీక్షణం ద్వా రా తెల్లవారు జామున విశాఖ నగరాన్ని ఎపుడైనా చూశారా..అలా చూస్తే విశాఖ అందాలు మనస్సుని ఏ విధంగా తాకుతాయో అర్ధమవుతాయి...అలా విశాఖ అందా లను ఈఎన్ఎస్ పాఠకు లకు చూపించడానికి ఈఎన్ఎస్ ప్రత్యేకంగా ఈ ఫ్లైట్ ల్యాండ్ షూట్ ని చేపట్టింది. ఆ అందాల విశాఖ విహంగ వీక్షణం చేస్తూ...కిందికి దిగితే ఎలా వుంటుంటో మీరూ ఒక్కసారి చూడండి. అంతేకాదండోయ్ ఆ యూట్యూబ్ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయడం మాత్రం మరిచిపోకండి. ఆ వీడియో ప్రత్యేకంగా మీ కోసం అందిం స్తోంది ఈఎన్ఎస్ లైవ్...ఇది చూసిన తరువాత మీ గుండె చప్పుడు ఎలా వుందో కూడా తెలుసుకోండి...
విశాఖ స్టీలుప్లాంట్ నిర్వాసితుల సమస్యలను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తిస్థాయిలో తీర్చేయాలని కంకణం కట్టుకున్నారు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఎంత కాలం ఉన్నామన్నది కాదు ప్రజలకు ఏ స్థాయిలో సహాయం చేశామన్నదే ముఖ్యమనే విధంగా పట్టిన పట్టు విడవకుండా స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డు బదిలీ కార్యక్ర మం జరిగేలా చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. స్టీలు ప్లాంటు ఏర్పడిన తరువాత చాలా మంది ఆర్ కార్డు దారుల, తమ కార్డులు బదిలీ జరగగక, ఉపాది దొర కక చాలా నష్టపోయారు. మిగిలివున్న కొద్దిమంది కష్టాలైనా తీర్చాలనే ఉద్ధేశ్యంతో ఎమ్మెల్యే తిప్పల చేస్తున్న ప్రయత్నాలు ముందడుగు పడుతున్నాయనే చెప్పాలి. ఆర్ కార్డు నిర్వాసితుల సమస్యలను తీర్చాలని జెసి ని కలిసిన తరువాతన ఈ విషయాన్ని నేరుగా సీఎం వైఎస్ జగన్మోనరెడ్డి దగ్గరకు తీసుకెళ్లి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసేలా చూడాలన్నది ఆయన ప్రయత్నం. అదే జరిగితే స్టీలు ప్లాంటుకి భూములు ఇచ్చి ఎలాంటి ఉపాది, ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉండిపోయిన ఆర్ కార్డు నిర్వాసితులు తమ కార్డులను బదిలీచేసుకునే అవకాశం వస్తుంది. దీంతో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అది జరిగి విశాఖజిల్లాలో ఏ ఎమ్మెల్యే పరిష్కరించని ప్రధాన సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేగా తిప్పలనాగిరెడ్డి చరిత్ర స్రుష్టించిన వారవుతారు. అందులోనూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా మంచి కార్యక్రమం చేయాలన్న తలపుంతో చేపట్టిన ఈ అంశంలో అధికారులు స్పందిస్తే...ఈ పని ఆరు నెలల్లో పూర్తయిపోతుంది...తద్వారా ఎన్నో ఏళ్ల నుంచి అరిష్క్రుతంగా ఉన్న సమస్య కూడా పరిష్కారం అవుతుందని నిర్వాసితులు పేర్కొంటున్నారు.
వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశిం చారు. శనివారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హల్ లో వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో నిర్వాసితుల సమస్యల పై ఇచ్చిన అర్జీలను పరిష్కరించడానికి తీసుకోవలసిన చర్యల పై జిల్లా కలెక్టర్ వెలుగొండ ప్రాజెక్ట్ భూ సేకరణ అధికారులు, రెవెన్యూ,పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలె క్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్ట్ భూసేకరణలో నష్టపోయిన ప్రజలకు సానుకూలంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. వెలి గొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.ఈ సంవత్సరంలో వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజల ను పునరావాస కేంద్రాలకు తీసుకు రావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడము జరిగిందన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు గతంలో పొరపాటున అన్యాయం జరిగి ఉంటే వారికి సానుకూలంగా న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ ముంపుగ్రామాల్లో ప్రజల నుండి3 వేల అర్జీలు వివిధ సమస్యల పై వచ్చాయ న్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ముంపునకు గురైన 11 అవాసప్రాంతల్లో విచారణ చేపట్టడానికి 32 మంది తహశీల్దార్లు, ఎంపీడీఓ లను నియమించామన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో నిర్వాసితులు కొత్తగా సమస్యలపై ఇచ్చిన అర్జీలను కూడా తీసుకోవాలని ఆయన చెప్పారు. సెప్టెంబర్ నాటికి ముంపు గ్రామాల్లో ఇక ప్రజల నుంచి అర్జీలు రాకూడ దన్నారు. సోమవారంనుంచి గురువారం లోగా ముంపు గ్రామాల్లో పర్యటించి అర్జీలపై విచారణ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె. వి.మురళి, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకo, వెలిగొండ ప్రాజెక్ట్ భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ కృష్ణవేణి, స్పెషల్ డిప్యూటీవ్ కలెక్టర్ చంద్రలీల,గ్లోరియా,మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. శేషి రెడ్డి, తహశీల్దార్లు,ఎంపీడీఓ లు,తదితరులు పాల్గొన్నారు.
యుపిఎస్ సి పరీక్షలు సజావుగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ర్వహిస్తున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనల ప్రకా రం పరీక్షల ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సెప్టెంబరు 6 వ తేదీన జరగనున్న ఈ పరీక్షల కు నగరంలో 22 పరీక్షా కేంద్రాల లో 7,782 మంది అభ్యర్థు లు పోటీ పడుతున్నారన్న ఆయన ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు నిర్వహిణ జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ విధించాలని, కలెక్టరేట్ లోని స్ట్రాంగ్ రూమ్ నుంచి పరీక్షా కేంద్రాలకు ఎగ్జామినేషన్ మెటీరియల్ రవాణా కు ఎస్కార్ట్ పెట్టాలని పోలీసుశాఖ ను కోరారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, కేంద్రాల వద్ద శానిటేషన్ మెరుగు పరచాలని, అభ్యర్థుల కు త్రాగునీటి సదుపాయం కల్పించాలని, డిస్పోజబుల్ గ్లాసులు అందుబాటులో ఉంచాలని జివియంసీ అధికారులను కోరారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ నుంచి సెప్టెంబర్ 5,6 తేదీలలో పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలన్నారు. పోస్ట్ ఎగ్జామినేషన్ మెటీరియల్ ను విమానం ద్వారా స్పీడ్ పోస్ట్ లో జాగ్రత్తగా పంపడానికి ఏర్పాట్లు చేసుకోవాలని తపాలా శాఖ అధికారులకు తెలిపారు. కేంద్రాల వద్ద అత్యవసర సేవలు అందించడానికి పారామెడికల్ సిబ్బంది ని అందుబాటులో ఉంచాలని జెసి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ.ప్రసాద్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.