1 ENS Live Breaking News

శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారి పవిత్ర సమర్పణ..

విశాఖ బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో పవిత్రోత్సవములు ఘనంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారికి విశ్వక్సే నారాధనము, పుణ్యాహవచనము, పవిత్ర అభిమన్త్రణము, అగ్నిధ్యానములు, ఉక్తహోమము, అష్టకళాశారాధనము,  అమ్మవారికి విశేష ఆరాధనము, అష్టకలశస్న పనము, పవిత్ర సమర్పణము, నీరాజనం, మంత్రపుష్పములు అర్పించారు. అదేవిధంగా సాయంత్రం అగ్నిధ్యానములు, ఉక్త హోమములు, నీరాజన మంత్రపుష్ప ములు సమర్పించారు. ఈ కార్యక్రమములో ఉపకలక్టర్ , కార్యనిర్వాహణాధికారిణి   యస్. జె. మాధవి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల మేరకు సామాజిక దూరం పాటిస్తూ, అమ్మవారికి ఏకాంతంగానే పవిత్రోత్సవములు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.  సహాయ కార్యనిర్వాహణాధికారి  వి. రాంబాబు, వి.బి.వి. రమణమూర్తి, పర్యవేక్షకులు,  ఎన్.వి.వి.ఎస్.ఎస్.ఏ.ఎన్. రాజు, & ఆలయ వేదపండితులు, అర్చకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

బురుజుపేట

2020-08-30 19:07:43

నూతన్ నాయుడుని అరెస్టు చేయాల్సిందే..సిపిఎం

విశాఖలోని పెందుర్తిలో ఈ నెల 27న దళితయువకుడైన కర్రి శ్రీకాంత్‌కు శిరోముండనం  చేయించిన నూతన్‌నాయుడుని తక్షణమే అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీకాంత్‌కు తగిన న్యాయం చేయాలని, నూతన్నాయుడుని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం  డాబాగార్డెన్స్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా లోకనాధం మాట్లాడుతూ, ఒక దళితయువకుడిపై సెలబ్రిటీ, సినీనిర్మాత నూతన్‌నాయుడు కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. ఈయన జనసేన పార్టీ నాయకుడునని చెప్పుకోవడానికి సిగ్గుపడాలన్నారు. దళితులైన ఇంత దారుణంగా వివక్షపూరితంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినెట్లు వ్యవహించి అసలై దోషులను వదిలేయడం సరికాదన్నారు. ఇంటి యజమాని అయిన నూతన్‌నాయుడుపై ఎటువంటి కేసులేకుండా, అరెస్టు చేయకుండా కేసును పక్కదారి పట్టించడం తప్ప మరొకటి కాదు.  శిరోముండనంతో అవమానపడిన దళిత బాధితుడికి చట్ట ప్రకారం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇచ్చి ఆ కుటుంబానికి ఎటువంటి ప్రాణ నష్టం కలుగకుండా రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేసారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, బి.జగన్‌, నాయకులు ఎం.సుబ్బారావు, చంద్రమౌళి, చంటి, కుమారి, వెంకటరావు, చంద్రశేఖర్‌, ఎస్‌.ఎఫ్‌.ఐ నాయ‌కురాలు ఎల్‌.చిన్నా‌రి,  కెవిపిఎస్‌ నాయకులు సుబ్బన్న, జ్యోతి, ఆదిలక్ష్మి, రమ, లలిత తదితరులు పాల్గొన్నారు.

డాబాగార్డెన్స్

2020-08-30 18:59:13

అనవసరంగా బయటకు వస్తే పోలీసు కేసు...ఆర్డీఓ

శ్రీకాకుళం పట్టణంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టుటలో ప్రజ లు భాగస్వామ్యం కావాలని కోరడంతోపాటు అనవసరంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగరాదని సూచిస్తున్నారు. అనవసరంగా బయట తిరిగే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారంటే పరిస్థితి ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చు.  శ్రీకాకుళం పట్టణంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్, పట్టణ పర్యవేక్షణ అధికారి టి.వేణుగోపాల్ నగర పాలక సంస్ధ అధికారులు, పోలీసు అధికారులు, పట్టణ ప్రత్యేక అధికారులు తదితర కోర్ కమిటి ఈ మేరకు నిర్ణయించింది. సోమ వారం నుండి రోజు వారీ వ్యాపార కార్యకలాపాలు యధావిధిగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసారు. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత మందుల దుకాణాలు మినహా ఏ ఇతర దుకాణాలు, చిల్లర దుకాణాలతో సహా, తెరవడానికి వీల్లేదని స్పష్టం చేసారు. అమలులో ఉన్న 144 వ సెక్షన్ ను మరింత పకడ్బందీగా అమలు చేయుటకు నిర్ణయించారు. ఒంటి గంట తరువాత ఏ ఒక్క వ్యక్తి కూడా అనవ సరంగా బయట తిరగరాదని స్పష్టం చేసారు.  కంటైన్మెంటు జోన్లలో తిరగడాన్ని మరింత కఠినంగా పర్యవేక్షించాలని సమావేశంలో నిర్ణయించారు. శ్రీకాకుళం పట్ట ణంలోకి ప్రవేశాన్ని మధ్యాహ్నం ఒంటి గంట నుండి మరుచటి రోజు ఉదయం 6 గంటల వరకు మరింత పక్కాగా పర్యవేక్షించుటకు సంకల్పించారు.  శ్రీకాకుళం పట్ట ణంలోకి ప్రవేశించే ముఖ్యంగా ఆరు మార్గాలు – తోటపాలెం జంక్షన్, బలగ ఏసిబి కార్యాలయం మార్గం, పొన్నాడ బ్రిడ్జి, అరసవల్లి జంక్షన్, రామలక్ష్మణ జంక్షన్, కిల్లిపా లెం జంక్షన్ ను గుర్తించి, పనులు లేకుండా అనవసర రాకపోకలను నిరోధించుటకు చర్యలు చేపడుతున్నారు. 

Srikakulam

2020-08-30 18:54:20

విమానం దిగుతున్నపుడు విశాఖ అందాలు సూపర్..

విశాఖ స్మార్ట్ సిటీని అందరూ పగలు చూసుంటారు...లేదంటే రాత్రి సమయంలో చూసుంటారు...కానీ విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు విహంగ వీక్షణం ద్వా రా తెల్లవారు జామున విశాఖ నగరాన్ని ఎపుడైనా చూశారా..అలా చూస్తే విశాఖ అందాలు మనస్సుని ఏ విధంగా తాకుతాయో అర్ధమవుతాయి...అలా విశాఖ అందా లను ఈఎన్ఎస్ పాఠకు లకు చూపించడానికి ఈఎన్ఎస్ ప్రత్యేకంగా ఈ ఫ్లైట్ ల్యాండ్ షూట్ ని చేపట్టింది. ఆ అందాల విశాఖ విహంగ వీక్షణం చేస్తూ...కిందికి దిగితే ఎలా వుంటుంటో మీరూ ఒక్కసారి చూడండి. అంతేకాదండోయ్ ఆ యూట్యూబ్ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయడం మాత్రం మరిచిపోకండి. ఆ వీడియో ప్రత్యేకంగా మీ కోసం అందిం స్తోంది ఈఎన్ఎస్ లైవ్...ఇది చూసిన తరువాత మీ గుండె చప్పుడు ఎలా వుందో కూడా తెలుసుకోండి...

Vizag Airport

2020-08-30 16:10:47

ఆర్ కార్డు నిర్వాసితుల పాలిట ఆపద్భాందవుడై...

విశాఖ స్టీలుప్లాంట్ నిర్వాసితుల సమస్యలను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తిస్థాయిలో తీర్చేయాలని కంకణం కట్టుకున్నారు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఎంత కాలం ఉన్నామన్నది కాదు ప్రజలకు ఏ స్థాయిలో సహాయం చేశామన్నదే ముఖ్యమనే విధంగా పట్టిన పట్టు విడవకుండా స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డు బదిలీ కార్యక్ర మం జరిగేలా చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. స్టీలు ప్లాంటు ఏర్పడిన తరువాత చాలా మంది ఆర్ కార్డు దారుల, తమ కార్డులు బదిలీ జరగగక, ఉపాది దొర కక చాలా నష్టపోయారు. మిగిలివున్న కొద్దిమంది కష్టాలైనా తీర్చాలనే ఉద్ధేశ్యంతో ఎమ్మెల్యే తిప్పల చేస్తున్న ప్రయత్నాలు ముందడుగు పడుతున్నాయనే చెప్పాలి. ఆర్ కార్డు నిర్వాసితుల సమస్యలను తీర్చాలని జెసి ని కలిసిన తరువాతన ఈ విషయాన్ని నేరుగా సీఎం వైఎస్ జగన్మోనరెడ్డి దగ్గరకు తీసుకెళ్లి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసేలా చూడాలన్నది ఆయన ప్రయత్నం. అదే జరిగితే స్టీలు ప్లాంటుకి భూములు ఇచ్చి ఎలాంటి ఉపాది, ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉండిపోయిన ఆర్ కార్డు నిర్వాసితులు తమ కార్డులను బదిలీచేసుకునే అవకాశం వస్తుంది. దీంతో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అది జరిగి విశాఖజిల్లాలో ఏ ఎమ్మెల్యే పరిష్కరించని ప్రధాన సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేగా తిప్పలనాగిరెడ్డి చరిత్ర స్రుష్టించిన వారవుతారు. అందులోనూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా మంచి కార్యక్రమం చేయాలన్న తలపుంతో చేపట్టిన ఈ అంశంలో అధికారులు స్పందిస్తే...ఈ పని ఆరు నెలల్లో పూర్తయిపోతుంది...తద్వారా ఎన్నో ఏళ్ల నుంచి అరిష్క్రుతంగా ఉన్న సమస్య కూడా పరిష్కారం అవుతుందని నిర్వాసితులు పేర్కొంటున్నారు.

Gajuwaka

2020-08-30 15:06:23

వెలుగొండ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి..

వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశిం చారు. శనివారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హల్ లో వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో నిర్వాసితుల సమస్యల పై ఇచ్చిన అర్జీలను పరిష్కరించడానికి తీసుకోవలసిన చర్యల పై జిల్లా కలెక్టర్ వెలుగొండ ప్రాజెక్ట్ భూ సేకరణ అధికారులు, రెవెన్యూ,పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలె క్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్ట్ భూసేకరణలో నష్టపోయిన ప్రజలకు సానుకూలంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. వెలి గొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.ఈ సంవత్సరంలో వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజల ను పునరావాస కేంద్రాలకు తీసుకు రావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడము జరిగిందన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు గతంలో పొరపాటున అన్యాయం జరిగి ఉంటే వారికి సానుకూలంగా న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ ముంపుగ్రామాల్లో ప్రజల నుండి3 వేల అర్జీలు వివిధ సమస్యల పై వచ్చాయ న్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ముంపునకు గురైన 11 అవాసప్రాంతల్లో విచారణ చేపట్టడానికి 32 మంది తహశీల్దార్లు, ఎంపీడీఓ లను నియమించామన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో నిర్వాసితులు కొత్తగా సమస్యలపై ఇచ్చిన అర్జీలను కూడా తీసుకోవాలని ఆయన చెప్పారు. సెప్టెంబర్ నాటికి ముంపు గ్రామాల్లో ఇక ప్రజల నుంచి అర్జీలు రాకూడ దన్నారు. సోమవారంనుంచి గురువారం లోగా ముంపు గ్రామాల్లో పర్యటించి అర్జీలపై విచారణ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె. వి.మురళి, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకo, వెలిగొండ ప్రాజెక్ట్ భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ కృష్ణవేణి, స్పెషల్ డిప్యూటీవ్ కలెక్టర్ చంద్రలీల,గ్లోరియా,మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. శేషి రెడ్డి, తహశీల్దార్లు,ఎంపీడీఓ లు,తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు

2020-08-29 20:05:13

యుపిఎస్ సి పరీక్షలు సజావుగా నిర్వహించాలి..జెసి

యుపిఎస్ సి  పరీక్షలు సజావుగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం   యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ర్వహిస్తున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనల ప్రకా రం పరీక్షల ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సెప్టెంబరు 6 వ తేదీన జరగనున్న ఈ పరీక్షల కు నగరంలో  22  పరీక్షా కేంద్రాల లో  7,782 మంది అభ్యర్థు లు పోటీ పడుతున్నారన్న ఆయన ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు నిర్వహిణ జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ విధించాలని, కలెక్టరేట్ లోని స్ట్రాంగ్ రూమ్ నుంచి పరీక్షా కేంద్రాలకు ఎగ్జామినేషన్ మెటీరియల్ రవాణా కు ఎస్కార్ట్ పెట్టాలని పోలీసుశాఖ ను  కోరారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, కేంద్రాల వద్ద శానిటేషన్ మెరుగు పరచాలని, అభ్యర్థుల కు త్రాగునీటి సదుపాయం కల్పించాలని, డిస్పోజబుల్ గ్లాసులు  అందుబాటులో ఉంచాలని జివియంసీ అధికారులను కోరారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ నుంచి సెప్టెంబర్  5,6 తేదీలలో   పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలన్నారు. పోస్ట్ ఎగ్జామినేషన్ మెటీరియల్ ను విమానం ద్వారా స్పీడ్ పోస్ట్ లో  జాగ్రత్తగా  పంపడానికి ఏర్పాట్లు చేసుకోవాలని తపాలా శాఖ అధికారులకు తెలిపారు. కేంద్రాల వద్ద అత్యవసర సేవలు అందించడానికి పారామెడికల్ సిబ్బంది ని అందుబాటులో ఉంచాలని జెసి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ.ప్రసాద్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

విశాఖ కలెక్టరేట్

2020-08-29 19:13:21

యువతకు సాఫ్ట్ వేర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వాలి..

భారత ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన మేకిన్ ఇండియా పిలుపుమేరకు మొబైల్ యాప్స్ గణనీయంగా పెరుగుతున్న తరుణంలో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలెప్ మెంట్ కేంద్రాల ద్వారా సాఫ్ట్ వేర్ రంగంపై శిక్షణ ఇవ్వాలని బీజేపి సీనియర్ నాయకులు కొప్పల రామ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ఏర్పాటు చేసే సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందడానికి అవకాశం వుంటుందన్నారు. అంతేకాకుండా, ప్రభుత్వ శాఖల్లో నిర్మాణమవుతున్న మొబైల్ యాప్స్ కి ఇలా సాఫ్ట్ వేర్ లో శిక్షణ ఇచ్చిన వారికి ఉపాది కల్పించాల న్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేసే టెక్నాలజీలపై నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఉపాది దొరకడంతోపాటు, ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుందన్నారు. ప్రభుత్వం ఆదిశగా ఆలోచన చేయకపోవడం వలన ఈ ప్రాంతంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏర్పాటు చేసినా, ఇతర ప్రాంతాలకి చెందిన వారికే కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా స్థానిక యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి నిరుద్యోగులకు ఉచితంగా సాఫ్ట్ వేర్ రంగాలపై శిక్షణ ఇవ్వాలని రామ్ కుమార్ డిమాండ్ చేశారు.

Visakhapatnam

2020-08-29 18:32:20

రెండో సారి నేషనల్ ఎనర్జీ లీడర్ గా విశాఖ ఉక్కు...

జాతీయ స్థాయిలో అత్యుమత్త ఇంధన పరిరక్షణ సామర్ధ్యం సాధించిన సంస్థగా నిలిచినందుకు, విశాఖ ఉక్కుకు “నేషనల్ ఎనర్జీ లీడర్”  గా కూడా రెండోసారి బహు మతి లభించిందని సీఎంఎడీ పికెరథ్ తెలియజేశారు. వరుసగా మూడేళ్ళపాటు దేశవ్యాప్తంగా వున్న స్టీలు ప్లాంటులతో పోటీ పడుతూ, ఈ అవార్డును విశాఖ ఉక్కు ద క్కించుకోవడం ఆనందంగా వుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్లీలుప్లాంటులో బ్లాస్ట్ ఫర్నేస్-2 లో పి.సి.ఐ. ని పెంపొందించడం, బ్లాస్ట్  ఫర్నేస్ లో ఇంధనపు ప్రమాణాన్ని అనుకూలపరచడం, ఆర్గాన్ రికవరీ, టర్బో బ్లోయర్సు ను అనుసంధానించడం లాంటి వినూత్న పద్ధతులు అమలుపరచడం తో పాటు వ్యర్ధాలను రీ సైక్లింగ్ చేయడం ద్వారా  సమర్ధ ఇంధన నిర్వహణ వీలుపడిందని ఆయన పేర్కొన్నారు. ప్లాంటు నిర్వహణతోపాటు, జాతీయ స్థాయిలో అవార్డు లు రావడానికి కారణమైన సిబ్బందిని, అధికారులను సీఎండీ  ఈ సందర్భంగా అభినందించారు.

Steel Plant

2020-08-29 18:15:14

తెలుగు భాష అమ్మవంటిది...రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి

తెలుగుభాష అమ్మవంటిదని అమ్మను ఎల్లప్పుడూ గుర్తించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం తెలుగుని భాగస్వామ్యం చేశామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా  శనివారం ఆర్.కె.బీచ్ లో తెలుగు తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలుగు భాషను గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గ్రామసచివాలయాల్లో సైతం ఫిర్యాదులు, దరఖాస్తులు తెలుగులోనే స్వీకరించడంతో పాటు, అందరికీ అర్ధమయ్యేలా నోటీసు కూడా తెలుగులోనే ఇవ్వాలనే నిబంధన పెట్టారన్నారు. రాష్ట్రంలో తెలుగు అధికార భాష ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర  అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Ramakrishna Beach

2020-08-29 17:30:55

దేశం ఆరోగ్యం కోసమే ఫిట్ ఇండియా ఫ్రీడం రన్..

ప్రతి ఒక్కరినీ ఆరోగ్యంగా ఉంచేందుకు కేంద్రప్రభుత్వం ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్ అన్నారు. శనివారం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రమ్ కార్యక్రమంలో భాగంగా ఈస్ట్ పాయింట్ నుంచి ఆర్కే బీచ్ వరకూ రన్ నిర్వహించింది. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడు తూ,  ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వాల్తేరు  డివిజన్  ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 2, 2020 వరకు “ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్” ను నిర్వహిస్తోందిన్నారు. కరో నా వైరస్ ను నియంత్రించడానికి ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలన్నారు. దానికోసం ప్రతీఒక్కరూ ఫిట్ గా ఉండాలన్న ఆయన, రోజులో ఏదో సమయంలో ఖచ్చితంగా సుమారు గంటపాటు నడవాలన్నారు. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడు తూ, ప్రతీఒక్క ఉద్యోగి ఆరోగ్యంగా ఉండటం ద్వారా ప్రయాణీకులకు సర్వీసులు అందించడానికి ఉపయోగకరంగ వుంటుందన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న సంద ర్భంగా కేంద్రం సూచించిన నిబంధనల ప్రకారం ఈ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.

Ramakrishna Beach

2020-08-29 17:24:30

రైతులకు ఎరువులు సకాలంలో అందాలి...

శ్రీకాకుళం జిల్లాలో రైతులకు ఎరువుల సరఫరాలో జాప్యం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ కె.యు.పి.రమణితో శని వారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎరువుల సరఫరా పరిస్ధితిని సమీక్షించారు. రైతులకు అవసరమగు ఎరువులను పూర్తి స్ధాయిలో అందుబాటులో ఉండేవిధంగా కృషి చేయాలని అన్నారు. సంబంధిత కంపెనీలతో మాట్లాడుతూ సకాలంలో సరుకు జిల్లాకు చేరుటకు ప్రయత్నించాలని సూచించారు. ఎరువులను మండలాలకు అవసరం మేరకు తక్షణం సరఫరా జరగాలని పేర్కొన్నారు. పాతపట్నం, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, మెళియాపుట్టి, భామిని, లావేరు, సంతకవిటి మండలాలకు యూరియా అవసరం ఉందని దానిని వెంటనే సరఫరా చేయాలని సూచించారు. ఇ – క్రాప్ బుకింగ్ వేగవంతం కావాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో 14,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని అందులో 7 వేల మెట్రిక్ టన్నులు సరఫరా ఇప్పటికే జరిగిందన్నారు. మిగిలిన నిల్వలను కొద్ది రోజుల్లో పంపిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. యూరియా అందిన వెంటనే పంపిణీ చేయుటకు ఏర్పాట్లు చేసామని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ క్వాలిటీ కంట్రోల్ సహాయ సంచాలకులు అజయ్ తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2020-08-29 17:00:42

ధ్యాన్ చంద్ మహనీయుడు – కలెక్టర్ జె.నివాస్

ధ్యాన్ చంద్ మహనీయుడు అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శనివారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరి గి న కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నివాస్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడాకా రులకు ధ్యాన్ చంద్ ఎంతో స్ఫూర్తిప్రదాత అన్నారు. దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసిన వ్యక్తి అన్నారు. ధ్యాన్ చంద్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి క్రీడాకారుడు ఉ న్నత స్ధాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గొప్ప మెలకువలతో హాకీ ఆడిన క్రీడాకారుడని పేర్కొంటూ అంతటి నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ సాధించాలని అన్నారు. ల్లా ఒలింపిక్ భవనానికి ప్రతిపాదనలు అవసరమని జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందర రావు కోరగా అందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు. కార్యక్ర మంలో క్రీడల చీఫ్ కోచ్ బి.శ్రీనివాస కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-29 16:58:06

వాలంటీర్లకు విసిసిఐ యూత్ వింగ్ మాస్క్ ల వితరణ

విశాఖజిల్లాలో కరోనా వైరస్ ను నియంత్రించడంలో వార్డు వాలంటీర్లు చేస్తున్న క్రుషి అభినందీయమని  యూత్ వింగ్, విసిసిఐ వైజాగ్ సివి అనిరుధ్ రావు అన్నారు. శనివారం ఈ మేరకు కార్యాలయంలో 1000 మాస్కులను వాలంటీర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంలో ఒక భాద్యతాయుతమైన విధి నిర్వహణ చేస్తూ, ప్రజలకు వాలంటీర్లు మంచి సేవ చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో వాలంటీర్లు వైరస్ బారిన పడకుండా మాస్కులు దోహదపడాలనే ఉద్యేశ్యంతో వీటటిని అందజేస్తున్నామని చెప్పారు.  వైజాగ్ పటం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (విసిసిఐ) 1931 లో స్థాపించిన దగ్గర నుంచి సేవా కార్యక్రమా లు చేపడుతున్నామన్నారు. యూత్ వింగ్, నగరంలోని యువ పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను ప్రోత్సహించే వృత్తిపరమైన సంస్థ కావడంతో పాటు ఆపద సమ యంలో సహాయం అందించేలా కూడా పనిచేస్తుందన్నారు. సంస్థ సిబ్బంది శ్రీకాంత్ తోపాటు, వాలంటీర్ సతీష్ పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-29 16:54:11

శ్రీకాకుళంలో ఆదివారం పూర్తి లాక్ డౌన్..కలెక్టర్

శ్రీకాకుళం పట్టణంలో ఆదివారం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. కాయగూరల మార్కెట్లు, చికెన్, మటన్, చేపల మార్కెట్లు కూడా తెరవడం జరగదని ఆయన స్పష్టం చేసారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ శ్రీకాకుళం పట్టణంలో కేసులు అధికంగా పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని అన్నారు. గత ఆది వారం లాక్ డౌన్ కు ప్రజలు మంచి సహకారం అందించారని చెప్పారు. మందుల దుకాణాలు లభ్యంగా ఉంటాయని, వాటి తోపాటు వాటికి ఆనుకుని పాలు, బ్రెడ్ మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయని  ఆయన స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవలను వినియో గించుకొనుటకు ఎటువంటి ఆటంకం లేదని ఆయన స్పష్టం చేసారు. అంబులైన్సులు, వైద్య వాహనాలకు అనుమతి ఉందని పేర్కొంటూ అత్యవసర పరిస్థితుల్లో సొంత వాహ నాల్లో వైద్యం నిమిత్తం వెళ్ళే వాహనాలకు కూడా ఆటంకం ఉండదని ఆయన తెలిపారు. అయితే అత్యవసరం కానప్పటికి వైద్య సేవలు పొందే నెపంతో బయట తిరిగే వాహనాలు, యజమానులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కుతోపాటు ఫేష్ షీల్డ్ ధరించాలని కోరారు. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రపరచుకోవాలని ఆయన అన్నారు.

Srikakulam

2020-08-29 16:42:19