1 ENS Live Breaking News

సిరోముండనం దోషులను కఠినంగా శిక్షించాలి...సిపిఎం

విశాఖజిల్లా, పెందుర్తి సుజాతనగర్‌లో జనసేన నాయకుడు, సినీనిర్మాత  నుతన నాయుడు నిన్న దళిత యువకుడు కె శ్రీకాంత్‌ ‌కి గుండుగీయించి తీవ్రదుర్మాగ్గ చర్య కు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ(ఎం) గ్రేటర్‌ ‌విశాఖనగర కమిటీ కార్యదర్శి డా.బి.గంగారామ్ చెప్పారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మా ట్లాడుతూ,  ఇంత దారుణమైన సంఘటన జిల్లాలో జరిగినప్పటికీ పోలీసులు ఇప్పటివరకు దోషులను అరెస్ట్ ‌చేయకపోవటాన్ని ఆయన తప్పు పట్టారు. విశాఖ మ హానగరంలో ఇలాంటి దుర్మర్గచర్యకు నుతననయుడు పాల్పడటం సభ్యసమాజంతలదించుకునే చర్య అన్నారు. నేరాన్ని కప్పిపుచ్చుకొవటానికి తప్పుడు కధనాల అల్లీ పక్కదారిపట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం గాని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌గాని, పెందుర్తి నియోజక ఎంఎల్‌ఏ ‌స్పందించకపోవటాన్నికూడా ఖండిస్తున్నామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయంలో దళితులపై జరిగిన దాడులు నేడు వైస్‌జగన్‌మోహన్‌ ‌రెడ్డి ప్రభుత్వంలో కూడా కొనసాగటం ఆంధోళనకరం. దళితులపై దాడులు చేయడంలో వైఎస్‌ఆర్‌, ‌తెలుగుదేశం, బిజేపి, జనసే ఒకే కోవకు చెందినవన్నారు. శిరోమండనంనికి పాల్ప డి న వరాందరిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉధ్యుమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నం.

Visakhapatnam

2020-08-29 16:40:46

ఏపీలో అంతర్జాతీయస్థాయి క్రీడా సదుపాయాలు...

ఆంధ్రప్రదేశ్ లో అంతర్జాతీయ స్థాయి క్రీడా సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు  ధ ర్మాన క్రిష్ణదాస్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవంను స్థానిక స్విమ్మింగ్ పూల్ వద్ద జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్య క్రమా న్ని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఒక సందేశాన్ని పంపించారు. ఈ సందేశాన్ని జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందర రావు చదివి వినిపించారు.  క్రీడా ప్రపంచంలో దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసి, హాకీ మాంత్రికుడిగా కీర్తి గడించిన ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ అని ఆయన జన్మ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రతీఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతోందని అన్నారు.  కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఎలాంటి ఆర్భాటాలకు తావులేకుండా కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూనే సంబరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఫిట్ ఇండియా పేరుతో గత ఏడాది ఘనంగా నిర్వహిం చుకు న్నామని చెప్పారు.దేశంలో అత్యున్నత స్థాయికి చేరిన క్రీడాకారులకు జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఖేల్ రత్న, ద్రోణాచార్య, అర్జున అవార్డులను అందించి సత్కరించడం జరుగుతోందని అన్నారు. 

Srikakulam

2020-08-29 16:38:24

క్రీడాభివ్రుద్ధి ప్రభుత్వం సిద్ధంగా వుంది...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్రీడలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామ్ గోపాల్ అన్నారు. శుక్రవా రం జిల్లా క్రీడల శాఖ అధికారులతో కలిసి సాప్ వాటర్ స్పోర్ట్ష్ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం క్రీడలను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందింస్తుందని చెప్పారు. అదే విధంగా గిరిజన ప్రాం తాల్లో కూడా క్రీడలను మరింత అభివ్రుద్ధి చేయనున్నదని చెప్పారు. ప్రస్తుతం క్రీడాభివ్రుద్ధికి కేటాయిచిన పనులను సత్వరమే పూర్తిచేసి వాటి నివేదికలు పం పాలన్నారు. వీటితో పాటు, ఏఏ క్రీడల ద్వారా యువతను మరింతగా రాణించేలా చేయవచ్చుగో గుర్తించాలని జిల్లా క్రీడల అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారులతోపాటు, ఐటిడిఏ క్రీడల అధికారులు పాల్గొన్నొరు...

Rushikonda

2020-08-28 20:34:39

స్పందన దరఖాస్తులపై అధికారులు పరిష్కారం చూపాలి..

స్పందన వినతులపై అధికారులు తక్షణమే స్పందించడంతోపాటు, దరఖాస్తులకు పరిష్కార మార్గాలు చూపించాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ గిరీష అన్నారు. శుక్రవారం తన చాంబరులో అధికారులతో స్పందన కార్యక్రమంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ, రెవిన్యూ విభాగా అధికారులతో నగరంలో చాలా చోట్ల పన్నులు వేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై ఫిర్యాదు రాకుండా ఉండటం తో పాటు మొండి బకాయిలు వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నగరంలో అక్రమ కట్టడాలను ముందుగానే గుర్తించి వారికి నోటీసులు ఇవ్వ డంతో ఫైన్లు కూడా వేయాలన్నారు. ఆక్రమణలను, కట్టడాలను తొలిదశలోనే అడ్డుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. నగరంలో ఉన్న అపార్ట్మెంట్లు, భవనాలు పరిశీలించాలని, అవార్డు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అభివ్రుద్ధి పనులు చేయించాలని ఆదేశించారు.

Tirupati

2020-08-28 20:33:06

ఆంధ్రప్రదేశ్ లో 4 లక్షలు దాటిన కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల్లో కొత్తగా 10,526 కేసులు నమోదై వీటి సంఖ్య నాలుగు లక్షలు దాటిపోయింది. 24గంటల్లో81 మంది మృతిచెందగా, వీరితో ఇప్పటి వరకూ మ్రుతి చెందిన వారు రాష్ట్రంలో 3,714గా నమోదయ్యారు. విశాఖ జిల్లాలో 24 గంటల్లో 6 గురు మృతి చెందగా, కొత్తగా 896 కేసులు నమోదు అయ్యాయి. దీనితో జిల్లాలో 34,206 కు సంఖ్య పెరిగింది. కాగా ఇప్పటివరకూ జిల్లాలో 2,74 మంది మృతిచెందారు. జిల్లాలో కేసులు అధికంగా వున్నందు ప్రజలు ప్రభుత్వం నిర్ధేశించిన మార్గద ర్శకాలను పాటించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కోరుతున్నారు. ప్రజల సౌకర్యార్ధం క్వారంటైన్ కేంద్రాలు నిర్వరామంగా నడుపుతున్నామన్న ఆయన కోవిడ్ లక్షణాలుంటే తక్షణమే పీహెచ్సీల ద్వారా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు హోమ్ క్వారంటైన్ ద్వారా కూడా చికిత్స తీసుకునే వెసు లుబాటు వుందన్న కలెక్టర్ పూర్తిస్థాయిలో మందులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. 

Visakhapatnam

2020-08-28 20:07:50

చిన్నారుల కోసం రెండు 108 అంబులెన్సులు సిద్ధం..

శ్రీకాకుళం జిల్లాలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా 108 అత్యవసర సేవలు ప్రారంభించినట్టు జెసి డా. కె.శ్రీనివాసులు తెలియజేశారు. శుక్రవారం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ రూపోందించిన 108 అత్యవసర సేవల  గోడపత్రికను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యం.చెంచయ్య, 108 వాహనాల జిల్లా మేనేజర్ పి. వెంకట రమణలతో కలిసి జె.సి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు జిల్లాలో 108 అత్యవసర సేవల వాహనాలు పెద్దలకు మాత్రమే వినియోగించడం జరిగిందని, ప్రస్తుతం చిన్నారుల కోసం ప్రత్యేకంగా రెండు 108 వాహనాలు జిల్లాకు రావడం విశేషమన్నారు. ఈ వాహనాలు మాతా, శిశు మరణాలు ఎక్కువగా ఉన్న టెక్కలి మరియు పాలకొండ రెవిన్యూ డివిజన్లకు కేటాయించడం జరిగిందని చెప్పారు. ప్రత్యేకంగా చిన్నారుల కోసం ఏర్పాటుచేసిన 108 వాహనాలు ప్రసూతి కేంద్రం మరియు నవజాత శిశు సంరక్షణ కేంద్రాలకు అనుసంధానం చేయబడ్డాయని ఆయన స్పష్టం చేసారు. ఈ 108 వాహనాల్లో చిన్నారుల కోసం వెంటి లేటర్, ఆక్సిజన్, నవజాత శిశువులకు కోసం ప్రత్యేకమైన పెట్టె మరియు అవసరమైన మందులు ఇందులో ఉంటాయని జె.సి వివరించారు.

Srikakulam

2020-08-28 19:25:04

కోవిడ్ విజేతలకు ప్లాస్మాదానంపై అవగాహన కల్పించాలి..

విశాఖజిల్లాలో 2నెలల్లో కోవిడ్  నుండి కోలుకున్న వారి నుండి ప్లాస్మా దానం చేసేలా రోగులను చైతన్యపరచాలిని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ వైద్యఆరోగ్యశాఖ అధి కారులను ఆదేశించారు.  అలా ముందుకు వచ్చిన వారి నుంచి ప్లాస్మా సేకరించాలని తెలిపారు. వారికి ప్లాస్మాదానంపై అన్ని ప్రాంతాల్లోనూ  అవగాహన కల్పించాలని తెలిపారు. ఫ్లాస్మా దానం చేసిన వారికి ప్రోత్సాహక బహుమతిగా  ప్రభుత్వం అందిస్తున్న 5వేల రూపాయలను మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా  డిఎంహెచ్ఓని ఆదేశిం చా రు. ప్లాస్మాదానంపై అన్ని వర్గాలకు తెలిసేలా ప్రసార మాద్యమాల ద్వారా ప్రచారం చేయాలన్నారు.  కె.జి.హెచ్., ఇ.ఎన్.టి.,రాణి చంద్రమతి దేవి ఆసుపత్రి, ప్రాంతీ య కంటి   ఆసుపత్రులలో గల 300 పడకలను తక్కువ రిస్క్ గల పేషెంట్లకు కేటాయించి వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో విమ్స్ డెరెక్టరు డా. వరప్ర సాద్, ఆంధ్రా మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డా. సుధాకర్,  కె.జి.హెచ్. సూపరిండెంటింగు ఇంజనీరు ,  ఇంచార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయలక్ష్మి పాల్గొన్నా రు.  

Visakhapatnam

2020-08-28 19:19:29

సెప్టెంబరు 1నాటికి 650 పడకలు సిద్దం కావాలి...

విశాఖలోని విమ్స్ ఆసుపత్రిలో గల 650 పడకలను సెప్టెంబరు ఒకట నాటికి వినియోగంలోనికి తీసుకురావాలని జిల్లా కలెక్టరు  వి.వినయ్ చంద్ వైద్యాధికారులను ఆ దేశించారు.  శుక్రవారం ఆయన విమ్స్ ఆసుపత్రిని తనిఖీ చేసారు. సిబ్బంది పనితీరు పర్యవేక్షణలో భాగంగా సీ.సీ. కెమోరా పుటేజీని పరిశీలించారు. అనంతరం వై ద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈసంధర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రిలో గల 216 ఐ.సి.యు, 434 ఆక్సిజను సదుపాయలు గల  650 ప డకలను పూర్తి స్థాయిలో వినియోగంలో ఉండాలన్నారు. అందుకు కావలసిన  సిబ్బందిని, పరికరాలను  వెంటనే సమకూర్చుకోవాలన్నారు. ఇటీవల రిక్రూట్ చేసి న అభ్యర్థులకు వెంటనే నియామకపత్రాలు  అందజేయాలని తెలిపారు.  సిబ్బందిని మూడు షిప్టులుగా విభజించి, ప్రతి షిప్టుకు ఒకరిని భాద్యునిగా నియమించాలని తె లిపారు.  మూడు షిప్టులలో  నియమించిన సిబ్బంది వివరాలు తనకు అందజేయాలని ఆదేశించారు. అవసరమైన సిబ్బందిని సమకూర్చవలసినదిగా ఆంధ్రా మెడి కల్ కాలేజీ  ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.

vims hospital vizag

2020-08-28 19:10:56

కోవిడ్ ఫలితాలు మరింత త్వరగా రావాలి...జిల్లా కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ నమూనాల పరీక్షా ఫలితాలు మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్)లో పెతాలజి, రేడియాలజీ తదితర విభాగాల లాబ్ ఇన్ ఛార్జిలతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. నమూనాలు సేకరించిన అనంతరం అతి త్వర గా ఫలితాలు వెల్లడించడం ద్వారా వ్యాధి లక్షణాలు లేని పాజిటివ్ కేసులు బయట తిరగకుండా నిరోధించగలమన్నారు. తద్వారా వ్యాప్తికి అవకాశం ఉండదని పేర్కొ న్నారు. ఐసియులో ఉన్న పేషెంట్లకు అవసరమగు పరీక్షలలో ఎటువంటి జాప్యం జరగరాదని ఆయన స్పష్టం చేసారు. పరీక్షా ఫలితాలకు అనుగుణంగా మంచి వైద్య చికిత్సను అందించవచ్చని అన్నారు. అతి తీవ్రతగల కేసులకు ప్లాస్మా చికిత్స అందించుటకు ప్రాధాన్యతను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. వైద్యులు, వైద్య సి బ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని, అయితే దానికి పూర్తి సార్ధకత చేకూరుటకు ప్రయత్నించాలని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చేరిన ఏ ఒక్క వ్యక్తి మృతి చెందకుండా అవసరమగు అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు.

Visakhapatnam

2020-08-28 18:59:39

పర్యావరణ ముసాయిదాను రాష్ట్రాలు వ్యతిరేకించాలి..

కరోనా వైరస్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పర్యావరణ పరిరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ ముసాయిదా  కార్పొరేట్‌ ‌సంస్థల అభివృద్ధి కోసం ఆదివాసీ చట్టాలను త్రుంగలో తొక్కిందని మాజీ ఐ.ఎ.ఎస్‌ అధికారి ఇఏఎస్‌ ‌శర్మ అన్నారు. శుక్రవారం గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పి.అప్పలనర్స అధ్యక్షత ను వెబ్‌ ‌నార్‌ (ఆన్‌ ‌లైన్‌ ‌సెమినార్‌) ‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇ.ఎ. ఎస్‌ ‌శర్మ గారు మాట్లాడుతూ, ఈజీ డుయింగ్‌ ‌బిజినెస్‌ ‌పాలసీ పేరుతో కార్పొరే ట్‌ ‌సంస్థలకు దాసోహం కావడం చట్టవ్యతిరేకమైనదని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇందిర గాంధీ ప్రభుత్వం 48(ఏ) తీసుకువచ్చి పర్యావరణ మంత్రిత్వ శా ఖ ను ఏర్పాటు చేశారని, పర్యావరణ పరిరక్షణ   చట్టం 1986 కు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ విధాన ముసాయిదా 2020 ఉందని విమర్శించారు. ఆదివాసీ అధికార్‌ ‌రాష్ట్రీయ మంచ్‌ ‌జాతీయ చైర్మన్‌, ‌మాజీ ఎంపీ డాక్టర్‌ ‌మీడియం బాబూరావు  మాట్లాడుతూ పర్యావరణ విధాన ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతి రేకంగా పోరాటం చేయాలని లేదంటే గిరిజనులు నిర్వసితులుగా మారిపోతారన్నారు.

విశాఖపట్నం

2020-08-28 18:42:15

బ్యాంకులు గ్రామాల వారీగా రోజూ షెడ్యులు ప్రకటించాలి..

ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని ప్రజలు నగదుగా తీసుకునేందు బ్యాంకులు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. శుక్ర వారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బ్యాంకు అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల సంక్షేమానికి ఆర్ధిక సహాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాల క్రింద లబ్దిదారుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరుగుతోందని దానిని లబ్ది దారులు బ్యాంకుల నుండి పొందుటకు తగు ఏర్పాట్లు ఉండాలని అన్నారు. కోవిడ్ దృష్ట్యా బ్యాంకు శాఖలలో ప్రజల రద్దీ ఎక్కువగా ఉండకుండా చూడాలని అందు లో భాగంగా గ్రామాల వారీగా షెడ్యూలు ప్రకటించాలని సూచించారు. ఆయా గ్రామాలకు కేటాయించిన తేదీలలో లబ్దిదారులు బ్యాంకుల వద్దకు వచ్చి నగదును పొం దగలరని పేర్కొన్నారు. ప్రకటించిన తేదీలను డి.ఆర్.డి.ఓ ఏపిఎంలు స్వయం సహాయక సంఘాల ద్వారా సమాచారం అందిస్తారని చెప్పారు. కోవిడ్ కారణంగా బ్యాం కు శాఖలలో సోడియం హైపోక్లోరైడ్ శానిటైజేషన్ చేయాలని కలెక్టర్ అన్నారు.

Srikakulam

2020-08-28 18:33:53

కేంద్ర, రాష్ట్ర విద్యుత్ సంస్కరణలు తిప్పికొట్టాలి..

బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణలను యావత్‌ ప్రజానీకం త్రిప్పికొట్టాలని వామపక్ష పార్టీల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం విద్యు త్‌ అమరవీరుల 20వ వర్ధంతి సందర్భంగా జివిఎంసి గాంధీవిగ్రహం వద్ద విద్యుత్‌ అమరవీరులకు నివాళర్పిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యుత్‌ సంస్కరణలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, సిపిఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు, సిపిఐ(ఎంఎల్‌) న్యూడె మోక్రసి జిల్లా కార్యదర్శి వై.కొండయ్య, సిపిఐ(ఎంఎల్‌) నాయకులు గణేష్‌పాండా మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం 2000 సంవత్సరంలో ప్రపంచ బ్యాం కు విధానాలనే అనుసరించడంతో ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపాడని, దాంతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలంతా తిరుగుబాటు చేసారన్నారు. విద్యుత్‌ చార్జీలు రద్దు చేయాలని వామపక్షపార్టీల పిలుపుమేరకు 2000 ఆగష్టు 28న చలో హైదరాబాద్‌ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు పోలీస్‌లతో కాల్పులు జరిపించి, బాష్పవాయు వును ప్రయోగించడంతో ముగ్గురు యువకిశోరాలైన బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డిలను పొట్టనపెట్టుకున్నాడన్నారు.

GANDHI STATUE, OPP GVMC, VIZAG

2020-08-28 18:22:34

ఉపాధిహామీ పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలి..జెసి

శ్రీకాకుళం జిల్లాలోని ఉపాధిహామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ క్రింద సాధించాల్సిన పనుల ప్రగతిపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని  జిల్లా సంక్షేమ, ఆసరా సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జె.సి ఛాంబర్ లో జిల్లా నీటియాజమాన్య సంస్థ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజినీర్లతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ క్రింద జిల్లాలోని గ్రామ సచివాలయాలు, వై.యస్.ఆర్.ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణపు పనులను చేపట్టివలసి ఉందన్నారు. ఇందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలను         ( యాక్షన్ ప్లాన్ ) అధికారులు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో గిరిజన ప్రాంతాలలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న పనుల వివరాలను ముందుగా తెలుసుకోవాలని, ఆ పనులు మినహా జిల్ల్లాలోని మిగిలిన అన్ని పనులను సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు జిల్లాలో చేపట్టవలసిన పనుల ప్రగతిపై ప్రణాళికలు వేయాలని, వాటిని ఎన్ని రోజులలో పూర్తిచేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ అనుకున్న సమయానికి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను కోరారు.  ఈ సమావేశంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ అదనపు పథక సంచాలకులు పి.లక్ష్మీపతి, పంచాయతీ రాజ్ శాఖ శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ కార్యనిర్వాహక ఇంజినీర్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-08-28 18:14:51

విశాఖలో విరబూసిన ఐదు బ్రహ్మకమలాలు...

ఉత్తర భారతదేశం హిమలయల్లో అరుదుగా కనిపించే బ్రహ్మకమలం పుష్పాలు విశాఖ జిల్లా, అగనంపూడి లో ఒకేసారి 5పుష్పాలు విరబూసాయి. శుక్రవారం సాయి ప్రసన్న రెసిడెన్సీలో నివసిస్తున్నా శివ కుమార్ , లక్ష్మీ సుబ్రమణ్యేశ్వరీ ఇంట్లో రాత్రీ ఒక్కసారిగా ఐదు బ్రహ్మకమలం పుష్పాలు వికసించాయి. వీటిన చూసిన ఇంటిలో సభ్యులు ఆనందం వ్యక్తం చేయడంతోపాటు ఫోటోలు, వీడియోలు తీసి స్నేహితులకు పంపడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఎక్కడో హిమలయాల్లో అరుదుగా కనిపించే బ్రహ్మకమలం పుష్పాలు తమ ఇంట్లో ఒకేసారి ఐదు పూలు పూయడంతో స్థానికులు కూడా వీటిని చూసేందుకు వస్తున్నారు. ఒకేసారి ఇన్ని బ్రహ్మకమలం పుష్పాలు పూయడం శుభసూచికం స్థానికులు చెబుతున్నారు. ఈ బ్రహ్మకమలం పూల మొక్కలు మొలవడం సాధారణంగా జరగదు, ఎంతో శ్రమతో ఈ మొక్కలను పరిరక్షించాలి. అలా జాగ్రత్తలు తీసుకుంటే తప్పా ఈ బ్రహ్మకమలం మొక్కలు పూలు పూయవు. ఈ మొక్కకి ఒకేసారి ఐదు పుష్పాలు వికసించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Aganampudi

2020-08-28 13:21:33

సెప్టెంబరు 4న దుర్గగుడి ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తాం...

విజయవాలో  సెప్టెంబరు4న దుర్గగుడి ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు.   4 కోట్ల రూపాయ‌ల‌తో చేపట్టనున్న అభివృద్ది ప‌నుల‌కు నేటిఉదయం  మంత్రి  స్వాతి సెంటర్,గాంధీ బొమ్మ సెంటర్ వద్ద  శుంకుస్థాపన‌ చేసారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, తన 5ఏళ్ల  పాలనలో టిడిపి న‌గ‌రాన్ని అభివృద్ది చేయ‌కుండా  విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌ను మోసం చేసిందన్నారు. జ‌గ‌న్ మోహన్ రెడ్డి నేతృత్వంలో తమ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత న‌గ‌ర అభివృద్దికి బాట‌లు ప‌డ్డాయ‌ని  అన్నారు.  గతంలో జ‌లీల్ ఖాన్‌, బొండా ఉమా, గ‌ద్దె రామ్మెహ‌న‌రావు, ఎం.పి కేశినేని నానిలు ఈ నగరానికి ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేకపోయార్నారు.  అలాంటిది  ఎం.పి నాని ఇప్ప‌డు దుర్గ‌గుడి ఫ్లై ఓవర్ గురించి మాట్లాడ‌టం హ‌స్య‌స్ప‌దంగా ఉంద‌న్నారు. కృష్ణా పుష్క‌రాల‌నాటికే దుర్గ‌గుడి ఫ్లై ఓవర్ పూర్తి చేస్తామ‌ని చెప్పిన ఎం.పి కేశినేని నాని ఇప్ప‌డు ప్ర‌జ‌ల‌కు ఏమి స‌మాధానం చేబుతార‌ని మంత్రి శ్రీనివాసరావు ప్ర‌శ్నించారు.

Vijayawada

2020-08-28 13:07:59