1 ENS Live Breaking News

పీహెచ్సీల్లో ప్రసవాలు అధికంగా చేయాలి...కలెక్టర్

ప్రాధమిక వైద్యకేంద్రాల పరిధిలో ప్రసవాలు అధికంగా చేయడానికి పారామెడికల్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ వైద్యా ధికారులను ఆదేశించారు. శనివారం అచ్చుతాపురంలో మండలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా  గ్రామంలో గల  ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని  సందర్శించి రోజుకు ఎన్ని శ్యాంపిల్స్ తీస్తున్నారని, ఎన్ని  కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.  పి.హెచ్.సి.లో గల ల్యాబ్, ఫార్మశీని పరిశీలించారు.  ఫార్మశీ లో గల మందుల వివరాలు, స్టాక్ ఎంత ఉన్నదీ, రిజిస్టర్ సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదాఅని రిజిస్టర్ను పరిశీలించారు.  ల్యాబ్ ను పరిశీలించి అందులో కొన్ని పరికరాలు మరమ్మత్తులకు గురైనవని, అవసరమైన పరికరాల జాబితా పంపాలని డా. రజనిని ఆదేశించారు. పి.హెచ్.సి.లో ప్రసవాలు ఎన్ని జరిగాయని, సౌకర్యాలు అన్ని ఉన్నాయని, ప్రసవాలు తగ్గకూడదని డాక్టర్ ను ఆదేశించారు. పి.హెచ్.సి.లో లైటింగ్, పెయింటింగ్, తదితరమైనవి వారం రోజుల్లో రూపు రేఖలు మారిపోవాలని ఆదేశించారు.  ఆ బాధ్యతను అనకాపల్లి ఆర్డీఓ సీతారామరావుకు అప్పగించారు.  కొండకర్ల ఆవ ను సందర్శించారు.  పర్యాటకులు వస్తున్నది లేనిది తహసిల్థార్ ను అడిగి తెలుసుకున్నారు.  అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఆహాలదంగా తయారు చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పర్యాటకులు సందర్శించే విధంగా ఉండాలని, సైనేజస్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

Acchutapuram

2020-09-05 18:35:52

మధుబాబుకు డిప్యూటీ సీఎం సత్కారం..

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతి అవార్డు స్వీకరించిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఏ. మధు బాబును శనివారం కలెక్టరేట్ లో శాలువాతో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సన్మానించారు. ఈసారి రాష్ట్రం నుంచి జాతీయ అవార్డుకు ఎంపికైన ఏకైక ఉపాధ్యాయునిగా మధుబాబు నిలవడం పట్ల మంత్రి మధుబాబుకు అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, జిల్లా పేరును జాతీయ స్థాయికి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. ఇదే స్పూర్తితో మరింత మంది విద్యార్ధులను మంచి ఉన్నత విద్యార్ధులుగా తయారు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌళిక సదుపాయాలు కల్పించినందున ప్రభుత్వ పాఠశాలలంటే పిల్లల్లో మంచి భావన కలిగే ఉపాధ్యాయులు తయారు చేయాల్సి వుందన్నారు. మధుబాబు జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసారని కితాబిచ్చారు. 

Srikakulam

2020-09-05 18:27:55

సుభాష్ చంద్రబోస్ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

శ్రీకాకుళం జిల్లాలో దేశ విపత్తు నిర్వహణ సంస్థ ( ఎన్.డి.ఎం.ఎ ) సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రధాన పురస్కార అవార్టులను ప్రధానం చేయనున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రధాన పురస్కార అవార్డులు – 2021 సంవత్సరానికి  పౌరులు,వివిధ సంస్థల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆయన చెప్పారు. దరఖాస్తులను ఈ నెల 30 లోగా ఆన్ లైన్ లో సమర్పించాల్సి వుంటుందన్న ఆయన ఈ https://dmawards.ndma.gov.in  వెబ్ సైట్ యందు అప్ చేసుకోవాలన్నారు. అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఆర్వో కోరారు.

Srikakulam

2020-09-05 18:01:34

మున్సిపల్ పార్కులో ఉచిత యోగా శిక్షణ తరగతులు

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కరోనా మహమ్మారి విస్తరించకుండా, వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు ప్రకాశం పార్కులో యోగా శిక్షణా తరగతులు నిర్వహిం చనున్నామని నగరపాలక సంస్థ కమిషనర్  గిరీషా తెలిపారు. నగరపాలక సంస్థలో ఈమేరకు శనివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా యోగా అసోసియే షన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 5 గంటలకు ప్రకాశం పార్కులోని ఆంఫీ థియేటర్ దగ్గర ఈ యోగా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. కమిషనర్ మాట్లాడుతూ, కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు  యోగా శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఈ ఆసక్తి కలిగిన నగరప్రజలు ఆదివారం ఉదయం 5 గంటలకు ప్రకాశం పార్కులో ఆంఫీ థియేటర్ కు రావాలని కమీషనర్ పిలుపునిచ్చారు. ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Tirupati

2020-09-05 16:49:44

గురువులతోనే నవ సమాజ ప్రగతి..ఆచార్య ఎంవిఆర్ రాజు

ప్రపంచంలో గురు శిష్య అనుభంధం మానవ జాతికి శ్రీరామ రక్ష అని ఏయూ ఆచార్యులు కొనియాడారు. ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగం విద్యార్థుల  ఆధ్వర్యంలో శనివారం గురుపూజోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు,ఈ సందర్బంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఆచార్యులు పూలమాలలు వేసి, అనంతరం గురువులను ఘనంగా సత్కరించారు. అనంతరం సైకాలజీ విభాగాధిపతి, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం వి ఆర్ రాజు మాట్లాడుతూ,  గురువులతోనే నవసమాజ ప్రగతి సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. విద్యతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించేది గరువులు మాత్రమేనన్నారు. నిరంతరం ఏదో ఒకటి తాము నేర్చుకుంటూ  తమ విద్యార్థులకు కూడా  తెలియజేయాలని మంచి సంకల్పం ఒక్క గురువులకు మాత్రమే సొంతమన్నారు. నేటి ఆధునిక యుగంలో కూడా గురువుల జ్ఞానమార్గం ఎంతో మందిక విద్యార్ధులకు  ఆదర్శనీయమన్నారు. ప్రపంచాన్ని నడిపించేది గురు మార్గం ఒక్కటేనన్న ఆయన ఆంధ్ర యూనివర్సిటీ లోడాక్టర్  సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలు మరపురానివన్నారు.  ప్రస్తుతం  తెలుగుభాషను కొనసాగిస్తూనే మరోవైపు ఇంగ్లీషుభాషపై కూడా విద్యార్ధులు పట్టు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. చిరుప్రాయం నుంచి ఇంగ్లీష్ పై పట్టు సాధిస్తే అది భవిష్యత్ తరాలకు పునాది వేస్తుంది అన్నారు. తదుపరి సైకాలజీ విభాగం అధ్యాపకులు డాక్టర్ సునీత, సుభాషిని, తదితరులును విద్యార్డులు ఘనంగా  సత్కరించారు. ఏయూ సైకాలజీ సీనియర్  విభాగం విద్యార్థి,  జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో వేణు, కృష్ణ,దివిజ,కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-09-05 13:03:45

విశాఖలో స్టార్ట్...కెమెరా...యాక్షన్..

కరోనా వైరస్ నిభందనల తరువాత చాలాకాలానికి విశాఖలో సినిమా షూటింగ్ లు సందడి మొదలైంది. లాక్‌డౌన్‌ తరువాత 4.0 అన్ లాక్ నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత మొట్టమొదటిసారి నగరంలో సినిమా షూటింగ్‌ సందడి ప్రారంభమైంది. ఆర్కే బీచ్‌ రోడ్డులో సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. కరోనా నేప థ్యంలో ఐదు నెలలుగా విశాఖలో సినీ షూటింగ్‌లు ఆగిపోయాయి. ప్రభుత్వ నిబంధనల సడలింపుల అనంతరం శనివారం బీచ్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ‘ఐపీఎల్‌’ పేరుతో రూపొందిస్తున్న సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్ర యూనిట్‌ సభ్యులు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ షూటింగ్‌ జరిపారు. దీంతో విశాఖలో మళ్లీ షూటింగ్ సందడి నెలకొంది. ఇప్పటికే పలు హీరోల పెద్ద ప్రాజెక్టులు కూడా కరోనా కారణంగానే నిలిచిపోయాయి. ప్రభుత్వం షూటింగ్ లకు కూడా అనుమతులు ఇవ్వడంతో మళ్లీ వెండితెర పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని సినిమా దర్శకులు భావిస్తున్నారు.

R.k.Beach

2020-09-05 12:28:37

విశాఖ మన్యంలో సుప్రీం కోర్టు ఆదేశాలు భేఖాతరు..

కేంద్రం ప్రభుత్వం బ్యాంకుల్లోని అన్నిరకాల రుణాలపై మారటోరియంపై తీర్పు ఇచ్చినప్పటికీ, సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ విశాఖ ఏజెన్సీలో మాత్రం ఆ ఆదేశాలు అమలు కావడం లేదు. కరోనా సమ యంలో అందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారుల వద్ద నుంచి బ్యాంకులు అన్ని రకాల  లోన్లుకి ఈఎంఐలు కట్టించుకున్నాయి. అన్ని లోన్లకు ఈసీఎస్ (ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్) ఉండటంతో జీతాలు పడిన వెంటనే లోన్లకు ఈఎంఐలు కట్ చేసుకున్నాయి. ఇవేవో ఆధారాలు లేకుండా అన్నమాటలు కాదు. విశాఖ ఏజెన్సీలోని అన్ని బ్యాంకులు, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఖచ్చితంగా ఈఎంఐలు కట్టించుకున్నాయి. అవి వాస్తవమో కాదో ఏజెన్సీలోని 11 మండలాల్లోని బ్యాంకు నివేదికలు చూస్తే అర్ధమవుతుంది. కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు నెలలు సగం జీతం ఇచ్చిన సమయంలో కూడా బ్యాంకులు ఈఎంఐలు కట్టించుకోవడం కట్ చేసుకోవడం గమనార్హం. ప్రస్తుం సుప్రీం కోర్టు మరో రెండు నెలలు ఈఎంఐలపై గడువు ఇచ్చిన నేపథ్యంలో ఈనెల అంటే ఆగస్టులో కూడా ఈఎంఐలు కట్టించుకున్నాయి ఏజెన్సీలోని బ్యాంకులు..అదేమంటే రుణాలకు ఈఎంఐలు ప్రతీనెలా కట్టాల్సిందేనని ఖరా ఖండీగా చెబుతున్నాయి. కొన్ని బ్యాంకులైతే ఈఎంఐ క్లియర్ అయ్యేంత వరకూ అకౌంట్లను ఫ్రీజ్ చేసి పెడుతున్నాయి. . అలాంటి సమయంలో కోర్టు తీర్పులను బ్యాంకులు ఎందుకు అమలు చేయడం లేదని  ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం మారటోరియం ప్రకటించినా, సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా బ్యాంకులు మాత్రం ఈ విధంగా వ్యవహరించడం చర్చనీయాంశం అవుతోంది. ఈ విషయంలో జిల్లా అధికారులు సైతం నోరు మెదపడం లేదు..

పాడేరు

2020-09-05 11:35:55

నేటి నుంచి పర్యాటక ప్రాంతాల్లోకి అనుమతులు...

విశాఖజిల్లాలో ఈరోజు నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులను అనుమతించడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేంద్రం వెలువరించిన 4.0 మార్గ దర్శకాలను అనుసరించి ఈ వెసులుబాటు కల్పించినట్టు పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు. వీకెండ్ కావడంతో విశాఖలోని పర్యాటక ప్రదేశాలన్నీ పర్యాటకు లతో నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాంగంగా అరకులోని బొర్రాగుహలు, మ్యూజియం, పార్కు, కాఫీ సెంటర్, విశాఖలోని కైలాసగిరి, రోప్ వే, రుషి కొండ, కంబాల కొండ, టూరిజం మ్యూజియంతో అన్ని పర్యాటక ప్రాంతాలు తెరవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రభుత్వ ఆదేశాలు రావడానికి వారం రోజుల ముందు నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నీ పరిశుభ్రం చేయించారు అధికారులు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఎప్పటికప్పుడు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లించడంతోపాటు, అన్ని ప్రాంతాలను శానిటైజ్ చేశారు. అదే సమయంలో పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు కూడా మాస్క్ ఖచ్చితంగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్లు వాడలని కూడా పర్యాటక శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా వుంటే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా పర్యాటక ప్రాంతాలకు పెద్దగా జనాలు వచ్చే సూచనలు కనిపించడం లేదు..

Visakhapatnam

2020-09-05 11:12:19

నాడు నేడు పనులు వేగవంతం చేయాలి..కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో నాడు నేడు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్  జె.నివాస్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం మండలం సింగుపురం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో నాడు నేడు పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నాడు నేడు పనులతో పాఠశాలల ముఖ చిత్రం మారుతుందని ఆయన పేర్కొన్నారు. మంచి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని, కార్పొరేట్ స్ధాయిలో సౌకర్యాలు కల్పించడం జరుగుతోందని ఆయన అన్నారు. తాగు నీరు, నిత్యం నీటిసరఫరాతో మరుగుదొడ్లు, మంచి విద్యుత్ దీపాలు, ప్యాన్ లు తదితర సౌకర్యాలు ఉండాలని చెప్పారు. విద్యార్ధులు ఆహ్లాదకర వాతావరణంలో విద్యను అభ్యసించాలని, తద్వారా మంచి విద్యాభ్యాసం కలుగుతుందని, మానసిక వికాసం వస్తుందని కలెక్టర్ అన్నారు. సింగుపురం ప్రాథమిక పాఠశాల డెమో పాఠశాలగా రూపొందించడం వలన ఇతర పాఠశాలలను అభివృద్ధి పరచుటకు చక్కని వేదికగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్రకళ, ఇడబ్య్లుఐడిసి కార్యనిర్వాహక ఇంజనీరు కె.భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు. 

సింగుపురం

2020-09-04 21:23:26

గడువులోగా గరుడ వారధి నిర్మాణం పూర్తికావాలి...

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుగున్న గరుడవారధి పనులను సత్వరమే పూర్తిచేయాలని కమిషనర్ గిరీష ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనులు ఎక్కువ కాలం చేయడం వాహన చోదకులకు చాలా ఇబ్బందులుంటాయని, వాటిని నిరోధించాలంటే పనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం కరకంబాడీ మార్గంలోని బొంతాలమ్మ ఆలయం సమీపంలో జరుగుతున్న వినాయకసాగర్ నిర్మాణ పనులను కూడా కమిషనర్ పరిశీలించారు. అక్కడి కాంట్రాక్టర్లతో మాట్లాడి పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకు న్నారు. గడువులోపల కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను పూర్తిచేయాలని, అదే సమయంలో నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా చూడాలన్నారు. పనులు పూర్తయిన తరువాత ఖచ్చితంగా విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

తిరుపతి

2020-09-04 18:39:48

అమృత్ పనులు వేగంగా పూర్తిచేయాలి...కమిషనర్ గిరీష

తిరుపతి నగరపాలక పరిధిలో జరుగుతున్న అమృత్ పథకం పనులు వేగవంతం గా పూర్తి చేయాలని నగరపాలక సంస్త కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,  పనుల్లో ఆలస్యం చేస్తే కాంట్రాక్టు రద్దు చేస్తామని కమిషనర్ గిరీషా  కాంట్రాక్టర్లను హెచ్చరించారు.  నగరప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు నీటి సరపరాకై అమృత్ పథకంలో పైపులైన్, ట్యాంకుల నిర్మాణం చేస్తున్నామన్నారు. ఈ పనుల్లో ఆలస్యం చేయడంవలన ప్రజలకు మంచినీటి కష్టాలు తీరకపోగా పెరుగుతాయన్నారు.  సకాలంలో కాంట్రా క్టర్లకు బిల్లులు మంజూరు చేస్తున్నా,  ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించారు. చిన్న చిన్న సమస్యలు చూపుతూ పనులు ఆలస్యం చేస్తే సహించే ది లేదని అధికారులను హెచ్చరించారు. అన్ని చోట్లా ట్యాంకులకు నీటి సరఫరా చేస్తున్నామన్న కమిషనర్ పెండింగ్ పైప్ లైన్ పనులు   వారంలోపు పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా త్రాగునీటి కొత్త కనెక్షన్లు కావాలంటే వారికి ఇవ్వాలన్నారు. కొన్ని చోట్ల యూ.డి.జి. పైప్ లైన్ అడ్డుగా ఉండడంతో వాటర్ పైప్ లైన్ ఆలస్యం అవుతోందని కాంట్రాక్టర్లు చెప్పారు. ఏది ఏమైనా పనులు సర్దుబాటు చేసుకుని పనులు పూర్తి చేయలన్నారు. పైప్ లైన్ ఆలస్యం వలన రాజీవ్ నగర్ లో సి.సి.రోడ్ పనులు ఆలస్యం అవుతున్నాయని అధికారులు చెప్పడంతో ఎక్కువ మందిని పెట్టి పనులు పూర్తి చేయాలని కమిషనర్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. పైప్ లైన్ నిర్మాణం పూర్తి అయిన వెంటనే అక్కడ గుంతలు పూడ్చి వేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్.ఈ. చంద్రశేఖర్, ఎం.ఈ.2 వెంకట్రామిరెడ్డి, డి.ఈ లు విజయకుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రఘుకుమార్, గోమతి, రవీంద్ర రెడ్డి, ఏ,ఈ. లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Tirupati

2020-09-04 14:18:15

2016లో ఆక్రమణ..నేడు అపార్ట్ మెంట్ల నిర్మాణం..అయినా

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9.27 ఎకరాల ప్రభుత్వ భూమి దర్జాగా 2016లో ఖబ్జా చేశారు. ఇపుడు అంతస్తుల మీద అంతస్తులు అనధికారికంగా నిర్మించేస్తు న్నా రు. కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వం రక్షించే ప్రయంత్నం చేయలేదు అంటున్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు. మధురవాడ సర్వే నెం 367 లో గల సుమారు 100 కోట్ల విలువైన 9.27 ఏకరముల ప్రభుత్వ భూమిలో దర్జాగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిచిన ఆక్రమణ దారులను తక్షణమే చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమండ్ చేస్తున్నారు. అంతే కాదు..  2016 ఆగష్టు నెలలో ఈభూమి అన్యాక్రాంతం జరిగిన అంశం గుర్తించి సీపీఐ తరుపున అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ చేసిన ఫిర్యాదు అంశాన్ని తాజాగా జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ కి చేసిన ఫిర్యాదులో పేర్కొని మెయిల్  సమర్పించినట్టు ఆయన మీడియాకి చెప్పారు. అభూమి ప్రభుత్వ భూమని రెవిన్యూ రికార్డులను మార్చి,అందులో నిర్మిస్తున్న భవనాలు అక్రమంగా నిర్మిస్తున్న వేననితేల్చి,ఆ భవనాలు నిర్మాణానికి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీచేసి నాలుగు సం"గడిచినప్పటికి నేటికి అవి కార్యరూపం దాల్చకపోవడం అవినీతేనని ఆరోపించారు. ఇటువంటి అంశములు వెలుగులోకి రాగానే అధికారులు కొద్దిగా హడావుడి చేసి వదిలివేయడం చాలా దారుణమన్నారు. అంతేకాదు గడిచిన నాలుగేళ్లుగా ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడానికి కారణాలపై కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని పైడిరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం లో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుచేస్తున్న తరుణంలో తక్షణమే ఆ విలువైన ప్రజా ఆస్థిని  స్వాధీనం చేసుకొని ప్రభుత్వ,ప్రజా అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు...

Madhurawada

2020-09-04 13:42:09

లక్షణం ఉంటే అది ఖచ్చితంగా కరోనానే...కలెక్టర్

కరోనా లక్షణాలు ఉన్నప్పటికి కరోనా అవునా ? కాదా ? అనే ఆలోచన వద్దని జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రజలను కోరారు. కరోనా లక్షణాలు కనిపించగానే చికిత్సకు రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా శుక్ర వారం ప్రజలను ఉద్దేశించి ఒక సందేశాన్ని విడుదల చేస్తూ జిల్లా కోవిడ్ ఆస్పత్రుల్లో అన్ని సదుపా యాలు కల్పించామని అన్నారు. ప్రస్తుతం అత్యంత కీలక సమయంలో ఉన్నామని, రానున్న నెలన్నర రోజులు జిల్లాకు మరింత కీలకమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో రోజుకు 8 వందల నుండి వెయ్యి కేసులు వరకు నమోదు అవుతున్నాయని ఆయన చెప్పారు. ప్రజలందరూ పూర్తిగా అప్రమత్తంగా ఉండి వైరస్ నివారణకు సహకరించాలని కోరారు. శ్రీకాకుళం పట్టణంలో రోజుకు కనీసం రెండు వందల కేసులు నమోదు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఇతర పట్టణాల్లో కూడా పరీక్షలు అధికంగా చేయుటకు నిర్ణయించామని చెప్పారు. జ్వరం, ఆయాసం వంటి ప్రాథమిక లక్షణాలు ఉన్న వాళ్ళు కరోనా కాదు అనే ధీమాతో ఉంటున్నారని, పరిస్ధితులను వాలంటీరుకు వివరింగా తెలియజేసి సరైన చికిత్సను సరైన సమయంలో పొందాలని ఆయన కోరారు. 94 శాతం కంటే తక్కువ ఆక్సిజన్, ఆయాసం, వరుసగా మూడు రోజుల పాటు జ్వరం ఉన్న వారు చికిత్స పొందుటకు ఆలస్యం చేయరాదని ఆయన సూచించారు. సకాలంలో ఆస్పత్రిలో చేరడం వలన ఖచ్చితంగా ప్రాణాలు కాపాడగలమని వైద్యులు తెలియజేస్తున్నారని కలెక్టర్ వివరించారు. చిన్న పాటి లక్షణాలు ఉన్న వారికి చికిత్సను అందించుటకు కోవిడ్ కేర్ కేంద్రాల్లో 5 వేల పడకలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కోవిడ్ ఆసుపత్రుల్లో మంచి వైద్యం అందిస్తున్నామని, నిపుణులైన వైద్యులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మంచి మందులతోపాటు ప్లాస్మా థెరాఫీని కూడా అందిస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. జిల్లాలో 73 మందికి ప్లాస్మా థెరాఫీ అందించామని, వాళ్ళందరి ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన చెప్పారు. జిల్లాలో కరోనా వ్యాప్తి నిరోధానికి మొదటి నుండి అనేక చర్యలు చేపట్టిన సంగతి ఆయన గుర్తు చేశారు. కంటైన్మెంటు జోన్లను పక్కాగా నిర్వహించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.  శ్రీకాకుళం పట్టణంలో 66 కంటైన్మెంటు జోన్లు ఉన్నాయని ఆయన తెలియజేస్తూ కంటైన్మెంటు జోన్లలో మొబైల్ వ్యాన్ల ద్వారా నిత్యావసర సరుకులను అందిస్తున్నట్లు చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో పరీక్షలు నిర్వహించుటకు అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఇంటివద్దకే పరిమితం కావాలని ఆయన సూచించారు. అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని ఆయన పిలుపునిచ్చారు. ఇంట్లో ఉన్న పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ  వారికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించాలని, వారితో మాట్లాడినప్పుడు మాస్కు విధిగా ఉపయోగించాలని సూచించారు. పెద్దలు క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ఆయన అన్నారు. ప్రజల జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ఇతర రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్వచ్చంద సంస్ధల సహకారంతో ఉచితంగా ఫేస్ షీల్డులు పంపిణీ చేయుటకు చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. ఫేష్ షీల్డు ఉపయోగించడం వలన 80 శాతం వరకు కరోనా వైరస్ వ్యాప్తి నుండి సురక్షితంగా ఉండవచ్చని సర్వేలు సూచిస్తున్నట్లు కలెక్టర్ నివాస్ చెప్పారు.  వ్యాపార సంస్థల నిర్వాహకులు, ఆటో రిక్షావారు కరోనా వైరస్ కు హై రిస్కు కలిగి ఉంటారని అన్నారు. తమ వద్దకు వచ్చే కస్టమర్లు విధిగా మాస్కు ధరించేటట్లు చూడాలని ఆయన సూచించారు. జిల్లా లో వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ కరోనా వైరస్ నిర్మూలనకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.

Srikakulam

2020-09-04 13:26:15

వెబ్ సైట్ లో పారామెడికల్ ఉద్యోగాల మెరిట్ లిస్టు.. dmho

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో స్టాప్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టుల పైనల్ మెరిట్ లిస్ట్ జాబితా 3-09-2020 తేదీన http://Visakhapatnam.nic.in వెబ్ సైటు నందు పొందు పరచినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారిణి డాక్టర్ విజయలక్ష్మి  తెలియజేయశారు. అభ్యర్థులు జాబితాను పరిశీలించుకొని, తమ అభ్యంతరాలు ఏమైనా ఉన్నచో 04-09-2020 సాయంత్రం 5.00 గంటల లోపు  రాత పూర్వకముగా, తగు డాక్యుమెంట్ ఆధారాలతో విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో తెలియజేయాలన్నారు. మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు పరిశీలిస్తామన్నడీఎంహెచ్ఓ.. ఇతర అభ్యర్థుల మెరిట్, సర్విస్ సర్టిఫికేట్, దృవ పత్రాల విషయాలలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో తమ దృష్టికి తీసుకు వచ్చినచో పరిశీలనకు దస్త్రాలను చూపిస్తామన్నారు. జిల్లా కలెక్టరు ఉత్తర్వుల మేరకు మొత్తం ప్రక్రియ నియమ నిబంధనలు అనుసరించి మాత్రమే నిర్వహించామన్నారు. 

Visakhapatnam

2020-09-03 19:39:54

కెజిహెచ్ సీఎస్ఆర్ బ్లాకులో కోవిడ్ రోగులకు వసతి..

విశాఖ  కె.జి.హెచ్.లో సి.యస్.ఆర్. బ్లాక్ కోవిడ్-19 పేషెంట్లకు రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నదని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించా రు.కె. జి.హెచ్. లో కొత్తగా నిర్మించిన సి.యస్.ఆర్. బ్లాక్ ను గురువారం ఆయన సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.  బ్లాక్ అంతటినీ క్షణ్ణంగా పరిశీలించారు.  150 ఐ.సి. యు. పడకలతో, ఆక్సిజన్ ఉన్న 500 పడకలతో రెండు మూడు రోజుల్లో కోవిడ్-19 పేషెంట్లకు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.  మూడు ఆపరేషన్ థియే టర్లు, ఆ బ్లాక్ లోనే ఒక ల్యాబ్, పేషెంట్ల అటెండెంట్లకు పేషెంట్ల సమాచారం తెలియజేసేందుకు ఒక సమాచార కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రతీ రూంలో ను సి.సి. కెమెరా ఉంటుందని, దీనిని మోనిటరింగ్ చేయడానికి ఒక రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కల్పించిన సౌకర్యాలు ఎంత ముఖ్యమో సర్వీసు కూడా అంతే ముఖ్యమని వైద్యులను ఆదేశించారు.  కె.జి.హెచ్. ఒక చారిత్రాత్మకత గల ఆసుపత్రి అని, కె.జి.హెచ్.  రాష్ట్రంలో నంబర్ ఒన్ లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మరియు కె.జి.హెచ్ పర్యవేక్షకులు డా. పి.వి. సుధాకర్,  ఎపిఎంఐడిసి ఇఇ ఉమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

కెజిహెచ్

2020-09-03 17:27:13