1 ENS Live Breaking News

ఓటరు నమోదు, సవరణ వినియోగంచుకోవాలి

భారత ఎన్నికల కమిషన్  ప్రత్యేక ముమ్మర సవరణ -2023 ను ప్రారంభించి యున్నందున ఓటర్లు స్వచ్ఛందంగా గానీ, బూత్ లెవల్ అధికారుల ద్వారా గానీ ఓటు నమోదు, సవరణ, పేరు చిరునామా మార్పు లకు సంబంధించి ధరఖాస్తు చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్  డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఓటు నమోదు , మార్పులు చేర్పులు , తొలగింపులకు ww.nvsp.in మరియు www.voterportal.eci.in లేదా voters app  ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా లోని  ఓటర్లు ఈ క్రింది సూచనల ప్రకారం తెలుసుకుని బూత్ లెవెల్ అధికారులకు సంప్రదించి  తగిన మార్పులు చేర్పులు కోసం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాధవీలత కోరారు.

మీ ఓటర్ కార్డును మీ యొక్క ఆధార్ కార్డ్ కు లింకు చేయుట కొరకు , ప్రతి ఓటరుకు తన ఆధార్ కార్డ్ ను ఫారం- 6 బి ద్వారా అనుసంధానం చేయవలసి యున్నదని తెలియచేశారు. ఇందు కోసం మీ ప్రాంతం లోని బూత్ లెవెల్ అధికారులకు " GARUDA APP " ను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ ఆగస్ట్ 1 వ తేదీన కేంద్ర ఎన్నికల కమీషన్ వారు ప్రవేశపెట్టి యున్నారు.  ఎవరికి వారు  ఓటర్లు స్వచ్ఛందంగా www.nvsp.in , www.voterportal.eci.in లేదా voters app నందు ఆధార్ లింకు చేసుకొనే వెసులు బాటు కూడా అందుబాటులో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.


కొత్త ఓటర్లు నమోదు కొరకు  01-01-2023 నాటికి 18 సం॥లు నిండే ప్రతి పౌరుడు ఓటు నమోదు చేసుకొనుటకు అవకాశం ఫామ్. 6 ద్వారా కల్పిస్తున్నట్లు తెలిపారు.  ఓటు నమోదు ప్రక్రియను నిరంతరం కొనసాగే విధంగా ఏడాదికి నాలుగు సార్లు నమోదుకు అవకాశం కలుగ చెయ్యడం జరుగుతోందని పేర్కొన్నారు.  జనవరి 1 , ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 సం.ములు నిండిన వారికి కూడా ముందస్తుగా ఓటు నమోదు కొరకు అవకాశం తద్వారా కల్పించినట్లు తెలిపారు. ఎన్ ఆర్ ఐ ఓటర్లు నమోదు కొరకు ఫారం 6బి , ఓటు తొలగించుట కొరకు ఫారం 7,  ఓటర్ కార్డు నందు మార్పుల కొరకు ఫారం 8 ( ఉదా : పేరు , లింగం , వయస్సు మరియు బంధుత్వంలో గల మార్పుల కొరకు ) నివాసం మార్పు కొరకు ( అసెంబ్లీ నియోజకవర్గం పరిధి లోపల / పరిధి దాటి)  ప్రత్యామ్నాయ ( డూప్లికేట్ ) ఓటర్ కార్డ్ కొరకు ఫారం 8 ని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు.  

Rajamahendravaram

2022-09-03 06:29:51

రుణాల మంజూరు వేగ‌వంతం చేయాలి

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రాధాన్య సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి బ్యాంకు లింకేజీ రుణాల మంజూరు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు, వివిధ బ్యాంకుల ప్ర‌తినిధుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా సూచించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో టిడ్కో, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు, జ‌గ‌న‌న్న తోడు కార్య‌క్ర‌మాలకు బ్యాంకు లింకేజీ రుణాల మంజూరుపై క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు, బ్యాంక‌ర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. బ్యాంకుల వారీగా రుణ మంజూరుపై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ల‌బ్ధిదారుల‌కు రుణాలు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టి అవ‌స‌ర‌మైన డాక్యుమెంటేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేసి.. రుణాలు మంజూర‌య్యేలా చూడాల‌న్నారు.

 ఏపీ టిడ్కో హౌసింగ్‌కు సంబంధించి లబ్ధిదారులకు  బ్యాంకు రుణాల మంజూరు, రిజిస్ట్రేషన్ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేసి త్వరితగతిన లబ్ధిదారులకు గృహాలు అప్పగించే విధంగా అధికారులు కృషిచేయాలన్నారు. కాకినాడ‌, పెద్దాపురం, పిఠాపురం, సామ‌ర్ల‌కోట ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ప‌రిధిలో 5,064 ల‌బ్ధిదారుల‌కు గాను 2,534 గృహాలకు రూ. 66.54 కోట్ల రుణాలు అందించ‌డం జ‌రిగింద‌ని.. మిగిలిన గృహాల‌కు కూడా రుణ మంజూరు ప్ర‌క్రియ‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని సూచించారు. అదే విధంగా జ‌గ‌న‌న్న తోడు కింద స‌వ‌రించిన ల‌క్ష్యాల‌కు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,995; ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 5,906 మంది చిరు వ్యాపారుల‌కు రూ. 10 వేలు చొప్పున రుణాలు అందించాల్సి ఉంటుంద‌న్నారు. 

అదే విధంగా న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల ల‌బ్ధిదారుల‌కు రూ. 35 వేల చొప్పున అద‌న‌పు ఎస్‌హెచ్‌జీ లింకేజీ బ్యాంకు రుణాల మంజూరును కూడా వేగవంతం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు.. బ్యాంక‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ శ‌త శాతం ల‌క్ష్యాలను చేరుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. స‌మావేశంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీర‌మ‌ణి, మెప్మా పీడీ బి.ప్రియంవ‌ద‌, హౌసింగ్ పీడీ బి.సుధాక‌ర్ ప‌ట్నాయ‌క్‌, ఎల్‌డీఎం సీహెచ్ ఎస్‌వీ ప్ర‌సాద్‌, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ అద‌న‌పు క‌మిష‌న‌ర్ సీహెచ్ నాగ‌న‌రసింహారావు, డీఎల్‌డీవో పి.నారాయ‌ణ‌మూర్తి, వివిధ బ్యాంకుల అధికారులు తదిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-09-02 16:26:03

స్వమిత్వా సర్వే జిల్లాలో త్వరగా పూర్తిచేయాలి

పశ్చిమగోదావరి జిల్లాలో స్వమిత్వా కింద చేపట్టిన సర్వే తరగతి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఈ ఓ పి ఆర్ డి లను,  సర్వేయర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుండి స్వమిత్య , జగనన్న స్వచ్చ సంకల్పం  పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలోని 16 మండలాల్లోని  16 గ్రామాలలో  స్వమిత్య కార్యక్రమం చేపట్టడం జరరిగిందని దీనిని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు. ఈ ఓ పి ఆర్ డి లకు వచ్చే వారంలో స్వమిత్య పై పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది కలెక్టరు తెలిపారు. స్వమిత్వపై ఇచ్చిన మార్గదర్శకాలు అన్ని ఈవోపీఆర్డీలు సర్వేయర్లు క్షుణ్ణంగా చదవాలని కలెక్టరు ఆదేశించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద అన్ని గ్రామాలలో అప్రోచ్ రోడ్లను  పరిశుభ్రం చేయాలని కలెక్టర్ సూచించారు. 

గ్రామాలలో చెత్త సేకరణ సక్రమంగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అన్ని గ్రామాల్లో ఉన్న ఎస్ డబ్ల్యూ పి సిలో అన్ని  కంపోస్ట్ తొట్లు ప్రాసెసింగ్ జరగాలని ఆమె ఆదేశించారు.  జిల్లాలోని అన్ని గ్రామాలు పరిశుభ్రత తో ఉండాలని జిల్లా కలెక్టరు  పి.ప్రశాంతి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  డిపిఓ యం నాగలత ,  ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జాషువా, ఈఓపిఆర్డీలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.


Bhimavaram

2022-09-02 14:18:50

ఎక్స్ లెన్స్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని   పర్యాటక ఎక్స్ లెన్స్ అవార్డులను అందించనున్నట్లు జిల్లా పర్యాటక శాఖాధికారి జి. దాసు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పర్యాటక ఎక్స్ లెన్స్ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దాసు తెలిపారు. పర్యాటకరంగంతో వ్యక్తిగత, సంస్థాగతపరమైన అంశాలకు చెందిన 40 విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, ఎంపికైన వారికి ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజు పర్యా టకశాఖ ఎండీ కన్నబాబు చేతుల మీదుగా అవార్డులను అందజేయనున్నట్లు వివరించారు. ఔత్సాహి కులు సెప్టెంబరు 10లోపు తమ దరఖాస్తులను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని పూరించి ఏపీటీఎ కార్యాలయం, విజయవాడవారికి అందజే యాలని వివరించారు. పూర్తి వివరాల కోసం 6309942028, నంబర్ కానీ www.aptourism.gov.in వెబ్సైట్ను కానీ సందర్శిం చాలని సూచించారు.

Paderu

2022-09-02 08:26:39

ఉచితంగా గ్రహణం మొర్రి శస్త్రచికిత్సలు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో  నడుస్తున్న బర్డ్ ఆసుపత్రిలో  గ్రహణమొర్రి ( Cleft Lip and Cleft Palate surgery) శస్త్రచికిత్స అవసరమయ్యే పేద పిల్లలకు  ఉచితంగా చేస్తామని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్  రెడ్డెప్పరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు .
రోజు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల  వరకు ఓపి లో పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. అపాయింట్‌మెంట్‌, విచారణల కోసం  7337318107 నంబర్లో  సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రహణం మొర్రి ఉన్న చిన్నారుల తల్లిండ్రులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో ఆయన కోరారు.

Tirupati

2022-09-02 06:45:46

పిఠాపురంలో జిల్లాస్థాయి స్పందన

జిల్లా స్ధాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5న  పిఠాపురం లోని రెడ్డి రాజా కళ్యాణ మండపంలో  ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలియజేసారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్  విజ్ఞాపనలను పిఠాపురంలో   స్వీకరిస్తామని కాకినాడ జిల్లాకు చెందిన  అర్జీదారులు అందరూ ఈ అంశాన్ని  గమనించి సెప్టెంబర్ 5వ తేదీన తమ అర్జీలను పిఠాపురంలో నిర్వహించే  స్పందన కార్యక్రమంలో సమర్పించాలని ఆమె కోరారు. అలాగే వివిధ శాఖల జిల్లా అధికారులు అందరూ  సెప్టెంబర్ 5వ తేదీ సోమవారం ఉదయం 9-30 గంటలకే పిఠాపురంలో నిర్వహించే స్పందన గ్రివెన్స్ సెల్ కార్యక్రమానికి  విధిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.



Kakinada

2022-09-01 16:58:07

స్కిల్ హబ్ లలో ఉచిత ఉపాధి శిక్షణలు

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాడేరు  ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలొ స్కిల్ హబ్ లు ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ జిల్లా అధికారి డా.పి .రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్కిల్ హబ్ ల ఏర్పాటులో భాగంగా పాడేరు స్కిల్ హబ్ లో 30 మంది నిరుద్యోగ యువతకు డాటా ఎంట్రీ ఆపరేటర్ (కంప్యూటర్) కోర్సులో, రంపచోడవరం  స్కిల్ హబ్ లో 30 మంది యువతకు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సులో  ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.  కంప్యూటర్ కోర్సులో  శిక్షణకు డిగ్రీ పాసై, 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన యువతీ యువకులు, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సులో శిక్షణకు పది, ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన యువతీ,యువకులు అర్హులని తెలిపారు. 

ఈ నెల ఆ 12 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ శిక్షణకు ఆసక్తి, అర్హతలు గల యువతీ యువకులు ఈ నెల ఐదవ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.  జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సులో శిక్షణ పొందగోరు వారు  ఈ నెల ఐదవ తేదీ లోగా 81796-13081, 83318-90681 నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, కంప్యూటర్ కోర్సులో శిక్షణ పొందగోరు వారు  ఈ నెల ఐదవ తేదీ లోగా 90147-67230, 63026-36174 నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని డా. రోహిణి వివవరించారు. ఈ శిక్షణ హబ్ లలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. 

Paderu

2022-09-01 13:49:25

5నెలల్లోగా నాడు-నేడు పనులు పూర్తికావాలి

శ్రీకాకుళం జిల్లాల్లో రెండవ విడత క్రింద జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనులన్నీ రానున్న ఐదు మాసాల్లోగా పూర్తిచేసి, వచ్చే ఏడాదికి విద్యార్థులకు అందించాలని పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నాడు-నేడు, టి.ఎం.ఎఫ్, ఎస్.ఎం.ఎఫ్, ఆర్.ఓ ప్లాంట్స్, బ్యాంక్ ఖాతాల ప్రారంభం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నాడు-నేడు, టి.ఎం.ఎఫ్ ( టాయిలెట్ మెయింట్ నెన్స్ ఫండ్ ) ఎస్.ఎం.ఎఫ్ ( స్కూల్ మెయింట్ నెన్స్ ఫండ్ ),ఆర్ఓ ప్లాంట్స్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. కావున నాడు-నేడులో చేపట్టిన పాఠశాలలన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

 పాఠశాలల్లో ఉండే అన్ని మౌలిక వసతులకు అవసరమైన అన్ని సరుకుల కొనుగోలుకు, వాచ్ మెన్ ఏర్పాటుకు ఎస్.ఎం.ఎఫ్ నిధులను వినియోగించుకోవచ్చని సూచించారు. అలాగే మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు టి.ఎం.ఎఫ్ నిధులను వినియోగించుకోవచ్చని చెప్పారు. రెండవ విడతలో నిర్మిస్తున్న పాఠశాలలకు, కళాశాలలకు అవసరమైన సిమెంట్, ఇసుక, ఐరన్ తదితర సామగ్రిని సిద్ధం చేసుకోవాలని, పనులు జాప్యం కాకుండా కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. నిర్మాణం అనంతరం వాటికి అవసరమైన గ్రీన్ బోర్డ్స్,ఫ్యాన్స్, ఎలక్ట్రిఫికేషన్, తాగునీరు, తదితర అంశాలపై చర్యలు చేపట్టాలని అన్నారు.

నాడు నేడు క్రింద చేపడుతున్న జూనియర్ కళాశాలల్లో పనులు శరవేగంగా పూర్తికావాలని, 10వ తరగతి విద్యార్ధులందరూ రానున్న ఏడాదికి కళాశాలల్లో చేరనున్నందున, వారిని దృష్టిలో ఉంచుకొని పనులు పూర్తిచేయాలని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్మాణాల కోసం మంజూరుచేసే నిధుల విషయమై రాష్ట్ర వ్యాప్తంగా 70 కళాశాలల ప్రిన్సిపాల్స్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు ఇచ్చారని, ఇది బాధ్యత రాహిత్యంగా గుర్తిస్తామన్నారు. అటువంటి వారందరూ తక్షణమే కరంట్ అకౌంట్ తెరచి శుక్రవారం నాటికి అందజేయాలన్నారు. పరిపాలన పరమైన ఉత్తర్వులు ఇవ్వనివాటికి తక్షణమే ఉత్తర్వులు మంజూరుచేసి పనులు ప్రారంభించాలని అన్నారు. పాఠశాలలకు అవసరమైన ఎలెక్ట్రిఫికేషన్ పనులు పూర్తిచేయాలన్నారు.

5న జరగనున్న గురు పూజోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగా జిల్లాస్థాయిలో ఈ వేడుకలను ప్రతి పాఠశాలలో నిర్వహించాలన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం ఉంటుందని, ఉత్తమ ఉపాధ్యాయుల వివరాలను జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలతో సమర్పించాలన్నారు. క్లీన్ ఇండియా కాంపెయిన్ లో భాగంగా సెప్టెంబర్ 1నుండి 15వరకు స్వచ్ఛతా బట్వాడా కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో నిర్వహించాలని, చివరి రోజున ధ్రువీకరణ పత్రాలు పంపిణీ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అన్ని శాఖల సమన్వయంతో రోజుకు ఒక కార్యక్రమంతో 15 రకాల కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు.

ఉపాధ్యాయులకు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాలన్నారు.జెబికె యాప్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని, యాప్ లో ఉండే సాంకేతిక లోపాలను ఇప్పటికే సరిదిద్దామని చెప్పారు. కావున విధిగా ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. రానున్న ఐదు రోజుల్లో ఆయా పాఠశాలలో ఉండే సమస్యలను పరిష్కరించుకొని బయోమెట్రిక్ అటెండెన్స్ ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. బయోమెట్రిక్ హాజరు ఉంటేనే అమ్మఒడి పథకం వర్తిస్తుందని, ఈ విషయాన్ని అసోసియేషన్లు, తల్లితండ్రులతో సమావేశం ఏర్పాటుచేసి వివరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రయివేటు పాఠశాలలకు ఇది వర్తిస్తుందని, విద్యార్థులు ఎక్కడ ఉన్నప్పటికీ హాజరు వేసుకునే వెసులుబాటు ఉందని, అయితే హాజరు తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.

8 జిల్లాల్లోని ఏ.పి.మోడల్ స్కూల్స్ లో అవసరమైన టీచర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని చెప్పారు. జె.సిల సహకారంతో అర్హతే ప్రామాణికంగా ఈ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు పెండింగులో ఉన్న 12 పాఠశాలలకు గాను ఐదుగురు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల  ఖాతాల్లో నగదు జమ అయినందున పనులు ప్రారంభించినట్లు చెప్పారు. మరో 7గురు ప్రధానోపాధ్యాయులు ఖాతాల్లో  నగదు జమకాబడలేదని వివరించారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డా.జయప్రకాష్, జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-01 13:42:48

భవన నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి

భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ కోన శశిధర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.   రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలు, వై.యస్.ఆర్. హెల్త్ క్లినిక్స్, జగనన్న స్వచ్ఛ సంకల్పం, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ప్రాధాన్యత భవన నిర్మాణాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. సిమెంటు ఎంత అవసరమో చెప్పాలని, అదనపు సిమెంట్ ఎంత అవసరమో తెలియాలన్నారు.  జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ భవనాలకు సంబంధించి కొన్ని కోర్టు కేసులు ఉన్నందు వలన ఆలస్యం జరుగుతుందని కలెక్టర్ వివరించగా

 వేరే స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని కమీషనర్ కోన శశిధర్ చెప్పగా ఇప్పటికే కొంత వరకు నిర్మాణాలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు.   జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా పరిషత్ సీఈవో వెంకటరామన్, డిపిఓ రవి కుమార్, పంచాయతీ రాజ్ ఎస్ఈ సత్యనారాయణ మూర్తి, డ్వామా పీడీ చిట్టిరాజు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-01 13:37:45

అక్టోబర్ 2 నాటికి భూ హక్కు పత్రాలు

అక్టోబర్ 2 నాటికి భూ హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని సిసిఎల్ఎ కమీషనర్ సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  జగనన్న శాశ్వత భూ హక్కు కు సంబంధించిన భూ రీ సర్వే, మ్యుటేషన్లపై జిల్లా కలెక్టర్లుతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వేకు సంబంధించి పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాకు 350 గ్రామాల్లో రీ సర్వే లక్ష్యం కాగా ఇంత వరకు 236 గ్రామంల్లో 80 వేల 617 ఎకరాలు రీ సర్వే పూర్తి అయిందని వివరించారు.  జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, సర్వే శాఖ ఎడి ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-01 13:32:25

తిరుమలో ఉప విచారణ కేంద్రం పరిశీలన

తిరుమ‌ల‌లో ఆధునీకరించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్ధిన ఎస్ఎంసి ఉప విచార‌ణ కేంద్రాన్నిగురువారం  టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు సందర్శించే తిరుమలలోని మరో 19  వ‌స‌తి ఉప విచారణ కార్యాలయాలను కూడా ఇదే విధంగా త్వ‌రిత గ‌తిన ఆధునీక‌రించాల‌ని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.  ప్రారంభోత్సవం త‌రువాత‌ కొత్త కౌంటర్ల ద్వారా భక్తులకు గదులు కేటాయించారు. నూత‌నంగా ఆధునీక‌రించిన ఎస్ఎంసి ఉప విచార‌ణ కేంద్రంలో మూడు గ‌దులు కేటాయింపు కౌంటర్లు, 25 మంది యాత్రికులు కుర్చునే విధంగా  ఏర్పాటు చేశారు. భక్తులకు మ‌రింత  ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే దేవతా చిత్రాలు, "శ్రీనివాస కళ్యాణం" యొక్క భారీ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న‌ది.  

     ఈ కార్య‌క్ర‌మంలో ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఈవో(ఆర్‌-2)  భాస్కర్, ఇఇలు  సురేందర్ రెడ్డి,  జగన్మోహన్ రెడ్డి, డిఇ (ఎల‌క్ట్రిక‌ల్‌)  రవిశంకర్ రెడ్డి, విజివోలు  బాలిరెడ్డి,  మనోహర్, రిసెప్ష‌న్  ఏఈవో రాజేంద్ర‌ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2022-09-01 13:10:01

ఇసుక నిల్వల ప్రాంతాల‌ను గుర్తించాలి

కాకినాడ జిల్లాలో ఇసుక త‌వ్వ‌కాల‌కు అనువైన ప్రాంతాల‌ను గుర్తించి, వారంలోగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ వివేకానంద‌హాల్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న జిల్లాస్థాయి ఇసుక క‌మిటీ (డీఎల్‌ఎస్సీ), జిల్లా ఖ‌నిజ ఫౌండేష‌న్ (డీఎంఎఫ్‌) స‌మావేశాలు జ‌రిగాయి. కాకినాడ ఎంపీ వంగా గీత‌, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ, వివిధ శాఖ‌ల అధికారులు హాజ‌రైన ఈ స‌మావేశంలో జిల్లాలో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ఇసుక‌, ప్ర‌భుత్వ ప్రాధాన్య భ‌వ‌న నిర్మాణాలు, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం అమ‌లుకు అవ‌స‌ర‌మైన ఇసుక‌, ఖ‌నిజ ఫౌండేష‌న్ కింద చేప‌ట్టిన ప‌నుల్లో పురోగ‌తి త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రీచ్‌ల గుర్తింపున‌కు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల బృందం క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు జ‌ర‌పాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం జిల్లాలో ఆరు డిపోల ప‌రిధిలో 2.38 ల‌క్ష‌ల ట‌న్నుల ఇసుక అందుబాటులో ఉంద‌ని.. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు; ఆర్‌బీకేలు త‌దిత‌ర ప్ర‌భుత్వ శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన ఇసుక‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని జేపీ ప‌వ‌ర్ వెంచ‌ర్స్ ప్రైవేటు లిమిటెడ్ ప్ర‌తినిధుల‌కు సూచించారు.

 అదే విధంగా జిల్లాలో జిల్లా ఖనిజ ఫౌండేష‌న్ (డీఎంఎఫ్‌) కింద మంజూరైన పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని స‌ర్వ శిక్షా అభియాన్‌; ర‌హ‌దారులు, భ‌వ‌నాలు; ఇరిగేష‌న్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. జిల్లాలో తొమ్మిది మండ‌లాల ప‌రిధిలో మైనింగ్ కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయ‌ని.. ఈ కార్య‌క‌లాపాల‌తో ప్ర‌త్య‌క్షంగా (10 కి.మీ. ప‌రిధి), ప‌రోక్షంగా (10-25 కి.మీ. ప‌రిధి) ప్ర‌భావిత‌మ‌వుతున్న గ్రామాలు/ఆవాసాల్లో డీఎంఎఫ్ నిధుల‌తో ప‌లు అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో రూ. 81 ల‌క్ష‌ల‌తో ప‌లు అంగ‌న్‌వాడీ భ‌వ‌నాల ప‌నుల‌కు, తొండంగి మండ‌లంలో రూ. 19 ల‌క్ష‌ల‌తో అయిదు అభివృద్ధి ప‌నుల‌కు తాజా స‌మావేశం ఆమోదం తెలిపిన‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, కాకినాడ ఆర్‌డీవో బీవీ ర‌మ‌ణ‌, మైన్స్ అండ్ జియాల‌జీ డీడీ ఇ.నరసింహారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీర‌మ‌ణి, ఆర్ అండ్ బీ ఎస్ఈ కె.హ‌రిప్ర‌సాద్‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-30 13:30:41

ప్రజలకు గణనాధుడి ఆశీస్సులుండాలి

నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ ప్రతిష్ట, పూజా కార్యక్రమాల్లో నగర మేయర్ పొట్లూరి స్రవంతి, కమిషనర్ హరిత మంగళవారం సాయంత్రం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రజలు చేపట్టిన కార్యక్రమాలు విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా కార్పొరేషన్ లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించడం శుభ పరిణామం అని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల నడుమ వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కోరుతూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వాసంతి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

Nellore

2022-08-30 13:23:14

మత్స్యకార యువత పథకాలు వినియోగించుకోవాలి..డిడి నిర్మలకుమారి

మత్స్యకారుల్లోని ఔత్సాహిక యువత ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మల కుమారి పిలుపు నిచ్చారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ సమీకృత ఇరిగేషన్, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్ 2022-23లో భాగంగా  స్థానిక నెహ్రు యువ కేంద్రం ఆవరణలో మత్స్య  శాఖ ఉద్యోగులకు మత్స్య కార్యకలాపాలపై అవగాహనా కార్యక్రమం సపోర్టింగ్ ఆర్గనైజేషన్ IRPWA ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్య శాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలా కుమారి మాట్లాడుతూ,  మత్స్య  శాఖ ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వంచే అందజేయబడుతున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. అంతేకాకుండా మత్స్యకారులకు, రైతులకు, మత్స్యకార సంఘాల సభ్యులకు, ఔత్సాహికులకు ఆ పథకాలను వివరించాలన్నారు. తద్వారా ఔత్సాహిక యువత ముందుకు రావడానికి ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు. 

ముఖ్యంగా ఫిష్  ఆంధ్ర షాపుల నిర్వహణ ద్వారా స్థానికంగా చేపల వినియోగం పెంచి తద్వారా ఆక్వా రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు, మత్స్యకారులు జీవన ప్రమాణాల అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. ఈ ఫిష్ ఆంధ్ర షాపుల ఏర్పాటుకి ముందుకొస్తే  మహిళలు, ఎస్.సి, ఎస్.టి లకు  60%, ఇతరులకు 40% రాయితీని ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు.  అలాగే ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకం ద్వారా సబ్సిడీతో కూడిన పధకాలు అందజేస్తుందన్నారు. వాటిలో ద్విచక్ర వాహనాలు, త్రి చక్ర వాహనాలు, ఫిష్ వెండింగ్ యూనిట్లు, లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్లు, ఫిష్ కియాస్కులు తదితర పథకాలకు సత్వరమే లబ్దిదారులను గుర్తించి, ఈ-మత్స్యకార వెబ్ పోర్టల్ ద్వారా అప్లై చేయించాల్సిందిగా ఆదేశించారు. 

మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం  అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని డిడి వివరించారు. అంతేకాకుండా  వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు రూ. 10.00 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం అందిస్తుందన్నారు. మత్స్యకారులంతా  ఈ-శ్రమ్ లో నమోదు చేశుకుంటే అదనంగా మరో రూ. 2. 00 లక్షలు లభిస్తాయని తెలియజేశారు. పథకాలకు వ్యాపార పెట్టుబడి నిమిత్తం అత్యంత తక్కువ వడ్డీ రేటుతో కిషాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తున్నవిషయాన్ని మత్స్యకారులకు తెలియజేయాలన్నారు. 50 సంవత్సరాలు దాటినా  అర్హుడైన ప్రతీ మత్స్యకారుని నెలకు రూ. 2,500/- పెన్షన్ ను,  స్వదేశీ మత్స్యకారులకు నామమాత్రపు లీజుతో చెరువులను కేటాయిస్తారని, అలాగే తీర ప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ సమయములో సకాలం లోనే రూ. 10,000/- నేరుగా వారి ఖాతాకు జమ చేస్తారని చెప్పారు.  హెచ్ఎస్డీ ఆయిల్ కార్డుల మంజూరు ద్వారా డీజిల్ పోయించుకొనే సమయంలోనే సబ్సిడీ వర్తింపుని కూడా అమలు చేస్తారన్నారు. ఆక్వా రైతులకు విధ్యుత్  రాయితీలు వస్తాయని తెలియజేశారు. 

 APSADA చట్టం ద్వారా రూపొందించిన ఈ-మత్స్యకార వెబ్ పోర్టల్ ద్వారా ఎలాంటి ఆలస్యం, అలసత్వం లేకుండా  సత్వర ఆక్వా కల్చర్ అనుమతులు, నీరు, మట్టి, మైక్రో బయాలజీ పరీక్షల కోసం ఆక్వా ల్యాబ్ లో సేవలు అందిస్తారని.. మత్స్య సంపద వృద్ధి, అధునాతన పద్దతి(RAS, BIOFLOC)  లో చేపల సాగు చేయుట మొదలగు వాటి గూర్చి క్షేత్ర స్థాయిలో పనిచేసే మత్స్య శాఖ అభివృద్ధి అధికారులు,  మత్స్య శాఖ సహాయ తనిఖీదారులు, గ్రామ మత్స్య సహయ కులు వివరంగా వివరించి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో APIIATP, ఏపీడీ రామారావు, IRPWA ఆర్గనైజింగ్ చీఫ్ ప్రకాష్, ఎఫ్డీఓ యు.చాందిని, మత్స్య శాఖ సహాయ తనిఖీదారులు సంతోష్, వేంకటెష్, ప్రసాద్, గ్రామ మత్స్య సహయ కులు తదితరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2022-08-30 12:06:49

తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి

ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది.         ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేప‌ట్టారు. అనంత‌రం వేద‌మంత్రాల న‌డుమ మూల‌వ‌ర్ల‌కు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన  వేణుగోపాల దీక్షితులు ఈ అభిషేకం చేశారు.  ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2022-08-30 11:41:15