1 ENS Live Breaking News

అర్హులైన జర్నలిస్టులకి అక్రిడిటేషన్లు అందిస్తాం..

 విశాఖపట్నంలో జర్నలిస్టులు మంగళవారం కదం తొక్కారు, కోర్కెల దినం ఆందోళనలో గొంతు కలిపారు. జర్నలిస్టుల సమస్యల  పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లికార్జున హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్,  ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అక్రిడేషన్ల సమస్యను ప్రధానంగా జర్నలిస్టులు కలెక్టర్ కు వివరించారు. వెంటనే ఆయన డీపీఆర్ఓ మణిరాంను  రప్పించి ఈనెల 27వ తేదీలోగా ఆ సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.1994,2005  జర్నలిస్టుల స్థలాల సమస్యకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి పూర్తి వివరాలు అందజేశామని తెలిపారు. జర్నలిస్టులకు ఇల్లు,ఇళ్ల స్థలాలు,బీమా,పింఛన్ సదుపాయం,ఆటాక్స్ కమిటీల నియామకాలు చేపట్టాలని  కలెక్టర్ ను కోరారు..ఈ కార్యక్రమంలో జాతీయ జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నగర అధ్యక్షులు పి. నారాయణ్,బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ నగర అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు,ఫెడరేషన్  నాయకులు ఎ.సాంబశివరావు,శివప్రసాద్,దాడి రవికుమార్,కామాకుల మురళీకృష్ణ,జి శ్రీనివాసరావు,మధు,బొప్పన రమేష్, రాజశేఖర్,ఎమ్మెస్సార్ ప్రసాద్,చింతా ప్రభాకర్,ఆనంద్ కృష్ణమూర్తి, నగేష్, శివరాం, కడలి ప్రసాద్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-09-20 10:30:23

ఆప‌ద మిత్ర‌ల‌కు ప‌రిపూర్ణ శిక్ష‌ణ ఇవ్వాలి

అన్ని ర‌కాల ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను ఎదుర్కొని, ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించే విధంగా ఆప‌ద‌మిత్ర‌ల‌కు స‌మ‌ర్ధ‌వంత‌మైన‌ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని రూపొందించాల‌ని, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ ఆదేశించారు. ఆప‌ద మిత్ర‌ల శిక్ష‌ణా కార్య‌క్ర‌మంపై, క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో వివిధ శాఖ‌ల అధికారుల‌తో సోమ‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

               జిల్లా విప‌త్తుల నిర్వ‌హ‌ణాధికారి బి.ప‌ద్మావ‌తి మాట్లాడుతూ, జిల్లాలో 300 మంది వ‌లంటీర్ల‌ను ఆప‌ద మిత్ర‌లుగా ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. వ‌లంటీర్ల‌తోపాటు ఉద్యోగ విర‌మ‌ణ చేసిన డాక్ట‌ర్లు, సివిల్ ఇంజనీర్లు, అగ్నిమాప‌క‌, పోలీసు అధికారులు కూడా వ‌య‌సుతో సంబంధం లేకుండా ఆప‌ద‌మిత్ర‌లుగా చేర‌వ‌చ్చ‌ని సూచించారు. వీరికి 12 రోజుల శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని ఈనెల 16 నుంచి  ప్రారంభిస్తామ‌ని చెప్పారు. ప్ర‌కృతి వైప‌రీత్యాలు రాక‌ముందు, వ‌చ్చిన స‌మ‌యంలో, వ‌చ్చిన త‌రువాతా చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై నిపుణ‌ల‌తో శిక్ష‌ణ ఇప్పిస్తామ‌ని వివ‌రించారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల‌తోపాటు, మాన‌వ త‌ప్పిదాల కార‌ణంగా జ‌రిగే ప్ర‌మాదాల‌ను ఎదుర్కొనే విధానంపైనా శిక్ష‌ణ ఉంటుంద‌ని తెలిపారు.

               జెసి మ‌యూర్ అశోక్ మాట్లాడుతూ, ఆప‌ద మిత్ర‌లు అన్ని రకాల వైప‌రీత్యాల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొనే విధంగా శిక్ష‌ణ ఇవ్వాల‌న్నారు.  దీనికోసం ప్ర‌తీ ప్ర‌భుత్వ శాఖా, త‌మ‌త‌మ శాఖ‌ల ప‌రంగా జ‌రిగే విప‌త్తుల‌ను, వాటిని ఎదుర్కొనే విధానాన్ని ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా ఆప‌ద మిత్ర‌ల‌కు వివ‌రించాల‌ని సూచించారు. ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించే అవ‌కాశం ఉన్న దేశంలోని 352 జిల్లాల్లో మ‌న జిల్లా కూడా ఉంద‌ని, అందువ‌ల్ల ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త నివ్వాల‌ని సూచించారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను ఎదుర్కొనే విధానంపై మన దేశంలో ప్ర‌జ‌ల‌కు స‌రైన అవ‌గాహ‌న లేద‌ని, పాశ్చాత్యా దేశాల్లో చిన్న‌త‌నంలోనే వీటిని నేర్పిస్తార‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని గుర్తించిన జాతీయ విప‌త్తుల నిర్వ‌హ‌ణా సంస్థ‌, ప్ర‌జ‌ల‌కు వైప‌రీత్యాల‌ను ఎదుర్కొన‌డంలో స‌న్న‌ద్దం చేసేందుకు, ఇటువంటి శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేసింద‌ని చెప్పారు. మండ‌లానికి ఇద్ద‌రు చొప్పున ఆశా కార్య‌క‌ర్త‌ల‌ను కూడా ఎంపిక చేసి, ఆప‌ద‌మిత్ర శిక్ష‌ణ ఇప్పించాల‌ని జెసి సూచించారు.

              స‌మావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, జెడ్‌పి సిఇఓ ఎం.అశోక్ కుమార్‌, జిల్లా పంచాయితీ అధికారి ఇందిరా ర‌మ‌ణ‌, జిల్లా వ్య‌వ‌సాయాధికారి తార‌క‌రామారావు, మ‌త్స్య‌శాఖాధికారి ఎన్‌.నిర్మ‌లాకుమారి, సెట్విజ్ సిఇఓ రామానందం, పోలీసు, అగ్నిమాప‌క‌, అట‌వీశాఖాధికారులు పాల్గొన్నారు.
.........................................

Vizianagaram

2022-09-12 14:58:29

ఆక్వా రైతులు వాతావరణ మార్పులు గమనించాలి

పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆక్వా రైతులు వాతావరణ మార్పులు గమనించాలని జిల్లా మత్స్య శాఖ అధికారి వేముల తిరుపతయ్య కోరారు. అల్పపీడనం కారణంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆక్వా రైతులందరూ వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా చెరువులను పరిశీలించాలని ఆయన సూచించారు.  వాతావరణంలో మార్పుల వలన ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు, పీహెచ్, నీటిలో కరిగే ఆక్సిజన్ (డిజాల్వెడ్ ఆక్సిజన్ - డివో) లలో మార్పులు సంభవిస్తాయని ఆక్వా చెరువు నీటిలో ఉండాల్సిన వివిధ ధాతువుల విలువలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని ఆయన అన్నారు. ఆల్కలినిటి (కార్బోనేట్స్, బైకార్బోనేట్స్)   కొరకు తినే సోడాను ఎకరానికి 10 కేజీలు, పీహెచ్ కొరకు రాక్ లైమ్ ను ఎకరానికి ఒక బస్తా, డివో కొరకు గాలి మరలు (ఏరేటర్స్) ను, పొటాషియం పర్మాంగనేట్ ను, హైడ్రోజన్ పెరాక్సైడ్ ను, సోడియం ఫెర్బోరేట్ ను అందుబాటులో ఉంచుకోవాలని తిరుపతయ్య విజ్ఞప్తి చేశారు.

Parvathipuram

2022-09-10 07:26:44

పరిశ్రమలలో రక్షణ పై నివేదిక అందజేయాలి

అనకాపల్లి జిల్లాలో ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ క్రింద  ఎక్కువగా కాలుష్యం విడుదల చేస్తున్న  రెడ్,  ఆరంజ్ కేటగిరీల పరిశ్రమల్లో రక్షణ ఎక్కుప్మెంట్ ను తనిఖీ  చేసి   నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి జిల్లా స్థాయి రక్షణ కమిటీని
 ఆదేశించారు. పరిశ్రమల రక్షణ పై బుధవారం రాష్ట్ర స్థాయి కమిటీ అధికారులతో అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు  జిల్లా స్థాయి కమిటీ చైర్మన్ మరియు జిల్లా  కలెక్టర్ తో పాటు సభ్యులు పరిశ్రమల శాఖ శ్రీధర్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.రమ్య, పి.సి.బి ఈ ఈ లు పాల్గొన్నారు. వి.సి అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో పరిశ్రమలలో  జరిగిన ప్రమాదాలను దృష్టి లో పెట్టుకొని పరిశ్రలలో సేఫ్టీ ని తనిఖీ చేయడానికి జిల్లా స్థాయి కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. జిల్లాలో రెడ్, ఆరంజ్ కేటగిరీ లలో  పరిశ్రమలు ఉన్నాయని, వాటిని కమిటీ సభ్యులు తనిఖీ చేసి నివేదికను రాష్ట్ర స్థాయి కమిటీ కి పంపవలసి ఉంటుందని తెలిపారు.

Anakapalle

2022-09-08 05:14:17

విశాఖలో రేపు అవధానకవి బ్రహ్మోత్సవం

అవధాన కవి బ్రహ్మోత్సవం సందర్భము గా ప్రముఖ  ఆసుకవి పద్య పితామహులు శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం 20 వ వార్షికోత్సవం శుక్రవారం రాత్రి కళాభారతి లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను బుధవారం కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు  మా శర్మ సింహాద్రి నాథుడు, శ్రీదేవి భూదేవి ,పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మా శర్మ మాట్లాడుతూ మూడేళ్లకు సంబంధించిన ప్రతిభా పురస్కారాలను ఈ యేడాది అందజేస్తున్నామన్నారు. ప్రధానంగా ప్రముఖ సంగీతదర్శకులు డాక్టర్ సింగీతం శ్రీనివాసరావు కు జాతీయ ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం చేయనున్నట్లు తెలిపారు. ఈ సభకు గరికిపాటి నరసింహారావు అధ్యక్షత వహించగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు నుంచి  అవధానులు, ప్రముఖ సాహితీ వేత్తలు, కళాకారులు హాజరు కానున్నట్లు తెలిపారు. 

మాశర్మతో పాటు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తదితరులంతా  ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయము వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ కొప్పరపు కవులు కనకదుర్గ, ఆంజనేయస్వామి ఉపాసకులని, ఏదైనా మనసులో సంకల్పిస్తే అది తప్పకుండా నెరవేరుతుందన్నారు అటువంటి కార్యక్రమంలో ప్రతీ ఏటా తాను పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాపీఠం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-09-07 06:43:46

ఇంటి నిర్మాణాలు సత్వరమే పూర్తిచేయాలి

న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యేలా ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌కు సూచించారు. మంగ‌ళ‌వారం కాకినాడ క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంపై కాకినాడ అర్బ‌న్‌, రూర‌ల్‌, తుని, తొండంగి మండ‌లాల రెవెన్యూ అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ లేఅవుట్ల‌లో నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు క‌ల్పించినందున ఇళ్ల నిర్మాణాల‌ను వేగ‌వంతం చేయాల‌ని సూచించారు. లేఅవుట్ల‌లో ఖాళీగా ఉన్న ప్లాట్ల‌ను న‌వ‌ర‌త్నాలు పేద‌లంద‌రికీ ఇళ్లు, 90 రోజుల్లో ఇంటి ప‌ట్టా కింద అర్హులైన ల‌బ్ధిదారుల‌కు కేటాయించాల‌న్నారు. ల‌బ్ధిదారుల‌ను వారికి కేటాయించిన ప్లాట్ల‌తో మ్యాపింగ్ చేయాల‌ని ఆదేశించారు. 

అదే విధంగా అవ‌స‌ర‌మైన‌చోట భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని స్ప‌ష్టం చేశారు. స‌మావేశంలో హౌసింగ్ పీడీ బి.సుధాక‌ర్ ప‌ట్నాయ‌క్, న‌గ‌ర‌పాల‌క సంస్థ అద‌న‌పు క‌మిష‌న‌ర్ సీహెచ్ నాగ‌న‌ర‌సింహారావు, వివిధ మండ‌లాల త‌హ‌సీల్దార్లు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-09-06 13:50:09

కేవీ సంఘటనకు కారణం తెలుసుకోండి

కాకినాడ‌లో కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురైన సంఘ‌టన‌ చోటు చేసుకోవ‌డానికి కార‌ణాన్ని క‌చ్చితంగా తెలుసుకోవ‌డం ద్వారా భ‌విష్య‌త్తులో ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా చూసుకోవడానికి వీలుపడుతుందని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా సూచించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో  ప్ర‌త్యేక విచార‌ణ క‌మిటీ స‌భ్యుల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, అధికారుల‌తో క‌లిసి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల ర‌క్త న‌మూనాలు, తాగునీటి న‌మూనాల‌ను ల్యాబ్‌ల‌కు పంపినందున‌.. నివేదిక‌లు వ‌స్తే కార‌ణాల‌ను అన్వేషించేందుకు వీల‌వుతుంద‌న్నారు. అదే విధంగా మైక్రో బ‌యాల‌జీ నిపుణుల‌ను పాఠ‌శాల‌కు పంపి ప‌రిశీల‌న చేయించాల‌ని అధికారుల‌కు సూచించారు.  

సోమ‌వారం ఉద‌యం నుంచి మంగ‌ళ‌వారం సంఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యం వ‌ర‌కు పాఠ‌శాల కార్య‌క‌లాపాల‌ను ప్రిన్సిప‌ల్ బి.శేఖ‌ర్‌ను అడిగి తెలుసుకున్నారు. త‌ర‌గ‌తి గ‌దుల్లో మౌలిక వ‌స‌తులు, ప‌రిస‌రాల వాతావ‌ర‌ణం, విద్యార్థులు పాల్గొన్న పాఠ్య‌, స‌హ పాఠ్య కార్య‌క్ర‌మాలు, తాగునీటి వ్య‌వ‌స్థ త‌దిత‌రాల వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య ప‌రిస్థితిని జీజీహెచ్ వైద్యులు డా. ఎంఎస్ రాజు వివ‌రించారు. పాఠ‌శాల‌లో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌ని కేంద్రీయ విద్యాల‌య ప్రిన్సిప‌ల్‌కు సూచించారు. సంఘ‌ట‌న‌పై పూర్తిస్థాయిలో విచార‌ణ చేసి ఆయా విభాగాల ప‌రిశీల‌న‌ల నివేదిక‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. స‌మావేశంలో క‌మిటీ ఇత‌ర స‌భ్యులు పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎన్‌.అశోక్ కుమార్‌, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.రాధాకృష్ణ‌, డీఈవో దాట్ల సుభ‌ద్ర‌, అస్టిస్టెంట్ ఫుడ్ కంట్రోల‌ర్ బి.శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-09-06 13:39:16

విషవాయువులు లీకేజేలేమీ జరగలేదు..

కాకినాడ గ్రామీణ మండలం వలసపాకల గ్రామంలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థుల అస్వస్థతకు కారణం విషవాయువులు కాదని.. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీల నుంచి విషవాయువు ఎక్కడ విడుదల కాలేదని కాకినాడ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు కురసాల కన్నబాబు తెలిపారు.  ఈ సంఘటనలో మంగళవారం ఉదయం నుంచి కేవలం భయాందోళనలు సృష్టించేందుకు కొంత మంది చేస్తున్న రకరకాల వదంతుల్లో ఏమాత్రం నిజం లేదని ప్రాథమికంగా విచారణలో తేలిందన్నారు.   418  విద్యార్థులు ఉన్న కేంద్రీయ విద్యాలయంలో కేవలం ఆరు, ఏడు తరగతులలో ఉన్న 18 మంది విద్యార్థులకు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని ఆయన తెలిపారు. కాకినాడ గ్రామీణ మండలం వలసపాకల గ్రామంలో ఉన్న కేంద్రీయ విద్యాలయం పరిశ్రమలకు చాలా దూరంగా ఉందని ముఖ్యంగా సూర్యపేటకు దగ్గర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయన్నారు.  జిల్లా కలెక్టర్  ఆధ్వర్యంలో నియమించిన కమిటీ సభ్యులు అంతా పరిశీలించి వాస్తవ విషయాన్ని నిర్ధారించడం జరుగుతుందన్నారు. జీజీహెచ్ లో వైద్య సేవలు పొందుతున్న విద్యార్థులు అందరితో మాట్లాడటం జరిగిందని వీరందరూ కొరకు ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచడానికి అవసరమైన ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర మేయర్ సుంకర శివప్రసన్న, కుడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి,  జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.పి.వెంకటబుద్దా,  ఆర్ఎంఓ డా.అనిత, డిఎంహెచ్ఓ డా. ఆర్.రమేష్, డిఈఓ డి.సుభద్ర, వైద్యాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

Kakinada

2022-09-06 13:03:37

ధరఖాస్తుదారులను వేధిస్తే సహించేది లేదు

మ్యుటేషన్ దరఖాస్తుదారులను వేదిస్తూ పదే పదే తిప్పటం సరికాదని, అంతే కాకుండా విఆర్ఓ లాగిన్ లో రిజెక్ట్ చేయటo జరుగుతోందని, అటువంటి సందర్భాలలో ఆయా తహసిలదార్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మంగళవారం కలక్టరేట్ విసి హాల్ నుండి మండల స్థాయి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ,  మ్యుటేషన్ దరఖాస్తుదారులకు కుటుంబ సభ్యుల ధృవీకరణ, నోటరీ అఫిడివిట్ లేకుండా సిసిఎల్ఎ సూచనల ప్రకారం మ్యుటేషన్ చేయాలని ఆదేశాలు జారీ  చేసినప్పటికీ కొంతమంది తహసిల్దార్లు పట్టించుకోటం లేనందున చాలా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.  ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అభిషేక్ ను వారితో సమీక్షించి మ్యుటేషన్లు త్వరగా పూర్తీ చేయాలని ఆదేశించారు. 

11 మండలాలు తిరిగి  విఆర్ఓల పని తీరుపై అసంతృప్తి వ్యక్త పరిచిన సబ్ కలెక్టర్ 15 మంది విఆర్ఓలకు నోటీసులు జారీ చేసామని సబ్ కలెక్టర్ తెలిపారు.  సచివాలయాలలో పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ ఉండటంపై కూడా కలెక్టర్ అసంతృప్తి వ్యక్త పరుస్తూ సకాలంలో పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 22 పెన్సన్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న కొయ్యూరు తహసిల్దార్ గూర్చి ఆరా తీయగా తనకి డిజిటల్ సైన్ కాలేదని తెలిసుకుని, జాయినై నెల దాటినా డిజిటల్ సైన్ లేకుండా ఎం చేస్తున్నారని, మరుసటి వారం విసి నాటికి డిజిటల్ సైన్ తీసుకోకపోతే వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.  అదేవిదంగా  సచివాలయ సిబ్బందిని తరచూ సమీక్షించాలని, సచివాలయ సిబ్బంది యునిఫారం ధరించేలా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ లను ఆదేశించారు.  

 ప్రతి సచివాలయంకు గడప గడపకు మాన ప్రభుత్వం కింద రూ.20 లక్షలు మంజూరు అయినందున సంబంధిత శాశన సభ్యులుతో చర్చించి ఆయా సచివాలయాల పరిధిలో చేపట్టాల్సిన పనులను అప్లోడ్ చేయాలని, సాంకేతిక, పరిపాలనాపరమైన మంజూరులు పొందాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విడియో కాన్ఫెరెన్స్ లో జిల్లా నుండి డిఆర్ఓ బి. దయానిధి, మండలాల నుండి, ఇటిడిఎ ప్రోజేక్ట్ అధికారులు రోణంకి గోపాల కృష్ణ, సూరజ్ గనోరే, తహసిల్దార్లు, ఏమ్పిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-09-06 12:58:16

కేవీ విద్యార్ధులంతా సురక్షితంగానే ఉన్నారు..

కాకినాడ రూరల్, వలసపాలక లోని  కేంద్రీయ విద్యాలయంలో అస్వస్థతకు లోనైన విద్యార్థులందరూ కోలుకుని, నిలకడైన ఆరోగ్యంతో సురక్షితంగా ఉన్నారని  కాకినాడ జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా తెలియజేశారు. మంగళవారం ఉదయం కాకినాడ రూరల్ మండలం వలసపాకల లోని కేంద్రీయ విద్యాలయంలో 5, 6 తరగతులు చదువుతున్న 18 మంది విద్యార్థులు ఊపిరి ఆడక పోవడం, ఛాతీలో మంట లక్షణాలతో కూడి అస్వస్థతకు లోను కావడంతో, జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై వారందరినీ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి హుటాహుటిన తరలించి వైద్య సహాయం అందించారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా, కాకినాడ ఎంపి వంగా గీత, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు,సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సేవలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. 

 అలాగే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఎటువంటి ఆందోళన చెందవద్దని, వారందరూ పూర్తి  స్వస్థత పొందేవరకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.  ఈ సందర్భంగా హాజరైన మీడియాతో జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా మాట్లాడుతూ మంగళవారం ఉదయం 9-30 గంటలకు తరగతులకు హాజరైన 5, 6, 7 తరగతుల విద్యార్థులు తమకు ఊపిరి ఆడటం లేదని, గుండెల్లో మంటగా ఉందని తెలియజేయడంతో వారందరినీ ఉపాధ్యాయులు ఆరుబయట వెంటిలేటెడ్ ప్రదేశానికి తరలించారని, తీవ్ర అస్వస్థతకు లోనైన 18 మంది వెంటనే 108 ఆంబులెన్స్ లలో కాకినాడ జిజిహెచ్ కు తరలించి తక్షణ వైద్య సహాయం అందించడం జరిగిందన్నారు.  5వ తరగతి విద్యార్థులు ముగ్గురు, 6వ తరగతి విద్యార్థులు ఎనిమిది మంది, 7వ తరగతి విద్యార్థులు ఏడుగురు ఈ అస్వస్థతకు గురైయ్యారన్నారు.   

 చికిత్స పొందుతున్న 18 మంది తిరిగ కోలుకున్నారని, వారి ఆరోగ్యానికి ఎటువంటి భయం లేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారన్నారు. అందరి బిపి, ఆక్సిజన్ లెవల్స్ సాధారణ స్థాయిలో ఉన్నాయని ఎవరికీ ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారన్నారు.    విద్యార్థుల అస్వస్థతకు కారణాలు ఇంకా ఇదమిద్దంగా నిర్థారణ కాలేదని, సమాచార అందిన వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫాక్టరీస్, అగ్నిమాపక అధికారులను కేంద్రీయ విద్యాలయానికి పంపి ప్రాధమిక విచారణ నిర్వహించడం జరిగందని, తరగతి గదులు, పాఠశాల ప్రాంగణాల్లో ఎటువంటి రసాయినిక, విష వాయువుల ఉనికి లేదని విచారణ బృంద తెలిపిందన్నారు.  పాఠశాల పరిశ్రమలకు దూరంగా, జన నివాసాల మద్యలో ఉందని, ఆ ప్రాంతంలో కలుషిత వాయువు ప్రభావం ఉన్నట్లు పరిసర ప్రజలెవరూ తెలిజేయలేదన్నారు.   విద్యార్థుల అస్వస్థతకు కారణాలను నిర్థారించేందుకు వైద్యులు, ఫుడ్ కంట్రోలర్, ప్యాక్టరీస్, పొల్యూషన్ బోర్డు అధికారులు సభ్యులుగా ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేశామని, 24 గంటలలో  నివేదిక అందజేయాలని ఈ కమిటీని కోరామన్నారు.   అలాగే విద్యార్థుల బ్లడ్ శాంపిళ్లను, పాఠశాలలోని త్రాగునీరు శాంపిళ్లను లాబొరేటరీకి పంపామని, ఈ పరీక్షలలో వారి అస్వస్థతకు కారణాలను విశ్లేషించడం జరుగుతుందన్నారు. 

  కాకినాడ ఎంపి వంగా గీతా విశ్వనాధ్ మాట్లాడుతూ విద్యార్థుల అస్వస్థత సమాచరం అందిన వెంటనే జిల్లా యంత్రాంగ తక్షణం స్పందించి వైద్య సహాయం అందించిందన్నారు. అలాగే కొంత మంది ప్రచారం చేస్తున్న వందంతులను నమ్మి ఆందోళనకు గురి కాకుండా  దైర్యంగా ఉండి వైద్య సేవలకు తల్లిదండ్రులు సహకరించారన్నారు.  భగవంతుడు దయ వల్ల విద్యార్థులు అందరూ క్షేమంగా కొలుకున్నారని, శాంపిల్ పరిక్షలు, విచారణ కమిటీ పరిశీలనలో ఈ సంఘటనకు కారణాలు నిర్థారణ అవుతాయన్నారు. పిల్లలు పూర్తిగా కోలుకుని, తల్లిదండ్రులు సంతృప్తి చెందే వరకూ జిజిహెచ్ లో ప్రత్యక వార్డులో ఉంచి వైద్య పర్యవేక్షణలో ఉంచడం జరుగుతుందన్నారు.   కేంద్రీయ విద్యాలయం ప్రస్తుతం కాకినాడ పబ్లిక్ స్కూల్ లో నిర్వహించడం జరుగుతోందని, త్వరలోనే పండూరు సమీపంలోని  పి.వెంకటాపురంలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో శాశ్వత భవనాలు నిర్మించ నున్నామని  ఎంపి తెలియజేశారు.  ఇందుకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తి చేశామని, త్వరలోనే భూమి స్వాధీనం చేసుకుని పనులు 15 నుండి 20 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించ నున్నట్లు నిన్ననే కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ లోని కేంద్రీయ విద్యాలయ కమీషనరేట్ నుండి తనకు తెలియజేశారని ఎంపి తెలిపారు.  ఈ లోపున ప్రస్తుతం విద్యాలయం నడుస్తున్న కాకినాడ పబ్లిక్ స్కూల్లో తరగతి గదుల ఇబ్బంది లేకుండా అదనపు తరగతి గదులు కూడా నిర్మిస్తామని తెలిపారు.  

Kakinada

2022-09-06 12:55:57

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకూడదు

విశాఖజిల్లాలో ప్రభుత్వ భూములు ఎట్టి పరిస్థితులలో  అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసిన బాధ్యత రెవెన్యూ ఉద్యోగులపై ఉందని జిల్లా కలక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  అన్నారు.  మంగళవారం జిల్లా కలక్టర్ కార్యాలయంలో  నిర్వహించిన  రెవెన్యూ అధికారుల వర్క్ షాప్ లో  జిల్లా కలక్టర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యు అధికారులు నూతన చట్టాలు, నిబంధనలపై అవగాహన పెంచుకొని, సాంకేతికత  పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ మంచి ఫలితాలు సాధించాలన్నారు.   ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినట్లు తెలిసిన వెంటనే  సర్వేయర్, రెవెన్యూ అధికారులు సంబంధిత భూ కబ్జాదారులకు నోటీసులు జారీ చేయాలన్నారు.  అవసరమైతే   జాయింట్ కలక్టర్, రెవెన్యూ డివిజన్ అధికార్లు తనిఖీలు నిర్వహించి  ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడాలన్నారు. 

అదే విదంగా  అన్యాక్రాంతమైన  ప్రభుత్వ భూములను రక్షించిన వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ముఖ్యంగా గెడ్డలు, పోరంబోకు, కాలువలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలన్నారు. ప్రజలు వారి యొక్క సమస్యలతో కార్యాలయంనకు వచ్చినపుడు వారితో సహనంతో మాట్లాడి వారి యొక్క సమస్యలను తీర్చే విదంగా రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు.  దీర్ఝకాలిక సమస్యలపై దృష్టి సారించాలని, ఒక నిర్ణయం ద్వారా అనేక మంది ప్రజలకు ఉపయోగపడే సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి  పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా  జిల్లాలో  1,40,000 ఇళ్ల స్థల పట్టాలు పంపిణీకి భూసేకరణ మరియు ఇతర పనులకు నిరంతరం శ్రమించిన అధికారులను అభినందించారు.  

త్వరలో ఒకేసారి  సుమారు  లక్ష ఇళ్ల నిర్మాణం ఒక యజ్ఞంలా ప్రారంభించి ముందుకు వెళ్లేందుకు  ప్రతి ఒక్కరూ సన్నద్దం కావాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి అధికారులందరూ ముందుగా రావాలన్నారు.  త్వరలో  ఒక మండలంను ఒక యూనిట్ గా జిల్లా కలక్టర్ తో పాటు జిల్లా అధికారులందరూ  రాత్రి బస చేసి ఆ మండలంలో నున్న అన్ని కార్యాలయాలతో పాటు చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు వారంలో మూడు రోజుల పాటు క్షేత్ర పరిశీలన చేయాలని సదరు వివరాలను కలక్టర్ కు తెలపాలన్నారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలక్టర్ కె.యస్.విశ్వాథన్, డి.ఆర్.ఓ శ్రీనివాసమూర్తి, విశాఖపట్నం, భీమిలి ఆర్డీఓలు, తహసీల్దార్లు, డిప్యూటి తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2022-09-06 11:41:07

ఐసిడిఎస్ పథకాలపై అవగాహనకల్పించాలి

సంపూర్ణ పోషకాహార పథకం పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి ఐ సి డి ఏస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరు కార్యాలయంలోని తన ఛాంబర్ లో  ఐ సి డి ఎస్ పిడి  ,సిడిపిఓ లతో  సంపూర్ణ పోషకాహార పథకం అమలు ,ఇతర పథకాలపై జిల్లా  కలెక్టరు  సమీక్షించారు. ఈ సందర్భంగా  కలెక్టరు మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో , మండలాలలో  గర్భిణీలు బాలింతలు కు పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి సంపూర్ణ పోషకాహార పథకం ప్రజలలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.  సంపూర్ణ పోషకాహార మాసోత్సవాలు ఈనెల 30 వరకు నిర్వహించడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. ఈ మాసోవోత్సవాల్లో పోషకాహార  సంపూర్ణ పోషకాహారం  యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసే విధంగా వర్క్ షాప్ లు నిర్వహించాలని ఆమె అన్నారు. 

ఈ కార్యక్రమంలో సి డి పి వోలు ముఖ్యపాత్ర పోషించాలని కలెక్టరు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో పండుగ వాతావరణం సృష్టించడం ,  ఆశా వర్కర్లు వైయస్సార్ సంపూర్ణ పోషణ ,  వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ యొక్క న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేసి, ఇచ్చిన వస్తువులను ఉపయోగించి సంపూర్ణ పోషకాహారం ఏవిధంగా పొందవచ్చునో వారికి వివరించాలని కలెక్టరు సూచించారు.  వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో అందిస్తున్న రాగి  ,సజ్జ , జొన్న , అటుకులు, ఎండు ఖర్జూరం , బెల్లం వేరుశనగ చిక్కీలు వంటి బలవర్ధకమైన ఆహారం తో పాటు పాలు  ,గుడ్లు వినియోగాన్ని వారికి  వివరించాలని  కలెక్టరు సూచించారు.  

వీటిపై ప్రదర్శనలను నిర్వహించాలని ప్రజాప్రతినిధులు  , కమ్యూనిటీ ప్రభావశీలుర్లను ఆహ్వానించడం ద్వారా సంపూర్ణ పోషకాహార పథకం  యొక్క ప్రాముఖ్యతపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. పోషకాహార మహోత్సవాలలో గర్భిణీలు , బాలింతలు, చిన్నారులు ఏ ఆహారం తీసుకోవాలి ఇంటింటికి వెళ్ళి వివరించాలని కలెక్టరు సూచించారు. జిల్లాలో ఎక్కడ పోషకాహారం లోపంతో పిల్లలు , గర్భిణీలు , బాలింతలు ఎవరు ఉండకూడదని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి ఆదేశించారు. ఈ సమావేశంలో ఐ సి డి ఎస్ పి డి   బి. సుజాత రాణీ,  సిడిపిఓలు వి. వాణి విజయ రత్నం,సి హెచ్ ఇందిర,బి. ఊర్మిళ, టి యల్ సరస్వతి,పి ఆర్ రత్న కుమారి, మేరీ ఏలిజబెత్,శ్రీ లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు .

Bhimavaram

2022-09-06 10:52:07

భూముల రీసర్వే తో పక్కాగా రికార్డులు

భూములరీ సర్వేతో పక్కా రికార్డులు రూపొందుతాయని, భూమి కొలతల  విషయంలో  గతంలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే   సరిదిద్దడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు. మంగళవారం ఆమె అనకాపల్లి జిల్లా కసింకోట మండలం లో పర్యటించారు. తాసిల్దార్ కార్యాలయంలో రీసర్వే రికార్డులను పరిశీలించారు. చిన్న పొరపాటైనా జరుగకుండా సర్వే పక్కాగా జరగాలన్నారు. ఇప్పటివరకు జరిగిన రీసర్వే పై అధికారులు ఉద్యోగుల తో సమీక్షించారు. తరువాత వెదురుపర్తి గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్వే చేసిన భూమి వివరాలు ప్రదర్శించారా, సర్వే పనులు ఎలా ఉన్నాయి అని అడిగారు.  సర్వే పనులు సంతృప్తిగా ఉన్నాయని , భూమి వివరాలు పెట్టారని వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సుధాకర్ నాయుడు, సర్వే, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
గృహ నిర్మాణ లక్ష్యాలను చేరుకోవాలి

అనపర్తి, రాజానగరం నియోజకవర్గాల్లో గృహ నిర్మాణ లక్ష్యాలను వేగవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవి లత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక  జిల్లా కలెక్టర్  కార్యాలయ సమావేశ మందిరంలో జగనన్న గృహ నిర్మాణాలపై హౌసింగ్ ఆధికారులు, అనపర్తి, రాజానగరం నియోజకవర్గ మండల స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ తో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాజానగరం నియోజకవర్గం లో 7252 ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1806 ఇళ్ళు పూ ర్తి అయ్యాయని 5446 ఇళ్ళు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.  అనపర్తి నియోజకవర్గం లో 9324 ఇళ్ళు నిర్మించి పూర్తి చేయాల్సి ఉండగా 1136 ఇళ్ళు పూర్తి అయ్యాయన్నారు.  8188 ఇళ్ళు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు.   వర్షాలు తగ్గాయి కాబట్టి త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు నూరు శాతం పూర్తి  అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 

ప్రత్యేక అధికారులు, హౌసింగ్ అధికారులు ప్రతిరోజు గృహ నిర్మాణాలపై మండల స్థాయిలో హౌసింగ్, ఎంపీడీఓలు, తహసీల్దార్లుతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు అవగాహన పెంచాలని కలెక్టర్ మాధవీలత అన్నారు. మండలాల్లో ఇసుక, సిమెంట్ , ఇనుము కొరత లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.  ప్రతీ ఇంటికి 20 టన్నుల ఇసుక ను హోసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కూపన్లు ఏర్పాటు చేసి, ఉచితంగా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఈ వారం రోజుల్లో లక్ష్యాల్లో భాగంగా కోరుకొండ మండలం లో 311 ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా 24 ఇళ్ళు పూర్తి చేయడం జరిగిందన్నా రు. రాజానగరం లో 466 ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా 93 ఇళ్ళు   పూర్తి చేయడం జరిగిందన్నారు.

సీతానగరం లో 185  ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా 13 ఇళ్ళు   పూర్తి చేయడం జరిగిందన్నారు.  అనపర్తి లో 438  ఇళ్ళు నిర్మిం చాల్సి ఉండగా 34 ఇళ్ళు పూ  ర్తి చేయడం జరిగిందన్నారు.  బిక్కవోలు లో 390  ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా 45  ఇళ్ళు పూర్తి చే యడం జరిగిందన్నారు.  రంగం పేట లో 647  ఇళ్ళు నిర్మిం చాల్సి ఉండగా 98 ఇళ్ళు పూ  ర్తి చేయడం జరిగిందన్నారు. మిగతావి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, వీటిని పూర్తి చేసే దిశలో వారానికి లక్ష్యం పెట్టుకుని, సచివాలయ కార్యదర్శి లకు ఒక్కొక్కరికి ట్యాగ్ చేయ్యాడం ద్వారా మరింత గా పనుల పర్యవేక్షణ, స్టేజ్ కన్వర్షన్ సాధ్యం అవుతుందని,. ఆ దిశలో చర్యలకు ఉపక్రమించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ఈ. ఈ, జి. పరశురామ్, డి. ఈ, జి. వేణుగోపాల స్వామీ నియోజకవర్గాల మండల తా హిసీల్దార్ లు, యం. పి. డి. ఓ లు, ఇరిగేషన్, సర్వే అధికా రులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-09-06 10:47:45

దివ్యాంగులకు పునరావాస కేంద్రాలు నిర్మాణం

పార్వతీపురం మన్యం జిల్లాలో దివ్యాగుల పునరావాస కేంద్రం నిర్మించి నిర్వహణ చేపట్టేం దుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎం. కిరణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో  విభిన్న ప్రతిభావంతులకు సేవలు అందుబాటులోకి తెచ్చుటకు ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లాలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయుటకు జిల్లా పర్యవేక్షణ కమిటీని స్థాపించామని అన్నారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి,నోడల్ ఏజెన్సీని ఎంపిక చేయుటకు ఆసక్తి గల స్వచ్చంద సంస్థలు, రెడ్ క్రాస్ వంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. దరఖాస్తులు  ఈనెల 8వ తేదీలోగా సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు,హిజ్రాలు, వయోవృద్ధుల శాఖ, పార్వతీపురం కార్యాలయంలో  సమర్పించాలని అన్నారు. పూర్తి వివరాలకు www.socialjustice.gov.in వైబ్సైట్, 9441416375 ఫోన్ నెంబర్ కు సంప్రదించవచ్చని ఆ ప్రకటనలో వివరించారు.

Parvathipuram

2022-09-06 10:11:10

ఉత్తరాంధ్ర కళాకారుల ప్రతిభ ప్రశంసనీయం

ఉత్తరాంధ్ర జిల్లాలు అంటేనే కవులు, కళాకారులుకు ప్రసిద్ధిగా పేరుగాంచిందని, అటువంటి కళాకారులను గుర్తించి గురుపూజోత్సవం రోజు సత్కరించడం ఎంతో గర్వకారణంగా ఉందని  శ్రీ గణేష్ యువజన సేవా సంఘం అధ్యక్షులు, అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్లశ్రీనుబాబు కొనియాడారు. సోమవారం విశాఖలోని డాబాగార్డెన్స్ వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో గురుపూజోత్సవం సందర్భంగా గురుశిష్య ప్రతిభా పురస్కార్ అవార్డులను రమేష్ ఎంటర్ టైనర్ అదినేత చదల వాడ రమేష్ బాబు(గురువు ), ఆర్టీసీ కండక్టర్ ఘాన్సీ (శిష్యురాలు) లకు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో కవులు, రచయితలు, స్వచ్చంధ సంస్థలతో పాటు కళాకారులు పాత్ర కూడా అత్యంత ప్రశంసనీయమన్నారు.

 ఆయా రంగాల్లో ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన వారిని గుర్తించి తమ సంస్థ ద్వారా సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా  గతంలో 45 మంది మహిళా పోలీసులను సత్కరించామని, ఆ తరువాత కళాకారుల సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులను, స్కూల్ ఆఫ్ దియేటర్ ఆర్ట్స్ బాల కళాకారులను సత్కరించామన్నారు. ఇక గురుపూజోత్సవం సందర్భంగా ఏటా గురువులను సత్కరించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గణేష్ యువజన సేవా సంఘం గడచిన 39 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుందన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది గాజువాకకు చెందిన రమేష్ ఎంటర్ టైనర్స్ అధినేత చదలవాడ రమేష్ బాబు(గురువు), ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీ (శిష్యురాలు)లకు ఈ ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగిందన్నారు.

 వీరితో పాటు మరో 13 మంది కళాకారులను సత్కరించామని శ్రీనుబాబు వివరించారు. భవిష్యత్తులో కూడా ఆయా రంగాల్లో రాణించిన వారిని గుర్తించి గౌరవంగా సత్కరించుకోవడం జరుగుతుందన్నారు. కొంత మొత్తం ఆర్థిక సహాయం వీరికీ అందచేశారు. సన్మానగ్రహీతలు చదలవాడ రమేష్ బాబు, ఝాన్సీలు మాట్లాడుతూ తమ ప్రతిభను గుర్తించి గురుపూజోత్సవం రోజు సత్కరించి అవార్డులను అందజేసిన గణేష్ యవజన సేవా సంఘంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. తెలుగు రాష్ర్టాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రజల మన్ననలు మరింత పొందే విధంగా అందరి ఆశీస్సులు కోరుతున్నామన్నారు. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా తమ కళాకారుల బృందం అనేక ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందన్నారు. కళాకారులు మెరుగ్గా ఉంటేనే ఆయా ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉంటాయన్నారు.

 ప్రతిభాపాటవాలు ఉంటే ఎప్పటికైనా తమకు గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి తాజాగా తమకు లభించిన ఆదరణే నిదర్శనమన్నారు. ప్రభుత్వము కూడ కళాకారులని ఆదుకోవాలని వీరు కొరారు.. ఈ సందర్భము గా రమేష్ మాస్టర్ బృందం నిర్వహించిన డాన్స్ లు అలరింఛాయీ. ఈ కార్య క్రమంలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ నిర్వాహకుడు అర్. నాగరాజ్ పట్నాయక్, రేస్ ఈవెంట్స్ అదినేత దాడి రవి కుమార్ తదితరులుపాల్గొన్నారు.

Visakhapatnam

2022-09-05 10:23:07