1 ENS Live Breaking News

దరఖాస్తుల స్వీకరణకు 30వరకు గడువు

శ్రీకాకుళం జిల్లాలోని వృద్ధ కళాకారుల కొత్త పింఛన్ల కొరకు సమర్పించవలసిన దరఖాస్తుల  గడువును ఈ నెల 30వరకు పెంచినట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎస్.వి.రమణ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. పించన్ల కొరకు దరఖాస్తుల స్వీకరణ విషయమై గతంలో ప్రకటన జారీచేసినప్పటికీ తక్కువ స్థాయిలో దరఖాస్తులు రావడంతో ఆ గడువును ఈ నెల 30 వరకు పెంపుదల చేసినట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు. ఈ కార్యాలయానికి అందిన దరఖాస్తులు ఆధారంగా జిల్లా స్థాయి కమిటీలో చర్చించి అర్హత పొందిన కళాకారుల తుది జాబితాను రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, విజయవాడ వారికి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 

కావున అర్హత గల కళాకారులు తమ పూర్తి చిరునామాతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ, ఆధార్, అనుభవ పత్రాల ప్రతులతో నిర్ణీత దరఖాస్తు ఫారంలో నింపి సెప్టెంబర్ 30లోగా  జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, సమాచార పౌర సంబంధాల శాఖ, అఫీషియల్ కాలనీ, జె.సి గారి బంగ్లా దరి, శ్రీకాకుళం - 532 001 చిరునామాకు స్వయంగా లేదా పోస్టు ద్వారా సమర్పించాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు, గడువు దాటిన తదుపరి వచ్చిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవని ఆయన స్పష్టం చేశారు. నిర్ణీత దరఖాస్తు ఫారంను కార్యాలయ పనివేళల్లో ఉచితంగా పొందవచ్చని అన్నారు.

Srikakulam

2022-09-22 14:53:09

శ్రీ‌నివాస సేతు ప‌నుల‌ను ప‌రిశీలన..

క‌ర‌కంబాడి మార్గం నుండి లీలామ‌హ‌ల్ స‌ర్కిల్ మీదుగా క‌పిల‌తీర్థం రోడ్డులోని వాస‌వి భ‌వ‌న్ వ‌ర‌కు నిర్మిస్తున్న శ్రీ‌నివాస సేతు ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నుల‌ను టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్  వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, ఎస్పీ  ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డితో క‌లిసి గురువారం ప‌రిశీలించారు. సెప్టెంబ‌రు 27వ తేదీ ముఖ్య‌మంత్రి  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభిస్తార‌ని, ఇందుకు అవ‌స‌ర‌మైన ప‌నులు 26వ తేదీ నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించారు. మున్సిప‌ల్‌, టిటిడి ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ‌ప‌నులు చేస్తున్న ఆఫ్కాన్ సంస్థ ప్ర‌తినిధుల‌కు ఈవో ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో వీర‌బ్ర‌హ్మం, జాయింట్ క‌లెక్ట‌ర్ బాలాజి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ కుమారి అనుప‌మ అంజ‌లి, టిటిడి చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎస్ఇ  మోహ‌న్‌, ఆఫ్కాన్ సంస్థ మేనేజ‌ర్  రంగ‌స్వామి ప‌లువురు అద‌న‌పు ఎస్పీలు, డిఎస్పీలు పాల్గొన్నారు.

Tirumala

2022-09-22 14:48:11

షాపుల యజమానులు సహకరించాలి

శ్రీకాకుళంనగరంలోని మెయిన్ రోడ్డుకు ఇరువైపుల గల షాపుల యజమానులు, తోపుడు బండ్లు కాలువలకు లోపలి భాగంలో వ్యాపారాలు కొనసాగించాలని, లేనిచో చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేశు స్పష్టం చేశారు. గురువారం నగరంలోని పలు ప్రాంతాలను సిబ్బందితో కలిసి పర్యటించారు. తొలుత నాగావళి నది వద్ద నిర్మిస్తున్న డైక్  దగ్గర వరద నుండి కాపాడేందుకు రూ.62 లక్షలతో నీటిపారుదల శాఖ నిర్మిస్తున్న రింగ్ బండ్ పనులను స్వయంగా పరిశీలించారు. ఇటీవల నదీ ప్రవాహానికి డైక్ వద్ద అడ్డుపడిన చెత్తను తొలగించే చర్యలు చేపట్టిన ఆయన తదుపరి ఆదివారంపేటలో రహదారికి ఇరువైపులా గల కాలువల్లో పూడికను సిబ్బందితో తీయించారు. కొత్తరోడ్డు అండర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న పెయింటింగ్ పనులను పరిశీలించారు. 

అనంతరం నగరంలోని మెయిన్ రోడ్డుకు ఇరువైపులా నున్స షాపుల యజమానులు, తోపుడు బండ్లు వ్యాపారులు చెత్తను కాలువల్లో వేస్తున్నారని, ఇకపై ఇటువంటివి చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే షాపుల యజమానులు, తోపుడు బండ్ల యజమానులు కాలువలకు లోపల భాగంలోనే వ్యాపారాలు కొనసాగించాలని, కాలువలు దాటి రహదారిపై వ్యాపారాలు కొనసాగించడం వలన వాహనాలకు,పాదచారులకు తీవ్ర అంతరాయం కలుగుతుందని తెలిపారు. అంతేకాకుండా కాలువలపై వ్యాపారాలు చేయడం వలన కాలువల్లోని శిల్టును తొలగించేందుకు సిబ్బందికి ఇబ్బందిగా మారుతుందని అన్నారు.

 వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని షాపులు,తోపుడుబండ్ల యజమానులు కాలువలకు లోపలి భాగంలో ఏర్పాటుచేసుకొని తమ వ్యాపారాలు కొనసాగించి నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు. వీటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ పర్యటనలో సానిటరీ సూపర్ వైజర్ గణేష్, సానిటరీ ఇన్ స్పెక్టర్ ఉగాది, కాంట్రాక్టర్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.



Srikakulam

2022-09-22 07:19:36

గుర‌జాడ స్ఫూర్తిని కొన‌సాగించాలి

మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు ర‌చ‌న‌ల స్ఫూర్తిని కొన‌సాగించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. మ‌హాక‌వి ర‌చ‌న‌లు నిత్య నూత‌న‌మ‌ని, తెలుగుజాతి ఉన్నంత‌వ‌ర‌కూ అవి నిలిచిఉంటాయ‌ని జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు కొనియాడారు. గుర‌జాడ అప్పారావు 160వ జ‌యంతి వేడుక‌లు బుధ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. ముందుగా గుర‌జాడ స్వ‌గృహంలోని చిత్ర‌ప‌టానికి, విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. గుర‌జాడ వినియోగించిన వ‌స్తువుల‌తో,  స‌త్య క‌ళాశాల జంక్ష‌న్‌ వ‌ర‌కూ దేశ‌భ‌క్తి గేయాల‌ను ఆల‌పిస్తూ, ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. అక్క‌డి గుర‌జాడ‌ విగ్ర‌హానికి పూల‌మాల‌ల‌తో నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, గుర‌జాడ వందేళ్ల క్రితం చెప్పిన ప్ర‌తీమాటా ఆచ‌ర‌ణ సాధ్య‌మ‌ని అన్నారు.

 నాటి సామాజిక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆయ‌న క‌న్యాశుల్కం రాశార‌ని, మ‌ళ్లీ క‌న్యాశుల్కం ఆచారం తిరిగి మొద‌ల‌య్యే ప‌రిస్థితి నేడు నెల‌కొంద‌ని అన్నారు. సొంత‌లాభం కొంత మానుకోవాల‌ని స‌మాజానికి దిశానిర్ధేశం చేశార‌ని అన్నారు. ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌ గురించి ఆయ‌న ఆనాడే చాలా గొప్ప‌గా చెప్పార‌ని అన్నారు. స్వ‌దేశీ వ‌స్తువుల వినియోగం పెంచాల్సిన‌ అవ‌స‌రాన్ని శ‌తాబ్దం క్రిత‌మే చాటి చెప్పిన గుర‌జాడ గొప్ప దూర‌దృష్టి గ‌ల‌వార‌ని కొనియాడారు. ఆయ‌న ర‌చ‌న‌ల‌ను అర్ధం చేసుకొని, వాటి స్ఫూర్తిని కొన‌సాగించ‌డ‌మే గుర‌జాడ‌కు అస‌లైన నివాళి అని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

                  జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, గుర‌జాడ విశ్వ‌క‌వి అని, ఆయ‌న భావాలు విశ్వ‌వ్యాపిత‌మని కొనియాడారు. ఆయ‌న ర‌చ‌న‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని, తెలుగువారికి గుర‌జాడ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. తెలుగు భాష ఉన్నంత‌వ‌ర‌కూ గుర‌జాడ ర‌చ‌న‌లు నిలిచి ఉంటాయ‌ని అన్నారు. ప్ర‌ధాని మోడి ప‌లికిన దేశ‌మంటే మ‌ట్టికాదోయ్‌... గుర‌జాడ గీతాన్ని ఉద‌హ‌రించారు. గుర‌జాడ వార‌స‌త్వాన్ని కొన‌సాగించాల్సిన అవ‌స‌రం నేటిత‌రంపై ఉంద‌న్నారు. విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల్లో మ‌హాక‌వి ర‌చ‌న‌ల‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇచ్చే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

                 కార్య‌క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, డిప్యుటీ మేయ‌ర్ ఇస‌ర‌పు రేవ‌తీదేవి, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్‌. శ్రీ‌రాముల‌నాయుడు, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ పివివిడి ప్ర‌సాద‌రావు, జిల్లా ప‌ర్యాట‌క శాఖాధికారి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, విద్యాశాఖాధికారి కె.వెంక‌టేశ్వ‌ర్రావు, స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి డి.ర‌మేష్‌, ప‌శు సంవ‌ర్థ‌క శాఖాధికారి డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ‌, మ‌హిళాశిశు సంక్షేమ శాఖాధికారి బి.శాంత‌కుమారి, సంగీత క‌ళాశాల ప్రిన్సిపాల్ ల‌క్ష్మీప్ర‌స‌న్న‌,  స‌మ‌గ్ర‌శిక్ష ఎపిసి డాక్ట‌ర్ విఏ స్వామినాయుడు, గుర‌జాడ కుటుంబీకులు వెంక‌టేశ్వ‌ర‌ప్ర‌సాద్‌, ఇందిర‌, ల‌లిత‌, గుర‌జాడ సాంస్కృతిక స‌మాఖ్య ప్ర‌తినిధులు పివి న‌ర్సింహ‌రాజు, డాక్ట‌ర్ ఎ.గోపాల‌రావు, కాపుగంటి ప్ర‌కాష్‌, జిల్లా గ్రంథాల‌య సంస్థ మాజీ అధ్య‌క్షులు రొంగ‌లి పోత‌న్న‌, వివిధ సంస్థ‌ల ప్ర‌తినిధులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-09-21 10:00:47

సింహగిరిపై భువనవిజయం సత్సంగం

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం , భక్త కోటి ఇలవేల్పు  సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి(సింహాద్రి అప్పన్న) ఆలయంలో బుదవారం  ఏకాదశి పర్వదినం సందర్భంగా విశాఖకు చెందిన భువన విజయం సంస్థ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. వరాహ, నారసింహ అవతారాలతో భక్తులకు దర్శనమిస్తున్న ఆ సింహాద్రి నాధుని తమ కీర్తనలతో కీర్తించారు. సుమారు 40 మంది సభ్యుల బృందం అన్నమాచార్య సంకీర్తనలుతో పాటు విష్ణు సహస్ర నామ పారాయణంలు  కూడా గావించారు. దీంతో సింహగిరి హరినామ సంకీర్తనలతో మారుమ్రోగింది.. ఏకాదశి పర్వదినాన ఆ స్వామి సన్నిధిలో తమ బృందం సత్సంగం నిర్వహించడం ఎంతో సంతోషం కలిగించిందని సంస్థ అధ్యక్షులు నెహ్రూ ,కార్యదర్శి జవ్వాది లక్ష్మి పేర్కొన్నారు. ఇంతటి మహత్తర అవకాశం కల్పించిన  సింహాచలం ఆలయ వర్గాలకు బృందం సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఆలయ ఏఈవో ఎన్ వి వి ఎస్ ఎస్ ఎ ఎఏన్ రాజు వీరందరికీ స్వామి దర్శన భాగ్యం కల్పించారు. అర్చకులు ఇరగవరపు వెంకట రమణమూర్తి ఆచార్యులు ఆశీర్వాదం అందజేయగా, కార్య క్రమం సమన్వయకర్తగా అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు వ్యవహరించారు..
ఏకాదశి పర్వదినాన సింహగిరిపై విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహించడం, అన్నమాచార్య  సంకీర్తనలు తో, ఆ స్వామిని సేవించుకోవడం,స్మరించుకోవడం అదృష్టంగా ప్రతి   ఒక్కరూ  భావిం చాలన్నారు. సింహగిరిపై ఉత్సవాలు సమయంలోనే కాకుండ  నిరం తరం సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యా త్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే దిశగా ఆలయ వర్గాలు చేస్తున్న కృషి అభినందనీయమని శ్రీనుబాబు కొనియాడారు. అనంతరం సంస్ధ సభ్యులు శ్రీనుబాబు ను ఘనంగా సత్కరించారు.

Simhachalam

2022-09-21 09:53:08

అగ్నివీర్ కు ఎంపికైన ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో 14వ ఆంధ్ర బెటాలియన్ లో శిక్షణ పొందిన కళాశాల ఎన్.సి.సి విద్యార్థులు 56 మంది అగ్నివీర్ కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.సురేఖ పేర్కొన్నారు. ఇటీవల  విశాఖపట్నంలో జరిగిన ఆర్మీ ర్యాలీలో అగ్నివీర్  దేహదారుఢ్య పరీక్ష విభాగంలో ఎంపికైనట్లు ఆమె వివరించారు. వీరందరికీ ఎన్.సి.సిలో సి-సర్టిఫికెట్ ఉండడం వలన వ్రాత పరీక్ష లేకుండానే ఉద్యోగార్దులుగా మారుతారని, సైన్యంలో చేరే అవకాశాన్ని పొందుతారని ఆమె తెలిపారు. అగ్నివీర్ కు ఎంపికైన ఎన్.సి.సి క్యాడెట్లను ఈ సందర్భంగా అభినందిస్తున్నామని అన్నారు. దేశ సేవకై ఎంపికైన వీరంతా నిరంతరం దేశ రక్షణకై పరితపిస్తూ సైనికులుగా సేవలు చేయాలని విద్యార్థులకు సూచించారు. 

కళాశాలలో ఇటీవల ఎన్.సి.సి- బి మరియు సి-సర్టిఫికెట్ పరీక్షలలో ఎన్.సి.సి విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించినందుకు  కళాశాల ఎన్. సి.సి అధికారి లెఫ్ట్నెంట్ డా.వై.పోలి నాయుడు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు కొనియాడారు. గత 10 సంవత్సరాలలో బెటాలియన్ లో గల అన్ని ఎన్.సి.సి సీనియర్ డివిజన్ విభాగంలో ఈ సంవత్సరం శత శాతం ఉత్తీర్ణత సాధించడం చాలా హర్షనీయమని ప్రిన్సిపల్ తెలిపారు. అనంతరం బి మరియు సి సర్టిఫికెట్ ఉత్తీర్ణులైన క్యాడేట్లకు సర్టిఫికెట్లను ప్రిన్సిపల్ డాక్టర్ సురేఖ  అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ ఆర్.హరిత జె.కె.సి కో ఆర్డినేటర్ డా. డి పైడితల్లి, పరిపాలనాధికారి ఎన్.సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-21 09:48:35

అర్హులైన జర్నలిస్టులకి అక్రిడిటేషన్లు అందిస్తాం..

 విశాఖపట్నంలో జర్నలిస్టులు మంగళవారం కదం తొక్కారు, కోర్కెల దినం ఆందోళనలో గొంతు కలిపారు. జర్నలిస్టుల సమస్యల  పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లికార్జున హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్,  ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అక్రిడేషన్ల సమస్యను ప్రధానంగా జర్నలిస్టులు కలెక్టర్ కు వివరించారు. వెంటనే ఆయన డీపీఆర్ఓ మణిరాంను  రప్పించి ఈనెల 27వ తేదీలోగా ఆ సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.1994,2005  జర్నలిస్టుల స్థలాల సమస్యకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి పూర్తి వివరాలు అందజేశామని తెలిపారు. జర్నలిస్టులకు ఇల్లు,ఇళ్ల స్థలాలు,బీమా,పింఛన్ సదుపాయం,ఆటాక్స్ కమిటీల నియామకాలు చేపట్టాలని  కలెక్టర్ ను కోరారు..ఈ కార్యక్రమంలో జాతీయ జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నగర అధ్యక్షులు పి. నారాయణ్,బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ నగర అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు,ఫెడరేషన్  నాయకులు ఎ.సాంబశివరావు,శివప్రసాద్,దాడి రవికుమార్,కామాకుల మురళీకృష్ణ,జి శ్రీనివాసరావు,మధు,బొప్పన రమేష్, రాజశేఖర్,ఎమ్మెస్సార్ ప్రసాద్,చింతా ప్రభాకర్,ఆనంద్ కృష్ణమూర్తి, నగేష్, శివరాం, కడలి ప్రసాద్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-09-20 10:30:23

ఆప‌ద మిత్ర‌ల‌కు ప‌రిపూర్ణ శిక్ష‌ణ ఇవ్వాలి

అన్ని ర‌కాల ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను ఎదుర్కొని, ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించే విధంగా ఆప‌ద‌మిత్ర‌ల‌కు స‌మ‌ర్ధ‌వంత‌మైన‌ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని రూపొందించాల‌ని, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ ఆదేశించారు. ఆప‌ద మిత్ర‌ల శిక్ష‌ణా కార్య‌క్ర‌మంపై, క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో వివిధ శాఖ‌ల అధికారుల‌తో సోమ‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

               జిల్లా విప‌త్తుల నిర్వ‌హ‌ణాధికారి బి.ప‌ద్మావ‌తి మాట్లాడుతూ, జిల్లాలో 300 మంది వ‌లంటీర్ల‌ను ఆప‌ద మిత్ర‌లుగా ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. వ‌లంటీర్ల‌తోపాటు ఉద్యోగ విర‌మ‌ణ చేసిన డాక్ట‌ర్లు, సివిల్ ఇంజనీర్లు, అగ్నిమాప‌క‌, పోలీసు అధికారులు కూడా వ‌య‌సుతో సంబంధం లేకుండా ఆప‌ద‌మిత్ర‌లుగా చేర‌వ‌చ్చ‌ని సూచించారు. వీరికి 12 రోజుల శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని ఈనెల 16 నుంచి  ప్రారంభిస్తామ‌ని చెప్పారు. ప్ర‌కృతి వైప‌రీత్యాలు రాక‌ముందు, వ‌చ్చిన స‌మ‌యంలో, వ‌చ్చిన త‌రువాతా చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై నిపుణ‌ల‌తో శిక్ష‌ణ ఇప్పిస్తామ‌ని వివ‌రించారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల‌తోపాటు, మాన‌వ త‌ప్పిదాల కార‌ణంగా జ‌రిగే ప్ర‌మాదాల‌ను ఎదుర్కొనే విధానంపైనా శిక్ష‌ణ ఉంటుంద‌ని తెలిపారు.

               జెసి మ‌యూర్ అశోక్ మాట్లాడుతూ, ఆప‌ద మిత్ర‌లు అన్ని రకాల వైప‌రీత్యాల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొనే విధంగా శిక్ష‌ణ ఇవ్వాల‌న్నారు.  దీనికోసం ప్ర‌తీ ప్ర‌భుత్వ శాఖా, త‌మ‌త‌మ శాఖ‌ల ప‌రంగా జ‌రిగే విప‌త్తుల‌ను, వాటిని ఎదుర్కొనే విధానాన్ని ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా ఆప‌ద మిత్ర‌ల‌కు వివ‌రించాల‌ని సూచించారు. ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించే అవ‌కాశం ఉన్న దేశంలోని 352 జిల్లాల్లో మ‌న జిల్లా కూడా ఉంద‌ని, అందువ‌ల్ల ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త నివ్వాల‌ని సూచించారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను ఎదుర్కొనే విధానంపై మన దేశంలో ప్ర‌జ‌ల‌కు స‌రైన అవ‌గాహ‌న లేద‌ని, పాశ్చాత్యా దేశాల్లో చిన్న‌త‌నంలోనే వీటిని నేర్పిస్తార‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని గుర్తించిన జాతీయ విప‌త్తుల నిర్వ‌హ‌ణా సంస్థ‌, ప్ర‌జ‌ల‌కు వైప‌రీత్యాల‌ను ఎదుర్కొన‌డంలో స‌న్న‌ద్దం చేసేందుకు, ఇటువంటి శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేసింద‌ని చెప్పారు. మండ‌లానికి ఇద్ద‌రు చొప్పున ఆశా కార్య‌క‌ర్త‌ల‌ను కూడా ఎంపిక చేసి, ఆప‌ద‌మిత్ర శిక్ష‌ణ ఇప్పించాల‌ని జెసి సూచించారు.

              స‌మావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, జెడ్‌పి సిఇఓ ఎం.అశోక్ కుమార్‌, జిల్లా పంచాయితీ అధికారి ఇందిరా ర‌మ‌ణ‌, జిల్లా వ్య‌వ‌సాయాధికారి తార‌క‌రామారావు, మ‌త్స్య‌శాఖాధికారి ఎన్‌.నిర్మ‌లాకుమారి, సెట్విజ్ సిఇఓ రామానందం, పోలీసు, అగ్నిమాప‌క‌, అట‌వీశాఖాధికారులు పాల్గొన్నారు.
.........................................

Vizianagaram

2022-09-12 14:58:29

ఆక్వా రైతులు వాతావరణ మార్పులు గమనించాలి

పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆక్వా రైతులు వాతావరణ మార్పులు గమనించాలని జిల్లా మత్స్య శాఖ అధికారి వేముల తిరుపతయ్య కోరారు. అల్పపీడనం కారణంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆక్వా రైతులందరూ వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా చెరువులను పరిశీలించాలని ఆయన సూచించారు.  వాతావరణంలో మార్పుల వలన ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు, పీహెచ్, నీటిలో కరిగే ఆక్సిజన్ (డిజాల్వెడ్ ఆక్సిజన్ - డివో) లలో మార్పులు సంభవిస్తాయని ఆక్వా చెరువు నీటిలో ఉండాల్సిన వివిధ ధాతువుల విలువలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని ఆయన అన్నారు. ఆల్కలినిటి (కార్బోనేట్స్, బైకార్బోనేట్స్)   కొరకు తినే సోడాను ఎకరానికి 10 కేజీలు, పీహెచ్ కొరకు రాక్ లైమ్ ను ఎకరానికి ఒక బస్తా, డివో కొరకు గాలి మరలు (ఏరేటర్స్) ను, పొటాషియం పర్మాంగనేట్ ను, హైడ్రోజన్ పెరాక్సైడ్ ను, సోడియం ఫెర్బోరేట్ ను అందుబాటులో ఉంచుకోవాలని తిరుపతయ్య విజ్ఞప్తి చేశారు.

Parvathipuram

2022-09-10 07:26:44

పరిశ్రమలలో రక్షణ పై నివేదిక అందజేయాలి

అనకాపల్లి జిల్లాలో ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ క్రింద  ఎక్కువగా కాలుష్యం విడుదల చేస్తున్న  రెడ్,  ఆరంజ్ కేటగిరీల పరిశ్రమల్లో రక్షణ ఎక్కుప్మెంట్ ను తనిఖీ  చేసి   నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి జిల్లా స్థాయి రక్షణ కమిటీని
 ఆదేశించారు. పరిశ్రమల రక్షణ పై బుధవారం రాష్ట్ర స్థాయి కమిటీ అధికారులతో అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు  జిల్లా స్థాయి కమిటీ చైర్మన్ మరియు జిల్లా  కలెక్టర్ తో పాటు సభ్యులు పరిశ్రమల శాఖ శ్రీధర్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.రమ్య, పి.సి.బి ఈ ఈ లు పాల్గొన్నారు. వి.సి అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో పరిశ్రమలలో  జరిగిన ప్రమాదాలను దృష్టి లో పెట్టుకొని పరిశ్రలలో సేఫ్టీ ని తనిఖీ చేయడానికి జిల్లా స్థాయి కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. జిల్లాలో రెడ్, ఆరంజ్ కేటగిరీ లలో  పరిశ్రమలు ఉన్నాయని, వాటిని కమిటీ సభ్యులు తనిఖీ చేసి నివేదికను రాష్ట్ర స్థాయి కమిటీ కి పంపవలసి ఉంటుందని తెలిపారు.

Anakapalle

2022-09-08 05:14:17

విశాఖలో రేపు అవధానకవి బ్రహ్మోత్సవం

అవధాన కవి బ్రహ్మోత్సవం సందర్భము గా ప్రముఖ  ఆసుకవి పద్య పితామహులు శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం 20 వ వార్షికోత్సవం శుక్రవారం రాత్రి కళాభారతి లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను బుధవారం కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు  మా శర్మ సింహాద్రి నాథుడు, శ్రీదేవి భూదేవి ,పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మా శర్మ మాట్లాడుతూ మూడేళ్లకు సంబంధించిన ప్రతిభా పురస్కారాలను ఈ యేడాది అందజేస్తున్నామన్నారు. ప్రధానంగా ప్రముఖ సంగీతదర్శకులు డాక్టర్ సింగీతం శ్రీనివాసరావు కు జాతీయ ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం చేయనున్నట్లు తెలిపారు. ఈ సభకు గరికిపాటి నరసింహారావు అధ్యక్షత వహించగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు నుంచి  అవధానులు, ప్రముఖ సాహితీ వేత్తలు, కళాకారులు హాజరు కానున్నట్లు తెలిపారు. 

మాశర్మతో పాటు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తదితరులంతా  ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయము వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ కొప్పరపు కవులు కనకదుర్గ, ఆంజనేయస్వామి ఉపాసకులని, ఏదైనా మనసులో సంకల్పిస్తే అది తప్పకుండా నెరవేరుతుందన్నారు అటువంటి కార్యక్రమంలో ప్రతీ ఏటా తాను పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాపీఠం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-09-07 06:43:46

ఇంటి నిర్మాణాలు సత్వరమే పూర్తిచేయాలి

న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యేలా ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌కు సూచించారు. మంగ‌ళ‌వారం కాకినాడ క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంపై కాకినాడ అర్బ‌న్‌, రూర‌ల్‌, తుని, తొండంగి మండ‌లాల రెవెన్యూ అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ లేఅవుట్ల‌లో నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు క‌ల్పించినందున ఇళ్ల నిర్మాణాల‌ను వేగ‌వంతం చేయాల‌ని సూచించారు. లేఅవుట్ల‌లో ఖాళీగా ఉన్న ప్లాట్ల‌ను న‌వ‌ర‌త్నాలు పేద‌లంద‌రికీ ఇళ్లు, 90 రోజుల్లో ఇంటి ప‌ట్టా కింద అర్హులైన ల‌బ్ధిదారుల‌కు కేటాయించాల‌న్నారు. ల‌బ్ధిదారుల‌ను వారికి కేటాయించిన ప్లాట్ల‌తో మ్యాపింగ్ చేయాల‌ని ఆదేశించారు. 

అదే విధంగా అవ‌స‌ర‌మైన‌చోట భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని స్ప‌ష్టం చేశారు. స‌మావేశంలో హౌసింగ్ పీడీ బి.సుధాక‌ర్ ప‌ట్నాయ‌క్, న‌గ‌ర‌పాల‌క సంస్థ అద‌న‌పు క‌మిష‌న‌ర్ సీహెచ్ నాగ‌న‌ర‌సింహారావు, వివిధ మండ‌లాల త‌హ‌సీల్దార్లు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-09-06 13:50:09

కేవీ సంఘటనకు కారణం తెలుసుకోండి

కాకినాడ‌లో కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురైన సంఘ‌టన‌ చోటు చేసుకోవ‌డానికి కార‌ణాన్ని క‌చ్చితంగా తెలుసుకోవ‌డం ద్వారా భ‌విష్య‌త్తులో ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా చూసుకోవడానికి వీలుపడుతుందని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా సూచించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో  ప్ర‌త్యేక విచార‌ణ క‌మిటీ స‌భ్యుల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, అధికారుల‌తో క‌లిసి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల ర‌క్త న‌మూనాలు, తాగునీటి న‌మూనాల‌ను ల్యాబ్‌ల‌కు పంపినందున‌.. నివేదిక‌లు వ‌స్తే కార‌ణాల‌ను అన్వేషించేందుకు వీల‌వుతుంద‌న్నారు. అదే విధంగా మైక్రో బ‌యాల‌జీ నిపుణుల‌ను పాఠ‌శాల‌కు పంపి ప‌రిశీల‌న చేయించాల‌ని అధికారుల‌కు సూచించారు.  

సోమ‌వారం ఉద‌యం నుంచి మంగ‌ళ‌వారం సంఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యం వ‌ర‌కు పాఠ‌శాల కార్య‌క‌లాపాల‌ను ప్రిన్సిప‌ల్ బి.శేఖ‌ర్‌ను అడిగి తెలుసుకున్నారు. త‌ర‌గ‌తి గ‌దుల్లో మౌలిక వ‌స‌తులు, ప‌రిస‌రాల వాతావ‌ర‌ణం, విద్యార్థులు పాల్గొన్న పాఠ్య‌, స‌హ పాఠ్య కార్య‌క్ర‌మాలు, తాగునీటి వ్య‌వ‌స్థ త‌దిత‌రాల వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య ప‌రిస్థితిని జీజీహెచ్ వైద్యులు డా. ఎంఎస్ రాజు వివ‌రించారు. పాఠ‌శాల‌లో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌ని కేంద్రీయ విద్యాల‌య ప్రిన్సిప‌ల్‌కు సూచించారు. సంఘ‌ట‌న‌పై పూర్తిస్థాయిలో విచార‌ణ చేసి ఆయా విభాగాల ప‌రిశీల‌న‌ల నివేదిక‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. స‌మావేశంలో క‌మిటీ ఇత‌ర స‌భ్యులు పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎన్‌.అశోక్ కుమార్‌, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.రాధాకృష్ణ‌, డీఈవో దాట్ల సుభ‌ద్ర‌, అస్టిస్టెంట్ ఫుడ్ కంట్రోల‌ర్ బి.శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-09-06 13:39:16

విషవాయువులు లీకేజేలేమీ జరగలేదు..

కాకినాడ గ్రామీణ మండలం వలసపాకల గ్రామంలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థుల అస్వస్థతకు కారణం విషవాయువులు కాదని.. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీల నుంచి విషవాయువు ఎక్కడ విడుదల కాలేదని కాకినాడ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు కురసాల కన్నబాబు తెలిపారు.  ఈ సంఘటనలో మంగళవారం ఉదయం నుంచి కేవలం భయాందోళనలు సృష్టించేందుకు కొంత మంది చేస్తున్న రకరకాల వదంతుల్లో ఏమాత్రం నిజం లేదని ప్రాథమికంగా విచారణలో తేలిందన్నారు.   418  విద్యార్థులు ఉన్న కేంద్రీయ విద్యాలయంలో కేవలం ఆరు, ఏడు తరగతులలో ఉన్న 18 మంది విద్యార్థులకు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని ఆయన తెలిపారు. కాకినాడ గ్రామీణ మండలం వలసపాకల గ్రామంలో ఉన్న కేంద్రీయ విద్యాలయం పరిశ్రమలకు చాలా దూరంగా ఉందని ముఖ్యంగా సూర్యపేటకు దగ్గర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయన్నారు.  జిల్లా కలెక్టర్  ఆధ్వర్యంలో నియమించిన కమిటీ సభ్యులు అంతా పరిశీలించి వాస్తవ విషయాన్ని నిర్ధారించడం జరుగుతుందన్నారు. జీజీహెచ్ లో వైద్య సేవలు పొందుతున్న విద్యార్థులు అందరితో మాట్లాడటం జరిగిందని వీరందరూ కొరకు ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచడానికి అవసరమైన ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర మేయర్ సుంకర శివప్రసన్న, కుడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి,  జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.పి.వెంకటబుద్దా,  ఆర్ఎంఓ డా.అనిత, డిఎంహెచ్ఓ డా. ఆర్.రమేష్, డిఈఓ డి.సుభద్ర, వైద్యాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

Kakinada

2022-09-06 13:03:37

ధరఖాస్తుదారులను వేధిస్తే సహించేది లేదు

మ్యుటేషన్ దరఖాస్తుదారులను వేదిస్తూ పదే పదే తిప్పటం సరికాదని, అంతే కాకుండా విఆర్ఓ లాగిన్ లో రిజెక్ట్ చేయటo జరుగుతోందని, అటువంటి సందర్భాలలో ఆయా తహసిలదార్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మంగళవారం కలక్టరేట్ విసి హాల్ నుండి మండల స్థాయి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ,  మ్యుటేషన్ దరఖాస్తుదారులకు కుటుంబ సభ్యుల ధృవీకరణ, నోటరీ అఫిడివిట్ లేకుండా సిసిఎల్ఎ సూచనల ప్రకారం మ్యుటేషన్ చేయాలని ఆదేశాలు జారీ  చేసినప్పటికీ కొంతమంది తహసిల్దార్లు పట్టించుకోటం లేనందున చాలా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.  ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అభిషేక్ ను వారితో సమీక్షించి మ్యుటేషన్లు త్వరగా పూర్తీ చేయాలని ఆదేశించారు. 

11 మండలాలు తిరిగి  విఆర్ఓల పని తీరుపై అసంతృప్తి వ్యక్త పరిచిన సబ్ కలెక్టర్ 15 మంది విఆర్ఓలకు నోటీసులు జారీ చేసామని సబ్ కలెక్టర్ తెలిపారు.  సచివాలయాలలో పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ ఉండటంపై కూడా కలెక్టర్ అసంతృప్తి వ్యక్త పరుస్తూ సకాలంలో పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 22 పెన్సన్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న కొయ్యూరు తహసిల్దార్ గూర్చి ఆరా తీయగా తనకి డిజిటల్ సైన్ కాలేదని తెలిసుకుని, జాయినై నెల దాటినా డిజిటల్ సైన్ లేకుండా ఎం చేస్తున్నారని, మరుసటి వారం విసి నాటికి డిజిటల్ సైన్ తీసుకోకపోతే వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.  అదేవిదంగా  సచివాలయ సిబ్బందిని తరచూ సమీక్షించాలని, సచివాలయ సిబ్బంది యునిఫారం ధరించేలా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ లను ఆదేశించారు.  

 ప్రతి సచివాలయంకు గడప గడపకు మాన ప్రభుత్వం కింద రూ.20 లక్షలు మంజూరు అయినందున సంబంధిత శాశన సభ్యులుతో చర్చించి ఆయా సచివాలయాల పరిధిలో చేపట్టాల్సిన పనులను అప్లోడ్ చేయాలని, సాంకేతిక, పరిపాలనాపరమైన మంజూరులు పొందాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విడియో కాన్ఫెరెన్స్ లో జిల్లా నుండి డిఆర్ఓ బి. దయానిధి, మండలాల నుండి, ఇటిడిఎ ప్రోజేక్ట్ అధికారులు రోణంకి గోపాల కృష్ణ, సూరజ్ గనోరే, తహసిల్దార్లు, ఏమ్పిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-09-06 12:58:16