1 ENS Live Breaking News

ఆ భూముల్లో జ్యూడిషియల్ విచారణ జరగాలి

కాకినాడ బీచ్ రోడ్ మార్గంలో వున్న విలువైన దుమ్ములపేట భూముల్లో పేదలకు పట్టాలు గృహనిర్మాణం పనులు సత్వరం చేపట్టకుండా గత ప్రభుత్వంలో శిలా ఫలకాలతో నిర్లక్ష్యం చేసారని..  పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్ల పూడి రమణరాజు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో వాటిని కబ్జా చేయడానికి చేస్తున్న యత్నాలు గత ఏడాది నుండి జరగడం దురదృష్టకరమని.. 1983 లో ఎన్ టి ఆర్ ను కోరి మరీ తీసుకున్న అక్కడి భూమి మనిషి నిలువెత్తు లోతులో వుండగా వాటిని మెరక చేసుకోవడానికి అక్కడి మత్సకారుల కుటుంబా లకు పాతికేళ్ళు పట్టిందని పేర్కొన్నారు.. ఎన్ టి ఆర్ నగర్ గా ఆ ప్రాంతాన్ని నామకరణం చేసి పేదలకు ఇచ్చిన పట్టాలు కొనసాగించి ప్రభుత్వ గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. 

గత ఏడాది నుండి  దుమ్ముల పేట స్థలంలో ఆర్ టి సి మార్కెట్ ఏర్పాటు అంటూ చేసిన కౌన్సిల్ ప్రతిపాదనలు వివాదా స్పదం కాగా ప్రజల నివాసం లేని చోట రు.50 లక్షలు నిధులు కేటాయించిన తీర్మానం వెనుక ఉద్దేశ్యపూర్వక ఎత్తుగడలువున్నాయ న్నారు. ప్రశాంత మైన నగరంలో కంచే చేను మేస్తున చందంగా జరుగుతున్న కబ్జాల సంస్కృతి పెరగకుండా రాజకీయ అలజడి సృష్టిస్తున్న ధోరణి ప్రభలకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుమ్ముల పేట భూములపై జ్యూడిషియల్ విచారణ చేయాలని రమణరాజు కోరారు.

Kakinada

2022-09-03 11:35:16

పిఠాపురం స్పందన వినియోగించుకోవాలి

సెప్టెంబర్ నెల మొదటి  సోమవారం 5వ తేదీన  జిల్లాస్ధాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమాన్ని పిఠాపురంలోని రెడ్డి రాజా కళ్యాణ మండపంలో  ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలియజేసారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్  విజ్ఞాపనలను పిఠాపురంలో స్వీకరిస్తామని కాకినాడ జిల్లాకు చెందిన  అర్జీదారులు అందరూ ఈ అంశాన్ని  గమనించి సెప్టెంబర్ 5వ తేదీన తమ అర్జీలను పిఠాపురంలో నిర్వహించే  స్పందన కార్యక్రమంలో సమర్పించాలని ఆమె కోరారు. అలాగే వివిధ శాఖల జిల్లా అధికారులు అందరూ  సెప్టెంబర్ 5వ తేదీ సోమవారం ఉదయం 9-30 గంటలకే పిఠాపురంలో నిర్వహించే స్పందన గ్రివెన్స్ సెల్ కార్యక్రమానికి  విధిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.


Kakinada

2022-09-03 11:30:25

ప‌రిశ్ర‌మ‌ల్లో భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల్సిందే

ప‌రిశ్ర‌మ‌ల్లో కార్మికుల భ‌ద్ర‌త‌, కాలుష్య నియంత్ర‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ త‌దిత‌రాల‌కు సంబంధించి నియ‌మ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని.. ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా స్ప‌ష్టం చేశారు. శ‌నివారం కాకినాడ క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో ప‌రిశ్ర‌మ‌లు, క‌ర్మాగారాలు, కాలుష్య నియంత్ర‌ణ‌, విప‌త్తుల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో పాటు జిల్లాలోని వివిధ ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఇటీవ‌ల వాకలపూడి పారిశ్రామికవాడలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప‌రిశ్ర‌మ‌లో జ‌రిగిన ప్ర‌మాదాల్లో నలుగురు మ‌ర‌ణించ‌డం చాలా బాధాక‌ర‌మ‌ని.. ఇక‌పై జిల్లాలో ఒక్క ప్ర‌మాదం కూడా జ‌ర‌క్కుండా చూడాల‌న్నారు. 

భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటిస్తూ ప‌నిప్ర‌దేశాల‌ను అత్యంత సుర‌క్షితంగా ఉండేలా చూసుకోవాల‌ని.. చిన్న‌పాటి నిర్ల‌క్ష్యం పెను ప్ర‌మాదానికి దారితీయొచ్చ‌నే విష‌యాన్ని గుర్తించి, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. త్వ‌ర‌లో జిల్లాలోని అన్ని పారిశ్రామిక యూనిట్ల‌లో సేఫ్టీ ఆడిట్‌, త‌నిఖీలు చేప‌ట్టేందుకు జిల్లా క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న జిల్లాస్థాయి క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ఈ క‌మిటీలో జిల్లా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ ఫ్యాక్ట‌రీస్‌, డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ లేబ‌ర్‌, ఏపీపీసీబీ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజీనీర్‌, జిల్లా అగ్నిమాప‌క అధికారి, ఎల‌క్ట్రిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ త‌దిత‌రులు స‌భ్యులుగా ఉంటార‌ని వివరించారు. అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తో ప్రారంభించి.. ద‌శ‌ల వారీగా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ త‌నిఖీలు చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

 చెక్ లిస్ట్‌ల ప్ర‌కారం విస్తృత స్థాయి త‌నిఖీలు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరుపై నిరంత‌ర అప్ర‌మ‌త్త‌త‌, ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని.. ఆ దిశ‌గా పరిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా భ‌ద్ర‌త‌, ప‌ర్యావ‌ర‌ణ హిత చ‌ర్య‌ల‌పై ఆడిట్ జ‌ర‌గ‌నుంద‌ని వెల్ల‌డించారు. ఇంట‌ర్ లాకింగ్‌, అలార‌మ్ వంటి వ్య‌వ‌స్థ‌ల‌ను ఆధునికీక‌రించుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల్లో వివిధ విభాగాల్లో ప‌నిచేసేందుకు నిబంధ‌న‌ల మేర‌కు ఆయా కార్య‌క‌లాపాల‌పై నైపుణ్య‌మున్న వారిని మాత్ర‌మే నియ‌మించుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. కార్మికుల భ‌ద్ర‌త‌తో పాటు సంక్షేమానికి సంబంధించి అన్ని నిబంధ‌న‌ల‌ను తు.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.రాధాకృష్ణ‌,  డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ జి.ల‌క్ష్మీన‌ర‌స‌య్య‌, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎన్.అశోక్, పరిశ్రమల శాఖ ఏడీ కె.కృష్ణార్జున‌ రావు, జిల్లా అదనపు అగ్నిమాపక శాఖ అధికారి బి.యేసుబాసు, జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-09-03 11:26:15

శత శాతం బయోమెట్రిక్ హాజరు ఉండాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో డెంగ్యూ జ్వరాల నియంత్రణకు పాలకొండలో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు.  శనివారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఫ్యామిలీ డాక్టరు,   బయోమెట్రిక్ హాజరు, ఆసుపత్రి ప్రసవాలు, 108, 102 తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్, వాక్సిన్ ప్రక్రియ, స్కూలు విద్యార్థుల ఆరోగ్యవివరాలు నమోదు, మాతాశిశు వివరాలు నమోదు, ఆసుపత్రుల భవనాలు నిర్మాణం తదితర అంశాలపై  వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టరు అంశాలు వారీగా లక్ష్యాలు సమీక్షించారు.  ఈ సంధర్బంగా జిల్లా కలెక్టరు సమీక్ష నిర్వహిస్తూ  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న  కుటుంబ డాక్టరు పధకాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. 

 ఈ పధకంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,  గ్రామానికి వెళ్లినపుడు అక్కడ సచివాలయం పరిధిలో ప్రజల ఆరోగ్య వివరాలు సంబంధించిన పూర్తి సమాచారంతో గ్రామానికి వెళ్లాలన్నారు.  ఉదయం గ్రామంలో గల దీర్ఝకాల వ్యాధిగ్రస్తులు, రక్తపోటు తదితర వ్యాదులు, మధుమేహం తదితర వ్యాధులతో బాధపడుతున్నవారికి చికిత్సనందించాలని, మద్యాహ్నం  ఇంటింటికి వెళ్లాలని, వైఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వారి ఆరోగ్యం పరిశీలించాలని, వయోవృద్దులు, నడువలేనివారికి చికిత్స అందించాలని తెలిపారు.  ఆసుపత్రికి, పట్టణాలకు వెళ్లి పొందే వైద్యసేవలు ఇంటి వద్దనే పొందుతున్నామనే సంతృప్తి ప్రజలకు కల్పించాలని తెలిపారు.  

గర్బిణీ స్త్రీల వివరాలు నమోదు, ఆసుపత్రులు ప్రసవాలు తక్కువ కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. రావివలస, సీతానగరం తదితర మండలాల ఆసుపత్రులలో ఒక్క ప్రసవం కూడా నమోదు కాకపోవడంపై వివరణ కోరారు. పాలకొండలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు కావడంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయవలసినదిగా ఆదేశించారు.  ఇంటింటి సర్వే, స్ప్రేయింగు, యాంటీ లార్వా కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. పాలకొండ రెవిన్యూ డివిజినల్ అధికారి, స్థానిక మున్సిపల్ కమీషనరుకు బాద్యతలు అప్పగించి పనులు పర్యవేక్షించేటట్లు అదేశాలిచ్చారు. 

నూరుశాతం బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని తెలిపారు. హాజరు నమోదు చేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పాఠశాల విద్యార్థుల ఆరోగ్య వివరాలు నమోదు 56 శాతంగాను, ఎన్.సి.డి. సర్వే 70 శాతం గాను ఉందని, కొన్ని మండలాలలో జిల్లా సరాసరి శాతం కూడా నమోదు చేయపోవడంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పిల్లలకు వ్యాక్సినేషను కార్యక్రమం 42 శాతం ఉందని నూరు శాతం పూర్తిచేయాలని, డేటా అప్ లోడ్ లో యిబ్బందులు ఉంటే వ్రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. 

108 వాహనాలలో ఎక్కువ ప్రసవాలు జరుగడంపై జిల్లా కలెక్టరు ప్రశ్నించారు. కొన్ని ఆసుపత్రులలో సున్నా ప్రసవాలు నమోదుకాగా  108 వాహనాలలో ప్రసవాలు పెరుగుతుండటంపై ఆయన ఆరా తీశారు. 108లో ప్రసవించిన వారి పూర్తి ఆరోగ్య వివరాలు సమర్పించాలని, ముందుగా వారిని ఆసుపత్రికి తరలించక పోవడానికి గల కారణాలపై నివేదిక సమర్పించాలని సంబంధిత పి.హెచ్.సి. అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రసవంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి నివేదించాలని ఆయన ఆదేశించారు. నివేదిక అందిన 24 గంటలలో జిల్లా కలెక్టర్ కు సమర్పించాలని ఆయన ఆదేశించారు. 

జిల్లాలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలటీ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీ, యితర  ఆసుపత్రుల నిర్మాణాల పురోగతిని సమీక్షిస్తూ  చిన్నచిన్న మరమత్తు పనులు గల భవనాలను 10 రోజులలో పూర్తి చేయాలన్నారు. రోడ్లు, భవనాల శాఖ చేపట్టిన పనులను సెప్టెంబరు నెలాఖరుకు పూర్తిచేయాలని తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన భవనాలు నాణ్యత విషయంలో వైద్యాధికారులు ముందుగానే తనిఖీ చేసి సంతృప్తిచెందాలన్నారు.  ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యాశాఖాధికారి బి. జగన్నాధరావు, ఆసుపత్రుల సమన్వయాధికారి బి.వాగ్దేవి, జిల్లా మలేరియా అధికారి కె.పైడిరాజు, ఎపిఎంఐడిసి ఇఇ సత్య ప్రభాకర రావు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు, 108, ఇంజనీరింగు సిబ్బంది పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-03 11:17:16

2వ ద‌శ‌లో 111 ఆల‌యాల నిర్మాణాలు

స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తిలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్స్య‌కార ప్రాంతాల్లో మ‌త మార్పిడుల‌ను అరిక‌ట్టేందుకు శ్రీ‌వాణి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ స‌హ‌కారంతో రెండో ద‌శలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 111 ఆల‌యాల నిర్మాణం చేప‌ట్టాల‌ని టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని ప‌రిపాల‌న భ‌వ‌నంలో గ‌ల ఈవో కార్యాల‌యంలో శ‌నివారం శ్రీ‌వాణి ట్ర‌స్టుపై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ‌వాణి ట్ర‌స్టు నిధుల‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 1342 ఆల‌యాల నిర్మాణం చేప‌ట్టాలని నిర్ణ‌యించామ‌ని, మొదటి ద‌శ‌లో 502 ఆల‌యాల నిర్మాణం జ‌రిగింద‌ని తెలిపారు. రెండో ద‌శ‌లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్స్య‌కార ప్రాంతాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో రూ.10 ల‌క్ష‌ల వ్య‌యంతో ఆల‌యాల నిర్మాణం జ‌రుగ‌నుంద‌న్నారు.



 వీటిలో శ్రీ‌వారి ఆల‌యాలు -9, రామాల‌యాలు -77, హ‌నుమంతుని ఆల‌యాలు -2, శివాల‌యాలు - 3, గ్రామ‌దేవ‌త‌ల ఆల‌యాలు - 20 ఉన్నాయ‌ని వివ‌రించారు. మొత్తం 1342 ఆల‌యాల నిర్మాణం రెండేళ్ల‌లో పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని, ప్ర‌తి రెండు నెల‌లకోసారి ఆల‌యాల నిర్మాణంపై స‌మీక్ష నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. నిర్మాణం పూర్త‌యిన 502 ఆల‌యాలకు, నిర్మాణం జ‌రుగ‌నున్న 111 ఆల‌యాల‌కు భ‌జ‌న సామ‌గ్రి అందించేందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ ఆల‌యాల్లో అర్చ‌కులుగా నియ‌మించే వారికి శ్వేత ఆధ్వ‌ర్యంలో నిత్య‌పూజా విధానంపై శిక్ష‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌న్నారు.   ఈ స‌మీక్ష‌లో టిటిడి జెఈవోలు  స‌దా భార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మం, ఎఫ్ఏసిఏవో  ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, సమరసత సేవా ఫౌండేషన్ ఛైర్మన్  తాళ్లూరు విష్ణు, సెక్ర‌ట‌రీ త్రినాథ్‌, జాయింట్ సెక్ర‌ట‌రీ  సునీల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirupati

2022-09-03 10:54:54

ప్రణాళికాబద్దంగా విశాఖ నగరాభివ్రుద్ధి

జీవిఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాలను, వార్డులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె 5వ జోన్ పరిధిలోని 49, 50 వార్డులలో పలు అభివృద్ధి పనులకు ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు, స్థానిక కార్పొరేటర్లు వావిలపల్లి ప్రసాద్, అల్లు శంకర్రావు తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో విశాఖ నగరంలో ఉన్న ప్రతి వార్డు నుంచి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. 49 వ వార్డు లో సుమారు రూ. 49.90 లక్షల వ్యయంతో భూగర్భ మురుగునీటి పైపులైను పనులకు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, అలాగే 50 వార్డులో సాయిరామ్ నగర్, సత్య నగర్, మాధవధార, వంశీ నగర్, నరసింహ నగర్ , మురళి నగర్ తదితర ప్రాంతాలలో సిసి రోడ్లు, సిసి కాలువ నిర్మాణానికి సుమారు రూ.115.50 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసామని తెలిపారు.

 అయ్యా  వార్డుల కార్పొరేటర్లు సమిష్టి కృషితో వార్డులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు ఈ వార్డుల్లో ఖర్చు పెట్టడం జరుగుతుందని  మేయర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, సచివాలయం సెక్రటరీలు, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-09-03 06:49:12

ఓటరు నమోదు, సవరణ వినియోగంచుకోవాలి

భారత ఎన్నికల కమిషన్  ప్రత్యేక ముమ్మర సవరణ -2023 ను ప్రారంభించి యున్నందున ఓటర్లు స్వచ్ఛందంగా గానీ, బూత్ లెవల్ అధికారుల ద్వారా గానీ ఓటు నమోదు, సవరణ, పేరు చిరునామా మార్పు లకు సంబంధించి ధరఖాస్తు చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్  డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఓటు నమోదు , మార్పులు చేర్పులు , తొలగింపులకు ww.nvsp.in మరియు www.voterportal.eci.in లేదా voters app  ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా లోని  ఓటర్లు ఈ క్రింది సూచనల ప్రకారం తెలుసుకుని బూత్ లెవెల్ అధికారులకు సంప్రదించి  తగిన మార్పులు చేర్పులు కోసం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాధవీలత కోరారు.

మీ ఓటర్ కార్డును మీ యొక్క ఆధార్ కార్డ్ కు లింకు చేయుట కొరకు , ప్రతి ఓటరుకు తన ఆధార్ కార్డ్ ను ఫారం- 6 బి ద్వారా అనుసంధానం చేయవలసి యున్నదని తెలియచేశారు. ఇందు కోసం మీ ప్రాంతం లోని బూత్ లెవెల్ అధికారులకు " GARUDA APP " ను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ ఆగస్ట్ 1 వ తేదీన కేంద్ర ఎన్నికల కమీషన్ వారు ప్రవేశపెట్టి యున్నారు.  ఎవరికి వారు  ఓటర్లు స్వచ్ఛందంగా www.nvsp.in , www.voterportal.eci.in లేదా voters app నందు ఆధార్ లింకు చేసుకొనే వెసులు బాటు కూడా అందుబాటులో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.


కొత్త ఓటర్లు నమోదు కొరకు  01-01-2023 నాటికి 18 సం॥లు నిండే ప్రతి పౌరుడు ఓటు నమోదు చేసుకొనుటకు అవకాశం ఫామ్. 6 ద్వారా కల్పిస్తున్నట్లు తెలిపారు.  ఓటు నమోదు ప్రక్రియను నిరంతరం కొనసాగే విధంగా ఏడాదికి నాలుగు సార్లు నమోదుకు అవకాశం కలుగ చెయ్యడం జరుగుతోందని పేర్కొన్నారు.  జనవరి 1 , ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 సం.ములు నిండిన వారికి కూడా ముందస్తుగా ఓటు నమోదు కొరకు అవకాశం తద్వారా కల్పించినట్లు తెలిపారు. ఎన్ ఆర్ ఐ ఓటర్లు నమోదు కొరకు ఫారం 6బి , ఓటు తొలగించుట కొరకు ఫారం 7,  ఓటర్ కార్డు నందు మార్పుల కొరకు ఫారం 8 ( ఉదా : పేరు , లింగం , వయస్సు మరియు బంధుత్వంలో గల మార్పుల కొరకు ) నివాసం మార్పు కొరకు ( అసెంబ్లీ నియోజకవర్గం పరిధి లోపల / పరిధి దాటి)  ప్రత్యామ్నాయ ( డూప్లికేట్ ) ఓటర్ కార్డ్ కొరకు ఫారం 8 ని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు.  

Rajamahendravaram

2022-09-03 06:29:51

రుణాల మంజూరు వేగ‌వంతం చేయాలి

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రాధాన్య సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి బ్యాంకు లింకేజీ రుణాల మంజూరు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు, వివిధ బ్యాంకుల ప్ర‌తినిధుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా సూచించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో టిడ్కో, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు, జ‌గ‌న‌న్న తోడు కార్య‌క్ర‌మాలకు బ్యాంకు లింకేజీ రుణాల మంజూరుపై క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు, బ్యాంక‌ర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. బ్యాంకుల వారీగా రుణ మంజూరుపై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ల‌బ్ధిదారుల‌కు రుణాలు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టి అవ‌స‌ర‌మైన డాక్యుమెంటేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేసి.. రుణాలు మంజూర‌య్యేలా చూడాల‌న్నారు.

 ఏపీ టిడ్కో హౌసింగ్‌కు సంబంధించి లబ్ధిదారులకు  బ్యాంకు రుణాల మంజూరు, రిజిస్ట్రేషన్ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేసి త్వరితగతిన లబ్ధిదారులకు గృహాలు అప్పగించే విధంగా అధికారులు కృషిచేయాలన్నారు. కాకినాడ‌, పెద్దాపురం, పిఠాపురం, సామ‌ర్ల‌కోట ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ప‌రిధిలో 5,064 ల‌బ్ధిదారుల‌కు గాను 2,534 గృహాలకు రూ. 66.54 కోట్ల రుణాలు అందించ‌డం జ‌రిగింద‌ని.. మిగిలిన గృహాల‌కు కూడా రుణ మంజూరు ప్ర‌క్రియ‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని సూచించారు. అదే విధంగా జ‌గ‌న‌న్న తోడు కింద స‌వ‌రించిన ల‌క్ష్యాల‌కు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,995; ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 5,906 మంది చిరు వ్యాపారుల‌కు రూ. 10 వేలు చొప్పున రుణాలు అందించాల్సి ఉంటుంద‌న్నారు. 

అదే విధంగా న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల ల‌బ్ధిదారుల‌కు రూ. 35 వేల చొప్పున అద‌న‌పు ఎస్‌హెచ్‌జీ లింకేజీ బ్యాంకు రుణాల మంజూరును కూడా వేగవంతం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు.. బ్యాంక‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ శ‌త శాతం ల‌క్ష్యాలను చేరుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. స‌మావేశంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీర‌మ‌ణి, మెప్మా పీడీ బి.ప్రియంవ‌ద‌, హౌసింగ్ పీడీ బి.సుధాక‌ర్ ప‌ట్నాయ‌క్‌, ఎల్‌డీఎం సీహెచ్ ఎస్‌వీ ప్ర‌సాద్‌, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ అద‌న‌పు క‌మిష‌న‌ర్ సీహెచ్ నాగ‌న‌రసింహారావు, డీఎల్‌డీవో పి.నారాయ‌ణ‌మూర్తి, వివిధ బ్యాంకుల అధికారులు తదిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-09-02 16:26:03

స్వమిత్వా సర్వే జిల్లాలో త్వరగా పూర్తిచేయాలి

పశ్చిమగోదావరి జిల్లాలో స్వమిత్వా కింద చేపట్టిన సర్వే తరగతి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఈ ఓ పి ఆర్ డి లను,  సర్వేయర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుండి స్వమిత్య , జగనన్న స్వచ్చ సంకల్పం  పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలోని 16 మండలాల్లోని  16 గ్రామాలలో  స్వమిత్య కార్యక్రమం చేపట్టడం జరరిగిందని దీనిని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు. ఈ ఓ పి ఆర్ డి లకు వచ్చే వారంలో స్వమిత్య పై పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది కలెక్టరు తెలిపారు. స్వమిత్వపై ఇచ్చిన మార్గదర్శకాలు అన్ని ఈవోపీఆర్డీలు సర్వేయర్లు క్షుణ్ణంగా చదవాలని కలెక్టరు ఆదేశించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద అన్ని గ్రామాలలో అప్రోచ్ రోడ్లను  పరిశుభ్రం చేయాలని కలెక్టర్ సూచించారు. 

గ్రామాలలో చెత్త సేకరణ సక్రమంగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అన్ని గ్రామాల్లో ఉన్న ఎస్ డబ్ల్యూ పి సిలో అన్ని  కంపోస్ట్ తొట్లు ప్రాసెసింగ్ జరగాలని ఆమె ఆదేశించారు.  జిల్లాలోని అన్ని గ్రామాలు పరిశుభ్రత తో ఉండాలని జిల్లా కలెక్టరు  పి.ప్రశాంతి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  డిపిఓ యం నాగలత ,  ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జాషువా, ఈఓపిఆర్డీలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.


Bhimavaram

2022-09-02 14:18:50

ఎక్స్ లెన్స్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని   పర్యాటక ఎక్స్ లెన్స్ అవార్డులను అందించనున్నట్లు జిల్లా పర్యాటక శాఖాధికారి జి. దాసు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పర్యాటక ఎక్స్ లెన్స్ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దాసు తెలిపారు. పర్యాటకరంగంతో వ్యక్తిగత, సంస్థాగతపరమైన అంశాలకు చెందిన 40 విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, ఎంపికైన వారికి ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజు పర్యా టకశాఖ ఎండీ కన్నబాబు చేతుల మీదుగా అవార్డులను అందజేయనున్నట్లు వివరించారు. ఔత్సాహి కులు సెప్టెంబరు 10లోపు తమ దరఖాస్తులను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని పూరించి ఏపీటీఎ కార్యాలయం, విజయవాడవారికి అందజే యాలని వివరించారు. పూర్తి వివరాల కోసం 6309942028, నంబర్ కానీ www.aptourism.gov.in వెబ్సైట్ను కానీ సందర్శిం చాలని సూచించారు.

Paderu

2022-09-02 08:26:39

ఉచితంగా గ్రహణం మొర్రి శస్త్రచికిత్సలు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో  నడుస్తున్న బర్డ్ ఆసుపత్రిలో  గ్రహణమొర్రి ( Cleft Lip and Cleft Palate surgery) శస్త్రచికిత్స అవసరమయ్యే పేద పిల్లలకు  ఉచితంగా చేస్తామని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్  రెడ్డెప్పరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు .
రోజు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల  వరకు ఓపి లో పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. అపాయింట్‌మెంట్‌, విచారణల కోసం  7337318107 నంబర్లో  సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రహణం మొర్రి ఉన్న చిన్నారుల తల్లిండ్రులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో ఆయన కోరారు.

Tirupati

2022-09-02 06:45:46

పిఠాపురంలో జిల్లాస్థాయి స్పందన

జిల్లా స్ధాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5న  పిఠాపురం లోని రెడ్డి రాజా కళ్యాణ మండపంలో  ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలియజేసారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్  విజ్ఞాపనలను పిఠాపురంలో   స్వీకరిస్తామని కాకినాడ జిల్లాకు చెందిన  అర్జీదారులు అందరూ ఈ అంశాన్ని  గమనించి సెప్టెంబర్ 5వ తేదీన తమ అర్జీలను పిఠాపురంలో నిర్వహించే  స్పందన కార్యక్రమంలో సమర్పించాలని ఆమె కోరారు. అలాగే వివిధ శాఖల జిల్లా అధికారులు అందరూ  సెప్టెంబర్ 5వ తేదీ సోమవారం ఉదయం 9-30 గంటలకే పిఠాపురంలో నిర్వహించే స్పందన గ్రివెన్స్ సెల్ కార్యక్రమానికి  విధిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.



Kakinada

2022-09-01 16:58:07

స్కిల్ హబ్ లలో ఉచిత ఉపాధి శిక్షణలు

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాడేరు  ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలొ స్కిల్ హబ్ లు ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ జిల్లా అధికారి డా.పి .రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్కిల్ హబ్ ల ఏర్పాటులో భాగంగా పాడేరు స్కిల్ హబ్ లో 30 మంది నిరుద్యోగ యువతకు డాటా ఎంట్రీ ఆపరేటర్ (కంప్యూటర్) కోర్సులో, రంపచోడవరం  స్కిల్ హబ్ లో 30 మంది యువతకు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సులో  ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.  కంప్యూటర్ కోర్సులో  శిక్షణకు డిగ్రీ పాసై, 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన యువతీ యువకులు, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సులో శిక్షణకు పది, ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన యువతీ,యువకులు అర్హులని తెలిపారు. 

ఈ నెల ఆ 12 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ శిక్షణకు ఆసక్తి, అర్హతలు గల యువతీ యువకులు ఈ నెల ఐదవ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.  జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సులో శిక్షణ పొందగోరు వారు  ఈ నెల ఐదవ తేదీ లోగా 81796-13081, 83318-90681 నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, కంప్యూటర్ కోర్సులో శిక్షణ పొందగోరు వారు  ఈ నెల ఐదవ తేదీ లోగా 90147-67230, 63026-36174 నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని డా. రోహిణి వివవరించారు. ఈ శిక్షణ హబ్ లలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. 

Paderu

2022-09-01 13:49:25

5నెలల్లోగా నాడు-నేడు పనులు పూర్తికావాలి

శ్రీకాకుళం జిల్లాల్లో రెండవ విడత క్రింద జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనులన్నీ రానున్న ఐదు మాసాల్లోగా పూర్తిచేసి, వచ్చే ఏడాదికి విద్యార్థులకు అందించాలని పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నాడు-నేడు, టి.ఎం.ఎఫ్, ఎస్.ఎం.ఎఫ్, ఆర్.ఓ ప్లాంట్స్, బ్యాంక్ ఖాతాల ప్రారంభం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నాడు-నేడు, టి.ఎం.ఎఫ్ ( టాయిలెట్ మెయింట్ నెన్స్ ఫండ్ ) ఎస్.ఎం.ఎఫ్ ( స్కూల్ మెయింట్ నెన్స్ ఫండ్ ),ఆర్ఓ ప్లాంట్స్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. కావున నాడు-నేడులో చేపట్టిన పాఠశాలలన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

 పాఠశాలల్లో ఉండే అన్ని మౌలిక వసతులకు అవసరమైన అన్ని సరుకుల కొనుగోలుకు, వాచ్ మెన్ ఏర్పాటుకు ఎస్.ఎం.ఎఫ్ నిధులను వినియోగించుకోవచ్చని సూచించారు. అలాగే మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు టి.ఎం.ఎఫ్ నిధులను వినియోగించుకోవచ్చని చెప్పారు. రెండవ విడతలో నిర్మిస్తున్న పాఠశాలలకు, కళాశాలలకు అవసరమైన సిమెంట్, ఇసుక, ఐరన్ తదితర సామగ్రిని సిద్ధం చేసుకోవాలని, పనులు జాప్యం కాకుండా కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. నిర్మాణం అనంతరం వాటికి అవసరమైన గ్రీన్ బోర్డ్స్,ఫ్యాన్స్, ఎలక్ట్రిఫికేషన్, తాగునీరు, తదితర అంశాలపై చర్యలు చేపట్టాలని అన్నారు.

నాడు నేడు క్రింద చేపడుతున్న జూనియర్ కళాశాలల్లో పనులు శరవేగంగా పూర్తికావాలని, 10వ తరగతి విద్యార్ధులందరూ రానున్న ఏడాదికి కళాశాలల్లో చేరనున్నందున, వారిని దృష్టిలో ఉంచుకొని పనులు పూర్తిచేయాలని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్మాణాల కోసం మంజూరుచేసే నిధుల విషయమై రాష్ట్ర వ్యాప్తంగా 70 కళాశాలల ప్రిన్సిపాల్స్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు ఇచ్చారని, ఇది బాధ్యత రాహిత్యంగా గుర్తిస్తామన్నారు. అటువంటి వారందరూ తక్షణమే కరంట్ అకౌంట్ తెరచి శుక్రవారం నాటికి అందజేయాలన్నారు. పరిపాలన పరమైన ఉత్తర్వులు ఇవ్వనివాటికి తక్షణమే ఉత్తర్వులు మంజూరుచేసి పనులు ప్రారంభించాలని అన్నారు. పాఠశాలలకు అవసరమైన ఎలెక్ట్రిఫికేషన్ పనులు పూర్తిచేయాలన్నారు.

5న జరగనున్న గురు పూజోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగా జిల్లాస్థాయిలో ఈ వేడుకలను ప్రతి పాఠశాలలో నిర్వహించాలన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం ఉంటుందని, ఉత్తమ ఉపాధ్యాయుల వివరాలను జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలతో సమర్పించాలన్నారు. క్లీన్ ఇండియా కాంపెయిన్ లో భాగంగా సెప్టెంబర్ 1నుండి 15వరకు స్వచ్ఛతా బట్వాడా కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో నిర్వహించాలని, చివరి రోజున ధ్రువీకరణ పత్రాలు పంపిణీ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అన్ని శాఖల సమన్వయంతో రోజుకు ఒక కార్యక్రమంతో 15 రకాల కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు.

ఉపాధ్యాయులకు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాలన్నారు.జెబికె యాప్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని, యాప్ లో ఉండే సాంకేతిక లోపాలను ఇప్పటికే సరిదిద్దామని చెప్పారు. కావున విధిగా ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. రానున్న ఐదు రోజుల్లో ఆయా పాఠశాలలో ఉండే సమస్యలను పరిష్కరించుకొని బయోమెట్రిక్ అటెండెన్స్ ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. బయోమెట్రిక్ హాజరు ఉంటేనే అమ్మఒడి పథకం వర్తిస్తుందని, ఈ విషయాన్ని అసోసియేషన్లు, తల్లితండ్రులతో సమావేశం ఏర్పాటుచేసి వివరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రయివేటు పాఠశాలలకు ఇది వర్తిస్తుందని, విద్యార్థులు ఎక్కడ ఉన్నప్పటికీ హాజరు వేసుకునే వెసులుబాటు ఉందని, అయితే హాజరు తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.

8 జిల్లాల్లోని ఏ.పి.మోడల్ స్కూల్స్ లో అవసరమైన టీచర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని చెప్పారు. జె.సిల సహకారంతో అర్హతే ప్రామాణికంగా ఈ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు పెండింగులో ఉన్న 12 పాఠశాలలకు గాను ఐదుగురు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల  ఖాతాల్లో నగదు జమ అయినందున పనులు ప్రారంభించినట్లు చెప్పారు. మరో 7గురు ప్రధానోపాధ్యాయులు ఖాతాల్లో  నగదు జమకాబడలేదని వివరించారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డా.జయప్రకాష్, జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-01 13:42:48

భవన నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి

భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ కోన శశిధర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.   రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలు, వై.యస్.ఆర్. హెల్త్ క్లినిక్స్, జగనన్న స్వచ్ఛ సంకల్పం, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ప్రాధాన్యత భవన నిర్మాణాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. సిమెంటు ఎంత అవసరమో చెప్పాలని, అదనపు సిమెంట్ ఎంత అవసరమో తెలియాలన్నారు.  జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ భవనాలకు సంబంధించి కొన్ని కోర్టు కేసులు ఉన్నందు వలన ఆలస్యం జరుగుతుందని కలెక్టర్ వివరించగా

 వేరే స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని కమీషనర్ కోన శశిధర్ చెప్పగా ఇప్పటికే కొంత వరకు నిర్మాణాలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు.   జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా పరిషత్ సీఈవో వెంకటరామన్, డిపిఓ రవి కుమార్, పంచాయతీ రాజ్ ఎస్ఈ సత్యనారాయణ మూర్తి, డ్వామా పీడీ చిట్టిరాజు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-01 13:37:45