1 ENS Live Breaking News

కేంద్ర మంత్రి పర్యటన విజయవంతం చేయాలి

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్ట‌ర్‌ మ‌న్సుఖ్ మాండ‌వీయ విజయనగరం జిల్లా ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను, క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదివారం స్వ‌యంగా ప‌ర‌శీలించారు. ఈనెల 25వ తేదీన కేంద్ర‌మంత్రి జిల్లాకు చేరుకొని, 26వ తేదీన ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు.  విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణ పేద‌ల‌కోసం గుంక‌లాంలో నిర్మాణంలో ఉన్న‌ జ‌గ‌న‌న్న కాల‌నీని కేంద్ర‌మంత్రి సంద‌ర్శించ‌నున్న నేప‌థ్యంలో,  క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఈ కాల‌నీని ప‌రిశీలించారు. అధికారుల‌తో మాట్లాడి, ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. హౌసింగ్ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, ఇత‌ర అధికారుల‌కు ప‌లు ఆదేశాల‌ను జారీ చేశారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో హౌసింగ్ ఇఇ శ్రీ‌నివాస‌రావు, ఇత‌ర ఇంజ‌నీర్లు పాల్గొన్నారు. జిల్లా మ‌హారాజా ప్ర‌భుత్వ‌ కేంద్రాసుప‌త్రిని క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. మంత్రి ప‌ర్య‌ట‌న‌కు చేస్తున్న ఏర్పాట్ల‌ను స‌మీక్షించారు. డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, ఆసుప‌త్రి సూప‌రింటిండెంట్ డాక్ట‌ర్ సీతారామ‌రాజు, ఇత‌ర అధికారుల‌తో చ‌ర్చించారు.  ప‌ర్య‌ట‌న‌కు ప‌క‌డ్భందీగా ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

Vizianagaram

2022-04-24 13:10:06

పాఠశాల భవనాలు పరిపాలనకా సిగ్గు సిగ్గు

కాకినాడ సాలిపేట గరల్స్ హైస్కూల్ ప్రాంగణంలో 2002న సర్వ శిక్షా అభియాన్ నిధులతో హిందూ స్పెషల్ ఎలిమెంటరీ స్కూల్ కు నిర్మించిన భవనాన్ని పాఠశాలల విలీనంతో విద్యాశాఖ ఉప తనిఖీ అధికారి కార్యాలయంగా వినియోగించడాన్ని కాకినాడ పౌర సంక్షేమ సంఘం తప్పుబడుతోంది. విద్యానిలయాలను విద్యకు మాత్రమే వినియగియోగించాలని, అంతేతప్పా పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వ కార్యాలయాలుగా వినియోగించడం విద్యాహక్కు చట్టానికి విరుద్దమని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు ఆరోపించారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు ఆ పాఠశాల భవనాన్ని ఖాళీ చేసి.. దానిని బాలికలతరగతి గదులకు వినియోగిం డిమాండ్ చేశారు. హైస్కూల్ మేడ మీద గదులను విద్యాశాఖ ఆధీనంలోవుంచడం ఎంత వరకూ భావ్యం కదాని హితవు పలికారు. ఈ విషయంలో వక్తలు ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరారు. చెట్లక్రింద తరగతుల నిర్వాహాణ జరుగుతున్నందుకు ఎమ్మెల్యే ఎంపీ మంత్రు లు కౌన్సిల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. హైస్కూల్ స్థలంలో వున్న భవనాన్ని తరగతి గదులకు అప్పగించాల ని విద్యాశాఖ ఉప కార్యాలయానికి ఇచ్చిన కౌన్సిల్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ విజిట్ చేసి సాలిపేట గరల్స్ హైస్కూల్  సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Kakinada

2022-04-24 08:35:05

మే3న సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం..

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం ,భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో  మే 3న అప్పన్న నిజరూప దర్శనం ఉత్సవము జరగనుంది. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయజర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు  తెలిపారు. ఈ మేరకు సింహాద్రి నాధుడు ను దర్శించుకున్న అనంతరం ఆయన  పాత్రికేయులతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించి ఈ నెల 26న తొలివిడత చందనం అరగ తీత  కార్యక్రమం వైభవంగా ప్రారంభం కానుందన్నారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు సంబంధించి ఆలయ వర్గాలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. మంగళ వారం తెల్లవారుజామున సింహాద్రి నాథుడును సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన చేస్తారన్నారు. అనంతరం గంగ ధార నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిస్తారన్నారు. తదుపరి వేద మంత్రోచ్ఛారణలు మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ చందనము చెక్కలను శిరస్సుపై ఉంచుకొని అర్చక స్వాములు  ఆలయ బేడా మండపం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారన్నారు. తొలుత వాటికి విశ్వక్సేన, పుణ్యాహవాచనం ఆరాధన కార్యక్రమంలు నిర్వహించి శాస్త్రోక్తంగా అరగతీత ప్రారంభమవుతుందని శ్రీనుబాబు తెలియజేశారు. తొలిసారిగా అరగదీసిన చందనాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి అర్చన గావిస్తారన్నారు... ఇలా నాలుగు రోజుల పాటు అరగదీసిన మూడు మణుగుల (125 కేజీ లు) చందనానికి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ఆలయ భాండాగారంలో భద్రపరచడం జరుగుతుందన్నారు.. నిజరూప దర్శనం రోజు రాత్రికి  ( మే 3) వివిధ రకాల ఫల, పుష్పా సీతలాదులతో కూడిన సహస్ర ఘటాభిషేకం స్వామి కి నిర్వహించి తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని ఆ స్వామి కి సమర్పిస్తారనీ  శ్రీను బాబు వివరించారు.  ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవో ఎంవీ  సూర్యకళ  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారని ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షన చేస్తున్నట్లు చెప్పారు.

Simhachalam

2022-04-24 07:41:30

ఎండలపట్ల అప్రమత్తత అవసరం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గ‌త కొద్ది రోజులుగా రోజురోజుకూ ఉష్ణోగ్ర‌త పెరుగుతున్న‌ కార‌ణంగా, వ‌డ‌గాలుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌ట‌న‌లో కోరారు. మ‌రికొద్ది రోజుల‌పాటు అధిక ఉష్ణోగ్ర‌త‌లు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌న్న వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌ల‌ను బ‌ట్టి ప్ర‌తీఒక్క‌రూ త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అన్నారు. ఎండ‌వేడిమి ఉండే స‌మ‌యాల్లో వీలైనంత‌వ‌ర‌కు బ‌య‌ట‌కు రాకుండా ఉండాల‌ని, త‌ప్పనిస‌రి ప‌రిస్థితిల్లో బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌క్షంలో, వేడినుంచి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు టోపీలు, గొడులు లాంటి ప‌రిక‌రాల‌ను వినియోగించాల‌ని, త‌మ చెంత మంచినీటిని ఉంచుకోవాల‌ని సూచించారు. ఈ వేస‌విలో లూజుగా ఉన్న కాట‌న్ దుస్తుల‌ను, తెలుపు రంగు దుస్తుల‌ను ధ‌రించ‌డం శ్రేయ‌స్క‌ర‌మ‌ని తెలిపారు. ముఖ్యంగా వృద్దులు, చిన్న‌పిల్ల‌ల‌ ప‌ట్ల మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు.  ఎక్కువ‌గా ఎండ కాసే ఉద‌యం 10 గంట‌లు నుంచి సాయంత్రం 4 గంట‌లు మ‌ధ్య బ‌య‌ట తిర‌గ‌డం, ఆరుబ‌య‌ట ప‌నిచేయ‌డం లాంటివి చేయ‌కూడ‌ద‌ని సూచించారు. ఈ వేస‌వి కాలంలో చ‌ల్ల‌ని శీత‌ల పాణీయాల‌ను త్రాగ‌కూడ‌ద‌ని, రోడ్ల ప్ర‌క్క‌న అమ్మే క‌లుషిత ఆహారాన్ని తిన‌కూడ‌ద‌ని, మాంసారాన్ని, మ‌సాలాల‌ను తిన‌కూడ‌ద‌ని, మ‌ద్యం సేవించ‌కూడ‌ద‌ని తెలిపారు.

               వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌కుండా ప్ర‌తీఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండి, త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ఎక్కువ‌గా ద్ర‌వ‌ప‌దార్ధాల‌ను, ఓఆర్ఎస్ లాంటి ద్రావ‌కాల‌ను తీసుకోవాల‌న్నారు. ఎండ తీవ్ర‌త వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్ర‌త ఒక్క‌సారిగా 104.9 డిగ్రీల వ‌ర‌కు పెరిగిపోయి, దానిని నియంత్రించే శ‌క్తికి శ‌రీరం కోల్పోవ‌డ‌మే వ‌డ‌దెబ్బ‌గా ప‌రిగ‌ణిస్తార‌ని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రాణాంత‌క‌మ‌ని పేర్కొన్నారు. శ‌రీర ఉష్ణోగ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టం, వ‌ణుకు పుట్ట‌డం, మ‌గ‌త నిద్ర లేదా క‌ల‌వ‌రింత‌లు, ఫిట్స్ లేదా పాక్షికంగా అప‌స్మార‌క స్థితి వ‌డ‌దెబ్బ ల‌క్ష‌ణాల‌ని తెలిపారు.  ప్ర‌మాద‌వ‌శాత్తూ ఎవ‌రైనా వ‌డ‌దెబ్బ‌కు గురి అయితే, వారిని నీడ‌లో ఉంచి, గాలి త‌గిలేలా చేసి, త‌డి గుడ్డ‌తో తుడిచి శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చాల‌ని సూచించారు. వీలైతే వారికి ఉప్పు క‌లిపిన మ‌జ్జిగ‌ను, గ్లూకోజ్, ఓఆర్ఎస్ లాంటివాటిని ఇవ్వాల‌ని చెప్పారు. అయితే వ‌డ‌దెబ్బ‌కు గురై, అప‌స్మార‌క స్థితికి చేరిన‌వారికి మాత్రం నీరు త్రాగించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. వారిని వీలైనంత త్వ‌ర‌గా ఆసుప‌త్రికి త‌ర‌లించాల‌ని సూచించారు. వ‌డ‌దెబ్బకు త‌క్ష‌ణ చికిత్స నందించేందుకు అవ‌స‌ర‌మైన మందుల‌ను అన్ని ఆసుప‌త్రుల్లో సిద్దంగా ఉంచామ‌ని క‌లెక్ట‌ర్‌ తెలిపారు.

Vizianagaram

2022-04-24 07:19:24

విద్య ఒక్కటే బలమైన ఆయుధం..

విద్య ఒక్కట అన్ని ఆయుధాల కంటే ఎంతో శక్తివతమైనదని, మిగతావి ఏవైనా విద్య తరువాత స్థానంలో నిలవాల్సిందేనని  ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ జడ్జి, ఏ పి రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్  జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు.శనివారం ఆనం కళా కేంద్రం .. నార్ని కేదారేశ్వరుడు కళావేదిక పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్సా.. గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక సాధికారకత.. అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా మాట్లాడుతూ, సమాజంలో ఒక బాధ్యత యుతమైన వ్యక్తిగా మనం ఏది చెయ్యాలో అది చెయ్యాల్సిన సామాజిక బాధ్యత మనపై ఉందన్నారు. ఎవరైనా 20 సమస్యలు పేర్కొన్న సందర్భంలో వాటిలో ఒక్క దానికైన పరిష్కారం చూపగల గాలన్నరు. ప్రతిదీ ప్రభుత్వం, అధికారులే చెయ్యాలనే ఆలోచన విడనాడి చొరవ తీసుకుని ముందుగుడు వేయాల్సి అవశ్యకత ఎంతైనా ముఖ్యం అని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకం అయిన నందున ఆత్మ విశ్వాసం తో కూడి ఉండాలని జస్టిస్ పిలుపు నిచ్చారు. మానవ సంబంధాలను కలిగి ఉండాలని, అది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం అన్నారు.  దేశంలో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. నేటికీ కనీస అవసరాలు కోసం ఎదురు చూస్తున్న సంఘటనలు చూస్తున్నామని, సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నా, ఇటువంటి అంశాలపై తీవ్రంగా ఆలోచన చెయ్యాల్సి ఉందన్నారు. విద్యా ద్వారా అభివృద్ధి సాధ్యమని, విద్యా అనే ఆయుధం ఉంటే సాధ్యం కానిది ఏది ఉండదని ఆయన అన్నారు. 

ఒక న్యాయవాదిగా, హై కోర్టు జడ్జి గా డి ఎస్ ఎస్ ఎ  యొక్క కీలక పాత్ర గుర్తించ లేదని, తదుపరి రోజుల్లో దాని యొక్క ప్రాముఖ్యత గుర్తించానని తెలిపారు. ప్రజల కోసం సేవా చేసేందుకు ఒక గొప్ప అవకాశం గా పదవి లభించిందని భావిస్తానని, ఒక పౌరునికి కనీస అవసరాలు తీర్చే ప్రయత్నం గా పదవీని భావిస్తానని జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింభించేలా మీ నృత్య రీతులు ఆకట్టుకున్నాయ ని పేర్కొన్నారు. వాటిని సజీవంగా నిలిపేందుకు మీ కృషి అభనందనీయం అన్నారు.

జిల్లా ప్రధాన న్యాయ మూర్తి -  జిల్లా న్యాయ సేవా ధికర సంస్థ - ఛైర్మన్  శ్రీమతి పి. వెంకట జ్యోతిర్మయి మాట్లాడుతూ, పేదరిక నిర్మూలన, అందరికీ చేరువ లో న్యాయ సేవలు, ఉండాలన్న లక్ష్యాలతో డి ఎల్ ఎస్ ఏ పని చేస్తుందని ఆమె తెలిపారు. సమస్య ఏదైనా డి ఎల్ ఎస్ ఏ దృష్టికి తీసుకొని వొస్తే సహాయం చేయడం జరుుతుందన్నారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం అందచేస్తున్న కార్యక్రమాలు కు పథకాలు చేరువ చెయ్యడం లో కీలక బాధ్యతలు నిర్వహించడం జరిగిందన్నారు. డబ్బులు ఉంటేనే న్యాయం జరుగుతుందనే భావనను కాకుండా అందరికి సమ న్యాయం కోసం పనిచేస్తుందని తెలిపారు.

జిల్లా కలక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, డి ఎల్ ఎస్ ఏ కి జిల్లా యత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందజేస్తాన్నారు. ఆర్థిక సాధికరత సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి, జగనన్న విద్యా దివేన, వసతి దీవెన, చేయూత వంటి ఎన్నో నగదు ప్రోత్సహక పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. ఆర్థిక సాధకారత సాధించాలంటే సంక్షేమ పథకాలను సద్వనియోగం చేసుకోవాలన్నారు. ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి మాట్లాడుతూ, ప్రజలకు న్యాయ పరమైన అంశాలలో అండగా ఉంటున్నమన్నరు. ఎన్నో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకుని రావడం ద్వారా రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. 

జిల్లా ప్రధాన న్యాయ మూర్తి -  జిల్లా న్యాయ సేవా ధికర సంస్థ - ఛైర్మన్  శ్రీమతి పి. వెంకట జ్యోతిర్మయి, రాష్ట్ర డిఎస్ఎల్ఏ కార్యదర్శి ఎమ్.బబిత, సీనియర్ సివిల్ జడ్జి కం జడ్జి జిల్లా న్యాయ సేవ ధికార సంస్థ - సెక్రెటరీ  శ్రీమతి కె.ప్రత్యుషకుమారి ,  తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, కూడా ఎస్పీలు  ఐశ్వర్యరాస్తోగి, కే వి ఎస్ ఎస్ సుబ్బారెడ్డి,  వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్ లు ఇలాక్కియా, జీ. సూరజ్ ధనుంజయ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్లసుబ్బారావు, డిఆర్ఓ సత్తిబాబు, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, పలువురు జడ్జిలు, న్యాయవాదులు, లా విద్యార్ధులు, మహిళలు,  తదితరులు పాల్గొన్నారు.

Rajahmundry

2022-04-23 14:24:13

Sc, St గ్రీవియెన్సు వినియోగించుకోండి

కాకినాడ జిల్లాలోని కలెక్టరేట్ లో ఈ నెల 25వ తేదీ ఆఖరి సోమవారాన్ని పురస్కరించి ఉదయం 9-30 గంటల నుంచి మద్యాహ్నం 1-30 గంటల వరకూ స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమం,  అలాగే మద్యాహ్నం 3 గంటల నుండి  ఎస్.సి., ఎస్.టి ప్రత్యేక స్పందన గ్రివెన్స్ సెల్ కార్యక్రమం జరుగుతాయని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు.  జిల్లాకు చెందిన అర్జీదారులు ఈ అంశాన్ని గమనించి స్పందన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో  సద్వినియోగం చేసుకోవాలని ఆమె మీడియాకి విడుదల చేసిన ప్రకటన ద్వారా కోరారు.

Kakinada

2022-04-23 14:17:07

24నుంచి కేసీసీ రుణాల ప్ర‌త్యేక డ్రైవ్‌

పంట సాగు చేసే ప్ర‌తి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు ప‌థ‌కం ద్వారా రుణాలు, సంబంధిత ఇత‌ర ప్ర‌యోజ‌నాలు క‌ల్పించేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు కాకినాడ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డులు-రుణాల‌పై శ‌నివారం క‌లెక్ట‌రేట్ నుంచి జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ టెలీకాన్ఫ‌రెన్స్ ద్వారా బ్యాంక‌ర్లు, అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ భార‌త ప్ర‌భుత్వ వ్య‌వ‌సాయ మంత్రిత్వ శాఖ ఉత్త‌ర్వుల మేర‌కు నాబార్డు, లీడ్‌బ్యాంకు, వ్య‌వ‌సాయ శాఖ‌, మ‌త్స్య‌శాఖ‌, ప‌శు సంవ‌ర్థ‌క శాఖ‌, ఇత‌ర అనుబంధ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో ఈ నెల 24 నుంచి మే 1 వ‌ర‌కు కిసాన్ భాగీదారీ ప్రాథ‌మిక హ‌మారీ ప‌థ‌కం కింద కేసీసీ రుణాల మంజూరుకు ప్ర‌త్యేక డ్రైవ్ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఆర్‌బీకే/గ్రామ స‌చివాల‌య ప‌రిధిలో గ్రామ స‌భ‌లు ఏర్పాటుచేసి, అర్హ‌త ఉండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి రుణాలు పొంద‌ని వ్య‌వ‌సాయ‌, పాడి, మ‌త్స్య రైతులు ద‌ర‌ఖాస్తు చేసుకునేలా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని జేసీ అధికారుల‌కు సూచించారు. పీఎం కిసాన్ రుణ అర్హ‌త ఉన్న ప్ర‌తి రైతు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేలా చూడాల‌న్నారు. స‌మావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజ‌ర్ ఎస్‌.శ్రీనివాస‌రావు, నాబార్డు డీడీఎం డా. వైఎస్ నాయుడు; కాకినాడ‌, పెద్దాపురం ఆర్‌డీవోలు బీవీ ర‌మ‌ణ‌, జె.సీతారామారావు, ఇవివిధ శాఖ‌ల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-04-23 14:07:01

28న జిల్లాలో ఇళ్ల పట్టాల పండుగ..

ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. 28వ తేదీన  రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నం పట్టణం పరిధిలో ఉన్న విశాఖపట్నం, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు పట్టాల పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.  324 ఎకరాల్లో లే అవుట్ వేసినట్లు చెప్పారు.  జివిఎంసి పరిధిలో ఉన్న ప్రజలకు భూ సేకరణ చేసి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.  పెందుర్తి శాసన  సభ్యులు అదీప్ రాజ్ మాట్లాడుతూ 28వ తేదీన పెద్ద ఎత్తున పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో సుమారు 50 వేల మందికి పట్టాలు పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఈ పర్యటనలో డిఐజి ఎస్. హరికృష్ణ, అనకాపల్లి జిల్లా కలెక్టర్ పఠాన్ శెట్టి రవి శభాష్, పెందుర్తి శాసన సభ్యులు అదీప్ రాజ్, జివిఎంసి కమీషనర్ లక్ష్మీశా, ఎస్పీ గౌతమ్ శాలిని, జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, అదనపు ఎస్పీ కె. శ్రావణి, ఆర్డీవో, అనకాపల్లి చిన్ని కృష్ణ, ఉప కలెక్టర్ గున్నయ్య, తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

Anakapalle

2022-04-23 13:52:59

25న నిడదవోలులో నియోజకవర్గ స్పందన

నియోకవర్గం స్థాయి లో స్పందన కార్యక్రమం చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 25 సోమవారం నిడదవోలు లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల వద్దకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నా మన్నారు. ఆదిశలోనే ప్రతి నియోజకర్గ స్థాయిలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసే విధానం లో తొలిసారిగా నిడదవోలు నియోజకవర్గం లో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. నిడదవోలు నియోజకవర్గం పరిధిలో ఉన్న మూడు మండలాలు అయిన నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాలకు చెందిన ప్రజలు కోసం ఈ స్పందన కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం యధాతధంగా నిర్వహించడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం లోని కలెక్టరేట్ నందు డిఆర్వో, ఇతర అధికారులు ఆధ్వర్యంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఆర్టీసి బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కి ఉచిత బస్సు సర్వీసు ఉ.9 నుంచి మ.2 వరకు నడుపుతున్నట్లు తెలియచేశారు. స్పందన ఫిర్యాదులు మీ మీ గ్రామ వార్డ్ సచివాలయంలో , మండల పరిధిలో తీసుకోవడం జరుతుందన్నారు. 

Rajahmundry

2022-04-23 12:30:05

వలంటీర్లు మరింతగా సేవలందించాలి

రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, ఆర్థిక సాధికారికత దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం కొవ్వూరులో సుందర స్థాయి కళ్యాణ మంటపం లో  వాలంటీర్ సన్మాన కార్యక్రమం, సున్న వడ్డీ చెక్కుల పంపిణీ కార్య్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 4,596 సంఘాలకు రు.45.51 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ ని అందించామన్నారు. కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలోని 4576 గ్రూపులో ఉన్న మహిళలకు రు.6.68 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ నేరుగా వారి బ్యాంకు ఖాతాకు జమ చేశామన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వా నికి వారధిగా నిలుస్తున్నారని తానేటి వనిత పేర్కొన్నారు. వారి సేవలను గుర్తిస్తూ తగిన రీతిన సత్కరించిన సందర్భం ఎప్పుడు జరుగలేదని, కేవలం జగనన్న హాయంలో  అటువంటి గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమా రి, మునిసిపల్ వైస్ ఛైర్ పర్సన్ గండ్రోతు అంజలీ దేవి, మాజి ఎమ్మెల్సీ కోడూరి శివరామ కృ ష్ణ, అక్షయ పాత్ర శ్రీని వాస రవీం ద్ర,  ఆర్. భాస్కర రావు, పలువురు కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు  తదితరులు పా ల్గొన్నారు.

Kovvur

2022-04-23 12:26:57

తిరుమలలో ఈఓ విస్త్రుత తనిఖీలు

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దృష్టిలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి శనివారం అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ తో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో భక్తుల క్యూలైన్లు, లగేజీ డిపాజిట్ కౌంటర్లు, స్కానింగ్ యంత్రాలను పరిశీలించారు. అక్కడి ఉచిత వైద్యశాలలో భక్తులకు అందుతున్న వైద్యసేవలు తనిఖీ చేశారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు పంపిణీ చేసేందుకు అన్నప్రసాదాలు తయారు చేసే వంటశాలను పరిశీలించారు. కంపార్ట్మెంట్ల నిర్వహణ, కంపార్ట్మెంట్ల నుండి భక్తులను దర్శనానికి వదలడం, తోపులాటలు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో సెల్లార్ లో మరుగుదొడ్ల పరిశుభ్రతను తనిఖీ చేశారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అందుతున్న ప్రసాదాల వితరణ విధానాన్ని, వంటశాలను పరిశీలించారు.  ఆ తర్వాత పిఎసి-1, 2, 3లలో భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. కళ్యాణకట్ట, లాకర్ల కేటాయింపు విధానం, డార్మిటరీల్లో భక్తులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఈవో వెంట డెప్యూటీ ఈఓలు  రమేష్ బాబు,  హరీంద్రనాథ్,  పద్మావతి, భాస్కర్,  రామారావు, విజిఓ  బాలిరెడ్డి, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, డిఎఫ్ఓ   శ్రీనివాసులురెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్  శ్రీనివాసులు, ఇతర అధికారులు ఉన్నారు.

Tirumala

2022-04-23 12:15:04

నాడు-నేడుతో రూపురేఖలు మారిపోవాలి

అనకాపల్లిజిల్లాకు మంజూరైన రెండవ విడత నాడు-నేడు పనులు మొదటి విడత లానే విద్యార్థులకు  సౌకర్యవంతంగా సుందరంగా  తీర్చి దిద్దాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం నాడు నేడు పనులపై సర్వ శిక్ష అభియాన్, ఏ పీ ఈ డబల్ యు ఐ డి సి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  కలెక్టర్ మాట్లాడుతూ నాడు నేడు రెండో విడతలో జిల్లాకు 379 పాఠశాలలు ఎంపిక చేయబడ్డాయన్నారు.  నాడు నేడు పనుల మూలంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారి తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు అన్నారు.  పాఠశాలను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం తో పాటు పనులను మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి సర్వ శిక్ష అభియాన్ ఈ ఈ నరసింహారావు ఏపీఈ డబ్ల్యుఐడిసి డి.ఈ. మృత్యుంజయరావు ఏ.ఈ.లు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-04-23 12:11:45

సచివాలయాల్లో సకాలంలో సేవలదాలి

అర్హులందరికీ సచివాలయాల ద్వారా వివిధ సేవలను సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి ఆదేశించారు శనివారం ఆయన సబ్బవరం మండలం అసకపల్లి, గొట్టివాడ సచివాలయాల ను సందర్శించి పనితీరును పరిశీలించారు.  సచివాలయానికి పనులపై వచ్చిన వారు నిరాశగా వెనుకకు పోరాదన్నారు.  అర్హులైనప్పటికి కొందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల అవగాహన ఉండదని అటువంటి వారికి పథకాలను గూర్చి తెలియజేయాలన్నారు.  అసకపల్లి లో హౌసింగ్ లే అవుట్లను, నిర్మాణాలను పరిశీలించారు. ఇసుక సిమెంటు సరఫరాపై లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు.


Anakapalle

2022-04-23 12:06:09

జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగంపెంచాలి

అనకాపల్లి జిల్లాలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో చేపట్టిన లేఅవుట్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి అధికారులను ఆదేశించారు.  శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలకు సంబంధించి విద్యుత్ సరఫరా బోరుబావులు అప్రోచ్ రోడ్ల పనులు తక్షణం పూర్తయ్యేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఇళ్ల నిర్మాణం పై క్షుణ్ణంగా చర్చించారు. ప్రతిపాదించిన లేఅవుట్లు, మంజూరు చేసిన గృహాల నిర్మాణాల పురోగతిని తెలుసుకున్నారు. వివిధ స్థాయిల్లో ఉన్న ఇళ్ళ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. వివిధ శాఖల సమన్వయంతో లబ్ధిదారులను ప్రోత్సహించి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు.  ఏ.ఈ, డీ.ఈ. లు నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు. అవసరమైన చోట్ల బోరుబావులను వెంటనే ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు లేఅవుట్ల నిర్మాణాల్లో, గృహ నిర్మాణాలు ప్రారంభించడంలో ప్రగతి చూపించిన పెందుర్తి, ఎలమంచిలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. అదే స్ఫూర్తితో మిగిలిన వారు కూడా పనిచేసి గృహనిర్మాణంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు.  నిర్మాణాలు మందకొడిగా ఉన్న మండలాలను పరిశీలించవలసిందిగా అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవో లను ఆదేశించారు.

జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పై అధికారులకు తెలియజేస్తూ ఉండాలన్నారు. నిర్మాణ సామాగ్రి ప్రణాళికాయుతంగా సరఫరా చేస్తూ ఉండాలన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి, నర్సీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారులు చిన్నికృష్ణ, గోవిందరావు, నర్సీపట్నం డి ఎల్ డి ఓ సత్యనారాయణ జిల్లా గృహనిర్మాణ అధికారి రఘురామ, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఉమా శంకర్ గృహ నిర్మాణ శాఖ ఈ.ఈ.లు  డి.ఈ.లు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-04-23 12:03:52

వ్యాపారాల కోసం రోడ్లు పాడు చేస్తారా

ఒక వైపు కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు ఏర్పాటు చేస్తుంటే మీ వ్యాపారాల కోసం రోడ్లు ధ్వంసం చేస్తారా అని నగర మేయర్ మహమ్మద్ వసీం ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని విద్యుత్ నగర్ సర్కిల్ నుండి హౌసింగ్ బోర్డ్ సర్కిల్ వరకు ఇటీవల వేసిన బిటి రోడ్డు ను శనివారం మేయర్ వసీం పరిశీలించారు. ఈ సందర్భంగా కొందరు వ్యాపారులు తమ వ్యాపారాలు కోసం షామియానాలు వేసుకుని వాటి మేకులను బీటీ రోడ్ పై కొట్టి ఉండటంతో వాటిని గమనించిన మేయర్ వసీం వ్యాపారులను పిలిపించి రోడ్లు ధ్వంసం అయ్యేలా ఎలా మేకులు ఇష్టారాజ్యంగా కొడతారని ప్రశ్నించారు. ఇకపై ఇలాంటివి చేస్తే వ్యాపారులతో సప్లయర్ యజమానులకు కూడా ఫైన్ లు వేయాలని అధికారులకు సూచించారు. సచివాలయ సిబ్బంది కూడా రోడ్లు ధ్వంసం అయ్యేలా ఎవరన్నా వ్యవహరిస్తుంటే అలాంటి వారిపై కఠినంగా సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అనీల్ కుమార్ రెడ్డి,సంపంగి రామాంజనేయులు, కార్యదర్శి సంగం శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2022-04-23 12:01:11