1 ENS Live Breaking News

ఆలయాల అభివ్రుద్ధి ప్రభుత్వ ప్రాధాన్యం..

రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆంధ్రప్ర దేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎండోమెంట్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ, ఆమదాలవలసలో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంకు 60 లక్షలు, తోగారం గ్రామంలో ఉన్న శ్రీ వల్లభ నారాయణ స్వామి దేవాలయంకి 50 లక్షలు,దివంజిపేట లో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకి 50 లక్షలు, కలివరం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకి 50 లక్షలు, బెల్లమాం గ్రామంలో ఉన్న శివాలయం కి 40 లక్షలు, రామచంద్రపురం గ్రామంలో ఉన్న శ్రీ వల్లభ నారాయణ స్వామి దేవాలయంకి 40 లక్షలు, గాజులకొల్లివలస గ్రామం లో ఉన్న పురాతన దేవాలయం సంగమేశ్వర దేవాలయం కి 30 లక్షలు, బూర్జ మండలం తమ్మీనాయుడుపేట గ్రామంలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయంకి 40 లక్షలు చొప్పున ఈ ఎనిమిది దేవాలయాలకు నూతన దేవాలయాలు నిర్మించుకోవడానికి నిధులు మంజూరయ్యాయని స్పీకర్ తమ్మినేని అన్నారు. సభాపతి కృషివలన త్వరితగతిన దేవాలయాలకు నిధులు మంజూరయ్యాయని ఎండోమెంట్ ఏసి కే శిరీష అన్నారు. అదేవిధంగా గ్రామాలలో దేవాలయ కమిటీలు ఏర్పాటు చేసి ఉమ్మడి బ్యాంక్ ఎకౌంటు ఏర్పాటు చేసి ఆ అకౌంట్లో గ్రామ ప్రజల వాటా 20 శాతం డబ్బులు జమ చేయాలన్నారు ప్రభుత్వము నుండి మిగతా 80 శాతం నిధులను ఆ అకౌంట్లో జమ అవుతాయని ఆమె అన్నారు. త్వరితగతిన గ్రామాలలో దేవాలయ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహకరించిన మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేనా నాగేశ్వరరావు, జడ్పిటిసి బెజ్జీ పురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అవుట్సోర్సింగ్ డైరెక్టర్ ఖండపు గోవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి రాంబాబు ఎండోమెంట్ ఏ సి కె శిరీష మరియు ఈ ఓ లు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-29 11:47:08

పరీక్ష కేంద్రాన్ని తనిఖీచేసిన కలెక్టర్..

పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండల కేంద్రంలో సెయింట్ జేవియర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. విద్యార్థుల హాజరు విధానాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ నాగమణి,  డిపార్ట్ మెంటల్ అధికారి యు.అప్పారావును పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించుటకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీక్షలు పూర్తయ్యేవరకూ ఎక్కడ ఎటువంటి లోపాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్, పరీక్ష పత్రాలు లీక్ వంటి ఉదంతాలు సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అనవసరపు వదంతులు వ్యాప్తి కాకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, పరీక్ష జరుగుతున్నంత కాలం విద్యుత్ సరఫరా జరిగే విధంగా సంబంధిత అధికారులతో సమన్వయం చేయాలని ఆయన చెప్పారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయుటకు అనుగుణంగా పరీక్ష కేంద్రం ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకర్ రావు, తాహశీల్దార్ బుచ్చయ్య, ఆర్. ఐ  ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం 10,631 మందికి గాను 10,581 మంది విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారు.

Parvathipuram

2022-04-29 08:09:58

అనధికారికంగా మందులు నిల్వచేస్తే జైలే

శ్రీకాకుళం జిల్లాలో అనధికార మందుల నిల్వ చేసేవారికి  జైలు శిక్ష తప్పదని జిల్లా ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు యం.చంద్రరావు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన జారీచేసారు. ఔషధ చట్టం, 1940  నిబంధనలు అతిక్రమించినందుకు బగాది కూర్మినాయకులు అనే ముద్దాయికి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ముప్పై వేల రూపాయల జరిమానాను టెక్కలి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు విధించిందని స్పష్టం చేసారు. 2018 సం.లో లైసెన్సులు లేకుండా మందులు నిల్వ ఉంచి అమ్ముతున్నారని సమాచారం మేరకు అప్పటి పాలకొండ, శ్రీకాకుళం, టెక్కలి డ్రగ్స్ ఇన్ స్పెక్టర్లు కూన కళ్యాణి, ఎ.కృష్ణ, ఎ.లావణ్య ఆకస్మికంగా తనిఖీ చేసి సదరు బగాది కూర్మినాయుకులు నిల్వ ఉంచిన మందులను స్వాధీన పరచుకొని టెక్కలి కోర్టులో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కోర్టులో నేరం నిరూపణ అయినందున సదరు ముద్దాయికి రూ.30వేల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష వేసినట్లు చెప్పారు. ఔషధ చట్ట ప్రకారం లైసెన్సులు లేకుండా మందులు విక్రయాలు ఎవరైనా జరిపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని సహాయ సంచాలకులు  యం.చంద్రరావు ఆ ప్రకటనలో హెచ్చరించారు.

Srikakulam

2022-04-28 14:49:04

ప్రారంభం కాని ఇళ్లన్నీ రద్దైపోతాయ్..

విజయనగరం జిల్లాలో మే నెల 15 నాటికి స్లాబ్ పడని  గృహాలు  రద్దు చేయడం జరుగుతుందని  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.  కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక సారి రద్దయితే ఆ ఆధార్ పై మళ్లీ మంజూరు అయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. అందువలన గృహాలు మంజూరైన లబ్ధిదారులు ఈ నెలాఖరు లోగా గ్రౌండింగ్ చేసుకొని, మే 15 నాటికి స్లాబ్ లెవెల్ కు చేరి కనీసం ఒక పేమెంట్ ను  పొందాలన్నారు. గుంకలాం వంటి పెద్ద లే ఔట్ నందు కాంట్రాక్టర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, మెటీరియల్ కూడా సిద్ధంగా ఉందని, మెప్మా వారి సహాయం తో లబ్ధిదారులు గృహ నిర్మాణాలు వెంటనే ప్రారంభించుకోవాలని తెలిపారు. మంజూరైన గృహాలు  రద్దు కాకుండా  వెంటనే నిర్మాణాలు చేపట్టాలన్నారు.

Vizianagaram

2022-04-28 14:46:39

మే1 నుంచి రబీ ధాన్యం కొనుగోలు

ప్రస్తుత ర‌బీ సీజ‌నులో జిల్లాలోని రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు 167 రైతుభ‌రోసా కేంద్రాల ద్వారా సేక‌ర‌ణ‌కు ఏర్పాట్లు చేశామ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ వెల్ల‌డించారు. మే 1వ తేదీ నుంచి ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. జిల్లాలోని రైతులంతా ర‌బీ సీజ‌నులో తాము పండించిన ధాన్యాన్ని రైతుభ‌రోసా కేంద్రాల్లో విక్ర‌యించి మ‌ద్ధ‌తు ధ‌ర పొందాల‌ని కోరారు. ఈ కొనుగోలు కేంద్రాల‌ను 78 ధాన్యం స‌హాయ‌క సంఘాల‌కు అనుసంధానం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. జిల్లాలో ప్ర‌స్తుత ర‌బీలో 8,986 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం దిగుబ‌డి వుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నామ‌ని, ఇందులో 6,290 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొన‌గోలుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ర‌బీ ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ ఆధ్వ‌ర్యంలో గురువారం ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రైతులు ధాన్యం తెచ్చేందుకు అవ‌స‌ర‌మైన గోనె సంచుల‌ను పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ స‌మ‌కూరుస్తుంద‌ని పేర్కొన్నారు. ధాన్యం ర‌వాణాకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, రైతులు త‌మ సొంత ఖ‌ర్చుల‌తో ధాన్యం ర‌వాణాచేస్తే ర‌వాణా ఖ‌ర్చులు కూడా చెల్లిస్తామ‌న్నారు. రైతులు ఎవ‌రైనా ఇప్ప‌టివ‌ర‌కూ ఇ-క్రాప్ చేయించుకోనట్ల‌యితే వెంట‌నే రైతుభ‌రోసా కేంద్రాల‌కు వెళ్లి చేయించుకోవాల‌న్నారు. ఇప్ప‌టికే ధాన్యం విక్ర‌యించేందుకు సిద్ధంగా వున్న రైతులు రైతుభ‌రోసా కేంద్రాల్లో షెడ్యూలింగు చేసుకోవాల‌న్నారు.

ఈ సంద‌ర్భంగా జిల్లా వ్యవ‌సాయ అధికారి బి.టి.రామారావు, జిల్లా స‌హ‌కార అధికారి ఎస్‌.అప్ప‌ల‌నాయుడు, పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ జిల్లా మేనేజ‌ర్ మీనా, పౌర‌స‌ర‌ఫ‌రాల అధికారి పాపారావు, వ్య‌వ‌సాయ మార్కెటింగ్ శాఖ అధికారి శ్యాం త‌దిత‌రులు వ్య‌వ‌సాయ స‌హాయ‌కులు, స‌హ‌కార సంఘాల సిబ్బంది త‌దిత‌రుల‌కు కొనుగోలు ప్ర‌క్రియ‌పై అవ‌గాహ‌న క‌లిగించారు.

Vizianagaram

2022-04-28 14:43:57

కళాకారులకు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర..

ఉత్తరాంధ్రలో కవులు, కళాకారులు, రచయితలు, నటులకు కొదవలేదని, అన్నింటికి ఈ ప్రాంతం పుట్టినిల్లుగా బాసిల్లుతుందని సురక్ష ఆసుపత్రి అధినేత, జనసేన డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొడ్డేపల్లి రఘు అన్నారు. నగరానికి చెందిన ధనుంజయ్ ఆర్ట్స్, క్రాప్ట్స్ సంస్థ 25వ వార్షికోత్సవ వేడుకలు విశాఖ పౌరగ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రఘుతో పాటు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, ప్రముఖ మెజిషియన్ బి.ఎన్. రెడ్డి, స్నేహాంజలి సంస్థ అధ్యక్షులు మూర్తి, కళాకారులు నాంచారయ్య, వెంకటేశ్వరరావు, నటుడు యాద్ కుమార్, సత్గీత్ క్రియేషన్స్ అధినేత గణేష్ తదితరులు పాల్గొని ధనుంజయ్ సేవలను కొనియాడారు. నిరంతరం తాను కష్టించి పనిచేస్తూ మరికొంత మందికి ఉపాది కల్పించి ధనుంజయ్ ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలిచారన్నారు. నటుడిగా, కళాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు. వీరంతా నటుడు ధనుంజయ్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు కళాకారులు, నటులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-04-27 03:06:08

అభివ్రుద్ధి పనులు వేగవంతం చేయాలి..

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ  కార్యాలయం లోని సమావేశ మందిరంలో మంగళవారం 14,15 ఆర్థిక సంఘ నిధులు, రహదారుల మరమ్మతులు, కార్పొరేషన్ సాధారణ నిధులు. అర్బన్ హెల్త్ సెంటర్ల అభివృద్ధి, నాడు- నేడు, పూడికతీత పనులు, మంచినీటి పై వేసవి కార్యాచరణ, తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం  కమిషనర్ నాగ  నరసింహారావు మాట్లాడుతూ వివిధ దశల్లో ఉన్న పనులన్నీ  వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యేలు కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మేయర్ సుంకర శివ ప్రసన్న, కార్పొరేటర్లు వివిధ అభివృద్ధి పనులను ప్రతిపాదించారని కమిషనర్ చెప్పారు. ప్రతిపాదిత పనులన్నీ సకాలంలో వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్చి చివరినాటికి కాంట్రాక్టర్లకు సంబంధించిన వే బిల్లులు కూడా క్లియర్ అయ్యాయని కమిషనర్ చెప్పారు.  సమావేశంలో  ఎస్ ఈ సత్య కుమారి, ఈఈ లు డిఈ లు, ఏఈలు పాల్గొన్నారు. 

 నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై ట్రాఫిక్ డిఎస్పి  మురళి కృష్ణారెడ్డి,సి ఐ చైతన్య కృష్ణ,  ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ నాగ నరసింహారావు సమావేశమయ్యారు. ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్లు, సెల్లార్ పార్కింగ్, ట్రాఫిక్ అవరోధంగా ఉన్న పశువుల సమస్య, సిగ్నల్ లైట్లు, సైన్ బోర్డ్స్ వంటి  అంశాల పై  చర్చించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లో నగరపాలక సంస్థ ను కూడా భాగస్వామ్యం చేసి ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చూస్తామన్నారు.

Kakinada

2022-04-26 13:27:19

కార్పోరేషన్ ఆధ్వర్యంలో చలి వేంద్రాలు

ప్రస్తుత వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాకినాడ నగరపాలక సంస్థ  రద్దీగా ఉండే  16 ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసింది. రూ 3 లక్షలు వెచ్చించి చలివేంద్రాల ఏర్పాటుకు అవసరమైన వసతులు కల్పించారు. నగరపాలక సంస్థ ద్వారా  స్వచ్ఛమైన చల్లటి నీటితో  ఈ చలివేంద్రాలు ద్వారా  ప్రజల దాహార్తిని తీర్చనున్నారు. ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నగరపాలక సంస్థ చలివేంద్రాలు ద్వారా మంచినీటి అందించి ప్రజల దాహార్తిని తీర్చనున్నారు. కేవలం మంచి నీరే కాకుండా  భానుగుడి జంక్షన్, టౌన్ హాల్, ప్రభుత్వాసుపత్రి, జగన్నాధపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్, అన్నమ్మ ఘాటీ సెంటర్ వంటి ముఖ్యమైన 5 ప్రాంతాలలో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మజ్జిగ చలివేంద్రాలు  మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు  పని చేయనున్నాయి. చలి వేంద్రాలు ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి  నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ఎస్ ఈ సత్య కుమారి,  ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఏర్పాటు  చేసిన చలివేంద్రాల లో  ఎటువంటి నీటి  సమస్య ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని  సూచించారు. ఈ మేరకు ఆయా చలివేంద్రాలను   పర్యవేక్షించే సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కమిషనర్ నాగ నరసింహారావు కోరారు.

Kakinada

2022-04-26 13:24:23

విజయవాడ ఘటనను ప్రతీఒక్కరూ ఖండించాలి

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక పరిస్థితి సరిగ్గా లేని మహిళపై జరిగిన ఆ ఘటన ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఆ సంఘటన ద్వారా  రాజకీయంగా  ప్రయోజనం కోసం ప్రతిపక్షాలు ఆరాటపడడం సహేతుకం కాదని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఎంపి మార్గాని భరత్ రామ్ తో కలిసి మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి డా. తానేటి వనిత  మాట్లాడుతూ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక పరిస్థితి సరిగ్గా లేని మహిళపై జరిగిన ఘటన ను ఎవ్వరూ హర్షించరని పేర్కొన్నారు. అటువంటివి సమాజంలో జరగ కూడదన్నారు. ఆ సంఘటన లోని బాధిత కుటుంబాల, బాధితురాలి వివరాలు బహిర్గతం చెయ్యరాదని చట్టాలు స్పష్టంగా తెలియ చేస్తున్నాయన్నారు. ప్రతిపక్ష నేత మీడియా తో కలిసి ప్రచారం కోసం చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కొందరు ప్రతి పక్ష నాయకులకు మహిళలపై ఏమాత్రం గౌరవం లేదని మంత్రి తెలిపారు. అత్యాచార బాధితురాలి పరామర్శను కూడా ప్రతిపక్ష నాయకుడు రాజకీయం చేశారన్నారు. పోలీసు శాఖ మూడు గంటల్లోనే అత్యాచార నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. అంతే కాదు బాధితురాలికి ప్రభుత్వం తరుపున 10 లక్షల రూపాయల పరిహారం ఇచ్చాము. ఆ కుటుంబంలో ని బాధిత రాలికి, లేదా ఆమె తల్లికీ ఉద్యోగం కోసం సిఫార్సు చేసినట్లు తెలిపారు. స్వంత ఇంటిని , స్థలాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, గృహ నిర్మాణ శాఖ మంత్రి తో ఈ విషయం పై మాట్లాడినట్లు తెలిపారు. హోం మంత్రి గా ఉన్న నన్ను ట్రోల్ చేయడం మహిళలకు ఇచ్చే  గౌరవమా..? అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ ఛైర్మన్ తో ప్రతిపక్షా లకు చెందిన మహిళలు , వర్గాలు అడ్డు తగలడం   కొట్లాటాలా వ్యవహరించి, మహిళలు పట్ల వారి కున్న వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయన్నారు. ఎమ్మార్వో వనజాక్షి విషయంలో అప్పటి సీఎం హోదాలో చేసిన  పంచాయతీని మంత్రి ఒకసారి గుర్తు చేశారు. మహిళలంతా సీఎం జగన్ వెనక ఉండటాన్ని ప్రతిపక్షం తట్టుకోలేక పోతోంది. సర్వేల ఫలితాలు తెలుసుకుని, అధికారం రాదని తెలుసుకుని ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్నాయన్నారు. ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో  మహిళలపై దారుణాలు జరిగితే బయటకు వచ్చేవి కాదని.. మా ప్రభుత్వంపై  నమ్మకంతో బాధితులు  బయటకు వస్తున్నారు. దిశ యాప్ ద్వారా చాలా మంది మహిళలు తమని తాము రక్షించుకున్న ఘటనలు మంత్రి ప్రస్తావించారు. హక్కుల కోసం పోరాడటాన్ని  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా హర్షిస్తారని తెలిపారు. ఐతే ఇక్కడ జరిగింది ,సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యు.టి.ఎఫ్  యత్నించడం అని, ఇది ఎంతవరకు సరైనదని ఆలోచించుకోవాలి.రాష్ట్ర ప్రజలందరూ సీఎం జగన్ గారి పాలనపై పూర్తి నమ్మకంతో వున్నారు. ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే ప్రతిపక్షాలు నాయకులు విషప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని రాజకీయ లబ్దికోసం ఉపయోగించు కోవాలని కొందరు చూస్తున్నారన్నారు.

ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ  రాష్ట్రంలో జరుగుతున్న ప్రతివిషయాన్ని గమనిస్తున్నారని, ప్రభుత్వంపై అన్యాయంగా చేస్తున్న విష ప్రచారాలను గమనిస్తూనే వున్నారని , తగిన సమయంలో గుణపాఠం చెబుతారని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు, కొందరు నాయకులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎంపి మార్గని భరత్ మాట్లాడుతూ, దిశా చట్టానికి కేంద్ర మహిళా మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించి, తదుపరి చర్య కోసం హోం మంత్రిత్వ శాఖ కు సిఫార్సు చేసిందని తెలిపారు.  తదుపరి పార్లమెంట్ లో కూడా తదుపరి సానుకూల నిర్ణయం రావడం దిశగా అడుగులు ముందుకు పడుతున్నట్లు తెలిపారు.

Rajahmundry

2022-04-26 13:19:50

ప్రజలకు ఈ-గవర్నెస్ చేరువచేయాలి

ప్రజలకు మరింత చేరువగా పారదర్శకంగా ఈ గవర్నెస్ ద్వారా మరింత మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని,  ఆ ఉద్దేశ్యాన్ని అందరూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా యంత్రాంగంతో ముఖ్యమంత్రి  తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయం నుంచి హౌసింగ్, ఓటీఎస్ , జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, గ్రామ, వార్డు, అర్భికే, హెల్త్ క్లినిక్స్, మిల్క్ యూనిట్ భవనాలు,  స్పందన, జగనన్న కాలనీలు, ఉపాధి హామీ, నాడు నేడు స్కూల్స్, ఆసుపత్రులు, అంశాలపై సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత  పాల్గొన్నారు.  వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారు లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలు  ఎందుకు చేసింది అన్న విషయంలో కలెక్టర్లు, జేసిలు, ఎస్పీలు అవగాహన కలిగి ఉండాలన్నారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసి, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు మరింతగా మెరుగైన, త్వరితగతిన పరిపాలన సౌలభ్యం అందించాలన్నదే ఉద్దేశ్యం అన్నారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకొని, లక్ష్యాలను ఛేదించే దిశగా అడుగులు వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికి గృహాల ను నిర్మించే కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని, దాదాపురూ.13 వేల కోట్లు ఈ పథకం కొరకు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. జిల్లా కలక్టర్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సమీక్ష చేస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యత కార్యక్రమాలు నూరు శాతం సాధించేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. ప్రతి 15 రోజులకు సిఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న దృష్ట్యా ప్రగతి సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్, డి ఆర్ ఓ బి. సుబ్బారావు,  ఎస్ ఈ.(పిఆర్)  ఏ బివి ప్రసాద్, డి ఎమ్ & హెచ్ ఓ డా. ఆర్ స్వర్ణలత, డిటి సి ఓ డా. ఎన్. వసుంధర, డి ఎస్ సి ఓ . పి. లక్ష్మణ రావు,  డిప్యూటీ డి ఎమ్ & హెచ్ ఓ లు   డా. కె. సుధాకర్, డా. జీ. వరలక్ష్మి, డ్వామా అడిషనల్ పిడి  ఏ. మోక్షలింగం, డిఎఓ(అగ్రి) ఎస్ . మాధవరావు, డిపిఆర్వో ఐ. కాశయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

Rajahmundry

2022-04-26 13:15:51

శాస్వత లైసెన్సులు చేయించుకోవాలి..

శ్రీకాకుళం  జిల్లాలో మోటారు వాహనాల లెర్నర్ లైసెన్సులు పొంది నేటివరకు శాస్వత లైసెన్సులు పొందని వారందరూ త్వరితగతిన శాస్వత లైసెన్సులను పొందాలని ఉప రవాణా కమీషనర్ డా. వడ్డి సుందర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన జారీచేసారు. రాష్ట్ర రవాణా శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు త్వరలో రాష్ట్ర రవాణా శాఖ కార్యకలాపాలన్ని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత ఎన్.ఐ.సి ద్వారా నిర్వహించ బడుచున్న VAHAN  మరియు SARATHI  సేవలకు అనుసంధానించబడనున్నట్లు చెప్పారు. అందువలన ఎవరైతే లెర్నర్ లైసెన్సులను పొంది ఇప్పటివరకు శాస్వత లైసెన్సులను పొందకుండా ఉన్నారో వారందరూ త్వరితగతిన శాస్వత లైసెన్సులను పొందాలని కోరారు. లేనిఎడల సదరు LLR లన్నీ రద్దుకాబడతాయని, కావున దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

Srikakulam

2022-04-26 13:02:49

గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి

రాష్ట్రంలో పేదలకు నిర్మిస్తున్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ లను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి ముఖ్య మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ ,రైతు భరోసా కేంద్రాల భవనాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ , ఏఎంసియు & బిఎంసియు, వైయస్సార్ డిజిటల్ లైబ్రరీలు, జగనన్న గృహ నిర్మాణాలు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, 90 రోజుల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం, జగనన్న భూ హక్కు- భూ రక్ష, భూసేకరణ, నాడు - నేడు పనులు, హెల్త్, ఎడ్యుకేషన్, స్పందన గ్రీవెన్స్, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలైన వాటిపై పీరియాడికల్ గా సమీక్షలు నిర్వహించి పనులను పర్యవేక్షించాలని సూచించారు. జగనన్న కాలనీ పెద్ద లే అవుట్ ల పై ప్రత్యేక దృష్టి సారించి అప్రోచ్ రోడ్లు, మౌలిక వసతులు కల్పించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు. జగనన్న సంపూర్ణ గృహ పథకం కింద పెండింగ్ రిజిస్ట్రేషన్ లను పూర్తి చేయాలని అన్నారు. ప్రజల నుండి స్పందనకు వచ్చిన వినతులను నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. విజయనగరం జిల్లా నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హాజరుకాగా, స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి  జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, డి అర్ ఓ జల్లేపల్లి వెంకట రావు, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-26 12:56:21

జిల్లాలో ఫీవర్ సర్వే సక్రమంగా చేపట్టాలి

ఫీవర్ సర్వే సక్రమంగా చేసి వేగంగా పూర్తి చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆయన క్యాంప్ కార్యాలయం నుండి జిల్లాలోని ఎంపీడీఓలు,వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, డివిజనల్ పంచాయతీ అధికారులతో  టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు,గ్రామ వాలంటర్లు సమన్వయంతో  పనిచేసి పగడ్బందీగా ఫీవర్  సర్వే చేయాలని ఆదేశించారు. ఎంపిడిఓ లు క్షేత్ర స్థాయి సిబ్బందికి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు. ఎం పి డి ఓ లు ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి మనబడి నాడు నేడు రెండవ విడత పనులకు సాంకేతిక పరమైన అనుమతులు పొందాలని సూచించారు. బ్యాంక్ ఖాతాలు తెరవాలని స్పష్టం చేసారు. ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన పనిదినాలు కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాల క్రిష్ణ మాట్లాడుతూ 212 గ్రామ సచివాలయం భవనాలు,209 రైతు భరోసా కేంద్రాలు,112 వెల్నెస్ సెంటర్లు నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు.84 రైతు భరోసా కేంద్రాలు 90శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు. ప్రతీ వారం అధికారులతో నిర్మాణాలు, ఉపాధి పనులు పురోగతి పై సమీక్ష చేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎహెచ్ ఓ డా.రామ్మోహన్, ఎంపిడిఓ లు,వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-04-26 12:53:15

రోజుకి లక్ష పనిదినాల ఉపాధి పనులు

ప్రతి జిల్లాలోను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోజుకు లక్ష పనిదినాలు కల్పిం చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, హెల్త్ క్లీనిక్‌లు గృహ నిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు, జగనన్న భూ హక్కు, ప్రాజెక్టులకు భూ సేకరణ, నాడు నేడు , స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులలో జిల్లాలో రోజుకు లక్ష పనిదినాలు కల్పించాలని, నెలకు 25 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఏప్రిల్, మే నెలలో ముమ్మరంగా ఉపాధి పనులు జరగాలన్నారు. ఈ మూడు నెలలో పనులపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డ్వమా పిడిలు, ఎంపిడి ఓలు దృష్టి పెట్టాలని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లీనిక్‌లు ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. డిజిటల్ లైబ్రరీలు డిసెంబరు 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి దశ మన బడి నాడు నేడు కింద రూ.3800 కోట్ల తో 15,750 పాఠశాలలను అభివృద్థి చేసామన్నారు. రెండవ దశలో రూ.8 వేల కోట్లతో 26,451 పాఠశాలలను అభివృధ్ధి చేస్తామని మే 2 వ తేదీ నుండి పనులకు శంకుస్థాపనులు చేస్తామన్నారు. పాఠశాల కమిటీలు నాడు నేడు పనులు చేస్తాయని, కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు, డి ఇ ఓ లు పనులు తనిఖీ చేయాలని అన్నారు. కంపెనీల నుండి సిమెంటు సరఫరా ఇబ్బందులు నోడల్ అధికారిని నియమించి ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలకు ఇసుక,సిమెంటు, ఇనుము, మెటల్ సరఫరా బాధ్యతలు అప్పంగించాలని అన్నారు. భవన నిర్మానాణాల పనులన్సీ ఒకరికే అప్పగించకుండా ఎక్కువ మందికి అప్పగిస్తే పనులు వేగంగా జరుగుతాయన్నారు. తొలిదశలో 15.6లక్షల ఇళ్ల నిర్మాణాలు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈనెల 28 వతేదీన విశాఖపట్నంలో 1.32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. స్పందన ఫిర్యాదలు పరిష్కారంలో నాణ్యతలు పాటించాలని చెప్పారు. ఫిర్యాదులను ఎందుకు తిరస్కరించారో ఫిర్యాదుదారులకు తెలియ జేయాలన్నారు.ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల నాడు నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడి ఏ పి ఓ రోణంకి గోపాల క్రిష్ణ , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, డి ఇ ఓ డా.పి.రమేష్, గిరిజన సంక్షేమశాఖ డిడి , సి . ఎ. మణికుమార్, ఇ ఇ డివి ఆర్ ఎం రాజు,రహదారులు భవనాల శాఖ ఇ ఇ పి. బాల సుందర బాబు, ఆర్ డబ్లూ ఎస్ ఇ ఇ జవహార్ కుమార్, ఉపాది హామీ ఎపిడి జె.గిరిబాబు, వెలుగు ఎపిడి మురళి, గృహనిర్మాణ శాఖ ఇ ఇ ఎస్ రఘుభూషణ రావు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-04-26 12:52:01

ఆసుపత్రులు త్వరితగతిన ప్రారంభించాలి

ప్రభుత్వ ఆసుపత్రులలో నాడు-నేడు కింద చేపట్టిన నిర్మాణ పనుల‌ను త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నాడు-నేడు కింద చేపట్టిన ఆసుపత్రుల నూతన నిర్మాణ పనులు, మరమ్మతులు, ఆధునికీక‌ర‌ణ పనుల పురోగతి తదితర అంశాలపై కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా.. జిల్లా వైద్య ఆరోగ్య, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, రంగరాయ వైద్య కళాశాల అధికారులు,  పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ, ఏపీ ఎంఎస్ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షీంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు రూ. 45 కోట్లతో ఏలేశ్వరం, ప్రత్తిపాడు సీహెచ్‌సీల‌లో 30 నుంచి 50 పడకలు ఏర్పాటు చేయ‌డంతో పాటు ఇతర సీహెచ్‌సీల‌లో భారతీయ ప్రజారోగ్య ప్రమాణాల‌ ప్రకారం ఆధునికీకర‌ణ పనులు చేపట్టనున్న‌ట్లు తెలిపారు. కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రితో పాటు తుని ఏరియా ఆసుపత్రి, ప్రత్తిపాడు, జగ్గంపేట, రౌతులపూడి, ఏలేశ్వరం, తాళ్ల‌రేవు తదితర సీహెచ్సీలలో చేపట్టిన నిర్మాణ పనుల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తిచేయాల‌న్నారు. ఇంజనీరింగ్ అధికారులు పనులలో పురోగతి చూపి నిర్దేశ గడువులోపు లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారిణి డా. బి.మీనాక్షి, జీజీహెచ్ సుపరింటెండెండ్ డా. పి.వెంకటబుద్ధ, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డా. డి.ఎస్.వి.ఎల్.నరసింహ, డీసీహెచ్ఎస్ డా. పీవీ.విష్ణువర్థిని, ఏపీఎంఎస్ఐడీసి ఈఈ కె.సీతారామరాజు, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు‌, అర్ అండ్ బి ఎస్ఈ హరిప్రసాద్‌బాబు ఇతర అధికారులు హాజరయ్యారు.

Kakinada

2022-04-26 12:12:19