1 ENS Live Breaking News

విద్యాదీవెనతో పేదలకు ఉన్నతవిద్య

పేద కుటుంబాల పిల్ల‌ల‌కు ఉన్న‌త విద్య‌ను అందించి.. ఆ కుటుంబాలు అన్ని విధాలా అభివృద్ధి సాధించాల‌నే ఆశ‌యంతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గొప్ప మ‌న‌సుతో జ‌గ‌న‌న్న విద్యా దీవెన (జేవీడీ) ప‌థ‌కాన్ని విజ‌య‌వంతంగా అమ‌లుచేస్తున్నార‌ని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. జ‌గ‌నన్న విద్యా దీవెన ప‌థ‌కం కింద 2022, జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ మొత్తాన్ని విడుద‌ల చేసే కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురువారం ఉద‌యం తిరుప‌తిలో ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కాకినాడ జిల్లా క‌లెక్ట‌రేట్ వివేకానంద స‌మావేశ‌మందిరం నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత‌, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ ద‌వులూరి దొర‌బాబు, జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ‌, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ మేయ‌ర్ సుంక‌ర శివ ప్ర‌స‌న్న‌, కుడా ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌ళాదీప్తి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కం కింద ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ మొత్తాన్ని విడుద‌ల చేసే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన అనంత‌రం ఎంపీ, హౌసింగ్ కార్పొరేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్, జాయింట్ క‌లెక్ట‌ర్, మేయ‌ర్, కుడా ఛైర్‌ప‌ర్స‌న్ త‌దిత‌రులు అధికారుల‌తో క‌లిసి విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌కు మెగా చెక్ అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కం కింద కాకినాడ జిల్లాలో 2022, జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికానికి 47,347 మంది విద్యార్థుల‌కు సంబంధించి 42,075 మంది త‌ల్లుల ఖాతాల్లో రూ. 29.59 కోట్లు మొత్తాన్ని జ‌మచేయ‌డం జ‌ర‌గుతుంద‌న్నారు. ఒక క్యాలెండ‌ర్ ప్ర‌కారం చెప్పిన స‌మ‌యానికి రాష్ట్ర ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను అందిస్తోంద‌న్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, వైద్య శాల‌ల్లో నాడు-నేడు కార్య‌క్ర‌మం ద్వారా అవ‌స‌ర‌మైన అన్ని మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. విద్యారంగ ప్రాధాన్యాన్ని గుర్తించి ఓ స‌మ‌గ్ర‌మైన విధానంతో ఆ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్య‌మంత్రి కృషిచేస్తున్నార‌ని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు.

ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి: జేసీ ఇల‌క్కియ‌ 
కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తున్న జ‌గ‌న‌న్న విద్యా దీవెన, జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన త‌దిత‌ర ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకొని, ఉన్న‌త చ‌దువులు చ‌దివి భ‌విష్య‌త్ కెరీర్ ప‌రంగా ఉన్న‌తంగా ఎద‌గాల‌ని విద్యార్థుల‌కు సూచించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జె.రంగ‌ల‌క్ష్మీదేవి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి కె.మ‌యూరితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-05-05 13:42:15

మన్యం జిల్లా అభివ్రుద్ధే ప్రధాన లక్ష్యం..

మన్యం జిల్లా అభివద్ధికి అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా రివ్యూ కమిటీ సమావేశం గిరి మిత్ర సమావేశ మందిరంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన గురు వారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రాదాన్యత క్రమంలో ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. తాగు నీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. సాలూరులో గృహ నిర్మాణంపై దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. సాలూరులో 10,850 గృహాలు మంజూరు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పక్కాగా అమలు జరిగి వేతనదారులకు మంచి వేతనం లభించుటకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అటవీ ప్రాంత రహదారుల గూర్చి మాట్లాడుతూ పనులు వేగవంతం చేయాలని అన్నారు. బొరబంద ఆర్.బి.కె నుండి తూర్పు గోదావరి జిల్లాకు ధాన్యం పంపించారని, అయితే సక్రమంగా నమోదు చేయలేదని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఏనుగులు వలన నష్టం జరిగిన వివరాలు, వచ్చిన నిధులు, వినియోగంపై నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. 

 జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి విప్లవాత్మక నిర్ణయాలలో భాగంగా జిల్లాల విభజన జరిగిందన్నారు. పరిపాలన చేరువ కావడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి జరుగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు పక్కాగా అమలు చేయాలని ఆయన సూచించారు. పథకాలు ప్రపంచ స్థాయిలో ప్రశంసలు పొందుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రూ.1.44 లక్షల కోట్లు నగదు బదిలీ పథకం క్రింద ప్రజలకు అందుతుందని మంత్రి పేర్కొన్నారు. నీటి ఎద్దడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు వద్దకు సమస్యలు వస్తాయని వాటిని అధికారులు వెంటనే పరిష్కరించాలని అన్నారు. ముఖ్య మంత్రి మానస పుత్రిక గ్రామ సచివాలయం, ఆర్.బి. కె, వెల్ నెస్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. అత్యధిక సంఖ్యలో రాష్ట్రానికి గృహాలు మంజూరు అయ్యాయని వాటిని నిర్మించుకోవాలని అన్నారు. నవరత్నాలు అమలు పక్కాగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని తద్వారా జీవితాలు మారుతాయని, బయటి ప్రపంచంతో సంబంధాలు మెరుగు అవుతుందని ఆయన పేర్కొన్నారు. అటవీ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మన్యం జిల్లాను ఆదర్శంగా నిలుపుటకు కృషి చేద్దాం అని, ముఖ్య మంత్రి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి అన్నారు. 

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ తాగు నీటి సమస్య ఉంటే జిల్లా పరిషత్ నుండి సహకారం అందిస్తామని ఆయన చెప్పారు. జల జీవన్ మిషన్ లో మన్యం జిల్లాలో నీటి సమస్య లేకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అన్నారు. సమగ్ర తాగు నీటి ప్రాజెక్టులు ఏర్పాటుకు ప్రత్యేక డిపిఆర్ లు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. పాలకొండ నియోజక వర్గంలో తాగు నీటి కొరకు రూ.20 లక్షలు మంజూరు చేస్తామని అందులో మొదటిగా రూ.15 లక్షలు విడుదల చేస్తామని అన్నారు. సాలూరు మండలం పెదపాడు గ్రామ సచివాలయంను త్వరగా నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు గొడ్డేటి మాధవి మాట్లాడుతూ సోలార్ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసిన పథకాల మరమ్మతులకు చర్యలు చేపట్టాలని అన్నారు. శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ గతంలో చేపట్టిన తాగు నీటి పనులను కూడా పర్యవేక్షణ చేసి పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే నీటి సమస్య తలెత్తిందని అన్నారు. దాదాపు 6 వందల గిరిజన గ్రామాలకు తాగు నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం పక్కాగా ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. వీరఘట్టం మండలంలో 60 గ్రామాలకు మొదటి విడత క్రింద ఉందని, దానిపై చర్యలు చేపట్టాలని కోరారు. సీతంపేట, భామిని మండలాలలో అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయాలని ఆమె కోరారు. హిల్ టాప్ గ్రామాలలో ఆర్.బి.కెలు, సచివాలయాల నిర్మాణానికి ఇసుక కొరత ఉందని అన్నారు. సిబ్బంది లేక రికార్డింగ్ జరగక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆమె తెలిపారు. సీతంపేట ప్రాంతంలో కూడా ఏనుగుల సమస్య ఉందని ఆమె అన్నారు. ఏనుగుల వలన జరిగే నష్టపరిహారం కూడా అందటం లేదని ఆమె అన్నారు. హిల్ టాప్ లో బియ్యం సరఫరాకు సామర్థ్యం ఎక్కువ ఉన్న వాహనాలు అవసరమని తద్వారా సరఫరా చక్కగా సాగుతుందని అన్నారు. శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ సీతానగరం మండలంలో 16 గ్రామాలు తాగు నీటి సమస్య ఎదుర్కొంటున్నాయని అన్నారు. నర్సిపురంలో 540 మందికి ఇళ్ళ స్థలాల పంపిణి చేయాలని ఆయన తెలిపారు.పట్టణంలో 13 వందలు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. బెలగాంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మంజూరుకు పరిశీలించాలని కోరారు. 

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ మన్యం జిల్లా గిరిజనులకు నిలయమని చెప్పారు.  జిల్లాలో విద్యా, వైద్యం, పేదల ఆదాయం పెంపొందించుటపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. పౌష్ఠికాహారంపై ప్రత్యేక చర్యలు చేపట్టి ఆరోగ్యం మెరుగు కృషి చేయాల్సి ఉందన్నారు. నీతి అయోగ్ సూచనల మేరకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తాగు నీటిపై ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. విద్యుత్ కనెక్షన్లు పెండింగులో ఉన్న అంశాలపై ఆర్. డబ్ల్యూ.ఎస్, ఇపిడిసిఎల్ సంయుక్తంగా నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు.  మునిసిపాలిటీ పరిధిలో ని జగనన్న కాలనీల్లో మౌళిక సదుపాయాలు కల్పించుటకు మునిసిపల్ నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు. పెద్ద లే అవుట్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని ఆయన చెప్పారు. గృహ నిర్మాణం, ఇతర భవనాల నిర్మాణ సామగ్రి కొరకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తామని ఆయన తెలిపారు. అటవీ ప్రాంతంలో రహదారుల నిర్మాణంపై అటవీ అధికారులు ఒకేసారి తనిఖీలు నిర్వహించి నివేదికలు త్వరితగిన సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. మార్చిలో జరిగిన జీడి మామిడి నష్టంపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కోరిన మేరకు బృందాన్ని నియమించారని ఆయన చెప్పారు. నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించామన్నారు. 

గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కూర్మి నాయుడు, ఉపాధి హామీ ఏపిడి శ్రీనివాస రావు, తదితరులు తమ శాఖల ప్రగతి వివరించారు.  పాలకొండ నియోజక వర్గంలోని మండలాలను పట్టణాభివృద్ధి అథారిటీ క్రింద తీసుకువచ్చుటకు ప్రతిపాదనలు సమర్పించాలని డి.ఆర్.సిలో తీర్మానించారు. ఈ మేరకు అన్ని మండలాలు తీర్మానాలు ఆమోదించి సమర్పించాలని, తద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సభ ఆమోదించింది. మార్చిలో జరిగిన జీడి పంట నష్టంకు నష్ట పరిహారం అందించాలని సభ తీర్మానించింది. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ , రాష్ట్ర టి చైర్మన్ జె. ప్రసన్న కుమార్, డిసిఎంఎస్ చైర్ పర్సన్ అవనాపు భావన, పోలీసు సూపరింటెండెంట్ వి. విద్యా సాగర్ నాయుడు,  ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు బి.నవ్య, ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావన, ఆర్.డి.ఓ కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కిరణ్ కుమార్, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ అధికారి విజయ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-05 13:32:23

అల్లూరి జిల్లాలో 14801 మందికి లబ్ధి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద 14801 మంది విద్యార్థులకు 6 కోట్ల 41 లక్షల 91 వేల044 రూపాయలు లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు.  కాగా బీసీ సంక్షేమ శాఖ నుండి 1960 మంది విద్యార్థులకు ఒక కోటి తొమ్మిది లక్షల 91 ఒక వేల 958 రూపాయలు, ఎస్ ఎస్ సి సంక్షేమ శాఖ నుండి 435 మంది విద్యార్థులకు 29 లక్షల 99 వేల 492 రూపాయలు, ఎస్ టి సంక్షేమ శాఖ నుండి 12347 మంది విద్యార్థులకు నాలుగు కోట్ల 87 లక్షల 57 వేల 926 రూపాయలు, మైనారిటీ సంక్షేమ శాఖ నుండి 109 మంది విద్యార్థులకు 28 లక్షల 83 వేల 336 రూపాయలు లబ్ధి చేకూర్చి నట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పి ఎ మణికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

Paderu

2022-05-05 11:15:48

పేద విద్యార్థుల చదువు బాధ్యత నాది

 పేదరికం వల్ల విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకూడదు అనే ఆలోచనతో జగనన్న విద్యా దీవెన పథకం ప్రవేశపెట్టి విద్యార్థుల చదువు బాధ్యతను తీసుకున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  గురువారం తిరుపతి నుండి జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభిస్తూ ప్రతి మూడు నెలలకు విద్యార్థుల ఫీజు ను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామన్నారు.  ఈ త్రై మాసంలో 10.85 లక్షల మంది విద్యార్థులకు రూ. 709 కోట్ల రూపాయలను బటన్ నొక్కి తల్లుల ఖాతాలలో జమ చేశారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంక్షేమ క్యాలెండర్ ను ముందుగానే ప్రకటించి అందుకు అనుగుణంగా పథకాల లబ్ధి చేకూరుస్తున్నమన్నారు.  జగనన్న విద్యా దీవెన తో పాటు జగనన్న వసతి దీవెన కింద 2021-22 సంవత్సరంలో రెండో విడతగా 1024 వేల కోట్ల రూపాయలు అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కాగా జిల్లా నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు పి ఎ మణికుమార్, విద్యార్థులు కలెక్టరేట్ సమావేశ మందిరంలో తిలకించారు.

Paderu

2022-05-05 11:14:15

ఫిష్ ఆంధ్ర నిర్వాహ‌కుల‌కు ప్రోత్సాహం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన ఫిష్ ఆంధ్ర ప‌థ‌కంలో భాగంగా మినీ రిటైల్ యూనిట్లను న‌డుపుతున్న‌ నిర్వాహ‌కుల‌కు త‌గిన ప్రోత్సాహం అందించాలని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆదేశించారు. నిర్వ‌హ‌ణ‌కు త‌గిన సామ‌గ్రి, స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేయాల‌ని సూచించారు. ఫిష్ ఆంధ్ర యూనిట్ల నిర్వ‌హ‌ణపై సంబంధిత అధికారులు, ల‌బ్ధిదారుల‌తో ఆమె త‌న ఛాంబ‌ర్లో  స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఫిష్ ఆంధ్ర యూనిట్ల ద్వారా చాలా మందికి ఉపాధి క‌లుగుతుందని, కావున వాటి నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వ ప‌రంగా త‌గిన ప్రోత్సాహం అందించాల‌ని సూచించారు. రోజూ తాజా చేప‌లను సంబంధిత యూనిట్ల‌కు హ‌బ్ ల ద్వారా స‌ర‌ఫ‌రా చేయాల‌ని చెప్పారు. చేప‌ల‌ వినియోగాన్ని పెంచేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వీలుంటే స‌మీప వస‌తి గృహాల్లో మెనూలో అమ‌లు చేసేందుకు సంబంధిత అధికారుల‌తో మాట్లాడి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకోవాల‌ని ఆదేశించారు. అద‌నంగా మ‌రిన్ని యూనిట్ల‌ను ప్రారంభించాల‌ని, ఔత్సాహికులంటే గుర్తించి యూనిట్లు కేటాయించాలన్నారు. కేంద్రాల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన సామాగ్రిని అంద‌జేయాల‌ని చెప్పారు. ఔత్సాహికుల నుంచి వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి ప్ర‌తి మండ‌ల కేంద్రంలో ఒక యూనిట్ ఏర్పాటు చేసేలా చూసుకోవాల‌ని ఫిష‌రీస్ విభాగం ఉప సంచాల‌కులను ఆదేశించారు.

ప్ర‌తి యూనిట్‌కు ఇన్వ‌ర్టెర్ అంద‌జేయండి..
వేస‌విని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్ర‌త్త‌గా ప్ర‌తి యూనిట్టుకు ఇన్వ‌ర్టెర్ అంద‌జేయాల‌ని హ‌బ్ అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. విద్యుత్ కోత‌ల వ‌ల్ల చేప‌లు పాడైపోకుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, నిర్వాహ‌కుల‌కు న‌ష్టం వాటిల్ల కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌కొల్పిన కేంద్రాల్లో ఎక్కడెక్క‌డ ఇన్వ‌ర్టెర్ అవ‌స‌ర‌మో గుర్తించి త్వ‌రిత‌గిన అందించాల‌ని చెప్పారు. స‌మావేశంలో మ‌త్స‌శాఖ విభాగం ఉప సంచాల‌కులు నిర్మ‌లా కుమారి, డీఆర్డీఏ పీడీ అశోక్ కుమార్‌, మెప్మా పీడీ సుధాక‌ర్‌, ఫిష్ ఆంధ్ర రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్ హ‌రేరామ్‌, జిల్లా కో-ఆర్డినేట‌ర్ కృష్ణ‌, ఇత‌ర అధికారులు జ‌గ‌న్ మోహ‌న్‌, భాస్క‌ర్ రావు, హ‌రిశ్చంద్ర‌, యూనిట్ల నిర్వాహ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-05-05 05:37:39

పవిత్రతకు మారుపేరు రంజాన్ మాసం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పరిశ్రమలు ఐటీ శాఖ  మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆదివారం అనకాపల్లి పట్టణంలోని శారదా నగర్ లో గల కళ్యాణ మండపంలో జిల్లా యంత్రాంగం  ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివంగత రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ పార్టీ లో నలుగురు ముస్లింలకు ఎమ్మెల్యే లు గా స్థానం కల్పించాలని ఒకరికి ఒక ముఖ్య మంత్రి పదవి కూడా ఇచ్చారని చెప్పారు. మైనారిటీ ప్రయోజనాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతుందని తెలిపారు.

అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బి వి సత్యవతి మాట్లాడుతూ  పేదలకు దానాన్ని ఇమ్మని ఖురాన్ బోధిస్తోంది అని, ఇంకా ఎన్నో మంచి విషయాలు కురాన్ లో ఉన్నాయని వాటిని అందరూ ఆదరించాలని పిలుపునిచ్చారు.  సర్వ మత సామరస్యానికి భారతదేశం ఆంధ్ర ప్రదేశ్ ప్రతీకగా నిలుస్తాయి అన్నారు రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ముస్లింల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.

జిల్లా కలెక్టర్ రవి పట్టం శెట్టి మాట్లాడుతూ అనకాపల్లి నూతన జిల్లా ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారి ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.  ముస్లిం సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని చెప్పారు.  స్పందన కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసుకుంటే సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని తెలిపారు. అనకాపల్లి జామియా మసీదు ప్రెసిడెంట్ పి ఎస్ ఎన్ హుస్సేన్ మాట్లాడుతూ ముస్లింలందరూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఎంతో రుణపడి ఉన్నామని చెప్పారు.  ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి అమర్నాథ్ ఎంపీ సత్యవతి కలెక్టర్ రవి పట్టం శెట్టి లకు అభినందనలు తెలియజేస్తూ ముస్లిం పెద్దలు సత్కరించారు.    ఈ కార్యక్రమం లో  జిల్లా రెవిన్యూ అధికారి పి వెంకట రమణ, ఆర్డీవో చిన్నికృష్ణ, జిలాని  రహమాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు‌.

Anakapalle

2022-05-01 14:03:42

అప్పన్నకు ఒడిస్సా భక్తులు విశేష పూజలు..

భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని  వేర్వేరు ప్రాంతాల భక్తులు అనేక రూపాల్లో కొలవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఒరిస్సా బరంపురం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు సింహాచలం తరలివచ్చారు. వీరంతా తొలుత వరహ  పుణ్య పుష్కరిణి వద్దకు చేరుకొని  పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం వివిధ ఫల పుష్పాదులతో పానకాలతో  విశేష అభిషేకం చేపట్టారు. అనంతరం భక్తులందరినీ ఒడిస్సా భక్తబృందం ప్రతినిధి కామ ఆశీర్వదించారు.
భక్తులంతా సాష్టాంగ నమస్కారం చేస్తే వారి పెద్ద  కామ కర్రతో వీపు వైపు కొట్టి స్వామి చల్లగా చూడాలని దీవించారు. తాము ప్రతియేటా చందనోత్సవం కు ముందు రోజు వచ్చి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ఈ ఏడాది సుమారు 300 మంది భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చుకున్నామని కామ తెలిపారు.
అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు  గంట్ల శ్రీను బాబు పుష్కరణి వద్ద  ఒడిషా భక్తులకు అవసరమైన సదుపాయాలను  పర్యవేక్షించారు. అంతే కాకుండా ఆయన వారితో పాటు  పూజాది కార్యక్రమాల్లో  మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఒడిశా భక్తబృందం నుంచి శ్రీను బాబు ఆశీర్వాదం పొందారు.

Simhachalam

2022-05-01 09:29:49

ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం

గ్రామ స‌చివాల‌య స్థాయిలోని వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ద‌గ్గ‌రి నుంచి జిల్లాస్థాయి ఆసుప‌త్రి వ‌ర‌కు ప్ర‌తి దాంట్లోనూ అందుబాటులో ఉన్న మాన‌వ వ‌న‌రులు, మౌలిక వ‌స‌తుల‌ను స‌మ‌ర్థంగా ఉప‌యోగించుకుంటూ ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య భ‌ద్ర‌త క‌ల్పించేందుకు కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. శనివారం క‌లెక్ట‌రేట్‌లో వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌తో క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమలుచేస్తున్న ఆరోగ్య ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు; ఆసుప‌త్రుల ద్వారా అందుతున్న సేవ‌లు, వ్యాధి నిరోధ‌క టీకా కార్య‌క్ర‌మం, 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవ‌లు, సీజ‌నల్ వ్యాధులు, వైద్య నిపుణుల నియామ‌కాలు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ 37 గ్రామీణ‌, 23 ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు; 465 వైఎస్సార్ ఆరోగ్య క్లినిక్‌లు, సీహెచ్‌సీలు, ఏహెచ్‌, జీజీహెచ్‌ల త‌దిత‌రాల ద్వారా జిల్లాలో ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందుతున్నాయ‌న్నారు. ఆసుప‌త్రుల‌కు స‌మ‌కూరుతున్న ఆధునిక ప‌రిక‌రాల వినియోగానికి సుశిక్షుతులైన సిబ్బంది ఉండాలి కాబ‌ట్టి ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌స‌రం మేర‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని సూచించారు. పీసీపీఎన్‌డీటీ చ‌ట్టాన్ని జిల్లాలో ప‌టిష్టంగా అమ‌లుచేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలని.. స్కానింగ్ కేంద్రాల్లో డెకాయ్ ఆప‌రేష‌న్లు, ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టాల‌ని సూచించారు. గ్రామీణ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వైద్య సేవ‌లు అందించేందుకు వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటుచేసింద‌ని.. గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యిమందికి ఒక‌టి చొప్పున‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 2,500 మందికి ఒక‌టి చొప్పున ఈ కేంద్రాలు ఉన్నందున వీటిద్వారా విస్తృత ఆరోగ్య సేవ‌లు అందించేలా క్షేత్ర‌స్థాయి సిబ్బంది కృషిచేసేలా చూడాల‌న్నారు. ఏఎన్ఎం, ఆశాల ప‌నితీరుపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని.. నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు పీహెచ్‌సీల్లో త‌నిఖీలు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. స‌మావేశంలో డీఎంహెచ్‌వో డా. బి.మీనాక్షి, డీసీహెచ్ఎస్ డా. పి.బి.విష్ణువర్థిని, ఆరోగ్య శ్రీ కోఆర్డినేట‌ర్ డా. పి.రాధాకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. రమేష్, ఆర్బన్ డీపీవో డా .మహేష్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-04-30 10:17:24

అర్హులకు సంక్షేమ పథకాలు చేరువ చేయాలి..

అర్హులకు సంక్షేమ పథకాలు చేరువ చేయాలని నగర మేయర్ మహమ్మద్ వసీం అధికారు లను ఆదేశించారు. నగరంలోని 48వ డివిజన్ లో శనివారం నిర్వహించిన సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమంలో మేయర్ వసీం డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి తో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానికులను మేయర్ వసీం సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అరా తీశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా అందించాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమన్నారు.అంతేకాకుండా సంక్షేమ పథకాలు అమలు తీరును స్వయంగా ప్రజా ప్రతినిధులు అధికారులతో కలసి వెళ్లి పరిశీలించేందుకు సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అర్వత ఉండి సంక్షేమ పథకాలు అందకుంటే అక్కడికక్కడే వాటిని పరిష్కరించడమే   సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సచివాలయ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ప్రజలలో మమేకమై వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య సమస్యలను స్థానికులు మేయర్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రమణారెడ్డి,కార్పొరేటర్లు  శ్రీనివాసులు, అనిల్ కుమార్ రెడ్డి కమల్ భూషణ్,సెక్రెటరీ సంగం శ్రీనివాసులు, నగర పలువురు అధికారులు, సచివాలయం  సిబ్బంది పాల్గొన్నారు.

Anantapur

2022-04-30 09:24:08

జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి..

పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రస్తుత వేసవి కాలంలో నీటి ఎద్దడి ఎక్కడా తలెత్తరాదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు గ్రామాల్లో ఉదయం పూట పర్యటన జరపాలని ఆయన ఆదేశించారు. తాగు నీటి ఎద్దడి -  వేసవి కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, మునిసిపల్ అధికారులతో శనివారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితి ఉన్నా ప్రతి అంశాన్ని పరిశీలించాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో ఉన్న నీటి వసతులు, వాటిని ప్రజలు ఉపయోగించే విధానాన్ని తనిఖీ చేయాలని పేర్కొన్నారు. గ్రామంలో పలు నీటి వసతులు ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఒకే బోరుపై ఆధారపడుతున్నప్పుడు మిగిలిన బోర్ల పరిస్థితిని తనిఖీ చేయాలని ఆయన అన్నారు. నీటిని ల్యాబ్ కు పంపించి  నివేదికలు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా నీటిని పరీక్షించాలని, క్లోరినేషన్ చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రతి మండలంలో నీటి తీవ్రత ఉన్న గ్రామాలను ముందుగానే పరిశీలించి జాబితాలను తయారు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి రోజు నీటి ఎద్దడిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఏ గ్రామంలోనైనా తాగు నీరు అందని పరిస్థితి తలెత్తితే దగ్గర్లో ఉన్న నీటి వసతి నుంచి తాగునీటి సరఫరా చేయుటకు కార్యాచరణ ప్రణాళిక ఉండాలని ఆయన అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నీటిని నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా ఫిల్టర్  చేయాలని ఆయన స్పష్టం చేశారు. వేసవిలో ప్రజలకు నీటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో విస్తృత పర్యటనతో పాటు ఇతర విభాగాల ద్వారా సమాచారం వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని తద్వారా ప్రజలు తమ సమస్యలను తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పారు. మండల స్థాయిలోనూ సమాచారం ఉండాలని ఆయన స్పష్టం చేశారు.  జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు, మునిసిపల్ కమీషనర్ పి.సింహాచలం శాఖాపరమైన వివరాలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా ఆరోగ్య ఉప ఇంజినీరింగ్ అధికారి విజయ్ కుమార్ సంభందిత అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-30 08:14:34

మలేరియా రహిత జిల్లాగా మార్చాలి..

పార్వతీపురం మన్యం జిల్లా మలేరియా రహిత జిల్లా కావాలని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రభల కుండా పటిష్ఠమైన చర్యలు ఇప్పటి నుంచే తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలంలో లేదా అకాల వర్షాలు కురిసే కాలంలో జ్వరాలు వ్యాప్తి ఉండే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో ఎక్కడా వ్యాప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మలేరియా, డెంగ్యూ, ఇతర వ్యాధులపై  కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా నివారణకు ముఖ్యంగా ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలన్నారు. తద్వారా లార్వా పెరుగుదల లేకుండా చూడగలమని ఆయన పేర్కొన్నారు. లార్వా పెరుగుదల లేకుండా తగిన చర్యలు కూడా చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఇంటింటికి వెళ్లి డ్రై డే పై అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రభల కుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై సైతం చైతన్యం కల్పించాలని ఆయన చెప్పారు.  ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నీరు నిల్వ జరిగే గ్రామాల జాబితాను ఉపాధి హామీ పిడికి అందజేయాలని ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నీటి కుంతలలో నీరు నిల్వ ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. ఫాగింగ్, స్ప్రేయింగ్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని ఆయన ఆదేశించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వైద్య అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందిని భాగస్వామ్యం చేసి పకడ్బందీగా స్ప్రేయింగ్, ఫాగింగ్ జరుగుటకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వసతి గృహాలకు దోమల నివారణకు మెష్ లను పెట్టాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. స్ప్రేయింగ్ కార్యక్రమాలపై ప్రతి రోజూ నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. 

జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు మాట్లాడుతూ మే 16 నుండి జిల్లాలో స్ప్రేయింగ్ నిర్వహిస్తున్నామన్నారు. గంభూషియా చేప పిల్లలను విడిచి పెట్టడం ద్వారా లార్వా నివారణకు చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. జిల్లాకు రెండు లక్షల గంభూషియస్ చేప పిల్లలు అవసరమని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, జిల్లా పంచాయతీ అధికారి కిరణ్ కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఇ ప్రభాకర రావు, ఉపాధి హామీ శ్రీనివాస రావు, మునిసిపల్ కమీషనర్ పి.సింహాచలం, మత్స్య శాఖ క్షేత్ర అధికారి గంగాధర రావు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-30 07:57:31

సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి..

గ్రామ వార్డ్ సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సత్వర సేవలు అందించేలా విధులు నిర్వహించాలని జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా స్థాయి గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి బి.లక్ష్మి పతి శనివారం పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పనితీరు పరిశీలించేందుకు మరింత మెరుగు పరిచేలా చర్యలు చేపట్టాలన్న ఉదేశ్యం జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించినట్టు చెప్పారు. 2022, ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించిన వెబ్  కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మేరకు  శ్రీకాకుళం జిల్లాలో జిల్లా పరిషత్ సి.ఇ.ఓ జిల్లా నోడల్ అధికారిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్ సిఈఓ, గ్రామ వార్డ్ సచివాలయం నోడల్ అధికారి లక్ష్మిపతి మాట్లాడుతూ గ్రామ, వార్డ్ సచివాలయంలో సిబ్బంది అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించేందుకు నిరంతరం విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అందిస్తున్న సేవలు, ఆధార్ సేవల లభ్యతను ప్రచారం చేయాలన్నారు. గ్రామ వార్డ్ సచివాలయంలో  లామినేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాయని వివరించారు. సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌లు, అసంఘటిత కార్మికులకు రిజిస్ట్రేషన్లు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు

అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లో ఇంటర్నెట్ మానిటరింగ్ టూల్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడం జరిగిందన్నారు.  బయో మెట్రిక్ హాజరును రోజుకు మూడుసార్లు తప్పని సరి అన్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుండి 5 గంటల మధ్య స్పందన నిర్వహించి వచ్చిన వినతులు సంబంధిత అధికారులకు అందజేయా లన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో మెలిగి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేయాలన్నారు. అలాగే జగనన్న స్వచ్ఛ సంకల్పంలో అందరూ భాగస్వామ్యులేనని, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగస్వాములై చెత్త సేకరణ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న ప్రజలు వారికి కావలసిన సేవల నిమిత్తం మీ పరిధిలో ఉన్న వాలంటీర్ సహాయంతో సేవలు పొందవచ్చునని జడ్పీ సీఈవో లక్ష్మీపతి పేర్కొన్నారు.  ప్రజల సమస్యలను ప్రతి రోజూ మధ్యాహ్నం సచివాలయంలో నిర్వహించే స్పందనలో తమ సమస్యలను పరిష్కరించే నిమిత్తం ఫిర్యాదులు అందజేయాలన్నారు. ప్రజలు గ్రామ, వార్డు వాలంటీర్ సేవలను వియోగించుకొని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.

Srikakulam

2022-04-30 06:23:02

స్మార్ట్ సిటీ ప‌నులను వేగ‌వంతం చేయాలి

కాకినాడ స్మార్ట్‌సిటీ మిష‌న్ కింద మంజూరై, చేప‌ట్టిన ప‌నుల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచే సేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌, కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పొరేష‌న్ లిమిటెడ్ (కేఎస్‌సీసీఎల్‌) ఛైర్‌ప‌ర్స‌న్ కృతికా శుక్లా ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వా రం క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా అధ్య‌క్ష‌త‌న కాకినాడ కేఎస్‌సీసీఎల్ కార్యాల‌యంలో 33వ డైరెక్ట‌ర్ల బోర్డు స‌మావేశం జ‌రిగింది. కాకినాడ నగ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్‌, స్మార్ట్‌సిటీ కార్పొరేష‌న్ లిమిటెడ్ సీఈవో, ఎండీ సీహెచ్ నాగ‌న‌ర‌సింహారావు; కాకినాడ నగ‌ర‌పాల‌క సంస్థ మేయ‌ర్‌, బోర్డు డైరెక్ట‌ర్ సుంక‌ర శివ ప్ర‌స‌న్న త‌దిత‌రులు హాజ‌రైన ఈ స‌మావేశంలో స్మార్ట్‌సిటీ మిష‌న్ ప్రాజెక్టులు, ప్ర‌స్తుత ప‌నుల్లో పురోగ‌తి త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ కింద చేప‌ట్టి ప్ర‌స్తుతం న‌డుస్తున్న ప‌నుల్లో వేగం పెంచి.. వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేసేలా అధికారులు కృషిచేయాల‌ని సూచించారు. ఈ ప‌నుల‌కు సంబంధించి అవ‌స‌రం మేర‌కు ఇత‌ర శాఖ‌లతో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. గోదావ‌రి క‌ళాక్షేత్రానికి సంబంధించి 88 శాతం, సైన్స్ సెంట‌ర్‌కు సంబంధించి 80 శాతం మేర ప‌నులు పూర్త‌యినందున మిగిలియున్న ప‌నుల‌ను స‌త్వ‌రం పూర్తిచేయాల‌న్నారు. ప‌రీక్ష‌లు ముగిసిన వెంట‌నే వేస‌వి సెల‌వుల్లో జ‌గ‌న్నాథ‌పురం స‌ర్కిల్‌, ర‌మ‌ణ‌య్య‌పేట స‌ర్కిల్ త‌దిత‌రాల్లో పాఠ‌శాల‌ల అభివృద్ధికి సంబంధించిన ప‌నులు పూర్త‌య్యేలా చూడాల‌ని ఆదేశించారు. ప‌నుల్లో పురోగ‌తిపై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష నిర్వ‌హించి, నివేదిక‌లు పంపాల‌ని.. కాంట్రాక్ట‌ర్ల వారీగా ప్ర‌గ‌తిని ప‌రిశీలించాల‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. స్మార్ట్‌సిటీ మిష‌న్ కింద రూ. 16 కోట్ల విలువైన ర‌హ‌దారుల అభివృద్ధితో పాటు పిండాల చెరువు అభివృద్ధికి సంబంధించిన ప‌నులను స‌మావేశంలో ప్ర‌తిపాదించారు. స‌మావేశంలో చీఫ్ ఇంజ‌నీర్ స‌త్య‌నారాయ‌ణ‌రాజు, స్వ‌తంత్ర డైరెక్ట‌ర్ జేవీఆర్ మూర్తి, సీఎస్ ఎం.ప్ర‌స‌న్న కుమార్ త‌దిత‌రులు ప్ర‌త్య‌క్షంగా హాజ‌రుకుగా మిగిలిన‌వారు వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-04-29 12:12:39

చెత్త నుంచి సంపదను పెంచాలి..

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ ను ఆదాయ వనరుగా అభివృద్ధి చేయడం పై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చెయ్యడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత తెలియచేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం రూరల్ గ్రామం  వెంకటనగర్ లోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ,  సేంద్రియ వ్యర్థాలతో నిర్వహిస్తున్న ఈ యూనిట్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఎరువులు అత్యంత నాణ్యమైన ఎరువుగా పేర్కొన్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. సరైనమార్కెటింగ్ సౌకర్యం లేదని అధికారులు వివరించారు. మొత్తం జిల్లాలో నిర్వహిస్తున్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ద్వారా వస్తున్న ఉత్పత్తి పై  సమగ్ర నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  మన జిల్లాలోని  లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే వాటిని హార్టికల్చర్ శాఖ ద్వారా వినియోగం లోకి తీసుకుని రావడం జరుగుతుందన్నారు.  వీటిని వినియోగంలోకి తీసుకుని రావడం వలన దిగుబడిపెరగడమే కాకుండా ఖర్చుకూడాతక్కువఅవుతుందని తెలిపారు. త్వరలోనే సంబంధించిన శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 60 రోజులకు , రెండు నుంచి మూడు టన్నుల ఉత్పత్తి అవుతోందని వివరించారు. 

Rajahmundry

2022-04-29 11:55:39

సజావుగా పది పరీక్షలు జరిపించాలి..

శ్రీకాకుళం జిల్లాలో సజావుగా పదవ తరగతి పరీక్షలు  జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షల సందర్భంగా శుక్రవారం పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా పర్యటించారు. పర్యటనలో జలుమూరు మండలం చల్లవాని పేట జిల్లా పరిషత్ హైస్కూల్, శ్రీకాకుళం మునసబు పేట గురజాడ విద్యా సంస్థలలో  నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను స్వయంగా పరిశీలించి నిర్వహణ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 27 నుండి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. జిల్లాలో 36,123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, ఇందులో 18,455 మంది బాలురు, 17,668 మంది బాలికలు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయం 09.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.45గం.ల వరకు జరిగే ఈ పరీక్షలు 248  కేంద్రాలను జరుగుతున్నా యని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 50 మంది రూట్ అధికారులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షిస్తున్నాయని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేసేలా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులతో పాటు వేసవి దృష్ట్యా తాగునీరు తదితర ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ప్రశ్నపత్రాలు భద్రత, పంపిణీ పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దూర ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో చేరి,తిరిగి పరీక్షల అనంతరం వారి ప్రాంతాలకు చేరుకునేలా  ఏ.పి.ఎస్.ఆర్.టి.సి  బస్సులను ఏర్పాటుచేయడం  జరిగిందన్నారు. ఈ ఆకస్మిక తనిఖీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-29 11:50:56