1 ENS Live Breaking News

ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో వచ్చేనెల 6వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా, పగద్భందిగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై డీ అర్ ఓ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మే 6వ తేది నుంచి 23 వరకు, రెండో సంవ్సరం పరీక్షలు మే 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం గం.9.00 నుంచి గం.12.00 వరకు జరుగుతాయని అన్నారు. జిల్లాలో మొదటి సంవత్సరం పరీక్షలకు 10349 మంది విద్యార్థులు, సెకెండ్ ఇయర్ పరీక్షలకు 10093 మంది కాగా మొత్తం 20442 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకు 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల పర్యవేక్షణకు 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 14 పరీక్షా ప్రశ్నా పత్రాలు భద్రపరిచే కేంద్రాల నుంచి సంబంధిత పరీక్షా కేంద్రాల వద్దకు తరలించేందుకు పటిష్ట బందోబస్తు కల్పించాలని పోలీస్ అధికారులను సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద త్రాగు నీరు, ఓ అర్ ఎస్ ప్యాకెట్లను సరఫరా చేయాలని, అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్య కార్యకర్తలకు నియమించాలని ఆదేశించారు.  విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో చేరుకొనేవిధంగా ఉ.గం.6.00 నుంచి గం.8.00ల మధ్య కొమరాడ, కురుపాం మండలం కేంద్రం నుంచి  బస్సు సర్వీసులు నడపాలని అర్ టి సి సహాయ మేనేజర్ గంగ రాజును సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు  సహకరించాలని కోరారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించి ప్రతిఒక్కరూ మాస్క్ ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియెట్ బోర్డ్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎమ్.ఆదినారాయణ, డి వి ఈ ఓ ఎస్.బి.శంకర రావు, డి ఈ ఓ కె.గంగా భవాని, పోస్టల్ సహాయ పర్యవేక్షకులు పి.ఎస్.కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-26 10:11:37

మలేరియా రహిత జిల్లాగా చేయాలి

విజయనగరం జిల్లాలో ఎక్కడా దోమలు ఉండే అవకాశం లేకుండా చూడాలని, తద్వారా జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి పేర్కొన్నారు.  ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్బంగా  సోమవారం కలెక్టరేట్ నందు  మలేరియా నిర్మూలన పై  జిల్లా మలేరియా శాఖ ఆధ్వర్యంలో అవగాహ కలిగించడం కోసం ముద్రించిన పోస్టర్స్,, కరపత్రాలను కలెక్టర్  ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. నిలువ నీటిలో దోమలు వృద్ధి చెందకుండా లార్వి సైడ్ మందులు  స్ప్రే చేయాలన్నారు. ఇండ్లలో కూడా దోమల మందులను స్ప్రే చేయాలన్నారు.  డ్రై డే లను పాటిస్తూ నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా రానున్న మూడు రోజులు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ నుండి హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో  ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.  మజ్జిగ, ఓ.ఆర్.ఎస్, తాగు నీటిని వెంట పెట్టుకోవాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని అన్నారు. ఎండలో కి వెళ్లవలసి వస్తే టోపి లేదా గొడుగు ధరించాలన్నారు.    పరీక్షా కేంద్రాల్లోనూ ప్రతి గది వద్ద తాగు నీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారుల కూడా విధి నిర్వహణ లో  వేశవికి తగ్గట్టుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి తులసి పాల్గొన్నారు.

Vizianagaram

2022-04-25 16:15:12

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి ఘనస్వాగతం

 కేంద్ర మంత్రి డా. మన్ సుఖ్ మాండవీయ కు సోమవారం విశాఖ విమానాశ్రయంలో ఘస స్వాగతం లభించింది. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పుష్పగుచ్చం అందజేసి  ఆహ్వానం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా విజయనగరంలోని జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ కి చేరుకున్న అన్నారు.  జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా ఎస్వీ రమణ కుమారి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రాత్రికి ఇక్కడే బసచేస్తారు. మంగళవారం ముందుగా ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ఆయన వెంట జిల్లా అధికార యంత్రాంగం కూడా కార్యక్రమాల్లో పాల్గొంటుందని జిల్లా కలెక్టర్ ఈ మేరకు ప్రకటించారు.

Vizianagaram

2022-04-25 16:11:12

గడువు లోగా వినతుల పరిష్కరించాలి

విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన స్పందనకు ప్రజల నుండి 129 వినతులు అందాయి. వీటిలో పించన్లు, సదరం కోసం  వైద్య శాఖకు 28, డి.ఆర్.డి.ఏ కు 6 వినతులు  అందగా  రెవిన్యూ కు సంబంధించి 95వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు,రీ సర్వే,  గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్,  డి.ఆర్.ఓ గణపతి రావు ఉప కలెక్టర్ సూర్యనారాయణ స్వీకరించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశిత  గడువు  దాటి ఉన్న వినతుల పై ఆయా అధికారులు దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఏ ఒక్క శాఖ వద్ద ఏ ఒక్క స్పందన దరఖాస్తు  గడువు దాటి ఉన్నా సహించేసి లేదని స్పష్టం చేశారు.

Vizianagaram

2022-04-25 15:13:15

రేపు ఏఎన్ఎంలకు శాఖాపరమైన పరీక్ష

ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో సేవ‌లందిస్తున్న గ్రేడ్ -3 ఎంపీహెచ్ఏలు, ఏఎన్ఎంల‌కు ఏపీపీఎస్సీ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం ప్ర‌త్యేకంగా శాఖాప‌ర‌మైన ప‌రీక్ష నిర్వ‌హించనున్న‌ట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గ‌ణ‌ప‌తిరావు తెలిపారు. ఈ మేర‌కు పటిష్ఠ‌ ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ప‌రీక్ష‌ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన ఏర్పాట్ల‌పై సోమ‌వారం త‌న కార్యాలయంలో వివిధ విభాగాల అధికారుల‌తో ఆయ‌న స‌మావేశం నిర్వ‌హించారు. ప‌రీక్ష‌లు స‌జావుగా జ‌రిగేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. ప‌రీక్ష ఉద‌యం 9.00 నుంచి మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల వర‌కు జ‌రుగుతుంద‌ని సంబంధిత ఏర్పాట్లు ప‌క్కాగా చేసుకోవాల‌ని అన్ని విభాగాల అధికారుల‌కు సూచించారు. గాజుల‌రేగ‌లోని ఐయాన్ డిజిట‌ల్‌, సీతం క‌ళాశాల కేంద్రాలుగా నిర్వ‌హించే ప‌రీక్ష‌కు మొత్తం 584 మంది హాజ‌ర‌వుతున్నార‌ని, ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పారు. వేస‌విని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, ఫ‌స్ట్ ఎయిడ్ కిట్ల‌ను కేంద్రాల వ‌ద్ద అందుబాటులో ఉంచుకోవాల‌ని చెప్పారు. నిరంత‌రాయ విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాల‌ని విద్యుత్ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. లైజ‌న్ అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అంద‌రి అధికారుల‌తో స‌మ‌న్వ‌యంగా వ్య‌వ‌హ‌రించి ప‌రీక్ష ప్ర‌శాంతంగా జ‌రిగేలా చూసుకోవాల‌ని చెప్పారు. ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యేవారు ఎలాంటి పుస్త‌కాలు, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు తీసుకురాకూడ‌ద‌ని హెచ్చ‌రించారు. అంద‌రూ నిర్ణీత స‌మ‌యంలోగా కేంద్రాల‌కు చేరుకోవాల‌ని, నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు. స‌మావేశంలో ఏపీపీఎస్సీ ప్ర‌తినిధి స‌త్య‌నారాయ‌ణ‌, డీప్యూటీ డీఎం & హెచ్‌వో డా. నారాయ‌ణ‌రావు, ఐయాన్ డిజిట‌ల్ ప్ర‌తినిధి అవినాష్ బాబు, లైజెన్ అధికారులు, పోలీసు, విద్యుత్ శాఖ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

విజయనగరం

2022-04-25 15:04:23

మలేరియా నివారణే ధ్యేయంగా పనిచేయాలి

మలేరియా నివారణే ధ్యేయం కావాలని, ఆ ధిశగా అధికారులు పనిచేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మలేరియా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో మలేరియా అవగాహన వాల్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మలేరియా ప్రభలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పక్కా కార్యాచరణ ప్రణాళిక ఉండాలని, నిర్దేశిత సమయంలో స్ప్రేయింగ్ జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాని విధంగా పర్యవేక్షణ ఉండాలని ఆయన అన్నారు. ప్రతి ఇంటి పైనా దృష్టి కేంద్రీకరించాలని, క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు, సిబ్బందితో సహా తహశీల్దార్, మండల అధికారులు, జిల్లా అధికారులు మలేరియా నివారణ చర్యలపై తనిఖీలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. మలేరియాపై ప్రజలలో మంచి అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-25 09:27:34

మండలాధికారులు స్పందన నిర్వహించాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో  సోమవారం స్పందన కార్యక్రమాన్ని మండల అధికారులు విధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. స్పందనకు ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యత ఇస్తుందని ఆయన పేర్కొంటూ సోమ వారం ఉదయం పూట మండల స్థాయి సమావేశాలు నిర్వహించారని ఆయన స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సోమవారం జరిగింది. 204 మంది వినతి పత్రాలు సమర్పించారు.  తోటపల్లి ప్రాజెక్ట్ పునరావాసంలో భాగంగా కొత్తవలస గ్రీన్ఫీల్డ్ కాలనీలో  నిర్వాసితులకు ఇల్లు కేటాయించారని, అదే స్థలాల్లో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టినందున ఇంటి స్థలాలు మంజూరు చేయాలని అడ్డాపు శీల మండలం బంటు వాని వలస గ్రామ సర్పంచ్ సిహెచ్.గణేష్ వినతి పత్రాన్ని అందజేశారు.  గ్రామ రాయుడు చెరువు లోని ఏ.33.61 సెంట్ల విస్తీర్ణం కలిగిన భూమి అన్యాక్రాంతానికి గురవుతున్నందున  ప్రభుత్వ భూమి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా చెరువులో జాతీయ ఉపాధి హామీ పథకం పనులు జరగకుండా కొందరు అడ్డుకుంటున్నారని, విచారణ జరిపి ఉపాధి హామీ పనులు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని వీరఘట్టం మండలం వండువ గ్రామానికి చెందిన బాసూరు విశ్వేశ్వరరావు ఫిర్యాదును అందించారు. 2019 సంవత్సరంలో గ్రామ స్మశాన వాటిక కు చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు బిల్లులు మంజూరు చేయాలని గురుగుబిల్లి మండలం సన్యాసి రాజు పేట గ్రామానికి చెందిన జాగాన వెంకట నాయుడు కోరారు. తొంపాలపాడు చౌక ధరల దుకాణం నుండి నిత్యవసర సరుకులు తీసుకువచ్చేందుకు ప్రజలు నానావస్థలు పడుతున్నందున ప్రజల సౌకర్యార్థం జరడ గ్రామం వద్ద నిత్యావసర సరుకులు తీసుకునే విధంగా రేషన్ డిపో ఏర్పాటు చేయాలని కురుపాం మండలం బొడ్డమాను గ్రామానికి చెందిన బిడ్డికొలు సుదర్శన్ అర్జీ అందజేశారు.

 గుమ్మలక్ష్మిపురం మండలం  గోయిపాక పంచాయితి కుంటేసు గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనానికి నాడు నేడు క్రింద  అభివృద్ధి చేశారని, అలాగే రెండో విడతలో మరి కొన్ని పాఠశాలల్లో అభివృద్ధి చేయాలని గోయిపాక గ్రామానికి చెందిన సామల కృష్ణ మూర్తి వినతి సమర్పించారు.  గ్రామంలో నిర్మాణ పనులు పూర్తిచేసిన అంగన్వాడి కేంద్రం భవనానికి బిల్లులు మంజూరు చేయాలని గుమ్మ లక్ష్మీ పురం గ్రామానికి చెందిన కే.రాజేష్ కోరారు. దివ్యాంగురాలు అయిన తనకు ఎటువంటి ఆధారం లేనందున ఉపాధి అవకాశం కల్పించాలని మండలంలోని కవిటీ భద్ర గ్రామానికి చెందిన తుమరాడ దుర్గమ్మ అర్జీ అందజేశారు. కురుపాం మండలం నీలకంటాపురం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్ట్ లో వైద్యుని నియమించాలని అదే గ్రామానికి చెందిన ఏ.మన్మధరావు కోరారు. స్పందనకు వచ్చిన వినతులలో ఎక్కువగా రేషన్ కార్డు, సదరం దృవీకన పత్రాలు మంజూరు చేయాలని, భూసమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-25 09:25:15

కాకినాడ పోలీసు స్పందనకి 47 ఫిర్యాదులు

కాకినాడ జిల్లా పోలీస్ స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలుతీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం ద్వారా 47 మంది నుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ వివాదాలు మరియు ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు ఎస్పీ ముందు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి యొక్క సమస్యలపై ఎస్పీ సానుకూలంగా స్పందించారు. ఆపై సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-04-25 09:06:31

నియోజకవర్గంలో ఒక్కోసారి స్పందన..

పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా ఏర్పాటైన నూతన జిల్లాల యంత్రాంగం ప్రజలతో మమేకమైయ్యే దిశలో నియోజకవర్గ స్థాయి లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం నిడదవోలు మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక శాసన సభ్యులు జి.శ్రీనివాసనాయుడు, జాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ లతో కలిసి  స్పందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి (సచివాలయం) వరకు స్పందన కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతోందన్నారు. నూతన జిల్లాలు ఏర్పడడంతో జిల్లా యంత్రాంగం మరింత చేరువ కావడానికి తొలిసారిగా నిడదవోలు నియోజకవర్గ పరిధిలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం మండల పరిధిలోనే అధికారులు అందుబాటులో ఉంటున్నా రన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఒక వారం జిల్లా కలెక్టరేట్ నందు, తదుపరి వారం నియోజకవర్గ పరిధిలో ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరించడం జరుగుతుందన్నారు.  ఫిర్యాదుల స్థాయిపై నిరంతర పర్యవేక్షణ వలన వెంటనే పరిష్కారం చూపడానికి క్షేత్ర స్థాయిలో స్పందన ద్వారా మంచి ఫలితాలు వస్తాయని మాధవీలత తెలిపారు. 

శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ కి వెళ్లి పరిష్కారం చూపాలని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ లు తీసుకుని వచ్చారన్నారు.  ప్రజా సమస్య  పరిష్కార వేదికగా ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో స్పందన ను ఏర్పాటు చేసి , ఆయా సమస్యల పరిష్కారం కోసం కాల పరిమితి నిబంధన అమలు చేస్తున్నట్లు తెలిపారు.  నూతన జిల్లా కలెక్టర్ గా వొచ్చిన డా. మాధవీలత ఒక అడుగు ముందుకు వేసి మన నియోజకవర్గం లో తొలి స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రజలు తరపున కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. స్పందన పిర్యాదు ల పరిష్కారాన్ని తదుపరి స్పందన లో తీసుకున్న చర్యలపై  సమీక్షించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఈ కార్యక్రమానికి జేసీ సిహెచ్. శ్రీధర్, ఆర్డీవో ఎస్. మల్లిబాబు, జిల్లా అధికారులు, మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయకుమారి, ఆర్డబ్ల్యూ ఎస్ ఇంజినీరింగ్ అధికారి డి.బాలశంకర రావు, డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ పీఎస్ విజయకుమార్, జెడి మత్స్యాశాఖ ఈ.కృష్ణారావు, డీఎస్ఓ పి.ప్రసాదరావు, డీసీఎస్ఎం కె.తులసి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి  ఎస్.మాధవరావు, జీఎం పరిశ్రమలు బి.వెంకటేశ్వరరావు,  నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండల అధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Nidadavole

2022-04-25 08:55:40

తక్షణమే వికలాంగ పించను మంజూరు

అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ లో  సోమవారం జరిగిన స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమార  ఫేషియల్, డి ఆర్ ఓ పి వెంకట రమణ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వచ్చి స్పందనలో తమ సమస్యలను తెలియజేస్తూ దరఖాస్తులు సమర్పించుకున్నారు. దేవరాపల్లి మండలం వాలాబు గ్రామానికి చెందిన టి. హేమలత మెక్సికా ఫేషియల్ వ్యాధితో చికిత్స పొందుతూ సహాయం కోసం   తల్లిదండ్రులతో కలసి వచ్చి స్పందన లో దరఖాస్తు చేసుకున్నారు.  దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి సీతామహాలక్ష్మిని పిలచి వివరాలను తెలుసుకుని సహాయం చేయాల్సిందిగా ఆదేశించారు.  బాలికకు వెంటనే వికలాంగ పింఛను మంజూరు చేయవలసిందిగా డీ ఆర్ డి ఎ ఏపీడిని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స చేయించాల్సిందిగా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ను ఆదేశించారు.  తక్షణ సహాయం అందించిన కలెక్టర్ కు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Anakapalle

2022-04-25 08:48:28

శ్రీకాకుళం-పార్వతీపురం బస్సు ప్రారంభం

ప్రయాణికుల సౌకర్యార్థం సోమవారం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి ఎక్స్ప్రెస్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్లు శ్రీకాకుళం ఆర్.టి.సి రెండవ డిపో మేనేజర్ టి.కవిత తెలిపారు. సోమవారం ఉదయం బస్ సర్వీస్ ప్రారంభించిన అనంతరం మేనేజర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల, ప్రయాణికుల వినతులు మేరకు రోజు ఉదయం 7.00 గంటలకు  బయలు దేరి, 9.30 చేరుకుంటుందని అలాగే పార్వతీపురం నుండి సాయంత్రం 6.00 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం 8.30 చేరుకుంటుందని పార్వతీపురం మన్యం జిల్లాగా అవతరించడం తో అక్కడకు వివిధ పనులపై వెళ్లి ఉద్యోగులకు, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

Srikakulam

2022-04-25 06:58:58

అన్నమాచార్య జ్ఞాపకాల పునః నిర్మించాలి

తిరుమల కొండపై కనుమరుగైన అన్నమాచార్య జ్ఞాపకాల పునః నిర్మాణాన్ని టిటిడి దేవస్థానం చేపట్టాలని కాకినాడలో శ్రీవారి భక్తులు కోరారు. ఈ అంశాన్ని డిమాండ్ చేస్తూ 25న తిరుమల కొండపై సనాతన సమధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యాన విశిష్ట స్వాములు చేపట్టిన మౌనదీక్షలకు మద్దతుగా సోమవారం ఉదయం నుంచి కాకినాడ భోగిగణపతి పీఠంలో శ్రీవారిభక్తులు  గోవిందసహస్ర నామ పారాయణ నిర్వహించి సంఘీభావం తెలిపారు.పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు విన్నూత్న రీతిలో శంఖాన్ని పూరించివిశిష్ట స్వాముల మౌన దీక్షలకు మద్దతు ప్రకటిం చారు. ఈసందర్భంగా  మాట్లాడుతూ శ్రీవారి కొండపై అన్నమయ్య నివసించిన ఇల్లు, మండపం, ఆరాధించిన దేవతావిగ్రహాలు అన్నమాచార్యుని ఏకశిలావిగ్రహం భవిష్యత్తు తరాల కోసం ప్రతిష్టిం చాలని డిమాండ్ చేశారు. కొండమీద 365రోజులు 24గంటల పాటు నిత్యం భజన కీర్తనలు నిర్వహించే జానపద కళాకారుల ప్రాచీన సంస్కృతీ వైభవాన్ని పునరుద్దరణ చేయాలని కోరారు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, యోగివేమన మున్నగు మఠాలను విశిష్టంగా అభివృద్ధి చేయాలని.. తిరుమల కొండమీద దక్షిణాది మఠాలకు తగిన ప్రాధాన్యత వుండాలని కోరారు. భజనసామ్రాట్ పట్టా రామదాసు అఖండ మంగళహారతి అందజేశారు. మహాలక్ష్మి సూర్యనారాయణమ్మ మంగతాయారు భాగ్యలక్ష్మి సీత పద్మలత తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-04-25 06:56:29

ప్రణాళిక ప్రకారం గ్రుహనిర్మాలు జరగాలి

సీఎం ప్రాధాన్యత కార్యక్రమమైన పేదలందరికీ ఇల్లు పథకం లో  గృహ నిర్మాణాలను ప్రణాళిక ప్రకారం చేపట్టాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొన్నిచోట్ల ప్రశంసనీయమైన పని జరిగిందని, మరికొన్ని చోట్ల సమస్యలు వచ్చాయని తెలిసిందన్నారు.   సమన్వయం లేక సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోందన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా కొన్నిచోట్ల పని మందకొడిగా సాగుతోంది అన్నారు. సమస్య ఎక్కడ ఉన్నదో కనుగొని పరిష్కరించి నట్లయితే పనులు వేగంగా పూర్తి అవుతాయన్నారు. అనకాపల్లి మండలం లో జరుగుతున్న పనుల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసి ప్రశంసించారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.  చిన్న చిన్న సమస్యలను మండల స్థాయి ప్రజాప్రతినిధులతో పరిష్కరించుకోవచ్చన్నారు. గృహ నిర్మాణాల తో సంబంధమున్న ఆయా శాఖల అధికారులు తరచు చర్చించుకోవాలన్నారు.  తాసిల్దార్ స్థాయిలోనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని లేనట్లయితే ఆర్డీవో దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ ఎటువంటి చిన్న పొరపాటుకు తావివ్వకుండా డాక్యుమెంటేషన్ చేసినట్లయితే ఎటువంటి సమస్యలు ఉండవన్నారు. వివిధ స్థాయిల్లో ఉన్న గృహ నిర్మాణాలను  ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేయాలన్నారు. మండల స్థాయిలో హౌసింగ్ అసిస్టెంట్లతో ప్రతిరోజు సమీక్షించాలని ఏ ఈ లను ఆదేశించారు. నిర్మాణాలు ఆగి పోవడం లేదా మందకొడిగా సాగడానికి గల కారణాలను విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి నర్సీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారులు చిన్నికృష్ణ గోవిందరావు జిల్లా గృహనిర్మాణ అధికారి రఘురామ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డిప్యూటీ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-04-24 13:29:13

నియోజకవర్గ స్పందన మీకోసమే..

నిడదవోలు నియోకవర్గం స్థాయిలో సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం మీడియాకి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.  ప్రజల వద్దకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలియజేశారు. ఆదిశలోనే ప్రతి నియోజకర్గ స్థాయిలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసే విధానం లో తొలిసారిగా నిడదవోలు నియోజకవర్గం లో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నిడదవోలు నియోజకవర్గం పరిధిలో ఉన్న మూడు మండలాలు అయిన నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాలకు చెందిన ప్రజలు కోసం ఈ స్పందన కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో  ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు.

Rajahmundry

2022-04-24 13:23:53

కేంద్ర ఆరోగ్య మంద్రి పర్యటన ఖరారు

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్ట‌ర్‌ మ‌న్సుఖ్ మాండ‌వీయ  జిల్లా ప‌ర్య‌ట‌న ఖ‌రార‌య్యింది. ఆయ‌న విస్తృత‌ ప‌ర్య‌ట‌న‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్రమంత్రి పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్  ఎ. సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీ సోమ‌వారం సాయంత్రం 6.45 గంట‌ల‌కు కేంద్ర‌మంత్రి మ‌న్సుఖ్‌ జిల్లాకు చేరుకొని, విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని ఎస్‌-క‌న్వెన్ష‌న్ హాలులో మేధావులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు, పార్టీ నాయకులతో స‌మావేశ‌మ‌వుతారు. రాత్రి జెడ్‌పి అతిధిగృహంలో బ‌సచేస్తారు.  26వ తేదీ ఉద‌యం 8.30కు బ‌య‌లుదేరి, గుంక‌లాం మెగా హౌసింగ్ లేఅవుట్‌ను ప‌రిశీలిస్తారు. అక్క‌డినుంచి 9.30 గంట‌ల‌కు బొండ‌ప‌ల్లి మండ‌లం గొట్లాం జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను చేరుకొని, నాడూ-నేడు ప‌నుల‌ను ప‌రిశీలిస్తారు. అక్క‌డినుంచి బ‌య‌లుదేరి, 10.15 గంటలకు నెల్లిమ‌ర్ల మండ‌లం రామ‌తీర్ధం చేరుకొని, శ్రీ సీతారామ‌స్వామి వారి ఆల‌యాన్ని సంద‌ర్శిస్తారు. స్వామివారి ద‌ర్శ‌నం అనంత‌రం 10.30 గంట‌ల‌కు పూస‌పాటిరేగ మండ‌లం కుమిలి చేరుకొని, మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కంలో భాగంగా జ‌రుగుతున్నఅభివృద్ది ప‌నుల‌ను ప‌రిశీలిస్తారు. రైతుల‌తో, వ‌లంటీర్ల‌తో మాట్లాడ‌తారు. పేద‌ల ఇంటింటికీ నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేసే ఎండియు యూనిట్‌ను ప‌రిశీలిస్తారు. అక్క‌డినుంచి బ‌య‌లుదేరి 11.45కి విజ‌య‌న‌గ‌రంలోని జిల్లా కేంద్రాసుప‌త్రిని సంద‌ర్శిస్తారు. తిరిగి 12.45కి జిల్లా ప‌రిష‌త్ అతిధిగృహానికి చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం 1.45 గంట‌ల‌కు అక్క‌డినుంచి బ‌య‌లుదేరి, క‌లెక్ట‌రేట్ ఆడిటోరియం వ‌ద్ద ఏర్పాటు చేయ‌నున్న ఫొటో ఎగ్జిబిష‌న్‌ను తిల‌కిస్తారు. 2.15 గంట‌ల‌కు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్  ఎ. సూర్యకుమారి ఆధ్వర్యంలో అధికారులతో సాయంత్రం 4 గంటలు వరకు  స‌మావేశాన్ని నిర్వ‌హిస్తారు. ఈ సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కూడా పాల్గొంటారు. సమావేశం అనంత‌రం విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టుకు బ‌య‌లుదేరి వెళ్తారు.

Vizianagaram

2022-04-24 13:18:16