1 ENS Live Breaking News

స్పందన అర్జీకి పరిష్కారం చూపాల్సిందే..

వివిధ స‌మ‌స్య‌లపై ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల‌కు స‌రైన స‌మ‌యంలో స‌రైన విధంగా ప‌రిష్కారం చూపాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. మ‌ళ్లీ మ‌ళ్లీ ఒకే స‌మ‌స్య‌పై ఫిర్యాదుల రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, రీ ఓపెన్ రాకుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని సూచించారు. నిర్ణీత కాలంలో ఫిర్యాదుల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం చూపాల‌ని, కింది స్థాయి అధికారి ఇచ్చిన రిప్లై స‌మాధానాన్ని ఉన్న‌తాధికారి ఒక సారి ప‌రిశీలించాలన్నారు. విన‌తుల పరిష్కారంలో అధికారులు ప్ర‌త్యేక‌ శ్ర‌ద్ధ వ‌హించాల‌ని, బీయాండ్ ఎస్‌.ఎల్‌.ఎ. ప‌రిధిలోకి వెళ్లొద్ద‌ని హెచ్చ‌రించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో స్పంద‌న ద్వారా, ఏపీ సేవా పోర్ట‌ల్ ద్వారా వ‌చ్చే విన‌తుల‌ ప‌రిష్కారంపై జ‌రిగిన స‌మీక్షలో ఫిర్యాదుల స్థితిగ‌తుల‌పై ఆమె స‌మీక్ష నిర్వ‌హించారు. వ‌చ్చిన ఫిర్యాదులే మ‌ళ్లీ మ‌ళ్లీ ఎందుకు వ‌స్తున్నాయనే అంశంలో అధికారులంతా పునఃప‌రిశీలించుకొని త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి క‌లెక్ట‌ర్ సూచించారు. అధికంగా రెవెన్యూ, పింఛ‌న్ల మంజూరు, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, విద్యుత్ స‌దుపాయం క‌ల్పన‌, గృహ నిర్మాణం, పాడి ప‌రిశ్ర‌మ తదిత‌ర స‌మ‌స్య‌ల‌కు సంబంధించి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయ‌ని ఆయా శాఖ‌ల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉంటూ స‌మ‌స్య‌ల‌ను నిర్ణీత గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. అలాగే అన్ని విభాగాల అధికారులు దిగువ స్థాయి సిబ్బందికి స్పంద‌న, ఇత‌ర విన‌తుల ప‌రిష్కారంలో అనుస‌రించాల్సిన విధానాలపై, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు. అవ‌సరమైతే మండ‌ల స్థాయిలో శిక్ష‌ణ స‌ద‌స్సులు ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. బియ్యం కార్డు జారీలో ఎక్కువ‌గా సాంకేతిక‌ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్న‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయ‌ని ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డి.ఎస్.ఓ.ను ఆదేశించారు.

స‌చివాల‌యాల‌కు త‌ప్ప‌కుండా రావాలి..
చాలా స‌చివాల‌యాల్లో వాలంటీర్ల హాజ‌రు శాతం చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని అంద‌రూ విధిగా హాజ‌ర‌య్యేలా ప్ర‌త్యేక స‌ర్క్యుల‌ర్ మెమో జారీ చేయాల‌ని జిల్లా ప‌రిష‌త్ సీఈవోను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. అలాగే ఎన‌ర్జీ అసిస్టెంట్స్ కూడా స‌రిగా హాజ‌రు కావ‌టం లేద‌ని త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యుత్ శాఖ అధికారుల‌కు సూచించారు. 

కార్యాల‌యాల చిరునామా బోర్డులు మార్చాలి..
జిల్లాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగిన నేప‌థ్యంలో, కొత్త రెవెన్యూ డివిజ‌న్లు ఏర్పాటైన క్ర‌మంలో వివిధ విభాగాల‌కు సంబంధించి చిరునామా బోర్డులు త‌ప్పకుండా మార్పు చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాకు అందించాల్సిన స‌మాచారం ఉంటే త్వ‌రిత‌గ‌తిన అంద‌జేయాల‌ని చెప్పారు. నీతి ఆయోగ్ సూచిక‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని సీపీవో కార్యాల‌యానికి త్వ‌రిత‌గ‌తిన అంద‌జేయాల‌ని వివిధ శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. స‌మావేశంలో డీఆర్వో ఎం. గ‌ణ‌ప‌తిరావు, వివిధ విభాగాల జిల్లాస్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-04-08 12:10:00

పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు..

శ్రీకాకుళం జిల్లాలో  పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలను  నిర్వహించాలని జిల్లా కలెక్టర్  శ్రీకేష్ లాఠకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 27 నుండి మే 9వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై  సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ -19 దృష్ట్యా మార్గదర్శకాలను అనుసరించి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.  జిల్లావ్యాప్తంగా 36,123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, ఇందులో 18,455 మంది బాలురు, 17,668 మంది బాలికలు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయం 09.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.45గం.ల వరకు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు 248  కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని, వేసవి దృష్ట్యా తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.పరీక్షల నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని, పరీక్ష ప్రశ్నపత్రాలు భద్రత, పంపిణీ పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులతో వైద్య బృందాలను ఏర్పాటుచేయాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులకు ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను మరియు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని  జిల్లా రెవెన్యూ అధికారికి ఆదేశించారు. పరీక్ష సమాధాన పత్రాలు ఎప్పటి కప్పుడు స్పీడ్ పోస్టులో పంపించేలా తపాలా శాఖాధికారులు చర్యలు చేపట్టాలని, పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరి, తిరిగి పరీక్షల అనంతరం వారి ప్రాంతాలకు చేరుకునేలా బస్సులను ఏర్పాటు చేయాలని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి జెరాక్స్,నెట్ సెంటర్లు తెరచి ఉండరాదని, పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికారాలు అనుమతించ రాదని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతీ అధికారికి అప్పగించిన భాద్యతలను సక్రమంగా నెరవేరుస్తూ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ సహాయ కమీషనర్ అలీ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎన్.అనురాధ, జిల్లాపరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, ఉప రవాణా కమీషనర్ డా.వడ్డి సుందర్, ఆర్.టి.సి ప్రజా సంబంధాల అధికారి బి.ఎల్.పి.రావు, పోలీస్, ఖజానా, తపాలా,ఏ.పి.ఈ.పి. డి.సి.ఎల్  శాఖల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-08 11:47:44

జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగంపెంచాలి..

రాష్ట్రంలో  ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని , అందుక నుగుణంగా తూర్పుగోదావరి జిల్లాలో నిర్మాణాలు  వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక  సబ్ కలెక్టర్ కార్యాలయలో హౌసింగ్, అనుబంధ  శాఖల అధికారులతో  సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత  మాట్లాడుతూ, జిల్లా పరిధిలో  లబ్దిదారులు ఇంటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేసినందున వివిధ దశల్లో ఉన్న వాటిలో తదుపరి పురోగతి సాధించాలన్నారు.  ప్రతి రోజు క్షేత్రస్థాయిలోని సిబ్బంది, అధికారులతో పురోగతి పై సమీక్ష నిర్వహించాలన్నారు. సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి ప్రగతి చూపాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఇళ్ళ నిర్మాణాలు చేసేందుకు ఆసక్తి చూపే కాంట్రాక్టర్లకి అడ్వాన్స్ ఇచ్చి, తదుపరి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసిన తర్వాత సర్దుబాటు చేసే విషయం పై సమగ్ర కార్యాచరణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రతి గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీక్ష చేస్తున్నందున, ఈ విషయంలో అలసత్వం వహించారదన్నారు. ఈ సమావేశానికి ఆర్డీవో ఎస్. మల్లిబాబు, హౌసింగ్ డిహెచ్ ఓ డి.తారక్ చంద్,   హౌసింగ్  ఈ ఈ లు  జి.సోములు, సిహెచ్. బాబూరావు,డీఈలు ఆర్ వేణు గోపాల్,   జి.పరశురామ్, కె.ఎస్.ఎన్. రెడ్డి, జి.శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

Rajahmundry

2022-04-08 11:38:52

విజయనగరం వసతి దీవెన రూ.46.21కోట్లు

విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన 2021-22  సంవత్సరానికి 2వ విడత నిధులను రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విడుదల చేసారు. ఇందులో విజయనగరం జిల్లాకు చెందిన  48,210 మంది విద్యార్థులకు గానూ 46.21 కోట్ల రూపాయలను విడుదల చేశారు.  వీరిలో బి.సి కు చెందిన విద్యార్థులు 39,205 మంది, ఎస్.సి 4,310, ఈ బిసి 2,818 మంది ఉండగా ఎస్.టి 617, కాపు 974, ముస్లింలు 246, క్రిస్టియన్ విద్యార్థులు 40 మంది ఉన్నారు. ఇందులో డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, పోలీటెక్నిక్, ఐ.టి.ఐ, మెడికల్, నర్సింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, డి ఎడ్, బి ఎడ్, బి పి ఎడ్ చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు  ఉన్నారు. 
ఈ కార్యక్రమం లో  నంద్యాల జిల్లానుండి ముఖ్యమంత్రి పాల్గొని నిధులు విడుదల చేయగా లైవ్ టెలికాస్ట్ లో  వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి  జిల్లా  కలెక్టర్ ఎ. సూర్య కుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.ఎల్.సి రఘురాజు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి,సోషల్ వెల్ఫేర్ డిడి సునీల్  రాజ్ కుమార్, డిబిసిడబ్లు కీర్తి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేసారు.

Vizianagaram

2022-04-08 11:10:27

కాకినాడ వసతి దేవెనకు రూ.44.67 కోట్లు

కాకినాడ జిల్లాలో 2021-22 సంవ‌త్స‌రానికి సంబంధించి జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన కార్య‌క్ర‌మం రెండో విడ‌తలో 46,828 మంది విద్యార్థుల‌కు రూ. 44.67 కోట్ల మేర ల‌బ్ధి చేకూరిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా తెలిపారు. శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నంద్యాల‌లో జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన ప‌థ‌కం రెండో విడ‌త ల‌బ్ధి మొత్తాన్ని విద్యార్థుల త‌ల్లుల ఖాతాలో నేరుగా జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి కాకినాడ క‌లెక్ట‌రేట్ నుంచి జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా, జెడ్‌పీ ఛైర్‌ప‌ర్స‌న్ విప్ప‌ర్తి వేణుగోపాల‌రావు, ఎమ్మెల్సీ పండుల ర‌వీంద్ర‌బాబు, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ మేయ‌ర్ సుంక‌ర శివ ప్ర‌స‌న్న‌, కుడా ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళాదీప్తి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌కు క‌లెక్ట‌ర్.. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన ల‌బ్ధికి సంబంధించిన మెగా చెక్ అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఆర్థిక స‌మ‌స్య‌లు విద్యార్థుల ఉన్న‌త చ‌దువుల‌కు అడ్డంకి కాకూడ‌ద‌నే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర‌భుత్వం జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌, వ‌స‌తి దీవెన ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తోంద‌న్నారు. జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన ద్వారా ఏటా రెండు విడ‌త‌ల్లో ఐటీఐ విద్యార్థుల‌కు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థుల‌కు రూ. 15 వేలు; డిగ్రీ, ఆపై కోర్సుల విద్యార్థుల‌కు రూ. 20 వేలు అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకొని, బాగా చ‌దువుకొని ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. విద్యార్థుల‌కు సూచించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జె.రంగ‌ల‌క్ష్మీదేవి, బీసీ సంక్షేమ అధికారి కె.మ‌యూరి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-04-08 11:05:58

స్పందనపై ప్రజలకు నమ్మకం పెంచాలి..

స్పందనపై ప్రజలకు నమ్మకం పెరిగేలా అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఐటిడి ఏ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ జి. ఎస్. ధనుంజయ్, ఐటిడిఏ పి. ఓ రోణంకి గోపాల క్రిష్ణ, ఎస్.పి.సతీష్ కుమార్, సబ్ కలెక్టర్ వి.అభిషేక్ తో మొట్టమొదటి సారిగా స్పందనలో గిరిజనుల నుండి శుక్రవారం 147 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ స్పందన కార్యక్రమంలో తప్పని సరిగా పాల్గొనాలని సూచించారు. స్పందనలో ఉపాధి, ఉద్యోగాఅవకాశాలు, తాగునీరు ,రహదారి సమస్యలపై ఎక్కవగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. జిల్లా అధికారులు స్వయంగా గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఆర్దికేతర సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని చెప్పారు.
స్పందనలో కొన్ని ఫిర్యాదులు డుంబ్రిగుడ మండలం రంగిలిసింగి గ్రామానికి చెందిన వంతాల లక్ష్మి జగనన్న తోడుపథకాన్ని మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. హుకుంపేట మండలం సంతారి పంచాయతీ పత్తిరి మెట్ట,బిల్లాయిపుట్టు గ్రామస్తులు జి.చంద్రరావు, పాడి త్రినాధరావు తదితర 15 మంది రైతులు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఆదివాసీ మహా సభ అధ్యక్షులు కొర్రా అప్పారావు పెదకోడాపల్లి పంచాయతీ మలకరిపుట్టు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేసారు. ముంచింగ్ పుట్టు మండలం లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ కొర్రా త్రినాధ్ కర్లాపొదార్ గెడ్డపై వంతెన నిర్మించాలని, కిముడుపల్లి, కర్లాపొదార్ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. పాడేరు మండలం దేవాపురం ఎంపిటిసి ఎం.నాగమణి దేవాపురం పంచాయతీలోనిఅంటిలోవ-దేవాపురం,డప్పాడ-జరిగరువు, గదుబూరు - కుమ్మరిపుట్టు గ్రామాల మట్టి రోడ్డు పనులు పూర్తి చేయాలని వినతిపత్రం అందజేసారు. బాషా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని,బకాయి వేతనాలు పూర్తి స్థాయిలో విడుదల చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. అప్పనర్స నేతృత్వంలో బాషా వాలంటీర్లు వినతిపత్రం సమర్పించారు. హుకుంపేట మండలం తడిగిరి గ్రామ సర్పంచ్ పి రంజిత్ కుమార్ తడిగిరి గ్రామం పరిధిలో 1650 గ్రామాల వ్యవసాయ భూమి ఉందని సాగునీటి సదుపాయం కల్పించాలని, ఆర్ ఓ ఎఫ్ పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ బి. దయానిధి, డి ఎఫ్ ఓ వినోద్‌కుమార్, గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు సి ఎ మణి కుమార్, ఇ ఇ డి వి ఆర్ ఎం రాజు, పంచాయతీరాజ్ పి ఐ యు ఇ ఇ కె.శ్రీనివాసరావు, పి ఆర్ ఇ ఇ కె.లావణ్య కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇ ఇ జవహార్ కుమార్, డి ఎల్ పి ఓ పి ఎస్ కుమార్ వెలుగు ఎపిడి మురళి, అదనపు జిల్లా వైద్యాధికారి డా. లీలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-04-08 10:50:23

ఘనంగా వలంటీర్ల సేవలకు పురస్కారాలు

శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్లకు  సేవా పురస్కార కార్యక్రమం మునిసిపల్ కమీషనర్ చల్లా ఓబులేసు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు  ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ  వాలంటీర్ వ్యవస్థ అనేది గతంలో  దేశంలో  ఎక్కడా లేని వ్యవస్థ అని అన్నారు. వాలంటీర్  అంటే వారి వార్డు లో యాభై కుటుంబాలకు  బాధ్యత తీసుకునే కుంటుంభ పెద్ద లా  వ్యవహారిస్తున్నారు. అని అన్నారు. కరోనా సమయంలో  మీరు  మీ ప్రాణాలు పణంగా  పెట్టి చేసిన సేవలు ఎంత పొగిడిన తక్కువే అని అన్నారు.ఇపుడు మీకు ఈ అవార్డులు గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి. చాలా మంది వాలంటీర్లు కి అవార్డులు ఇవ్వాలి కానీ  అందరికి ఇవ్వలేరు. మిగతా వారందరికి కూడా మున్ముందు అవార్డులు వస్తాయి ఇందులో ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదు. గుర్తింపు అనేది రావాల్సిన సమయంలో వస్తాయి  మనం వేచి  చూడాలి అని అన్నారు.ఈ కార్యక్రమం లో రెవెన్యూ డివిజనల్ అధికారి బొడ్డేపల్లి శాంతి, శ్రీకాకుళం మునిసిపల్ అసిస్టెంట్ కమీషనర్ జే రామప్పల నాయుడు, కళింగ వైశ్య రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్,మాజీ మునిసిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, చల్లా అలివేలు మంగ, మైల పల్లి మహాలక్ష్మి మత్య కార డైరెక్టర్, ఊడి శ్యామల, కాపు డైరెక్టర్, మొహమ్మద్ రఫీ రాష్ట్ర మైనారిటీ డైరెక్టర్, పైడి మహేశ్వరరావు, పి. సుగుణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-08 10:44:26

శ్రీకాకుళంజిల్లాకి వసతి దీవెన రూ.51.94 కోట్లు

శ్రీకాకుళం జిల్లాకు జగనన్న వసతి దీవెన క్రింద జిల్లాకు 51.94 కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి లైవ్ ద్వారా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు.  శుక్రవారం నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన వసతి దీవెన సభలో ఆయన వర్చువల్ విధానం ద్వారా 2021-22 విద్యా సంవత్సరంనకు సంబంధించి విద్యా దీవెన తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.  శ్రీకాకుళం జిల్లాలో 54,432 మంది విద్యార్థులకు సంబంధించి 49,060 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో 51.94 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు.  ఇందులో 4079 మంది ఎస్.సి విద్యార్థులు 3722 మంది తల్లుల  ఖాతాల్లో 3.89 కోట్ల రూపాయలు, 850 మంది ఎస్.టి విద్యార్థుల తల్లులు 807  మంది ఖాతాల్లో 78.02 లక్షలు, 46,888 మంది బి.సి విద్యార్థుల తల్లులు 42,188 మంది ఖాతాల్లో రూ.44.73 కోట్లు, 1,717 మంది ఇబిసి విద్యార్థుల తల్లులు 1,594 మంది ఖాతాల్లో రూ.1.67 కోట్లు, 165 మంది ముస్లిం మైనారిటీ విద్యార్థుల తల్లులు 142 మంది ఖాతాల్లో రూ.15.72 లక్షలు, 713 మంది కాపు విద్యార్థుల 675 మంది తల్లుల ఖాతాల్లో 67.80 లక్షల రూపాయలు, 20 మంది క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థులకు 16 మంది తల్లులు ఖాతాల్లో రూ.1.95 లక్షలు జమ చేసినట్లు ఆయన చెప్పారు.  

జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన పథకం క్రింద జిల్లాలో ఐటిఐ పాలిటెక్నిక్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర ప్రొఫెసనల్ కోర్సులు చదువుకుంటున్న విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ లు లభించనున్నాయని తెలిపారు. ప్రతి విద్యార్థిని, విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థానం అధిరోహించాలని కోరారు. జగనన్న వసతి దీవెన  లైవ్ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి సందేశాన్ని వీక్షించారు.   ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ, రాష్ట్ర మహిళా ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ బి. హేమామాలిని రెడ్డి,  మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె. వెంకట రత్నం, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కమల, బిసి సంక్షేమ అధికారి ఇ. అనూరాధ, ఆయా కళాశాలలకు చెందిన విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు నమూనా చెక్కును అందజేశారు చేసారు.

కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ జిల్లాలో విభిన్న ప్రతిభా వంతులైన ఐ.టి.ఐ నుండి పి.జి వరకు చదువుకున్న, చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు 06 గురికి  ముఖ్య అతిథులు లేప్టాప్ లు అందజేశారు.

Srikakulam

2022-04-08 09:45:51

మనందరి భవిష్యత్తుకి పునాది విద్య..

మన భవిష్యత్తు కి పునాది విద్య , అటువంటి విద్యను పేద, నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత తెలిపారు.  జగనన్న వసతి దీవెన పధకం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గ పరిధిలోని  34,261 మంది విద్యార్థులకు చెందిన 30559 మంది తల్లుల ఖాతాలో రూ.32.61 కోట్లు జమ చేసామని జిల్లా కలెక్టర్ డా.మాధవీలత పేర్కొన్నారు. నంద్యాల నుంచి ముఖ్యమంత్రి  పాల్గొన్న సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా   శుక్రవారం ఉదయం  స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో శాసన సభ్యులు జక్కంపూడి రాజా,  తలారి వెంకట్రావు తో కలిసి  కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  జిల్లా కలెక్టర్ గా భాద్యతలు చేపట్టిన తర్వాత జగనన్న విద్యా దీవెన వంటి కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి పాల్గొనడం ఒక మరుపురాని సంఘటన గా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎంతో ఆలోచించి జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ప్రవేశ పెట్టి అమలు చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి తాను చదువుకో గలను అనే స్టైర్యాన్ని ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కల్పించగలిగారు.  మన భవిష్యత్తు కి పునాది విద్య , అటువంటి విద్యను పేద, నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత తెలిపారు.


ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ, విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకుంటూ ఫీజ్ రీయింబర్సు కింద అన్ని వర్గాలకు సమన్యాయం చేసారని తెలిపారు. ఆర్ట్స్ కళాశాల పరిధిలో ని 3,666 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.3.48 కోట్లు జమ చెయ్యడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చెయ్యడం లో బ్రాండ్ అంబాసిడర్ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని శాసన సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. తండ్రి ఒక అడుగు వేస్తే తాను రెండడుగులు వేస్తానని చెప్పి ఆచరణలో చూపిన వ్యక్తి జగనన్న అన్నారు. 

విద్యార్థిని ఏ. స్వాతి మాట్లాడుతూ, మా ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్ననని, జగనన్న విద్యా దీవెన సొమ్ము తో కంప్యూటర్ కొనుగోలు చేసాను, ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను, నా వంటి ఎందరో విద్యార్థులకు ఆర్ధిక భరోసా కల్పించి ఉన్నత చదువులు చదివేందుకు ఆస్కారం ఏర్పడిందని తెలిపారు.  సి.సాయి మాట్లాడుతూ, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన  పధకం నా వంటి ఎందరో పేద, నిరుపేద వర్గాల కు ఎంతో తోడ్పాటు అందించిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ విశ్వేశ్వర రావు, జిల్లా షెడ్యూల్, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి పిఎన్వీ . సత్యనారాయణ, సూపరింటెండెంట్ పి.దొరబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Rajahmundry

2022-04-08 09:31:59

బొమ్మూరు న్యాక్ భవనంలో స్పందన..

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్పందన ఫిర్యాదులను నూతనంగా బొమ్మూరు గ్రామంలో న్యాక్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ కార్యాలయం లో ఇకపై ప్రతి సోమవారం స్పందన ఫిర్యాదులు  స్వీకరించనున్నట్టు జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో సంబంధించిన శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ వారికి అందచేసే స్పందన ఫిర్యాదులను ఏప్రిల్ 11వ నుంచి జిల్లా కలెక్టరేట్ లో  స్వీకరించడం జరుగుతుందన్నారు. రాజమహేంద్రవరం రూరల్ గ్రామం ధవళేశ్వరం లో ఉన్న న్యాక్ (ఎన్. ఏ. సి) భవనంలో కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు.  స్పందన కి ప్రజలు  రావడానికి వీలుగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఉదయం 9 నుంచి మ. 2 వరకు తాత్కాలికంగా ఉచిత బస్సు సర్వీసు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  అదే విధంగా స్థానిక సబ్ కలెక్టర్ నుంచి స్పందన లో ఫిర్యాదులు ఇచ్చే ప్రజల కోసం   కూడా ఉచిత బస్సు ను ఏప్రిల్ 11 వ తేదీన నడుపుతున్నట్లు మాధవీలత తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్పందన ఫిర్యాదులను గ్రామ/వార్డు  సచివాలయాల్లో , రెవెన్యూ, మండల స్థాయిల్లో కూడా స్వీకరిస్తారని కలెక్టర్ వివరించారు.  మోరంపూడి నుంచి వేమగిరి వైపు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో  ఉన్న  హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న న్యాక్ భవన సముదాయంలో కలెక్టరేట్ ఏర్పాటు చెయ్యడం జరిగిందని కలెక్టర్ డా.మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం కి పలు రూట్లలో నడిపే ఆర్టీసీ బస్సులు సోమవారం రోజున ఉదయం కొన్ని బస్సులు కలెక్టరేట్ మీదుగా నడిపేలా రూట్ మ్యాప్ రూపొందించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో ఎస్.మల్లిబాబు, ఆర్టీసీ, రవాణా, రెవెన్యూ శాఖ లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Rajahmundry

2022-04-08 08:44:04

రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలు..

ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రామ‌తీర్ధంలో శ్రీ‌రామ‌న‌వమి సంద‌ర్భంగా సీతారాముల క‌ళ్యాణాన్ని ఈ ఏడాది అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హించేందుకు విస్తృత‌ ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి వెల్ల‌డించారు. కోవిడ్ కార‌ణంగా గ‌త రెండేళ్లుగా సీతారాముల క‌ళ్యాణాన్ని భ‌క్తులు తిల‌కించేందుకు అవ‌కాశం లేకుండా పోయింద‌ని, అందువ‌ల్ల ఈ ఏడాది జ‌రుగుతున్న క‌ళ్యాణోత్స‌వానికి భ‌క్తులంద‌రినీ ఆహ్వానిస్తున్న‌ట్టు చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున సీతారాముల వారి క‌ళ్యాణానికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఈ మేర‌కు దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులు జారీచేసిన‌ట్లు పేర్కొన్నారు. స్వామి వారి క‌ళ్యాణానికి రామ‌తీర్ధం వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్ధం ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలిపారు. భ‌క్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ద‌ర్శ‌నం చేసుకొనేందుకు అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల ద్వారా తాగునీరు, అత్య‌వ‌స‌ర వైద్య స‌హాయం వంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్  సూర్య‌కుమారి శుక్ర‌వారం రామ‌తీర్ధంలో ప‌ర్య‌టించి సీతారాముల క‌ళ్యాణానికి చేస్తున్న ఏర్పాట్ల‌పై రెవిన్యూ అధికారులు, ఆల‌య అధికారుల‌తో స‌మీక్షించారు. తొలుత క‌ళ్యాణం జ‌రిగే మండ‌పంలో ఏర్పాట్ల‌ను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. రెండేళ్ల త‌ర్వాత ప్ర‌జ‌లు తిల‌కించేందుకు వీలుగా సీతారాముల క‌ళ్యాణాన్ని ఆల‌యం వెలుప‌ల నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నందున భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తార‌ని అందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని ఇ.ఓ. డి.వి.వి. ప్ర‌సాద‌రావును ఆదేశించారు. భ‌క్తుల కోసం తాత్కాలిక మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అత్య‌వ‌స‌ర వైద్యం అందించేందుకు 108, 104 అంబులెన్సులు సిద్ధంగా వుంచాల‌ని,  వైద్య శిబిరం ఏర్పాటుచేసి ఓ.ఆర్‌.ఎస్‌. ప్యాకెట్లు త‌గిన‌న్ని అందుబాటులో వుంచాల‌ని వైద్య ఆరోగ్య‌శాఖ అధికారుల‌ను ఆదేశించారు. భ‌క్తుల‌కు త‌లంబ్రాలు, పాన‌కం అందించేదుకు రెండు కౌంట‌ర్లు ఏర్పాటు చేయాల‌న్నారు. భ‌క్తులు చెప్పులు విడిచిన చోటు నుంచి క‌ళ్యాణం జ‌రిగే ప్ర‌దేశానికి వ‌చ్చేట‌పుడు ఎండ తీవ్ర‌త‌కు ఇబ్బంది ప‌డ‌కుండా ఆ ప్రాంతాన్ని కార్పెట్ వేసి నీటితో త‌డ‌పి వుంచాల‌న్నారు. స్వామి వారి క‌ళ్యాణానికి హాజ‌ర‌య్యే ప‌ది వేల మంది భ‌క్తుల‌కు అన్న‌దానం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు ఆల‌య అధికారులు జిల్లా క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు.

భ‌క్తులు వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహ‌నాల్లో వ‌చ్చే అవ‌కాశం వున్నందున ఆయా వాహ‌నాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ పోలీసుల‌ను ఆదేశించారు. పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నందున ట్రాఫిక్ ప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌న్నారు. క‌ళ్యాణం జ‌రిగే ప్ర‌దేశంలో, ఆల‌యం వ‌ద్ద రెండు ఫైర్ ఇంజ‌న్ల‌ను సిద్దంగా వుంచాల‌ని విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. స్వామి వారి క‌ళ్యాణానికి వ‌చ్చే ప్ర‌ముఖుల ద‌ర్శ‌నానికి ప్రోటోకాల్ ప్ర‌కారం ఏర్పాట్లు చేయాల‌ని విజ‌య‌న‌గ‌రం, చీపురుప‌ల్లి ఆర్‌.డి.ఓ.లు భ‌వానీ శంక‌ర్‌, ఎం.అప్పారావు, నెల్లిమ‌ర్ల‌ త‌హ‌శీల్దార్ సీతారామ‌రాజుల‌ను ఆదేశించారు. ఉత్స‌వ ఏర్పాట్ల‌న్నింటినీ ప‌ర్య‌వేక్షించాల‌ని ఆర్‌.డి.ఓ. భ‌వానీశంక‌ర్‌కు సూచించారు. పారిశుద్ద్య నిర్వ‌హ‌ణ‌ను పంచాయ‌తీరాజ్ శాఖ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టేలా ఏర్పాట్లు చేయాల‌ని ఎంపిడిఓ రాజ్‌కుమార్‌ను ఆదేశించారు.  సీనియ‌ర్ శాస‌న‌స‌భ్యులు  బొత్స స‌త్య‌నారాయ‌ణ స్వామి వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున‌ ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నార‌ని, శ్రీ‌వ‌రాహ ల‌క్ష్మీ నృసింహ‌స్వామి వారి దేవ‌స్థానం, సింహాచ‌లం తరపున ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌కూరుస్తార‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. అనంత‌రం రామ‌స్వామి వారి ఆల‌యంలో స్వామి వారిని క‌లెక్ట‌ర్ ద‌ర్శించుకొన్నారు. ఆల‌య అధికారులు, అర్చ‌కులు జిల్లా క‌లెక్ట‌ర్‌కు సంప్ర‌దాయ బ‌ద్దంగా స్వాగ‌తం ప‌లికి స్వామి వారి ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

Ramatheertham

2022-04-08 08:12:09

సత్వరమే నష్టపరిహారం అందించాలి..

ఓఎన్జీసీ పైపు లైన్ల పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు త్వరితగతిన పరిహారం అందించేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో మత్స్య శాఖ, ఓఎన్జీసీ, తాళ్లరేవు మండల రెవెన్యూ అధికారులతో కలెక్టర్ కృతికా శుక్లా.. జాయింట్ కలెక్టర్ ఇలాక్కియా‌తో కలిసి మత్స్యకారులకు పరిహారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా పరిధిలోని తాళ్లరేవు మండలానికి సంబంధించి ఓఎన్జీసీ పైపు లైన్లు పనుల వలన జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకారులకు నష్ట పరిహారం ఇచ్చే విధంగా అధికారులు చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఇందుకు ఓఎన్జీసీ, మత్స్య, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తాళ్ళరేవు మండలం పరిధిలో మత్స్యకారులు, ఒంటరి మహిళలు మొత్తం 7,050 మంది లబ్ధిదారులు ఉన్నారని, మత్స్యకారుల జాబితా సిద్దంగా ఉన్నందున సొమ్ము జమ అయ్యేవిధంగా చూడాలని కలెక్టర్ కృతికా శుక్లా ఓఎన్జీసీ అధికారులను ఆదేశించారు. పైపులైన్ల పనులు ఇతర వివరాలు ఓఎన్జీసీ అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ కు వివరించారు. సమావేశంలో  జిల్లా మత్స్యశాఖ అధికారి పి.వి.సత్యనారాయణ, ఓఎన్జీసీ జీఎం (హెచ్.ఆర్) డి.మల్లిక్, ఓఎన్జీసీ ప్రతినిధి రవి, తాళ్ళరేవు తహసీల్దార్ ప్రసాద్ రావు, ఎంపీడీవో పీవీ.థామస్, మత్స్య శాఖ ఏడీ కె.కరుణాకర్, ఎఫ్.డీ.వో జీ.గోపి తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-04-08 06:44:55

య‌బ్బోజుకి క్రిష్టియ‌న్ మేరేజ్ లైసెన్స్..

విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణానికి చెందిన పి. య‌బ్బోజు చౌద‌రికి, ప్ర‌భుత్వం క్రిష్టియ‌న్ మేరేజ్ లైసెన్స్‌ను జారీ చేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. స్థానిక స్టేడియం కాల‌నీలోని గ్రేస్ అండ్ ట్రూత్ చ‌ర్ఛికి చెందిన య‌బ్బోజు చౌద‌రికి, ఇండియ‌న్ క్రిష్టియ‌న్ మేరేజ్ యాక్ట్ 1872 ప్ర‌కారం, మూడేళ్ల‌పాటు చెల్లేవిధంగా ఈ లైసెన్సును జారీ చేసిన‌ట్లు వివ‌రించారు. ఇక‌నుంచీ జిల్లా ప‌రిధిలో భార‌తీయ‌ క్రిష్టియ‌న్ల మ‌ధ్య జ‌రిగే వివాహాల‌కు, ఆయ‌న ధృవ‌ప‌త్రాల‌ను జారీ చేస్తార‌ని క‌లెక్ట‌ర్‌ తెలిపారు.

Vizianagaram

2022-04-08 06:43:52

విజయసాయిరెడ్డిని కలసిన ఎస్సిఆర్డబ్యుఏ..

స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గురువారం సర్క్యూట్ హౌస్ లో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆయనను దుస్సాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం, జ్ఞాపికను అందజేసారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది సంబరాలకు సహాయసహకారాలు అందించినందుకు  విజయసాయిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ పలు జర్నలిస్టుల సమస్యలను విజయసాయిరెడ్డి  దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎమ్.వి.ఎస్.అప్పారావు, కార్యదర్శి కాళ్ళ సూర్య ప్రకాష్, ముఖ్య సలహాదారులు కర్రి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పద్మజ, ఎస్.ఎన్.నాయుడు, కోశాధికారి అశోక్ రెడ్డి, సహాయ కార్యదర్శి అబ్బిరెడ్డి చంద్రశేఖర్, సహ సహాయ కార్యదర్శి కె.వినోద్, కార్యవర్గ సభ్యులు వి.సూరిబాబు, విశ్వేశ్వరరెడ్డి, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-04-08 03:14:13

నవరత్నాలు పూర్తిస్థాయిలో అమలు చేయాలి..

ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నవరత్నాల పధకాలు, సంక్షేమ పధకాలను సమర్ధ వంతంగా అమలు చేయడంలో అధికారులు అంతా సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్. సమీర్ శర్మ ఆదేశాలిచ్చారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి 26 జిల్లాల కలెక్టర్లు, కమీషనర్లు, ఆయా శాఖ ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ పధకాల అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ రాజకుమారి, శిక్షణా కలెక్టర్ శుభం బన్సాల్, డి.ఆర్.ఒ కొండయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్. సమీర్ శర్మ మాట్లాడుతూ నవరత్నాలు, జగనన్న పేదలందరికీ ఇల్లు, ఓ.టి.ఎస్. విద్యా దీవెన, వసతి దీవెన, గృహనిర్మాణం, జగనన్న ఆసరా, చేయూత, పాల వెల్లువ, వై.యస్.ఆర్ నేస్తం, గ్రామ/ వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రాల నిర్వహణ, సర్వీసులు, ఆధార్ సెంటర్ల నిర్వహణ, వాలటీర్లు, గ్రామ సచివాలయాల సెక్రటరీల ప్రొబీషన్ డిక్లరేషన్ విధానం తదితర పథకాలపై సమీక్ష నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. కొత్తగా ఆయా జిల్లాల్లో కలెక్టర్లుగా బాధ్యతలు వారు తమ కర్తవ్య బాధ్యతలను సమన్వంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఎప్పటి కప్పుడు రోజువారి పరిశీలనలు చేయాడంతో పాటు నివేదికలు ఆధారంగా పథకాలను సమర్ధవంతంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ/ వార్డు, గృహనిర్మాణశాఖ ముఖ్య అజయ్ జైన్ ప్రభుత్వ పధకాలు అమలు జరుగుతున్న తీరును అధికారులకు వివరించి, పురోగతికి సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో హౌసింగ్ పి.డి. వసంతబాబు, ఎస్సీ కార్పోరేషన్ ఇ.డి ప్రేమకుమారి, ఇ.డి.ఎం. రత్నం, డిజాస్టర్ మేనేజ్ మెంట్ పి.డి లలిత, సి.పి.ఒ శేషశ్రీ, డి.పి.ఒ కేశవరెడ్డి, కలెక్టరేట్ ఎ.ఒ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Guntur

2022-04-07 15:40:44