1 ENS Live Breaking News

విశాఖలో 31న జర్నలిస్ట్ ల ఉగాది సంబురాలు.. గంట్ల శ్రీనుబాబు

ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్,ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ల ఆధ్వర్యంలో (సంయుక్తంగా )ఈనెల 31 తేదీన శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. విశాఖలోని  వి జె ఎఫ్ వినోద వేదికక లో జరిగిన కార్యవర్గ సమావేశానికి ఏపీ డబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్షులు పి. నారాయణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ నిరంతరం మానసిక ఒత్తిడికి లోనయ్యే జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు ఆటవిడుపుగా ఈ సంబరాలు నిర్వహిస్తున్నామని, జర్నలిస్టుల సంక్షేమంతో పాటు వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆరోజు ఉదయం 10 గంటలకు వైశాఖ జలఉద్యానవనములో ఈ వేడుకలు మొదలవుతాయని పంచాంగ శ్రవణం,లక్కీ డిప్, సంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్టులను సత్కరిస్తామన్నారు. ఏపీడబ్ల్యుజేఎఫ్ నగర అధ్యక్షులు పి.నారాయణ్ మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉగాది సంబరాలను వైశాఖి జలఉద్యానవనంలో నిర్వహిస్తున్నామని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తమ కుటుంబాలతో పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.ఉదయముఅల్పాహారంనుంచి విందు భోజనంవరకూ ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు..ఈ సమావేశంలో ఏపీడబ్ల్యుజేఎఫ్ నగర కార్యదర్శి ఎస్. అనురాధ,ఏపీ బిజేఏ నగర అధ్యక్షుడు ఈరోతి ఈశ్వరరావు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు జి. శ్రీనివాస్,కోశాధికారి బి. సీతారామమూర్తి, ఉపాధ్యక్షులు బండారు శివ ప్రసాద్,  కే. మురళీకృష్ణ, ఇతర ప్రతినిధులు చింతా ప్రభాకర్, ఎం. ఏ. ఎన్. పాత్రుడు, కామన్న, ఎం. వి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-24 07:05:15

ఘనంగా బంగారమ్మ పరస మహోత్సవం..

అప్పన్న సోదరి, ఏడు గ్రామల ప్రజల ఇలవేల్పు శ్రీ బంగారమ్మ తల్లి పరస మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక సిడిగంపేటలో కొలువైన ఎల్లమ్మ తల్లి పండుగ మహోత్సవం వైభవంగా జరిపించారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు,కుంకుమలు సమర్పించు కున్నారు. ముడుపులు,మొక్కుబడులు చెల్లించుకున్నారు.ఆయా కార్యక్రమాల్లో సింహచలం దేవస్ధానం దర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజులు నిర్వహించారు. అమ్మవార్లుకు పసుపు,కుంకమలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ నిర్వాహకులకు గంట్ల శ్రీనుబాబు దంపతులు రూ.25వేలు విరాళంగా అందజేశారు. ఇక వేపగుంట ప్రజల గ్రామదేవత ముత్స్యమాంబ అమ్మవారి మారువారం పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని గంట్ల శ్రీనుబాబు దంపతులు దర్శించుకని ముడుపులు,మొక్కుబుడులు చెల్లించుకున్నారు.

Simhachalam

2022-03-24 06:56:59

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి..

స్టాండ్ అప్ ఇండియా పధకంలో భాగంగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చేందుకు ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) వెంకటరావు తెలిపారు.  శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఇ.పి.సి) సమావేశాన్ని నిర్వహించారు.   ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఎస్.సి., ఎస్.టి. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు స్టాండ్ అప్ ఇండియా పధకాన్ని ప్రవేశపెట్టిందని, అన్ని బ్యాంకులలో రుణ సౌకర్యం కల్పించాల్సివుంటుందన్నారు.  పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు మండల స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.   ప్రభుత్వ మార్గదర్శకాలకు సంబంధించిన పూర్తి వివరాలను సర్క్యులర్ తయారుచేసి అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రదర్శించడం ద్వారా ఈ పధకం విజయవంతం అవుతుందన్నారు.  జిల్లాలో వివిధ పరిశ్రమల అభివృద్దికి సంబంధించి అధికారులతో చర్చించారు.  క్రిందటి నెలలో నిర్వహించిన డి.ఐ.ఇ.పి.సి సమావేశంలో చేపట్టిన అంశాలపై సమీక్షించారు.  భూగర్భ జలాలను వినియోగించే పరిశ్రమల వారు ఈనెలాఖరులోగా భూగర్భ జల శాఖ నుండి నిరభ్యంతర పత్రాలను (ఎన్.ఓ.సి) తప్పనిసరిగా పొందాలన్నారు.  లేని పక్షంలో సంబంధిత పరిశ్రమల యాజమాన్యంపై చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు.  పరిశ్రమల నుండి వెలువడే వాయు, నీటి, శబ్ద కాలుష్యాలకు సంబంధించి కాలుష్య నియంత్రణ శాఖ ద్వారా వున్న నియమనిబంధనలను కచ్చితంగా అమలు పర్చాలన్నారు.   పరిశ్రమల నిర్వహణకు అవసరమైన నీటి సరఫరాకు సంబంధించి ఇరిగేషన్, మున్సిపల్, ఎపిఐఐసి లనుండి నిబంధనలకు అనుకూలంగా తీసుకోవల్సివుంటుందన్నారు.  జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ ఈ నెలలో సింగిల్ డస్క్   పోర్టల్ (ఎస్.డి.పి)లో  54 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 35 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు.  మిగిలినవి పరిశీలనలో వున్నాయని తెలిపారు.  ఈ సమావేశంలో డిఐఇపిసి కమిటీ మెంబర్లు ఎల్.డి.ఎం, ఎపిఐఐసి, ఎం.ఎస్.ఎం.ఇ., కాలుష్యనియంత్రణ, ఫ్యాక్టరీలు, పంచాయితీరాజ్, ఇరిగేషన్, అగ్నిమాపక, మున్సిపల్, విఎంఆర్డిఎ, కార్మిక తదితర శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు.

Vizianagaram

2022-03-19 10:01:21

ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను ప్రోత్స‌హించాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వ‌రి,చెర‌కు త‌దిత‌ర‌ సంప్ర‌దాయ పంట‌ల‌ బ‌దులు, రైతుల‌ను లాభ‌సాటిగా ఉండే ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌వైపు మ‌ళ్లించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి కోరారు. రైతుల‌తో మ‌మేక‌మై, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని వ్య‌వ‌సాయ‌శాఖాధికారుల‌కు క‌లెక్ట‌ర్‌ పిలుపునిచ్చారు.  పంట‌ల మ‌ళ్లింపు విధానంపై స్థానిక కృషిభ‌వ‌న్‌లో శ‌నివారం ఏర్పాటు చేసిన వ‌ర్క్‌షాపును క‌లెక్ట‌ర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ నేల స్వ‌భావం, రైతుల స్థితిగ‌తుల ఆధారంగా ప్ర‌త్యామ్నాయ‌ పంట‌ల‌ను సూచించాల‌ని అన్నారు. ముఖ్యంగా ఆయా పంట‌ల‌కు ఉన్న‌ మార్కెట్ అవ‌కాశాల‌ను దృష్టిలో పెట్టుకొని మాత్ర‌మే పంట‌ల‌ను ఎంపిక చేయాల‌ని సూచించారు.  ఎంతో సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ, అది రైతుల‌వ‌ర‌కు చేర‌డం లేద‌ని అన్నారు. అధికారులు  క్షేత్ర‌స్థాయిలో విస్తృతంగా ప‌ర్య‌టించి, రైతుల‌తో మ‌మేక‌మై, వారి వాస్త‌వ అవ‌స‌రాల‌ను గుర్తించాల‌ని సూచించారు. పంట‌ల మ‌ళ్లింపుపై  రైతుల‌వారీగా, గ్రామం వారీగా ప్ర‌ణాళిక‌ను రూపొందించి, అమ‌లు చేయాల‌ని సూచించారు. మార్కెట్‌లో డిమాండ్‌ను బ‌ట్టి, ఉద్యాన‌, వాణిజ్య‌పంట‌లను సూచించాల‌న్నారు. ముందు అధికారుల దృక్ఫ‌థంలో మార్పు రావాల‌ని సూచించారు. ఈ-క్రాప్ న‌మోదు  రైతుకు కీల‌క‌మ‌ని, దీనిపై ప్ర‌తీఒక్క‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. ముఖ్యంగా పంట పండించే ప్ర‌తీ రైతుకు మేలు చేయ‌డం మ‌న ల‌క్ష్యం కావాల‌ని చెప్పారు. రైతుల‌కు పంట రుణాలు విరివిగా ఇప్పించేందుకు కృషి చేయాల‌న్నారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్నిపెద్ద ఎత్తున ప్రోత్స‌హించాల‌ని కోరారు. ప్ర‌తీ గ్రామంలో కూడా ఎంతోకొంత ప్ర‌కృతి సేద్యం చేయించాల‌ని, తద్వారా వారిని చూసి, ఇత‌ర రైతులు కూడా స్ఫూర్తి పొందే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో మ‌న‌సుపెట్టి ప‌నిచేయ‌డం ద్వారా, మంచి ఫ‌లితాల‌ను సాధించ‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఖ‌రీఫ్ నాటికి రైతుల దృక్ఫ‌థంలో మార్పును తీసుకువ‌చ్చి, ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌వైపు మ‌ళ్లే విధంగా ప్ర‌తీ వ్య‌వ‌సాయ అధికారి కృషి చేయాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌సాయ‌శాఖ జెడి తార‌క‌రామారావు, డిడి బిఎస్ఆర్ నందు, ఎడిఏలు, ఏఓలు, వ్య‌వ‌సాయ స‌హాయ‌కులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-03-19 09:53:16

ప్ర‌ణాళికాబద్ధంగా రీసర్వే ప్రక్రియ..

జ‌గ‌న‌న్న శాశ్వ‌త‌ భూహ‌క్కు, మ‌రియు భూర‌క్ష (రీ సర్వే) ప‌థ‌కాన్ని జిల్లాలో ప‌క‌డ్బంధీగా అమ‌లు చేయనున్నామని, ఈ మేరకు చర్యలు తీసుకున్నామని జిల్లా క‌లెక్ట‌ర్ డా. ఎ. మల్లిఖార్జున చెప్పారు. ప్ర‌ణాళికాబ‌ద్దంగా స‌మ‌గ్ర రీస‌ర్వే ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయన పేర్కొన్నారు. వివిధ జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లతో, విజ‌య‌వాడ నుంచి భూ ప‌రిపాల‌న ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జి. సాయిప్ర‌సాద్‌, స‌ర్వే సెటిల్‌మెంట్స్ క‌మిష‌న‌ర్ సిద్దార్థ‌ జైన్ గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న ఈ  రీస‌ర్వే ప్ర‌క్రియ‌ను క్షేత్ర‌స్థాయిలో క‌లెక్ట‌ర్లు ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, డి.ఆర్.వో. శ్రీనివాసమూర్తి హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను వివరించారు. స‌ర్వే ప్ర‌క్రియను మ‌రింత వేగంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రక్రియను సజావుగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఇచ్చిన ల‌క్ష్యాల మేర‌కు ఇప్పటి వరకు గుర్తించిన పది మండలాల్లో 26 గ్రామాల్లో సర్వే పూర్తి చేశామని తెలిపారు.

అంత‌కుముందు సిసిఎల్ఏ సాయిప్ర‌సాద్ మాట్లాడుతూ భూముల మ్యుటేష‌న్ కోసం ప్ర‌జ‌ల‌ నుంచి వ‌స్తున్న‌ ద‌ర‌ఖాస్తుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని ఆదేశించారు. తహశీల్దార్లు వాటిని ఎందుకు తిర‌స్క‌రిస్తున్నారో, తిర‌స్క‌ర‌ణ‌కు స‌రైన కార‌ణాలు ఉన్నాయో లేవోన‌ని, క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించాల‌ని సూచించారు. ముటేషన్ ప్రక్రియకు సంబంధించి అకారణంగా ధరఖాస్తుల తిరస్కరణ ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో రిజెక్షన్ పవర్స్ ఆర్డీవో కి బదిలీ చేయనున్నట్లు సిసిఎల్ ఏ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, సర్వే విభాగం సహాయ సంచాలకులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-17 12:50:14

అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు..

మంద‌గ‌మ‌నం వీడి ప‌నుల్లో పురోగ‌తి సాధించాల‌ని, లేని ప‌క్షంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోక‌ త‌ప్ప‌ద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. ఎ. మ‌ల్లిఖార్జున గృహ నిర్మాణ శాఖ అధికారుల‌ను హెచ్చ‌రించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మంచి ఉద్దేశంతో చేప‌ట్టిన పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం  ఫ‌లాలు అంద‌రికీ చేరేలా ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌న్నారు. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా మంచి ప‌నితీరు క‌న‌బ‌రిచి ఆశాజ‌న‌క ఫ‌లితాలు సాధించాల‌ని సూచించారు. జిల్లాలో జ‌రుగుతున్న గృహ నిర్మాణ ప‌నులు, ఓటీఎస్ ప్ర‌క్రియ‌, బిల్లుల చెల్లింపు త‌దిత‌ర అంశాలపై మంగ‌ళ‌వారం ఆయ‌న గృహ నిర్మాణ‌, రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్ శాఖల‌ అధికారుల‌తో క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో స‌మీక్ష‌ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ గృహ నిర్మాణాల‌కు సంబంధించిన అన్ని ప‌నుల్లో మ‌రింత పురోగ‌తి సాధించాల‌ని, నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను చేరుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కొన్ని మండ‌లాల్లో ఇంకా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాక‌పోవ‌టం శోచ‌నీయ‌మ‌ని క‌లెక్ట‌ర్ అన్నారు. త్వ‌రిత‌గ‌తిన స్పందించి ప‌నులు ప్రారంభించాల‌ని చెప్పారు. గృహ నిర్మాణ‌, రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఓటీఎస్ ప్ర‌క్రియ‌ను స‌జావుగా చేయాల‌ని, న‌గ‌దు చెల్లించిన వారికి త్వ‌రిత‌గ‌తిన ప‌ట్టాలు అంద‌జేయాల‌ని సూచించారు. ఓటీఎస్ ప్ర‌యోజ‌నాల‌ను ల‌బ్ధిదారులకు తెలియ‌జేయాల‌ని అధికారుల‌కు చెప్పారు. అలాగే ఓటీఎస్ ప‌ట్టా ఆధారంగా ఏపీజీవీబీ బ్యాంకు రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ స‌దుపాయం క‌ల్పించేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. మిగిలిన బ్యాంకులు కూడా ఈ విష‌యంలో సానుకూలంగా స్పందిస్తాయ‌ని క‌లెక్ట‌ర్‌ ఆశాభావం వ్య‌క్తం చేశారు. అలాగే పెండింగ్ ప‌నుల‌ను త్వరిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని, ప‌నుల విష‌యంలో నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించే వారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా హెచ్చ‌రించారు. ప‌నిలో వెనుక‌బాటు త‌నానికి సాకులు చెప్పొద్ద‌ని అధికారుల‌కు సూచించారు. క్షేత్ర స్థాయిలో ప‌ని చేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం పెట్టి ఇళ్ల నిర్మాణాల ప్ర‌క్రియలో వేగం పెంచేందుకు ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు.

భూమి పూజ చేస్తే రూ.10 వేలు జ‌మ‌

జ‌గ‌న‌న్న లేఅవుట్ల‌లో భూమి పూజ చేసిన వెంట‌నే సంబంధిత ల‌బ్ధిదారుల‌కు రూ.10 వేలు అందించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని, దీనిపై ల‌బ్ధిదారుల్లో అవ‌గాహ‌న క‌ల్పించి నిర్మాణాల్లో వేగం పెంచాల‌ని జాయింట్ క‌లెక్టర్ క‌ల్ప‌నా కుమారి పేర్కొన్నారు. బీబీఎల్ స్థాయిలో కేవ‌లం భూమి పూజ చేసిన వారికి ప్రోత్సాహ‌క రూపంలో న‌గ‌దు అందేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. దీని ద్వారా నిర్మాణాల్లో వేగం పెంచాల‌ని సూచించారు. లేఅవుట్ల‌లో నీరు, ముడిస‌రుకులు, ఇత‌ర వ‌స‌తులు క‌ల్పించాల‌ని చెప్పారు. ఈ నెల 18వ తేదీలోగా బీబీఎల్ ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు.

స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ క‌ల్ప‌నా కుమారి, గృహ నిర్మాణ శాఖ ఈఈ, డీఈలు, ఏఈలు, త‌హ‌శీల్దార్లు, ఎంపీడీవోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-15 10:40:04

క్రిష్ణదేవిపేటలో ఏప్రిల్ 3న 1997 బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టు గెదర్ మీట్..

విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట హైస్కూలులో చదువుకున్న 1997 ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టు గెదర్ మీట్  కార్యక్రమం ఏప్రిల్ 3వ తేదిన అదే గ్రామంలోని అల్లూరి సీతారామరాజు థీమ్ పార్కులో ఏర్పాటు చేసినట్టు కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు), ఎర్రానాగేశ్వర్రావులు తెలియజేశారు. ఈ మేరకు వారు విశాఖలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. తమ బ్యాచ్ కి పదవతరగతి పూర్తయి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్లాస్ మేట్స్ సభ్యులంతా కలవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా కాస్త ఆలస్యమైందని..ఈ కారణంగానే ఇంకా కొంతమంది స్నేహితుల వివరాలను సేకరించలేకోయామని పేర్కొన్నారు. క్రిష్ణదేవిపేట జెడ్పీ హైస్కూలులో 1997కి బ్యాచ్ 10వ తరగతి విద్యార్ధులు ఇంకా ఎవరైనా ఉంటే తక్షణమే ఈఎన్ఎస్ బాలు 9490280270, 9390280270,  నాగేశ్వర్రావు 8187897203, అసూన్ 9491784482 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. ఆ రోజు జరిగే కార్యక్రమానికి తమ బ్యాచ్ సభ్యులు ఎక్కడున్నా కలసి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారు ఆ ప్రకటనలో కోరారు.

Visakhapatnam

2022-03-15 04:01:34

సంతృప్తి చెందేలా ప‌రిష్కారం చూపాలి..

ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల‌కు నిర్ణీత స‌మ‌యంలో సంతృప్తి కరంగా ప‌రిష్కారం చూపాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎ.మ‌ల్లిఖార్జున జిల్లా అధికారుల‌ను ఆదేశించారు.ఒక సారి అందిన ఫిర్యాదు మ‌ళ్లీ తిరిగి రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, జాగ్ర‌త్త వ‌హించాల‌ని సూచించారు. నిర్ణీత కాలంలో ఫిర్యాదుల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం చూపాల‌ని, కింది స్థాయి అధికారి ఇచ్చిన రిప్లై స‌మాధానాన్ని ఉన్న‌తాధికారి క్షుణ్ణంగా ప‌రిశీలించాల‌ని పేర్కొన్నారు. విన‌తుల పరిష్కారంలో అధికారులు శ్ర‌ద్ధ వ‌హించాల‌ని చెప్పారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో జ‌రిగిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో ముందుగా పాత ఫిర్యాదుల స్థితిగ‌తుల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. వ‌చ్చిన ఫిర్యాదులే మ‌ళ్లీ మ‌ళ్లీ ఎందుకు వ‌స్తున్నాయనే అంశంలో అధికారులంతా పునఃప‌రిశీలించుకోవాలని క‌లెక్ట‌ర్ సూచించారు. రీ ఓపెన్ పిటిష‌న్ల‌కు, ఎస్‌.ఎల్‌.ఏ. ప‌రిధి దాటిన ద‌ర‌ఖాస్తుల‌కు సంబంధించి కార‌ణాలు తెలపాల‌ని కోరుతూ సంబంధిత అధికారుల‌కు లేఖ‌లు రాయాల‌ని డీఆర్వో శ్రీ‌నివాస‌మూర్తిని ఆదేశించారు. అనంత‌రం స్పంద‌న కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రించారు. స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్లు వేణుగోపాల్ రెడ్డి, అరుణ్ బాబు, క‌ల్ప‌నా కుమారి, డీఆర్వో శ్రీ‌నివాస‌మూర్తి, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-14 09:35:26

అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

ప్ర‌భుత్వ ఆదేశాలు, నిబంధ‌న‌ల‌ మేర‌కు ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా ప‌ని చేయాల‌ని అలా కాని ప‌క్షంలో క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లిఖార్జున గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా విభాగ అధికారుల‌ను హెచ్చ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు నిర్దేశించిన‌ ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌టంలో, అప్ప‌గించిన ప‌నుల‌ను చేయ‌టంలో సంబంధిత విభాగం వెనుక‌బ‌డి ఉంద‌ని మంద‌గ‌మ‌నం వీడి అధికారులంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. జ‌ల‌జీవ‌న్ మిష‌న్‌, స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ లో భాగంగా జిల్లాలో చేప‌డుతున్న ప‌నుల‌పై, ఇంటింటికీ కుళాయిల ఏర్పాటులో గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా విభాగం తీసుకుంటున్న చ‌ర్య‌లపై శుక్ర‌వారం ఆయ‌న క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న జ‌ల‌జీవ‌న్ మిష‌న్‌, శానిట‌రీ కాంప్లెక్సుల నిర్మాణంలో నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకోవాల‌ని ఈ నెలాఖ‌రులోగా చేరుకోవాల‌ని గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా విభాగ‌పు అధికారుల‌ను ఆదేశించారు. వేస‌విని దృష్టిలో పెట్టుకొని ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయాల‌ని, త్వ‌రిత‌గిత‌న పైప్ లైన్లు, ట్యాప్‌లు ఏర్పాలు చేయాల‌ని సూచించారు. జిల్లాలో 1.24 ప‌నులను గుర్తించగా సుమారు 28వేల ప‌నుల‌నే పూర్తి చేయ‌టం గ‌ర్హ‌ణీయ‌మ‌ని క‌లెక్ట‌ర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వేస‌విలో ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండా అంద‌రికీ తాగునీరు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, మార్చి నెలాఖ‌రులోగా సంబంధిత ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని నిర్దేశించారు. ఈ క్ర‌మంలో జిల్లాలోని అన్ని మండలాల ప‌రిస్థితిని ఆయా డివిజ‌న్ల‌, మండ‌లాల అధికారుల ద్వారా క‌లెక్ట‌ర్ తెలుసుకున్నారు.

ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట వేస్తూ జిల్లాలో ఉన్న ప్ర‌తి స‌చివాయం పరిధిలో లేదా స‌మీప ప్రాంతంలో క‌మ్యునిటీ శానిట‌రీ కాంప్లెక్సుల‌ను నిర్మించాల‌ని చెప్పారు. స‌చివాలయాల్లో ప‌ని చేసే మ‌హిళా సిబ్బందికి ఇబ్బంది లేకుండా నిర్మాణాల‌ను పూర్తి చేసి మ‌రుగుదొడ్ల‌ను త్వ‌రిత‌గ‌తిన అందుబాటులోకి తీసుకోవాల‌ని సూచించారు. శానిట‌రీ కాంప్లెక్సుల నిర్మాణానికి సంబంధించిన స్థ‌ల సేక‌ర‌ణ‌, టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను వారంలోగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. జిల్లాలో 733 శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణాల‌కు అనుమ‌తులు మంజూరు చేయ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 583 చోట్ల గ్రౌండింగ్ ప‌నులు పూర్త‌య్యాయ‌ని, మిగిలిన చోట్ల కూడా సంబంధిత ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన ప్రారంభించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. పెద‌బ‌య‌లు, ముంచింగుపుట్లు ప‌రిధిలో గ‌తంలో జ‌రిగిన ప‌నుల‌కు సంబంధించి త‌క్కువ నిధులు మంజూరు అయ్యాయ‌ని సంబంధిత మండ‌లాల అధికారులు క‌లెక్టర్ దృష్టికి తీసుకురాగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా స‌ర్కిల్ ఆఫీస్ అధికారుల‌ను ఆదేశించారు. అలాగే నాడు-నేడు ప‌థ‌కంలో భాగంగా పాఠ‌శాల‌ల్లో చేప‌ట్టాల్సిన‌ తాగునీటి వ‌స‌తి క‌ల్ప‌న‌కు సంబంధించిన ప‌నులను గుర్తించి అంచనాల‌ను త‌యారు చేయాల‌ని సూచించారు.

స‌మావేశంలో డీఈవో చంద్ర‌క‌ళ‌, ఎస్‌.ఎస్‌.ఏ. పీవో, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా విభాగం స‌ర్కిల్ కార్యాల‌యం డీఈ సావిత్రి, డివిజ‌న్ లెవెల్ అధికారులు, జేఈలు, ఏఈలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-11 10:14:10

2.35 లక్షల మందికి కోవిడ్ టీకావేసి సేవలందించారామె.. కలెక్టర్ అభినందన..

విశాఖజిల్లా వైద్యఆరోగ్యశాఖలో మధురవాడ పీహెచ్సీలో ఎంపీహెచ్ఏ(ఎఫ్)గా పనిచేస్తున్న చిల్లా ఉమామహేశ్వరి కోవిడ్ టీకాలు వేయడంలో అరుదైన రికార్డు నమోదు చేశారు. ఏకంగా 2.35 లక్షల మందికి ఆమె కోవిడ్ టీకా వేసి విశాఖజిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో రెపరెపలాండించారు. ఆమె చేసిన సేవకు గుర్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుక్ ఎల్.మాండవీయ ఘనంగా సత్కరించి మెమెంటోను అందజేశారు. దానిని ఈరోజు జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున ద్రుష్టికి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి కె.విజయలక్ష్మి తీసుకు వెళ్లగా ఆమెను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని ప్రోత్సహించారు. సిబ్బందితో మంచి సేవ జాతీయ స్థాయిలో నమోదు చేసే విధంగా క్రుషి చేసినందుకు డిఎంహెచ్ఓను కూడా జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా డిఐఓ డా.ఎస్.జీవన్ రాణి, జిల్లా కార్యాలయ సిబ్బంది ఏంపీహెచ్ఏ ఉమామహేశ్వరికి అభినందనలు తెలియజేశారు.

Madhurawada

2022-03-10 13:41:10

స్వచ్ఛ సంకల్పం లక్ష్యాలను చేరుకుంటాం..

విశాఖ‌జిల్లాలో పారిశ‌ద్ధ్య నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ సంక‌ల్పం ల‌క్ష్యాల‌ను చేరుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ డా. ఎ. మ‌ల్లిఖార్జున పేర్కొన్నారు. వైఎస్సార్ జ‌ల‌క‌ళ‌, జ‌ల‌జీవ‌న్ మిష‌న్ ప‌థ‌కాల‌ను స‌క్ర‌మంగా అమ‌లు చేసి ఫ‌లితాల‌ను అంద‌రికీ చేర‌వేస్తామ‌ని తెలిపారు. పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్ర‌న్సిప‌ల్ సెక్ర‌ట‌రీ గోపాల కృష్ణ ద్వివేదీ, డిప్యూటీ క‌మిష‌న‌ర్ కోన శ‌శిధ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో గురువారం వివిధ అంశాలపై వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. రాష్ట్ర ప్రభుత్వం చేప‌ట్టిన‌ జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇంటింటి చెత్త సేక‌ర‌ణ‌, చెత్త సేక‌ర‌ణ కేంద్రాల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌పై ఆశాజ‌న‌క ఫ‌లితాలు రావాల‌ని, ఆ దిశ‌గా కలెక్ట‌ర్లు, సంబంధిత విభాగాల అధికారుల‌ ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌లో లోపాలు త‌లెత్త‌కుండా, త‌ప్పుడు నివేదిక‌లు పంపించి ప‌ని నుంచి త‌ప్పించుకోకుండా క్షేత్ర‌స్థాయి సిబ్బందిపై ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని సూచించారు. ఇంటి ప‌న్నుల వసూళ్ల‌లో వేగం పెంచాల‌ని, నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు అంద‌రూ బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పారు. చాలా జిల్లాల్లో షెడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయ‌ని, పనులను వేగవంతం చేయాలన్నారు. విద్యుత్ కనెక్షన్లు, అప్రోచ్ రోడ్లు, నీటి సౌకర్యం తదితర మౌలిక వసతులను క‌ల్పించాల‌ని సూచించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ‌ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల‌లో మరుగుదొడ్లు నిర్మాణాల‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త్వ‌రిత‌గ‌తిన ప‌నులు పూర్త‌య్యేలా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలని కలెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డా. ఎ. మ‌ల్లిఖార్జున మాట్లాడుతూ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన చ‌ర్య‌ల గురించి వివ‌రించారు. ఉపాధి హామీ ప‌థ‌కంలో భాగంగా సాధ్య‌మైనంత ఎక్కువ మందికి ప‌నులు క‌ల్పిస్తామ‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే డిమాండ్ మేర‌కు ప‌నులు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. మెటీరియ‌ల్ కాంపోనెంట్ నిధుల‌ను వినియోగించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. శానిటరీ కాంప్లెక్సుల ఏర్పాటుకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో 12 ఎక‌రాల భూమిని గుర్తించామ‌ని చెప్పారు. రైతుల‌కు బోర్‌వెల్స్ ఏర్పాటు చేస్తామ‌ని సాగునీటి అవ‌స‌రాలు తీరుస్తామ‌ని చెప్పారు. చెత్త‌సేక‌ర‌ణ కేంద్రాల నిర్వ‌హ‌ణలో లోపాలు లేకుండా, ఇంటింటి చెత్త సేక‌ర‌ణలో ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. ప‌న్నుల వ‌సూలులో కింది స్థాయి సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేయ‌టం ద్వారా మ‌రిన్ని ఫ‌లితాలు సాధిస్తామ‌ని చెప్పారు. 
వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా నుంచి జాయింట్ కలెక్ట‌ర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, క‌ల్ప‌నా కుమారి, ఆర్‌.డ‌బ్ల్యూ.ఎస్‌., డ్వామా, ఫారెస్టు విభాగాల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-10 11:24:20

రీ-స‌ర్వేలో నిర్దేశిత‌ ల‌క్ష్యాల‌ను చేరుకుంటాం..

విశాఖ‌ జిల్లాలో చేప‌ట్టిన రీ-స‌ర్వే ప్ర‌క్రియ‌లో ప్ర‌భుత్వం నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను చేరు కుంటామ‌ని, ఆ దిశ‌గా ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లిఖార్జున పేర్కొన్నారు. జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 16 గ్రామాల్లో రీ స‌ర్వే ప్ర‌క్రియ పూర్తి చేశామ‌ని, ఈ వారం లోపు మ‌రొక 10 గ్రామాల్లో ప్ర‌క్రియ పూర్తి కానుంద‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జ‌గ‌న‌న్న భూ ర‌క్ష ప‌థ‌కంలో భాగంగా చేప‌ట్టిన భూముల రీ-స‌ర్వే విధానం అమ‌లు, ఫ‌లితాల‌పై సీసీఎల్ఎ క‌మిష‌న‌ర్ జి. సాయి ప్ర‌సాద్ గురువారం వివిధ జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్ర‌క్రియ‌ను వేగంగా, స‌జావుగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఫ‌లితాలు అంద‌రికీ అందాల‌ని, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. స‌ర్వే విధానం, మ్యుటేష‌న్ ప్ర‌క్రియ‌, రెవెన్యూ సంబంధిత ప‌లు అంశాలపై ఈ సంద‌ర్భంగా ఆయ‌న స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లిఖార్జున జిల్లాలో తీసుకున్న చ‌ర్య‌ల గురించి సీసీఎల్ఏకు వివ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్వే పూర్త‌యిన గ్రామాల్లో నోటిఫికేష‌న్లు, సంబంధిత ప‌త్రాలు అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించారు. మ్యుటేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగా సాగేలా త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. కార‌ణం తెల‌ప‌కుండా తిర‌స్క‌రించిన మ్యుటేష‌న్ ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి జిల్లాలో మొత్తం 26 గ్రామాల్లో రీ స‌ర్వే ప్ర‌క్రియ పూర్తి చేసి సంబంధిత ప‌త్రాలు అంద‌జేస్తామ‌ని వివ‌రించారు. స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, క‌ల్ప‌నాకుమారి, డీఆర్వో శ్రీ‌నివాస‌మూర్తి, స‌ర్వే విభాగ‌పు అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-10 11:21:28

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రుహుల్లా నామినేషన్ ..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా గురువారం నాడు ఏపీ శాసనసభ ఉప కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నిసా హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానానికి శాసన సభ్యుల కోటాలో ప్రస్తుతం ఎన్నిక జరుగుతున్నది. అభ్యర్థి ఎండీ రుహుల్లా అల్లా సాక్షిగా ప్రమాణం చేసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి పి.వి. సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పి. గౌతంరెడ్డి  పాల్గొన్నారు. 

Sachivalayam

2022-03-10 10:50:22

తూ.గో.జి.ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబుకి హెచ్సార్సీ నోటీసులు..

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబుకి హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీచేసింది..  జిల్లాలోని మండపేటకి  కాళీక్రిష్ణభవగావన్ ఆత్మహత్య కేసు విషయంలో పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశించింది.  జిల్లా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి తో విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ నోటీసులను రామచంద్రాపురం డిఎస్పీ, మండపేట సిఐ, ఎస్ఐలకు కూడా  జారీచేసింది. విచారణ నివేదిను ఏప్రిల్ 11వ తేదీలోపు సమర్పించాలని సూచించింది. ప్రేమ వ్యవహారంలో ప్రియురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండపేట సిఐ కాళీ క్రిష్ణ భగవాన్ ను మర్మాంగంపై బలమైన  గాయం అయ్యేలా కొట్టారని,  ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడనేది ప్రధాన ఆరోపణ. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు ధర్నాచేయడంతో మానవ హక్కుల సంఘం ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి ఈ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఈ ఘటన విషయంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మండపేట సిఐను వీఆర్ లో కి పంపడంతోపాటు జిల్లాలోని అన్ని స్టేషన్ల పోలీసులకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఒక వ్యవస్థలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది తప్పుచేసి దానికి జిల్లా అధికారులే ప్రభుత్వంలో సంజాయిషి ఇచ్చుకోవాలి. అలా మండపేటలో జరిగిన ఘటనపై ఇపుడు జిల్లా ఎస్పీ విచారణతోపాటు సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. కిందిస్థాయి సిబ్బంది చేసిన తప్పకు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు ఇపుడు జిల్లా పోలీసు అధికారులు హెచ్చార్సీకి నోటీసుల రూపంలో సమాధానం చెప్పాల్సి వస్తోంది. హెచ్సార్సీ చైర్మన్ మందాత సీతారామ్మూర్తి,  జ్యూడిషల్ సభ్యుడు సుబ్రమణ్యం, నాన్ జ్యూడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు, జిల్లా ఎస్పీకి నోటీసులు జారీచేశారని సెక్షన్ ఆఫీసర్ బి.తారక నరసింహ కుమార్ తెలియజేశారు. 

Kakinada

2022-03-10 07:01:41