1 ENS Live Breaking News

రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు..కలెక్టర్

తూర్పుగోదావరి  జిల్లాలో నాడు - నేడు పనులతో పాటు 84 అదనపు తరగతి గదులు నిర్మాణంతో కలిపి , మొత్తం 49 పాఠశాలల్లో  133 పనులను సుమారు రూ.100 కోట్లతో చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత తెలిపారు. శుక్రవారం సాయంత్రం విద్యా శాఖ పై స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో  నాడు నేడు ద్వారా రెండవ ఫేజ్ లో చేపట్టవలసిన పనులకు సంబంధించి మండలవారి అధికారులతో సమీక్షించి పలు సూచనలు అందించారు. చేపట్టే పనుల్లో నాణ్యత కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో నాడు నేడు రెండవ ఫేజ్ లో 49 పాఠశాలలను ఆధునీకరణ త్వరితగతిన చేపట్టాలన్నారు. అదేవిధంగా 84 అదనపు తరగతి గదులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తరచు పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు అందుబాటులో ఉండే  త్రాగు నీరు, టాయిలెట్స్ అపరిశుభ్రంగా వున్నట్లు అయితే సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి రానున్నారని సూచన ప్రాయంగా తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన తేదీలోగా ప్రతి అధికారి వారికి కేటాయించిన , నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.

అంతకుముందు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండో దశ నాడు నేడు అభివృద్ధి పనులు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు తలపించేలా ఉండాలన్నారు. నూతనంగా భాద్యతలు చేపట్టిన కలెక్టర్ లను అభినందిస్తూ, ఇంజినీరింగ్ అధికారులు పనులను నిబద్ధతతో చేపట్టాల్సి ఉందన్నారు. రెండో దశలో అదనపు తరగతి గదుల నిర్మాణం, ఇతర కపోనెంట్స్  కలిసి ఉన్నందున పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ లు పాఠశాలలు తనిఖీ చేసి, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశానికి డీఈఓ  ఎస్. అబ్రహం, ఎమ్ ఈ ఓ లు,  పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏ పి డబ్ల్యు ఐ డి సి, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు హాజరయ్యారు.

Rajahmundry

2022-04-08 16:04:07

ఈనాడు ఆంధ్రజ్యోతి టీవి5 లను వదిలేదు..

తనపై అసత్య ప్రచారాలు చేసిన టీడీపీ నాయకులు, బండారు సత్యనారాయణ,పలువురి టిడిపి నాయకులపైన ఈనాడు,ఆంధ్రజ్యోతి  టీవీ5,మీడియా సంస్థలపై ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఈ మేరకు ఫిర్యాదుని పిఎం పాలెం పోలిసు స్టేషన్లో  అందజేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలోనే ఎన్సీసీ భూముల లావాదేవీలు జరిగాయని,  ఆ విషయమై తిరుపతి వేంకటేశ్వర స్వామిపై ఒట్టు పెట్టి నిజాలు చెప్పగలరా అని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు తీసుకుని  ఎన్.సి.సి కంపెనీకి లబ్ది చేకూర్చింది చంద్రబాబు కాదా అని మండి పడ్డారు.చంద్రబాబు ఆల్జీ మర్స్ అనే వ్యాధితో బాధ పడుతున్నారని,  దేవుడు ఆయుష్హు ఇస్తే వచ్చే ఎన్నికల వరకు మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేస్తారని..కానీ వచ్చే పరిస్థితి ఏపీ ప్రజలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో బీసీల కడుపు కొట్టి భూములను టిడిపి సామాజిక వర్గం ఆక్రమించిందన్న ఆయన ఆ భూముల విలువ కనీసం 10వేల కోట్లు ఉంటుందన్నారు. భూముల అక్రమాలను సహించేది లేదని, భూములు అన్నీ స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. సుజనా చౌదరి ఆర్ధిక నేరగాడని, అయ్యన్నపాత్రుడు మోస్ట్ వాగుడుకాయని, ఆయన ఇంటి పేరు చింత కాయ కాదు మిరపకాయల అంటూ చురకలు అంటించారు. అయ్యన్న తాగితే మనిషే కాదని..రాత్రీ,పగలు తాగుతునే ఉంటాడని అన్నారు. ఆయన కొడుకు విజయ్ కి బినామీ కంపెనీలు ఉన్నాయిని, తండ్రి కోడుకులు బెంగుళూరులో మోసాలకు  పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయమై ఈడీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. అంతేకాకుండా అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని క్రిమినల్ , సివిల్ డిఫార్మేషన్ కేసులు పెట్టి న్యాయస్థానంను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డితోపాటు ఎమ్మెల్సీ వంశీక్రిష్ణశ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజ్, తిప్పలనాగిరెడ్డి, ఉత్తర నియోజవకర్గ ఇన్చార్జి కెకె రాజు, ఐటి విభాగం ప్రతినిధి మిలీనియం శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-04-08 15:58:01

పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు..

పదవతరగతి  పరీక్షలను  ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని విశాఖజిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాధన్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం ఉదయం వారు పదవతరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశమందిరంలో   సమన్వయ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ పరీక్షలను  జిల్లాలోని 318 పాఠశాలలను పరీక్షా కేంద్రాలగా ఎంపిక చేయడం జరిగిందని,  ఇందులో 155 పాఠశాలలను విశాఖ జిల్లాలలోను,  122 పాఠశాలలను అనకాపల్లి జిల్లాలోను , 41 పాఠశాలలను  అల్లూరి సీతారామరాజు జిల్లాలోను  ఎంపిక చేయడం జరిగిందని  వీటిలో  మొత్తం 58,256 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరగుతారని తెలిపారు.  318 పరీక్షా కేంద్రాలలో 10 సమష్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వాటిలో  సి.సి కెమెరాలు ఏర్పాటు చేయుటకు  అధికారులను సూచించినారు.  జిల్లా అధికారులందరూ  సమన్వయంతో పని చేసి, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు చూడాలన్నారు. 10వ తరగతి పరీక్షలు  తేది 27-4-2022 నుండి 9-4-2022 వరకు జరుగుతాయన్నారు.  

పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, నిరంతర విద్యుత్తు ఉండేటట్లు చూడాలని ఆదేశించారు.  పరీక్ష సమయం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 నిల వరకు  ఆయా ప్రాంతాలలో 144 వ సెక్షన్ అమలులో ఉంటుందని మరియు  పరీక్షా కేంద్రాలలో  అనుమతి లేనిదే ప్రవేశించరాదని, అతిక్రమించిన వారికి చట్ట పరమైన చర్యలు తీసుకోబడునని తెలియజేసారు. ఏ ఒక్క విద్యార్ధి కూడా నేలపై పరీక్షలు వ్రాయరాదని అధికారులను ఆదేశించారు.  ఇదే విదంగా ఏప్రిల్ నెలలో జరగబోయే  సార్వత్రిక పది మరియు ఇంటర్ పరీక్షలను సజావుగా  నడిపించాలని  ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి విజయకుమార్, మూడు జిల్లాల విద్యాశాఖాదికారులు, ఉప విద్యాశాఖాదికారులు, ప్రభుత్వ పరీక్షల సహయ కమిషనర్, విద్యుత్తు, వైద్య ఆరోగ్య, రవాణా, తపాలా , పోలీసు తదితర అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2022-04-08 15:21:22

సకాలంలో ప్రజలకు రేషన్ అందించాలి..

ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు ప్రజలందరికీ సకాలంలో అందేలా చూడాలని కాకినాడ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ.ఎస్‌ పంపిణీ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం  కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలో ఎండీయూ వాహ‌నాల ద్వారా జ‌రుగుతున్న రేష‌న్ పంపిణీ ప్ర‌క్రియ‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ప్రజా పంపిణీ వ్య‌వ‌స్థ (పీడీఎస్‌) స‌రుకుల‌ను కార్డుదారులకు స‌క్ర‌మంగా అందిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని ప‌రిశీలించారు. ఏప్రిల్ నెల‌కు సంబంధించి పీడీఎస్ స‌రుకుల పంపిణీ జిల్లాలో శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌.. కాకినాడ‌లో ప‌లు ప్రాంతాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేసి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క మొబైల్ వాహ‌నాల ద్వారా ఇళ్ల వ‌ద్ద‌కే పీడీఎస్ స‌రుకులు అందించే బృహ‌త్త‌ర కార్య‌క్రమం క్షేత్ర‌స్థాయి అమ‌లుతీరును ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. కార్య‌క్ర‌మం సాఫీగా, విజ‌య‌వంతంగా పూర్తిచేసేందుకు ఎండీయూ ఆప‌రేట‌ర్లు, వాలంటీర్ల‌కు జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ ప‌లు సూచ‌న‌లు చేశారు.

Rajahmundry

2022-04-08 13:33:20

ఆనం కళాకేంద్రం సందర్శించిన కమిషనర్..

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన కె.దినేష్ కుమార్ నగర పాలక సంస్థ లోని వివిధ విభాగాలను పరిశీలించి, ఆయా విభాగాల పనితీరు పై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ను పరిశీలించి శనివారం ఉదయం 11 గంటలకు  ప్రారంభోత్సవం కోసం తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించలేదని అధికారులు తెలిపారు. కళా ,  సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలిచి నగరంలో ఒక సాంస్కృతిక కళా వేదికగా ఆనం కళాకేంద్రంకి పునర్ వైభవాన్ని తీసుకుని రావడం జరుగుతుందని దినేష్ కుమార్ తెలిపారు. స్టేజి డెకరేషన్ , లైటింగ్, సిట్టింగ్ కెపాసిటీ వంటి వాటిపై సమీక్షించి, సూచనలు చేశారు. కమిషనర్ తో నగర పాలక సంస్థ డీఈ జి. పాండురంగారావు, ఈఈ  ఆర్.శేషగిరిరావు, డీఈ  పి. ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

Rajahmundry

2022-04-08 13:04:12

తూ.గో.జి.కలెక్టర్ ను కలిసిన కమిషనర్

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ  కమిషనర్ కె. దినేష్ కుమార్ శుక్రవారం భాద్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ డా.మాధవీలత ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసిన కలెక్టర్ డా.మాధవీలత, జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరానికి చరిత్రాత్మకమైన ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.  నగరాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి అభివృద్ధి పరచాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరాభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని జిల్లా కలెక్టర్ డా.మాధవీలతకు కమిషన్ తెలియజేశారు.

Rajahmundry

2022-04-08 13:02:10

అప్పన్న ఉత్సవాలు విజయవంతం చేద్దాం..

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 12న జరగనున్న స్వామి  కళ్యాణ మహోత్సవం, మే 3న జరగనున్న అప్పన్న నిజరూప దర్శనం ఉత్సవాలుకి సంబందించి ట్రస్ట్ బోర్డు సభ్యులతో అధికారులు కలసి పూర్తి స్థాయిలో విజయ వంతం చేద్దామని ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ తో కలిసి స్వరూపానంద సరస్వతి స్వామీజీ ని కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు తదుపరి. శుక్రవారం దేవస్థానం కార్యాలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఈవో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈసందర్భముగా ఉత్సవాలు కి సంబందించిన  పలు అంశాలపై బోర్డ్ సభ్యులు తో  చర్చించారు. అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఇ ఓ, ఈఈ శ్రీనివాసరాజు  బోర్డు సభ్యులకు వివరించారు,, స్వామి కళ్యాణం జరిగే వేదికను అందంగా తీర్చిదిద్దాలని ఇంజనీరింగ్ అధికారులను బోర్డ్ సభ్యులు ఆదేశించారు.. అంతేకాకుండా కళ్యాణ మహోత్సవం కు వచ్చే భక్తులకి ఏటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. కళ్యాణ మహోత్సవానికి ఈ యేడాది అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఈవో చెప్పారు. అదేవిధంగా స్వామి కళ్యాణముకి మీడియాకు  కూడా గతంలో మాదిరిగానే అనుమతి ఉంటుందన్నారు. కళ్యాణ వేదిక ఎదురుగా గతంలో మాదిరిగా మీడియాపాయింట్ ఉంటుందని ట్రస్ట్ బోర్డు సభ్యులు తెలియజేశారు.. ఈ దిశగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చందనోత్సవానికి సంబంధించి తదుపరి జరిగే ట్రస్ట్ బోర్డు సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆలయ అభివృద్ది లో  మీడియా సహకారం  అవసరం. కాబట్టి చందనోత్సవం కి కూడా మీడియాకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు సభ్యులు తెలియజేశారు. రాష్ట్రము లో ఇతర ఆలయాల మాదిరిగానే సింహగిరి పైన అందరికి అందుబాటులో మీడియా పాయింట్ ఉంటుందని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు.
సమావేశం లో ఆలయ అధికారులు ట్రస్టు బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్ రాజ్, దొడ్డి రమణ, సువ్వాడ శ్రీదేవి, పాత్రుడు, సతీశ్,  నిర్మల, శ్రీదేవి వర్మ, రాధ, రాజేశ్వరీ, చందు తదితరులున్నారు.

Simhachalam

2022-04-08 12:42:15

వారికి గ్రూప్1,2 పరీక్షలకు ఉచిత శిక్షణ..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే బ్యాంకు పీవో, గ్రూప్ -1 ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యేందుకు తిరుప‌తి, విజ‌య‌వాడ ఏపీ స్ట‌డీ స‌ర్కిళ్ల‌లో ఉచిత శిక్ష‌ణ అంద‌జేయనున్నుట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీల్ రాజ్ కుమార్ తెలిపారు. పీవో ప‌రీక్ష‌లకు స‌న్న‌ద్ధ‌మ‌య్యే వారికి తిరుప‌తిలోని డా. బి. ఆర్‌. అంబేద్క‌ర్ ఏపీ స్ట‌డీ స‌ర్కిల్ లో, గ్రూప్-1 ప‌రీక్ష‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యే వారికి విజ‌య‌వాడ బ్రాంచి ఏపీ స్ట‌డీ స‌ర్కిల్‌లో శిక్ష‌ణ ఉంటుంద‌ని శుక్ర‌వారం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. వార్షిక ఆదాయం రూ.6 ల‌క్ష‌లు క‌లిగిన ఎస్సీ, ఎస్టీ సామాజిక, ఇత‌ర‌ వ‌ర్గాల‌కు చెందిన ప‌ట్ట‌భ‌ద్రులు ఈ నెల 18వ తేదీ లోగా apstdc.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ లో ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించాల‌ని సూచించారు. అభ్య‌ర్థుల సౌక‌ర్యార్థం ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ గ‌డువును ఈ నెల 10 నుంచి 18వ తేదీ వ‌ర‌కు పొడిగించిన‌ట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్  ప‌రీక్ష నిర్వ‌హించ‌టం ద్వారా శిక్ష‌ణ‌కు అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంద‌ని, ఎంపికైన వారికి ఉచిత వ‌స‌తి, ఉచిత శిక్ష‌ణ అందజేస్తార‌ని వివ‌రించారు.

Vizianagaram

2022-04-08 12:33:02

రభీ ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయండి..

కాకినాడ జిల్లాలో ర‌బీ సీజ‌న్‌కు సంబంధించి రైతుల నుంచి ధాన్యం సేక‌రించే ప్ర‌క్రియ మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు సాఫీగా సాగేలా ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళికల‌తో స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇల‌క్కియ‌.ఎస్‌.. అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ విధానగౌతమి సమావేశ మందిరంలో వ్యవసాయం, రెవెన్యూ, పౌరసరఫరాలు, సహకార శాఖలతో ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ అధికారుల పునశ్చరణ సమావేశంలో జేసీ ఇల‌క్కియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల మూడో వారం నుంచి రబీ ధాన్యం సేకరణ ప్రారంభంకానున్నందున ప్రభుత్వ నిబంధనల‌ను అమ‌లుచేస్తూ రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు అధికారులు సమాయత్తంకావాలన్నారు. సేకరణలో ధాన్యం తూకం, తేమ శాతం స‌రిగా ఉండేలా చూడాల‌న్నారు. ప్రధానంగా రైతులకు కనీస మ‌ద్ద‌తు ధరపై అవగాహన కల్పించి, రైతులు తమ పంటను మద్దతు ధ‌రకే అమ్ముకునేలా అధికారులు కృషిచేయాలన్నారు. ధాన్యం సేకరణలో ఈ-క్రాప్ బుకింగ్‌, ఈ-కేవైసీ వివరాలు కీలకమైనందున రైతులు అందరూ తప్పనిసరిగా ఈ-క్రాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకునేలా అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. ఖరీఫ్ ధాన్యం సేకరణలో ఎదురైన సమస్యలను అధిగమించి క్షేత్ర స్థాయిలో రైతుల‌కు ఇబ్బందులు రాకుండా రబీ ధాన్యం సేకరణ సజావుగా జరిగేందుకు అధికారులు కృషిచేయాలని జేసీ ఇల‌క్కియ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ ఎన్.విజయ్ కుమార్, పౌర సరఫరాల శాఖ డీఎం  ఇ.లక్ష్మి రెడ్డి, డీఎస్వో పీ.సురేష్, పెద్దాపురం ఆర్డీవో జే.సీతారామరావు, కాకినాడ ఇంచార్జ్ ఆర్డీవో కె.శ్రీరమణి, మండల స్థాయి రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-04-08 12:21:17

ఓటిఎస్ పై ప్రత్యేకంగా ద్రుష్టిసారించాలి..

కాకినాడ జిల్లాలో న‌వ‌ర‌త్నాలు పేద‌లంద‌రికీ ఇళ్లు, సంపూర్ణ గృహ హక్కు (ఓటీఎస్) పథకాలపై దృష్టిసారించి ల‌బ్ధిదారుల‌కు మేలు జ‌రిగేలా ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్ నుంచి క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ.ఎస్‌తో క‌లిసి వ‌ర్చువ‌ల్ విధానంలో ఆర్‌డీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, మండ‌ల ప్ర‌త్యేక అధికారులు, త‌హ‌సీల్దార్లు, ఎంపీడీవోల‌తో హౌసింగ్, సంపూర్ణ గృహ హక్కు, ఇత‌ర ప్ర‌భుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాల‌పై తొలిసారిగా స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పురోగ‌తి వివ‌రాల‌ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రధానంగా ఓటీఎస్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్, స్కానింగ్, ఈ-సైనింగ్ అంశాలపై దృష్టిసారించాల‌న్నారు. ఇందుకు గ్రామ/వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్, ఇతర సిబ్బందితో మండల స్థాయి అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో టెక్నికల్ సమస్యలు ఉంటే వెంటనే  జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో వైఎస్సార్ జగనన్న కాలనీలలో వివిధ దశలో ఉన్న గృహ నిర్మాణాల పురోగతిపై శ్రద్ధ వహించి స్టేజ్ అప్‌డేష‌న్‌పై దృష్టిసారించాల‌న్నారు. హౌసింగ్ లబ్ధిదారులకు అవగాహన కల్పించి వర్షాలు పడకముందే గృహాలు నిర్మించుకునేవిధంగా చూడాల‌న్నారు. గ్రామ/వార్డు సచివాలయాలలో స్పందన అర్జీలు, ఇతర సేవ‌ల‌ను సకాలంలో పరిష్కారించాలన్నారు. జగనన్న విద్యాదీవెన‌, జ‌గ‌న‌న్న తోడు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి సకాలంలో ఎక్నాలిజిమెంట్ ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స‌మావేశంలో డీఆర్‌వో కె.శ్రీధర్‌రెడ్డి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, హౌసింగ్ పీడీ బి.సుధాక‌ర్ పట్నాయక్, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు, ఈఈ బీవీ సత్యనారాయణ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-04-08 12:18:32

స్పందన అర్జీకి పరిష్కారం చూపాల్సిందే..

వివిధ స‌మ‌స్య‌లపై ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల‌కు స‌రైన స‌మ‌యంలో స‌రైన విధంగా ప‌రిష్కారం చూపాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. మ‌ళ్లీ మ‌ళ్లీ ఒకే స‌మ‌స్య‌పై ఫిర్యాదుల రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, రీ ఓపెన్ రాకుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని సూచించారు. నిర్ణీత కాలంలో ఫిర్యాదుల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం చూపాల‌ని, కింది స్థాయి అధికారి ఇచ్చిన రిప్లై స‌మాధానాన్ని ఉన్న‌తాధికారి ఒక సారి ప‌రిశీలించాలన్నారు. విన‌తుల పరిష్కారంలో అధికారులు ప్ర‌త్యేక‌ శ్ర‌ద్ధ వ‌హించాల‌ని, బీయాండ్ ఎస్‌.ఎల్‌.ఎ. ప‌రిధిలోకి వెళ్లొద్ద‌ని హెచ్చ‌రించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో స్పంద‌న ద్వారా, ఏపీ సేవా పోర్ట‌ల్ ద్వారా వ‌చ్చే విన‌తుల‌ ప‌రిష్కారంపై జ‌రిగిన స‌మీక్షలో ఫిర్యాదుల స్థితిగ‌తుల‌పై ఆమె స‌మీక్ష నిర్వ‌హించారు. వ‌చ్చిన ఫిర్యాదులే మ‌ళ్లీ మ‌ళ్లీ ఎందుకు వ‌స్తున్నాయనే అంశంలో అధికారులంతా పునఃప‌రిశీలించుకొని త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి క‌లెక్ట‌ర్ సూచించారు. అధికంగా రెవెన్యూ, పింఛ‌న్ల మంజూరు, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, విద్యుత్ స‌దుపాయం క‌ల్పన‌, గృహ నిర్మాణం, పాడి ప‌రిశ్ర‌మ తదిత‌ర స‌మ‌స్య‌ల‌కు సంబంధించి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయ‌ని ఆయా శాఖ‌ల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉంటూ స‌మ‌స్య‌ల‌ను నిర్ణీత గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. అలాగే అన్ని విభాగాల అధికారులు దిగువ స్థాయి సిబ్బందికి స్పంద‌న, ఇత‌ర విన‌తుల ప‌రిష్కారంలో అనుస‌రించాల్సిన విధానాలపై, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు. అవ‌సరమైతే మండ‌ల స్థాయిలో శిక్ష‌ణ స‌ద‌స్సులు ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. బియ్యం కార్డు జారీలో ఎక్కువ‌గా సాంకేతిక‌ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్న‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయ‌ని ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డి.ఎస్.ఓ.ను ఆదేశించారు.

స‌చివాల‌యాల‌కు త‌ప్ప‌కుండా రావాలి..
చాలా స‌చివాల‌యాల్లో వాలంటీర్ల హాజ‌రు శాతం చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని అంద‌రూ విధిగా హాజ‌ర‌య్యేలా ప్ర‌త్యేక స‌ర్క్యుల‌ర్ మెమో జారీ చేయాల‌ని జిల్లా ప‌రిష‌త్ సీఈవోను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. అలాగే ఎన‌ర్జీ అసిస్టెంట్స్ కూడా స‌రిగా హాజ‌రు కావ‌టం లేద‌ని త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యుత్ శాఖ అధికారుల‌కు సూచించారు. 

కార్యాల‌యాల చిరునామా బోర్డులు మార్చాలి..
జిల్లాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగిన నేప‌థ్యంలో, కొత్త రెవెన్యూ డివిజ‌న్లు ఏర్పాటైన క్ర‌మంలో వివిధ విభాగాల‌కు సంబంధించి చిరునామా బోర్డులు త‌ప్పకుండా మార్పు చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాకు అందించాల్సిన స‌మాచారం ఉంటే త్వ‌రిత‌గ‌తిన అంద‌జేయాల‌ని చెప్పారు. నీతి ఆయోగ్ సూచిక‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని సీపీవో కార్యాల‌యానికి త్వ‌రిత‌గ‌తిన అంద‌జేయాల‌ని వివిధ శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. స‌మావేశంలో డీఆర్వో ఎం. గ‌ణ‌ప‌తిరావు, వివిధ విభాగాల జిల్లాస్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-04-08 12:10:00

పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు..

శ్రీకాకుళం జిల్లాలో  పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలను  నిర్వహించాలని జిల్లా కలెక్టర్  శ్రీకేష్ లాఠకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 27 నుండి మే 9వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై  సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ -19 దృష్ట్యా మార్గదర్శకాలను అనుసరించి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.  జిల్లావ్యాప్తంగా 36,123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, ఇందులో 18,455 మంది బాలురు, 17,668 మంది బాలికలు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయం 09.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.45గం.ల వరకు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు 248  కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని, వేసవి దృష్ట్యా తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.పరీక్షల నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని, పరీక్ష ప్రశ్నపత్రాలు భద్రత, పంపిణీ పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులతో వైద్య బృందాలను ఏర్పాటుచేయాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులకు ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను మరియు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని  జిల్లా రెవెన్యూ అధికారికి ఆదేశించారు. పరీక్ష సమాధాన పత్రాలు ఎప్పటి కప్పుడు స్పీడ్ పోస్టులో పంపించేలా తపాలా శాఖాధికారులు చర్యలు చేపట్టాలని, పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరి, తిరిగి పరీక్షల అనంతరం వారి ప్రాంతాలకు చేరుకునేలా బస్సులను ఏర్పాటు చేయాలని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి జెరాక్స్,నెట్ సెంటర్లు తెరచి ఉండరాదని, పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికారాలు అనుమతించ రాదని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతీ అధికారికి అప్పగించిన భాద్యతలను సక్రమంగా నెరవేరుస్తూ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ సహాయ కమీషనర్ అలీ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎన్.అనురాధ, జిల్లాపరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, ఉప రవాణా కమీషనర్ డా.వడ్డి సుందర్, ఆర్.టి.సి ప్రజా సంబంధాల అధికారి బి.ఎల్.పి.రావు, పోలీస్, ఖజానా, తపాలా,ఏ.పి.ఈ.పి. డి.సి.ఎల్  శాఖల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-08 11:47:44

జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగంపెంచాలి..

రాష్ట్రంలో  ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని , అందుక నుగుణంగా తూర్పుగోదావరి జిల్లాలో నిర్మాణాలు  వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక  సబ్ కలెక్టర్ కార్యాలయలో హౌసింగ్, అనుబంధ  శాఖల అధికారులతో  సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత  మాట్లాడుతూ, జిల్లా పరిధిలో  లబ్దిదారులు ఇంటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేసినందున వివిధ దశల్లో ఉన్న వాటిలో తదుపరి పురోగతి సాధించాలన్నారు.  ప్రతి రోజు క్షేత్రస్థాయిలోని సిబ్బంది, అధికారులతో పురోగతి పై సమీక్ష నిర్వహించాలన్నారు. సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి ప్రగతి చూపాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఇళ్ళ నిర్మాణాలు చేసేందుకు ఆసక్తి చూపే కాంట్రాక్టర్లకి అడ్వాన్స్ ఇచ్చి, తదుపరి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసిన తర్వాత సర్దుబాటు చేసే విషయం పై సమగ్ర కార్యాచరణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రతి గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీక్ష చేస్తున్నందున, ఈ విషయంలో అలసత్వం వహించారదన్నారు. ఈ సమావేశానికి ఆర్డీవో ఎస్. మల్లిబాబు, హౌసింగ్ డిహెచ్ ఓ డి.తారక్ చంద్,   హౌసింగ్  ఈ ఈ లు  జి.సోములు, సిహెచ్. బాబూరావు,డీఈలు ఆర్ వేణు గోపాల్,   జి.పరశురామ్, కె.ఎస్.ఎన్. రెడ్డి, జి.శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

Rajahmundry

2022-04-08 11:38:52

విజయనగరం వసతి దీవెన రూ.46.21కోట్లు

విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన 2021-22  సంవత్సరానికి 2వ విడత నిధులను రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విడుదల చేసారు. ఇందులో విజయనగరం జిల్లాకు చెందిన  48,210 మంది విద్యార్థులకు గానూ 46.21 కోట్ల రూపాయలను విడుదల చేశారు.  వీరిలో బి.సి కు చెందిన విద్యార్థులు 39,205 మంది, ఎస్.సి 4,310, ఈ బిసి 2,818 మంది ఉండగా ఎస్.టి 617, కాపు 974, ముస్లింలు 246, క్రిస్టియన్ విద్యార్థులు 40 మంది ఉన్నారు. ఇందులో డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, పోలీటెక్నిక్, ఐ.టి.ఐ, మెడికల్, నర్సింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, డి ఎడ్, బి ఎడ్, బి పి ఎడ్ చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు  ఉన్నారు. 
ఈ కార్యక్రమం లో  నంద్యాల జిల్లానుండి ముఖ్యమంత్రి పాల్గొని నిధులు విడుదల చేయగా లైవ్ టెలికాస్ట్ లో  వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి  జిల్లా  కలెక్టర్ ఎ. సూర్య కుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.ఎల్.సి రఘురాజు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి,సోషల్ వెల్ఫేర్ డిడి సునీల్  రాజ్ కుమార్, డిబిసిడబ్లు కీర్తి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేసారు.

Vizianagaram

2022-04-08 11:10:27

కాకినాడ వసతి దేవెనకు రూ.44.67 కోట్లు

కాకినాడ జిల్లాలో 2021-22 సంవ‌త్స‌రానికి సంబంధించి జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన కార్య‌క్ర‌మం రెండో విడ‌తలో 46,828 మంది విద్యార్థుల‌కు రూ. 44.67 కోట్ల మేర ల‌బ్ధి చేకూరిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా తెలిపారు. శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నంద్యాల‌లో జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన ప‌థ‌కం రెండో విడ‌త ల‌బ్ధి మొత్తాన్ని విద్యార్థుల త‌ల్లుల ఖాతాలో నేరుగా జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి కాకినాడ క‌లెక్ట‌రేట్ నుంచి జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా, జెడ్‌పీ ఛైర్‌ప‌ర్స‌న్ విప్ప‌ర్తి వేణుగోపాల‌రావు, ఎమ్మెల్సీ పండుల ర‌వీంద్ర‌బాబు, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ మేయ‌ర్ సుంక‌ర శివ ప్ర‌స‌న్న‌, కుడా ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళాదీప్తి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌కు క‌లెక్ట‌ర్.. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన ల‌బ్ధికి సంబంధించిన మెగా చెక్ అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఆర్థిక స‌మ‌స్య‌లు విద్యార్థుల ఉన్న‌త చ‌దువుల‌కు అడ్డంకి కాకూడ‌ద‌నే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర‌భుత్వం జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌, వ‌స‌తి దీవెన ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తోంద‌న్నారు. జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన ద్వారా ఏటా రెండు విడ‌త‌ల్లో ఐటీఐ విద్యార్థుల‌కు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థుల‌కు రూ. 15 వేలు; డిగ్రీ, ఆపై కోర్సుల విద్యార్థుల‌కు రూ. 20 వేలు అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకొని, బాగా చ‌దువుకొని ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. విద్యార్థుల‌కు సూచించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జె.రంగ‌ల‌క్ష్మీదేవి, బీసీ సంక్షేమ అధికారి కె.మ‌యూరి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-04-08 11:05:58