1 ENS Live Breaking News

రూ.11.50 కోట్లతో నూకాంబిక ఆలయ ఆధునీకరణ

అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం పునః నిర్మాణ 11.50 కోట్ల తో పనులు చేపట్టనున్నట్టు ఆలయ పర్యవేక్షకులు, వైఎస్సీర్పీపీ నాయకులు దాడి జయవీర్ చెప్పారు.  శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం మీడియాలో ఆయన మాట్లాడారు. ఎనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయం లో భవి‌ష్యత్ తరాలు దృష్ట్యా రాతి కట్టడం తో పునః నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. మొదటి దఫా గా రూ.3.05 కోట్ల తో రాతి కట్టడంతో గర్భా లయం, అంతరాలయం, అని వెట్టి మండపం పనులు చేపడగామని, .రెండవ ధపా లో రూ.5 కోట్లతో ప్రాకార మండపం, మిగిలిన అని వెట్టి మండపం పనులు చేపట్టను న్నట్లు ఆయన తెలిపారు. మిగిలిన మండపం పనులకు శ్రీవాణి ట్రస్ట్ నుంచి రూ.1.50 కోట్లు  టిటిడి మాజీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మంజూరు చేయనున్నా రన్నారు.  రూ.2.50 కోట్ల తో నిర్మించిన తొమ్మిది అంతస్తుల రాజగోపురం ఆలయ పునః నిర్మాణ పనులు పూర్తయ్యాయిన తరువాత వినియోగం లోనికి తీసుకొస్తామ న్నారు. ప్రసాదం పథకం ద్వారా అత్యధిక నిధులు మంజూరు చేసినట్లయితే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నారు. 

దేవస్థానంలో చేపట్టే అభివృద్ధి పనులకు రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులందరూ సహకారించాలని ఆయన కోరారు. ఎపి రాష్ట్ర అర్చక ఎగ్జామ్నర్, వేద పండితులు చక్రవర్తి మాట్లాడుతూ, ఆగమశాస్త్రంకు స్థానిక సాంప్రదాయాలు జోడించి శాస్త్రోక్తంగా అమ్మవారి ఆలయాన్ని పునః నిర్మించాల్సి ఉంటుందన్నారు. ఆలయ పునః నిర్మాణ పనులు చేపట్టేందుకు ముందు బాల లయం ఏర్పాటు చేసి ఉత్సవ్ మూర్తి దర్శనాలను జరిపించాలన్నారు.  దేవాలయ ఈఓ బండారు ప్రసాద్ మాట్లాడుతూ, వేదపండితుల సలహాలు సూచనలు మేర వచ్చే సెప్టెంబరు 7 వ తేదీ నుంచి దేవాలయ పునః నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా అమ్మవారి మూలవిరాట్ దర్శనాలు నిలిపి వేసి తాత్కాలికంగా దేవస్థాన కళ్యాణ మండపం ప్రాంగణంలో అమ్మవారి బాల లయం వద్ద దర్శనం ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కాగా అమ్మవారి దేవాలయ ఆధునికీకరణ పునః నిర్మాణ పనులకు సహకరించిన రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, వైసీపీ నాయకులు దాడి రత్నాకర్, దాడి జయవీర్ తదితర ప్రజా ప్రతినిధులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు వాసు, వి. మురళీ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-27 13:48:47

మదర్ థెరిసా ఆశయలతో ముందుకు సాగాలి

మదర్ థెరిసా ఆశయ సాధనతో ముందుకు సాగాలని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి అన్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోటలో  వీరమల్ల మధు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ లోగోను జేసీ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ మదర్ థెరిసా  జయంతి రోజున ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ కష్టంలో ఉన్న వారిని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. దేశంకానీ దేశం వచ్చి సేవా దృక్పథంతో ముందుకు సాగిన మదర్ థెరిసా  దేశంలోనే అత్యున్నత పురస్కారాలు పద్మశ్రీ, భారతరత్న, నోబుల్ పీస్ ప్రైస్, జవహర్లాల్ నెహ్రూ అవార్డులు అందుకున్నారన్నారు. కోవిడ్ సమయంలో సహాయ కార్యక్రమాలు చేసిన మధు అండ్ టీమ్ సభ్యుల సేవలను కొనియాడారు. సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేసి సంస్థను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని జేసీ లావణ్య వేణి సూచించారు. కార్యక్రమానికి ముందుగా మదర్ థెరిస్సా  చిత్రపటానికి పూలమాలు వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సి వాయిస్ సీఈవో లింగుస్వామి, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ గౌరవాధ్యక్షులు తమ్మిశెట్టి సత్యనారాయణ, గౌరవ సలహాదారులు టీవీఎస్ రాజు, వీరమల్ల మధు, నీజాపరపు దుర్గాప్రసాద్ మున్నంగి శ్రీనివాస్, గోరికల వెంకటేశ్వరరావు, పండూరు రామ సాయి, వీరమల్ల నితిన్ సాయి, సౌజన్ సాయి,  నాగరాజు,  తదితరులు పాల్గొన్నారు.

Kamavarapukota

2023-08-26 17:41:12

అన్నవరం నుంచి కదిలిన స్వామివారి ప్రచార రథం

అన్నవరం శ్రీ వీరవేంకటసత్యన్నారాయణ స్వామివారి ప్రచార రథం శనివారం తూర్పురాజగోపురం నుంచి ప్రారంభం అయ్యింది. ఈరోజు నుంచి సెప్టెంబరు 25 వరకూ ధర్మ ప్రచార మాసోత్సవములలో భాగంగా గుమ్మలదోడ్డి,మారేడుమిల్లి, రంపచోడవరం, మోతిగూడెం, కుంట, చింతూరు, కూనవరం ప్రాంతాలలో పర్యటిస్తుంది. సదరు గిరజన గ్రామాలలో హిందూ ధర్మ ప్రచారం చేపడుతుంది. భక్తులకు దేవస్థానం ద్వారా ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతములు  నిర్వహించే విషయాన్ని భక్తులకు తెలియజేస్తారు. శ్రీ స్వామివారి సత్య రథాన్ని పూజలు అనంతరం జెండాఊపి ప్రారంభించారు.

Annavaram

2023-08-26 14:31:46

బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి

5 సం. నుండి 18 సం.ల బడి ఈడు పిల్లలు ప్రతి ఒక్కరూ ఎక్కడైనా బడిలోనే చదువుతూ ఉండాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి చెప్పారు. శనివారం విద్యాశాఖ అధికా రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన జి.ఈ.ఆర్. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (స్థూల నమోదు నిష్పత్తి) శత శాతంగా ఉండా లన్నారు. ఊరిలో పాఠశాలలో కాకపోతే వారు ఎక్కడ చదువుతున్నది అప్ లోడ్ చేయాలన్నారు. ఎంఈఓలు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సెక్రటరీలు క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితమైన సమాధానాన్ని  బుధవారం నాటికల్లా తెలియజేయాలన్నారు.  ఆధార్ నెంబరు మిస్ మ్యాచ్ అవ్వడం లేదా వలస వెళ్లడం మాత్రమే ఆప్షన్ గా ఉండా లన్నా రు.  ఊరిలో ఉన్న విద్యార్థుల పూర్తి సమాచారం వెల్ఫేర్ సెక్రటరీలు తప్పనిసరిగా సేకరించాలన్నారు. అదేవిధంగా అన్ని స్థాయిలలో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయాలన్నారు‌. ఈ సమావేశంలో జి ఎస్ వి ఎస్ ప్రత్యేక అధికారి మంజుల వాణి, డివైఇవో సుజాత, డీఈవో వెంకట లక్ష్మమ్మ, డిప్యూటీ డిఇఓ రవిబాబు, జిల్లాలోని ఎంఈఓ లు ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సెక్రటరీలు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-26 14:18:36

ప్రసవాలు ఎక్కువ శాతం ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలి

అనకాపల్లి జిల్లాలో జరిగే ప్రసవాలు ఎక్కువగా ప్రభుత్వ డాక్టర్ల పర్యవేక్షణలో ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలని జిల్లా కలెక్టర్ రవి పట్టణ శెట్టి వైద్యాధికారులను ఆదేశిం చారు.  శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కేసులు కూడా ఎక్కువగా ప్రభుత్వ ఆసుప త్రులలోనే చికిత్స చేయాలన్నారు.  కష్టతరమైన కాన్పుకు అవకాశం ఉండే గర్భవతులను ముందుగానే ఆసుపత్రులకు తీసుకురావాలన్నారు.  అదేవిధంగా స్టాఫ్ నర్స్ ఆశ కార్యకర్తలు వారికి ముందస్తు చికిత్సలను గురించి ముందస్తు జాగ్రత్తలను గూర్చి పూర్తి అవగాహన కలిగించాలన్నారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉండే సుఖప్రసవాలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.  తగిన చికిత్స పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. డాక్టర్లు వైద్య సిబ్బంది గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు‌. ఈ సమా వేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ హేమంత్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ శ్రవణ కుమార్, అనకాపల్లి నర్సీపట్నం జిల్లా ఆసుపత్రుల సూపరిండెంట్లు, చోడవరం నక్కపల్లి మాడుగుల ఎలమంచిలి కోటవురట్ల కె కోటపాడు ప్రాంతీయ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఇతర డాక్టర్లు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-26 14:16:01

వనదుర్గమ్మ ఆలయంలో 6రోజులు చండీయాగం

శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, దిగువన ఉన్న శ్రీ వనదుర్గమ్మఅమ్మవారి ఆలయంలో ఆరు రోజుల పాటు నిర్వహించే చండీయాగం శనివారం ప్రారంభం అయ్యింది. నిజ శ్రావణ దశమి నుండి నిజ శ్రావణ శుద్ద పూర్ణమి వరకూ ఈ యాగం నిర్వహిస్తారని ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. తొలిరోజు కార్యక్రమంలో ఈఓ దంపతులు పాల్గొన్నారు. ఉదయం గణపతి పూజా , పుణ్యహావచనం , జపములు, మందపారాధనలు, నవగ్రహ, లింగార్చన, ములా మంత్రజపములు, చండీ , నవగ్రహా, బ్రహ్మ మందపారాధనలు, నవగ్రహా, లింగార్చన , ములా మంత్ర జపములు,చండీపారాయణలు, నవావరణార్చన, సూర్యనమస్కారములు, కౌమారీ (బాల) పూజ, సువాసినీ పూజా, అమ్మవారి గర్భగుడిలో కలశస్థాపన, బయట ముఖమడపంలో నిర్వహిస్తారు. రేపటి నుంచి మంగళవారం వరకూ  ప్రతీరోజు ఉదయం పారాయణలు నిర్వహిస్తారు.  మధ్యాహ్నం గం.04.00 లకు లక్ష కుంకుమార్చన, చండీహోమము జరుగుతంది. తదుపరి మహానివేధన, నీరాజన మంత్రపుష్పములు మొదలగు కార్యక్రమములు నిర్వహించి 31వ తేది నిజ శ్ర్వన పూర్ణమి హురువరం రోజున ఉదయం 11.00 గంటలకు పూర్ణాహుతి తో యాగం ముగుస్తుంది ఈఓ వివరించారు.

Annavaram

2023-08-26 14:10:40

మానవత్వానికి ప్రతీక మదర్ థెరిస్సా

మానవత్వానికి, నిస్వార్ధ సేవకు ప్రతిరూపంగా మదర్ థెరిస్సా నిలుస్తారని రిటైర్డ్ అడిషనల్ డిఎంఅండ్ హెచ్వో డా.చింతాడ కృష్ణమోహన్ పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలో భారతరత్న మదర్ థెరిస్సా 113వ జయంతి వేడుకలు  నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహదాత కృష్ణమోహన్ మాట్లాడుతూ, విదేశాల్లో జన్మించిన మదర్ థెరిస్సా భారతదేశంలో పేదలు, నిరాశ్రయులు, నిర్భాగ్యులకు సేవలు అందించి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ప్రముఖ విద్యావేత్తలు డా.నిక్కు అప్పన్న, బి.లక్ష్మణరావు మాట్లాడుతూ, మదర్ థెరిస్సాకు శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. అభాగ్యులకు సేవలందించి నోబుల్ శాంతి బహుమతితో పాటు భారతరత్న పొందిన మహోన్నత వ్యక్తి కొన్ని సంవత్సరాలు క్రితం జిల్లాలో పర్యటించడం గొప్ప విషయమన్నారు. అవధాన పండితులు పైడి హరనాధరావు మాస్టార్ మదర్ థెరిస్సా గొప్పతనం వివరించే గేయం ఆలపించారు. తొలుత మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో గాంధీమందిర బృందం నటుకుల మోహన్, మహిబుల్లాఖాన్, నక్క శంకరరావు, పందిరి అప్పారావు, వావిలపల్లి జగన్నాథంనాయుడు, గుర్తు చిన్నారావు, తర్లాడ అప్పలనాయుడు, సువ్వారి రాజారావు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2023-08-26 06:49:47

విస్నన్నపేట భూములు అడ్డంగా దోచేస్తున్నారు..

వైఎస్సార్సీపీ నేతలు విసన్నపేట భూములను  అడ్డుగోలుగా దోచేస్తున్నారని  జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖలో శనివారం  ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో  ఆయన మాట్లాడారు. పరిపాలన రాజధాని పేరుతో విశాఖపట్నం కేంద్రంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో  అనకాపల్లి నుండి భోగాపురం వరకు కోట్లాది విలువ చేసే భూములను దోచేస్తున్నారన్నారు. అడుగడుగునా జనసేన పార్టీ భూదోపిడిని  ఎండగడుతున్న తరుణంలో  వైఎస్సీర్సీపీ నాయకులు ఎదురు దాడికి దిగుతున్నారని భూ దోపిడీ జరిగింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.  మాజీ ఇంచార్జి  విజయ్ సాయి రెడ్డికి 300ఎకరాల భూమి గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారని అన్నారు. ఈ భూమి విజయసాయి రెడ్డికి గురుదక్షిణ చెల్లించడం వల్లే   అమర్ కు  మంత్రి పదవి వచ్చిందని ఆయన తెలిపారు. ఎస్ ఆర్ షాపింగ్ మాల్  అధినేత గోపీనాథ్ రెడ్డి అమర్ కు  బినామీ అని ఆయన పేరు మీద భూమి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. దాసరి అప్పారావు, దిమ్మల అప్పారావు, పల్లి అప్పలనాయుడు, బొడ్డేటి వసంతరావు సామాన్య వ్యక్తులని  వారికి కోట్లాది రూపాయలు పెట్టి భూమి మీద కొనుగోలు చేసే స్తోమత నుంచి వచ్చిందని ప్రశ్నించారు. మంత్రి అమర్ కొండను తవ్వి ఎలుకను పట్టారని ఎద్దేవా చేస్తున్నారని  పట్టింది ఎలుకను కాదని ఏనుగునని ఆయన చెప్పారు. అక్కడ ప్రభుత్వ భూముందని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారని ఆయన చెప్పారు. దంతులూరి వారి స్థలాలు  ఆ పక్కనే ఉన్నాయని వారి భూముల్లోకి వారు వెళ్ళడానికి కూడా వైఎస్సార్సీపీ నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

 విస్సన్నపేట లో కొండలు, వాగులు, గడ్డలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. బత్తుల సుధాకర్ ఒక ప్రభుత్వ అధికారే ఉండి అవినీతికి పాల్పడుతున్నారని అని చెప్పారు. గతంలో ఈ సుధాకర్ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు. మంత్రి అమర్ విస్సన్నపేటలో తనకి ఎటువంటి భూములు లేవని చెప్తున్నారు అని భూములన్ని బినామీ పేర్ల మీద పెట్టేసారని  స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి కారు చౌకగా ఉత్తరాంధ్ర భూములను కొట్టేస్తున్నారని ఆయన తెలియజేశారు. వైసీపీ నాయకులు  పరిపాలన రాజధాని అని చెప్పి  ఉత్తరాంధ్ర మొత్తం దోచేస్తున్నారన్నారు. ఈ భూములు మంత్రి బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మంత్రి అవినీతి మంత్రాన్ని  నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయగలరని ఆయన సవాల్ విసిరారు.  తర్లవాడలో 120 ఎకరాలు భూమిని కారు చౌక  మంత్రి కొట్టేస్తున్నారు అన్నారు. ఈ భూమి విలువ 300 కోట్ల రూపాయలు ఉందని కేవలం 20 కోట్ల రూపాయలకు దోచుకుపోతున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అనకాపల్లి స్పోర్ట్స్ పర్సన్  ఎల్ గోపి, శ్రీరామదాసు గోవిందరావు  , భరణిక రాము, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-08-26 06:42:35

విశాఖ తూర్పు సమన్వయకర్తగా ఎంపి ఎంవివి

విశాఖ జిల్లా కేంద్రంలోని తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తగా ఎంపి ఎంవివి.సత్యన్నారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకూ తూర్పు సమన్వయకర్తగా విఎంఆర్డీఏ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల వ్యవహరిస్తూ వచ్చారు. ఇపుడు షడన్ గా ఎంపి ఎంవివి తెరమీదకు వచ్చారు. విశాఖలోని నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో పార్టీ కీలక మార్పులు చేస్తున్నట్టు వచ్చిన ప్రచారంలో ఈరోజు మారిన తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త పదవి చర్చనీయాంశం అవుతోంది.

Visakhapatnam

2023-08-25 15:56:53

పతనమైన బంతి..కాలువ పాలైన వందల కేజీల పూలు

నిలకడ లేని పూల ధరలతో రైతులు లబోదిబోమంటున్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా బుధ గురువారాల్లో పూల ధరలకు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం మార్కెట్లో పూలను కొనేవారు లేక కాలవలోను,చెత్తకుప్పల్లోనూ పారబోసిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అలాగని ఈ పువ్వులు పక్క ఊరు నుంచి లేదా పక్క మండలం నుంచి తీసుకొచ్చినవి కాదు. ఎక్కడో కర్నూలు,చిత్తూరు తదితర జిల్లాల నుంచి తూర్పుగోదావరి జిల్లా కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్ కు తీసుకువచ్చి బేరాలు లేక పారబోయాల్సిన దయనీయ పరిస్థితి ఎదురైంది. కొనుగోలుదారులు అధికంగా ఉండడం వల్ల బుధ, గురువారాల్లో  కేజీ 40 నుంచి రూ.70 పలకడంతో ఈ బంతి పూలను టన్నుల కొలది కడియపులంక మార్కెట్ కు తీసుకొచ్చారు. సుదూర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన ఈ బంతి పువ్వుల ధరలు గురువారం, శుక్రవారం మధ్యాహ్నం నుంచి  తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం అయ్యేసరికి కొనేవారే లేకపోయారు. దీంతో ఆ పువ్వులకు మచ్చలు వచ్చి పాడైపోవడంతో ఇలా కాలువలో పారబోయవలసి వచ్చిందని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లా నుంచి బంతిపూలను వ్యాన్లో కడియపులంక తీసుకొచ్చామని తీరా ఇక్కడ కొనే వారు లేకపోవడంతో కాలువలో పారిపోసినట్లు  నాగేశ్వర రెడ్డి అనే రైతు వాపోయారు. ఆయా జిల్లాల్లో  పూలను కోయించి వాహనంపై ఇక్కడగా తీసుకొచ్చినందుకు కోతకూలి,రవాణా ఇతర ఖర్చులు కేజీకి 25 రూపాయలు వరకూ  అవుతుందని అలా తీసుకొచ్చిన పువ్వులను ఇక్కడ పారబోయడం వల్ల చాలా నష్టం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Kadiyapulanka

2023-08-25 15:28:01

సత్యదేవుని సన్నిధిలో వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో శ్రావణ శుక్రవారం సామూహిక వరలక్ష్మీదేవి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. ఉదయం 9గంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారిని ఏర్పాటు చేసి వేదపండితుల ఆధ్వర్యంలో వ్రతాలను నిర్వహించారు. పూజలో పాల్గొన్న మహిళలు కొబ్బరికాయలు, పువ్వులు తెచ్చుకోగా, మిగిలిన పూజా సామాగ్రిని దేవస్థానం ఏర్పాటు చేసింది. ఉచితంగా నిర్వహించిన అమ్మవారి వ్రతాల్లో పాల్గొనడానికి గృహిణుల విశేషంగా తరలి వచ్చారు. వ్రతం అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Annavaram

2023-08-25 05:54:57

సత్యదేవుని నిత్యన్నాధాన ట్రస్టుకి రూ.1,01,116 విరాళం


అన్నవరంలోని శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలోని శ్రీ సత్యదేవ నిత్యఅన్నదాన ట్రస్టు కి  గుంటూ జిల్లా తాడికొండకు చెందిన  గద్దల లక్ష్మీ సుభాష్ దంపతులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు. ఈ మేరకు శుక్రవారం దేవస్థానంలోని కార్యాలయ సిబ్బంది ఆ మొత్తాన్ని చెక్కుగా అందజేశారు. ఈరోజే రోషిని, అన న్యల పేరున అన్నదానం చేయాలని కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దాతలకు ఆలసిబ్బంది స్వామివారి ప్రసాదాన్ని అందజేయ గా, వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు.

Annavaram

2023-08-25 05:48:48

ఆ వెండి వస్తువులు అకౌంట్స్ లోనే భద్రపరిచాం

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలోని న్యూ సిసి సత్రములో  రూమ్ నెంబరు-24లో కర్ణాటక నుండి వచ్చిన భక్తులు చిన్న వెండి గిన్నె, స్పూన్ మరిచిపోయి వెళ్ళిపోయారు. దీనితో వాటిని స్వాధీనం చేసుకొని సదరు వెండి గిన్నె, స్పూన్ రూమ్ నందు మరిచిపోయినట్లుగా ఆ సత్రంలో దిగిన  భక్తులకు ఆలయ సిబ్బంది ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే కర్ణాటక నుండి వచ్చి మరుల సదరు వస్తువులు తీసుకొనుటకు సుమారు నెల రోజులు పడుతుందని భక్తులు తెలియజేసినట్టు దేవస్థానం అధికారులు తెలియజేశారు.  సదరు భక్తులు కర్ణాటక నుండి వచ్చేంతవరకు వెండి వస్తువులను అకౌంట్స్ విభాగం కస్టడీ నందు భద్రపరిచినట్టు మీడియాకి విడుదల చేసిన ప్రకనటలో పేర్కొన్నారు. వారు వచ్చిన తరువాత వారికి వాటిని అందజేస్తామని తెలియజేశారు.

Annavaram

2023-08-24 17:17:14

రీసర్వే ప్రక్రియను మరింత వేగవంతం చెయ్యాలి

జగనన్న శాశ్వత భూహక్కు, మరియు భూ రక్ష ( రి సర్వే) లో భాగంగా మ్యుటేషన్ల పనులు  వేగవంతం చేయాలని సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ ఆదేశిం చారు. జగనన్న శాశ్వత భూహక్కు, మరియు భూ రక్ష ( రి సర్వే) ప్రగతిపై  జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో విజయవాడ నుంచి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా  సిసిఎల్ఎ  స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మాట్లాడుతూ మ్యుటేషన్లు, పట్టాలకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. పలు అంశాలపై ఆయన చర్చించారు.ఫైనల్ ROR అయిన గ్రామాల్లో 100% స్టోన్ ప్లాన్టేషన్ పూర్తి చేయాలన్నారు. భూ రీసర్వే సందర్భంగా క్షేత్రస్థా యిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలన్నారు. వివాదాలు లేని భూరికార్డుల రూపకల్పనకు ప్రభుత్వం ఆధునిక పరిజ్ఞానంతో భూ సర్వే పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. భూ హక్కు పత్రాలు ముద్రణ కోసం మోడ్యూల్ లో ఉన్న క్లరికల్ కరక్షన్స్ అన్ని క్లియర్ చేయాలన్నారు. నిర్దేశి త గడువులోగా అధికారులందరూ రీసర్వే కింద అన్ని రకాల ప్రక్రియలను సమన్వయంతో పనిచేసి   పూర్తి చేయాలన్నారు.  ఈ వీడియో కాన్పరెన్స్ లో జిల్లా నుండి  జా యింట్ కలెక్టర్ కే.ఎస్. విశ్వనాథన్ ,  తదితర  అధికారులు పాల్గొన్నారు.
 

Visakhapatnam

2023-08-24 15:24:12

చంద్రయాన్-3 విజయవంతంపై మంత్రి అమర్నాథ్ హర్షం

చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసకోర్చి ఇస్రో శాస్త్రవేత్తలు పెద్ద లక్ష్యాన్ని సాధించగలిగారని అన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద  అడుగు పెట్టేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు ప్రయత్నించినా సాధించలేని విజయాన్ని భారత శాస్త్రవేత్తలు సాధించి సరికొత్త అధ్యాయానికి తెర తీశారని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఈ విజయం భారతీయులందరికీ అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసి, వాటిలో విజయం సాధించి ప్రపంచ దేశాలలోని భారతదేశం  అగ్రస్థానంలో  నిలవాలన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రపంచ శాస్త్రవేత్తలకు ఇస్రో శాస్త్రవేత్తలు మార్గదర్శకులుగా నిలిచే రోజు అతి దగ్గరలోనే ఉందని మంత్రి అమర్నాథ్ అన్నారు.

Anakapalle

2023-08-23 14:24:14