1 ENS Live Breaking News

దిశ యాప్ తో మహిళలకు స్వీయరక్షణ..

మహిళలంతా దిశ యాప్ తమ ఫోన్లలో ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఆపద సమయంలో స్వీయ రక్షణ పొందవచ్చునని శంకవరం వీఆర్వో సీతారామ్, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, జెఏ రమణమూర్తిలు  పేర్కొన్నారు. మంగళవారం శంఖవరం మండల కేంద్రంలోని సచివాలయంలో గ్రామ వాలంటీర్లతో కలిసి స్థానిక మహిళల ఫోన్లలో దిశ యాప్ ఇనిస్టాల్ చేయించారు. ఈ సందర్భంగా మహిళాపోలీస్ జిఎన్ఎస్ శిరీష మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశయాప్ ను ప్రత్యేకంగా రూపొందించిందన్నారు. దీనిని అత్యవసర సమయంలో వినియోగించడం ద్వారా పోలీసుల నుంచి సహాయ సహకారాలు అందుతాయన్నారు. ప్రతీ ఒక్క మహిళ సెల్ ఫోనులో దిశ యాప్ పెట్టుకోవడం ద్వారా దుండగల నుంచి రక్షించుకోవడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ యాప్ మహిళల ఫోన్లలో ఉంటే ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లేంత దైర్యం కూడా వస్తుందన్నారు. అనంతరం దిశ యాప్ యొక్క ప్రాముఖ్యత, దీనిని ఏ విధంగా వినియోగించాలో కూడా మహిళలకు అవగాహన కల్పించారు. కాలేజీ వెళ్లే యువతులే కాకుండా ఇంట్లో ఉండే మహిళలు కూడా అత్యవసర సమయంలో దీనిని ఉపయోగించవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యర్తలతోపాటు, ఆశ వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2021-06-29 05:40:38

2నెలలుగా బీఎస్ఎన్ఎల్ లో జీతాల్లేవ్..

భారతదేశంలోని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు రెండు నెలలుగా మంజూరు కాని జీతాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ బిఎంఎస్,బిటీఈయూ జాతీయ అధ్యక్ష, కార్యదర్శిలు వివిఎస్ సత్యన్నారాయణ , ఆర్సీ పాండేలు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా వారు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ లో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ప్రాణాలకు తెగింగి విధులు నిర్వహించారన్నారు. ఆ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారని వివరించారు. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదన్నారు. ఇపుడు రెండు నెలల నుంచి జీతాలు కూడా అందలేదని చెప్పారు. కేంద్రం తక్షణమే స్పందించి పెండింగ్ లో వున్న రెండు నెలల జీతాలను తక్షణమే మంజూరు చేసి ఉద్యోగులను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు. అదేవిధంగా వివిధ పద్దుల కింద రావాల్సిన 30వేల కోట్ల ను కూడా విడుదల చేయాలన్నారు. కేంద్రం బిఎస్ఎన్ఎల్ కి రావాల్సిన మొత్తాలను సకాలంలో విడుదల చేయకపోవుడంతో ఉద్యోగులతోపాటు, సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా కాంట్రాక్టు సిబ్బంది ఉద్యోగా రెగ్యులైజేషన్, ఇతర నియామకాలతో పాటు న్యాయపరమైన డిమాండ్లును కూడా మంత్రి ద్రుష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లినట్టు వీరు వివరించారు. 

Visakhapatnam

2021-06-29 02:27:14

కొత్త ప్రెస్ అక్రిడిటేషన్ల ప్రక్రియ షురూ..

రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడానికి, పాత్రికేయుల సౌలభ్యం కోసం ఆన్ లైన్ వెబ్ సైట్ www.ipr.ap.gov.in ను మరొక మారు అందుబాటులో ఉంచినట్టు  ష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నాటికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులు అదే లాగిన్ ఐడీ ఉపయోగించి, తమ దరఖాస్తులకు అవసరమైన సవరణలు చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. గతంలో తమ దరఖాస్తుతో పాటు సమర్పించని  డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు ప్రస్తుతం అప్ లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించడమైనదని వెల్లడించారు. గత దరఖాస్తులలో అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాలను పీడీఎఫ్ ఫార్మాట్ లో అప్ లోడ్ చేయనందున, వారు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో లాగిన్ లో కనపడటం లేదని, కావున  అభ్యర్థులు విధిగా వారు సమర్పించాల్సిన అన్ని పత్రాలను పీడీఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్  లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.  అలాగే, గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా ప్రస్తుతం మీడియా సంస్థ మారి ఉంటే, అటువంటి వారు కొత్తగా, మరల  దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సంబంధిత యాజమాన్యాలు వారి వారి సంస్థలలో పనిచేస్తున్న పాత్రికేయులకు సంబంధించిన అక్రిడిటేషన్ కార్డులు జారీచేయడానికి సిఫార్సు లేఖలను మార్పులు, చేర్పులు ఉంటే సరిచేసి, సవరించిన లేఖలను తిరిగి అప్ లోడ్ చేయాలన్నారు. అలాగే తాజాగా సిఫార్సు లేఖలను రాష్ట్రస్థాయిలో కమిషనర్ సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో మరియు జిల్లాస్థాయిలో సంబంధిత జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయాలలో సమర్పించాలని తెలిపారు. 
ఈ నేపథ్యంలో ఇదివరకు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులు, యాజమాన్యాలు వారికి సంబంధించిన డేటాను మార్పులు చేర్పులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకొనేందుకు వీలుగా వైబ్ సైట్ ను తేదీ.04.07.2021 వరకు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని పాత్రికేయులు, మీడియా సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని, పూర్తిస్థాయిలో ఆన్ లైన్ ద్వారా అప్ లోడ్ చేయనివారు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను అప్ లోడ్ చేసి వాటి కాపీలను సంబంధిత శాఖ కార్యాలయములలో అందజేయాల్సిందిగా కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి సూచించారు.

Tadepalle

2021-06-28 14:17:11

పండుగలా గ్రుహనిర్మాణ మేళా..

ఆర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి సొంతింటి కళ సాకారం చేసేందుకు ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు.  జూలై 1 న నిర్వహించనున్న మెగా  గ్రౌండింగ్ మేళాకు ముందస్తు ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో హౌసింగ్ లేఅవుట్ ను సోమవారం ప్రోజెక్ట్ అధికారి సందర్శించారు, ఈ సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్షించి సూచనలు అందించారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ జూలై 1న చేపట్టనున్న మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాలో మండలంలో మంజూరైన 55 లేఅవుట్లలో, సొంత స్థలాలలో 207  మొత్తం 3165 మంజూరు కాగా అందులో 735 గ్రౌండింగ్ పూర్తి అయ్యాయని మిగిలిన ఇళ్లు జూలై 1న గ్రౌండింగ్  అయ్యేలా ఆన్ని చర్యలు చేపట్టాలని, మెగా  గ్రౌండింగ్ మేళా ఇళ్లు నిర్మాణానికి ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని, మెగా మేళా ఒక పండగ వాతావరణంలో చేపట్టాలని ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మండల ప్రత్యేక అధికారి, బి.సి కార్పొరేషన్ ఇ.డి నాగరాణి, ఎం.పి.డి.ఓ కృష్ణా రావు , హౌసింగ్ డి.ఇ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2021-06-28 13:11:38

గృహ నిర్మాణాలు గ్రౌండింగ్ జరగాలి..

పేదలకు కేటాయించిన లే అవుట్ల లో గృహ నిర్మాణాలు గ్రౌండింగ్ అయ్యేటట్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారులు, తాసిల్దారు ఎంపీడి ఒలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే గృహ నిర్మాణాలు పూర్తయ్యేందుకు  ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు. గ్రామ సచివాలయం పరిధిలో సిబ్బందితో సమావేశం నిర్వహించి ఇళ్ళ లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ గ్రౌండింగ్ చేసుకునేటట్లు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో  ఇన్ ఛార్జ్ ఆర్ డి ఓ సీతారామమూర్తి, మండల ప్రత్యేక అధికారి డా, మంచు కరుణాకర్ రావు, తాసిల్దార్ ఎస్. గణపతి, ఎంపీడీవో పి. నారాయణ మూర్తి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ .నీలయ్య, సర్వేయర్ సుభాష్, తదితరులు పాల్గొన్నారు.

Tekkali

2021-06-27 16:47:00

గ్రామ సచివాలయ మహిళా పోలీసు ప్రమోషన్ పై తీవ్ర వ్యతిరేకత..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శిలను జీఓఎంఎస్ నెంబరు 59తో వారిని కూడా సాధారణ పోలీసులు(కానిస్టేబుల్స్ తో సమానం) గా మార్చింది. ఇంత వరకూ బాగానే ఉన్నా వీరికి ఇన్ సర్వీసులో వచ్చే ప్రమోషన్ లో విషయంలో రాష్ట్రంలోని మహిళా పోలీసులంతా ఆదిలోనే పెదవి విరిచేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అగ్రికల్చర్, హార్టికల్చర్ డిప్లమా విద్యార్హతో ఉద్యోగంలోకి చేరిన వారికి సైతం ఇన్ సర్వీసులో ప్రభుత్వ ఖర్చుతో యూనివర్శిటీల్లో డిగ్రీలు చదివించి ఆపై వెంటనే మండల  అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్లుగా  ప్రమోషన్లు ఇస్తోందని.. అలాంటిది తాము వస్తూ వస్తూనే డిగ్రీ, ఆపై విద్యార్హతలతో మహిళా పోలీసు ఉద్యోగాల్లోకి వచ్చినా సాధారణ కానిస్టేబుల్స్ మాదిరిగానే తమను ప్రభుత్వం గుర్తించడం ఏం బాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సాధారణ పోలీసుల విద్యార్హత ఇంటర్ ఉన్నావారికి హెడ్ కానిస్టేబుల్, డిగ్రీ, అంతకంటే అర్హతున్నవారికి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషనేనా అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ అర్హతున్న తమకు డిపార్ట్ మెంటల్ టెస్టులు పెట్టి కనీసం ఎస్ఐ ప్రమోషన్ అయినా ఇవ్వాలనే వాదనను బలంగా వినిపిస్తున్నారు. రాష్ట్రంలోని మహిళా పోలీసులంతా డిగ్రీ విద్యార్హతతో వున్నవారే. ఇందులో అతి తక్కువ మంది మాత్రమే 45 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఉన్నారు. మిగిలిన వారంతా 30ఏళ్ల లోపు వారే ఉన్నారు. దీనితో తమకు వయస్సు, విద్యార్హత రెండూ ఉన్నాయని, దిశ యాక్టు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలంటే మహిళా ఎస్ఐల అవసరం భివష్యత్తులో చాలా వుంటుందని, అదేదో తమకు ముందే బరోసా కల్పిస్తే బావుంటుందని చెబుతున్నారు.  అలాకాకుండా డిగ్రీ చదువుకున్నవీరికి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ రావాలంటే కనీసం ఐదు నుంచి ఏడేళ్ల సమయం పడుతుంది. అక్కడి నుంచి ఏఎస్ఐ కావాలంటే మరో ఏడేళ్లు సమయం పడుతుంది. ఆపై ఎస్ఐగా ప్రమోషన్ రావాలంటే తామంతా ఆ ప్రమోషన్ రాకుండానే రిటైర్ అయిపోతామని..ప్రభుత్వ విధానం తమకు ఏ మాత్రం సమంజసంగా లేదని చెబుతున్నారు.  వుందని తమకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించైనా..లేదంటే ఇన్ సర్వీసులో ఎస్ఐ నోటిఫికేషన్ తీసే సమయంలో ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం గ్రామసచివాలయాల్లో పేరుకి మహిళా పోలీస్ ఉద్యోగమే అయినా.. ఐసిడిఎస్, హెల్త్, విలేజ్ లా అండ్ ఆర్డర్, కార్యాలయ విధులు, డిజిటల్ అసిస్టెంట్లకు సహాయం, విలేజ్ సర్వేలు, ఇలా సుమారు 10 నుంచి 15 ప్రభుత్వ శాఖల పనులు ప్రభుత్వం చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలుత గ్రామ, వార్డు సచివాలయాల్లో విధుల్లోకి చేరినపుడు అత్యధిక సమయం ఐసిడిఎస్ శాఖకు వెచ్చించడంతో తమకి ప్రమోషన్లు కూడా ఇదే శాఖలో వస్తాయని భావించామని, అయితే ప్రభుత్వం తమకు హోం డిపార్ట్ మెంట్ ద్వారా అపాయింట్ మెంట్లు ఇవ్వడంతో ఇపుడు అదేశాఖలో తమను సాధారణ పోలీసులుగా మార్చారని చెబుతున్నారు. ఈ విషయంలో చాలా మంది మహిళా పోలీలకు పోలీస్ డ్రెస్ వేసుకునే ఉద్యోగం నచ్చలేదని పెదవి విరుస్తున్నారు. ఎన్నో ఆశలతో విధుల్లోకి చేరిన తమని  ప్రభుత్వం ప్రమోషన్ విషయంలో చాలా నిరాశకి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమ ఉద్యోగ సంఘాల గ్రూపుల్లో ప్రతీరోజూ గంటల తరబడి డిబేట్లు జరగడం కూడా ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పటికే ఒక శాఖ ఉద్యోగమని చెప్పి సుమారు 10 ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు చేయిస్తుండటంతో చాలా మంది తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి అంతకంటే మంచిగా ఉండి, జీతం వచ్చే ఉద్యోగాలకు మహిళా పోలీసులు వెళ్లిపోతున్నారు. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వున్న 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిస్థాయిలో మహిళా పోలీసుల ఉద్యోగాలు నేటికీ భర్తీ కాలేదు. భర్తీఅయిన చాలా చోట్లు చాలా మంది తమ ఉద్యోగాలను వదిలేసి వెళ్లిపోయారు. గ్రామ, వార్డు మహిళా సంరక్షా కార్యదర్శిలుగా వున్న వీరిని ప్రభుత్వం సాధారణ పోలీసులుగా మార్చినా వీరిలో సుమారు 60శాతానికి పైగా ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. 90శాతం ఉద్యోగులు ప్రమోషన్ విషయంలో కూడా ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ విద్యార్హతులు, ప్రమోషన్లపై పునరాలోచించాలని కోరుతున్నారు. మరికొందరైతే..ఈ తరహా ఉద్యోగాలు తాము చేయలేమని..దీనికంటే మంచి ఉద్యోగాలొస్తే ఏమాత్రం ఉపేక్షించకుండా బయటకు వెళ్లిపోతామని సంకేతాలు ఇస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే..రాష్ట్రప్రభుత్వంలో మహిళా పోలీసుల ద్వారా అందే సుమారు 10ప్రభుత్వశాఖకి అందించే సహాయం ఆగిపోతుంది. ప్రభుత్వ ప్రతిష్టకు కూడా బంగం వాటిల్లుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటుందా..లేదంటే ఉన్నోళ్లు ఉంటారు..పోయినోళ్లు పోతారు అని ధీమా ఉండిపోతుందా అనేది వేచిచూడాలి..!

Tadepalli

2021-06-27 02:23:09

గిరిజనులకు మంచి వైద్యసేవలు అందాలి..

రాష్ట్ర ప్రభుత్వం విద్య , వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు విడుదల చేస్తుందని పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల కృష్ణ తెలిపారు. శనివారం జిల్లా ఏరియా ఆసుపత్రిని పీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం కోసం అధిక నిధులు ఖర్చు పెడుతున్నట్లు పిఓ తెలిపారు. గిరిజనుల కు వైద్య సేవలు సకాలంలో అందించాలని ,ఏ ఒక్కరికీ వైద్యం అందలేదని తమకు ఫిర్యాదు అందకూడదని పిఓ స్పష్టం చేశారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కి వైద్య సిబ్బందిని పంపించి మలేరియా,డెంగ్యూ జ్వరాలు ప్రబలకుండా నిత్యం పర్యవేక్షణలో వుండాలని ఆయన తెలిపారు. రాబోయేది వర్షాకాలం జాగ్రత్త వహించాలని ప్రతీ గ్రామానికి వెళ్లి స్ప్రేయింగ్ చేయించాలని మలేరియా అధికారులను ఆదేశించారు. అంతకుముందు పిఓ ఆసుపత్రి లో ఉన్న  పరికరాలు,మందులు వున్న  గదులను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డులో వున్న రోగులను పరమార్శించి ఏఏవ్యాధులకొరకు వైద్యం తీసుకుంటున్నారో పేషంట్లను అడగి తెలుసుకున్నారు. అక్కడ విధులకు హాజరైన వైద్యులతో మాట్లాడి విధులలో నిర్లక్ష్యం చేయకూడదని వైద్యసేవలు సకాలంలో అందించాలని ప్రజలు వైద్య నిమిత్తం ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని ఆయన అన్నారు. అనంతరం ప్రాజెక్టు అధికారి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి ఈరోజు ఎంతమంది విధులకు హాజరయ్యారో వివరాలు తెలుసుకున్నారు.

Paderu

2021-06-26 11:44:16

ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చేయాలి..

కాకినాడ పట్టణ పరిధిలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు పథకం కింద ఇల్ల స్థలం మంజూరైన ప్రతి  ఒక్కరు  ఇల్లు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శనివారం కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో భాస్కర్ నగర్ 4వ వార్డు (బి), సీతారామనగర్ 9 వార్డు (ఏ) పట్టణ సచివాలయలను కాకినాడ మున్సిపల్ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్  గృహ నిర్మాణాల పురోగతి, దిశా యాప్, 90 ఈ రోజుల్లో ఇళ్ల స్థలాలు మంజూరు, అందిస్తున్న సేవల వివరాలు  సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి పేదలకు ఇల్ల స్థలాలు ఇచ్చేందుకు మంచి లేఔవుట్లును సిద్ధం చేసిందన్నారు. ఇళ్ల స్థలాలు మంజూరు అయిన ప్రతి ఒక్క లబ్ధిదారుని చేత గృహ నిర్మాణం చేపట్టించి గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. వార్డు సచివాలయంలో ఉన్న మహిళా పోలీస్  దిశా చట్టం, దిశ యాప్ పై అవగాహన పెంపొందించుకోని, వార్డు పరిధిలో ఉన్న మహిళలు, యువతిలందరూ తమ మొబైల్ ఫోన్లలో దిశా యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా చైతన్యపరచాలన్నారు. ఆకతాయితనంగా చిన్నచిన్న వాటితోపాటు మహిళలు, పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై దిశా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే విధంగా చూడాలన్నారు. వివిధ సేవల నిమిత్తం వార్డు సచివాలయానికి వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పూర్తిచేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట  నగరపాలక సంస్థ ఏడిసి సిహెచ్.నాగనరసింహారావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు  పాల్గొన్నారు.

Kakinada

2021-06-26 11:35:19

సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్..

ప్రజలకోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో అందించడానికి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ సెంటర్లను ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు  జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. భవన నిర్మాణ పక్షోత్సవాలు లో భాగంగా శనివారం సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో గ్రామ సచివాలయం 1 మరియు 2  జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. సచివాలయం 1 కి సంబంధించి నోటీస్ బోర్డ్ లో పెట్టిన లబ్ధిదారులు లిస్టు లను పరిశీలించారు అలాగే హాజరు బయోమెట్రిక్ లేకపోవడంపై ఆరా తీయగా కరోనా వల్ల  హాజరు పుస్తకం ద్వారా  తీసుకుంటున్నట్టు తెలిపారు. సెక్రెటరీ లేకపోవడం గమనించి కలెక్టర్ సిబ్బందిని అడగ్గా సెక్రెటరీ సెలవు పెట్టి వెళ్లారని తెలిపారు. ఉండూరు గ్రామంలో ఖాళీ స్థలాల గురించి తాసిల్దార్ జితేంద్ర ను కలెక్టర్ ప్రశ్నించగా బ్రహ్మానంద పురం లో ఖాళీ స్థలాలు ఉన్నాయి అని లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే అక్కడ కేటాయిస్తున్నట్లు కలెక్టర్ కు వివరించారు. అనంతరం సచివాలయ 2 ను పరిశీలించారు అక్కడ నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాన్ని, వెల్ సెంటర్ ను, సచివాలయ భవనాల పనులను పరిశీలిం చారు. పనులు వేగవంతం చేసి త్వరలోనే  భవనాలు ప్రారంభించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Samarlakota

2021-06-26 09:08:16

విధినిర్వహణలో అలక్ష్యం వహిస్తే చర్యలు..

గ్రామసచివాలయ సిబ్బంది విధినిర్వహణలో అలక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సబ్‌ కలెక్టరు ఇలాక్కియా తీవ్రంగా హెచ్చరించారు. శుక్రవారం కోరుకొండ మండలంలోని కొటికేశవరం, శ్రీరంగపట్నం 1,2,  గ్రామసచివాలయాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ నిర్వహిచారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సచివాలయాల్లో సర్వీసు రిక్వస్టులు పరిష్కార సరళిలో చాలా జాప్యాలున్నాయన్నారు. ప్రజలకు సచివాలయాల ద్వారా సేవలు సత్వరమే అందించాలన్నారు. దరఖాస్తులను పెండింగ్ ఉంచడం,పరిష్కరించే క్రమం సక్రమంగా లేవన్నారు.  ప్రభుత్వ ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి అందించడంలో మరింత చురుగ్గా వ్యవహరించాలన్నారు. ఎప్పటి కప్పుడు మండల అధికారులు కూడా సచివాలయాలను సందర్శించి ఇక్కడ సేవలు ప్రజలకు ఏవిధంగా అందుతున్నాయో గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాహసిల్దారు పాపారావు, ఎంపిడిఓ నరేష్‌కుమార్‌ తదితరులు పాల్గోన్నారు. 

2021-06-25 17:18:18

భ‌వ‌న నిర్మాణాలు త్వ‌ర‌గా పూర్తిచేయాలి..

ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ నిర్మాణాలను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు అధికారుల‌ను ఆదేశించారు. ఆయ‌న గ‌జ‌ప‌తిన‌గ‌రం మండ‌లంలో శుక్ర‌వారం విస్తృతంగా ప‌ర్య‌టించి, ప‌లు ప్ర‌భుత్వ‌ భ‌వ‌నాల నిర్మాణాల‌ను త‌నిఖీ చేశారు. ముచ్చెర్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు భ‌రోసా కేంద్రాన్ని, డాక్ట‌ర్ వైఎస్ఆర్ విలేజ్ క్లీనిక్  భ‌వ‌నాన్ని త‌నిఖీ చేశారు. నిర్మాణ ప‌నులు దాదాపు పూర్తి కావ‌డంతో, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌పెయింటింగ్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తిచేసి, ప్రారంభానికి సిద్దం చేయాల‌ని ఆదేశించారు. కెంగువ గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు భ‌రోసా కేంద్రాన్ని, హెల్త్ క్లీనిక్‌ను ప‌రిశీలించారు. ఈ రెండు భ‌వ‌నాలు శ్లాబులు పూర్తి చేసి, ప్ర‌స్తుతం ప్లాస్ట‌రింగ్ ప‌నులు జ‌రుగుతుండ‌టంతో, మిగిలిన ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని సూచించారు. తుమ్మికాప‌ల్లి గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రామ స‌చివాల‌యం, రైతు భ‌రోసా కేంద్రం భ‌వ‌నాల‌ను త‌నిఖీ చేశారు. విలేజ్ క్లీనిక్ నిర్మాణం జ‌రుగుతుండ‌టంతో, దానిని కూడా త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎంపిడిఓ కిశోర్ కుమార్‌, ఇత‌ర ఇంజ‌నీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Gajapatinagaram

2021-06-25 14:08:55

మోడల్ టౌన్ షిప్ గా జగనన్న కాలనీ..

గుంక‌లాం లేఅవుట్‌లోని జ‌గ‌న‌న్న కాల‌నీని మోడ‌ల్ టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దుతామ‌ని విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణానికి ఆయ‌న శుక్ర‌వారం శంకుస్థాప‌న చేశారు. ల‌బ్దిదారుల‌ను చైత‌న్య‌వంతం చేసి, త్వ‌ర‌గా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను కోరారు.  ఈ సంద‌ర్భంగా ఎంఎల్ఏ  మాట్లాడుతూ, ప్ర‌తీ పేద‌వాడికీ సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని, దీనిలో భాగంగానే రాష్ట్రంలో సుమారు 30 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి శ్రీ‌కారం చుట్టార‌ని చెప్పారు.  గుంక‌లాం లేఅవుట్‌లో డిసెంబ‌రు 30న గౌర‌వ ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా ప‌ట్టాలు పంపిణీ ప్రారంభించడం  అదృష్టంగా పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేవుట్‌గా సుమారు 397 ఎక‌రాల్లో, 12,302 మందికి ప‌ట్టాలు పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కాల‌నీలో అన్ని మౌలిక స‌దుపాయాల‌నూ క‌ల్పించి, మోడ‌ల్ టౌన్ షిప్‌గా అభివృద్ది చేస్తామ‌న్నారు.  ఈ లేఅవుట్‌లో మొత్తం 129 బోర్ల‌ను త‌వ్వించి, ఇళ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన నీటిని స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు. రెండుమూడు రోజుల్లో విద్యుత్ సదుపాయం క‌ల్పించి, మోటార్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు.  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి హ‌యాంలో 2004-09 మ‌ధ్య తాను శాస‌న‌స‌భ్యునిగా ఉన్న స‌మ‌యంలో, వైఎస్ఆర్ న‌గ‌ర్‌లో 3,200 ఇళ్ల‌తో లేఅవుట్‌ను అభివృద్ది చేశామ‌ని చెప్పారు. గుంక‌లాం లేఅవుట్ లోని జ‌గ‌న‌న్న కాల‌నీ కూడా భ‌విష్య‌త్తులో ఒక పెద్ద న‌గ‌రంగా అభివృద్ది చెందుతుంద‌ని, దీనికోసం ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తామ‌ని చెప్పారు. ఇవి కాకుండా కొండ‌క‌ర‌కాం, సారిక‌, జ‌మ్మునారాయ‌ణ‌పురం వ‌ద్ద కూడా జ‌గ‌న‌న్న‌ కాల‌నీల‌ను అభివృధ్ది చేస్తామ‌ని, నియోజ‌క‌వ‌ర్గం మొత్తంమీద సుమారు 20వేల ఇళ్లు నిర్మించ‌నున్నామ‌ని తెలిపారు. ఉప ముఖ్య‌మంత్రి పుష్ప‌శ్రీ‌వాణి, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా ఇళ్ల నిర్మాణానికి సంపూర్ణ స‌హ‌కారాన్ని అందిస్తున్నార‌ని, ప్ర‌భుత్వ ప‌రంగా ఏవిధ‌మైన స‌హ‌కారం కావాల‌న్నా, అందించేందుకు వారు సంసిద్దంగా ఉన్నార‌ని స్వామి తెలిపారు.
               ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి,  కార్పొరేట‌ర్లు కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, ఎస్‌వివి రాజేష్‌, హౌసింగ్ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌ర‌రావు, హౌసింగ్ డిఇ సిహెచ్ శ్రీ‌నివాస‌రావు, ఏఈలు కె.శ్రీ‌నివాస‌రావు, రామ్‌ప్ర‌సాద్‌, గోపాల‌కృష్ణ‌, ఇత‌ర అధికారులు, ఆశ‌పు వేణు, మ‌ధు త‌దిత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.

గుంకలాం

2021-06-25 13:57:42

Vijayawada

2021-06-25 13:03:49

కరోనా టీకాకి ప్రజలు ముందుకి రావాలి..

కరోనా వైరస్ నియంత్రణకి ప్రతీ ఒక్కరూ సహకరించి టీకా వేయించుకోవడానికి ముందుకి రావాలని శంఖవరం ఈఓపీఆర్డీ కెవివిఎస్ విశ్వనాధ్, పంచాయతీ కార్యదర్శి రామచంద్రమూర్తి(రాంబాబు) పిలుపునిచ్చారు. గురువారం ప్రభుత్వ హైస్కూలులో ఏర్పాటు చేసిన శాస్వత కోవిడ్ వేక్సిన్ కేంద్రంలోని టీకా పంపిణీ కార్యక్రమాన్ని వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, ప్రభుత్వం 5ఏళ్లలోపు పిల్లలున్న తల్లులకు కోవిడ్ వేక్సినేషన్ లో ప్రధాన్యత ఇస్తుందన్నారు. థర్ఢ్ వేవ్ ని ద్రుష్టిలో పెట్టుకొని పిల్లల తల్లులందరికీ వేక్సిన్ వేస్తున్నామన్నారు. అదేవిధంగా మొదటి డోసు తీసుకుని 84 రోజులు పూర్తయిన వారికి రెండో డోసు కూడా వేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ప్రజలు అపోహలు వీడి ప్రభుత్వ నిభందనల మేరకు వేక్సినేషన్ వేయించుకోవాలన్నారు. పీహెచ్సీవైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ మాట్లాడుతూ, కరోనా నిబంధనలు అనుసరించి వేక్సినేషన్ చేపడుతున్నామన్నారు.  ఈరోజు సెషన్ లో 200 మందికి కోవిడ్ టీకాలు వేసినట్టు డాక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం2,3 కార్యదర్శి శంకరాచార్యులు, సత్య, జూనియర్ అసిస్టెంట్ రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-06-24 17:19:47