1 ENS Live Breaking News

గిరి మహిళలు ఆర్దిక సాధికారిత సాధించాలి..

ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను సద్వినియోగం చేసుకుని గిరిజన మహిళలు ఆర్దిక సాధికారిత సాధించాలని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి గోపాల క్రిష్ణ రోణంకి అన్నారు . శనివారం పెదబయలు మండలం పెదకోడాపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడుతూ ఏజెన్సీలో 46 హట్ బజారులను నిర్మిస్తున్నామని చెప్పారు. వనధన్ వికాస కేంద్రం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులకు అదనపు విలువలను జోడించి విక్రయించాలని సూచించారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూములను అభివృధ్ది చేసుకోవాలని అన్నారు. ఈ నెల 8 వతేదీ నుంచి మొబైల్ ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని, ఆధార్ నమోదు చేసుకోవాలన్నారు. ఆధార్ కార్డు ఉండి వాటిలో తప్పులుంటే సవరించు కోవాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయ భవనాలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లీనిక్‌ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసే విధంగా పంచాయతీ సర్పంచులు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. పెదకోడాపల్లి సర్పంచ్ సెగ్గె వెంకట రమణ గ్రామంలోని తాగునీటి సదుపాయాలు, పెద్దగొంది గ్రామంలో 35 మంది విద్యార్దులు ఉన్నారని పాఠశాల భవనం, గ్రామానికి వీధిదీపాలు వేయించాలని కోరగా ప్రాజెక్టు అధికారి సానుకూలంగా స్పందించారు. వీధిదీపాలను రేపటిలోగా ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో మినీ అంగన్వాడీ మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఋఅనంతరం హట్ బజారు నిర్మాణానికి కేటాయించిన స్దలాన్ని పరిశీలించారు. నిర్మాణాలకు అవసరమైన అనుమతులు జారీ చేస్తామన్నారు. పెదకోడాపల్లి గ్రామంలో నిర్మిస్తున్న గ్రామ సచివాలయం భవనం రైతు భరోసా కేంద్రం నిర్మాణాలను తనిఖీ చేసారు. ఈనెల 8 వ తేదీ నాటికి రైతు భరోసా కేంద్రం నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఎపిడి మురళి, ఏరియా కో ఆర్డినేటర్ నీలా చలం తదితరులు పాల్గొన్నారు.

Pedabayalu

2021-07-03 11:13:02

ఇవిఎం గొడౌన్ల‌ను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌..

విజయనగరం జిల్లాలోని నెల్లిమ‌ర్ల‌లోని ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్లు (ఇవిఎం) గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ శుక్రవారం  త‌నిఖీ చేశారు. గోదాముల‌కు వేసిన సీళ్ల‌ను ప‌రిశీలించారు. అక్క‌డి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. అనంత‌రం గోదాముల‌ను తెరిచి, ఇవిఎంల‌ను త‌నిఖీ చేసి, సీళ్లు వేశారు. సమీపంలోని పాత డ్వామా కార్యాలయంలో ఉన్న ఇవిఎంలను, ఇటీవలే ఖాళీ చేసిన ప్రస్తుత గోదాములోకి మార్చాలని ఆదేశించారు.  ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, నెల్లిమ‌ర్ల తాశీల్దార్ గొట్పాపు రాము, డిప్యుటీ తాశీల్దార్ సూర్యాకాంతం, క‌లెక్టరేట్ హెచ్ సెక్ష‌న్ సూప‌రింటిండెంట్ పి.రామ‌కృష్ణ‌, నెల్లిమర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ సముద్రపు రామారావు,  సిపిఐ ప్ర‌తినిధి తాలాడ స‌న్నిబాబు, ఇత‌ర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Nellimarla

2021-07-02 14:12:48

ఐసీడిఎస్ పై మహిళా పోలీసులకి శిక్షణ..

ఐసీడిఎస్ కార్యకాలపాలపై మహిళా పోలీసులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలని సూపర్ వైజర్ వి.అరుణశ్రీ పేర్కొన్నారు. శుక్రవారం శంఖవరం మండల కేంద్రంలోని 7బ్యాచ్ మహిళా పోలీసులకు మహిళా శిసు సంక్షేమశాఖ కార్యాలయంలో క్షేత్రస్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  మహిళా పోలీసులకు గ్రామాల్లోని మహిళలకు రక్షణగా నిలవాలన్నారు. బాల్య వివాహాలు నిర్మూలనలో కీలక పాత్ర పోషించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అమలు చేస్తు పౌష్టికాహార పథకం అమలు పూర్తిస్థాయిలో జరిగేలా చూడాలన్నారు. అనంతరం కేంద్రాల్లో నిర్వహించే రికార్డులు, అంగన్వాడీల విధులు, సిడిపీఓ కార్యాలయం ద్వారా అందించే సేవలపైనా అవగాహన కల్పించారు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఐసిడిఎస్ ద్వారా సేవలు అందించాలన్నారు. జీఓ నెంబరు 59 ద్వారా మహిళా పోలీసులను సాధారణ పోలీసులతో సమానంగా గుర్తించిన సందర్భంలో ప్రతీ ప్రభుత్వ కార్యాలయ పరిపాలనపైనా అవగాహన పెంచుకోవడం ద్వారా అత్యవసర సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి వీలుపడుతుందన్నారు. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా మహిళా పోలీసులకు సమాచారం అందించడానికి, విధి నిర్వహణలో సహాయ పడటానికి తాము సిద్దంగా ఉంటామనే విషయాన్ని మరిచిపోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు జీఎన్ఎస్ శిరీష, కళాంజలి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-02 07:25:28

ఎంపీడీఓ కార్యాలయంలో పోలీసులకి శిక్షణ..

శంఖవరం మండల అభివ్రుద్ధి అధికారి కార్యాలయంలో 7వ బ్యాచ్చి మహిళా పోలీసులకు గురువారం క్షేత్రస్థాయి శిక్షణ ఇచ్చారు. ఎంపీడీఓ జె.రాంబాబు ఆదేశాల మేరకు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నగేష్ మహిళా పోలీసులకు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగే కార్యకాలపాలు, మెయింటేన్ చేసే రిజిస్టర్లు, అభివ్రుద్ధి పనులు, పరిపాలనకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈసందర్బంగా సీనియర్ అసిస్టెంట్ మాట్లాడుతూ ప్రభుత్వం జీఓ నెంబరు 59 ద్వారా మహిళా పోలీసులను సాధారణ పోలీసులతో సమానంగా గుర్తించిన సందర్భంలో ప్రతీ ప్రభుత్వ కార్యాలయ పరిపాలనపైనా అవగాహన పెంచుకోవడం ద్వారా అత్యవసర సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి వీలుపడుతుందన్నారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా మహిళా పోలీసులకు సమాచారం అందించడానికి, విధి నిర్వహణలో సహాయ పడటానికి సిద్దంగా ఉన్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో  ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు జీఎన్ఎస్ శిరీష, కళాంజలి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-01 15:57:35

మెగా గ్రౌండింగ్ కి ముందుకి రావాలి..

నవరత్నాలు -పేదలందరికి ఇల్లు మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమం   విజయవంతం అయ్యే విధంగా లబ్దిదారులు తమ వంతు కృషి చేయాలనీ కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సామర్లకోట ఇటీసీ లే అవుట్ సామూహిక  శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ డి. మురళీదర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా ఇళ్ల పట్టాదారులందరుకు శుభాకాంక్షలు అని తెలిపారు. గతంలో ఇటీసీ లే అవుట్ లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, అదే రోజు పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ల శంకుస్థాపన చేసుకోవాలని తెలియజేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా  ఈ రోజు లబ్దిదారులు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు. అంతేకాకుండా మనకు ప్రధానంగా ఆర్థిక పెట్టుబడికి కొన్ని సమస్యలు తేలేత్తడం జరిగిందని, ఆ లోటు సరిదిద్దేవిధంగా మహిళల డ్వాక్రా రుణాలు ఆర్థిక పెట్టుబడిని వినియోగించుకుని నవరత్నాలు పేదలందరికి ఇల్లులుకు పెట్టడం జరుగుతుందని, ప్రభుత్వం నుండి కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రెమెంట్స్ రావడం ఆలస్యం కావచ్చు కానీ, పేదలందరికి ఇల్లు నిర్మాణానికి ప్రెమెంట్స్ ఎటువంటి ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా నవరత్నాలు పేదలందరికి ఇల్లు మూడు రోజుల కార్యక్రమానికి  200కోట్ల రూపాయలు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని, ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల రూపాయలు మహిళలకు ఇవ్వడం జరిగిందని తెలిపారు.ప్రతి ఇంటీకి జియో టాకింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ అధికారాయంత్రగంమంత సమిష్టి కృషితో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా కలెక్టర్ చేతుల మీదుగా 883 మంది లబ్దిదారులకు సామజిక అవసరాల నిమిత్తం బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయంగా రూ.4,41,50,000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో  కాకినాడ ఆర్డీఓ చిన్ని కృష్ణ మాట్లాడుతూ సామర్లకోట పరిధిలో  ఇళ్ల పట్టాలు మొత్తం 2200 దానిలో ఫస్ట్ ఫేస్ లో 1200 మందికి ఇవ్వడం జరిగిందని, ఈ రోజు 400 మంది పైగా హాజరు అవ్వడం జరిగిందని, వాలంటీర్లు, ప్లానింగ్ సక్రెటరీలు, ఇమ్మ్యూనిటీస్ ద్వారా హౌసింగ్ యాప్ అప్డేషన్ చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా మెప్మా నుండి 125 బ్యాంకు రుణాల చెక్కులను అందజేయడం జరుగుతుందని తెలిపారు.అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా ఈ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )భార్గవ్ తేజ, జాయింట్ కలెక్టర్ (ఆసరా )జి. రాజకుమారి, హౌసింగ్ పిడి మెప్మా కె. శ్రీ రమణి, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్,తహసీల్దార్ జితేంద్ర, మునిసిపల్ కోఆప్షనల్ సభ్యులు ధవ్వులూరి సుబ్బారావు, వైస్ చైర్మన్ జాన్ మోజెస్, చైర్మన్ కృష్ణ మూర్తి, కౌన్సిలర్స్, ప్రజా ప్రతినిధులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Samarlakota

2021-07-01 13:49:12

పేదలకు సొంతిల్లే ప్రభుత్వ లక్ష్యం..

పేద కుటుంబాల భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పించే వైఎస్సార్ బీమా ప‌థ‌కం ప‌రిధిలోకి వ‌చ్చే విధంగా జిల్లాలో అర్హుల న‌మోదు ప్ర‌క్రియ గ్రామ‌, వార్డు స‌చివాల‌య స్థాయిలో అత్యంత క‌చ్చిత‌త్వంతో జ‌రుగుతున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. గురువారం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌తో రూపొందిన వైఎస్సార్ బీమా ప‌థ‌కాన్ని వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించారు. 2021-22లో రాష్ట్రంలో 1.32 కోట్ల పేద కుటుంబాల‌కు దాదాపు రూ.750 కోట్ల వ్య‌యంతో ఉచిత బీమా ర‌క్ష‌ణ క‌ల్పించే ఈ కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌రేట్ నుంచి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌, ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్, కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన అర్హులైన వారికి బీమా కార్డుల‌ను కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ గ్రామ‌, వార్డు స‌చివాల‌య స్థాయిలో ఈ-కేవైసీ ద్వారా అర్హుల‌ను ప‌థకంతో అనుసంధానం చేసే ప్ర‌క్రియ‌లో భాగంగా జిల్లాలో చేప‌ట్టిన 16,53,364 రైస్‌కార్డుల స‌ర్వే పూర్తికావ‌స్తోంద‌ని, దాదాపు మూడు ల‌క్ష‌ల కార్డుల‌ను మాత్ర‌మే ఇంకా స‌ర్వే చేయాల్సి ఉంద‌ని వెల్ల‌డించారు. దుర‌దృష్టవ‌శాత్తు కుటుంబ పెద్ద‌ను కోల్పోయిన పేద కుటుంబాల‌కు వైఎస్సార్ బీమా ప‌థ‌కం ఆస‌రా కానుంద‌ని వివ‌రించారు. 18-50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వ్య‌క్తి స‌హ‌జంగా మ‌ర‌ణిస్తే ఆ కుటుంబానికి రూ.ల‌క్ష ఆర్థిక సాయం, అదే విధంగా 18-70 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వ్య‌క్తి ప్ర‌మాదంలో మ‌ర‌ణించినా లేదా శాశ్వ‌త అంగ వైక‌ల్యం పొందినా ఆ కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల బీమా ప‌రిహారం అందుతుంద‌ని వివ‌రించారు. బీమా న‌మోదు, క్లెయిమ్‌ల చెల్లింపుల‌కు సంబంధించిన ఫిర్యాదుల న‌మోదుకు 155214 టోల్‌ఫ్రీ నెంబ‌రు కూడా అందుబాటులో ఉంద‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. 

రూపాయి భారం లేకుండా: మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌*
పేద కుటుంబాల‌పై రూపాయి కూడా భారం ప‌డ‌కుండా రాష్ట్ర ప్ర‌భుత్వం ఉచిత బీమా అందిస్తోంద‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ పేర్కొన్నారు. దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న జ‌రిగిన ప‌రిస్థితిలో ప‌థ‌కం కింద ఎలాంటి జాప్యం లేకుండా స‌త్వ‌రం క్లెయిమ్‌ల చెల్లింపున‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింద‌న్నారు. కోవిడ్ క‌ష్ట‌కాలంలో సైతం ప్ర‌జ‌ల సంక్షేమానికి సంబంధించిన ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని గౌర‌వ ముఖ్య‌మంత్రి తు.చ‌.త‌ప్ప‌కుండా అమ‌లుచేస్తున్నార‌ని పేర్కొన్నారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా ప్ర‌తి ల‌బ్ధిదారునికీ ప‌థ‌కాల ఫ‌లాలు అందుతున్నాయ‌ని, సంక్షేమం విష‌యంలో రాష్ట్రం దేశానికే ఆద‌ర్శ‌వంతంగా ఉంద‌ని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, కార్మిక శాఖ ఉప‌కమిష‌న‌ర్ ఎన్‌.బుల్లిరాణి త‌దిత‌రులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన‌, ప‌థ‌కం ప‌రిధిలోకి వ‌చ్చిన వారు హాజ‌ర‌య్యారు. 

2021-07-01 13:47:19

మహిళా పోలీసులకు రెవిన్యూపై శిక్షణ..

మహిళా పోలీసులు రెవిన్యూశాఖ కార్యకలాపాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించడానికి వీలుపడుతుందని తశహశీల్దార్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని 7వ బ్యాచ్  మహిళా పోలీసులకు రెవిన్యూ కార్యాలయంలోని వివిధ అంశాలపై ఆయన స్వయంగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, శవపంచనామ, బైండోవర్లు, బీఎల్ఓ విధులు అత్యవసర సమయంలో సమాచారం చేరవేయడం తదితర విషయాలు ఏ విధంగా చేపట్టాలనే విషయంలో అవగాహన కల్పించారు. అంతేకాకుండా మహిళా పోలీసులకు రెవిన్యూ పరంగా మండల స్థాయిలో ఎప్పుడైనా తమ సహకారం అందిస్తామని, అదేవిధంగా సచివాలయ పరిధిలో వీఆర్వోలు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం జీఓ నెంబరు 59 ద్వారా సాధారణ పోలీసులుగా మహిళా పోలీసును మార్పుచేసినందున గ్రామాలకు రక్షణగా ఉండాలని సూచించారు.  అక్రమ మధ్యం, గొడవలు, అల్లర్లు, మహిళలపై వేధింపులు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు జీఎన్ఎస్ శిరీష, కళాంజలి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-01 13:07:55

జగనన్నకాలనీలు కాదు.. గ్రామాలు

నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమం రాగోలు లే ఔట్ కాలనీ వద్ద మునిసిపల్ కమీషనర్ ఓబులేసు ఆధ్వర్యంలో గురువారం జరిగింది.  ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ముఖ్యఅతిథిగా పాల్గొని గృహ స్థల లబ్ధిదారులతో భూమి పూజ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవి జగనన్న కాలనీలు కావని, ఈ కాలనీల్లో నిర్మిస్తున్న గృహాల వలన గ్రామాలే ఆవిర్బవించనున్నట్లు చెప్పారు. కాలనీల్లో నిరంతర విద్యుత్, తాగునీరు, సిమెంటు రహదారులు, కళ్యాణ మండపం, పార్కు, విద్యుత్ వెలుగులు, మురుగునీటి కాలువలు ఇలా సకల సౌకర్యాలు ఇందులో రానున్నట్లు చెప్పారు. ఇపుడు నిర్మిస్తున్న కాలనీలు మొత్తం పూర్తయితే కాలనీలుగా ఉండవని, సౌకర్య వంతమైన, విలాసవంతమైన గృహాలుగా జగనన్న కాలనీలు ఉండబోతున్నాయని,  అందరికీ శాశ్వత చిరునామాగా ఈ కాలనీలు మారబోతున్నాయని అని అన్నారు. ముఖ్యంగా మహిళల వారి పేరునే ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని అన్నారు. రాగోలు జగనన్న కాలనీలో 362 మందికి ఇంటి స్థలాలు మంజూరుచేయడం జరిగిందని, లబ్ధిదారులతో  పునాది రాయి వేసి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం లబ్ధిదారుల మనోగతాన్ని శాసనసభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  ప్రపథమంగా శంకుస్థాపన చేసిన 43వ డివిజన్ నివాసి లబ్ధిదారు దుక్క అపర్ణతో శాసనసభ్యులు మాట్లాడుతూ తమ జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.  గత  20 ఏళ్లుగా స్వంత ఇళ్లు లేని తమకు జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరుకావడం, అందులో తాను శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉందని శాసనసభ్యులకు వివరించారు. ఇంతవరకు చిరునామా అన్నది లేని తనకు జగనన్న దయవలన తన శాశ్వత చిరునామా రాగోలు కాలనీగా మారుతున్నoదుకు  చాలా ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.జె.కిషోర్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, కమీషనర్ ఓబులేసు, తహశీల్ధార్ ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రకాశరావు, శ్రీకాకుళం డివిజనల్ పంచాయతీ అధికారి   రాంప్రసాద్, కార్యనిర్వాహక ఇంజినీర్ సుగుణాకర్, ఏ.పి.కార్పొరేషన్ కార్యనిర్వాహక ఇంజినీర్ నాగేశ్వరరావు, మాజీ మునిసిపల్ ఛైర్ పర్సన్ మెంటాడ వెంకట పద్మావతీ, మెంటాడ స్వరూప్ , పొన్నాడా ఋషి, అందవరపు సంతోష్ ,చిట్టి జనార్దన్,చల్లా శ్రీనివాస్ రావు,సాధువైకుంటారావు, లంకం, రాగోలు సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు

Srikakulam

2021-07-01 12:03:08

పేదోడిక గూడు కష్టం తీరుస్తున్న సీఎం..

ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కల సాకారం  కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. గురువారం మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళాలో భాగంగా బలిఘట్టం సర్వేనెంబర్ 552  బైపురెడ్డిపాలెంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలలో  లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇల్లు లేని ప్రతి నిరుపేద కు సొంత ఇల్లుకల నెరవేరుస్తున్నారన్నారు. ఇందుకు అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. జగనన్న కాలనీలలో త్రాగు నీరు, విద్యుత్తు, రోడ్లు, డ్రైన్లు తదితర మౌలిక వసతులు అన్నింటిని కల్పించడం జరుగుతుందన్నారు. సొంత స్థలం ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం తరఫున రూ.1.80 లక్షల ను మంజూరు చేస్తూ వారికి సిమెంటు, ఐరన్,ఇసుక సబ్సిడీ ధరలకే అందించడం జరుగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణాలను నిర్దేశించిన సమయానికి పూర్తి చేసి వారి గృహప్రవేశాల కు సిద్ధం చేస్తామని అన్నారు. మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళాలో నర్సీపట్నం ఇంచార్జ్ ఆర్ డి ఓ అనిత,  మున్సిపల్  చైర్పర్సన్ గుడిబండ ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, మున్సిపల్ కమిషనర్ కనకారావు ,హౌసింగ్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

Narsipatnam

2021-07-01 11:55:34

పేదవాడికి గూడు కల్పించడమే సీఎం లక్ష్యం..

అర్హులైన  పేదవారికందరికి  ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమని  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు.  గురువారం నాడు  పెందుర్తి మండలం గుర్రంపాలెం  లేఅవుట్ లో  వై ఎస్ ఆర్ జగనన్న కాలనీలో   గృహ నిర్మాణాలకు  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, స్థానిక ఎం ఎల్ ఎ  ఎ. అధీప్ రాజ్ లతో కలిసి  శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  పెందుర్తి మండలంలోని  గుర్రంపాలెం లో   11 ఎకరాలలో లే అవుట్  వేసి   454 ప్లాట్ లను  చేసారని, రూ 8.13 లక్షలతో  నీటి కనెక్షన్లు  ఇచ్చారని, రూ. 89.60లక్షలు   విద్యుదీకరణ పనులకు మంజూరు చేసారని , రూ 17.94 లక్షలు సైట్  లెవెలింగ్ చేయడానికి  వినియోగించారని తెలిపారు.  మెగా గ్రౌండింగ్ మేళా  సందర్భంగా  ఈ లే అవుట్ లో  100 గృహాలకు  శంఖుప్థాపన  చేయనున్నట్టు తెలిపారు.  జిల్లా కలెక్టర్  వి.వినయ్ చంద్ మాట్లాడుతూ నవరత్నాలు , పేదలందరికి ఇళ్లు పథకం కింద  చేపట్టిన  వై ఎస్ ఆర్ జగనన్న కాలనీలలో  రెండవ దపా మెగా గ్రౌండింగ్ సందర్భ౧గా జిల్లాలో  జూలై 1, 3,4 తేదీలలో  గ్రౌండింగ్  చేస్తున్నట్టు తెలిపారు. లబ్దిదారులు  గృహ నిర్మాణం పై  పూర్తి శ్రద్ద వహించి  పనులు చేయించాలని  కోరారు.  ప్రభుత్వం  20 టన్నుల ఇసుక లబ్దిదారునికి  ఉచితంగా  సరఫరా చేస్తుందని తెలిపారు.  ఇంకా అవసరమైన  స్టీలు, సిమెంటు గోదాములలో సిద్దంగా ఉందని తెలిపారు.  వెై ఎస్ ఆర్ జగనన్న కాలనీలలో  మౌళిక సదుపాయాలు, బోర్లు, ప్రతి ఇంటికి కొళాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, శానిటేషన్, విద్యుత్తు, రోడ్లు కల్పిస్తామని  అన్నారు. అంగన్ వాడీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని  తెలిపారు. లబ్దిదారులను ప్రోత్సహించి  ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టాలని  అధికారులను  ఆదేశించారు. 
స్దానిక శాసన సభ్యులు  ఎ. అదీప్ రాజ్ మాట్లాడుతూ  పెందుర్తి నియోజక వర్గంలో  32వేల మందికి  శాశ్వత గృహ వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు  తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ    ప్రభుత్వమే  ఇసుక ధర ,  రవాణా ఖర్చులు భరించి తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఇసుక తెప్పించి లబ్దిదారులకు ఉచితంగా  సరఫరా చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో  హౌసింగ్ పిడి  శ్రీనివాస్, నియోజక వర్గ ప్రత్యేకాధికారి హేమలత, మండల ప్రత్యేకాధికారి రాజు, ఎం ఆర్ ఓ పి.రామారావు,  ఎం పి డి ఓ  ఎస్ మంజుల వాణి, హౌసింగ్ డి ఇ రాజు,  సర్పంచ్ గోవిందరాజులు  పాల్గొన్నారు.

Pendurthi

2021-07-01 11:52:58

అప్పన్న సన్నిధిలో ఆటోడ్రైవర్ నిజాయితీ..

విశాఖ వేపగుంటకు చెందిన లక్ష్మీ బొడ్డేటి, భర్త రామక్రిష్ణ 4గురు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం శ్రీస్వామివారి దర్శనానికొచ్చారు. సింహాచలం కొండపై బస్టాప్ లోని మెట్లపై కూర్చొని  తమ స్మార్ట్ ఫోన్ ను మరిచిపోయారు. ఒక వివాహ కార్యక్రమానికొచ్చిన చిన్నవాల్టేర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఎం. మోహన్ కు ఆ సెల్ ఫోన్ దొరకడంతో పీఆర్వో ఆఫీసు దగ్గరున్న పోలీసులకు దానిని అందించారు. దీనితో పోగొట్టుకున్న బాధితులకు ఆ స్మార్ట్ ఫోన్ ను గోపాలపట్నం సీఐ ఎం. అప్పారావు ద్వారా ఆమెకు అప్పగించారు. ఈ సంబర్భంగా బాధితురాలు పోలీసులకు, ఆలయ అధికారులకు,  దొరికిన ఫోన్ ను అప్పగించిన ఎం. మోహన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆటో డ్రైవర్ నిజాయితీని దేవస్థానం  ఈఓ సూర్యకళ, సిఐలు అభినందించారు . భక్తులు సెల్ ఫోన్లు భద్రపరచుకునేందుకు పీఆర్వో ఆఫీసుదగ్గర, ఫ్రీదర్శనం క్యూ దగ్గర కౌంటర్లు ఏర్పాటుచేశామని, మొబైల్స్ ఎవరూ బయట ఎక్కడా పెట్టొద్దని ఈఓ తెలిపారు. భక్తులకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామని ఈఓ భరోసా ఇచ్చారు.

Simhachalam

2021-06-30 06:08:20

గ్రామాలకి ప్రభుత్వ కార్యాలయాలొచ్చాయ్..

అవును స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్. జగన్మోహనరెడ్డి చొరవ ముందుచూపుతో  గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామాల రూపు రేఖలను మార్చేస్తుంది. ఒకటి కాదు రెండు కాడు ఏకంగా 15వేల ఐదు గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సీఎం  గ్రామాలకే ప్రభుత్వ కార్యాలయాలొచ్చాయి. బ్రిటీషు కాలంలో నాడు అమాయక ప్రజలను హింసించడానికి సైనికులు తిరిగితే.. అదే నేడు గ్రామాల్లో శాంతి భద్రతలను పరిరక్షించడానికి సచివాలయానికో మహిళా పోలీస్ చొప్పున 14964 మంది రక్షక బటులు గ్రామానికి రక్షణ కల్పిస్తున్నారు. గ్రామాభివ్రుద్ధికి కార్యదర్శి, భూములు పరిరక్షించడానికి వీఆర్వో, రైతులకు అండగా నిలవడానికి అగ్రికల్చర్ అసిస్టెంట్, మత్స్య సంపదను పెంచడానికి ఫిషరీష్ అసిస్టెంట్, సంక్షేమ పథకాలు అందించడానికి వెల్ఫేర్ అసిస్టెంట్, వాణిజ్య పంటలు పెంచే హార్టీకల్చర్ అసిస్టెంట్, పట్టు పరిశ్రమను రైతులకు పరిచియం చేయడానికి సెరీకల్చర్ అసిస్టెంట్, గ్రామాల్లో నిర్మాణాలను దగ్గరుండి చూడటానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్, భూముల భూముల లెక్క పక్కాగా చూపించడానికి సర్వేయర్, ఇలా 15శాఖల సిబ్బంది మొత్తం గ్రామంలోనే ప్రజలకు సేవలు అందిస్తే ఇంకేం కావాలి. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం అంటే ఏంటో ఆయన ఉద్యమం చేసిన రోజుల్లో బ్రిటీషు సేనల పోరాటంలో పేరు భారతీయులు వల్లె వేస్తుంటే నేటి.. స్వాతంత్య్ర భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా, ఒక్కో గ్రామంలో గ్రామ సచివాలయం, ప్రాధమిక వైద్యం అందించేందు విలేజ్ హెల్త్ క్లినిక్, రైతుల అన్ని అవసరాలు తీర్చేందుకు భరోసా కేంద్రం, పాడి పుశుల ఆరోగ్యం కోసం పశువుల ఆసుపత్రి ఇలా అన్ని రకాల సేవలు గ్రామాల్లోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నాడు ఆంధ్రప్రదేశ్ అంటే అభివ్రుద్ధికి ఆమడ దూరంలో వుండేది. ఇపుడు దేశవ్యాప్తంగా వున్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఇక్కడ అందే సేవలపై అధ్యయనాలు చేసి.. వారి రాష్ట్రంలో ఏవిధంగా ప్రజలకు సేవలు అందించాలి అనే కోణంలో ఆలోచిస్తున్న రాష్ట్రాల్లొని అంది నోటి వెంట వచ్చే పదం... సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి... ప్రతీ ప్రజాసేవకు ముందు గ్రామసచివాలయం ఏర్పాటునే ఇపుడు దేశం మొత్తం వల్లెవేస్తుంది. నాడు 56 ప్రభుత్వ సేవలతో మొదలైన సచివాలయ వ్యవస్తలో ఇపుడు 545 సేవలు అందుబాటులోకి వచ్చాయంటే ఎవరికి మండల, జిల్లా కేంద్రానికి వెళ్లే అవసరం వస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, అందే సేవలపై మరింతగా మండల, జిల్లా అధికారులు ద్రుష్టి సారిస్తే..గ్రామాలకొచ్చిన ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు..

Tadepalle

2021-06-30 02:17:30

ఆర్బీకేలను సుందరంగా మార్చండి..

రైతు భరోసా కేంద్రాల సుందరీకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయదుర్గం నియోజకవర్గంలో ఆర్బీకేల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. నియోజక వర్గంలో ఆవుల దట్ల మండలంలోని ఉడైగోళం-74 గ్రామ సచివాలయం, హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనులు.. రాయదుర్గం లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ అగ్రి క్లినిక్ ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు.  జులై 8న రైతుదినోత్సవం సందర్భంగా జిల్లాలో  కొన్ని రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్నామన్నారు. ఆయా రైతు భరోసా కేంద్రాలను జులై 5 నాటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.రాయదుర్గంలోని ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబుకు రూ.27.50 లక్షలు,నిధులతో నిర్మించిన  భవన నిర్మాణ సముదాయాన్ని జూలై 8 వ తేదీన ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. సుందరీకరణ పనులు జూలై 5వ తేదీ లోపల పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా & రెవెన్యూ) నిశాంత్ కుమార్, పంచాయతీ రాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ భాగ్యరాజ్, వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, కళ్యాణదుర్గం ఆర్డీవో నిశాంత్ రెడ్డి , ఈ ఈ  జవహర్ అస్లీ, డి ఈ  రామ్మోహన్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.

Rayadurgam

2021-06-29 13:59:48

మెగా గ్రౌండింగ్ విజయవంతం కావాలి..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాతకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పధకంలో భాగంగా జూలై 1,3,4, తేదీలలో నిర్వహించే మెగా గ్రౌండిరగ్‌ విజయవంతం చేయడానికి కేత్రసాయి అధికారులు, గ్రామ వాలంటీర్లు లబ్దిదారులు బాగస్వామ్యంతో ప్రత్యేక చోరవ చూపాలని సబ్‌ కలెక్టరు ఇలాక్కియా ఆదేశించారు. మంగళవారం ఆమె గ్రామీణ మండల పరిధిలోని  తోర్రేడు  సీతానగరం మండలంలోని  మునికూడలి, చినకొండేపూడి  లేవుట్లలో పునాదులు త్రవ్వేందుకు మార్కింగ్‌, ఎలక్ట్రికల్‌ స్దంబాలు ఏర్పాటు, గ్రామీణ నీటి సరఫరా శాఖ మరియు పారిశుద్ద్యశాఖ ద్వారా బోరు బావులు నిర్మాణాలు, తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ త్వరగా కనీస మౌలిక వసతులు గృహ నిర్మాణాల నిమిత్తం కల్పించి లబ్దిదారులను ప్రోత్సాహించి వారికి డ్వాకా ద్వారా అడ్వాన్ను రుణం మంజూరు చేయించి వెంటనే నిర్మాణాలు ప్రారంబింపజేయాలన్నారు. ప్రతి లబ్దిదారుడు గృహ నిర్మాణాలు తప్పకుండా చేపట్టేలా గ్రామ వాలంటీర్లు క్షేత్రస్దాయి అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవాలని ఆదేశించారు.  ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మానస పుత్రిక నవరత్నాలు` పేదలందరికి ఇల్లు కార్యక్రమమన్నారు. మెగా గ్రౌండిరగ్‌ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఉండాలని ఆమె అన్నారు.  పదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు నూటినూరు శాతం పాటుపడాలన్నారు.  ప్రభుత్వం అందించే రూ 1,80,000లకు అదనంగా స్వయం సహాయక సంఘాల ద్వారా మరో రూ 50 వేలు అడ్వాన్పు రుణం ఇప్పించి  పక్కాగా ఇల్లు  నిర్మించుకునేలా ప్రోత్సాహాన్ని లబ్దిదారులుకు అందించాలన్నారు.  ఒక్కొక్కరు ఇల్లు నిర్మించుకోవాలంటే  అయ్యేపనికాదని అందుకని 10 మంది నుంచి 25 మంది వరకు గ్రూపుగా ఏర్పడి ఇళ్ళ నిర్మాణాన్ని ఆరంబించేలా వాలంటీర్లు పంచాయితీ కార్యదర్శులు ప్రోత్సాహాన్ని అందించి ఉమ్మడిగా నిర్మాణాలు చేసుకుంటే లబ్దిదారులుకు మెటీరియల్‌ పరంగా, నిర్మాణ వ్యయాలు పరంగా ఖర్చులు తగ్గి ఎంతో మేలు చేకూరుతుందని ఆమె స్ఫష్టం చేసారు. ఇళ్ల నిర్మాణాలు విషయంలో ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా లబ్దిదారులుకు అధికారులు బాసటగా నిలవాలని ఆమె అన్నారు. అదేవిధంగా జిల్లా స్దాయిలో  ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలో విద్యుత్‌, గ్రామీణ నీటి సరపరా,  పంచాయితీ రాజ్‌ వంటిశాఖల సిబ్బంది అందుబాటులో వుండి వెంటనే సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు  విద్యుత్‌ లైన్లు త్వరగా వేసి గృహ నిర్మాణాల కొరకు  నీటి సరఫరా కొరకు ట్రాన్సుకో అధికారులు తోడ్పాటు నందించాలన్నారు.అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా అధికారులు బోరుబావులు 2 మాత్రమే పూర్తి చేసారని మూడవ బోరుబావిను వెంటనే త్రవ్వాలని ఆదేశించారు. మునికూడలి లేవుల్‌ చాలవరకు పునాదులుత్రవ్వి నిర్మాణాలు ప్రారంబించడం జరిగిందన్నారు. బొబ్బర్లంక ములక్లలంక గ్రామాలలో కూడా ఆమె పర్యటించారు.  ఈ కార్యక్రమాలలో తాహసిల్దార్లు పవన్‌ కుమార్‌. రియాజ్‌ హుస్సేన్‌. మండల పరిషత్‌ అభివృద్ది అధికారి  మూర్తి, నోడల్‌ అధికారి, ఎడి మైనింగ్‌  రంగా కుమార్‌ కొంతమూరు ట్రాన్సుకో ఎ.ఇ కిశోర్‌ కుమార్‌. గ్రామ కార్యదర్శులు, గ్రామ రెవిన్యూ అధికారులు, గృహనిర్మాణ సంస్ద ఇంజనీర్లు వర్కు ఇన్‌స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.  

Seethanagaram

2021-06-29 13:45:15

పేదవాడి సొంతింటి కాల నెరవేర్చాలి..

ఆర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి సొంతింటి కళ సాకారం చేసేందుకు ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు. జూలై 1 న నిర్వహించనున్న మెగా గ్రౌండింగ్ మేళాకు ముందస్త ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కొమరాడ మండలం కొమరాడ, గుమడ గ్రామాల్లో, పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో  హౌసింగ్ లేఅవుట్ ను, మంగళవారం ప్రోజెక్ట్ అధికారి సందర్శించారు, ఈ సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్షించి సూచనలు అందించారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ జూలై 1న చేపట్టనున్న మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాలో పార్వతీపురం మండలంలో మంజూరైన 55 లేఅవుట్లలో, సొంత స్థలాలలో 207  మొత్తం 3165 మంజూరు కాగా అందులో 735 గ్రౌండింగ్ పూర్తి అయ్యాయని మిగిలిన ఇళ్లు జూలై 1న గ్రౌండింగ్  అయ్యేలా ఆన్ని చర్యలు చేపట్టాలని, అలాగే కొమరాడ మండలంలో 25 లే అవుట్లులో 334 ఇళ్లు, సొంత స్థలంలో 2.141 ఇళ్లు మొత్తం 2475 మంజూరు అయ్యాయని, లబ్ధిదారులు   మెగా  గ్రౌండింగ్ మేళా ఇళ్లు నిర్మాణానికి ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని, మెగా మేళా ఒక పండగ వాతావరణంలో చేపట్టాలని ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపు నిచ్చారు.
           కొమరాడ మండలం కొమరాడ గ్రామ సచివాలయంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. సచివాలయంలో అందిస్తున్న సేవల పై ఆరా తీశారు, అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోటే నివాసం ఉండాలన్నరు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా ఆనుసరించాలని, సేవల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ  సమయపాలన పాటించాలని అన్నారు.  పిర్యాదుల సేకరణలో పరిష్కారంలో ఆలసత్వం ప్రదర్శించ వద్దని సూచించారు.  ఈ క్రమంలో సిబ్బంది హజరుపట్టి, ప్రగతి నివేదికల పట్టిక తదితర రికార్డులు పరిశీలించారు, వోలంటరీ వ్యవస్థను సక్రమంగా వినియోగించు కోవాలని హితవుపలికారు. 

      ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఎస్.వేంకటేశ్వరులు, పార్వతీపురం కొమరాడ ఎం.పి.డి.ఓలు, తహసీల్దార్లు, హౌసింగ్ ఇ.ఇ, గ్రామ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

2021-06-29 12:50:50