విద్యార్ధులకు పాఠశాల దశ నుంచే పరిశోధనలపై అవగాహన పెంచుతూ వారిలో ఉత్తేజాన్ని నింపాలని తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ శాస్త్రవేత్త శివ ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం శంఖవరం జిల్లాపరిషత్ పాఠశాలలో అంతరిక్ష పరిజ్ఞానం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ఇస్రో రాకెట్ ప్రయోగాలు, చంద్రయాన్, శాటిలైట్ అంతరిక్ష ప్రయోగాలు వాటి పై పిల్లలు అంతరిక్ష విజ్ఞానం పై ఆసక్తిని కలిగించే వివిధ అంశాల ఆయన అవగాహన కల్పించారు. విద్యార్ధులు సెల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి పరిశోధనలు, ఇస్రో నిర్వహించే కార్యక్రమాల కోసం తెలుసుకోవాలన్నారు. అంతేకాకుండా వివేకానందుడు, ఏపీజే అబ్దుల్ కలాం గురించి చెబుతూ విద్యార్థులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాద గోపాలకృష్ణ,లింగేశ్వర రావు, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు వెంకటేశ్వర రావు,వెంకటరావు, అప్పల రాజు, విద్యార్ధులు పాల్గొన్నారు.
ముఖ్య మంత్రి వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ ప్లస్ పథకాని నీరుగారిస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని పార్వతీపురం ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ హెచ్చరించారు. మంగళవారం మక్కువ మండలం శంభరలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ముందుగా రికార్డులు పరిశీలించారు రికార్డులు ఆన్ని సక్రమంగా నిర్వహించక పోవడం, పంపిణీ చేసిన వస్తువులకు సంబంధించి రశీదులు లేకపోవడం పై అలాగే పిల్లల హాజరు పట్టి పరిశీలించారు మొత్తం పిల్లలు 23 మందికి గాను 20 మంది హాజరు అయినట్లు రిజిష్టర్లో నమోదు అయి ఉండగా కేంద్రంలో 8 మంది పిల్లలు ఉండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలో లబ్ధిదారులు వచ్చి మాకు ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ పోషణ ప్లస్ సరుకులు అందటం లేదని ప్రాజెక్ట్ అధికారి వారికి పిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ప్రాజెక్ట్ అధికారి అంగన్వాడీ నిర్వహిస్తున్న సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి తదుపరి క్రమశిక్షణా చర్యలు చేపట్టలని సి.డి.పి.ఓ కి ప్రాజెక్ట్ అధికారి ఆదేశించారు.అనంతరం ప్రాజెక్ట్ అధికారి మక్కువ మండలం శంభర జిల్లా పరిషత్ హైస్కూల్ మధ్యాహ్న భోజన నిర్వహణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ముందుగా రికార్డులు పరిశీలించారు రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం పిల్లలతో కలసి భోజనం చేశారు . నాణ్యత లేని గుడ్లు వినియోగించడం, భోజనం రుచికరంగా లేకపోవడం పై ఆగ్రహించిన ప్రాజెక్ట్ అధికారి మీ ఇంటిలో ఇలాగేనా తింటారు ఇటువంటి రుచిలేని భోజనం, నాణ్యత లేని గుడ్లు మీరు తింటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంతరం భోజన నిర్వాహకులపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అహర్నిసలు కృషిచేసి ప్రత్యేక రాష్ట్రం సంపాదించుకోవడానికి ఆమరణ నిరాహారదీక్ష చేసిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని పాడేరు ఐటిడిఎ పిఓ డా.సలిజాముల వెంకటేశ్వర్ కొనియాడారు. మంగళవారం స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో 120 వపొట్టి శ్రీరాముల జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి అయిన మహా పురుషుడు అన్నారు. ఆంధ్రులకు ప్రాంతీయ భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటుకు కారణభూతుడైనవాడు మహాత్మ గాంధీ బోధించిన సత్యం,అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటిడిఎ పరిపాలనాధికారి కె.నాగేశ్వర రావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువలేమని అన్నారు. డిడి ట్రైబల్ వెల్ఫేర్ విజయకుమార్,డిఎమ్&హెచ్ఒ కె.లీలాప్రసాద్, కాఫీ ఏడి రాధాకృష్ణ, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ కృష్ణారావు మరియు ట్రైబల్ వెల్ఫేర్,పంచాయతీ రాజ్ , ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
విశాఖజిల్లాలోని కొయ్యూరు మండలం నల్లగొండ గ్రామానికి త్వరలోనే పోస్టల్ సేవలు అందనున్నాయి. ఈ మేరకు పోస్టల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నోఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో పోస్టల్ సేవలు విస్తరించాలని ప్రతిపాదనలు కేంద్రప్రభుత్వానికి, పోస్టల్ శాఖ ఉన్నతాధికారులకు వెళ్లినా కార్యరూపం దాల్చలేదు. ఇటీవల కాలంలో పోస్టల్ శాఖ తీసుకున్న ప్రత్యేక నిర్ణయాల కారణంగా ఈ గ్రామానికి పోస్టల్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతీ పోస్టాఫీసు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉండాలని ఈ శాఖ భావించింది. దీనితో విశాఖజిల్లాలో సుమారు 30 పోస్టాఫీసులు(బ్రాంచిలు) వేరే ప్రాంత బ్రాంచీల్లో విలీనం చేస్తున్నారు. మరికొన్నింటిని ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగానే నల్లగొండలో కొత్తగా పోస్టాఫీసు సేవలు ప్రారంభం అవుతున్నాయి. బ్రిటీషు సేనలపై అల్లూరి సీతారామరాజు మన్యం పితూరి ఉద్యమం జరిపే సమయంలో కొయ్యూరు నుంచి దగ్గర దారిలో క్రిష్ణదేవిపేట ప్రాంతానికి చేరుకునే సమయంలో ఈ గిరిజన గ్రామం మీదుగానే అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరులు రాకపోకలు సాగించేవారని చరిత్ర చెబుతున్నది. ఈ నేపథ్యంలోనే ఈ గ్రామానికి పోస్టల్ సేవలు ప్రారంభం కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది..అన్నీ అనుకూలిస్తే మరో వారం రోజుల్లో పోస్టల్ సేవలు ప్రారంభం కానున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మున్సిపాలిటీ పాలక మండలికి ఈ నెల 18వ తేదీన ఉ. 11 గంటలకు జరిగే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని జెసి రాజకుమారి పేర్కొన్నారు. మున్సిపాలిటీలో గెలుపొందిన అభ్యర్ధులకు ఆరోజు సమావావేశానికి హాజరు కావాల్సిందిగా తెలిపే నోటీసులను అభ్యర్ధులకు ఆమె నేరుగా అందించారు. ఆదివారం జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి మండపేట మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎస్.పి. అద్నాన్ నయీమ్ అస్మి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగిందన్నారు. 18వ తేదీన మండపేట మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. ఎన్నికైన కౌన్సిలర్లు ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా మండపేట మున్సిపాలిటీలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని జేసి వివరించారు.
విశాఖపట్నం జిల్లా యలమంచిని మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈ మున్సిపాలిటీలో 25 వార్డులు ఉండగా అత్యధికంగా 23 వార్డులను వైఎస్సార్సీపీ గెలుపొంది మున్సిపాలిటీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేశారు. దీనితో యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు టార్గెట్ కంప్లీట్ అయ్యినట్టు స్పష్టమైంది. మిగిలిన రెండు స్థానాలు మాత్రమే వైఎస్సార్సీపీ ఓడిపోయింది. అయిన్నప్పటికీ యలమంచిలిలో ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. విశాఖజిల్లాలో ప్రధానంగా టిడిపి ప్రత్యేకంగా ద్రుష్టిసారించినా ఫలితం లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ అభ్యర్ధులు అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని తమ సత్తానుు చాటారు. కనీసం టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా ఈ మున్సిపాలిటీలో దక్కకపోవడం చర్చనీయాంశం అవుతుంది. ఈ నియోజకవర్గంలో ఆది నుంచి ఎమ్మెల్యే కన్నబాబురాజుకి పూర్తిస్థాయిలో పట్టువుంది. అనుకున్నట్టుగానే సీఎంకి మున్సిపాలిటీని గిఫ్ట్ గా ఇస్తామన్న ఎమ్మెల్యే ప్రకటన నిజమవడంతో నియోజవర్గంలో సంబాలు అంబారాన్ని అంటుతున్నాయి. పార్టీ క్యాడర్ లో ఫుల్ జోష్ నెలకొంది...
నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని ఏర్పాట్లతో సిద్ధం చేశామని జిల్లా అదనపు ఎన్నికల అధికారి మరియు సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య తెలిపారు. శనివారం అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ మరియు మున్సిపల్ కమీషనర్ ఎన్ కనకారావు, పట్టణ సి ఐ స్వామి నాయుడు తో కలిసి కౌంటింగ్ హాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. విద్యుత్ కు అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్ ఉండేలా అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరానికి రెండు జనరటర్ల ను సిద్దం చేయడం జరిగిందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిగా వీడియో తీయడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ అధికారులు,సిబ్బంది ఉదయం 6.30 గం ల కల్లా వారికి కేటాయించిన టేబుల్స్ వద్ద సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎనిమిది గంటలకు ముందుగానే పోస్టల్ బ్యాలెట్ లను కౌంటింగ్ కు సిద్దం చేయడం జరుగుతుందన్నారు. వెంటనే ఓట్ల లెక్కింపు మొదలు పెట్టాల్సి ఉంటుందన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన వైఎస్సార్సీపీ నేడు ప్రజా ప్రభుత్వంగా విశేషంగా సేవలు అందిస్తుందని వైఎస్సార్సీపీ మండల నాయకులు గిరిబాబు అన్నారు. శుక్రవారం గొలుగొండ మండలం చీడిగుమ్మలలో వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా డా.వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భవించి నేటికి 11 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తయిదన్నారు. తమ ప్రియతమ నేత యువ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అడుగుజాడల్లోనే తామంతా పనిచేస్తూ పయనిస్తామని ప్రకటించారు. వచ్చే మూడు దఫాలు వైఎస్ జగనన్ననే సీఎం ని చేసుకుని ప్రజాసేవకులగా ప్రజలతోనే ఉంటామని చెప్పారు. అన్ని వర్గాలు మద్దతు ఇచ్చే ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమేనని కొనియాడారు. ఈ కార్యక్రమం లో జగన్ యువసేన ,వార్డుమెంబర్లు,పార్టీ పెద్దలు పాటు శాంతారామ్, పత్తి రమణ, లెక్కల అప్పలనాయుడు, మర్రి అప్పలనాయుడు, గండి శ్రీను, ఇటంశెట్టి రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
హుకుంపేట మండలం మత్స్య గుండం ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.సలిజాముల వెంకటేశ్వర్ పట్టు వస్త్రాలు ధరించి పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన కమిటీ సభ్యులతో మాట్లాడుతూ దూరప్రాంతాలనుంచి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని మంచినీరు సరఫరా చేయాలని నీటిలో దిగి స్నానాలు చేసేవారిని నిత్యం పర్యవేక్షించాలని గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని విద్యత్ కు అంతరాయం కలుగకుండా చూసుకోవాలని పిఓ ఆదేశించారు. ఈరోజు 11వ తా. నుండి 3రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు.
దక్షిణ కాశీగా వెలుగొందుతున్న నర్సపట్నంలోని బలిఘట్టం శ్రీ బ్రహ్మలింగేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం మహా శివరాత్రి పుజలు, దర్శనాలు ఘనంగా నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో వచ్చిన భక్తుల సౌకర్యార్ధం లిఫ్ట్ రూరల్ డవలప్మెంట్ వెల్ఫెర్ సొసైటీ ఆధ్వర్యం లో ఉచితంగా మజ్జిగ, మంచినీటి ప్యాకెట్స్, పులిహోర ప్రసాదం వితరణ చేపట్టారు. ఎండలు అధికంగా కాస్తుండటంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందుల పంపిణీ కూడా చేపట్టింది. ఈ కార్యక్రమం లో సంస్థ గౌరవ అధ్యక్షుడు ఐ.సుధాకర్, అధ్యక్షురాలు ఐ.అశ్వని, కార్యదర్శి ప్రసాద్ , సభ్యలు అడిగర్ల సతీష్,పృధ్విరాజ్,బి.శివ తదితరులు పాల్గొన్నారు.
విశాఖలోని భీమిలీలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో సహా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం భీమిలీ మూడోవ వార్డ్ నెరేళ్ళ వలస కాలనీలో మంత్రి కుటుంబ సభ్యులు, 11వ పోలింగ్ బూత్ వద్ద ఓటు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటుహక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన మంత్రి కుటుంబం అందరి మాదిరిగానే క్యూలైన్ లో నిలబడే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి జ్ఞానేశ్వరి, కుమార్తె ఆరోవ వార్డు కార్పొరేటర్ అభ్యర్ది డాక్టర్ ప్రియాంక, శ్రావణ్ కుమార్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కుటుంబానికి సుస్థిర ఆదాయం అందేలా చేసేందుకు, మహిళా సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వైఎస్సార్ చేయూత పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి మహిళలకు సూచించారు. మంగళవారం కరప మండలంలోని ఆరట్లకట్ట గ్రామంలో వైఎస్సార్ చేయూత కింద పాడిపశువుల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు అందించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్సార్ చేయూత పథకం పరిధిలో గ్రామంలో పాడిపశువులు పొందేందుకు 106 మందికి రుణాలు మంజూరు కాగా.. ఇప్పటికే 33 యూనిట్లు గ్రౌండ్ అయినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా అందించిన పాడి పశుపోషణతో ఆదాయంతో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుందని, కుటుంబానికి పోషణ భద్రత లభిస్తుందని వివరించారు. సచివాలయానికి అనుసంధానంగా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయని, వీటివల్ల మహిళా పాల ఉత్పత్తిదారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా మహిళా పాడి రైతులు అందించే పాలకు బయట మార్కెట్ కంటే ఎక్కువ ధర లభిస్తుందన్నారు. దీనికోసం ప్రభుత్వం అమూల్ కంపెనీతో ఒప్పందం చేసుకుందని వివరించారు. అమ్మిన పాల పరిమాణం, వెన్న శాతం ఆధారంగా డబ్బులు నేరుగా మహిళల ఖాతాల్లో జమవుతుందన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బ్యాంకులకు సక్రమ చెల్లింపుల ద్వారా ఏటికేడు అధిక ప్రయోజనం పొందాలని సూచించారు. అదే విధంగా పథకం ద్వారా లబ్ధిదారులు ఇచ్చిన ఆప్షన్ మేరకు మేకలు, గొర్రెలు యూనిట్లు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అల్లానా గ్రూప్ మీట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని, దీంతో గొర్రెలు, మేకల పెంపకందారులకు ఎంతో ప్రయోజనం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమం అమల్లో బ్యాంకర్ల పాత్ర ఎంతో ఉందని కలెక్టర్ ప్రశంసించారు. ఆరట్లకట్ట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ద్వారా జిల్లాలో అత్యధిక పశు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించడమే కాకుండా రూ.కోటికి పైగా రుణాలు అందించిన బ్రాంచ్ మేనేజర్ టి.కమలాకరరావును కలెక్టర్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంకు లింకేజీలో ఈ బ్రాంచ్ ముందుందని కలెక్టర్ ప్రసంశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, పశుసంవర్థక శాఖ జేడీ ఎన్‌టీ శ్రీనివాసరావు, ఎల్‌డీఎం జె.షణ్ముఖరావు, కరప ఎంపీడీవో కె.స్వప్న తదితరులు పాల్గొన్నారు.
పాడేరు డివిజన్ లోని మత్స్యగుండం ఆలయం వద్ద 11న మహాశివరాత్రి సందర్భంగాభక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డీఓ కె.లక్ష్మీ శివ జ్యోతి తెలిపారు. సోమవారం మత్స్యగుండం ఆలయంలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. శివుని గుడి వద్ద దర్శనము చేసుకునే భక్తులకు క్యూ లైన్ లో పంపించాలని అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆమె అధికారులకు తెలిపారు. స్నానాలకు వెళ్లేవారకి ప్రమాదాలు జరుగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటుచేసేమని గ్రామీణ మంచినీటి శాఖా అధికారులు మంచినీరు సరఫరా చేస్తున్నట్లు , ఆర్టీసి వారు 20 బస్సులు నడుపుతారని ఆమె తెలిపారు. 3రోజులు విద్యత్ కి అంతరాయం కలుగకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఆలయానికి 5 మీటర్ల దూరాన వాహనాలను ఆపివేయాలని తెలిపారు. తాహశీల్దార్ వై.బి.కోటేశ్వరావు ,ఇఒఆర్డి ఉమామహేశ్వరరావు ,ఆర్ఐ నల్లన్న పాల్గొన్నారు.
స్త్రీలు విద్యావంతులైతే, సమాజం పురోభివృద్ది చెందుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ స్పష్టం చేశారు. ఆడపిల్లలను కూడా బాగా చదివించాలని ఆయన కోరారు. జిల్లా మహిళాభివృద్ది, శిశు సంక్షేమశాఖ ఆద్వర్యంలో స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో సోమవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతే, కుటుంబం తో పాటు, ఆ గ్రామం, తద్వారా సమాజం కూడా అభివృద్ది చెందుతుందనడానికి తన జీవితమే ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యుత్, రవాణా సదుపాయాలు కూడా లేని ఒక మారుమూల కుగ్రామంలో తాను జన్మించినప్పటికీ, తన తల్లి విద్యావంతురాలు కావడం వల్ల, తాను ఒక ఐఏఎస్ స్థాయికి ఎదిగానని చెప్పారు. తన అభివృద్దికోసం, తన మాతృమూర్తి, కన్నప్రేమను కూడా ప్రక్కనబెట్టి, తనను చిన్నప్పుడే చదువుకోసం దూరంగా పంపించారని తెలిపారు. తనతల్లి తనతోపాటు, గ్రామంలోని ఎందరినో విద్యావంతులను చేశారని, ఫలితంగా సుమారు 300 మంది ఉద్యోగాలను పొంది, గ్రామం ఎంతో అభివృద్ది చెందిందని తెలిపారు. చదువు సంస్కారాన్ని, వికాశాన్ని, ఉద్యోగాన్ని ఇవ్వడంతోపాటు అభివృద్దిని కూడా ఇస్తుందని పేర్కొన్నారు.
ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్దిని సాధిస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్‌గా తాను సాధించిన అవార్డులు, పురస్కారాలు, ప్రశంసలు వెనుక ఎంతోమంది మహిళా అధికారులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. మహిళా అధికారుల తోడ్పాటుతోపాటు, తన భార్యామణి సహకారం కూడా సంపూర్ణంగా లభించడం వల్లే విజయవంతమైన, ప్రజా కలెక్టర్‌గా ఈ మూడేళ్లు పనిచేయగలిగానని అన్నారు. కరోనా నియంత్రణలో కూడా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. జిల్లాను హరిత వనంగా మార్చేందుకు కృషి జరుగుతోందని, విజయనగరం పట్టణాన్ని ఒక మోడల్ టౌన్ గా తీర్చిదిద్దుతానని కలెక్టర్ తెలిపారు.
విపత్తుల నిర్వహణాశాఖ జిల్లా మేనేజర్ బి.పద్మావతి మాట్లాడుతూ, స్త్రీల సౌశీల్యాన్ని, వారి పురోగతిని చాటిచెప్పడానికి ఇలాంటి ఉత్సవాలు దోహదపడతాయని అన్నారు. స్త్రీ అక్షయ పాత్ర లాంటిదని, ఆమె సహనానికి, ఓర్పునకు ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో తల్లి,తండ్రి, గురువు తమ పాత్రలను సరిగ్గా పోషించి, నేటి తరాన్ని చక్కగా తీర్చిదిద్దనట్లయితే, స్త్రీలకు గౌరవం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. గతానికి భిన్నంగా ప్రస్తుత స్త్రీ అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతోందని చెప్పారు.
జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి జె.విజయలక్ష్మి మాట్లాడుతూ, ప్రపంచంలోనే సగభాగమైన స్త్రీలు, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది చెందినప్పుడే, మహిళా సాధికారత సాధ్యపడుతుందన్నారు.
అక్షరాశ్యులైన స్త్రీలు ఉద్యోగాలను పొందడం ద్వారా మహిళా సాధికారత దిశగా పయనిస్తున్నప్పటికీ, ఎంతోమంది మహిళలు నేటికీ వెనుకబడి ఉన్నారని, వారి అభ్యున్నతిపైనా దృష్టి పెట్టాలని కోరారు. మహిళాభివృద్దికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతినిస్తోందని, వారికోసం మాతృత్వ వందన, సంపూర్ణ పోషణ తదితర పలు ప్రత్యేక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.
జిల్లా స్త్రీ,శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.రాజేశ్వరి మాట్లాడుతూ విశ్వగమనానికి స్త్రీ మూలాధారమని పేర్కొన్నారు. చెల్లిగా, తల్లిగా, భార్యగా ఆమె బహుముఖ పాత్ర పోషిస్తూ, సమాజంలో సగభాగమై నిలిచిందన్నారు.
జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాతామహులు రత్నమ్మ, రామ్‌నాయక్‌లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు మహిళా అధికారులు డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, ఆర్‌వి నాగరాణి, చంద్రావతి, మంజులవాణి, విజయశ్రీ, మల్లికాంబ, అనురాధా పరశురామ్, ఎపిడి బి.శాంతకుమారి, పలువురు సిడిపిఓలు, సూపర్‌వైజర్లు, విశ్రాంత అధికారులు పాల్గొన్నారు.
చింతపల్లి మండలంలోని చౌడుపల్లి పంచాయతీ బౌర్తి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుల్లెల సత్యరాజును ఐ టీడీఏ ప్రోజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల సస్పెండ్ చేశారు. సోమవారం మండలం పర్యటనలో బాగంగా బౌర్తి పాఠశాలను తనిఖీ చేశారు. మనబడి నాడు నేడు పనుకు తనిఖీ చేశారు.మనబడి నాడు పనులు అసంపూర్తిగా నిలిచి పోయాయి. ఉపాధ్యాయుడు రూ.5వేలు వేతనం ఇచ్చి వాలంటీర్ ను నియమించి ఆయన విధులకు గైరు హాజరయ్యారు. 5వతరగతి విద్యార్థులు కనీసం అ, ఆ,లు చెప్పలేకపోతున్నారని విద్యా ప్రమాణాలు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు పాఠశాలకు వస్తున్నది లేనిది గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం పై ఆరాతీశారు. పిల్లలకు యూనిఫామ్ కట్టించాలని తలిదండ్రులకు సూచించారు.