1 ENS Live Breaking News

సింహాద్రినాధుడి స్వర్ణకవచం బ‌హుక‌ర‌ణ‌.. ‌

విశాఖ‌లోని  సింహాచలం శ్రీవరాహాలక్ష్మీనృసింహస్వామివారికి  జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు, అప్పన్న చందనోత్సవ కమిటీ మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు దంపతులు అపురూపమైన క‌వ‌చాన్ని విరాళంగా అందజేశారు. దశమి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకొని శుక్రవారం ఉదయం 27 కేజీల ఇత్తడి కవచం ఆలయ వర్గాలకు అందజేశారు . ఈ కవచం సింహాద్రినాధుడి స్వర్ణకవచం అలంకరణకు వినియోగించనున్నారు. ఈ సందర్భంగా దాత గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, సింహాచలం ప్రాంతంలో జన్మించడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. గతంలో కూడా అప్పన్న నిత్యన్నధాన పథకానికి తాను రూ .3 లక్షలు విరాళంగా అందజేయడంతో పాటు తమ కుటుంబ సభ్యులు మరికొంత మొత్తాన్ని అందజేశార‌ని తెలిపారు. అంతే కాకుండా స్వర్ణ పుష్పాలు, స్వర్ణ తులసీదళాలు కూడా తాము విరాళంగా అందజేశామ‌న్నారు. తాజాగా స్వర్ణ కవచ అలంకరణకు అవసరమైన ఇత్తడి కవచం అందజేసే అదృష్టం లభించిందన్నారు. ఆలయ ఏఇఓ రాఘవకుమార్ కు ఈ కానుకను శ్రీనిబాబు దంపతులు అందజేశారు. తొలుత ఇత్తడి కవచంకు ఆలయ అర్చకలు సింహాచ‌ల‌ ఆచార్యులు , పెద్దిరాజు తదితరులంతా స్వామివారి పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో శిల్పి పండూరి అయ్యప్ప , పండూరి సాంబ , నాయుడు  పాల్గొన్నారు. అంత‌కు ముందు దాత కుటుంబ సభ్యులు స్వామిని దర్శించుకొని ప్ర‌త్యేక‌ పూజలు నిర్వహించి తీర్ధ ప్ర‌సాదాలు స్వీక‌రించారు.

Simhachalam

2021-01-08 13:38:53

సకాలంలో ఇళ్ల స్థలాల పంపిణీ చేపడతాం..

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న "నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు " కింద లబ్ధిదారులకు నిర్ధేశిత సమయంలోగా ఇంటి పట్టాలను వేగవంతంగా పూర్తి స్థాయిలో అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వివరించారు. విజయవాడ నుంచి మంగళవారం ఇంటి పట్టాల పంపిణీ, ఎన్ఆర్ఈజిఎస్, నాడు - నేడు పనులు, అమ్మఒడి, వివిధ రహదారులకు సంబంధించి భూమి సేకరణ, ఇంటింటికి బియ్యం సరఫరా తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ లోని ఎన్ఐసి భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ "నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు " కింద జిల్లాలో పూర్తి స్థాయిలో త్వరితగతిన ఇంటి పట్టాలను పంపిణీ చేస్తామని తెలిపారు. జిల్లాలో గత నెల డిసెంబర్ 25వ తేదీన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేయడం మొదలుపెట్టామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2.19 లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్నామని, లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలోనే వారికి ఇంటి పట్టాలను అందజేస్తున్నామన్నారు. సొంత స్థలాలలోనే లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్నామని, ఇంటి పట్టాలను అందుకున్న మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఇంటి పట్టాల పంపిణీ చేస్తున్నామని, నిర్దేశిత సమయంలోగా ఇంటి పట్టాలను పంపిణీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కి జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపిఓ ప్రేమచంద్ర, డీఈవో శామ్యూల్, ఎపిఈడబ్ల్యూసి అండ్ ఎస్ఎస్ఏ ఈఈ శివకుమార్, ఐసిడి ఎస్ పిడి విజయలక్ష్మి, డిఎం హెచ్ ఓ కామేశ్వర ప్రసాద్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, డిప్యూటీ కలెక్టర్ వరప్రసాద్, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, డి ఎస్ ఓ రఘురాం రెడ్డి, ట్రాన్స్ కో ఎస్ ఈ రాజశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, అధికారులు పాల్గొన్నారు.  

Anantapur

2021-01-05 18:56:48

సంబర జాతరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి..

సంబర పోలమాంబ జాతరలో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని పార్వతీపురం సబ్ కలెక్టర్ విధేఖర్ ఆదేశించారు. మంగళవారం శంబర గ్రామాన్ని ఐ టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి. కూర్మనాధ్ తో కలసి సబ్ కలెక్టర్ విధేఖర్  సందర్శించారు.  ముందుగా చదురు గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి బి.ఎల్.నగేష్ కండువాలతో ఇద్దరు అధికారులను సత్కరించారు.  అనంతరం చదురు గుడిలో  భక్తులరాకపోకలను అడిగి తెలుసుకున్నారు.  జాతరలో క్యూలైన్లు ఏర్పాటు, టికెట్ కౌంటర్ ఏర్పాటు, ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు వివరాలను ఆలయ ఈ వో ని అడిగితెలుసుకున్నారు.  చదువు గుడి వెనుక అమ్మవారి గుడిని అనుసరించి వున్న ఖాళీ స్థలాన్ని జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తాత్కాలికంగా తీసుకోవాలని ఆదేశించారు.  అనంతరం నీలాటిరేవుని పరిశీలించారు.  నీలాటిరేవు ప్రాంతమంతా తీవ్రదుర్గంధం వెదజల్లుతూ , పారిశుద్ద్యం పేరుకుపోవడంతో సబ్ కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.  పక్కనే వున్న గ్రామ కార్యదర్శిని పిలిచి తక్షణమే పారిశుద్ద్య పనులు చేపట్టాలని ఆదేశించారు.  ఎంతో పెద్ద జాతర జరుగుతున్న గ్రామంలో పారిశుద్ద్యం అధ్వానంగా ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  తదుపరి అమ్మవారి చదురు గుడి వెనుక గల జాతర స్తలాన్ని పరిశీలించారు.  జాతరలో క్యూలైన్లు ఏర్పాటు, ఉచిత దర్శనాన్ని పరిశీలించారు.  జాతరలో క్యూలైన్లు ఏర్పాటు, ఉచిత దర్శనం వివరాలు అడిగి తెలుసుకున్నారు.  తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ప్రస్తుతమున్న మరుగుదొడ్ల పనితీరుపై,  కేశఖండన ప్రదేశానికి సంబందించిన వివరాల పై ఆరా తీశారు..  జాతరలో భక్తులకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  నీలాటిరేవు మరమ్మత్తులు చేపట్టాలని పంచాయితీరాజ్ శాఖని ఆదేశించారు.  తదుపరి వనం గుడి ప్రదేశాన్ని పరిశీలించారు.  జాతర సందర్భంగా సిరుమాను తిరిగే ప్రదేశాలను, తిరిగే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.         ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ విధేఖర్, ఐటిడిఎ పి.ఓ. కూర్మనాధ్ వెంట ఆలయఈవో బిఎల్ నగేష్, తహశీల్దారు డి.వీరభద్రరావు, మండల పరిషత్ అభివృద్ది అధికారి సిహెచ్ సూర్యనారాయణ, ట్రాన్సుకో అసిస్టెంట్ ఇంజనీరు శివశంకర్ లతో పాటు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Sambara

2021-01-05 17:58:57

పంచాయతీ నిధులు బొక్కిన వారిపై వేటుకి సిద్దం.. ఈఎన్ఎస్ లైవ్ కధనాలకు స్పందన

విశాఖజిల్లా, ఎస్.రాయవరం మండలంలో సచివాలయ నిధులు  రూ.10 లక్షల ను వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు అడ్డగోలుగా దారి మళ్లించుకున్న ఈఓపీఆర్డీ మరో ఇద్దరు సచివాలయ కార్యదర్శిలపై వేటు వేయడానికి జిల్లా పంచాయతీ అధికారులు రంగం సిద్ధం చేశారు.  ఈఓపీఆర్డీ త్రిమూర్తులు స్పెషల్ ఆఫీసర్ గా పనిచేసిన చోట జరిగిన చేసిన అవినీతి వ్యవహారాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా బాహ్య ప్రపంచానికి ఆధారాలతో సహా తెలియజేసింది. దీనితో ఈఎన్ఎస్ లైవ్ కథనాల ఆధారంగా ఏ.ఎల్ పురం, ఎస్.రాయవరం మండలంలోని పలు సచివాలయాల్లో పనిచేసిన కాలంలో కూడా త్రిమూర్తులు అవినీతికి పాల్పినట్టు  ఇటు కలెక్టర్ కు, డిపీఓ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కు సుమారు 50 ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై స్పందించిన విశాఖజిల్లా పంచాయతీ అధికారి క్రిష్ణకుమారి త్రిమూర్తులు మరో ఇద్దరు సచివాలయ కార్యదర్శిల అవినీతి పై విచారణకు ఆదేశించారు. వెంటనే వీరి అవినీతిపై నర్సీపట్నం డిఎల్పీఓ శిరిషారాణి విచారణ చేపట్టి నివేదికు డిపీఓకు అందించారు. ఆపై దానిని కమిషనర్ కు డిపిఓ నివేదించడం, అవినీతి జరిగినట్టు రుజువు కావడంలో సదరు సచివాలయ సిబ్బందిపై వేటు వేయడానికి చార్జిషీటు వేయాల్సిందిగా కమిషనరేట్ నుంచి డిపిఓకు ఉత్తర్వులు అందాయి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కుడా పచ్చజెండా ఊపడంతో అక్రమార్కులపై వేటువేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు డిపీఓ క్రిష్ణకుమారి ఈఎన్ఎస్ కు ప్రత్యేకంగా తెలియజేశారు. వాస్తవంగా ఈఓపీఆర్డీ స్థాయి అధికారిని సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్ కు లేదు. దీనితో అతను చేసిన అవినీతిపై చార్జిషీట్ ద్వారా కేసు ఫైల్ చేశారు. ఈఓపీఆర్డీ చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా, విచారణ నివేదికను పక్కదారి పట్టించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమార్కుల పాచికలు పారలేదు. ఎట్టకేలకు పంచాయతీరాజ్ కమిషనర్ చర్యలకు ఉపక్రమించడంతో వారిపై వేటు అనివార్యమైంది. పంచాయతీ నిధులు కాజేసిన ఈఓపీఆర్డీ త్రిమూర్తులు   పాయకరావుపేట నియోజకవర్గంలో యాక్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఒక చోటా నేతతో అధికారుల ద్వారా తనపై వేటు తప్పించుకోవాలని చూస్తున్నట్టుగా నియోజవకర్గంలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి తేడా వ్యవహరాలు చేస్తున్నందుకు ఇప్పటికే ఎమ్మెల్యే అతనిని దూరంగా పెట్టారు కూడా అయినా తన మాటకు విలువ వుందంటూ సదరు యాక్టింగ్ ఎమ్మెల్యే తన హవాని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని విజయవాడ కమిషనరేట్ స్థాయిలో పైరవీలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నిధుల దుర్వినియోగం విషయంలో పక్కాగా ఆధారాలు ఉండటంతో అవినీతి ఈఓపీఆర్డీ, మరో ఇద్దరు సిబ్బందిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

s.rayavaram

2021-01-04 18:32:58

సొంతింటి కల తీరింది సీఎం వైఎస్ జగన్ వలనే..

ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి సీఎం వైఎస్ జగన్ 35 లక్షల మందికి ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తున్నారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం  శంఖవరం మండలం మండపం గ్రామంలో నవరత్నాలు - పేదలందరికీ ఇండ్లు/ స్థల పట్టాల పంపిణీ / వైఎస్సార్ జగనన్న కాలనీ నిర్మాణం పధకంలో భాగంగా తొలి దశలో 249 మంది లబ్దిదారులకు సంబంధించిన ఇండ్ల స్థల పట్టాలను ఎమ్మెల్యే  పంపిణీ చేసారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,  కులం, మతం, పార్టీ, ప్రాంతాల వివక్షకు, భేషజాలకు అతీతంగా అర్హూలందరికీ పారదర్శకంగా, చిత్త శుద్ధితో ఇల్లు, ఇళ్ళ స్థలం పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. ప్రతీ బిడ్డ విద్యాభివృద్ధికి జగనన్న అమ్మ ఒడి పధకం లక్షలాది కుటుంబాలకు విద్యా వెలుగులు అందిస్తున్న దన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల్లోని ప్రతీ రైతుకూ రైతు భరోసా అందుతోందన్నారు. వైఎస్సార్ ఆసరా పధకం గురించి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయల డ్వాక్రా రుణాలను జగన్ మాఫీ చేశారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి అధికారంలో ఉంటే సుమారు 46 పైగా ప్రభుత్వ  సంక్షేమ పధకాలు అర్హూలందరికీ అందుతాయని ఎమ్మెల్యే వివరించారు. ఇంకా పలు విషయాలను ఆయన కూలంకషంగా సభికులకు వివరించారు. గృహ నిర్మాణ శాఖ డిఈ. సురేష్ బాబు మాట్లాడుతూ గుడా, నాన్ గుడా గ్రామాల్లో ఈ పధకాల గురించి వివరించారు. ఈ గ్రామంలో 420 మందికి ఇంటి పట్టాలిస్తున్నామని, భవిష్యత్తులో ఈ  ఊరికి రూ. 4.20 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది వివరించారు.            డిసీసీబీ. డైరెక్టర్ శెట్టిబత్తుల కుమార్ రాజా మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలు అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలనే సత్సంకల్పంతో సుమారు 46 సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి విజయ వంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకనాటి ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్ళ స్థలాలను ఇవ్వాలని సంకల్పించి మూడు సార్లు ప్రయత్నించి విఫలం అయ్యారని, ఆయన కుమారుడు నేటి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని లక్షలాది నిరుపేదలకు ఇళ్ళ స్థలాలను, ఇండ్లను ఇస్తున్నారని  తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం అన్నారు. ఇప్పటి లబ్దిదారులు కాక ఇంకా మిగిలిన అర్హులైన వారూ ఇళ్ళ స్థలాలు, ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉందని, సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో. రాంబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  గృహ నిర్మాణ శాఖ సహాయక ఇంజనీర్ వెంకటరమణ, ఈవోపీఆర్డీ  కాశీవిశ్వనాధ్, ఉపాధి పధకం ఏపీఓ.సత్యనారాయణ, మండపం సచివాలయం 1 కార్యదర్శి నాగమణి, వీఆర్వోలు లోవరాజు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, అన్నవరం ఎంపీటీసీ. సభ్యుడు దఫాలుగా సతీష్  తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-01-03 17:15:06

పేదల అవసరాలు అడగకుండానే తీరుస్తున్నాం..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు కావలసిన అవసరాలను అడగకుండానే తీరుస్తూ ప్రజారంజకమైన పాలన అందిస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణదాస్ అన్నారు.  నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పధకంలో  భాగంగా   ఆదివారం పాయకరావుపేట నియోజక వర్గం కోటవురట్ల మండలం పాములవాక, పీ కే పల్లి, చినబొ డ్డేపల్లి , ఆకసాహెబ్ పేట గ్రామ పంచాయతీ లకు చెందిన  211 మంది సొంత ఇళ్లు లేని అర్హులైన పేద లబ్ది దారులకు స్థల పట్టాలను మంత్రి అందజేశారు.    సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన  అర్హులందరికీ వైయస్సార్ జగన్ అన్న కాలనీలలో ఇళ్ల స్థలాలను ఇవ్వడంతో పాటు, ఇంటి నిర్మాణాలను చేపట్టి గ్రామగ్రామాన పండగ వాతావరణాన్ని కల్పిస్తున్నారన్నారు . ప్రతి నిరుపేద కుటుంబంలో ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందన్నారు.         ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో  ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని నవరత్నాలలో సొంత ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటికి స్థలాలను ఇస్తున్నారని, అంతే కాకుండా వాటి నిర్మాణాలను కూడా చేపట్టి మహిళ లను ఇంటి యజమానులుగా చేస్తున్నారన్నారు.          వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విద్య వైద్య రంగాలకు కూడా ప్రాముఖ్యత కల్పిస్తూ పలు అభివృద్ధి పథకాలను అందిస్తున్నారన్నారు. గ్రామాలలోనూ పట్టణాలలోనూ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి పారదర్శకంగా పరిపాలనను కొనసాగిస్తున్నార న్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పాలన అందిస్తూ దేశంలో సమర్ధుడైన మూడో ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. రానున్న రోజులలో మొదటి స్థానంలో నిలుస్తారని ఆశిస్తున్నానన్నారు. వ్యవసాయ రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ను అందించడం ద్వారా వారికి ఆర్థిక చేయూత నిస్తున్నారన్నా రు. అమ్మఒడి, పింఛన్లు , ఆరోగ్యశ్రీ తో పాటు పలు  రకాల పథకాలను అర్హులందరికీ చేరే విధంగా అమలు చేస్తున్నారన్నారు. బీసీల సంక్షేమం కోసం 56 రకాల బీసీ కార్పొరేషన్ లకు చైర్మన్లను , డైరెక్టర్లను నియమించిన  ఘనత ముఖ్యమంత్రి దేని అన్నారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అనుకున్న లక్ష్యాలను సాధించి భారత ప్రధాని చేత ప్రశంసలు పొందారన్నారు. నివర్ తుపానుకు పంట నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తూ ఇన్పుట్ సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేశారన్నారు.      ఈ సందర్భంగా మంత్రి పాములవాక గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ పనుల నిమిత్తం రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు.           అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బి వి సత్యవతి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి అని మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ, మహిళలందరినీ లక్షాధికారులగా చేస్తూ వారి పేరునే ఇంటి స్థలం ఇస్తున్నారని మనమందరం వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాములవాక గ్రామం లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి , సోలార్ లైట్లు ఏర్పాటుకు ఎంపీ ల్యాండ్ నిధుల నుండి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.             పాయకరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గొల్ల బాబూరావు మాట్లాడుతూ ఈరోజు ఎంతో   శుభ దినం  అనీ ,ఇళ్ల పట్టాల పండుగ సంక్రాంతికి ముందే వచ్చిందని, నివసించేందుకు సొంతఇల్లు అనే స్థి రాస్తి సంపాదించుకోలేమనే బాధ నుండి ఊరట లభించిందన్నారు.                    నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ  పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం లో సుమారు 1507 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో పాములవాక , పీకే పల్లి , చిన్న బొడ్డేపల్లి, అకా సాహెబ్ పేట గ్రామ పంచాయతీలలో 211 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థల పట్టాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులై ఉండి ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే సంబంధిత గ్రామ , వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి 90 రోజుల లోపల అర్హులకు ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో  పాయకరావుపేట  ప్రత్యేక అధికారి విశ్వేశ్వరరావు , కోట వురట్ల తహసీల్దార్ బి రామారావు, మాజీ ఎమ్మెల్సీ డి వి సూర్య నారాయణ రాజు, ఇతర  రెవెన్యూ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

Kotavuratla

2021-01-03 16:42:21

ప్రభుత్వ భవనాలు తక్షణమే పూర్తిచేయాలి..

అనంతపురం జిల్లాలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం గుడిబండ మండలం లోని మోరుబాగల్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తి తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా గ్రామసచివాలయ, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులు వేగంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మహబూబ్ పీరా, ఎంపీడీవో నాగేంద్ర కుమార్, పలువురు అధికారులు, సచివాలయ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Gudibanda

2021-01-02 19:14:52

సచివాలయాలను శుభ్రంగా ఉంచాలి..

అనంతపురం జిల్లా సచివాలయంలో గడువు దాటి ఒక్క సమస్య కూడా పెండింగ్ ఉంచరాదని, ఎప్పటికప్పుడు సచివాలయానికి వచ్చే సర్వీసులకు పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం సాయంత్రం మడకశిర మండలం లోని కదిరేపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయంకు వచ్చే సర్వీసులను పరిష్కరించేందుకు ప్రతిరోజు పర్యవేక్షించాలని ఎంపీడీవోను ఆదేశించారు. కదిరేపల్లి సచివాలయంలో 12 గడువు తీరిన సర్వీసులు పెండింగ్ ఉండడం పట్ల నిర్ణీత సమయంలో పరిష్కరించాల్సిన సమస్యలను ఎందుకు పెండింగ్లో ఉంచారని ప్రశ్నించారు. ఆదివారం లోపు అన్ని గడువు దాటిన సమస్యలన్నింటిని పరిష్కరించాలని ఆదేశించారు. సర్వీసులకు గడువు దాటినా కూడా పరిష్కారం చూపించక పోవడం, సచివాలయాన్ని పరిశుభ్రంగా ఉంచకపోవడంతో డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు జాగ్రత్తగా పని చేసి ఎప్పటికప్పుడు సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సచివాలయంలో శుభ్రత పాటించాలని, పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇవ్వాలి.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇంటి పట్టాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని,  ఏ ఒక్కరూ మిస్ కావడానికి వీలులేదన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గూగుల్ మ్యాప్ లో సచివాలయాన్ని మ్యాపింగ్ చేశారా లేదా అని ఆరా తీశారు. అంతకుముందు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల వివరాలని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రాజ్ గోపాల్, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

Madakasira

2021-01-02 18:58:43

ఎంపీడీఓ, కార్యదర్శిలకు మెమోలు..

శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం గొటివాడ గ్రామ పంచాయతీ కార్యదర్శి జి.వెంకటేష్ కు, జలుమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎం.పి.డి.ఓ)కు మెమోలు జారీ చేసినట్లు వార్డు, గ్రామ సచివాలయం, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. సారవకోట మండలం బుడితి, నరసన్నపేట మండలం ఉర్లాం, జలుమూరు మండలం గొటివాడ గ్రామ సచివాలయాలను శని వారం తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ సచివాలయంలో ప్రభుత్వం సూచించిన మేరకు ప్రభుత్వ పథకాల వివరాలు తెలియజేసే సమాచారం అందుబాటు, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. గొటివాడలో ప్రభుత్వ పథకాల సమాచారం అందుబాటులో పెట్టనందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ కు మెమో జారీ చేసారు. పర్యవేక్షణ లోపభూయిష్టంగా ఉన్నందుకు ఎం.పి.డి.ఓకు కూడా మెమో జారీ చేసారు.  ప్రభుత్వ పథకాల జాబితాను ప్రజల సమాచార నిమిత్తం సచివాలయాల్లో బహిరంగంగా ప్రదర్శించాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు. వివిధ పథకాల క్రింద అర్హత సాధించిన లబ్దిదారుల జాబితా సైతం ప్రదర్శించాలని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో వివిధ విభాగాల సహాయకులు తు.చ తప్పకుండా విధులు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయాలని ఆయన ఆదేశించారు. ప్రజల నుండి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను నిర్ధేశిత సమయంలో పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేసారు. సమయానుసారం ప్రభుత్వం, ఉన్నత అధికారుల నుండి అందే ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు విధులు నిర్వహించి విజవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలో వాహనాలు నిలుపుదల చేయరాదని, వాహనాల పార్కింగుకు సరైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు.

Jalumuru

2021-01-02 18:26:10

సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలి..

అనంతపురం  జిల్లాలోని గుడిబండ మండల కేంద్రంలోని 1వ గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గూగుల్ మ్యాప్ లో గుడిబండ 1వ గ్రామ సచివాలయాన్ని మ్యాపింగ్ చేశారా లేదా ఆరా తీశారు. అనంతరం గ్రామ సచివాలయంలో రిజిస్టర్ లను పరిశీలించారు. గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సచివాలయ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు సచివాలయం ద్వారా ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్క సర్వీసులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తి, గుడిబండ ఎంపీడీవో నాగేంద్ర కుమార్, ఈ ఓఆర్డీ నాగరాజు నాయక్, వెల్ఫేర్ అసిస్టెంట్ గోవిందరాజులు, డిజిటల్ అసిస్టెంట్ రాజు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Gudibanda

2021-01-02 18:21:58

అప్పన్నకు పూజలు చేసిన అవంతి దంపతులు..

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు  దంపతులు సింహాచలం అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ  నరసింహస్వామి వారిని దర్శించుకుని అనంతరం కప్ప స్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలు శుభిక్షంగా ఉండాలని, కరోనా వైరస్ పూర్తిస్థాయిలో నియంత్రణ జరగాలని స్వామివారిని వేడుకున్నట్టు కోరుకున్నట్టు చెప్పారు. నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అందించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింహాచలం బోర్డ్ సభ్యులు,  స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు,ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Simhachalam

2021-01-01 20:49:33

అన్ని ప్రాంతాలు సమాన అభివ్రుద్ధి..

విశాఖలో అన్ని నియోజకవర్గాలను పూర్తిస్థాయిలో అభివ్రుద్ధి చేయనున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం సింహచలంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. కోటి యాబై ఐదు లక్షలతో నిర్మించనున్న  సామాజిక భవనం, సీసీ రోడ్లు, సీసీ కాలువలు శంకుస్థాపన చేశారు. అనంతరం పేదలందరికి ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాలను అందచేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విశాఖను అంతర్జాతీయ స్థాయిలో అభివ్రుద్ధిచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషం గా ఉండాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.  2020 సంవత్సరంలో ఎదురైన కరోనా మహమ్మారి,  విపత్తులను  అధికమించి దైర్యంగా ఎదుర్కొని రాష్ట్రాన్ని  దేశంలోనే ఆదర్శం రాష్ట్రముగా తీర్చి దిద్దిన ఘనత ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Simhachalam

2021-01-01 17:03:21

రామతీర్థం దుర్ఘటనకు మంత్రి బాధ్యత వహించాలి..

విజయనగరం జిల్లా నెల్లిమర్ల రామతీర్థంలో శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పట్టుకొని అరెస్టు చేయాలని గాజువాక బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్జి నరసింగరావు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం గాజువాక తహశీల్దార్ కార్యాలయం ముందు రామతీర్ధం నింధితులను కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కెఎన్ఆర్ మాట్లాడుతూ, రామతీర్థంలో తక్షణమే నూతన రాముని విగ్రహాన్ని వెంటనే ఏర్పాటుచేయాలన్నారు. రాష్ట్రంలో తరచూ హిందూదేవాలయాలపై దాడులకు నైతిక బాధ్యతలహించి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్  వెంటనే రాజీనామ చేయాలని డిమాండ్ చేసారు. అనంతరం డిప్యూటీ తహశీల్దారుకి వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు గోలి.శంకరరావు,డా.గొర్లె.సత్యనారాయణ ,సిరసపల్లి .నూకరాజు , డా.శేషుప్రసాద్,నాగేశ్వరరావు,రమనరావు, బొండా.యల్లాజీ ,పావని,వర్రి.లలిత ,జిలకర్ర.భువనేశ్వరి,రోహిణి, తారావు, బొండా.శ్రీదేవి, సూరిబాబు, కృష్ణంరాజు, పుష్పలత, రామునాయుడు, కృష్ణ, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Gajuwaka

2020-12-31 13:51:21

జనవరి 7లోగా పట్టాల పంపిణీ జరగాలి..

తూర్పుగోదావరి జిల్లాలో జనవరి 7 వ తేదీ లోపు అల్లవరం మండలంలోని అన్ని గ్రామాల నిరుపేద లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయాలని  అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ అధికారులను ఆదేశించారు. బుధవారం సబ్ కలెక్టర్ అల్లవరం మండలం గోడి గ్రామంలో 115 మంది లబ్ధిదారుల కొరకు సిద్ధం చేస్తున్న 3 ఎకరాల 83 సెంట్లు ఇండ్ల స్థలాన్ని,అలాగే అల్లవరం మండల ప్రధాన కేంద్రం లో 192 మంది లబ్ధిదారులకు పంపిణీ నిమిత్తం సిద్ధం చేస్తున్న 4 ఎకరాల 52 సెంట్ల  స్థలాన్ని సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ, ,దీనిని దృష్టి లో వుంచుకొని అధికారులు ఇండ్ల స్థలాల కు సంభందించి మిగిలి వున్న పనులు అన్నిటినీ సత్వరం పూర్తి చేయాలని,  లబ్ధిదారుల కొరకు గుర్తించిన ఇండ్ల స్థలాల లో ఎక్కడైనా మెరక చేయవలసివున్నా,రెడ్ గ్రావెల్  వేయవలసి వున్నా,ఇంటర్నల్ రహదారులు తదితర చేయవలసిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 7 వతేది లోపు పంపిణీకి సిద్దం చేయాలని అల్లవరం మండల పరిషత్ అభివృద్ది అధికారి రాఘవులును,అలాగే ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. అసిస్టెంట్  ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్ ను సబ్ కలెక్టర్ ఆదేశించారు.సబ్ కలెక్టర్ వెంట ఎం.పి.డి.ఓ రాఘవులు,మండల తహసీల్దార్ అప్పారావు, ఏ.పి.ఓ. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Allavaram

2020-12-30 21:38:30

ప్రతీ నిరుపేదకి నవరత్నాలు అందజేస్తాం..

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం లో భాగంగా   బుధవారం పాయకరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గొల్ల బాబురావు నక్కపల్లి మండలం వేంపాడు, నెల్లిపూడి, డి ఎల్ పురం, గునుపూడి , బంగారమ్మ పేట, గ్రామపంచాయతీలు,  పాయకరావుపేట మండలం నమ్మ వరం , సీతారాంపురం, గుంటపల్లి గ్రామ పంచాయతీలలో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధి కొరకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని, అంతేకాకుండా ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు.            నక్కపల్లి, పాయకరావుపేట   మండల తాసిల్దార్ లు వి వి రమణ, పి అంబేద్కర్, రెవిన్యూఅధికారులు ,సిబ్బందిహాజరయ్యారు.

Payakaraopeta

2020-12-30 21:05:37