1 ENS Live Breaking News

పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం..

పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణాపురం లక్ష్మీ నగర్, నాయుడుకాలనీ , పాతినవారి పేట, బొడ్డేపల్లి పేట 8 వార్డులకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సోమ వారం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన సభాపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా దాదాపు 815 పట్టాలను పేదలకు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ  పేద ప్రజలకు గూడు కల్పంచాలనే ఆశయంతో ఇళ్ళ స్ధలాల పంపిణీ ప్రారంభించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,75,755 మంది అక్కా చెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ళ స్ధలాల పట్టాల పంపిణీ జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతంలో 1.50 సెంట్లు, పట్టణ ప్రాంతంలో ఒక సెంటు భూమిని జగనన్న ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.23,535 కోట్ల మార్కెట్ విలువగల 68,361 ఎకరాల భూమిని ఉచిత ఇళ్ళ పట్టాలుగా పంపిణీ జరుగుతుందని గుర్తు చేసారు.  రాష్ట్రంలోని పేదలందరికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో రూ.50,940 కోట్ల అంచనా వ్యయంతో రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ళ నిర్మాణం చేపట్టుటకు ప్రభుత్వం సంకల్పించిందని అందులో మొదటి దశలో రూ. 28,080 కోట్ల అంచనా వ్యయంతో 15.60 లక్షల ఇళ్ళ నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగిందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,005 వై.యస్.ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.21.345 కోట్ల విలువైన 2.62 లక్షల టిడ్కో గృహాల సేల్ అగ్రిమెంట్లను కూడా అక్కాచెల్లెమ్మలకు నేడు అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, హౌసింగ్ అధికారులు వర్మ, బొడ్డేపల్లి కోటేశ్వరరావు, స్ధానిక నాయకులు జే.జే.మోహన్ రావు, జే.కే.వెంక బాబు, బొడ్డేపల్లి అజంత కుమారి, అల్లంశెట్టి ఉమామహేశ్వర రావు, పొన్నాడ చిన్నా రావు తదితరులు పాల్గొన్నారు.

Amadalavalasa

2020-12-28 18:30:31

వైఎస్సార్సీపీ ప్రభుత్వంతోనే పేదోడికి సొంత గూడు..

రాష్ట్రం లో ప్రతీ నిరుపేద సొంత ఇంటి కల కేవలం ముఖ్య మంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఆదివారం ఉప్పలగుప్తం మండలం కిత్తన చెరువు గ్రామంలో మండల పరిధిలోని రెండు వేల 329 మంది నిరుపేద  లబ్ధిదారులకు మంత్రి ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే కిత్త నచెరువు గ్రామానికి చెందిన 135 మంది నిరుపేదలకు జగనన్న కాలనీ లో 2 కోట్ల 45 లక్షల తో నూతనంగా నిర్మించే ఇళ్ళ నిర్మాణానికి కూడా మంత్రి శంఖుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద సొంత ఇల్లు లేకుండా ఉండకూడదనేది ముఖ్యమంత్రి లక్ష్యమని ఈ ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల ఇళ్ళ పట్టాలను నిరుపేదలకు పంపిణీ చేశారని,ఇది కనీ, వినీ ఎరుగని చారిత్రాత్మక సంఘటన అని మంత్రి అభివర్ణించారు. ఇంటి నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి మూడు ఆప్షన్లు ఇచ్చారని వీటిలో లబ్ధిదారులు తమకు నచ్చిన ఆప్షన్ ను ఎంపిక చేసుకొని ఇంటిని నిర్మించు కోవచ్చునని మంత్రి తెలిపారు.ఇళ్ళ స్థలాల పట్టాలను నిరుపేదలకు ఇవ్వడం ద్వారా వారి కళ్లలో ఆనందాన్ని,వెలుగును ముఖ్య మంత్రి నింపారని మంత్రి తెలియ చేస్తూ పేదలందరి తరపున మంత్రి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్రి బాబ్జీ,అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ బొక్కా ఆదినారాయణ, డా. పినిపే  శ్రీకాంత్, చెల్లు బోయిన శ్రీనివాస్, మోటూరి సాయి, దంగేటి రాంబాబు, దంగేటి దొరబాబు,గెడ్డం సంపత్ కుమార్, జిన్నూరి వెంకటేశ్వరరావు,వంగా గిరిజ, గృహ నిర్మాణ శాఖ ఇ. ఇ. గణపతి, డి.ఇ.ఇ. నాగలక్ష్మి ఎం.పి.డి.ఓ. కె.విజయప్రసాద్,డిప్యూటీ తహసీల్దార్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Uppalaguptam

2020-12-27 21:40:37

నిరుపేదల పాలిట వరం జగనన్న ఇళ్లు..

రాష్ట్రంలో నిరుపేదలందరికీ ముఖ్యమంత్రి ఇస్తున్న ఇళ్లు వరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చెల్లు బోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు.   నవరత్నాలుపేదలందరికీ ఇళ్లు కార్యక్రమం లో భాగంగా ఆదివారం మంత్రి మల్కిపురం మండలం శంకర గుప్తం గ్రామంలో 241 మంది నిరుపేద మహిళలకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారని ఇది ఆయన ఒక్కడికే సాధ్యమని మంత్రి చెబుతూ నిరుపేదలందరికీ ఇండ్ల స్థలాల పట్టాలను ఇవ్వడం ద్వారా ప్రతి నిరుపేదకు ఆస్తిని ముఖ్యమంత్రి కల్పించారని దీనిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.ప్రతీ నిరుపేదకు సొంత ఇల్లు వుండాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల ఇండ్ల స్థలాల పట్టాలను నిరుపేద మహిళలకు పంపిణీ చేశారని,ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని మంత్రి కొనియాడారు.ముఖ్యమంత్రి ఆశించిన విధంగా ప్రతీ నిరుపేద సొంత ఇంటి ని నిర్మించు కోవాలని మంత్రి తెలియ చేసారు.జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ  నవరత్నాలుపేదలందరికీ ఇళ్లు కార్యక్రమం లో భాగంగా జిల్లాలో మూడు లక్షల 84 వేల మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని,అలాగే 1 లక్ష 50 వేలు గృహాలు మంజూరు చేయడం జరిగిందని  అన్నారు. ప్రతీ నిరుపేదకు ఇంటి స్థల పట్టా ఇవ్వటమే కాకుండా వారికి పొజిషన్ కూడా చూపించడం జరుగుతుందని ముఖ్య మంత్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతీ నిరుపేద సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ సూచించారు. అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి మూడు ఆప్షన్లు ఇవ్వడం జరిగిందని లబ్ధిదారులు తమకు నచ్చిన ఆప్షన్ ను ఎంపిక చేసుకొని ఇంటిని నిర్మించుకోవచ్చునని కలెక్టర్ తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు  కౌశిక్, ఎస్.సి మాల కార్పోరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి పెదపాటి అమ్మాజీ,రాజోలు శాసన సభ్యులు రాపాక వరప్రసాదరావు,తదితరులు పాల్గొన్నారు.

Malikipuram

2020-12-27 21:38:46

నిరుపేదల కష్టాలు తీర్చుతున్న దేవుడు సీఎం వైఎస జగన్..

సొంత ఇల్లు లేని ప్రతీ నిరుపేద అక్కాచెల్లెమ్మల కు సొంత ఇంటి కల సౌకర్యాన్ని కల్పించి వారి ముఖాలలో చిరునవ్వులను  చూడటమే మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్  జగన్ మోహన్ రెడ్డి  లక్ష్యమని చోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ అన్నారు. నవరత్నాలు- వైయస్సార్ జగనన్న ఇళ్ల పట్టాలు కార్యక్రమం రెండో రోజు శనివారం చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం చిన పాచిల, కొమిర , గుమ్మళ్ళపాడు ,మత్స్య పురం, కె బి పి అగ్రహారం ,బుడ్డి బంద, కవ్వగుంట గ్రామ పంచాయతీలకు, రోలుగుంట  మండలం వడ్డీప , బుచ్చింపేట, రత్నం పేట, బిబి పట్నం, ఎంకే పట్నం, ఆర్ల , రాజన్నపేట గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణాలకు అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.         ఈ సందర్భంగా శాసన సభ్యులు  కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు నవరత్నాలు అమలుకు సంబంధించి తన పాదయాత్రలో ఇచ్చిన మాటను  నిలబెట్టుకున్నారని, మాట  తప్పని, మడమ తిప్పని నేత మన జగనన్న అనీ, ఆయన చెప్పినట్లే  సొంత ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలాన్ని ఇస్తూ సొంత ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారన్నారు.            ఈ కార్యక్రమంలో  రావికమతం, రోలుగుంట మండలాల తాసిల్దార్ లు పీ కనకారావు, కృష్ణమూర్తి  ఇతర రెవెన్యూ అధికారులు , సిబ్బంది హాజరయ్యారు.

Ravikamatham

2020-12-26 21:42:38

నిరుపేదల సొంతింటి కల సాకారం అవుతోంది..

 రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరూ సొంత ఇల్లు లేకుండా వుండకూడదనే ముఖ్య మంత్రి వై .యస్. జగన్ మోహన్ రెడ్డి ఆశయానికి అనుగుణంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రతి నిరుపేద సొంత ఇంటి కల నవరత్నాలుపేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా నెరవేరుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. నవరత్నాలుపేదలందరికీ ఇళ్లు కార్యక్రమం లో భాగంగా  శనివారం అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామంలో  అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 4447 మంది నిరుపేద లబ్ధిదారులకు గృహాలను,ఇండ్ల స్థలాల పట్టాలను అమలాపురం పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి చింతా అనూరాధ తో కలిసి మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేసి కోటి మంది కలల సాకారం చేశారని మంత్రి చెబుతూ వారందరి కలలు ఈ రోజు వెలుగు చూశాయని మంత్రి అన్నారు. నవరత్నాలు_పేదలందరికీ ఇళ్లు పథకం  అద్భుతమైన పథకమని మంత్రి కొనియాడారు.ఈ ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం రాబోయే 15 రోజులు నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రతీ పంచాయితీ లోని లే అవుట్ లను అధికారులు సందర్శించి ఆయ లబ్ధిదారులకు పట్టాలను అందచేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.అమలాపురం పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి చింతా అనూరాధ మాట్లాడుతూ పేద మహిళల కొరకు నిరంతరం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆయన ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీనీ నెర వేస్తున్నారని 9 పథకా లకు హామీ ఇస్తే 90 కి పైగా పథకాలను అమలు చేస్తున్నారని ఎంపి అన్నారు. ఇళ్ల స్థల పట్టాల పంపణీ ని ఎందరో అడ్డుకున్నపటికిని పేద మహిళల కొరకు ముఖ్యమంత్రి పోరాడి మీ సొంత ఇంటి కల ను ముఖ్యమంత్రి నెరవేర్చారని ఎంపి తెలిపారు. రాబోయే ముప్పయి సంవత్సరాలు కూడా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా కావాలని కోరుకుందాం అని ఎంపి తెలియజేశారు.అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ మాట్లాడుతూ అమలాపురం డివిజన్ లో మొత్తం 14 వేల మంది నిరుపేద లబ్ధిదారులకు వెయ్యి ఎకరాలు ఇండ్ల స్థలాల నిమిత్తం భూ సేకరణ చేయడం జరిగిందని వీరందరికీ పట్టలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పట్టణ నిరుపేదలకు బోడస కుర్రు లో 1632 టిడ్ కో గృహాలను నిర్మించగా మరో 190 మందికి కూడా ఇండ్ల స్థలాల కొరకు స్థల సేకరణ చేయడం జరిగిందని,వీరికి కూడా పట్టాలు ఇస్తున్నామని సబ్ కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అల్లవరం మండలం బోడసకుర్రు లో 1632 మంది లబ్ధిదారుల కొరకు నిర్మించిన టిడ్ కో భవనాలను (51 బ్లాకులు) లబ్ధిదారులకు మంత్రి, ఎంపి అందజేశారు. మొత్తం 33 ఎకరాల విస్తీర్ణంలో టిడ్ కో భవనాలను నిర్మించడం జరిగింది.ఇందులో 300 ఎస్.ఎఫ్.టి తో 672 గృహాలు,365 ఎస్.ఎఫ్.టి తో 128 గృహాలు,అలాగే 430 ఎస్.ఎఫ్.టి తో 832 గృహాలు లబ్ధిదారులకు నిర్మించడం జరిగింది.అలాగే బోడసకుర్రు,వన్నేచింతలపూడి, తాండవపల్లి   గ్రామాలకు చెందిన మునిసిపాలిటీ పరిధిలోని మరో 2815 మంది లబ్ధిదారులకు ఒక సెంట్ చొప్పున ఇండ్ల స్థలాల పట్టాలను కూడా మంత్రి, ఎంపి  పంపిణీ చేశారు.ఇందులో ప్రత్యేకంగా బోడసకుర్రు గ్రామానికి చెందిన 474 మంది లబ్ధిదారులకు ఒక్కొక్క సెంటు చొప్పున (10.60 ఎకరాలు) ఇండ్ల స్థలాల పట్టాలను మంత్రి, ఎంపి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్,మునిసిపల్ కమీషనర్ వి.ఐ.పి.నాయుడు,హౌసింగ్ ఇ.ఇ. గణపతి,పట్టణ నాయకులు మట్ట పర్తి నాగేంద్ర, చెల్లు బోయిన శ్రీనివాస్, ఒంటెద్దు వెంకన్నా యుడు,షేక్ అబ్దుల్ ఖాదర్,మట్టపర్తి మురళీ కృష్ణ, గనిసెట్టి రమనలాల్, ఉండ్రు వెంకటేష్, నాగారపు వెంకటేశ్వరరావు, గొవ్వాల రాజేష్, కట్టోజు రాము, సంసాని బులినాని,కరెళ్ల రమేష్ బాబు,కర్రి వెంకట రామరాజు, పిచ్చిక శాంతి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Allavaram

2020-12-26 21:36:20

బడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల లో నవరత్నాలు - పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం రెండవ రోజు శనివారం నర్సీపట్నం నియోజకవర్గం  గొలుగొండ మండలంలో   నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ సొంత ఇల్లు లేని నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.  గొలుగొండ మండలం గొలుగొండ, కొత్త మల్లంపేట, పాత మల్లం పేట  గ్రామ పంచాయతీలకు సంబంధించి వైయస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్ల లో   ఇళ్ల స్థలాల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా  ఏర్పాటుచేసిన సమావేశంలో శాసన సభ్యులు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా  నిరుపేదల  సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తూ సొంత ఇల్లు లేని  వారికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం గావించి మరీ అందిస్తున్నారన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా కుల మతాలు , పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలను అక్కాచెల్లెళ్ల పేరట ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు. అభివృద్ధి చేసిన లేఅవుట్లలో  మౌలిక వసతుల కల్పన తోపాటు పక్కా ఇళ్ల నిర్మాణాలను కూడా చేపట్టడం జరుగుతుందన్నారు.  ఈ సందర్భంగా శాసన సభ్యులు లబ్ధిదారులకు  పట్టాల పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య, మండల తాసిల్దార్ వెంకటేశ్వరరావు ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

Golugonda

2020-12-26 13:50:29

సీఎం వైఎస్ జగన్ కు రుణపడి ఉంటాం..

నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మకమైనదని, ఇటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన  మన  ముఖ్యమంత్రి కి ప్రతి నిరుపేద కుటుంబం రుణపడి  ఉంటుంది పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం  రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వైయస్సార్ జగన్ అన్న ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం జి.మాడుగుల మండలం లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విశాఖ ఏజెన్సీ 11 మండలాల్లో 26 వేల మంది కుటుంబాలకు  కల్పించడం జరిగింది అన్నీ ఆమె అన్నారు. మన  ముఖ్యమంత్రి జగన్  మోహన్ రెడ్డి మహిళల పక్షపాతిగా ఉంటూ ఇళ్ల పట్టాలు మహిళలు పేరు మీదగా రిజిస్ట్రేషన్ చేయడం అనేది మహిళలకు సమజము లొ గౌరవ పెంచెవిధంగా ఉంటుంది అన్ని అమె ఆన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఇ నిర్ణయం తీసుకోవడం మంచి శుభ పరిణామం  అన్నీ ఆమె అన్నారు.జి.మాడుగుల  మండలంలో ఒక్కొక్క కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి సేంట్ న్నర  భూమి ఇస్తూ త్వరలో  ఇక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టి  నిర్మాణం పూర్తయిన తర్వాత అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.   ఈ కార్యాక్కమలొ పాల్గొన్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్  వెంకటేశ్వర్ సలిజమల  మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అందరికీ ఇల్లు కట్టి ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రాజెక్టు అధికారి వారు తెలిపారు. ఏజెన్సీ 11 మండలాల్లో 26 వేల మందికి ఈ ఇళ్ల పట్టాల పంపిణీ చూస్తున్నము అని తెలిపారు.  ఇళ్ల పట్టాలను మహిళలు పేరు మీద ఇస్తున్నామని ప్రాజెక్టు అధికారి వారు తెలిపారు. గత సంవత్సరం నుండి  ఏజెన్సీలో ప్రభుత్వ భూములను ఎక్కడున్నావో కనుగొని అక్కడే నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి  మంజూరు చేయడం  జరిగిందని తెలిపారు.  జి.మాడుగుల మండలం లో ప్రస్తుతం మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు  స్థలంలో ఆరు నెలల్లో ఇల్లు కట్టించి ఇస్తామని ప్రాజెక్ట్ అధికారి వారు తెలిపారు ప్రతి ఇంటి నిర్మాణం కొరకు ఒక లక్షా ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు.  ఈ కార్యా క్రమం లో తాసిల్దర్ చిరంజివి పడల్,హౌ సింగ్ డి ఇ బాబు,ఎంపీడీఓ ,పలువురు స్థానిక వైస్సార్ కార్యకర్తలు పాల్గొన్నారు .

జి.మాడుగుల

2020-12-25 20:46:27

అక్కా చెల్లెమ్మలకు “ఇళ్ళ పట్టా”భిషేకం..

పేద అక్కాచెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాభిషేకం జరుగుతోందని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస గ్రామంలో శుక్ర వారం జరిగిన కార్యక్రమంలో శాసన సభాపతి ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,75,755 మంది అక్కా చెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ళ స్ధలాల పట్టాల పంపిణీ జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతంలో 1.50 సెంట్లు, పట్టణ ప్రాంతంలో ఒక సెంటు భూమిని జగనన్న ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.23,535 కోట్ల మార్కెట్ విలువగల 68,361 ఎకరాల భూమిని ఉచిత ఇళ్ళ పట్టాలుగా పంపిణీ జరుగుతుందని గుర్తు చేసారు. రాష్ట్రంలోని పేదలందరికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో రూ.50,940 కోట్ల అంచనా వ్యయంతో రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ళ నిర్మాణం చేపట్టుటకు ప్రభుత్వం సంకల్పించిందని అందులో మొదటి దశలో రూ. 28,080 కోట్ల అంచనా వ్యయంతో 15.60 లక్షల ఇళ్ళ నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగిందని వివరించారు.  రాష్ట్ర వ్యాప్తంగా 17,005 వై.యస్.ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.21.345 కోట్ల విలువైన 2.62 లక్షల టిడ్కో గృహాల సేల్ అగ్రిమెంట్లను కూడా అక్కాచెల్లెమ్మలకు నేడు అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. 1,43,600 మంది లబ్దిదారులకు 300 చదరపు అడుగులు టిడ్కో గృహాలను కేవలం రూపాయికే ప్రభుత్వం అందిస్తుందని ఆయన అభినందించారు. 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఇళ్ళకు లబ్దిదారులు కట్టవలసిన ముందస్తు వాటాలోని 50 శాతం సొమ్ము కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని, లబ్దిదారుల తరపున రూ.4,287 కోట్ల అదనపు భారాన్ని జగనన్న ప్రభుత్వమే భరిస్తుందని శాసన సభాపతి అన్నారు. పేద వారి సొంత ఇంటి కల నెరవేరుతుందని, జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చేపట్టిందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆహ్లాదకర వాతావరణంలో లే అవుట్లను తయారు చేయుట జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.  జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 95,408 మంది అర్హులైన లబ్దిదారులు, పట్టణ ప్రాంతాల్లో 27,654 మంది లబ్దిదారుల వెరశి 1,23,062 మంది లబ్దిదారులు ఉన్నారని చెప్పారు. 64,448 మందికి ఇళ్ళ పట్టాలు జారీ చేయడమే కాకుండా, 90 రోజుల పథకం క్రింద 1496 మందికి ఇళ్ళ పట్టాలు, భూమిపై ఉన్న 53,074 మందికి స్వాధీన పత్రాలను, జి.ఓ 463 క్రింద ఆక్రమిత స్ధలాల్లో ఉన్న 172 మందికి పట్టాలు మంజూరు జరుగుతుందని తెలిపారు. 1227.17 ఎకరాల ప్రభుత్వ స్ధలం, 568.63 ఎకరాలు సేకరించి పట్టాల పంపిణీకి లే అవుట్లు తయారు చేయడం జరిగిందని వివరించారు. గ్రామీణ ప్రాంతంలో 1,128 లే అవుట్లలో 42,615 ఇళ్ళ స్ధలాలు ఏర్పాటు చేయగా, పట్టణ ప్రాంతంలో 28 లే అవుట్లలో 23,329 ఇళ్ళ స్ధలాలను ఏర్పాటు చేసామని వెరశి 1,156 లే అవుట్లలో 65,944 ఇళ్ళ పట్టాలను ఏర్పాటు చేసామని తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి 41,683 మంది లబ్దిదారులకు ఇళ్ళ స్ధలాలు జారీతో పాటు, 90 రోజుల పథకం క్రింద 932 ఇళ్ళ స్ధలాలు, భూమిపై ఉన్న  52,621 మందికి స్వాధీన పత్రాలను జారీ చేయడం జరుగుతుందని, జి.ఓ 463 మేరకు 172 మందికి క్రమబద్ధీకరణ జరుగుతుందని జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకుగాను 1087.70 ఎకరాల ప్రభుత్వ భూమి, 280.30 ఎకరాల భూ సేకరణ జరిగిందని చెప్పారు.  పట్టణ ప్రాంతాల్లో 27,654 మంది లబ్దిదారులకు గాను టిడ్కో గృహాల్లో పట్టణ ప్రాంతాల్లోని 3,872 మంది లబ్దిదారులకు అవకాశం కల్పించడం జరుగుతుందని, 22,765 మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలను మంజూరు చేయుట జరుగుతుందని తెలిపారు. 90 రోజుల పథకం క్రింద 564 మందికి, భూమిపై ఉన్న  453 మందికి స్వాధీన పత్రాలను  జారీ చేయడం జరుగుతుందని, పట్టణ ప్రాంతంలో ప్రభుత్వ భూమి 139.47 ఎకరాలు ఉండగా, 288.33 ఎకరాలు భూ సేకరణ చేసామని ఆయన వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా అమలు చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు.  ఇళ్ళ నిర్మాణానికి లబ్ధిదారులకు ప్రభుత్వం మూడు ఐచ్చికాలను ఎంపిక చేసుకొనుటకు ఇచ్చిందని పేర్కొన్నారు. మంచి కార్యక్రమాలకు రాద్దాంతం చేయరాదని ఆయన కోరారు. పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంపై ప్రతి ఒక్కరూ స్వాగతించాలని, పేద పిల్లలు సైతం ఉన్నత చదువులు చదవాలని అన్నారు. పోటీతత్వంలో మన పిల్లలు ముందుండి భారత కీర్తి ప్రతిష్టలు పెంచుటకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి లైవ్ కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గృహ నిర్మాణ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న లబ్దిని వివరించారు. ఇళ్ల నిర్మాణం వలన వివిధ ప్రక్రియల పరంపరలో ఆర్ధిక వ్యవహారాలు ఎక్కువ అవుతాయని ఆయన పేర్కొన్నారు. వార్డు, గ్రామ సచివాలయ, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ కార్యక్రమాలను పారదర్శకంగా ప్రభుత్వం చేపడుతుందన్నారు. జిల్లాలో మొదటి విడతలో 97,616 ఇళ్లను రూ. 3 వందల కోట్లతో నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. జనవరి 7వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. లబ్దిదారు సైలాడ శైలజ మాట్లాడుతూ ఏఈ రోజు మహిళలకు నిజంగా మంచి రోజు అన్నారు. ఉండటానికి ఇళ్ళు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. నేను ఉన్నాను అంటూ ముఖ్యమంత్రి జగనన్న భరోసా ఇస్తున్నారు. కరోనా సమయంలో సైతం ఉచిత రేషన్ పంపిణీ చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఎండ జ్యోతి రత్నం మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఒక అన్నగా అండగా నిలుస్తున్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నా పేరుతో ఒక ఇంటిని జగనన్న ఇస్తూ ఆశీర్వదిస్తున్నారు. జగనన్న తీసుకు వచ్చిన వాలంటీర్ వ్యవస్థ వలన ప్రతి పథకం ఇంటి వద్దనే అందుతున్నాయి. ఈ సందర్భంగా లబ్ధిదారులకు రాష్ట్ర శాసన సభాపతి సీతారాం పట్టాలను పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ. కిశోర్, జిల్లా బాలురు, బాలికల క్రికెట్ సంఘం అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్, తహశీల్దార్ శ్రీనివాసరావు, గృహ నిర్మాణ సంస్థ ఏఇ కూర్మి నాయుడు, మునిసిపల్ కమీషనర్ రవి సుధాకర్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Amadalavalasa

2020-12-25 17:32:43

ఆలయాలు చర్చిల్లో ఎమ్మెల్యే పూజలు..

ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్ పర్వదినాలను పురస్కరించుకుని విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే , అసెంబ్లీ ఎస్ సి వెల్ఫెర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబూరావు శుక్రవారం ఆలయాలు, చర్చిలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పాయకరావుపేట లో ఎమ్మెల్యే గొల్ల పాండురంగస్వామి ఆలయం, చర్చిలకు వెళ్లి పూజలు, ప్రార్ధనల్లో పాల్గొన్నారు. అటు ఎస్ రాయవరం మండలం చినగుమ్ములూరు లో కూడా చర్చిలో జరిగిన ప్రార్థనలో కూడా ఎమ్మెల్యే పాల్గొన్నారు. భగవంతుని దయ, కృప లతో సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ది చెందుతుందని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కొన్ని చర్చిల్లో సహవాసులకు చీరలు పంపిణీ చేశారు. దేవుని క్రుపతో మంచి జీవితం గడపాలని కోరుకున్నారు. అదేవిధంగా ప్రజలను పట్టిపీడిస్తున్న కరోనా అంతం కావాలని ముక్కోటి దేవుళ్లకు ప్రార్ధనలు చేసినట్టు ఎమ్మెల్యే వివరించారు.

Payakaraopeta

2020-12-25 16:31:35

సీఎం వైఎస్ జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి..

న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం కింద శుక్ర‌వారం కొమ‌ర‌గిరిలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించ‌నున్న ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. గురువారం సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వ‌రూప్‌, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌, ఎంపీ వంగా గీతా, ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న కార్య‌క్ర‌మాల స‌మ‌న్వ‌య‌క‌ర్త త‌ల‌శిల ర‌ఘురాం, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌, పెండెం దొర‌బాబు త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్.. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. పేద‌ల‌కు శాశ్వ‌త గృహ వ‌స‌తి క‌ల్పించే ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అధికారుల‌తో స‌మీక్షించారు. ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. యు.కొత్తప‌ల్లి మండ‌లంలోని కొమ‌రగిరి గ్రామ ప‌రిధిలో 322 ఎక‌రాల 31 సెంట్ల విస్తీర్ణంలో భారీ లేఅవుట్‌ను సిద్ధం చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. వివిధ విభాగాల స‌మ‌న్వ‌యంతో ల‌బ్ధిదారుల విశాల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేశామ‌ని, ఇక్క‌డ మొత్తం 16,689 ప్లాట్ల‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలిపారు. మోడ‌ల్ హౌజ్ నిర్మాణం పూర్త‌యింద‌న్నారు. కార్య‌క్ర‌మానికి వ‌చ్చే ప్ర‌జ‌లకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశామ‌న్నారు. తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించామ‌ని, కోవిడ్ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించి, కార్య‌క్ర‌మానికి వ‌చ్చేలా చూస్తున్నామ‌న్నారు. స‌భా ప్రాంగ‌ణంలో వైద్య శిబిరాలు అందుబాటులో ఉంటాయ‌న్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు, క‌లెక్ట‌ర్ వెంట జాయింట్ క‌లెక్ట‌ర్లు డా. జి.ల‌క్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజ‌కుమారి, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్, ప‌లువురు అధికారులు,  ప్ర‌జాప్ర‌తినిధులు ఉన్నారు. న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం-జిల్లా స్వ‌రూపం - ప్ర‌తిష్టాత్మ‌క న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం ద్వారా తూర్పు గోదావ‌రి జిల్లాలో మొత్తం 3,84,218 మంది ల‌బ్ధిపొంద‌నున్నారు. - మొత్తం ల‌బ్ధిదారుల్లో 2,58,236 మంది గ్రామీణ ల‌బ్ధిదారులు కాగా, ప‌ట్ట‌ణ ప్రాంత ల‌బ్ధిదారులు 1,25,982 మంది. - ప‌థ‌కం అమ‌ల్లో భాగంగా తొలిద‌శ కింద 1,53,626 గృహాలు మంజూరుకాగా, వీటికి సంబంధించి ఎస్సీ ల‌బ్ధిదారులు 30,156 మంది, ఎస్‌టీ ల‌బ్ధిదారులు 6,399 మంది, బీసీ లబ్ధిదారులు 69,186 మంది, ఓసీ ల‌బ్ధిదారులు 47,885 మంది ఉన్నారు. - ఇళ్ల స్థ‌లాల ల‌బ్ధిదారుల కోసం 7,218 ఎక‌రాల 62 సెంట్ల భూమి అవ‌స‌రం కాగా.. 1,856.55 ఎక‌రాల‌ను ప్ర‌స్తుత‌మున్న ప్ర‌భుత్వ భూమి నుంచి సేక‌రించారు. మిగిలిన 5,362.07 ఎక‌రాల భూమిని స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చిన 5,850 మంది రైతుల నుంచి సేక‌రించారు.  - భూ సేక‌ర‌ణ‌కుగానూ జిల్లాకు రూ.3167.97 కోట్లు మంజూరు కాగా.. ఇందులో రూ.2566.39 కోట్లు ఖర్చ‌యింది.  - జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.2,160 కోట్లు ఖ‌ర్చు చేయ‌నుంది.  - మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం ప‌రిధిలో రూ.540.89 కోట్ల అంచ‌నా వ్య‌యంతో 1532 లేఅవుట్‌ల‌ను అభివృద్ధి చేశారు.

Komaragiri

2020-12-24 18:54:03

చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనం వైఎస్సార్సీపీ ప్రభుత్వం..

ప్ర‌జా సంక్షేమం కోసం చిత్త‌శుద్దితో ప‌నిచేసే ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేర్చి, ప్ర‌జారంజ‌క పాల‌న‌ను అందిస్తున్న‌ ఘ‌న‌త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికే ద‌క్కింద‌ని ఆయ‌న కొనియాడారు.  ఎన్నిక‌ల మేనిఫేస్టో త‌మ పార్టీకి భ‌గ‌వ‌ద్గీత‌తో స‌మానమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. సాలూరులో సుమారు రూ.17 కోట్ల వ్య‌యంతో  100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి నిర్మాణానికి ఆయ‌న గురువారం శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ మాట్లాడుతూ పాద‌యాత్ర‌లో సాలూరు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి, వంద ప‌డ‌క‌ల ఆసుప‌త్రిని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి మంజూరు చేశార‌ని, దీని నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామ‌ని చెప్పారు. వైద్యుల సంఖ్య‌ను 52కి పెంచుతామ‌ని, శ‌స్త్ర‌చికిత్స‌లు కూడా ఇక్కడ అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలిపారు.  ఆసుప‌త్రిలో ప‌రిక‌రాల కొనుగోలుకు మ‌రో రూ.50ల‌క్ష‌ల‌ను ప్ర‌భుత్వం మంజూరు చేసింద‌న్నారు. ఇక‌నుంచీ మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి, విశాఖ‌ప‌ట్నానికి వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు. ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని, సుమారు రూ.653 కోట్ల‌తో జిల్లాలో వివిధ ఆసుప‌త్రుల నిర్మాణం, అభివృద్ది జర‌గ‌నుంద‌ని చెప్పారు. త్వ‌ర‌లో జిల్లా కేంద్రం విజ‌య‌న‌గ‌రంలో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రితో కూడిన‌ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల నిర్మాణానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి శంకుస్థాప‌న చేయ‌నున్నార‌ని తెలిపారు.                ఉత్తుత్తి ప్ర‌చారార్భాటాల‌‌తో గ‌త ప్ర‌భుత్వం ఐదేళ్లు ఏమీ చేయ‌కుండానే ప‌బ్బం గ‌డిపింద‌ని మంత్రి విమ‌ర్శించారు. పేద‌ల భూమిని కాపాడేందుకు, వారికి శాశ్వ‌త హ‌క్కు క‌ల్పించేందుకు స‌మ‌గ్ర భూ స‌ర్వే ప్రారంభిస్తే, దానిపైనా ప్ర‌తిప‌క్షం త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పేద ప్ర‌జ‌లంద‌రికీ గూడు క‌ల్పించేందుకు వైకుంఠ ఏకాద‌శి, క్రిస్మ‌స్ ప‌ర్వ‌దినం నాడు శుక్ర‌వారం రాష్ట్రంలో సుమారు 30లక్ష‌ల‌, 78వేల మందికి ఇళ్ల ప‌ట్టాలిచ్చే కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి శ్రీ‌కారం చుడుతున్నార‌ని చెప్పారు. ఈ కార్యక్ర‌మం నిరంత‌రం కొన‌సాగుతుంద‌ని, అర్హులైన‌వారు ఎప్పుడు ద‌ర‌ఖాస్తు చేసుకున్నా, వారికి 90 రోజుల్లో ఇంటి ప‌ట్టా మంజూర‌వుతుంద‌ని అన్నారు. సుమారు 20 ఏళ్ల‌పాటు పేద‌ల‌నుంచి నెల‌కు రూ.3వేలు చొప్పున అద్దె ముక్కు పిండి వ‌సూలు చేస్తూ, టిట్కో ఇళ్లు ఇవ్వాల‌ని గ‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తే, త‌మ ప్ర‌భుత్వం కేవ‌లం రూపాయికే వారి పేరిట ఇంటిని రిజిష్ట‌ర్ చేసి ఇవ్వ‌బోతోంద‌ని, ఇదే నాటి ప్ర‌భుత్వానికి, నేటి ప్ర‌భుత్వానికీ తేడా అని  స్ప‌ష్టం చేశారు. వివ‌క్ష‌త‌కు తావివ్వ‌కుండా, అవినీతి ర‌హితంగా, పార్టీల‌కు అతీతంగా,  అత్యంత పార‌ద‌ర్శ‌కంగా అర్హులంద‌రికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను త‌మ ప్ర‌భుత్వం అందిస్తోంద‌ని మంత్రి చెప్పారు.                   జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ ప్ర‌జ‌లంద‌రికీ ఆరోగ్యాన్ని అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. దీనిలో భాగంగా వైద్యారోగ్య రంగంలో కోట్లాది రూపాయ‌ల వ్య‌యంతో పెద్ద ఎత్తున‌ మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తోంద‌ని చెప్పారు. వైద్యుల‌నుంచి, సిబ్బంది వ‌ర‌కూ అన్ని స్థాయిల్లోని సిబ్బందిని పెద్ద ఎత్తున భ‌ర్తీ చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఆరోగ్య‌మే మ‌హాభాగ్య‌మన్న నినాదంతో, జిల్లాలో ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నం, ఆరోగ్యం నినాదాల‌తో పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. దీనిలో భాగంగానే జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం కార్యక్ర‌మం క్రింద జిల్లాలో సుమారు కోటి,36ల‌క్ష‌ల మొక్క‌ల‌నాటి, ఇటీవ‌లే జాతీయ స్థాయిలో గుర్తింపును పొందామ‌ని క‌లెక్ట‌ర్ అన్నారు.                  సాలూరు శాస‌న‌స‌భ్యులు పీడిక రాజ‌న్న‌దొర మాట్లాడుతూ, మ‌హాత్మాగాంధీ క‌ల‌లు గ‌న్న గ్రామ స్వ‌రాజ్యాన్ని స్థాపించేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి పెద్ద ఎత్తున పాల‌నా సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టార‌ని, దానిలో భాగంగానే గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశార‌ని అన్నారు. దీనివ‌ల్ల ప్ర‌తీ మారుమూల గిరిజ‌న ప‌ల్లెకు కూడా ప్ర‌భుత్వ సేవ‌లు, సౌక‌ర్యాలు అందుతున్నాయ‌ని చెప్పారు. సామాన్య ప్ర‌జ‌ల సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చేందుకు దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒకేసారి 30లక్ష‌ల‌కు పైగా ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి శుక్ర‌వారం శ్రీ‌కారం చుడుతున్నార‌ని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం త్రాగునీటికి కూడా నిధులు మంజూరు కాలేద‌ని, త‌మ ప్ర‌భుత్వం సుమారు రూ.64కోట్ల వ్య‌యంతో వందేళ్ల‌కు స‌రిప‌డే నీటి ప‌థ‌కాన్ని నిర్మిస్తోంద‌ని తెలిపారు. వంద‌ల కోట్ల వ్య‌యంతో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టిన అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను ఎంఎల్ఏ వివ‌రించారు.                 ఈ స‌మావేశంలో పార్వ‌తీపురం ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, ఎపిఎంఎస్ఐడిసి ఇఇ స‌త్య‌ప్ర‌భాక‌ర్‌, మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ వి.రామ్మూర్తి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ర‌మ‌ణ‌మూర్తి, తాశీల్దార్  కె.శ్రీ‌నివాస‌రావు, ఎంపిడిఓ పార్వ‌తి, ప‌లువురు ఇత‌ర అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.

Salur

2020-12-24 17:51:10

స్నేహలత కుటుంబానికి ప్రభుత్వం అండ..

అనంతపురం జిల్లా, ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద బుధవారం  హత్యకు గురయిన ఎస్ బి ఐ  లో పొరుగు సేవల ఉద్యోగిగా పనిచేసిన  స్నేహలత హత్య కు అయిన నేపథ్యంలో మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు స్పష్టంచేశారు. గురువారం అనంతపురం నగరంలోని అశోక్ నగర్ మూడవ క్రాస్ లో నివాసము ఉన్న మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి స్నేహలత మృతదేహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకు మునుపు మృతురాలి కుటుంబ సభ్యులను కలెక్టర్ ఓదార్చారు. మృతురాలి తల్లిదండ్రుల రోదన, క్షోభ ను  చూసి చలించిన కలెక్టర్ మీ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వం అండగా ఉంటుందంటూ వారిలో ఆత్మస్థైర్యాన్ని,  భరోసాను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కల్పిం చారు. జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ (ఆసరా , సంక్షేమం) గంగాధర గౌడ్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి , అనంతపురం రెవెన్యూ డివిజన్ అధికారి గుణ భూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Dharmavaram

2020-12-24 17:43:49

ట్రాన్స్ జండెర్స్ కి పోలీస్ కౌన్సిలింగ్..

ట్రాఫిక్ లో ట్రాన్స్ జెండర్స్ వాహన చోదకులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కడప సిఐ నాగభూషణం హెచ్చరించారు. గురువారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్ఆర్ నగర్ లో నివాసం ఉంటున్న ట్రాన్స్ జెండర్స్ కి సిఐ కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ లో వాహనదారులను ఇబ్బంది పెట్టకూడదని, అసలు ట్రాఫిక్ సమయంలో రోడ్లపైకి రాకూడదన్నారు. అలా కాకుండా పోలీసు హెచ్చరికలను కాదని రోడ్లపైకి వస్తే కేసులు నమోదు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. చాలా మంది వాహన దారుల నుంచి మీపై ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఒకేసారి కేసులు పెడితే ఇబ్బందులు పడతారన్న ఉద్దేశ్యంలో జిల్లా అధికారు ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినట్టు సిఐ వివరించారు. ట్రాఫిక్ లో అడ్డంగా నిలబటం ద్వారా కొన్ని సిగ్నల్స్ వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాటిని నియంత్రించేందుకే ముందుస్తుగా తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Kadapa

2020-12-24 13:57:50

ప్రజల ఆస్తుల పరిరక్షణకే భూముల రీసర్వే..

ప్రజల ఆస్తులకు శాశ్వత హక్కు, రక్షణ కల్పించడానికే  రీ సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.  పాద యాత్ర లో భూ సమస్యల పై  ప్రజల ఆవేదనలను  విని  మేనిఫెస్టో లోనే  సుపరిపాలన, రీ సర్వే లను పొందుపరచడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారంగానే  రాష్ట్రమంతటా రీ సర్వే జరపడం జరుగుతోందని మంత్రి అన్నారు.  బొండపల్లి మండలం  తమటాడ గ్రామంలో  వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా కార్యక్రమాన్ని  బుధవారం  మంత్రి ప్రారంభించారు.   సర్వే రాయిని వేసి భూమి పూజ చేసారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రమంతటా వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు తో 4500 బృందాలతో 17 వేల గ్రామాల్లో ఈ సర్వే మూడు దశలలో జరిగి  జనవరి 2023 నాటికీ ముగుస్తుందని తెలిపారు.  ప్రభుత్వమే సరిహద్దులను నిర్ణయించి, సర్వే రాళ్ళను ఉచితంగా  వేసి హక్కు దారునికి అందిస్తుందని తెలిపారు.  గ్రామాల్లో సమస్యలను పరిష్కరించడానికి మొబైల్ కోర్ట్ లు వస్తాయని, అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తారని,  ఏ ఒక్కరు వేరే కోర్ట్లకు గాని, పోలీస్ స్టేషన్ లకుగాని వెళ్ళే అవసరం లేదని స్పష్టం చేశారు.  ప్రభుత్వం దూర దృష్టి తో అలోచించి ప్రజలకు మేలు జరిగేలా ఈ పధకాన్ని తీసుకు వచ్చిందని తెలిపారు.  ప్రతిపక్షం అవాస్తవాలను చెప్తూ తప్పుడు రాతలు రాయిస్తుందని అన్నారు.   అవకాశం ఉన్నపుడే ప్రజలకు మేలు జరిగే పనులు చేసి వారి  మనస్సులో శాశ్వతంగా నిలిచి పోవాలని అన్నారు.  తమటాం గ్రామం లో 466  ఎకరాల్లో సర్వే చేయనున్నామని, ఈ సర్వే మీకు కావాలా వద్దా అని వేదిక పై నుండి మంత్రి అడుగగా కావాలి కావాలి అంటూ ప్రజలు హర్ష ధ్వానాల మధ్య తెలియజేసారు.  గ్రామ సచివాలయ ఉద్యోగాలను  మెరిట్ ప్రాతిపదికన, పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా నియామకాలు చేపట్టామని తెలిపారు.   అనేక మంది యువకులు  తమ కర్తవ్యాలను చిత్త  శుద్ధితో చేసి గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తున్నారని పేర్కొన్నారు.  గతం లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు  కూడా లంచాలు లేకుండా   దొరికేవి కాదని ఎద్దేవా చేసారు.  ముక్కోటి ఏకాదశి పర్వ దినాన పేదలందరికీ ఇళ్ళు  పధకం ద్వారా పేదల స్వంతింటి కలను నిజం చేస్తున్నామన్నారు.  సభాధ్యక్షత  వహించిన గజపతి నగరం శాసన సభ్యులు  బొత్స అప్పల నరసయ్య మాట్లాడుతూ  సర్వే లో భూ సమస్యలు బయట పడతాయని, ఏమైనా ఉంటె సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలనీ తెలిపారు.  వంద సంత్సరాల క్రితం జరిగిన సర్వే వలన నిజమైన హక్కు దారునికి ఇప్పటికి పట్టా దొరక లేదని,  ఈ సర్వే తో శాశ్వత పట్టాను పొందుతారని అన్నారు.  గజపతి నగరం నియోజక వర్గానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 630 కోట్ల పనులు జరిగాయని తెలిపారు.   రహదారుల కోసం సుమారు 200 కోట్లను ఖర్చు చేయడం జరిగిందన్నారు.  బొండపల్లి నుండి తమటాం రహదారిని పిఎంజిఎస్వై  క్రింద వచ్చే ఏడాది లోగ పూర్తి చేస్తామని తెలిపారు.  డిగ్రీ కళాశాల మంజూరు, , 30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చడం  తదితర అభివృద్ధి పనులు జరిగాయన్నారు.  అవినీతి రహిత పాలననందిస్తూ , ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.  పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్ మాట్లాడుతూ  సమగ్ర శాస్త్రీయంగా భూ సర్వే ను జరిపి యజమానులకు శాశ్వత హక్కును కల్పించిన ప్రబుత్వానికి రుణ పది ఉంటామని అన్నారు. రైతు బాందవునిగా జగన్మోహన్ రెడ్డి పేరును గుర్తించారని, రైతు భరోసా కేంద్రాల ద్వార రైతు  ముంగిటకే సేవలను అందించడమే కాక రైతు భరోసా, నష్ట పరిహరాలను,   జల కళ ద్వార ఉచిత బోరు, మోటార్ ను అందిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ మాట్లాడుతూ  ప్రతి పట్టాదారునికి ఆనందం కలిగే రోజు వస్తుందని అన్నారు.  పురపాలక శాఖ  లో దేశ  వ్యాప్తంగా 9 అవార్డులు రాగా ఆంధ్ర ప్రదేశ్ కే 6 అవార్డులు రావడం విశేషమని,  మంత్రి గారి పట్టుదల, కృషి, శ్రమ , నిజాయితీ కి ఇది నిదర్శనమని అన్నారు.  ఏ శాఖ నైన సమర్ధవంతంగా నిర్వహించే మంత్రిగారి  జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.  ఈ సమావేశం లో శాసన మండలి సభ్యులు డా. సురేష్ బాబు,  సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్,  సబ్ కలెక్టర్  విధేకర్ ,  ఆర్.డి.ఓ భవాని శంకర్, కే.ఆర్.సి  ఉప కలెక్టర్ బలత్రిఉపుర సుందరి, మండల ప్రత్యేకాధికారి నాగమణి,  సర్వే అండ్ ల్యాండ్ శాఖ ఎ.డి పోలరాజు, తహసిల్దార్, ఎం పి డి ఓ ,   మాజీ సర్పంచ్ లు, ఎం పి  పి లు, సర్వేయర్లు,  ప్రజలు పాల్గొన్నారు. 

బొండపల్లి

2020-12-23 19:53:08

అన్నదాతలకు అన్నివిదాలా తోడుంటా..

అన్నదాతలను అన్ని విధాలా ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. బుధవారం వేంపాడు, గొడిచెర్ల పిఏసీఎస్ లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయం లో నష్టం వాటిల్లిన రైతులకు వెంటనే నష్ట పరిహారం అందించిన ఘనత మా ప్రభుత్వానిదేనన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయ లో విప్లవాత్మక మైన మార్పులు తీసుకుని వచ్చిందన్న ఎమ్మెల్యే పంట నష్ట పోతే పది రోజుల్లో నష్ట పరి హారం చెల్లించిన ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే నన్నారు. మండలం లో నివర్ తుఫాను వచ్చినపుడు నష్ట పోయిన రైతులందరికీ పరిహారం చెల్లించామన్నారు. చంద్ర బాబు హయం లో ఏనాడు రైతులకు నష్ట పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. పదేళ్ల కాలంగా రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకున్నాన్నారు. ఉత్తరాంధ్రా సృజల స్రవంతి పోలవరం ప్రాజెక్టు లను 2021 చివరనాటికీ పూర్తి చేసి నీరు అందిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Nakkapalli

2020-12-23 18:12:01