1 ENS Live Breaking News

పర్వత ఆరోగ్యం కోసం మసీదులో నమాజులు..

ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యులు పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ పుట్టిన రోజును పురస్కరించుకుని సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యములతో కల కాలం ప్రజా సేవలో జనరంజకంగా రాణి  సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉండాలని దేవుని వేడుకున్నారు. బుధవారం శంఖవరం మండలం అన్నవరంలోని మసీదు (అబు బకర్) లో హ్యూమన్ రైట్స్ మిషన్ సభ్యులు ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం నమాజ్ అనంతరం "దుఅ" (దేవుని కోరుట) చేసారు. ఈ  కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు షేక్ సయ్యద్, షేక్ ఉమర్ భాష, షేక్ సుభాన్, మొహమ్మద్ రఫీ, సయ్యద్ రోషన్, షేక్ ఆలీషా, షేక్ అబ్దుల్లా, హ్యూమన్ రైట్స్ మిషన్ రాష్ట్ర సభ్యులు ఇండుగపల్లి నూకరాజు, అబ్బిరెడ్డి నారయణ రెడ్డి, మాకినీడి నాగసత్యనారాయణ, పెద్దింటి లక్ష్మణరావు, గంపల రాజు, షేక్ సత్తార్, షేక్ సుభాన్, షేక్ సలీమ్ తదితరులు పాల్గొన్నారు.

Annavaram

2020-12-30 20:50:04

లబ్ధిదారులందరికీ ఇళ్లు, ఇంటి పట్టాలు అందాలి..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, చిట్టచివరి లబ్ధిదారులు వరకు  ఇళ్ల స్థలాలు , ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు కొండ గుంటూరు, కడియం గ్రామాలలో పర్యటించి భూసేకరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో  స్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన అందరికీ నివాసయోగ్యమైన స్థలాలను భూసేకరణ  ద్వారా సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్లు,ఇంటి స్థలాలు అందాలన్నారు. ఈ విషయంలో ఎవరు అలక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  అందరు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పాటుపడాలని ఆమె సూచించారు. ఈ పర్యటనలో కడియం తాహసిల్దార్ జి భీమారావ్, రాజానగరం తహసిల్దార్ బాలసుబ్రమణ్యం, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు విఆర్వో లు పాల్గొన్నారు.

Kadiam

2020-12-30 18:43:48

నిరుపేదలందరికీ పక్కా ఇళ్లు..

 నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం లో భాగంగా   బుధవారం నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం గ్రామీణ ప్రాంతానికి చెందిన వేములపూడి , అమలాపురం, మెట్టపాలెం , చెట్టుపల్లి గ్రామపంచాయతీలలో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు.  ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధి కొరకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. వైయస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారన్నారు. సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని, అంతేకాకుండా ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు.          నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య మాట్లడుతూ  అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. చెట్టుపల్లి గ్రామంలో 230 మంది లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇంకా కొందరు ఇంటి స్థలాలు రాలేదని తనకు కంప్లైంట్ ఇస్తున్నారని, ఈ రోజే తాసిల్దారు , వీఆర్వోల తో ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులై తే తప్పనిసరిగా వెంటనే ఇంటి స్థలాల మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Narsipatnam

2020-12-30 17:23:00

గుకలాంలో పైలాన్ ఆవిష్కరించిన సీఎం..

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడానికి గుంకలాం గ్రామానికి చేరుకున్నారు. పేదలందరికీ ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి విజయనగరం జిల్లా విజయనగరం నియోజక వర్గం గుకలాం గ్రామంలో ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ తో పాటు తొలిదశ నిర్మించనున్న ఇళ్ళ నిర్మాణ పనులకు సంబంధించి జగనన్న కాలనీ లేఅవుట్ లో ఏర్పాటు చేసిన  పైలాన్ ను ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పైలాన్ వద్ద నిర్మించిన మోడల్. నమూనా  గృహాన్ని తిలకించారు ఈ పైలాన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్య మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, మునిసిపల్, రూరల్ డెవలప్మెంట్ శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ,  రెవెన్యూ,భుపరిపాలనా శాఖా మాత్యులు ధర్మాన కృష్ణా దాస్, దేవాదాయ  శాఖా మాత్యులు మంత్రి వెళ్ళంపల్లి శ్రీనివాస్, పర్యాటక శాఖా మాత్యులు ముత్తం శెట్టి శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖా మంత్రి శ్రీ రంగనాధ రాజు,    విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, ముఖ్య మంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘరాం,జిల్లా కలెక్టర్ ఎం. హరి జవహర్ లాల్, విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి, శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

గుకలాం

2020-12-30 17:04:02

చేనేత కార్మికులకు ప్రభుత్వం పూర్తిస్థాయి భరోసా..

రాష్ట్రం లో చేనేత,సహకార రాంగాలను బ్రతికించి తద్వారా చేనేత కుటుంబాలను ఆదుకుంది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. బుదవారం అమలాపురం రూరల్ మండలం బండారు లంక లో  72 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 50 వేలు చొప్పున 36 లక్షలు ముద్ర రుణాలను మంత్రి   పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సహకార రంగాన్ని అభివృద్ధి చేసి సహకార సంఘాల ద్వారా చేనేత పనివారికి రుణాలు ఇచ్చి ఆదుకుంది ఆ నాటి ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి అని,చెబుతూ తండ్రిని మించిన తనయుడు గా అంతకు మించిన సహాయ సహకారాలను చేనేత కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్నారని మంత్రి తెలిపారు.2014 నుండి 2019 వరకు బండారులంక గ్రామం ఏ విధంగాను అభివృద్ధికి నోచుకోలేదని, ఏ కొత్త పథకం రాలేదని 2009 నుండి 2014 వరకూ తాను శాసన సభ్యునిగా,మంత్రిగా బండారులంకలో కోట్లాది రూపాయల తో రహదారులు,డ్రెయిన్లు నిర్మించానని మంత్రి తెలిపారు.  అభివృద్ధిలో రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు వేస్తే జగన్ మోహన్ రెడ్డి నాలుగు అడుగులు వేస్తున్నారని,బండారులంకలో 900 మందికి ముఖ్యమంత్రి చేయూత ద్వారా పెన్షన్లు ఇస్తున్నారని,గతంలో బండారు లంక లో ఏ ఒక్కరికీ ఇంటి పట్టా ఎవ్వరూ ఇవ్వలేదని, ఒక్క నిరుపేద చేనేత  కుటుంబాల సొంత ఇల్లు లేక ఎన్ని కష్టాలు పడుతున్నారో స్వయంగా నేను చూశానని, ఈ రోజు బండారు లంక లో 290 మందికి ఇండ్ల స్థలాల పట్టాలను ముఖ్య మంత్రి ఇచ్చారని,మీరు ఇళ్లు కట్టుకుంటే మరో లక్షా 80 వేలు ముఖ్యమంత్రి ఇస్తారని,కట్టుకోలేమంటే ముఖ్యమంత్రే ఉచితంగా కట్టించి ఇస్తారని మంత్రి తెలిపారు.మొత్తం 475 మందికి బండారు లంక లో ఇళ్లు ఇస్తున్నట్లు మంత్రి తెలియ చేసారు.అలాగే బండారులంక లో 11 వందలమంది కి అమ్మఒడి పథకం అమలు చేస్తున్నారని,సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీన మరోసారి ఈ 11 వందలమందికి అమ్మఒడి ని ముఖ్య మంత్రి ఇస్తున్నారని మంత్రి తెలియచేశారు.అంతేకాకుండా తల్లిదండ్రులకు భారం కాకుండా పిల్లలకు పుస్తకాలు,బాగ్ లు షూస్,బెల్టులు అన్ని ఉచితంగా ముఖ్య మంత్రి ఇస్తున్నారని మంత్రి తెలిపారు.  ఇంటర్మీడియేట్ వరకు ముఖ్యమంత్రి పిల్లలకు అమ్మఒడి,ఆతరువాత ఫీజ్ రీింబర్స్మెంట్ ను ముఖ్యమంత్రి ఇస్తున్నారని మంత్రి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత మరియు ఔళి శాఖ సహాయ సంచాలకులు ఎన్.ఎస్ కృపావరం,సహాయ అభివృద్ది అధికారులు రజనీకాంత్,సూరిబాబు,ఎం.పి.డి.ఓ.ప్రభాకరరావు,పంచాయితీ కార్యదర్శి జి.నారాయణరావు,ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ ఎన్.అభినవ్, చెల్లు బోయిన శ్రీనివాస్, కుడుపూడి వేంకటేశ్వర(బాబు), బొంతు గోవింద శెట్టి, జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు కామి శెట్టి శ్రీనివాసరావు,రాష్ట్ర చేనేత విభాగం సంయుక్త కార్యదర్శి జాన గణేష్, సరె ళ్ళ రామకృష్ణ, కండెబోయిన వెంకటేశ్వరరావు, పిచ్చిక శాంతి ప్రభాకర్, కరెళ్ళ రమేష్,పి.ఎ.సి.ఎస్. అధ్యక్షులు దంగేటి బుల్లి అబ్బులు,కారుపర్తి నాగమల్లేశ్వరావు, సమయమంతుల రామం, భోజనపల్లి గణేష్,వాసా దొరబాబు,ముషిని నాగరాజు, పెనుమాల సునీత,గోసంగి సుశీల,చందన శంకర్రావు, చింతా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2020-12-30 16:55:24

పేదల సంక్షేమం సీఎం వైఎస్ జగన్ విశేష క్రుషి..

పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కుల మతరహితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరం మండలంలోని కత్తెరపల్లి  లో నేడు ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు మేరకు అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో అత్యంత కృషి చేస్తున్నారని ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని పథకాలు ప్రజల్లోకి గ్రామ సచివాలయాల ద్వారా అమలు చేయించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకొంటున్నారన్నారు.ప్రజా సంకల్ప పాదయాత్రలో మద్యపాన నిషేధం తో పాటు డ్వాక్రా రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తూ ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తున్నారన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ళు పట్టాలతో పాటు ఇళ్లను నిర్మించే పనిని ప్రభుత్వం చేపట్టిందన్నారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త  మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం 2.6 లక్షల మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతోందని అయితే అర్హత గల లబ్ధిదారులు వున్నంతకాలం ఇది నిరంతర ప్రక్రియ అన్నారు.ప్రభుత్వం ఎవరికైనా పథకాలను ఇవ్వడానికి ఉంది తప్పపథకాలను తీసి వేయడానికి కాదని అన్నారు.ప్రభుత్వం ప్రస్తుతం ఇళ్ల నిర్మాణ విషయంలో నిబద్ధత తో పనిచేస్తోందని వీలైనంత తొందరగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.ఈ సందర్భంగా పలువురు మహిళల కు పట్టాలను పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి,జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్త తో పాటు పలువురు అధికారులు అనధికారులు పాల్గొన్నారు.

Karveti Nagar

2020-12-29 18:53:52

నిరుపేదల ఇంటి కష్టాలన్నీ తీరిపోతాయ్..

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం లో భాగంగా  పాయకరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గొల్ల బాబురావు కోటవురట్ల మండలం కైలాసపట్నం, టి జగ్గంపేట, కోటవురట్ల, లింగాపురం, తంగేడు గ్రామపంచాయతీలలో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు.  మండల తాసిల్దార్ బి రామారావు, రెవిన్యూ అధికారులు మరియు సిబ్బంది హాజరయ్యారు. అనంతరం శాసనసభ్యులు గొల్ల బాబురావు ఎస్ రాయవరం మండలం కొత్త రేవుపోలవరం , రేవుపోలవరం , వాకపాడు, గుడివాడ, గుర్రాజు పేట గ్రామ పంచాయతీలకు చెందిన  లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ గావించారు. మండల తాసిల్దార్  బి సత్యనారాయణ ఇతర రెవిన్యూ సిబ్బంది హాజరయ్యారు.

Kotavuratla

2020-12-29 17:54:12

పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలి..

పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపైన ఉందని పాడేరు  శాసన సభ్యురాలు కొట్టగిల్లి భాగ్యలక్ష్మి  అన్నారు.స్థానిక లంబసింగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని పర్యాటక ప్రాంతాల్లో  పారిశుధ్యం, కాలుష్య నివారణపై ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి స్థానిక  రిసార్టులు యజమానులు, స్థానిక గిరిజనులు, గ్రామ వలంటీర్లు తో అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. పర్యాటకులను ప్రోత్సాహిస్తామని, కానీ పర్యాటకులు భాద్యతలు మర్చి పోతున్నారన్నారు. ప్లాస్టిక్ నియంత్రణ చేయాలన్నారు. అడ్డాకులను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ కొండమీదకు రాకూడన్నారు. వందన్ వికాస కేంద్రాలద్వారా గుడ్డ సంచులు తయారు చేయాలన్నారు. పర్యాటక ప్రాంతంలో గిరిజన సాంప్రదాయ వంటకాలు రుచి చూపించాలన్నారు.  వంజంగి హిల్స్కు పర్యాటకుల తాకిడి పెరిగిందన్నారు. అక్కడ నకిలీవస్తువులు విక్రయాలు జరుగుతున్నాయన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ సలిజామల మాట్లాడుతూపర్యాటకుల తాకిడి పెరిగింది, పర్యాటకుల వలన శబ్దకాలుష్యం, వాయు కాలుష్యం పెరుగుతున్నదని అన్నారు.ప్లాస్టిక్ ని నిరోదించకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తు తాయని అన్నారు. పర్యాటకుల  వాహనాలు నిలుపుదలకు ప్రైవేట్ స్థలాన్ని సేకరించాలని అన్నారు. పర్యాటక ప్రాంతంలో రిసార్టులు నిర్మిస్తే పంచాయతీ అనుమతులు పొందాలన్నారు. పర్యటకాన్ని రెగ్యులరైజ్ చేయవలసి ఉందన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు దుకాణాలు తెరవకూడదన్నారు. పోలీసులకు తగు సూచనలు చేశారు. డస్ట్ బిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. దుకాణ యజమానులు డస్ట్ బిన్ పెట్టకపోతే దుకాణాలు మూయిస్తామని హెచ్చరించారు.   తాగు నీటి సదుపాయం కల్పిస్తామని అన్నారు. ప్రజలనుంచి కాలుష్య నివారణపై అభిప్రాయం సేకరించారు. లంబసింగి నుంచి చేరువులవేనం వరకు రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరారు.చెత్త కుండీలు, పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు.పబ్లిక్ టాయిలెట్లు నిర్మిస్తామన్నారు.వారపు సంతల్లో ప్లాస్టిక్ నిరోధించాలని పిఓ సూచించారు.పంచాయతీ తీర్మానం చేయాలన్నారు. ప్లాస్టిక్ అమ్మేవారి నుంచి అపరాధ రుసుము వసూళ్లు చేయాలన్నారు. ప్రైవేట్ వ్యక్తులు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకుంటే అనుమతులు ఇస్తామని పీవో సూచించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటి అధ్యక్షురాలు జల్లి హాలియా రాణి,గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు జి.విజయకుమార్, జిల్లా పర్యాటక అధికారి పూర్ణిమా దేవి, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపిడిఓ ఉషశ్రీ ,టూరిజం మేనేజర్ అప్పలనాయుడు,సామాజిక కార్యకర్త  సోహల్, పోలీస్ అధికారులు, రిసార్టులు యజమానులు ,స్థానిక ప్రజలు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Chinthapalli

2020-12-29 17:37:45

ప్రతీ నిరుపేదకు సొంతిల్లే ప్రభుత్వ లక్ష్యం..

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం లో భాగంగా చోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ  రావికమతం మండలం గొంప , మరల పాక , గుడివాడ, తట్టబంధ, గుడ్డిప, తోటకూర పాలెం గ్రామపంచాయతీలలో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. మండల తాసిల్దార్ పీ కనకారావు, రెవిన్యూ అధికారులు మరియు సిబ్బంది హాజరయ్యారు. అనంతరం శాసనసభ్యులు ధర్మశ్రీ రోలుగుంట మండలం ఏపీ అగ్రహారం , జానకి రాంపురం, కుసర్ల పూడి గ్రామ పంచాయతీలకు చెందిన  లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ గావించారు. మండల తాసిల్దార్ కృష్ణమూర్తి ఇతర రెవిన్యూ సిబ్బంది హాజరయ్యారు.

Ravikamatham

2020-12-29 17:26:55

ఉత్సాహంగా ఇళ్ట పట్టాల పండుగ..

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం లో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామపంచాయతీలో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు.  నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని , అర్హులై ఉండి పేర్లు లేని వారు ఎవరైనా ఉంటే వారు సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని వాటిని పరిశీలించి అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ జయ, రెవిన్యూ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.  అటు మాకవరపాలెం మండలం తాసిల్దార్ రాణి అమ్మాజీ ,  రెవెన్యూ అధికారులు పి పి అగ్రహారం , జంగాలపల్లి గ్రామ పంచాయతీలలో లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ గావించారు. ఇటు నాతవరం మండలం చమ్మచింత గ్రామ పంచాయతీలో మండల తాసిల్దార్ జానకమ్మ లబ్ధిదారులకు ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

Narsipatnam

2020-12-29 15:53:05

90 రోజుల్లో నిరుపేదలకు సొంతిల్లు..

ఆంధ్రప్రదేశ్ లో ఏఒక్క నిరుపేదకు ఇళ్లు లేకుండా ఉండకూడదనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతీ పేదవాడికి ఇళ్లు మంజూరు చేస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నానాధ్ అన్నారు. మంగళవారం కశింకోట మండలం, తీడ, సుందరయ్యపేట, అచ్చెర్ల, భీమవరం గ్రామాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులైన నిరుపేదలు ఎవరైనా దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి స్థలంతోపాటు, ఇల్లు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. తొలి విడతగా ఇచ్చే ఇళ్ల పట్టాలు కేవలం కాదని ఇది నిరంతర ప్రక్రియగా కొగనాసాతుందన్నారు. ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో  ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నాలుగు గ్రామాలలో 424 మంది పేదవారికి ఇళ్ల పట్టాలు  పంపిణీ చేశామని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మళ్ళ బుల్లిబాబు, దంతులూరి శ్రీధర్ రాజు, చిలికి సత్తిబాబు, దొంగల నాయుడు, రెడ్డి ఎర్రన్నాయుడు, బండారు వాసు, అప్పలనాయుడు, అచ్చెన్నాయుడు, వెంకట్, కరణం పద్మ, శంకర్, సోమేశ్, రమేష్, నిమ్మదల సన్యాసినాయుడు, ఆర్డీవో సీతారాం గారు, పట్టా లబ్ధిదారులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Kasimkota

2020-12-29 15:44:53

పేదల సొంతింటి కల నెరవేరిన వేళ..

పేదల సొంత ఇంటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని  పాడేరు శాసన సభ్యురాలు శ్రీమతి  కొట్టగుళ్లిభాగ్యాలక్షి అన్నారు. మంగళవారం చింతపల్లి మండలం అన్నవరం గ్రామంలో జరిగిన నవరత్నాలులో భాగంగా పేదలందరికి ఇళ్ళు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 26వేల మంది ఇళ్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ  చేస్తున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారుల అభీష్టం మేరకే ఇల్లు నిర్మిస్తామని అన్నారు. సొంత ఇల్లు లేక అవస్థలు పడే వారికి సొంత ఇంటి హక్కులు ప్రభుత్వం కల్పిస్తుందని  చెప్పారు. మహిళలు పేరుమీద రిజిస్ట్రేషన్ చేస్తామని అన్నారు. ప్రతీ పధకంలో మహిళలకు భాగస్వామ్యం  కల్పిస్తున్నామని చెప్పారు. మహిళలు చేయూతను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వై ఎస్ ఆర్ ఆసరా ద్వారా రుణ మాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జగనన్న కాలనీలలో అన్నిమౌళిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఐటీడీఏ  ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనా విధానమే నేటి పట్టాలు పంపిణీ అని అన్నారు. ఇళ్ళ స్థలాలు పంపిణీ పేదలకు ముఖ్యమంత్రి ఇచ్చిన వరమని పేర్కొన్నారు. గతంలో ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలు పంపిణీ చేశామని నేడు ఇళ్ళపట్టాలు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.జాన్ నుంచి ఇళ్ల నిర్మాణాలు చేపడతామని అన్నారు. ప్రభుత్వం రైతు భరోసా, చేయూత, ఆసరా, బీమా ,అమ్మఒడి వంటి పధకాలు అమలు చేస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రూ.500కోట్లతో పాడేరు లో మెడికల్ కళాశాల,రూ.35కోట్లతో  సీసీరోడ్లు,బిటి రోడ్లు మంజూరు చేశామని చెప్పారు.కాఫీ రైతులకు చింతపల్లి లో మాక్స్ సంస్థ ఏర్పాటు చేశామని అన్నారు. రాగులు, ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లిస్తోందని అన్నారు.అనంతరం  98 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణి చేసారు. ఈకార్యక్రమంలో మార్కేట్ కమిటీ అధ్యక్షులు జల్లి హలియ రాణి, తహసీల్దార్ గోపాల కృష్ణ, ఎంపిడివో  ఉషశ్రీ ,హౌసింగ్ డీఈఈ బాబు,స్థానిక నేతలు జల్లి సుధాకర్, మోరి రవి తదితరులు పాల్గొన్నారు.

Chinthapally Village

2020-12-29 15:34:08

జెడ్పీలో 12 మందికి కారుణ్య నియామ‌కాలు..

విజయనగరం జిల్లాలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారంతా అంకిత‌భావంతో ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. మంగళవారం జిల్లా ప‌రిష‌త్‌లో 12 మందికి కారుణ్య నియామ‌కాల కింద ఉద్యోగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,  క‌ష్ట‌పడి ప‌నిచేసి మంచి పేరు తెచ్చుకోవాల‌ని సూచించారు. ఉద్యోగులు మరణించిన అనంతరం వారి కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే మానవతా ద్రుక్పదంతో కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టామని వివరించారు. నియామకాలు పొందిన వారిలో న‌లుగురిని జూనియ‌ర్ అసిస్టెంట్లుగా, ఒక‌రిని టైపిస్ట్‌గా, ఏడుగురిని ఆఫీస్ స‌బార్డినేట్స్‌గా నియ‌మించారు. అంతేకాకుండా మిగిలిన కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా తక్షణమే శాఖాపరమైన పనులు పూర్తిచేసి వారికి కూడా నియమాకాలు చేపట్టాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

2020-12-29 11:30:24

ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పోరేట్ స్థాయి వైద్యం..

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి వైద్య ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా అందుతోందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం రౌతులపూడి సిహెచ్సీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ, ఒకప్పుడు గర్భిణీ స్త్రీలు స్కానింగ్ లు, ఇతర రక్త పరీక్షలు చేయించుకోవాలంటే ప్రైవేటు ల్యాబులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేదని ఇపుడు అలాంటి అత్యాధునిక సదుపాయాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. త్వరలోనే నాడు నేడు క్రింద ప్రభుత్వ పీహెచ్సీలు, సీహెచ్సీలను ఆధునీక రిస్తుందన్నారు. అంతేకాకుండా ఎక్కడా ఎలాంటి పారామెడికల్ సిబ్బంది కొరత లేకుండా సిబ్బంది నియామకం కూడా చేపడుతుందన్నారు. ఇటీవలే ఆసుపత్రికి ల్యాబ్ టెక్నీషియన్ ను కూడా ప్రభుత్వం నియమించిందన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు చేసే స్కానింగ్ వివరాలను ఎమ్మెల్యే ప్రత్యేక వైద్యనిపులు డా.కిన్నెరను అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా ప్రభుత్వ వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి స్త్రీ వైద్య నిపుణులు డా.సునీత, ఆసుపత్రి  సిబ్బంది పాల్గొన్నారు.

Rowthulapudi

2020-12-29 10:50:02

సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పరిపాలన..

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ప్రతి ఒక్కరి అవసరాలను అడగకుండానే నేరుగా వారి గడప వద్దకే చేర్చుతున్న ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  దేనని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు.  నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం లో భాగంగా సోమవారం నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చిన్న జగ్గంపేట, గుమ్మడి కొండ , గాంధీనగరం , ఎం బి పట్నం, వై డి పేట, ఏపీ పురం, శృంగవరం గ్రామాలలో సొంత ఇల్లు లేని నిరుపేద లబ్ధిదారులకు శాసనసభ్యులు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తూ ఇప్పటికీ 22 రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి అంద చేస్తున్నారన్నారు. రాబోయే నూతన సంవత్సరం , సంక్రాంతి  కానుకగా  అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు  చూడాలని మన ముఖ్యమంత్రి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.  ఈ కార్యక్రమంలో నాతవరం తాసిల్దార్ జానకమ్మ, ఇతర రెవెన్యూ అధికారులు సిబ్బంది హాజరయ్యారు. అటు  నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం  బయ్య వరం, ఎన్ ఆర్ పేట, లచ్చన్న పాలెం, గిడుతూరు, మల్లవరం గ్రామాలకు చెందిన  అర్హులైన లబ్ధిదారులకు తాసిల్దార్ రాణి అమ్మాజీ   ఇళ్ల స్థల పట్టాలను  పంపిణీ చేశారు.

Nathavaram

2020-12-28 20:56:00