1 ENS Live Breaking News

స్కూల్స్ అకడమిక్ స్టాండర్డ్స్ మెరుగుపరచాలి

ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ స్టాండర్డ్స్ మరింతగా మెరుగుపరచాలని కరప మండల విద్యాశాఖ అధికారిణి కె.బి.క్రిష్ణవేణి పేర్కొన్నారు. మంగళవారం మండల కాంప్లెక్స్ లో 65 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్టర్స్ అప్డేషన్, నాడు, నేడు,  సిలబస్ కంప్లీషన్, వర్కుబుక్ కంప్లీషన్ తదితర అంశాలపై రివ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, మిస్ కోఆర్డిరేటర్లు, ప్రధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు ఏఈ వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.

Karapa

2023-01-31 12:57:02

కరోనా పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలి

కరోనా సమయంలో మృత్యువాతకు గురై నేటికీ ప్రభుత్వం అందించే రూ.50 వేలు  పరిహారం పొందని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మాడుగుల తహసీల్దార్ పివి.రత్నం విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిహారం కోసం దరఖాస్తు చేసుకోదలచిన వారు తమ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యత్వపత్రం, జత చేసి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన వివరాలను తహశాల్దార్ కార్యాలయంలో సిబ్బంది తెలియజేస్తారన్నారు.

Madugula

2023-01-31 12:22:27

జువ్విన కుటుంబాన్ని పరామర్శించిన వరుపుల రాజా

ఏలేశ్వరం నగర పంచాయతీ కి చెందిన జువ్విన రాంబాబు కుటుంబ సభ్యులను ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పరుపుల రాజా మంగళవారం పరామర్శించారు. రాంబాబు  భార్య నాగ ప్రభావతి గారిని పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ ప్రతీ కార్యకర్తకు, నాయకుడిని అండగా వుంటుందని హామీ ఇచ్చారు. ఎవరూ అదైర్య పడాల్సిన పలేనిదని దైర్యం చెప్పారు. ఆయనాతోపాటు ప్రత్తిపాడు టిడిపి, శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Yeleswaram

2023-01-31 05:30:52

వేడుకగా సుబ్రహ్మణ్య స్వామి రధోత్సవం

సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో విశాఖ శ్రీ శారదాపీఠం పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సోమవారం సాయంత్రం నిర్వహించిన రధోత్సవం వేడుకగా సాగింది. కోలాటం బృందాలు, తప్పెట గుళ్ళు, డప్పు వాయిద్యాలు, విచిత్ర వేష ధారణలతో వైభవోపేతంగా ఉత్సవం నిర్వహించారు. చినముషిడివాడలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు నారికేళాలను సమర్పించి రధోత్సవాన్ని ప్రారంభించారు. రధోత్సవంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. చినముషిడివాడ ప్రాంతమంతా సంచరించిన అనంతరం సుబ్రహ్మణ్య రధం తిరిగి పీఠానికి చేరుకుంటుంది. అనంతరం వల్లీ కళ్యాణం చేపడతారు. ఏటా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజంతా పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గిరిజనులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Pendurthi

2023-01-30 13:46:33

పాడేరు ఐటీడీఏ పీఓను తక్షణమే సరెండర్ చేయాలి

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఐటీడీఏ పీఓ రోణంకి గోపాలక్రిష్ణను తక్షణమే ప్రభుత్వం సరెండర్ చేయాలని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్ధినిలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో కళాశాలల వసతి గృహాల్లో విద్యార్థిని విద్యార్థులకు నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ పాడేరు ఐటిడిఏ ముందు 43 రోజులుగా దీక్ష చేస్తున్న ఐక్య ప్రజావేదిక నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు కళాశాలల వద్ద సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ, ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థిని విద్యార్థుల మరణాలు అరికట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో హెల్త్ అసిస్టెంట్లు నియమించి ఆరోగ్యాన్ని కాపాడాలని, పౌష్టికాహారం అందించాలని 43 రోజులుగా దీక్ష చేస్తున్న ఐక్యవేదిక నాయకులను భేషరతుగా విడిచి పెట్టాలన్నారు. గిరిజన వ్యతిరేకి అయిన పాడేరు ఐటీడీఏ పీఓ రోణంకి.గోపాలకృష్ణను ప్రభుత్వం సరెండర్ చేయకుండా దీక్షలు చేస్తున్న ఐక్యవేదిక నాయకులను అరెస్టులు చేయడాన్ని తప్పుబట్టారు.  ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్ధినిలు పాల్గొన్నారు.

అరకువేలి

2023-01-30 13:11:42

డా.బిబిఆర్ ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్యసేవలందిస్తాం

అత్యవసర వైద్యసహాయం కోరే నిరుపేద రోగులకు డా.బిబిఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కేజిహెచ్ ద్వారా ఉచితంగా వైద్యసేవలు అందించే ఏర్పాటు చేస్తామని..కెజిహెచ్ మాజీ ఆర్ఎంఓ, ప్రముఖ వైద్యులు, డా.బిబిఆర్ ట్రస్టుల నిర్వాహకులు డా.బంగారయ్య పేర్కొన్నారు. సోమవారం కోటఉరట్ల మండల కేంద్రం లో ఉన్న సామజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన  సందర్శించారు.  సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్యలక్ష్మి తో కలిసి వార్డులో ఉన్న పెషేంట్లను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బంగారయ్య మాట్లాడుతూ, అత్యవసరం అయిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, నిరుపేదలైనవారి వివరాలు తెలియజేస్తే విశాఖ  కెజిహెచ్ కి పంపిస్తే డాక్టర్ బిబిఆర్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయం అందిస్తామని వైద్యాధికారికి తెలియజేశారు. ట్రస్టు సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట చంటి, సతీష్, నానాజీ, అప్పారావు, రవి, శ్రీను, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.

Kotavuratla

2023-01-30 12:58:35

దుమ్ముల పేటలో పైప్ లైన్ పరిశీలన

కాకినాడ దుమ్ములపేట రైల్వే ట్రాక్‌ వద్ద ఉన్న కేఎస్‌పీఎల్‌– కోరమండల్‌కు సంబంధించిన పైపులైన్‌ను ఎమ్మెల్యే ద్వారంపూడి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. గతంలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా అప్పట్లో వేసిన పైపులైన్లు వల్ల వర్షపునీరు వెళ్ళేదారి లేక పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని ఎమ్మెల్యే ద్వారంపూడి చెప్పారు. ఈ నేపద్యంలో అక్కడ పైపులైన్‌లు తొలగించి కల్వర్టులు నిర్మించాల్సిందిగా కేఎస్‌పీఎల్‌సంస్థను కోరామన్నారు. ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన కేఎస్‌పీఎల్‌ అవసరమైన అనుమతులు తీసుకుని కల్వర్టులు నిర్మించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే సాంబమూర్తినగర్, రేచర్లపేట, పల్లంరాజునగర్‌ ప్రాంతాలకు ముంపు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కౌడ ఛైర్‌పర్సన్‌  రాగిరెడ్డి దీప్తికుమార్, మాజీ మేయర్, వైఎస్సార్‌సీపీ నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్నసాగర్, కేఎస్‌పీఎల్‌ సీవోవో మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2023-01-30 12:31:33

మార్చికల్లా టిడ్కో గృహాలు లబ్దిదారులకు అప్పగింత

టిడ్కో గృహాలను మార్చి కల్లా అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని  కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన కార్పొరేషన్, హౌసింగ్, విద్యుత్,అధికారులతో కలిసి టిడ్కో ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించారు. కౌడ ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, మాజీ మేయర్, వైఎస్సార్‌సీపీ నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్నసాగర్, కమిషనర్‌ కె.రమేష్, అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, పలువురు అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి టిడ్కో ఇండ్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించారు. అక్కడ కల్పిస్తున్న మౌళిక సదుపాయలను అడిగి తెలుసుకున్నారు. పనులు మరింత వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.

 పనుల ప్రగతిపై ఎమ్మెల్యే ద్వారంపూడి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిడ్కో మొదటి దశలో 1152 ఇండ్లను మార్చి మొదటి వారానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో రెండునెల వ్యవధిలో ఫేజ్‌–2 ఇళ్ళను కూడా పూర్తి చేస్తామన్నారు. తొలి విడత టిడ్కో లబ్థిదారులు ఏప్రిల్‌ మొదటి వారానికల్లా గృహప్రవేశాలకు సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే ద్వారంపూడి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ సత్యకుమారి, టిడ్కో ఈఈ రీటా, వ్యవసాయ మార్కెట్‌కమి టీ డైరెక్టర్‌ వాసుపల్లి కృష్ణ, స్థానిక నాయకులు మట్టపర్తి రఘురామ్, ఎరుపల్లి సీతారామ్, మోసా పేతూరు తదితరులు పాల్గొన్నారు.


Kakinada

2023-01-30 12:28:33

పోలీస్ స్టేషన్ కోసం స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ..

కాకినాడ జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు సోమవారం తిమ్మాపురం నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం కోసం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో శిరిడి సాయి బాబా గుడివెనుక గల ప్రభుత్వం మంజూరు చేసిన 28సెంట్లు భూమిని పరిశీలించినారు. పోలీస్ స్టేషన్ భవన నిర్మాణని కి పోలీస్ హౌసింగ్ బోర్డు  ఎఇ. షేక్ వలితో  చర్చించి  తగినసూచనలు  చేశారు. ఎస్పీ వెంట  ఎస్.బి. డి.ఎస్.పి. ఎ.అంబికా ప్రసాద్, కాకినాడ ఎస్ డిపిఓ  పి.మురళీ కృష్ణారెడ్డి, కాకినాడ రూరల్  సి ఐ, తిమ్మాపురం ఎస్ఐ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

కాకినాడ రూరల్

2023-01-30 09:38:24

త్వరలో విశాఖ శారదాపీఠం ఆగమ పాఠశాల

విశాఖ శ్రీ శారదాపీఠంలో త్వరలో వైష్ణవ ఆగమ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్టు  పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ప్రకటించారు. ఇప్పటికే పీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల ద్వారా విద్యార్ధులకు స్మార్తంతో పాటు రుగ్వేదం, యజుర్వేదం నేర్పుతున్నామని అన్నారు. తమ గురువులు స్వరూపానందేంద్ర స్వామి సంకల్పం మేరకు త్వరలోనే వైష్ణవ ఆగమ సదస్సును ఏర్పాటు చేయదలచామని వివరించారు. ఆలయ సంస్కృతిని ద్విగుణీకృతం చేసే ఆగమాలను ప్రోత్సహించాల్సిన అవసరముందని తెలిపారు. ఆలయం ఉన్నంత వరకు ఆగమం ఉంటుందని, ఆలయం ఉంటేనే ధర్మం నిలబడుతుందని స్వాత్మానందేంద్ర స్వామి స్పష్టం చేసారు. ఆగమ, వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులతో మూడు రోజులపాటు నిర్వహించిన చాత్తాద వైష్ణవ ఆగమ సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సదస్సులో చిర్రావూరి శ్రీరామ శర్మ, విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. అర్చక ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఈ సదస్సును నిర్వహించారు.

Pendurthi

2023-01-29 14:14:56

త్వరలో అందుబాటులోకి దేవరాపల్లి బస్సు స్టాప్

దేవరాపల్లి బస్ స్టాప్ ను అతిత్వరలోనే అందుబాటులోకి తీసుకు రానున్నట్టు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. ఆదివారం  మండల కేంద్రంలో ప్రత్యేక చొరవతో చేపడుతున్న బస్ స్టాప్ ఆధునీకరణ పనులను పర్యవేక్షించారు. బస్టాప్ ప్రాంగణంలో ఉన్న స్థలంలో ప్రయాణికుల సౌకర్యార్ధం భవనానికి మెరుగు పరుస్తున్నామని మాజీ ఎంపిపి కిలపర్తి భాస్కర్ తెలిపారు. అతి త్వరలో దేవరాపల్లి బస్ స్టాండ్  అందరికి అందుబాటులో వచ్చేలా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి బూడి ఆదేశించారు.

దేవరాపల్లి

2023-01-29 13:52:48

వైఎస్సార్సీపీ పరిపాలనలో రాష్ట్రం 20ఏళ్లు వెనక్కి

వైఎస్.జగన్మోహనరెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి 20ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ యంవివి. ప్రసాద్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆదివారం అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలం కంఠారం, బాలారం, పంచాయితీల్లో నిర్వహించిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో మాజీ మంత్రి మత్యరాస మణి కుమారి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వంజంగి కాంతమ్మలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనారోగ్యం తో బాధపడుతున్న టిడిపి సీనియర్ కార్యకర్త నిమ్మల. నాగేశ్వరరావును నేతలు పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బాలారం సర్పంచ్ అప్పన అప్పలనర్స, టిడిపి రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, రాష్ట్ర మహిళా కార్యదర్శి బొర్రా విజయరాణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దుచ్చరి చిట్టిబాబు, మాజీ జెడ్పిటిసి గాడి. శ్రీరామమూర్తి, ఉండా. నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

కొయ్యూరు

2023-01-29 13:28:08

అనాధబాలికలకు వస్త్రాలు పంచిన బాలభానుమూర్తి

సింహాచలం ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త విజినిగిరి బాలభానుమూర్తి అనాధశరణాలయంలోని బాలికలకు ఆదివారం నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.ఈ
సందర్భగా ఆయన మాట్లాడుతూ, నిరంతర ఉచిత దుస్తులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాసనగర్ లోని మనసు బాలికల అనాధ ఆశ్రమంలో ఈ పంపిణీ చేపట్టినట్టు తెలిపారు. ప్రార్ధించే పెదవుల కన్నా..సాయం చేసే చేతులు మిన్న అన్న అని భావిస్తూ..తనపరిధిలో ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. నా అనేవారు లేని నిర్భాగ్యులకు సహాయం చేయడానికి మరింత మంది దాతలు మంచి మనసుతో ముందుకి రావాలని ఆయన కోరారు.

Simhachalam

2023-01-29 13:09:04

గోడసారలో గిరిజనులు ఇల్లు మంజూరుచేయాలి

అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలంలోని పోతంగి పంచాయితీ పరిధి గోడసార గ్రామంలో గృహాలు లేని అర్హులందరికీ గృహాలు మంజూరు చేసి పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలని పంచాయతీ సర్పంచ్ వెంకటరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆయన ఆదివారం ఉదయం గోడసార గ్రామంలో పర్యటించి గృహాలు లేని లబ్ధిదారుల వద్దకు వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామంలో 5 కుటుంబాలకు నివాసముండేందుకు సరైన గృహాలు లేక ఎండకు వానకు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి గోడసార గ్రామంలో ఈ ఐదు కుటుంబాలకు నివాస గృహాలు మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని, ఐటిడిఏ అధికారులను కోరారు.

డుంబ్రిగూడ

2023-01-29 08:54:25

అల్లూరి జిల్లాలో మళ్లీ పులి సంచారం..2ఆవులు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ పరిధి చిన్నకోనల గ్రామ అటవీ ప్రాంతంలో కోటపర్తి. గంగులు అనే రైతుకు చెందిన పశువులు ఆదివారం ఉదయం అడవికి మేతకు వెళ్లి పెద్దపులి దాడిలో మృత్యువాత పడ్డాయని తెలియజేశారు. ఈ నెల 3న చిన్నకోనల అటవీ ప్రాంతంలో 3 లేగ దూడలు మేతకు వెళ్లినపుడు కూడా పులిబారిన పడ్డాయని గ్రామస్తులు పేర్కొన్నారు. తక్షణమే ఫారెస్ట్ అధికారులు స్పందించి పెద్దపులి భారి నుంచి తమను తమ పశువులకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పులి దాడిలో పశువులను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఈ సమస్యను పరిష్కరించాలని చిన్నకోనల గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.

Ananthagiri

2023-01-29 08:49:12