1 ENS Live Breaking News

విశాఖలో నీచ ‘కోక’రాజకీయాలకు తెరలేపారు.. మంత్రి పై బురద చల్లారు..

మొన్న విశాఖ రాజధాని ప్రాంతానికి అనువైనది కాదని సునామీలొస్తాయన్నారు .. నిన్న భూమి ఉపరితల మండిపోతుందిని విశాఖకు అత్యంతపెద్ద ప్రమాదం పొంచి వుందని భయపెట్టాలని చూశారు.. ఆ పాచికలేవీ విశాఖ ప్రజల ముందు, అందునా వైఎస్సార్సీపీ పార్టీ ముందు అసలే పారలేదు.. ఇక లాభం లేదనుకొని ఈరోజు నీచాతి నీచంగా ‘కోక ఫోనులో పెట్టిన కేక అంటూ’ నీచ రాజకీయాలకు తెరలేపారు.. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వంపై కవాలనే బురద చల్లే ప్రయత్నంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదో రకంగా ముందు ప్రభుత్వంలోని మంత్రులను టార్గెట్ చేస్తే తప్పా విశాఖ ప్రజలు నమ్మరనే భావనకు వచ్చిన ఓ వర్గం రాష్ట్రపర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును టార్గెట్ చేసినట్టు ఖచ్చితంగా ఈ విషయంలో కనిపిస్తుంది. సామవేద దండోపాయాలు ఉపయోగించైనా ప్రభుత్వంలోని మంత్రులు వ్యక్తిత్వం మంచిది కాదని చూపే ప్రయత్నానికి ఎవరో ఒక అభం శుభం తెలియని మహిళను పావుగా వాడుకున్నారు. దానినే పదే పదే ప్రజలు నమ్మేవిధంగా ప్రచారాలు చేసి మంత్రి నేరుగా మీడియా ముందుకొచ్చి తన వ్యక్తిత్వం కోసం చెప్పుకునేలా చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అధికారిక సమీక్షలు, ఊపిరి సలపని సమావేశాలు, కార్యకర్తలు, పర్యటనలు ఇలా సరిగ్గా తినడానికి గానీ, ఓ గంట మనసారా కునుకు తీయడానికి కూడా ఖాళీలేకూడా లేని  మంత్రులు ఏకంగా అరగంట పాటు ‘ఫోనులో పొందు కోరినట్టు’గా ఆడియో టేపులను స్రుష్టించి మరీ జనాల మీదకు వదిలారంటే పరిస్థితి, టార్గెట్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో అసలు విషయం తెలియనివారంతా దానిని వైరల్ చేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లేనిపోని మచ్చను వేయాలని చాలా గట్టిగానే ప్రచారం చేశారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్వీబీసీ చైర్మన్ ప్రుధ్విరాజ్ విషయంలో కొందరు ఇలాంటి కోక రాజకీయాలు చేసే ఆయన నామినేటెడ్ పోస్టు పోవడానికి కారణమయ్యారు. సరిగ్గా ఇపుడు ఆ సూత్రాన్ని విశాఖజిల్లాతో పాటు రాష్ట్ర ప్రజల్లో ఎంతో మంచి పేరు తెచ్చుకుంటున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై ప్రయోగించి ఈయన మంత్రి పోస్టుకి ఎసరు పెట్టడానికి ఈ విధంగా ప్రయోగం చేశారనే ప్రచారం గుప్పుమంటుంది. నందిని పదే పదే చూపించి పంది అనేలా ప్రచారం చేయడంలో ఆయనపై కక్షగట్గిన  ప్రత్యర్ధి వర్గం చాలా శ్రమించినట్టే కనిపిస్తుంది. ఈ ఆడియో టేపుల లీకేజీలో కావాలనే పెద్ద నేత తెరవెనుక ఉండి కదంతా నడిపించారని కూడా చెబుతున్నారు. స్వతహాగా ఆర్ధికంగా బలంగా వున్న వ్యక్తిని ఇలా వలపు వల బాణంతో ఇరికిస్తే పార్టీలో తెచ్చుకున్న పేరుపోవడంతోపాటు, పార్టీపై కూడా బురదచల్లడానికి ఆస్కారం వుంటుందని ఈ విధంగా పక్కగా ప్లాన్ చేశారనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఇంతకీ చిన్న శబ్ధం కూడా రాకుండా అత్యంత క్లియర్ ఆడియోలో బయటపెట్టిన ఆ తెరవెన నేత ఎవరై ఉంటారని కూడా విశాఖలో జోరుగా పరిశోధన జరుగుతుంది. ఇప్పటికే ఈ విషయమై మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు మీడియా ముందుకి వచ్చి తన కోసం చెప్పుకున్నారు. ఈ సమయంలో అసలా నకిలీ కోక కట్టుకొని కవ్వించినట్టు మాట్లాడినది వాస్తవమా.. అవాస్తవమా.. అనే చర్చ విశాఖతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. ఈ తరుణంలో ఆ ఆడియో టేపు సదరు మీడియా సంస్థకి విడుదల చేసిన మహిళ పార్టీలో ఎవరై ఉంటారని, లేదంటే పార్టీ పేరు చెప్పినట్టు మాట్లాడించి, మిమిక్రీ చేసినా, టెక్నాలజీని వినియోగించి  స్రుష్టించినా.. స్వయంగా దానినే పదే పదే చూపి బురదచల్లడానికి ఆస్కారం వుంటుందని ఈ విధంగా స్కెచ్ వేశారా అనే కోణంలో అటు పోలీసులు కూడా విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి.. అదేదో ‘వంగలేక మంగళవారం అన్నట్టు’ నేరుగా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక.. మంత్రిని అవంతిని ఎదుర్కోలేక.. అధికార పార్టీ మంత్రులపై ఇలాంటి కోక రాజకీయాలు చేసి నకిలీ ఆడియోలు బయటపెడితే ప్రజలు నమ్మేస్తారు అన్నట్టుగా తీవ్ర స్థాయిలో ప్రయత్నించినా.. మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యక్తిత్వం, మంచితనం తెలిసిన వారంతా ఇదంతా రాజకీయం కోసమే అన్నట్టు కొట్టి పడేస్తున్నారు.. వాస్తవం కూడా అదే అన్నట్టుగా..!

Visakhapatnam

2021-08-20 12:34:19

వివాదాలున్న చోట ముందు సర్వేచేయండి..

ప్ర‌త్యేక భూసంబంధ వివాదాలు, స‌మ‌స్య‌లు ఉన్న గ్రామాల్లో తొలివిడ‌త‌లోనే స‌మ‌గ్ర భూస‌ర్వే చేప‌ట్టాల‌ని పుర‌పాల‌క శాఖ‌ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. ఈ గ్రామాల్లో త్వ‌ర‌గా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వై.ఎస్‌.ఆర్‌.జ‌గ‌న‌న్న‌ స‌మ‌గ్ర భూహ‌క్కు, భూర‌క్ష ప‌థ‌కం అమ‌లుపై రాష్ట్ర స్థాయి ఉప‌సంఘంలో స‌భ్యుడిగా వున్న మంత్రి బొత్స జామి మండ‌లం విజినిగిరిలో శుక్ర‌వారం మాట్లాడుతూ అవ‌స‌ర‌మైతే రాష్ట్ర క‌మిటీ స‌మావేశంలో ఈ అంశంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ఇనాం, మ‌ఖాసా భూములు వంటి ప‌లు ర‌కాల భూసంబంధ స‌మ‌స్య‌లు ఉన్న‌చోట తొలివిడ‌త‌లోనే స‌ర్వే జ‌ర‌గాల‌ని చెప్పారు. మంత్రి శుక్ర‌వారం జామి మండ‌లం విజినిగిరిలో ప‌ర్య‌టించారు. ఈ గ్రామంలో ప‌లువురు మ‌ఖాసా భూముల స‌ర్వే ఎంతోకాలంగా పెండింగులో వున్న అంశం మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్  సూర్య‌కుమారికి సూచ‌న‌లు చేస్తూ ఈ అంశంపై తొలివిడ‌త‌లో చేప‌ట్టేందుకు ప్ర‌తిపాద‌న‌లు చేయాల‌న్నారు. రాష్ట్రంలో 2023 నాటికి స‌మ‌గ్ర‌ భూస‌ర్వే పూర్తిచేయాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా నిర్దేశించుకుంద‌న్నారు. మ‌న రాష్ట్రంలో చేప‌ట్టిన త‌ర్వాత కేంద్రం కూడా జాతీయ‌స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఇదే త‌ర‌హాలో భూస‌ర్వే చేప‌ట్టేందుకు నిర్ణ‌యించింద‌న్నారు.

గ్రామంలో రూ.40 ల‌క్ష‌ల ఎం.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌. నిధుల‌తో నిర్మించిన గ్రామ స‌చివాల‌య భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి మాన‌స‌పుత్రిక గ్రామ స‌చివాల‌యాలు, వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ అని పేర్కొంటూ, ఈ వ్య‌వ‌స్థ‌పై ముఖ్య‌మంత్రి  జ‌గ‌న్ ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నార‌ని, ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టేలా స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్లు ప‌నిచేయాల‌న్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్ట తెచ్చే ప‌నులు చేయ‌వ‌ద్ద‌ని కోరారు. వ‌లంటీర్ల‌ను ప్ర‌భుత్వానికి క‌ళ్లు, చెవులుగా ముఖ్య‌మంత్రి భావిస్తున్నార‌ని వీరి ప‌నిత‌నంపైనే ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట ఆధార‌ప‌డి వుంద‌న్నారు.

జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి మాట్లాడుతూ గ్రామానికి మంచి అంద‌మైన స‌చివాల‌య భ‌వ‌నాన్ని నిర్మించుకున్నార‌ని పేర్కొంటూ గ్రామ స‌ర్పంచ్‌ను అభినందించారు. అదే విధంగా గ్రామ ప్ర‌జ‌ల ఆరోగ్యంప‌ట్ల కూడా స్థానిక ప్ర‌తినిధులు శ్ర‌ద్ధ చూపి ప్ర‌జ‌లంతా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. జామి మండలంలో కోవిడ్ కేసులు అధికంగా వుండ‌టంతో పాటు వ్యాక్సినేష‌న్ త‌క్కువ‌గా జ‌రుగుతోంద‌ని, ఈ విష‌యంలో ప్ర‌జాప్ర‌తినిధులు, స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల‌ను వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్స‌హించాల‌ని కోరారు.  మూడో వేవ్ రాక ముందే జిల్లాలో ప్ర‌తి ఒక్క‌రికీ వ్యాక్సిన్ వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని దీనికి ప్ర‌తిఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శాస‌న‌స‌భ్యులు బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, శాస‌న‌మండ‌లి స‌భ్యుడు సురేష్‌బాబు త‌దిత‌రులు మాట్లాడారు. ఆర్‌.డి.ఓ. బిహెచ్‌.భ‌వానీ శంక‌ర్‌, పంచాయ‌తీరాజ్ ఎస్‌.ఇ. విజ‌య్ కుమార్‌, మండ‌ల ప్ర‌త్యేక అధికారి విజ‌య్ కుమార్‌, డివిజ‌న‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ అఫీస‌ర్ రామ‌చంద్ర‌రావు, గ్రామ స‌ర్పంచ్ కిలారి సూర్యారావు త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంత‌రం మంత్రి బొత్స గంట్యాడ మండ‌లం కొర్లాంలో గ్రామ స‌చివాల‌య భ‌వ‌నాన్ని, రైతుభ‌రోసా కేంద్రాన్ని ప్రారంభించారు.

Jami

2021-08-20 10:53:56

రాజానగరంలో 21న హౌసింగ్ మంత్రి పర్యటన..

తూర్పుగోదావరి జిల్లాలో ఆగస్టు 21న గ్రుహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు  రాజానగరం మండలో పర్యటించనున్నారని రాజమండ్రి హౌసింగ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ మేరకు శుక్రవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి తోపాటు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు నరేంద్రపురం గ్రామంలో వైఎస్సార్ జగనన్న కాలనీలను సందర్శిస్తారని, అక్కడే పలు అభివ్రుద్ది కార్యక్రమాలకు, ఇళ్ల నిర్మాణాలకు శంఖుస్థాపనలు కూడా చేస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Rajanagaram

2021-08-20 10:31:11

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి..

స‌చివాల‌య సిబ్బంది ఉత్త‌మ సేవ‌ల ద్వారా గ్రామీణ ప్ర‌జ‌ల అభిమానాన్ని పొందాల‌ని, ప్ర‌భుత్వానికి మంచి పేరు తీసుకురావాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు హిత‌వు ప‌లికారు. ప్ర‌భుత్వం స‌చివాల‌య సిబ్బందిపైనే ఎన్నో ఆశ‌లు పెట్టుకుంద‌ని, ముఖ్య‌మంత్రి శ్రీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎంతో మంచి ఆశ‌యంతో ప్ర‌వేశ‌పెట్టిన ఈ వ్య‌వ‌స్థ‌ను విజ‌య‌వంతం చేసేందుకు శాయ‌శ‌క్తులా కృషిచేయాల‌న్నారు.  జాయింట్  క‌లెక్ట‌ర్(ఆసరా) జె.వెంక‌ట‌రావు గురువారం  డెంకాడ మండ‌లంలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. అమ‌కాం, గొల‌గాం(గంట్లాం) లోని గ్రామ స‌చివాల‌యాల‌ను, రైతుభ‌రోసా కేంద్రాన్ని త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయా గ్రామాల్లో స‌చివాల‌యాల ద్వారా అందుతున్న సేవ‌ల‌పై ఆరా తీశారు. ఆయా గ్రామాల్లోని స‌చివాల‌య రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్న తీరును తెలుసుకున్నారు. వ‌లంటీర్లు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వున్న‌దీ లేనిదీ ఆరా తీశారు.

Denkada

2021-08-19 16:14:18

సచివాలయాల ద్వారానే ప్రజలకు సేవలందాలి..

గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు వారి గ్రామంలోనే వుంటూ ప్ర‌భుత్వ సేవ‌లు, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుకోవాల‌నే స‌దుద్దేశ్యంతో ముఖ్య‌మంత్రి  వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ్రామ స‌చివాల‌యాలు, రైతుభ‌రోసా కేంద్రాల‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని ఆ ల‌క్ష్యాలు నెర‌వేరేలా స‌చివాల‌య సిబ్బంది, ఆర్బీకెల సిబ్బంది చిత్త‌శుద్దితో కృషిచేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ పేర్కొన్నారు. సచివాల‌యాలు, ఆర్బీకెల ద్వారా గ్రామీణుల‌కు ఉత్త‌మ సేవ‌లు అందించే దిశ‌గా ప‌నిచేసి ఈ వ్య‌వ‌స్థ‌ను విజ‌య‌వంతం చేసే బాధ్య‌త స‌చివాల‌యాల సిబ్బందిపైనే వుంద‌న్నారు. జాయింట్  క‌లెక్ట‌ర్(రెవిన్యూ) డా.కిషోర్ కుమార్ గురువారం మ‌ధ్యాహ్నం డెంకాడ మండ‌లంలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. చింత‌ల‌వ‌ల‌స‌, ర‌ఘుమండ‌, బొడ్డ‌వ‌ల‌స గ్రామాల్లో స‌చివాల‌యాల‌ను త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయా గ్రామాల్లో స‌చివాల‌యాల ద్వారా అందుతున్న సేవ‌ల‌పై ఆరా తీశారు. ఆయా గ్రామాల్లోని వ‌లంటీర్ల‌తో మాట్లాడి త‌మ ప‌రిధిలోని కుటుంబాల‌కు ఏవిధంగా సేవ‌లు అందిస్తున్న‌దీ తెలుసుకున్నారు. ఇ-కెవైసి జ‌రుగుతున్న తీరు, సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్న తీరును తెలుసుకున్నారు. వ‌లంటీర్లు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వున్న‌దీ లేనిదీ ఆరా తీశారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో మండ‌ల త‌హ‌శీల్దార్ ఆదిల‌క్ష్మి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Denkada

2021-08-19 16:12:05

ఆధార్ కేంద్రం తలార్ సింగ్ కి మార్పు..

పాడేరు మండలం లోని  చుట్టుపక్కల ఉన్న గిరిజనుల సౌకర్యార్థం జనాలు రద్దీ తగ్గించడం కోసం స్థానిక పిఎమ్ఆర్ సి నుంచి తలార్ సింగ్ ఇన్డోర్ స్టేడియంకు మార్చడమైనది.  ఆధార్ కార్డులు నమోదు చేసుకొనుటకు ఈరోజు అనగా 19-8-2021 గురువారం నుండి ఏర్పాట్లు చేసినట్లు సబ్ కలెక్టర్ వి అభిషేక్ తెలిపారు.  ఈ ఆధార్ కార్డు కేంద్రాన్ని సబ్ కలెక్టర్ ప్రారంభించారు.ఈరోజు 100 మందికి ఆధార్ కార్డులు నమోదు చేశారని రేపటినుంచి తలార్సింగ్ ఇన్డోర్ స్టేడియంలో నమోదులు జరుగు తాయని ఈ స్థలమార్పిడి  విషయాన్ని ప్రజలందరూ గమనించి ఆధార్ కార్డు నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని సబ్ కలెక్టర్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ టి.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Paderu

2021-08-19 15:30:26

25వేల మేకలు, గొర్రెలకు వేక్సిన్..

శంఖవరం మండలం పరిధిలోని 25వేల గొర్రెలు, మేకలకు నట్టల నివారణ వేక్సిన్ పంపిణీ చేసినట్టు పశు సంవర్ధకశాక సహాయ సంచాలకులు డా.ఎం వీరరాజు తెలియజేశారు. గురువారం శంఖవరం పశువుల ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం సుమారు 16 గ్రామ సచివాలయాల పరిధిలోని 14 పంచాయతీల్లో 30వే మేకలు,గొర్రెలు ఉండగా25 మేకలు, గొర్రెలకు వేక్సిన్ వేశామన్నారు. ఈనెలాఖరులో మిగిలిన వాటికి కూడా పూర్తి చేస్తామని ఏడి వివరించారు. వేక్సిన్ కోసం గ్రామ సచివాలయాల పరిధిలోని వెటర్నరీ సహాయకులను సంప్రదించాలని ఆయ సూచించారు.

Sankhavaram

2021-08-19 15:25:38

126 గేదెలకు, ఆవులకు టీకాలు..

రౌతులపూడి మండలం ఎస్.అగ్రహారం పశువుల ఆసుపత్రిలో 126 గేదెలు, ఆవులకి 126 గొంతు వాపు వ్యైధి టీకాలు పంపిణీ చేసినట్టు వైద్యాధికారి ఎం.వీరరాజు తెలియజేశారు. ఈ మేరకు గురువారం ఆయన అగ్రహారంలో మీడియాతో మాట్లాడారు. వర్షాలు అధికంగా పడుతున్న తరుణంలో పశువులు దానా తినేటప్పుడు మట్టిలో ఉండే ఒక రకమైన వైరస్ దానాలో చేరి గొంతు వాపు వ్యాధి వస్తుందన్నారు. ముందుగా టీకా వేయడం ద్వారా దానిని నివారించవచ్చునని ఆయన వివరించారు. వేక్సిన్ కోసం గ్రామ సచివాలయాల పరిధిలోని వెటర్నరీ సహాయకులను సంప్రదించాలని ఆయ సూచించారు.

Rowthulapudi

2021-08-19 15:24:34

సచివాలయాల్లో ప్రజలకు వేగంగా సేవలందాలి..

గ్రామ స‌చివాల‌య సిబ్బంది ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులో వుంటూ స‌చివాలయాల ద్వారా మెరుగైన‌, వేగ‌వంత‌మైన‌ సేవ‌లందించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు ఆదేశించారు. గుర్ల మండ‌లంలో జె.సి. బుధ‌వారం ప‌ర్య‌టించి ప‌లు గ్రామ సచివాల‌యాల‌ను త‌నిఖీ చేశారు. ముందుగా కెల్ల గ్రామ స‌చివాల‌యాన్ని సంద‌ర్శించి అక్క‌డి సిబ్బంది హాజ‌రుపై ఆరా తీశారు. సిబ్బంది నిర్ణీత వేళ‌ల్లో విధుల‌కు హాజ‌ర‌వుతోందీ లేనిదీ త‌నిఖీ చేశారు. కార్యాల‌య రిజిష్ట‌ర్ల‌ను, రికార్డుల‌ను ప‌రిశీలించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు పొందేందుకు ల‌బ్దిదారుల‌కు వుండాల్సిన అర్హ‌తలు, ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం త‌దిత‌ర అంశాల‌పై స‌చివాల‌యంలో పూర్తిస్థాయిలో స‌మాచారం అందుబాటులో వుంచిన‌దీ లేనిదీ ప‌రిశీలించారు. సిబ్బంది ఎవ‌రెవ‌రు ఏయే విధులు నిర్వ‌హిస్తున్న‌దీ గ్రామంలో ఏ ర‌క‌మైన సేవ‌లంందించిందీ తెలుసుకున్నారు. ప్ర‌జ‌ల నుంచి వివిధ స‌మ‌స్య‌ల‌పై వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించేందుకు ఎంత స‌మ‌యం తీసుకుంటున్న‌దీ అడిగి తెలుసుకున్నారు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల ప‌రిష్కారంలో జాప్యానికి తావివ్వొద్ద‌ని హెచ్చ‌రించారు.

అనంత‌రం ఇదే మండ‌లంలోని కోట‌గండ్రేడు గ్రామ స‌చివాల‌యాన్ని జె.సి. సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్దిదారుల ఎంపిక విధానం, వ‌లంటీర్ల ప‌నితీరుపై స‌మీక్షించారు. ప్ర‌భుత్వం నిర్దేశించిన విధంగా రేష‌న్ కార్డులు, ఇళ్ల‌స్థ‌లాలు, ఫించ‌న్ల మంజూరు త‌దిత‌ర అంశాల్లో గ‌డువులోగా వాటిని మంజూరు చేస్తున్న‌దీ లేనిదీ తెలుసుకున్నారు.

Gurla

2021-08-18 15:10:52

భూముల రీ సర్వేకి ప్రజలు సహకరించాలి..

భూముల సర్వేకు  అందరూ సహకరించాలని పార్వతీపురం ఐటీడీఏ పీఓ కూర్మనాథ్ కోరారు. బుధవారం  పాచిపెంట మండలం గుట్టుర్టు పంచాయతీ కుడుమురులో  ప్రోజెక్ట్ అధికారి గ్రామసభ నిర్వహించారు. కుడుమురు గ్రామం సర్వే నేం 48కు సంబంధించి ఒరిజినల్ రికార్డులు లేనందున సర్వేకు సహకరించమని కోరుతూ గ్రామ సభ నిర్వహించారు. సాగుచేస్తున్న వారి  వివరాలు నమోదు చేయమని సంబంధిత రెవెన్యూ అధికారులకు సూచించారు. ఎవరైతే మేము ఈ భూమి ఇనాము దారులు అంటున్నారో వారి దగ్గర వివరాలు తీసుకొని మళ్ళీ సభ ఏర్పాటు చేసి నివేదికలు తయారు చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. అన్సేటిల్డ్ లాండ్ కాబట్టి పాత రికార్డులు ఒక్క సారి పరిశీలించాను తహశీల్దారుకు సూచించారు.  ఈ గ్రామ సభకు పాచిపెంట తహసిల్దార్ రామ చంద్ర రెడ్డి, ఎం.పి.డి.ఓ, డి.టి రెవెన్యూ అధికారులు సిబ్బంది, గ్రామ సర్పంచ్ మదల సింహాచలం గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Pachipenta

2021-08-18 15:07:47

కేంద్ర అటవీశాఖ పరిశీలనా పర్యటన..

విశాఖజిల్లాలోని నాతవరం మండలం భమిడికలొద్దు గ్రామంలో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటి బుధవారం పర్యటించింది. ఆ ప్రాంతంలో  లేటరైట్ మైనింగ్  గనులకు సంబందించి జాతీయ హరిత ట్రిభ్యునల్ ఆదేశాల మేరకు కమిటి వివరాలు సేకరించింది.  అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్  ఎల్లమురుగన్, సైంటిస్టు సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున , జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాల రెడ్డి, ఆర్ డి ఓ అనిత,  తాసిల్దార్ జానకమ్మ,  గనుల శాఖ డి డి సూర్యచంద్ర, డి ఎఫ్ ఓ సూర్యనారాయణ, సర్వే ల్యాండ్ రికార్డ్సు ఎ డి కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ ప్రమోద్ కుమార్ రెడ్డి,  రూరల్ సి ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Nathavaram

2021-08-18 14:29:28

హౌసింగ్ లో భీమిలీ ప్రధమ స్థానంలో ఉంది..

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికి ఇళ్లు మంజూరు చేసి నిర్మాణాలను కూడా పూర్తి చేసి అందిస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు స్పష్టం చేసారు.  బుధవారం రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం  శెట్టి శ్రీనివాసరావు తో కలిసి ఆనందపురం మండలం గండిగుండం లోని వై ఎస్ ఆర్ జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలను పరిశీలించారు.  ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోనే  అత్యధికంగా భీమిలి నియోజక వర్గంలో ఇళ్ల నిర్మాణాలు 95 శాతం  పూర్తి కానున్నాయని తెలిపారు.  జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు  ఎటువంటి ఇబ్బంది రాకుండా  అవసరమైన సిమెంటు, ఐరన్, ఇసుక మొదలైన వాటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు.  ఎటువంటి సమస్యలున్న పరిష్కరించి గృహ నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతుందన్నారు.  ఫేజ్-I, ఫేజ్ – II లలో మొత్తం 30 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి గృహాలను నిర్మించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.  పర్యాటకశాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గండిగుండం లో జగనన్నకాలనీ హెవే  కు  దగ్గరగా ఉందని,  కుటుంబానికి 70 గజాల స్థలాన్ని ఇస్తూ,  ఇళ్లు కట్టి ఇవ్వడం జరుగుతుందన్నారు. మావుళ్లమ్మ అనే మహిళకు రెండవ ఫేజ్ లో మంజూరు అయినప్పటికి  ఆమె కట్టుకుంటానని  ముందుకు రావడంతో  అనుమతి ఇచ్చి కట్టిస్తున్నామని తెలిపారు.  ఇది ప్రభుత్వ చిత్త శుద్దికి నిదర్శనమన్నారు.  అంతకు ముందు మంత్రులు గండిగుండంలో  వై ఎస్ ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీలలో  ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.  అదే విధంగా గండిగుండం(194గృహాలు), శొంఠ్యాం(364గృహలు),   గ్రామాలలో వై ఎస్ ఆర్ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలను  మంత్రులు పరిశీలించారు. ఆర్ డి ఓ పెంచల కిశోర్, హౌసింగ్ పిడి  ఎం .శ్రీనివాసరావు,  తదితరులు పాల్గొన్నారు. 

Bheemili

2021-08-18 14:03:43

సామాజిక భవనాన్ని ప్రారంభించిన మంత్రి..

భీమిలీ నియోజకవర్గంలోని జీవీఎంసీ జోన్-1 పరిధిలోని 2వ వార్డులోని తగరపువలసలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్థానికంగా 20 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం.. 78 లక్షలతో నిర్మిస్తున్న రైతుబజార్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తగరపువలస ప్రజల చిరకాల కోరిక రైతుబజార్ నేడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజా క్షేమాన్ని కాంక్షిస్తున్నారని అన్నారు.  రాష్ట్రంలో  పేదరిక నిర్మూలనే ముఖ్య మంత్రి లక్ష్యమని అన్నారు. త్వరలోనే మంచినీటి పైపులైన్ల పనులు పూర్తిచేసి భీమిలీ, తగరపువలసలోని ఇంటింటికీ మంచినీరు అందిస్తామని అన్నారు. స్థానికంగా చెక్ డాం కట్టించేందుకు కృషి చేస్తానని అన్నారు. పాండ్రంగి బ్రిడ్జి పూర్తికి.. పద్మనాభస్వామి ఆలయానికి రహదారి నిర్మాణానికి, ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ హరి వెంకట కుమారి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దాట్ల పెదబాబు, జోనల్ కమిషనర్  వెంకటరమణ, ఎమ్మార్వో ఈశ్వరరావు, 1వ వార్డు కార్పొరేటర్ అక్కరమాని పద్మావతి రామ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Bheemili

2021-08-17 14:51:22

లాభసాటి వ్యవసాయాన్ని చేరువచేయాలి..

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించి వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ఆర్బీకే సెంటర్ల ఏర్పాటు లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. భీమిలీ నియోజకవర్గంలోని భీమునిపట్నంలో 73.54 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు. 50 లక్షలతో  వ్యవసాయ మార్కెట్ నూతన కార్యాలయంకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల బాధలు అర్తం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గానికో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. 
ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లీ ప్రపంచం అడుగులేస్తోంది. మారిన జీవన విధానం, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మంచి పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరం అని అన్నారు. నియోజకవర్గంలోని 47 ఆర్బీకే సెంటర్లకుగానూ ఆగస్టు నెలాఖరుకు సగం పూర్తవ్వాలని.. దసరాకు మొత్తం ఆర్బీకే సెంటర్ల నిర్మాణం పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం జరిగితే రైతులు నష్టపోకూడదని ఈ-క్రాప్ విధానం తీసుకొచ్చి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారని అన్నారు. నియోజకవర్గంలోని రైతుల సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. రైతులకు సేవ చేస్తే.. భగవంతునికి చేసినట్టేనని మంత్రి ఈ సందర్బంగా అన్నారు. 

మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించేందుకు ఈ అగ్రి ల్యాబ్స్ ఉపయోగపడతాయని అన్నారు. రైతుల సంక్షేమం కోరి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు. అగ్రికల్చరల్ జాయింట్ డైరెక్టర్ లీలావతి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గస్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ స్థాపణతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వాడుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఉన్న 627 రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరఫరా చేస్తున్నామని అన్నారు. రైతులందరూ ఈపంటలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. 

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దాట్ల పెదబాబు, అగ్రికల్చరల్ ఏడీ, హార్టికల్చరల్ ఏడీ, జిల్లా పశుసంవర్ధక శాఖ చైర్మన్ గాడు వెంకటప్పడు, వ్యవసాయ అధికారులు, మాజీ ఎంపీపీ కొరడ వెంకటరావు, , కార్పొరేటర్లు, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు, పీఏసీఎస్ అధ్యక్షులు, మూడు మండలాల సర్పంచులు, ఎంపీటీసీ అభ్యర్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Bheemili

2021-08-17 14:48:27

మహాత్ముల బలిదానమే నేటి మన స్వాతంత్య్రం..-

భారత స్వాతంత్ర్యం కోసం మహాత్ముల ప్రాణాల బలి దానం/ త్యాగ ఫలమే మన స్వాతంత్ర్య ఫలాలుగా అందుకుంటున్నామని ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం శంఖవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల, కళాశాలల ప్రాంగణాల్లో ఎంతో ఘనంగా నిర్వహించిన దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టాడుతూ, ఆ జాతి నేతలు ఎప్పటికీ మనకు చిరస్మరణీయులని, వారి శాంతియుత, విప్లవ ద్విముఖ పంధా పోరాటాల ఫలితంగానే నేటికి 75 స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించు కుంటున్నామన్నారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి ఆయన తన విలువైన సందేశాన్ని అందించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థుల ఉన్నతి కోసమే అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యార్థుల ఫీజు రీఇంబర్స్మెంట్, నాడు - నేడు, జగనన్న విద్యా కానుక వంటి పథకాలను ముఖ్యమంత్రి జగన్ ప్రవేశ పెట్టారని, వీటిని సద్వినియోగం చేసుకుని విద్యార్ధులు ఉన్నత స్థాయికి రావాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు.  ఈ నెల 18 తేదీన పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రెండో దఫా నాడు - నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నా మన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమారావు రామ్జీ అంబేద్కర్ చిత్రపటాలకు జ్యోతి ప్రజ్వలనం చేసి, పూల మాలలతో ఆవిష్కరించి, ఆ నేతలకు నివాళులను అర్పించారు.  ఈ కార్యక్రంలో పాఠశాల, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-15 16:02:23