1 ENS Live Breaking News

జగనన్న పచ్చతోరణం పెద్దఎత్తున సాగాలి..

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న జగనన్న పచ్చతోరణం కార్యక్రమం పెద్దఎత్తున ఉద్యమం సాగాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన శ్రీ సత్యదేవ కళ్యాణ మండపంలో కొబ్బరి మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పచ్చతోరణమంటే మొక్కలు, చెట్లు ఎక్కడికి వెళ్లినా స్వాగతం పలికేట్టుగా నాటాలన్నారు. ఎంపీడీఓ జె.రాంబాబు మాట్లాడుతూ, మండలంలో పెద్దఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సచివాలయ  కార్యర్శిలు శ్రీరామచంద్రమూర్తి, శంకరాచార్యులు, సత్య, ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్, జూనియర్ సహాయకులు రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, ఉపాది హామీ సిబ్బంది వైఎస్సార్సీపీ నాయకులు లచ్చబాబు, పడాల సతీష్, పడాల బాష, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-09 15:53:59

జ్ఞానవేణి ఎంపిక పట్ల ఉద్యోగుల హర్షం..

ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ఎస్సీ,ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గంలో స్టేట్ జనరల్ బాడీకి యునానిమస్ గా  జ్ఞానవేణి కుంచే వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం పట్ల విశాఖజిల్లా యూనిట్ మరియు రెవిన్యూ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ తహశీల్దార్ కార్యాలయంలో  జ్ఞానవేణి కుంచేని కలిసి సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనను రాష్ట్రకార్యవర్గంలో స్థానం దక్కడమంటే తనపై బాధ్యత మరింత అధికంగా పెట్టినట్టేనన్నారు. యూనియన్ అభివ్రుద్ధి, అధికారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. అధికారులు, ఉద్యోగులకు ఎలాంటి సమస్య వున్న తక్షణమే తనను సంప్రదిస్తే..విషయాన్ని రాష్ట్ర కమిటీలో చర్చించి పరిష్కారిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా ఎస్సీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Seethammadara

2021-08-09 14:41:46

ఆదివాసీల జీవితాల్లో ఆర్ఓఎఫ్ఆర్ వెలుగులు..

ఆంధ్రప్రదేశ్ లోని గిరిజనుల జీవితాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్ఓఆర్ఎఫ్ భూమి పంపంణీ చేసి వెలుగులు నింపుతోందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్ అన్నారు. ప్రపంచ ఆదీవాసి దినోత్సవం సందర్భంగా శంఖవరం మండలంలోని ఎస్టీ సబ్ ప్లాన్ లో ఉన్న గిరిజనులకు  ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీచేశారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, గిరిజనుల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ ఎల్లప్పుడూ కృషిచేస్తున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నెరవేర్చి చూపిస్తున్నారని అన్నారు. గిరిజనుల వెంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాంబాబు, తహశీల్దార్ బాలసుబ్రమణ్యం,  ఎంపీపీ అభ్యర్ధి పర్వత రాజబాబు,  మండలంలోని 14 పంచాయతీల సర్పంచ్ లు, స్థానిక సచివాలయ  కార్యర్శిలు శ్రీరామచంద్రమూర్తి, శంకరాచార్యులు, సత్య, ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్, జూనియర్ సహాయకులు రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, వైఎస్సార్సీపీ నాయకులు లచ్చబాబు, పడాల సతీష్, పడాల బాష, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-09 14:08:18

జగనన్న స్వచ్ఛ సంకల్పంతో సుందర గ్రామాలు..

జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమంతో పల్లెలన్నీ పరిశుభ్రంగా మారిపోయి సుందర గ్రామాలుగా తయారు కావాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్ అన్నారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని శ్రీ సత్యదేవ కళ్యాణమండపంలో ఏర్పాటుచేసిన జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ గ్రామాలను స్వచ్ఛంగా, పరిశుభ్రంగా మార్చాలని సంకల్పించారని అన్నారు. ఇందులో బాగంగా అన్ని పంచాయతీలు, గ్రామ సచివాలయాల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రతీ ఒక్కరూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇచ్చిన పిలుపుని స్వీకరించి గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలన్నారు. కార్యక్రమం ఒక ఉద్యమంలా చేపట్టాలని పిలపుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాంబాబు, తహశీల్దార్ బాలసుబ్రమణ్యం,  ఎంపీపీ అభ్యర్ధి పర్వత రాజబాబు,  మండలంలోని 14 పంచాయతీల సర్పంచ్ లు, స్థానిక సచివాలయ  కార్యర్శిలు శ్రీరామచంద్రమూర్తి, శంకరాచార్యులు, సత్య, ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్, జూనియర్ సహాయకులు రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, వైఎస్సార్సీపీ నాయకులు లచ్చబాబు, పడాల సతీష్, పడాల బాష, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-09 14:03:14

సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంపీడీఓలు..

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు కల్పించిన సీఎం వైఎస్.జగన్మోహ నరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉద్యోగులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జె.రాంబాబు మాట్లాడుతూ, సీఎంవైఎస్ జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగా పంచాయతీరాజ్ శాఖలో అన్ని కేటగిరీల్లో పనిచే ఉద్యోగులందరికీ పదోన్నతులు లభిస్తాయన్నారు. ముఖ్యంగా ఎంపీడీఓలకు డిఎల్డీఓ, డిప్యూటీ సిఈఓ, వివిధ శాఖల్లో డైరెక్టర్లుగా పదోన్నతులు లభిస్తాయన్నారు. ఇన్నేళ్ల నుంచి ఎదురుచూసిన కల ఈ ప్రభుత్వంలో నెరవేరుతుండటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సుబ్రమణ్యం, పలువురు ఎంపీడీఓలు, శంఖవరం మండలంలోని పంచాయతీ కార్యదర్శిలు, స్థానిక సచివాలయ కార్యదర్శిలు శ్రీరామచంద్రమూర్తి, శంకరాచార్యులు, సత్య జూనియర్ సహాయకులు రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్, పడాల సతీష్,  పడాల బాష, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-09 13:55:40

రోడ్డు తవ్విన ధనరెడ్డిపై పోలీసులకి ఫిర్యాదు..

ఎస్.రాయవరం లోని వెంకటేశ్వరస్వామి గుడి వద్ద లేఔట్ నుంచి వ్యర్దపు నీరు సర్వసిద్ది పంట కాలువ లోకి వదలడానికి ఆదివారం అర్ధరాత్రి తారురోడ్డు ధ్వంసం చేసి సిమెంట్ తూరలు వేసిన కర్రిధనరెడ్డి పై ఆర్అండ్ బి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.  సర్వసిద్ది పంట కాలువలోకి అక్రమ లేఔట్ వ్యర్దపు నీరు పంపడానికి నిబంధనలకు విరుద్ధంగా అర్అండ్ బి, నీటిపారుదలశాఖ, పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీల వద్ద ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా తారురోడ్డు  తవ్వేశారు.  పట్టపగలు 10 గంటల సమయంలో అందరూ వాహనదారులు, అధికారులు వెళుతుండగా రద్దీగా ఉన్న సమయంలో తారు రోడ్డు రెండు అడుగులు వెడల్పు, 30 అడుగుల పొడవునా తవ్వేసిన విషయమై ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు తహసీల్దార్ బి.సత్యనారాయణకు తెలియజేశారు. తక్షణమే యజమాని కర్రి ధనరెడ్డి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని  సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో తహశీల్దార్ బి.సత్యనారాయణ చేపడుతున్న పనులు ఆపాలని ఆదేశించారు. ఇదే విషయమై ఆర్అండ్ బీ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఎన్నిఫిర్యాదులు చేసినా రాత్రికి రాత్రి మళ్లీ రోడ్డును అడ్డంగా తవ్వేసి బైపా శ్రీనివాసరావు మరో 5 గురు వ్యక్తులతో రోడ్డు యంత్రాలతో పనులు పూర్తిచేశారు. ఇటు పోలీసులు, ఆర్అండ్భీ, నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదులు చేరసినా పనులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కొనసాగించారని ఆర్టీఐ కన్వీనర్ ఆరోపిస్తున్నారు.  ఇప్పటికైనా అక్రమాలు, ఆక్రమణలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోకపోతే విషయాన్ని ఆధారాలతోపాటు జిల్లా ఎస్పీ, జిల్లాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు కన్వీనర్ ఆదివారం మీడియా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 

S Rayavaram

2021-08-08 14:58:11

ప్రజలకు ఉచిత బియ్యం సక్రమంగా చేరాలి..

ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆపన్న హస్తం- ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉచిత బియ్యం పథకమని , లబ్ధి దారులందరికీ సక్రమంగా అందజేయాలని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి  నిర్మలా సీతారామన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కశింకోట మండలం తాళ్ళ పాలెం లో పీ డీ ఎస్  కేంద్రాన్ని తనిఖీ చేశారు. రేషన్ డీలర్ ను పంపిణి వ్యవస్థ పై వివరాలను అడిగి తెలుసుకున్నారు.  కేంద్ర ప్రభుత్వం" పీ ఎం జి కే ఏ వై"  పథకాన్ని 2020 సం ఏప్రిల్ నుండి నవంబర్ వరకూ (8)నెలలు, 2021సం మే నుండి నవంబర్ (7) నెలల వరకూ పేద ప్రజలకు ఒక్కొక్కరికీ 5 కే జీ ల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నదన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియ జేయాల్సిన అవసరం ఉందని, బియ్యాన్ని  పంపిణీ చేసేటప్పుడు తప్పని సరిగా ప్రధాన మంత్రి మోదీ గారి ఫోటో ను ప్రదర్శించాలని జాయింట్ కలెక్టర్ ను ఆదేశించారు. అదేవిధంగా అంత్యోదయ అన్న యోజన పథకం (AAY)కింద కార్డు దారులకు 35 కే జీ ల బిియ్యం,కిలో  ఒక రూపాయి కు, కిలో పంచదార 13.50 రూ.లకు పంపిణి చేస్తున్నట్లు,  ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం  60 శాతం పైగా కార్డులకు బియ్యాన్ని పూర్తి సబ్సిడీ తో రాష్ట్రాలకు అందిస్తున్నదని మంత్రి తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి పథక లబ్ది దారులతో ముఖాముఖి సంభాషించారు. "ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం" అంటూ ఒకటి ఉన్నదని మీకు తెలుసా? అని ప్రశ్నించారు.. లబ్ధి దారులు మాట్లాడుతూ ప్రతీ నెల ఇంటీ వద్దకే వాహనం వచ్చి బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని తెలుపగా, ఆ విధంగా కాదు మీరు నేరుగా రేషన్ షాప్ లో ఉచిత బియ్యాన్ని ప్రధాన మంత్రి మోదీ గారి చిత్ర పటం తో తీసుకోవాలన్నారు.ప్రధాని పేదవారి సంక్షేమం కోసం పలు అభివృద్ధి పథకాలను అందిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, ఆం.ప్ర. ఆర్థిక శాఖ ప్రిన్సిిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, ఎమ్ పీ బీ సత్యవతి, ఎమ్ ఎల్ సి పి వి యన్ మాధవ్,  సోము వీర్రాజు,ఎం ఎల్ ఏ లు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, జాయింట్ కలెక్టర్ లు ఏం వేణుగోపాల్రెడ్డి,పి అరుణ్ బాబు, అర్ డీ వో సీతా రామారావు, అధిక సంఖ్య లో స్థానిక ప్రజలు హాజరయ్యారు.

Kasimkota

2021-08-08 11:36:10

సీపీఎస్ విధానం తక్షణమే రద్దుచేయాలి..

ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్  విధానం రద్దు చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని APCPSEA రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల.నాగిరెడ్డికి వినతి  పత్రాలు అందజేసిన ఉద్యోగులు సిపీఎస్ రద్దు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, సీపీఎస్ విధానం రద్దు కోరుతూ క్విట్ సిపీఎస్ నినాదంతో  రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేయాలని APCPSEA రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిందన్నారు. ఆమేరకు అందరి ప్రజాప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందిస్తున్నామన్నారు.  అధికారంలోకి వచ్చిన వారంరోజులలోనే సీపీఎస్ రద్దు చేస్తామని  ముఖ్యమంత్రి  హామీ ఇచ్చారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  సిపిఎస్ విధానం రద్దు చేసి పాతపెన్షన్ స్కీమును యధాతధంగా కొనసాగించి రాష్ట్రం లోని రెండు లక్షల ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానాన్ని రద్దు ఛేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే రూ.10 కోట్లు ఆదాయం లభిస్తుందన్న నేతలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై విది విధానాలు రూపొందించేందు చర్చలకు తమను ఆహ్వాలవాలని ఆయన డిమాండ్ చేసారు. ఈవిదానం రద్దు చేయకపోతే సెప్టెంబర్ 1న పెన్షన్ విధ్రోహ దినంగా పాటిస్తూ  రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు చేపడాతమని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు  బి. చిన్నారావ్ , అనకాపల్లి మండల శాఖ అధ్యక్షుడు  బి. శ్రీనివాసరావు , ప్రధాన కార్యదర్శి వి కృష్ణ మోహన్, ఎం ఎన్. జె శ్రీనివాస్, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2021-08-08 08:32:42

ఆగస్టు15 వేడుకలకు ఖాకీ డ్రెస్సుతోనే మహిళా పోలీసులు..

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళాపోలీసులు పంద్రాగస్టు వేడకలకు పోలీస్ డ్రెస్ తోనే మహిళా పోలీసుల హాజరు కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 15వేల 4  సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళాపోలీసులకి యూనిఫారం అలవెన్సులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఏపీ డిజీపీ గౌతం సవాంగ్ ను ఆదేశించారు. అంతేకాకుండా వారంతా ఖాకీ యూనిఫారంలోనే పంద్రాగస్టు వేడుకలకు హాజరు కావాలని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దానికి అనుగుణంగా డిజిపి గౌతం సవాంగ్ రాష్ట్రంలోని 13జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. వాటితోపాటు మహిళా పోలీసులకు నిర్వహించాల్సిన దేహదారుడ్య, నడక పోటీలను కూడా  దశలవారీగా అన్ని బ్యాచ్ ల వారికి ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో డీజిపీ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారాన్ని ఇటు జిల్లాల పోలీసులు కూడా అన్ని స్టేషన్ల పరిధిలోని మహిళా పోలీసులకు వర్తమానం పంపారు. సాధారణంగా యూనిఫారం అంటే ఖాకీ చొక్కా, పేంటు, మూడు సింహాల గుర్తు, చేతిపై ఏపీ పోలీస్ లోగో స్టిక్కర్, బూట్లు, విజిల్ విత్ త్రెడ్, ఒక లాఠీ పోలీసుశాఖల  ఇస్తారు. ప్రభుత్వం కూడా జీవో నెంబరు 59 ద్వారా హోంశాఖకి చెందిన మహిళా పోలీసులుగా గుర్తించడంతో వీరికి కూడా అదేస్థాయిలో యూనిఫారం ఇవ్వాల్సి ఉంది. కాకపోతే హోం డిపార్ట్ మెంట్ లోని లేని కొందరు పోలీసులకి మహిళా పోలీస్ ఉద్యోగాలు ప్రభుత్వం నియమించడం, వారికి అధికారాలు ఇవ్వడం ఇష్టం లేదు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకుండా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసే సమయమంలో గ్రామ సంరక్షణ కోసం మహిళా పోలీస్ ని నియమించి తద్వారా గ్రామానికి దన్నుగా నియమించాలనుకొని వారిని నియమించింది. వారికి ఐసిడిఎస్,తో ఆరోగ్యశాఖల సిబ్బందికి తోడుగా పనిచేయాలని అత్యధిక భాగం గ్రామ పరిరక్షణకే ఇవ్వాలని కూడా  ఆదేశించింది. సాధారణ దుస్తుల్లో అయితే ప్రజల్లో వారికి గుర్తింపు రాదని భావించిన ప్రభుత్వం జీఓ నెంబరు 59 ద్వారా వారిని కూడా సాధారణ పోలీసులుగా మార్పుచేస్తూ.. ఇపుడు వారికి ఖాకీ డ్రెస్సుని కేటాయించింది. ఏదైతే ఖాకీ డ్రెస్సులు వేసుకొని గ్రామాల్లో తిరిగితే  గ్రామాల్లో తమకి విలువ పడిపోతుందని..తామంటే భయంపోతుందని ఆందోళపడిన చాలా మంది పోలీసు సిబ్బందికి ప్రభుత్వ నిర్ణయం నిజంగానే వారి ప్రచారానికి అడ్డుకట్టవేయగలిగింది. దీనితో ఆగస్టు 15తరువాత రాష్ట్రవ్యాప్తంగా 15వేల 4 గ్రామ వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులు ఖాకీ డ్రెస్సులతోనే విధులకు హాజరు కానున్నారు. దీనిని బట్టి రాష్ట్రప్రభుత్వం గ్రామ రక్షణకు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చిందో ప్రజలకు తెలియజేసినట్టు అయ్యింది.

ప్రభుత్వ జీఓలపై పోలీసులకు అవగాహన ఎంత..?

ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినదగ్గర నుంచి మహిళా పోలీసుల నియమాకాల కోసం జీఓఎంఎస్ నెంబరు 126, 129, 59, ఇపుడు తాజాగా 60ని విడుదల చేస్తూ.. ఒక్కో జీఓలో ఒక్కో రకమైన ఆదేశాలు ఇస్తూ వచ్చింది. వాస్తవానికి ఈ ప్రభుత్వ జీఓలను జిల్లా ఎస్పీలు, అడ్మిన్ ఎస్పీలు వారి పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎస్ఐలకు అవగాహన కల్పించాల్సి వుంది. ప్రభుత్వం జీఓల్లో పొందు పరిచినట్టుగా అమలు చేయాల్సివుంది. జిల్లా ఎస్పీలు ఆపని చేస్తున్నప్పటికీ స్టేషన్ స్థాయిలో మాత్రం సిబ్బంది అంతగా ప్రభుత్వ జీఓలను పట్టించుకోనట్టుగానే ప్రచారం జరుగుతుంది. ఒక్కో స్టేషన్  పరిధిలో ఒక్కోలా మహిళా పోలీసుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు పోలీసుశాఖకు కాస్త తలనొప్పిగా పరిణమిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. కొందరు కానిస్టేబుళ్లు మీరు మాలా నిజమైన పోలీసులు కారంటే.. మరికొందరు హెడ్ కానిస్టేబుళ్లు మీకు ప్రభుత్వం మాలాగ ఖాకీ డ్రెస్సు ఇవ్వదనీ, మీరు మా కింద సమాచారం ఇవ్వడానికి మాత్రమే పనిచేయాలని మాట్లాడుతున్నారు..ఇవన్నీ పక్కనపెడితే ఏఎస్ఐ స్థాయిలో వున్నవారు, ఎస్ఐ స్థాయిలో ఉన్నవారు పోలీసు డిపార్ట్ ఉద్యోగులమంటే మేమేనని... కేవలం మిమ్మల్ని ప్రభుత్వం స్టేషన్ కి సమాచారం ఇవ్వగానికే గ్రామంలో నియమించిందని నేరుగా చెబుతున్నారు. మరికొన్ని చోట్ల నేరుగా అసలు మీరు పోలీసుశాఖకు చెందిన వారు కాదని, మాతో సమానంగా పోలీస్ అని ఎలా పిలిపించుకుంటున్నారని వాదనలకు దిగుతున్నారు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులను ప్రభుత్వం హోంశాఖ ద్వారా, జిల్లా ఎస్పీలతో నియామకాలు చేపట్టింది. ఆ తరువాత ప్రత్యేక జీఓలను సైతం విడుదల చేస్తున్నప్పటికీ ఎందుకనో పోలీసుశాఖలోని ఒక వర్గం మహిళా పోలీసు వ్యవస్థను పోలీసుశాఖలో కలుపుకోవడానికి, వారితో సమానంగా గుర్తించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనితో ప్రభుత్వ ఉత్తర్వులపై అసలు వీరికి అవగాహన ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నిచోట్ల జిల్లా ఎస్పీలు హెచ్చరించినప్పటికీ కింది స్థాయి సిబ్బందిలో మార్పు మాత్రం కనపడనట్టుగానే ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికైనా జిల్లా పోలీసుశాఖ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగాల్లో పోలీసు శాఖ ద్వారానే నియమించిన మహిళా పోలీసు ఉద్యోగాలపై కఠినమైన ఆదేశాలు జారీచేయాల్సివుందనే డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తుంది.

Tadepalle

2021-08-08 06:15:01

మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలి..

సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని గార్డ్స్ డైరెక్టర్ వరదా నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం  సీతంపేటలో గ్రంధాలయంలో సరితా చారిటబుల్ ట్రస్ట్ అధ్యర్యంలో మహిళా సాధికారతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. విజయ భారతి మాట్లాడుతూ, ప్రతి ఒక్క తల్లి తమ బిడ్డలను విద్యావంతులను చేయాలనీ తెలిపారు. సత్యభామ మాట్లాడుతూ, దిశా చట్టం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవడంతోపాటు యాప్ ని ఇనిస్టాల్ చేసుకొని రక్షణగా మలచుకోవాలన్నారు. ట్రస్ట్ చైర్మన్ సరితా మాట్లాడుతూ సమాజంలో మహిళల అభివృధ్ధికోసం తమ సంస్థ పాటుపడు తుందని తమకున్న అవసరాలు సంస్థకు తెలియచేస్తే తగువిధంగా సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో   గ్రంధాలయ లైబ్రేరియన్ డి. రాజు, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వారామణి తదితరులు పాల్గొన్నారు.

Seethampeta

2021-08-07 15:18:25

10లోగా కేజీబీవీల్లో ప్రవేశాలు పొందాలి..

శంఖవరం కేజీబీవీ పాఠశాలలో 37 మందికి అడ్మిషన్లు ఇచ్చినట్టు ఇన్చార్జి ఎస్ఓ రత్నం తెలియజేశారు. శంఖవరంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేజీబీవికి 6వ తరగతిలో దరఖాస్తు చేసుకున్నవారు 10వ తేదీలోగా అడ్మిషన్లు పొందాలని ఆమె కోరారు. వారితోపాటు ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టినవారు వారికి వచ్చిన సెల్ మెసేజితోనూ  దృవీకరణ పత్రాలతో అడ్మిషన్లు పొందవచ్చునన్నారు. ఎంపికైనా విద్యార్థులంతా ఆన్ లైన్ ధరఖాస్తు తో పాటు, కులధ్రృవీకరణపత్రం , స్టడీ సర్టిఫికేట్, ఆధార్ ,రేషన్ కార్డ్ ,పాస్ పోటో తో పాఠశాల పనివేళల్లో  సంప్రదించాలని ఆమె కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్ధినిలు సద్వియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

శంఖవరం

2021-08-07 14:21:23

12లోగా అగ్రిగోల్డు వివరాలు సమర్పించాలి..

అగ్రిగోల్డు బాధితులు రసీదులతో సచివాలయాలను సంప్రదించాలని మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష కోరారు. శనివారం ఈ మేరకు శంఖవరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అగ్రీగోల్డులో రూ.20వేల వరకూ డిపాజిట్లు కట్టిన వారంతా తమ రసీదులు, ఆధార్ కార్డులతో సచివాలయంలోగానీ, గ్రామ వాలంటాటీర్లను గానీ సంప్రదించాలన్నారు. కట్టిన రసీదులను ఆన్లైన్ లో అప్లోడ్ చేసి  ప్రభుత్వానికి నివేదించ నున్నామని అన్నారు. తక్షణమే వివరాలు తెలియజేయాలన్నారు. అగ్రిగోల్డు వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వం ఈనెల 12వ తేదీవరకూ మాత్రమే గడువు విధించిందని ఆమె వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.

Sankhavaram

2021-08-07 14:20:11

పొలంబడిలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ..

డా.వైఎస్సార్ పొలంబడి కార్యక్రమం ద్వారా వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు పంటల యాజమాన్యం సస్యరక్షణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు వ్యవసాయాధికారి కెజెచంద్రశేఖర్ తెలియజేశారు. శనివారం శంఖవరంలోని పంటపొలాల్లో ఈ మేరకు ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఖరీఫ్ లో సీజన్ లో వచ్చే తెగుళ్లు, వాటికి చేపట్టాల్సి సస్యరక్షణ చర్యలు, మందుల వాడకంపై పలు సూచనలు చేశామన్నారు. గ్రామ సచివాలయాల పరిధిలోని రైతులకు వ్యవసాయ సహాయకులు సాగుబడి సమయంలో సూచనలు సలహాలు చేస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, రైతులు పాల్గొన్నారు.

శంఖవరం

2021-08-07 14:14:38

సంక్షేమ పథకాలలో వెనకడుగు లేదు..

అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని  శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. జగనన్న పచ్చతోరణం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సరుబుజ్జిలి మండలం పెదపాలెం గ్రామం నుండి పాలవలస గ్రామం వరకు రోడ్డుకిరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాసనసభాపతి తమ్మినేని సీతారాం శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పాలవలస గ్రామం లో జగనన్న కాలనీలో ఉమ్మడి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మానస పుత్రిక అని, 31 లక్షల ఇళ్లు దేశంలో ఎక్కడా ఇప్పటి వరకు నిర్మించ లేదని అన్నారు. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చాలా దగ్గరగా మోనిటరింగ్ చేస్తున్నారని, ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక పరిపాలనా వ్యవస్థను మెరుగు పరిచే నాయకుడికి సంపూర్ణమైన అభినందనలు తెలియజేస్తున్నానని సీతారాం అన్నారు. ఈ కార్యక్రమంలో  మండల అధికారులు, స్థానిక నాయకులు బెవర మల్లేశ్వరరావు, కె వి జి సత్యనారాయణ,  సురావరపు నాగేశ్వరరావు తదతరులు పాల్గొన్నారు.

Sarubujjili

2021-08-06 15:09:17

సచివాలయ భవనాలు సత్వరమే పూర్తిచేయాలి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం , రైతు భరోసా, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ సెంటర్ల శాశ్వత భవన నిర్మాణాలు  వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాళ్లరేవు మండలం జి.వేమవరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవన సముదాయాలను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు  ప్రభుత్వం అందించే సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శాశ్వత భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనుల పై ప్రత్యేక దృష్టి పెట్టి, ఇతర అధికారులతో సమన్వయం చేసుకుని రోజువారి పనులలో ప్రగతి చూపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తాళ్లరేవు మండలం ఎంపీడీవో పీ.విజయ్ థామస్,సచివాలయ సిబ్బంది, ఇతర రెవిన్యూ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Tallarevu

2021-08-06 14:06:44