1 ENS Live Breaking News

ఘనంగా వేణుమాధవస్వామి ఆలయ వార్షికోత్సవం..

కత్తిపూడి సుబ్రమణ్య స్వామి ఆలయ ఆవరణలో వున్న వేణుమాధవ స్వామి ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్వామివారి ఆలయంలో ఈరోజు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అస్టోత్తరాలను ఆలయ అర్చకులు సత్యన్నారాయణ శర్మ చేపట్టారు. ఈ సందర్భగా వేణఉమాధవ స్వామిని అన్ని రంగుల పూలు, తులసి మాలలతో సర్వంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ వి.నూకరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి ప్రత్యేక భజనా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులందరికీ తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Kathipudi

2021-08-15 14:54:04

బెస్ట్ ఆఫీసర్ గా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి..

చక్కని  విధినిర్వహణ ఆ అధికారిణి పరమావధి.. మత్స్యశాఖలో ఏ కొత్త ప్రాజెక్టు మొదలైనా దానిని ఈమె మాత్రమే రాష్ట్రంలో విజయవంతంగా మొదటిసారిగా పూర్తిచేస్తారు.. అధికారులు ఇచ్చిన లక్ష్యాలను ఇట్టే పూర్తిచేయడంతో ఈ అధికారిణి దిట్ట.. ఏజిల్లాలో పనిచేసినా ఆమెను బెస్ట్ ఆఫీసర్ అవార్డు వరిస్తుందటే అతిశయోక్తి కాదేమో.. ఆమె విజయనగరం జిల్లా మత్స్యశాఖ అదనపు సంచాలకులు నేతల నిర్మల కుమారి. పేరుకి జిల్లా అధికారిణి అయినప్పటికీ మత్స్యశాఖలో అన్ని పనులను ఎంతో ఉన్నతంగా చేసుకుపోతుంటారీమే. తెలుగుదనం ఉట్టిపడేలా చక్కని రూపంతో వ్యవహరిక శైలి.. టీమ్ ని లీడ్ చేయడంలోనూ అంతే నేర్పుగా వ్యవహరించే సమసర్ధత ఆమె సొంతం. వెరసీ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధికారిణగా డిప్యూటీసీఎం పాముల పుష్పవాణి నుంచి అవార్డు అందుకున్నారు. అంతేకాదు ఈమెను అభినందిస్తూ..ప్రభుత్వానికి, మత్స్యశాఖకు మరింత పేరుతీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ ఏడి నిర్మల కుమారి మీడియాతో మాట్లాడుతూ, ఈ అవార్డు తనపై మరింత భాద్యతను పెంచిందన్నారు. జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పర్యవేక్షణలో విధినిర్వహణ మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తానని, కొత్త ప్రాజెక్టులను మత్స్యకారులకు చేరువ చేయడంలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు.  ఈమెకి అవార్డు రావడం పట్ల జిల్లా మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

విజయనగరం

2021-08-15 14:30:43

పేదలు అభివ్రుద్ధి చెందడమే నిజమైన స్వాతంత్య్రం..

నిరుపేదలు ఏరోజైతే అభివ్రుద్ధి చెందుతారో ఆరోజే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని ఉపసర్పంచ్ చింనీడి కుమార్ అన్నారు. ఆదివారం శంఖవరం గ్రామసచివాలయం-2లో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. 75ఏళ్ల క్రితం మనికి స్వాతంత్య్రం రావడానికి ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారన్నారు. వారి స్పూర్తితో నేడు సీఎం వైఎస్ జగన్ గ్రామాలు అభివ్రుద్ధి చెందాలనే లక్ష్యంతో గ్రామసచివాలయాలు ఏర్పాటు చేశారని కొనియాడారు. అలాంటి మంచి చోటలో జెండా ఎగురవేయడం ఎంతో ఆనందంగా వున్నదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసచివాలయ-2 కార్యదర్శి శంకరాచార్యులు, ఇన్చార్జి మహిళా పోలీస్ జీఎన్ఎస్ శిరీష, పంచాయతీ ఆరోగ్య సహాయకులు రమణమూర్తి, వైఎస్సార్సీపీ మండల నాయకులు పడాల సతీష్, పడాల భాష, గ్రామవాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-15 13:49:59

మహానీయుల త్యాగఫలమే స్వాతంత్య్రం..

అల్లూరి సీతారామరాజు స్వయంగా సంచరించిన శంఖవరం మండల కేంద్రంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం గ్రామసచివాలయం-1లో గ్రామసర్పంచ్ బి. గన్నయ్యమ్మ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్ మాట్లాడుతూ, మహాత్ముల ప్రాణ త్యాగాల ఫలితమే నేడు 75ఏళ్లుగా స్వాతంత్య్రం ఫలితాలను అనుభవిస్తున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు సైతం భరతజాతి కోసం ప్రాణాలర్పించారన్నారు. వారి ఆశయాలకు అనుగుణం పనిచేసిన రోజే స్వాంతంత్ర్యానికి నిజమైన గుర్తింపు వచ్చిన్టు అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శిలు రాంబాబు, శమకరాచార్యులు, సత్య, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, జూనియర్ సహాయకులు రమణమూర్తి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-15 13:47:16

త్యాగధనులను మార్గదర్శకంగా తీసుకోవాలి.

భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను మార్గదర్శకంగా తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణశ్రీ అన్నారు. ఆదివారం శంఖవరం ఐసీడిఎస్ సీడీపీఓ కార్యాలయంలో ఆమె జెండా ఎగురవేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ ఈస్వరాజ్యం కోసమే కలలు గన్నారని అన్నారు. నేటి బిడ్డలు రేపటి ఆరోగ్య పౌరులుగా ఎదగాలంటే పౌష్టికాహరం ఎంతో అవసరమన్నారు. దాన్ని ఐసిడీఎస్ ఉచితంగా అందిస్తున్నదని వీటిని తల్లులు, కాబోయే తల్లులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తల సంఘం ప్రతినిధి బుల్లెమ్మ, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-15 13:29:46

జిసిసి అభివ్రుద్ధికి రాజీలేని క్రుషి.. చైర్మన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ని బలోపేతం చేయడంతో పాటు, సిబ్బంది సమస్యల పరిష్కారాని శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని చైర్మన్ శోభా స్వాతి రాణి పేర్కొన్నారు. శనివారం ఆమె పాడేరులో మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా జిసిసిలోని కొందరు సిబ్బంది సమస్యలను ఎమ్మెల్యే చైర్మన్ ద్రుష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె సంస్థలోని ఏ కేడర్ ఉద్యోగుల వలన సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని చెప్పారు. అంతేకాకుండా జిసిసిని మరింతగా బలోపేతం చేయడానికి ప్రజాప్రతినిధులంతా సహకారం అందించాలని చైర్మన్  ఎమ్మెల్యే, ఎంపీలను కోరారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి జిసిసి ఉత్పత్తులు వినియోగించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తద్వారా జిసిసికి ముడి సరుకు అందించే గిరిజన రైతులకు మరింత అభివ్రుద్ధి చెందడానికి ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ బోర్డు సభ్యులు  డా.తమర్భ నర్సింగరావు , జిసిసి మేనేజర్ తో పాటు ఇతర అధికారులు, వై.ఎస్సార్ నియోజవర్గ నాయకులు,కార్యకర్తలు పాల్గోన్నారు.

పాడేరు

2021-08-14 15:29:38

రేషన్ కార్డుదారుల ఈ-కేవైసీకి ఆగస్టు 20 ఆఖరు..

కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్  కార్డులో ఉన్న కుటుంబ సభ్యులంతా కచ్చితంగా ఈ-కేవైసీ చేయించుకోవాలని విశాఖ అర్భన్ తహశీల్దార్ కుంచే జ్నానవేణి స్పష్టం చేశారు. ఈమేరకు విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. అర్భన్ మండలం  పరిధిలో రేషన్ షాపులో కార్డు కలిగి కుటుబంలో ఒక్కరైనా ఈ-కేవైసీ చేయించుకోకపోతే  కార్డులో సభ్యుల పేర్లు తొలగిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా కార్డుకూడా రద్దుచేస్తామని చెప్పారు. కార్డు ఈ-కేవైసీ చేయించుకునేందుకు గ్రామరెవెన్యూ అధికారి, వాలెంటీర్లను సంప్రదించాలని ఆమె సూచించారు. ఈనెల 20తేదీ ఈ-కేవైసీకి ఆఖరుతేదీగా నిర్ణయించారని తహశీల్దార్ పేర్కొన్నారు. అంతేకాకుండా సదరు రేషన్ కార్డులో తప్పుగా ఆధార్  నమోదు అయిఉన్నా వాటిని సరిచేయించుకోవాలని సూచించారు. వాటిని గ్రామ సచివాలయ రైస్ కార్డు సేవల ద్వారా ఆధార్ కార్డు నెంబరు మార్చుకొనుటకు అవకాశం కల్పించినట్టు తెలియజేశారు. చిన్న పిల్లల ఈ-కేవైసీ నమోదుకు  ముందుగా ఆధార్ కార్డులో వారి వేలిముద్ర నవీకరణ (అప్డేట్) కూడా చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం పేర్కొన్న హెచ్చరికల ద్వారా సంబదిత సభ్యుల నమోదు ప్రక్రియ చేయించుకోని రేషన్ కార్డులను, కార్డు దారులను బోగస్ సభ్యులుగా గుర్తించి వారి యొక్క పేర్లను రైస్ కార్డు నుంచి తొలగిస్తామని ఆమె తెలియజేశారు. అంతేకాకుండా సెప్టెంబర్  నెల నుంచి నిత్యవసర సరుకులు సరఫాను నిలిపివేస్తామని చెప్పారు. వాలెంటీర్లు అందరూ వారి పరిధిలో గల కుటుంభ సభ్యుల  యొక్క ఈ-కేవైసీ చేయించుకొనని సభ్యులచేత ఆగస్టు 20 లోగా విధిగా ఈ-కేవైసీ చేయించాలని వీఆర్వోలకి ఆదేశాలు జారీచేశామని తహశీల్దార్ జ్నానవేణి స్పష్టం చేశారు.

Visakhapatnam

2021-08-13 15:57:03

శంఖవరంలో 131 అగ్రీగోల్డు పత్రాలు ఆన్లైన్..

శంఖవరం మండల కేంద్రంలో అగ్రీగోల్డు బాధితుల నుంచి రూ.20వేల లోపు డిపాజిట్ దారుల అర్జీలు 131వచ్చినట్టు మహిళాపోలీస్ జిఎన్ఎస్ శిరీష తెలియజేశారు. గురువారం శంఖవరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ మూడు గ్రామ సచివాలయాల పరిధిలో అందిన డిపాజిట్ అర్జీలను ఆన్ లైన్ చేశామన్నారు. మరో 20వరకూ గతంలో పోలీస్ స్టేషన్లలో ఇచ్చిన వారు తెచ్చినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రికార్డు సక్రమంగా ఉన్నవాటినే  ఆన్లైన్ చేశామన్నారు. కొని ప్రభుత్వ నిబంధనలకు లోబడి లేని డాక్యుమెంట్లను స్వీకించలేదని చెప్పారు.

Sankhavaram

2021-08-12 15:55:21

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండాలి..

 ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి, కార్పొరేట్ స్కూళ్ళకంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది  లక్ష్యమని ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అధికారి గురువారం తన పర్యటనలో భాగంగా జియ్యమ్మ వలస పేదమేరంగి జిల్లాపరిషత్ హైస్కూల్, చిన్నమెరంగి ఎం.పి.పి.స్కూల్, జెడ్ పి.హెచ్.స్కూల్ లలో నిర్వహిస్తున్న నాడు - నేడు పనులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  అనంతరం చేపడుతున్న పనులకు సంబంధించి ఆరా తీశారు. నాడు - నేడు పనులు పరిశీలన అనంతరం ప్రాజెక్ట్ అధికారి  మాట్లాడుతూ  పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఆత్యదిక ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు, నాడు నేడు పనులు వేగవంతం చేయాలన్నారు, పిల్లలకు సంబంధించిన మెటీరియల్,  పాఠశాలలో తరగతి గదులు,  కొత్తగా వచ్చిన ఫర్నీచర్,    పాఠశాల ఆవరణ పరిశీలించి తదుపరి చేపట్టవలసిన పనులపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు సూచనలు అందించారు.   ఈ పర్యటనలో జియ్యమ్మవలస మండలం రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ఇంజనీరింగ్ ఆధికారులు, పాఠశాల ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2021-08-12 14:04:25

సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు..

సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు. పార్వతీపురం ఏరియా 100 పడకల ఆసుపత్రిలో  పేసెంట్స్ తాకిడి అధికంగా ఉందని తెలిసిన వెంటనే ప్రోజెక్ట్ అధికారి ఏరియా ఆసుపత్రి పర్యటించి ఏరియా ఆసుపత్రి సూపరంటెండెంట్ డాక్టర్ వాగ్దేవి వారితో సమావేశమై ఆసుపత్రిలో ఉన్న రోగుల వివరాలు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున, ఏటువంటి సమస్య  ఎదురయినా ఎదుర్ కోవడానికి సిద్దంగా ఉండాలని సూచించారు. అలాగే ఆసుపత్రి, పరిసర ప్రాంతాలు పరిశుబ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఈ పర్యటనలో ఏరియా ఆసుపత్రి సూపరంటెండెంట్ డాక్టర్ వాగ్దేవి, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Parvathipuram

2021-08-12 14:01:54

ఈకేవైసీ గ్రామ వాలంటీర్లే చేయించాలి..

గ్రామ వలేంటిర్లు తమ పరిధిలో గల 50 కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించే లా విధులు నిర్వహించాలి అని సబ్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ గురువారం తన పర్యటనలో భాగంగా గరుగుబిల్లి,పార్వతీపురం మండలాలు పర్యటించారు. గరుగుబిల్లి మండలంలో గొట్టివలస, ఉల్లిభధ్ర,  గరుగుబిల్లి, పార్వతీపురం మండలం అడ్డాపుసీల సచివాలయాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా వాలంటీర్లు తో రైస్ కార్డుల ఇ.కె.వై.సి పై సమీక్షించారు. ఇ.కె.వై.సి ఏంతవరకు జరిగింది అన్న వివరాలపై ఆరాతీశారు. అనంతరం రైస్ కార్డుల ఇ.కె.వై.సి ఇంతవరకు కాని వారికి నోటీసు ద్వారా తెలియజేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని పూర్తి చేయాలని ఆదేశించారు.  అనంతరం  సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సచివాలయం సిబ్బంది, వాలెంటిర్లకు సీజనల్ వ్యాధులపై, ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలన్నారు. అలాగే  పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు.  పిర్యాదులు సేకరణ పరిష్కారంలో అలసత్వం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు. అనంతరం పార్వతీపురం మండలం పార్వతీపురం సచివాలయాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి రెవెన్యూ అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2021-08-12 13:59:37

శ్రీకూర్మాంలో కొత్త భవన నిర్మాణం..

పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కూర్మాం దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం  కొత్త భవనం నిర్మాణం కాబోతోందని స్థానిక శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు.  శ్రీకూర్మం గ్రామ పంచాయతీలో అదిలీల ఫౌండేషన్ (న్యూఢిల్లీ) వారి ఆధ్వర్యంలో నిర్మించనున్న ధర్మ శాల నిర్మాణానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూర్మనాథ ఆలయానికి సమీపంలో బస్టాండ్ దగ్గర ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని అని తెలిపారు. పితృదేవతలకు కర్మ కాండలకు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారని, వారు వేచి ఉండడానికి సరియైన వసతి లేనందు వలన భక్తుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అదిలీల ఫౌండేషన్ యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయన్నారు.  దైవ భక్తి కలిగిన ఆదినారాయణ సంకల్పం నేడు కార్య రూపం దాల్చిందన్నారు.  పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని మరిన్ని వసతులు మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు.  దేవస్థానం కి వచ్చే భక్తుల కోసం  అన్నదానం కోసం అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.  ఈ  కార్యక్రమంలో సర్పంచ్ గోరు అనిత ఫౌండేషన్ చైర్మన్ ఎస్ ఆదినారాయణ, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, రాష్ట్ర అగ్రిమిషన్ సభ్యులు గొండు రఘురాం, మాజీ ఎఎంసి చైర్మన్ బరాటం నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ బరాటం రామశేషు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ మూర్తి, మార్పు ధర్మారావు, మాజీ సర్పంచ్ రామశేషు, తదితరులు పాల్గొన్నారు.

Srikurmam

2021-08-12 13:13:46

ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది.. ఆ టెస్టు పాసైతేనే సచివాలయ జాబ్ రెగ్యులర్..

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net  చెప్పివన్నీ ప్రభుత్వంలో అక్షర సత్యాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ తప్పిదం.. ఉద్యోగులకు ప్రాణసంకటం.. శీర్షికన ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్ లో ప్రచురించిన న్యూస్ కార్డ్ పై స్పందించిన గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్యకార్యదర్శి అజైయ్ జైన్ డిపార్ట్ మెంట్ టెస్టులు పాసైన వారి ఉద్యోగాలనే రెగ్యులర్ చేస్తామని అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. సిబీఏసీ పరీక్షతోపాటు, డిపార్ట్ టెస్టులు పాస్ కావాలని చెప్పిన ప్రభుత్వం సీబీఏసీ పరీక్ష విషయంలో వెనక్కి తగ్గింది కానీ.. గతంలో చెప్పినట్టిగా సచివాలయంలోని 19శాఖల సిబ్బందీ ఖచ్చితంగా డిపార్టమెంట్ టెస్టులు పాస్ కావాలని, దానికి షెడ్యులు ఖరారు చేయమని ఈమేరకు 8శాఖలకు సర్క్యులర్ నెంబరు 71/D/2021ను మాత్రం జారీచేసింది. దీని ప్రకారం ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-3, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్,పశు సంవర్ధకశాఖ సహాయకులు, ఫిషరీస్ అసిస్టెంట్, గ్రేడ్-2వీఆర్వో, సెరీకల్చర్ అసిస్టెంట్, ఆరోగ్యశాఖ ఏఎన్ఎంలు సంబంధిత డిపార్ట్ మెంట్ పరీక్ష పాసైతే తప్పా వీరి ప్రొబేషన్ పూర్తయి సర్వీసులు రెగ్యులర్ కావు. మొత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లోని 19శాఖల సిబ్బందిలో ఇప్పటికే 11 శాఖల సిబ్బంది ఆయా శాఖాధిపతుల సూచనలతో డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసయ్యారు. మిగిలిన వారికి వారికి ఆయా శాఖల అధిపతుల నుంచి ఎలాంటి సూచనలు లేకపోవడంతో నేటికీ డిపార్టమెంటల్ పరీక్షలు రాయలేకపోయారు. ప్రభుత్వం గతంలో కొన్నిశాఖల సిబ్బందికి జీఓలు, గెజిట్లలోనే డిపార్టమెంట్ పరీక్ష విషయం సూచించడంతో చాలా మంది ఉద్యోగులు రెండేళ్ల కాలంలోనే పరీక్ష పాసయ్యారు. మరికొంత మంది ఉద్యోగులకు ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో వారంతా డిపార్ట్ మెంట్ టెస్టులు రాయకుండా అలాగే మిగిలిపోయారు.  ఇపుడు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా మళ్లీ కొత్తగా జారీచేసిన సర్క్యులర్ ప్రకారం.. 10-08-2021న ఆయాశాలఖ అధిపతులు సచివాలయ సిబ్బందికి పెట్టాల్సిన డిపార్ట్ మెంటల్ పరీక్షలు గుర్తిస్తారు. 15-08-2021 నాటికి ఆయా శాఖల సిబ్బంది విధులు, సర్వీసు రూల్సుతో పాటు డిపార్ట్ మెంట్ టెస్టులకు సంబంధించిన విషయాలను జీఓలో నవీకరిస్తారు. 20-08-2021న డిపార్ట్ మెంట్ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ను ఏపీపీఎస్సీ ద్వారా ప్రకటిస్తారు. 15-09-2021న మళ్లీ ఏపీపీఎస్సీ ద్వారా డిపార్ట్ మెంట్ పరీక్షలను మిగిలివున్న 8ప్రభుత్వశాఖ సిబ్బందికి నిర్వహిస్తారు. 22-09-2021న డిపార్ట్ మెంట్ టెస్టుల దానియొక్క రూల్స్ ను సిబ్బందికి తెలియజేస్తారు. చివరిగా 02-10-2021న ఎవరైతే ప్రభుత్వం నిర్ధేశించిన డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసై , ఎవరైతే అర్హత సాధిస్తారో.. ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తిచేసుకుంటారో వారి సర్వీసులను మాత్రమే ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుంది.

ఇంత క్లారిటీగా ప్రొబేషన్ పూర్తవడానికి రెండు నెలల ముందు డిపార్ట్ మెంట్ పరీక్షల షెడ్యూలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇదే విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు విధుల్లోకి చేరినపుడే చెప్పకుండా పెద్ద తప్పుచేసి, ప్రస్తుతం కొండంత భారం మా నెత్తిన పెట్టిందని ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు ప్రత్యేక సర్క్యులర్ లో ఆదేశించినట్టుగాన విధుల్లోకి చేరిన మొదట్లోనే చెప్పివుంటే ప్రొబేషన్ పూర్తయ్యేనాటికి మాశాఖలకు సంబంధించిన అన్నిరకాల డిపార్ట్ మెంట్ పరీక్షలను పూర్తిచేసుకునేవారమని.. తాజాగా ప్రొబేషన్ పూర్తవడానికి రెండు నెలల ముందు డిపార్ట్ మెంట్ పరీక్ష పెడితే మా పరిస్థితి ఏంటని  గగ్గోలు పెడుతున్నారు సచివాలయ ఉద్యోగులు. ఈ 2 కాలంలో కరోనా వైరస్ వచ్చినపుడు, ప్రభుత్వ పథకాల అమలకు మాతో శని, ఆదివారాలనే తేడా లేకుండా సెలవులు కూడా ఇవ్వకుండా పనులు చేయించుకున్న ప్రభుత్వం.. ఆఖరి సమయంలో తమను ఇబ్బంది పెట్టడానికి ఇపుడు డిపార్ట్ మెంట్ పరీక్షల విషయం లేవనెత్తిందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ,వార్డు సచివాలయాల్లోని 19శాఖల్లోని 8శాఖల ఉద్యోగులు(ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-3, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్,పశు సంవర్ధకశాఖ సహాయకులు, ఫిషరీస్ అసిస్టెంట్, గ్రేడ్-2వీఆర్వో, సెరీకల్చర్ అసిస్టెంట్, ఆరోగ్యశాఖ ఏఎన్ఎంలుల) ఉద్యోగులకు సర్వీసు రూల్స్ ప్రకారం ఎలాంటి డిపార్ట్ మెంట్ పరీక్షలూ లేవని ఈ 71/D/2021 సర్క్యులర్ లోనే ప్రకటించిన ప్రభుత్వం. మళ్లీ నిబంధనలు నవీకరించి సర్వీసు ప్రొబేషన్ ముదు డిపార్ట్ మెంట్ టెస్టులు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ చేసేదేదో మొదట్లోనే చేస్తే ఈ ఇబ్బందులు తప్పివే కాదు కదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాడేపల్లి

2021-08-11 03:22:35

రేవిడి పీహెచ్సీని ప్రారంభించిన మంత్రి..

భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  పద్మనాభం మండలం రేవిడిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారుల నుంచి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాడు నేడు పనుల్లో భాగంగా రూ.69 లక్షల వ్యయంతో పనులు చేపట్టగా.. ఇందుకు సంబంధించి ప్రస్తుతం.. రూ.37 లక్లల వరకు పనులు పూర్తయ్యాయని  అధికారులు వివరించారు. ఆసుపత్రి పనులకు సంబంధించి ఆర్ అండ్ బీ అధికారుల పనితీరు మరింత మెరుగు పరచుకోవాలని మంత్రి ఆదేశించారు.  పీహెచ్ సీకి సబంధించి మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని డీఎమ్ హెచ్ఓను ఆదేశించారు. ఈక్రమంలో ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలపై మంత్రి ఆరా తీశారు. స్టాఫ్ అందుబాటులో ఉండటం లేదని స్థానికులు ఫిర్యాదు చేయగా  పూర్తిస్థాయిలో స్టాఫ్ నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలో బెడ్లు, మందులు, మంచినీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని ఎవరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని అన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి బంధువులు వేచి ఉండేందుకు ఒక షెడ్డు నిర్మించాలని ఆదేశించారు. ఆసుపత్రి పనులపై రిపోర్ట్ ఇవ్వాలని ఆర్ అండ్ బీ అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి మంత్రి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య, రెవెన్యూ అధికారులు, మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

రేవిడి

2021-08-10 16:24:36

శంఖవరంలో దోమలపై దండయాత్ర..

శంఖవరంలో ఆరోగ్యసిబ్బంది మంగళవారం దోమలపై దండయాత్ర మొదలు పెట్టారు. నీటి నిల్వ కుంటలు, పాత్రలు, నీళ్ళ తొట్టెలు, నీరు నిల్వ ఉన్న టైర్లు, కొబ్బరి చిప్పలు తదితర వస్తు సామాగ్రిలో దాగి ఉన్న దోమలపై వాటి నివారణకు వివిధ రకాల మందులను పిచికారీ చేసారు. వీటికి సమాంతరంగా మరో పక్క జ్వరాలు, డెంగ్యూ జ్వర పీడితుల ఆచూకీ కనుగొనేందుకు పక్కాగా సర్వే చేపట్టారు. శంఖవరంలోని అంబేద్కర్ నగర్ లో  ప్రభుత్వ ఆస్పత్రి క్షేత్ర స్థాయి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామం మొత్తం మీద 8 వరకూ డెంగ్యూ జ్వరాలు ఉన్నట్టు మిగతా వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నట్టు ఆస్పత్రి ప్రధాన వైద్యుడు ఆర్వీవీవీ. సత్యనారాయణకు సమాచారం అందడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మూడు డెంగ్యూ జ్వారాలు నమోదైన అంబేద్కర్ నగర్ పై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ప్రాంతం మొత్తాన్ని నిరవధికంగా మూడు రోజుల పాటు సర్వే చేయాలని, దోమల నివారణా మందులను పిచికారీ చేయాలని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సత్యనారాయణ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ యు.గ్లోరీ, సచివాలయం 1 ఏఎన్ఎం. వెంకటలక్ష్మి, ఆశ కార్యకర్తలు కోగూరి నాగమణి, జక్కల సూర్యకాంతం తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-10 13:30:35