1 ENS Live Breaking News

డెంగ్యూజ్వరాల నియంత్రకు శ్రమించాలి..

శంఖవరం మండల కేంద్రంలోని డెంగ్యూ జ్వరాల నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖతోపాటు, గ్రామసచివాలయ సిబ్బంది సమన్వయంగా పనిచేసి ఫలితాలు సాధించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పి.సరిత సూచించారు. శుక్రవారం శంఖవరం మండల కేంద్రంలో ఆమె విస్త్రుతంగా పర్యటించి డెంగ్యూ జర్వాలు, పారిశుధ్య నిర్వహణను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆరోగ్య సిబ్బంది తరచుగా ప్రైరాత్రమ్ ద్రావణాన్ని పిచికారీ చేయడంతోపాటు, లక్షణాలున్నవారికి తక్షణమే వైద్య పరీక్షలు చేయించాలన్నారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణ అయితే సదరు ఇళ్ల వద్ద ప్రత్యేకంగ బ్లీచింగ్ చైన్ ఏర్పాటు చేయాలని గ్రామసచివాలయ కార్యదర్యదర్శి శ్రీరామచంద్రమూర్తిని ఆదేశించారు. అనంతరం వ్యాధుల పరిస్థితిపై పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణతోపాటు, పారామెడికల్ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అవకాశం ఉంటే వారంలో రెండు రోజులు  ఫీవర్ సీజన్ వెళ్లేంత వరకూ డ్రే పాటించేలా చూడాలని, మంచినీటికి తప్పని సరిగా క్లోరినేషన్ చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి బందిలి గన్నియ్యమ్మ, ఆసుపత్రి ఫీల్డు సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శంఖవరం

2021-08-27 12:44:25

మీ గోవులను గుర్తించండి..లేదంటే తరలిస్తాం..

తునిపట్టణంలో ఎప్పటినుంచో గోవులు సంచారం తో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ విషయం తుని మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరి సుధాబాలు గారి దృష్టికి రావడంతో  బుధవారం వాటిని నారాయణ స్కూల్ పక్కన గల సీతారామపార్క్ లో సంరక్షణ చేస్తున్నారు. గోవుల యజమానులకు సమాచారం అందిచినా రాకపోవడంతో ఛైర్పర్సన్  ఆదేశానుసారం  ఈ రోజు వైద్య పరీక్షలు చేసి కొన్నింటిని కాకినాడ తరలించారు. యజమానులు మిగిలిన గోవులను తీసుకెల్లాలన్నారు.

Tuni

2021-08-25 16:17:15

పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ చేయాలి..

ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు పారిశుద్ధ్య నిర్వహణ తరచూ చేపట్టాలని ఎంఈఓ ఎస్విరమణ పేర్కొన్నారు. బుధవారం శంఖవరంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం అందించిన పారిశుధ్య నిర్వహణ సామాగ్రిని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, ప్రభుత్వం నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించినదని వాటి నిర్వహణకే వీటిని సరఫర  చేసిందన్నారు. వీటిని మరుగుదొడ్లు పరిశుభ్రం చేసించే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. అన్ని పాశాలలకు సమాచారం అందించామని రెండుమూడు రోజుల్లో వీటి పంపిణీ పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-25 16:16:29

బిఎల్వో విధులు సిబ్బంది నిర్వహించాల్సిందే..

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బిఎల్వోలు ఖచ్చితంగా విధులు నిర్వహించా ల్సిందేనని తహసీల్దార్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బుధవారం శంఖవరం ఎంపీడీవో కార్యాలయంలో బీఎల్వోలతో  ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ  ప్రతి ఒక్కరూ కచ్చితంగా గరుడా యాప్ ఇన్స్టాల్ ఓటరు నమోదుతో పాటు అన్ని కార్యక్రమాలన్నీ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశం వచ్చినా వాటిని కచ్చితంగా అమలుచేయాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశానుసారం బిఎల్వోలను బూత్ ల వారీగా రాబోయే కార్యక్రమాలకు సిద్ధం చేయడానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అధికారుల నుంచి వచ్చిన సమాచారాన్ని మండల స్థాయిలో పెట్టిన గ్రూపుల్లో సమాచారం పెడుతున్నామని వాటికి అనుగుణంగా బిఎల్వోలంతా విధులు నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కూడా అదే స్థాయిలో చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బిఎల్వో విధులకు ఎంపికైన మహిళా పోలీసులు, వ్యవసాయ సహాయకులు, వీఆర్వోలు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-25 16:12:56

మధ్యాహ్నాం భోజనాల్లో నాణ్యత పాటించాలి..

పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్నా భోజన పథకంలో పూర్తిస్థాయి నాణ్యత పాటించాలని గ్రామ సచివాలయ సంక్షేమ సహాయకులు బడేదివాకర్ పేర్కొన్నారు. బుధవారం శంకవరం మోడల్ స్కూల్ లో ఆయన మధ్యాహ్న భోజన పథకంలో ఆహార పదార్థాలను స్వయంగా పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఖర్చుతో భోజనాన్ని అందిస్తుందని దీని నిర్వాహకులు శుభ్రత, రుచితో తయారుచేసి విద్యార్ధులకు అందించాలన్నారు. అనంతరం ఆహార పదార్థాలను రుచిచూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే నాణ్యత రుచితో నిత్యం విద్యార్ధులకు ఆహార పదార్ధాలు అందించాలని  సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల భోజన తయారీ సిబ్బంది  పాల్గొన్నారు.

శంఖవరం

2021-08-25 15:59:57

పెండింగ్ లో అర్జీలు ఉండకూడదు..

స్పందన అర్జీలు పెండింగ్ లో ఉండరాదని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.  బుధవారం స్థానిక ఆదివారంపేట సచివాలయం -2ను ఆయన సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేసే డిసిప్లే బోర్డు సచివాలయానికి వచ్చే ప్రజలకు సరిగా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని కమీషనర్ ను ఆదేశించారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంత వరకు లబ్దిదారులకు ఇచ్చిన వాటికి అకనాలెడ్జ్ ఉన్నది లేనిది అడిగి తెలుసుకున్నారు.  వాటిని ఏ విధంగా చేస్తున్నదీ, సెల్ ఫోన్ లో పరిశీలించారు.  ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, ప్రతీ రోజు సరఫరా చేస్తున్న తాగునీరు ఎవరు చూస్తున్నదీ, నీరు సరఫరా చేసే వారి ఫోన్ నంబర్ ఉన్నది లేనిది అడిగి తెలుసుకున్నారు.  కమీషనర్ ఫోన్ నంబర్ పెట్టుకోవాలని చెప్పారు.  వీధిలో లైట్లు ఎన్ని ఉన్నాయని అడుగగా 80 లైట్లు ఉన్నాయని సచివాలయ సిబ్బంది తెలిపారు.  అందులో ఎన్ని పనిచేస్తున్నాయని కలెక్టర్ అడుగగా కొన్ని పనిచేయడం లేదని చెప్పగా పనిచేయడం లేదని కమీషనర్ దృష్టిలో పెట్టాలని ఆదేశించారు. మెటీరియల్ దిగుమతి చేసుకొని సిద్దంగా ఉంచుకోవాలని కమీషనర్ ను ఆదేశించారు. స్పందన అర్జీలు 199 పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.  ప్రోపర్టీ ట్యాక్స్ ఎప్పుడైనా ఇవ్వగలరా అని కలెక్టర్ అడుగగా ఎప్పుడైనా ఇస్తామని సచివాలయ సిబ్బంది కలెక్టర్ కు వివరించారు.  ఇంత వరకు ఎంత నగదు జమచేసింది కంప్యూటర్ లో ఆయన పరిశీలించారు.  సిబ్బంది హాజరును ఆయన పరిశీలించారు.  సచివాలయంలో మార్పులకు పలు సూచనలు కమీనర్ కు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఓబులేసు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Adivarampeta

2021-08-25 13:27:14

బ్రిడ్జి సపోర్టింగ్ వాల్ కొట్టుకుపోయింది..

అన్నవరం-మండపం మార్గమధ్యలో వున్న బ్రిడ్జి సోపోర్టింగ్ వాల్ ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకు పోయింది. దీనితో ఈ ప్రాంతంలో ఉన్న మొట్టి మొట్టి మొత్తం వర్షపు నీటికి కరిగిపోయి గొయ్యలా మారింది. ఈ బాగాన్ని ఆనుకునే ద్విచక్రవాహనాలు బ్రిడ్జిపైగా టర్నింగ్ కొట్టాల్సి వుంది. ఈ ప్రాంతం కాస్త భయంకరంగా మారడంలో ఎక్కడ ఆ గొయ్యి నుంచి జారిపోతామేమోననే భయంతో వాహనచోదకు దానిని పక్కనుంచి వెళ్లాల్సి వస్తుంది. ఆదమరుపుగా వచ్చేవారు ఖచ్చితంగా ఆ గొయ్యిలో పడే ప్రమాదముండటంతో ఎవరూ కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. రెండూ పంచాయతీలకు మధ్యన ఉండటంతో ఈ ప్రాంతం తమ పరిధి కాదంటే తమ పరిధి కాదని రెండు పంచాయతీల వారు చేతులెత్తేస్తున్నారు. అధికారులు ద్రుష్టిసారిస్తే తప్పా ఈ సమస్యకు పరిష్కారం దొరికే సూచనలు కనిపించడం లేదు..

Annavaram

2021-08-24 11:35:29

యుద్ద ప్రాతిపదికన నిర్మాణాలు జరగాలి..

గ్రామ సచివాలయలు, వెల్నెస్ సెంటర్లు, ఆర్బీకే  భవనాల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని పంచాయతీరాజ్ డిఇ వెంకటేశ్వర్లు సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం శంఖవరం ఎంపీడీఓ కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. డిఈ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్నిరకాల నిర్మాణాలు పూర్తికావాలన్నారు. ఆర్ బికె, వెల్నెస్ సెంటరర్లు, సచివాలయాల నిర్మాణాలు వేగం పెంచాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను డిఈ ఆదేశించారు. ఇప్పటివరకూ నిర్మాణంలో ఉన్న, త్వరలో పూర్తికాబోతున్న నిర్మాణాల వివరాల నివేదకలను సచివాలయాల వారీగా పంపాలన్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-24 11:32:21

ఆ గ్రామానికి చేసిన సేవను ఆ విద్యార్ధులు ఇన్నేళ్లూ మర్చిపోలేదు..

చేసిన సేవ, చెప్పిన పాఠం, చూపిన అభిమానం, చెప్పుకోవడమే అందరూ చూసి ఉంటారు.. వాటన్నింటినీ చక్కగా ఒక మంచి గౌరవప్రధమైన కార్యక్రమం చేస్తే ఎలావుంటుందో బాలారం పూర్వవిద్యార్ధుల సంఘం చేయడం ఒక మంచి ముందడుగనే చెప్పాలి..  అవునా.. అందుకేనేమో ఆ బాలారం గ్రామానికి పండుగొచ్చింది.. డప్పువాయిద్యాలు, మేళ తాళాలు, చిన్న పిల్లల ఆటపాటలు ఎటు చూసినా కోలాహలమే.. ఏంటీ ఈ మధ్య పండుగలేం జరగలేదు కదా అనుకుంటున్నారా.. అలా అనుకుంటే కాదు.. ఆ గ్రామానికి సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఘనంగా సత్కరించుకోవడానికి విశాఖజిల్లా, కొయ్యూరు మండలం, బాలారం పూర్వవిద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్ల క్రితంలో ఈ గ్రామంలో విద్యార్ధులకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు, ఈ గ్రామానికి సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారిని ఏరి కోరి ఈ కార్యక్రమానికి పిలిచారు. వారందరినీ(గుదే కొండలరావు, సూరిశెట్టి నాగేశ్వర్రావు, రాళ్లపల్ల కె.ఎస్.ప్రసాద్, మంత్రి ప్రగన వెంకటరావు,బోయిన ఆనందరావు, పాటిబల్ల బాల త్రిపుర సుందరి) ఒకేసారి గ్రామంలో ఊరేగిస్తూ, పూల వర్షం కురిపిస్తూ ఇక్కడి పూర్వవిద్యార్ధులు ఒక ఉత్సవంలా ఆ గ్రమంలో నిర్వహించారు. వారంతా ఒకేసారి గ్రామానికి రావడంతో ఊరంతా సంబరం చేసుకున్నారు. తమకు చదువులు చెప్పిన గురువులను, తమ పల్లెకి సేవలందించిన ప్రభుత్వ సిబ్బందిని ఎంతో మంచి మనసుతో ఘనంగా సత్కరించి తమ గౌరవాన్ని చాటుకున్నారు.  ఈ కార్యక్రమం మొత్తం అక్కడి పూర్వవిద్యార్ధుల సంఘం అధ్యక్షు నీలం జోగిరాజు ఆధ్వర్యంలో జరిగింది. విశ్రాంత ఉద్యోగులందరినీ ఘనంగా సత్కరించిన ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ఊరు జనం మొత్తం కదిలొచ్చింది. సాధారణంగా ఏ ప్రభుత్వ శాఖలో నైనా ఉద్యోగి ఉద్యోగ విరమణ చేస్తే ఆరోజు ఒక కార్యక్రమం చేసి ఊరుకుంటారు. కానీ ఈ గ్రామంలో పనిచేసి, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరినీ పిలిచి ఈ కార్యక్రమం చేపట్టడంతో జిల్లాలోనే ఈ కార్యక్రమం అందరినీ ఆలోచింపజేసింది. మాట అనడం ఎంత తేలికో..గ్రామానికి సేవచేసిన వారిని గుర్తుపెట్టుకొని మరీ పిలిచి సన్మానించడం అంటే ఎంతో కష్టం.. అంతటి కష్టాన్ని ఇష్టంగా చేసుకొని చేపట్టిన ఈ గ్రామస్తుల  గురభక్తికి వినమ్రంగా నమస్కరించాల్సిందే కాదంటారా..!

బాలారం

2021-08-23 14:32:28

కత్తిపూడిలో 50మందికి ఉచిత వైద్య పరీక్షలు..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 104 ప్రత్యేక  వైద్య శిబిరాలను ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి శెట్టిబత్తుల శ్రీరామ్ రాజీవ్ కుమార్ కోరారు. సోమవారం కత్తిపూడిలోని సచివాలయం-1 లో 104 ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సర్పంచ్ కొల్లు వెంకటసత్యనారాయణ ప్రారంభించిన ఈ వైద్య శిబిరంలో సుమారు 50 మంది రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీచేశారు. ప్రజలకు తగు ఆరోగ్య సూచనలు, ఆహారం నియమాలనూ వైద్యాధికారి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కత్తిపూడి గ్రామ పంచాయతీలో ఉన్న మూడు సచివాలయాల్లోనూ ప్రతీ నెలా మొత్తం మూడు రోజుల పాటు మూడు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం  సచివాలయం 2 లోను, బుధవారం సచివాలయం 3 లోనూ ఈ 104 ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో తుని డివిజనల్ మేనేజర్ కేంద్రం.వీరబాబు, తొండంగి మండలం రావికంపాడు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం పరిధిలోలోకి వచ్చే కత్తిపూడి సచివాలయం 1 ఏఎన్ఎం.నాగమణి, సచివాలయం 2 ఏఎన్ఎం.బేబీసునీత, కత్తిపూడి సచివాలయం-1 సిబ్బంది పాల్గొన్నారు.

Kathipudi

2021-08-23 11:14:30

ప్రజలంతా మెచ్చేలా సేవలు అందించాలి..

ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించాలని డిఎల్పీఓ వై.అమ్మాజీ పేర్కొన్నారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని గ్రామసచివాలయం-1ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలందరూ మెచ్చేలా సేవలందించాలన్నారు. అనంతరం సిబ్బంది అందించే సేవల వివరాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు.  సచివాలయంలో నోటీసు బోర్డులో ప్రదర్శించిన ఆయా ప్రభుత్వ పథకాల లబ్దిదారుల జాబితాలను పరిశీలించారు. బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు. కార్యదర్శి రాంబాబు, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, జూనియర్ సహాయకులు రమణమూర్తి, వెల్ఫేర్ అసిస్టెంట్ దివాకర్, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్ తదితరులు ఉన్నారు.

Sankhavaram

2021-08-23 10:46:04

వెటర్నరీ అసిస్టెంట్లకు వారాంతపు పరీక్షలు..

పశుసంవర్ధక శాఖలోని సహాయకులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించు కోవాల్సిన అవసరం వుందని ఆ శాఖ సహాయ సంచాలకులు డా.ఎం.వీరరాజు సూచించారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలో ఆసుపత్రి వేదికగా తన పరిధిలోకి వచ్చే గ్రామసచివాలయ వెటర్నీ సహాయకుల వారంతపు నైపుణ్య పరీక్షలను  నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు వీక్లీ స్కిల్ అసెస్ మెంట్ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు. పశుసంవర్ధక శాఖ నిర్దేశించిన లక్ష్యాలతోపాటు, కొత్త విధానాలపై శిక్షణ ఇవ్వడంతోపాటు, ఎలా పాడి రైతల పశువులకు సేవలందిస్తున్నారో ఈ పరీక్ష ద్వారా తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-23 09:28:44

నిరుపేద వృద్ధులకు గొడుగులు పంపిణీ..

విశాఖలోని సింహాచ‌లంలో సామాజిక కార్యకర్త విజినిగిరి.బాలభానుమూర్తి  వ్రుద్ధులకు గొడుగులు వితరణ చేశారు. ఈ మేరకు సోమవారం  98వ వార్డ్ పరిధి విజినిగిరిపాలెం గ్రామంలో ఈ సేవాకార్యక్రమాన్ని చేపట్టారు.  ప్రస్తుతం వర్షాలు, ఎండలకాస్తున్న సందర్భంగా దృష్టిలో ఉంచుకొని నిరుపేద వృద్ధులకు ఉపయోగపడాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఆయన తెలియజేశారు. తన తండ్రి వర్ధంతి రోజున ప్రతి సంవత్సరం తమ కుటుంబ సభ్యులు ఒక సేవా కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తుంద చెప్పారు.  అందులో భాగంగానే తండ్రి  విజినిగిరి.అప్పారావు ఐదవ వర్థంతిని పురుస్కరించుకొని వ్రుద్ధులకు గొడుగులు పంపిణీ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజినిగిరి.సత్యసురేంధ్ర తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2021-08-23 07:29:44

సేవలతో ప్రజల మనస్సుని గెలవాలి..

సచివాలయ సిబ్బంది ఉత్తమ సేవల ద్వారా గ్రామీణ ప్రజల అభిమానాన్ని పొందాలని తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం సచివాలయ సేవలపై ఎన్నో అసలు పెట్టుకుందని, ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో మంచి ఆశయంతో ప్రవేశపెట్టిన ఈ సచివాలయ వ్యవస్థను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. సబ్ కలెక్టర్ భావన శనివారం బొబ్బిలి మండలం అలజంగి 1,2 గ్రామ సచివాలయాలు సందర్శించారు, ఈ సందర్భంగా సచివాలయాల్లో ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలపై ఆరా తీశారు. ఆయా గ్రామాల్లో సచివాలయాలల్లో నిర్వహిస్తున్న రికార్డులు తనిఖీ చేశారు, ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అందిస్తున్న తీరును పరిశీలించారు. వలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని హితవు పలికారు. గ్రామాలలో నిర్వహిస్తున్న ఈ. కెవైసి పై ఆరా తీసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
  ఈ పర్యటనలో బొబ్బిలి మండలం రెవెన్యూ అధికారులు సిబ్బంది, సచివాలయాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Bobbili

2021-08-21 15:26:43

సచివాలయం నుంచే సేవలన్నీ అందాలి..

గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందాలని జాయింట్ కలెక్టర్ డా.లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. శనివారం అన్నవరం గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా జెసీ మాట్లాడుతూ, సిబ్బంది నూరుశాతం బయోమెట్రిక్ వేయాలని, సాంకేతిక సమస్యలొస్తే కారణాలను తెలియజేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సచివాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు.  ముఖ్యంగా సర్వీస్ రిక్వెస్టులపై పై సిబ్బంది దృష్టి సారించాలన్నారు. కచ్చితంగా ప్రతిరోజూ మూడు నుంచి ఐదు వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలని జేఏసీ సిబ్బందిని ఆదేశించారు.ఈకార్యక్రమంలో ఎంపిడిఓ రాంబాబు తాసిల్దార్ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి శ్రారామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Annavaram

2021-08-21 14:27:28