1 ENS Live Breaking News

సచివాలయాల నుంచే సేవలందాలి..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలు అమలులో గ్రామ సచివాలయం పాత్ర కీలకమని, వీటి ద్వారా మరింత వేగంగా, మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాళ్లరేవు మండలం, నీలపల్లి  గ్రామ సచివాలయాన్ని  జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్  ఆకస్మికంగా సందర్శించారు.గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలు,సచివాలయంలో ప్రదర్శించిన వివిధ సంక్షేమ పథకాల జాబితాను కలెక్టర్ పరిశీలించారు.కోవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ , సిబ్బంది, వాలంటీర్లు బయోమెట్రిక్ హాజరును, ఇ- సర్వీసులు, పింఛన్లు, బియ్యం కార్డులు మంజూరు, వైఎస్సార్ బీమా క్లైమ్ ల వివరాలను కలెక్టర్  సిబ్బందినివివరాలు అడిగి తెలుసుకుని,క్షుణ్ణంగా రిజిస్టర్ లను తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో  కోవిడ్ నిబంధనలు ప్రజలందరు తప్పనిసరిగా పాటించే విధంగా చూడాలన్నారు.గ్రామంలో అధిక వర్షాలు, వరదలు సమయాల్లో లోతట్టు ప్రాంతాల్లో పంట మునిగిపోవడంతో అనేక మంది రైతులు ఇబ్బందులకు గురిచేస్తున్న  గ్రామ కంఠం పరిధిలో ఉన్న  చెరువును సర్వే చేసి రాళ్లు వేయాలని రెవెన్యూ, సర్వే అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. తొలుత తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో ఉప్పంగల , జార్జి పేట, పిల్లంక ,గోవ లంక, ఇంజరం ,నీ‌లపల్లి గ్రామస్తులకు కొరకు సుమారుగా 11.66 ఎకరాల విస్తీర్ణంలో సిద్ధం చేసిన వైఎస్సార్ జ‌గ‌న‌న్న కాల‌నీలో జరుగుతున్న  గృహ నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. లేఅవుట్ లో జరుగుతున్న ఇంటి నిర్మాణ పనులు ,గ్రౌండింగ్ పూర్తయిన గృహాల వివరాలను ఇంజనీరింగ్, హౌసింగ్ అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.
     ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తాళ్లరేవు ఎంపీడీవో పీ.విజయ్ థామస్, పంచాయతీరాజ్ డీఇ జిబివీ. రమేష్, హౌసింగ్ ఏఈ శ్రీనివాసు ,సచివాలయ సిబ్బంది,ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Tallarevu

2021-08-06 14:05:44

పథకాలపై సిబ్బందే అవగాహన కల్పించాలి..

క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేసే స‌చివాల‌య సిబ్బంది ప్ర‌భుత్వానికి క‌ళ్లూ, చెవులు లాంటివార‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి పేర్కొన్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు తీరు, క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌లు వీరిద్వారానే స‌రిగ్గా తెలుసుస్తుంద‌ని అన్నారు.  స‌చివాల‌య‌ సిబ్బంది అంతా ప్ర‌భుత్వ ప‌థ‌కాలను సంపూర్ణంగా అవ‌గాహ‌న చేసుకొని, వాటిపై ప్ర‌జ‌ల‌కు సానుకూలంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు.  జిల్లా క‌లెక్ట‌ర్ ఏ. సూర్య‌కుమారి, గ‌రివిడి మండ‌లంలో శుక్ర‌వారం విస్తృతంగా ప‌ర్య‌టించారు. తాశీల్దార్‌, ఎంపిడిఓ కార్యాల‌యాల‌ను సంద‌ర్శించారు. ప‌లుచోట్ల  మొక్క‌ల‌ను నాటారు. వాటికి ప్ర‌తిరోజూ నీరుపోసి సంర‌క్షించాల‌ని సూచించారు. అనంత‌రం మండ‌లంలోని తోండ్రంగి గ్రామానికి వెళ్లి, కొత్త‌గా నిర్మించిన ఆర్‌బికె భ‌వ‌నాన్ని ప‌రిశీలించారు.  రైతుల‌తో, వ్య‌వ‌సాయాధికారి సంగీత‌తో మాట్లాడి, పంట‌ల ప‌రిస్థితిని తెలుసుకున్నారు.  అనంత‌రం స‌చివాల‌యాన్ని త‌నిఖీ చేశారు. స‌చివాల‌య సిబ్బంది ప్ర‌తీఒక్క‌రితో మాట్లాడారు. వారి శాఖ‌ల ప‌రంగా ప‌థ‌కాల అమ‌లు తీరుపై ప్ర‌శ్నించారు. పెండింగ్ ధ‌ర‌ఖాస్తులు, క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌లు, జ‌గ‌న‌న్న కాల‌నీల నిర్మాణం, స‌మ‌గ్ర స‌ర్వే, ఇ-క్రాప్‌, చేయూత గ్రౌండింగ్‌, రేష‌న్ స‌రుకుల స‌ర‌ఫ‌రా, ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగంపైనా ఆరా తీశారు.  వివిధ వ‌ర్గాల‌ ప్ర‌జ‌ల‌తో భేటీ అయి, వేక్సినేష‌న్‌పై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. స‌చివాల‌యంలో నిర్వ‌హిస్తున్న వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. గ్రామ స‌ర్పంచ్ పి.బంగారుల‌క్ష్మితో మాట్లాడి, గ్రామంలోని స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. ఇంటింటి కుళాయిలు ప్ర‌భుత్వ‌ప‌రంగా మంజూరు చేస్తామ‌ని, రోడ్డు నిర్మాణంలో మాత్రం గ్రామంనుంచి భాగ‌స్వామ్యం కావాల‌ని అన్నారు.

            ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ప్ర‌స్తుత వ్య‌వ‌స్థ‌లో స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్లు ఎంతో కీల‌క‌మ‌ని అన్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి, వాటిని స‌క్ర‌మంగా అమ‌లు చేసే బాధ్య‌త వారిపైనే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తీ ప‌థ‌కంపైనా పూర్తిగా అవ‌గాహ‌న క‌ల్పించుకోవాల‌ని, వాటిని అర్హుల‌కు అంద‌జేయాల‌ని సూచించారు. ప్ర‌భుత్వం పంపిణీ చేస్తున్న ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్ర‌తీఒక్క‌రూ వినియోగించేలా చూడాల‌న్నారు. ఈ బియ్యానికి అద‌నంగా పోష‌కాలను క‌లుపుతున్నార‌ని, వాటిని వాడ‌టం వ‌ల్ల ర‌క్త‌హీన‌త నివారింప‌బ‌డుతుంద‌ని చెప్పారు. ప్ర‌తీ ఒక్క‌రూ కోవిడ్ వేక్సిన్ వేయించుకోవాల‌ని సూచించారు. ముఖ్యంగా గ‌ర్భిణీలు త‌ప్ప‌నిస‌రిగా వేక్సిన్ వేయించుకోవాల‌ని, వ‌లంటీర్లు, ఇత‌ర సిబ్బంది వారికి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆదేశించారు. స‌చివాల‌య సిబ్బంది అంతా స‌కాలంలో విధుల‌కు హాజ‌రై, స‌క్ర‌మంగా ప‌నిచేయాల‌ని కోరారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌డంలో భాగ‌స్వాములు కావాల‌ని క‌లెక్ట‌ర్‌ పిలుపునిచ్చారు. అనంత‌రం హౌసింగ్ కాల‌నీ లేఅవుట్‌ను ప‌రిశీలించారు.

           ఈ కార్య‌క్ర‌మాల్లో మండ‌ల తాశీల్దార్ శివ‌న్నారాయ‌ణ‌, ఎంపిడిఓ జి.భాస్క‌ర‌రావు, మండ‌ల వ్య‌వ‌సాయాధికారి టి.సంగీత‌, పిఆర్ డిఇ ఎం.శ్రీ‌నివాస‌కుమార్‌, ఏఈ పి.చంద్ర‌శేఖ‌ర్‌, హైసింగ్ ఏఈ ఎంవి ర‌మ‌ణ‌, వైకెపి ఏపిఓ ఎస్‌.ర‌త్న‌మాల‌, ఎపిఎం ఎల్‌.ప‌ద్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.
            క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మందుగా గ‌రివిడి ఫేక‌ర్ ఆద్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న శ్రీ‌రామ్ జూనియ‌ర్ కాలేజ్‌, ఆర్ట్స్‌, అప్ల‌యిడ్ కాలేజ్‌, ఫేక‌ర్ కంటి ఆసుప‌త్రుల‌ను సంద‌ర్శించారు. ఆవ‌ర‌ణ‌లో మొక్క‌ల‌ను నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫేక‌ర్ సిఇఓ శ‌ర్మ‌, డిజిఎం ఎల్‌.నారాయ‌ణ‌మూర్తి, ఎజిఎం క‌మ‌లాక‌ర‌రావు, గ‌రివిడి లైన్స్‌క్ల‌బ్ గ‌వ‌ర్న‌ర్ టివివిఎస్ఎన్‌రాజు, ఇత‌ర స‌భ్యులు, ఫేక‌ర్ అధికారులు పాల్గొన్నారు.

Garividi

2021-08-06 13:55:33

అర్హులైన వారందరికీ వేక్సిన్ అందాలి..

గ్రామాల్లో ప‌నిచేసే స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్లు, ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌ల సిబ్బందికి వంద‌శాతం వ్యాక్సినేష‌న్ పూర్తిచేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు గంట్యాడ మండ‌ల స్థాయి అధికారుల‌ను ఆదేశించారు. జె.సి. శుక్ర‌వారం గంట్యాడ మండ‌లం కొండ తామ‌రాప‌ల్లిలో ప‌ర్య‌టించారు. కోవిడ్‌ ప్ర‌త్యేక వాక్సినేష‌న్‌ డ్రైవ్‌లో భాగంగా జ‌రుగుతున్న టీకాలు వేసే కార్య‌క్ర‌మాన్ని ప‌రిశీలించారు. గ్రామంలో 45 ఏళ్లకు పైబ‌డిన వారు, ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల త‌ల్లులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు, వలంటీర్లు, రేష‌న్ డీల‌ర్లు, టీచ‌ర్లు త‌దిత‌ర వ‌ర్గాల్లో వ్యాక్సిన్ వేయించుకోని వారు ఎంత‌మంది ఉన్నార‌ని ఆరా తీసి వారంద‌రికీ ఈరోజే టీకాలు వేయించాల‌ని మండ‌ల త‌హ‌శీల్దార్‌, ఎంపిడిఓ, ఎం.ఇ.ఓ., వైద్యాధికారుల‌కు సూచించారు. అనంత‌రం గ్రామ స‌చివాల‌యాన్ని సంద‌ర్శించి రిజిష్ట‌ర్లు, రికార్డులు ప‌రిశీలించారు. సంక్షేమ ప‌థ‌కాల తీరును అడిగి తెలుసుకున్నారు. స‌చివాల‌యంలో ప్ర‌జ‌ల‌కు తెలిసేలా సంక్షేమ ప‌థ‌కాల స‌మాచారం అందుబాటులో వుంచిందీ లేనిదీ పరిశీలించారు. గ్రామాల్లో కోవిడ్ వ్యాప్తి చెంద‌కుండా ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, ఈ దిశ‌గా వ‌లంటీర్ల ద్వారా అవ‌గాహ‌న క‌లిగించాల‌న్నారు. స‌చివాల‌య సిబ్బంది నిర్వ‌హిస్తున్న విధుల‌పై ఆరా తీశారు. కార్యాల‌య ప‌నివేళ‌ల్లో సిబ్బంది ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుండాల‌ని స్ప‌ష్టంచేశారు.

Gantyada

2021-08-06 13:50:41

వేక్సినేషన్ తోనే కరోనా వైరస్ కట్టడి..

కరోనా కట్టడికి వెక్షినేషన్ తప్పనిసరి, 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా  వెక్షినేషన్ చేయించుకోవాలి, వెక్షినేషన్ పై అపోహలు విడండి అని సబ్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా శతశాతం వెక్షినేషన్ స్పెషల్ డ్రైవ్ పార్వతీపురం డివిజన్ లో పార్వతీపురం మండలం ములగ, మక్కువ మండలం తురుమామిడి పంచాయతీలో శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రక్రియలో నిర్దేశిత గ్రామ పంచాయతీలలో 45 సంవత్సరాల వయస్సు పై బడి ఉన్న వారికి వెక్షినేషన్ స్పెషల్ డ్రైవ్ ఉదయం ప్రారంభించారు. ములగ పంచాయతీలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సబ్ కలెక్టర్ భావన పర్యవేక్షించి, నిర్వహిస్తున్న వెక్షినేషన్ పై ఆరా  తీశారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా వెక్షినేషన్ చేయించుకోవాలని, వెక్షినేషన్ పై చాలా మందికి అపోహలు ఉన్నాయి, అపోహలు విడి వెక్షినేషన్ చేయించుకొని కరోనా కట్టడికి అందరూ సహకరించాలన్నారు.  ఈ పర్యటనలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Parvathipuram

2021-08-06 13:49:36

రక్తహీనత నుంచి గిరిజనులను కాపాడాలి..

స్త్రీ శిశు సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్యశాఖ శాఖలు సంయుక్తంగా గిరిజనులు రక్తహీనత నుఅధిగమిం చేందుకు చర్యలు చేపడుతూ మాతాశిశు మరణాలను తగ్గించాలని జిల్లా కలెక్టర్ సి హరి కిరణ్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఐటీడీఏ పరిధిలోని సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య భౌగోళిక నైసర్గిక ఐ టి డి ఎ స్వరూపాలను ప్రభుత్వ పరంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. విద్యా కార్యక్రమాలపై సమీక్షించి పిమ్మట ఐటీడీఏ పరిధిలో మిగులు టీచర్లను డీఎడ్ కళాశాలల్లో బోధన కొరకు నియమించాలని డి డి ఎం సరస్వతిని ఆదేశించారు. రెగ్యులర్ పాఠశాలలో దివ్యాంగుల అవసరాల కొరకు వసతులను కల్పించాలని అందుకు అనుగుణంగా అంచనాలు రూపొందించిన సమర్పించాలని ఆదేశించారు. మాతా శిశు మరణాలు నివారణ  వరకు  ప్రసవాల  కొరకు నిరీక్షించు వార్డులలో సేవలు మెరుగుపరిచి బలోపేతం చేయాలని తదనుగుణంగా మాతాశిశు మరణాల రేటును తగ్గించాలని ఆదేశించారు వైద్య సేవలు మెరుగుదలకు ఏజెన్సీ పరిధిలో కమ్యూనికేషన్ వ్యవస్థను విస్తరించాలని సూచించారు. తీవ్ర పోషకాహార లోపాలు గల పిల్లలు గర్భిణీలు గుర్తించి ప్రత్యేక పోషకాహారం నుంచి అందించి ఆరోగ్య భద్రతకు పాటుపడాలన్నారు.

 కోవిడ్ మూడవ దశ పొంచి ఉన్నందున నివారణ చర్యలు ఆస్పత్రులను బలోపేతం చేయాలని ఆక్సిజన్ తో కూడిన పడకల సంఖ్యను అవసరాలకు అనుగుణంగా పెంచాలని ఆదేశించారు ప్రాంతీయ ఆసుపత్రి లో ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ నిర్వహణకు యోచన చేయాలని అని సూచించారు. కోవిడ్ మూడో దశ సన్నద్ధత చర్యలను ఆయన సమీక్షించారు. మలేరియా నియంత్రణ చర్యలపై సమీక్షించి జ్వర పీడిత నుండి రక్త నమూనాలు సేకరించేందుకు లక్ష్యాలు నిర్దేశించి నియంత్రణ చర్యలు బలోపేతం చేయాలని ఆదేశించారు. గిరిజనుల అనారోగ్య సమస్యలు చాలా సున్నితమైనవని
 వాటి నివారణకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఉద్యాన సాగును వ్యవసాయాన్ని ఉపాధి హామీ అనుసంధానంతో ప్రోత్సహించి గిరిజన అభివృద్ధికి తోడ్పాటును అందించాలి అన్నారు. తోటల పెంపకం సంబంధించి అంటు మొక్కలు సరఫరా చేస్తూ అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించాలన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద గిరిజనులకు అందించిన భూములను నరేగా ద్వారా ఫలదాయకం గా తీర్చి దిద్ది ఉద్యాన పంటల సాగు  యాంత్రీకరణ ఉపకరణాల ద్వారా లాభసాటిగా మార్చాలని ఆదేశించారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం నందిని క్రీములను అన్ని దశలలో నిశితంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు. వర్షాధార పంట లను ప్రోత్సహించడంతో పాటు నీటి వనరులు ఉన్న చోట ఖరీఫ్లో వరి సాగును రబీ సీజన్లో అపరాలు సాగును ప్రోత్సహించాలని గిరిజన ప్రాంతాల్లో రబీ సీజన్ లో పశువుల కట్టడికి చర్యలు చేపట్టాలన్నారు.

 ఏజెన్సీ పరిధిలో బ్యాంకింగ్ వ్యవస్థ సేవలు విస్తరించాలని కలెక్టర్ దృష్టికి తెచ్చారు నాబార్డు ద్వారా రహదారులు విద్యాసంస్థల్లో వసతులు మెరుగుదలకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు సి సి డి పి కింద అణగారిన కొండరెడ్ల అభ్యున్నతికి పాటుపడాలన్నారు.  ఐఎపి నిధులతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో యువత కొరకు వసతులు మెరుగుపరిచి ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీ  అభ్యంతరాలను శాఖల సమన్వయంతో పరిష్కరించుకుంటూ గిరిజన అభివృద్ధికి తోడ్పడాలి అన్నారు. గిరిజన ఆవాసాల్లో పూర్తిస్థాయిలో అనుసంధానం రోడ్లు వివిధ గ్రాంట్ కింద నరేగా అనుసంధానంతో వేయాలని ఆదేశించారు. వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్న ఇంజనీరింగ్ విభాగం వారు ఆయా పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో గడువులు విధించి పర్యవేక్షణా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయిలు వేయాలని ccdp కింద 24 ఆవాసాలకు సౌరశక్తితో మంచినీటి సదుపాయం జరుగుతోందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సమస్త ప్రయోజనాలను గిరిజనులకు వర్తింపజేసి  వారు పేదరికాన్ని జయించి ఆర్థిక ప్రగతి వైపు పయనించేలా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. గిరిజనులు వీడి వీకే గ్రూపులుగా ఏర్పడి చిన్నతరహా అటవీ పాఠశాల సేకరించుకుని విలువ ఆధారితంగా మార్చుకునేందుకు ప్రాసెసింగ్ యూనిట్లు బాసటగా నిలుస్తున్నాయి అని ఉన్నాయని కోవిడ్ సమయంలో ఈ యూనిట్లను ప్రారంభించడం సంతోషంగా ఉన్నారు.

 ఏడు మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు విలువ ఆధారిత పరిశ్రమల స్థాపించుకుని తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందాలని సూచించారు ఏజెన్సీ పరిధిలో రెండు ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఒక్కొక్కటి 10 కోట్లతో చేయడం జరిగిందని తద్వారా ఒక్కొక్క దాని ద్వారా సుమారు పదివేల మంది ఆర్థికంగా లబ్ధి పొందగలరు అని ఆయన అన్నారు. ccdp కింద మినీ రైస్ మిల్లు పశువుల షెడ్లు ఏర్పాట్లకు ప్రతిపాదనలు చేయడం జరిగిందన్నారు వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పోషణ అభియాన్ కింద రక్తహీనతను అధిగమించేందుకు చర్యలు చేపట్టి మాతా శిశు మరణాలు అరికట్టాలని  మాతా శిశు మరణాలు సంభవించినప్పుడు సంభవించడానికి గల కారణాలను అన్వేషించి ఆయా గ్యాపులను పూరించుకోవాలని ఆదేశించారు. సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలో ఏవైనా సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు నేరుగా  ఎస్ ఎం ఎస్ వాట్సాప్  చేయవచ్చునని తెలిపారు ఎస్ఎంఎస్ చేసినప్పుడు పేరు హోదా కూడా తెలపాలన్నారు. ఏజెన్సీ పరిధిలో ఆరోగ్య సమస్యలు చాలా సున్నితంగా ఉంటాయని ఆయా సమస్యల నివారణకు వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. అధికారులకు ఏ విధమైన సపోర్ట్ అవసరమైన అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు అనంతరం మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని భర్వెయిటింగ్ హాల్ ఉన్న గర్భిణీల ఆరోగ్య స్థితిగతులను ఆరా తీశారు. సమయానికి వైద్య సహాయం భోజన వసతి అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే కలెక్టర్ గర్భిణీల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిరోధక టీకాలు ఇమ్యునైజేషన్ ప్రక్రియలు సకాలంలో నిర్వహించుకునే వదిలింది అడిగి తెలుసుకున్నారు. ఐరిస్కగర్భిణీలకు ముందుగానే గుర్తించి మెరుగైన వైద్య సేవలకు సిఫార్సు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య సబ్కలెక్టర్ సింహాచలం సబ్ డిఎఫ్ఒ నిషా కుమారి సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Rampachodavaram

2021-08-04 15:29:02

పచ్చని మొక్కలతోనే మానవ మనుగడ..

పచ్చని మొక్కలపైనే మానవ మనుగడ ఆధారపడి ఉందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సలహా కమిటీ సభ్యులు కాండ్రేగుల వెంకటరమణ అన్నారు. జాతీయ భీమా కార్మిక సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీకనకదుర్గ అమ్మవారి దేవాలయం సత్యనారాయణపురం కళ్యాణగిరిపై బుధవారం ఆయన మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ, మానవ మనుగడలో అత్యంత కీలకమైన పర్యావరణం, మొక్కలు నాటడాన్ని సామాజిక బాధ్యతగా అందరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. శాస్త్ర, సాంకేతిక విప్లవం.. విస్తారమైన వ్యవసాయ క్షేత్రాలు.. సింథటిక్ ఉత్పత్తుల వినియోగం, వాటి ఉత్పత్తి పద్ధతులు ఇవన్నీ ప్రకృతికి విఘాతం కలిగిస్తూ క్రమంగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉ ష్ణోగ్రతల్లో మార్పులు, వాయు కాలుష్యం లాంటి వాటి గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. చెట్లు పర్యావరణానికి ఎంతో ముఖ్యమని కాండ్రేగుల వెంకటరమణ   అన్నారు. కార్యక్రమంలో దేవాలయం వ్యవస్థక కార్యదర్శి బోయిన నాగేశ్వరరావు, జాతీయ భీమా కార్మిక సంస్థ కేంద్ర కమిటీ సభ్యుడు బొడ్డేడ అప్పలనరసయ్య, సభ్యులు ఎం.జగదీష్, లక్కరాజు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2021-08-04 15:17:44

సిబ్బంది బాధ్యతా యుతంగా వుండాలి..

గ్రామ స‌చివాల‌యానికి వివిధ స‌మ‌స్య‌ల‌పై వ‌చ్చే ప్ర‌జ‌ల‌తో సిబ్బంది మ‌ర్యాద‌గా, బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించి వారు చెప్పిన స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా ఆల‌కించి వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు స‌చివాల‌య సిబ్బందికి సూచించారు. వివిధ ప‌థ‌కాల‌ను, ప్ర‌భుత్వ సేవ‌ల‌ను ఏవిధంగా పొందాల‌నే అంశంపై గ్రామీణుల్లో కొంద‌రికి అవ‌గాహ‌న వుండ‌క‌పోవ‌చ్చ‌ని వారు స‌చివాల‌యానికి నివేదించ‌డానికి వ‌చ్చిన‌పుడు వారికి ఏవిధంగా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుందో వివ‌రించి చెప్పాల‌న్నారు. గ్రామ‌స్థాయిలో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయితే జిల్లా కేంద్రానికి విన‌తులు అందించే అవ‌స‌ర‌మే వుండ‌ద‌ని పేర్కొన్నారు. జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు బుధ‌వారం నెల్లిమ‌ర్ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని డెంకాడ‌, పూస‌పాటిరేగ మండ‌లాల్లో ప‌ర్య‌టించి ప‌లు గ్రామ స‌చివాలయాల‌ను త‌నిఖీ చేశారు. ముందుగా పూస‌పాటిరేగ మండ‌లం లోని కుమిలి-1 గ్రామ స‌చివాల‌యాన్ని సంద‌ర్శించి అక్క‌డి రిజిష్ట‌ర్‌లు, రికార్డులు త‌నిఖీ చేశారు. స‌చివాల‌య సిబ్బంది అంతా విధుల‌కు హాజ‌రయ్యిందీ లేనిదీ ఆరా తీశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు గురించి తెలుసుకున్నారు. అనంత‌రం డెంకాడ మండ‌లం గుణుపూరుపేట గ్రామ స‌చివాల‌యాన్ని సంద‌ర్శించి స‌చివాల‌యంలో వివిధ ప‌థ‌కాల‌పై ప్ర‌ద‌ర్శించిన స‌మాచారాన్ని ప‌రిశీలించారు. స‌చివాల‌య సిబ్బందితో మాట్లాడి గ్రామ‌స్థుల‌కు ప్ర‌భుత్వ సేవ‌లు ఏవిధంగా అందిస్తున్న‌దీ తెలుసుకున్నారు. గ్రామ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుంటూ ఉత్త‌మ సేవ‌లందించాల‌ని స‌చివాల‌యాల‌ను ఆద‌ర్శంగా నిల‌పాల‌న్నారు. కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలని జె.సి. సూచించారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించెలా వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించాలని కోరారు.

Denkada

2021-08-04 14:28:08

జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

ఏజెన్సీలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి కూర్మనాథ్ పేర్కొన్నారు. గ్రామాలలో జ్వరాల తీవ్రత ఉందని తెలిసినా వెంటనే బుధవారం  ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ కురుపాం, గుమ్మ లక్ష్మి పురం మండలాల్లో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను పరిశీలించారు. ముందుగా గుమ్మ లక్ష్మి పురం మండలం లో టిక్కిబాయ్, కురుపాం మండలంలో తోటగుడ గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను సందర్శించి గ్రామాలలో జ్వరాలకు సంబందించిన వివరాల పై ఆరా తీశారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ ఏటువంటి అర్హత లేని వైద్యులను సంప్రదించ వద్దని, ప్రజలు తమ నివాస గృహానికి చేరువలో నున్న పి.హెచ్.సి / సి.హెచ్.సి కి వెళ్లి చికిత్స తీసుకోవాలని, కావలసిన మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి గుమ్మలక్ష్మిపురం మండలం పి. ఆమిటి గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సచివాలయం, రైతు భరోసా కేంద్రాలలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు.  పిర్యాదులు స్వీకరణ పరిష్కారంలో అలసత్యం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డులు పరిశీలించారు. ఈ పర్యటనలో  గుమ్మాలక్ష్మిపురం, కురుపాం మండలాల రెవెన్యూ, వైద్య అధికారులు, సచివాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Gummalaxmipuram

2021-08-04 14:27:00

అవగాహన కల్పించే బాధ్యత వలంటీర్లదే..

గ్రామ వలంటిర్లు తమ పరిధిలోగల 50 కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సబ్ కలెక్టర్ భావన ఆదేశించారు. బుధవారం పార్వతీపురం మున్సిపల్ పరిధిలో గల 8 , 9 వార్డుల సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు, సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం సబ్ కలెక్టర్  మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు.  పిర్యాదులు సేకరణ పరిష్కారంలో అలసత్వం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు. 

Parvathipuram

2021-08-04 14:26:13

శిక్షణతో పరిపాలనపై మరింత పట్టు..

శిక్షణ తరగతుల ద్వారా గ్రామ పరిపాలనపై అవగాహన పెంచుకుని గ్రామాభివృద్ధికి పాటుపడాలని జాయింట్ కలెక్టర్ వెల్ఫేర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం అమలాపురం టిటిడిసిలో4వ బ్యాచ్ సర్పంచ్ ల శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన జె సి సర్పంచులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించడానికి గ్రామ సర్పంచ్ లకు శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి పరిపాలన అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామంలో మెరుగైన పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని,  ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తమ గ్రామాలను తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేయాలని తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో ఐనవిల్లి, కాట్రేనికొన, అల్లవరం, ఐ పోలవరం మండలాల సర్పంచ్ లు,  డిఎల్పీఓ ఆర్. విక్టర్, డిఎల్డివో వి.శాంతామని, అమలాపురం ఎంపిడివో ప్రభాకరావు, తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2021-08-04 14:24:35

సంక్షేమ పథకాలన్నీ సచివాలయాల నుంచే..

ప్ర‌భుత్వ ప్రాధాన్య సంక్షేమ ప‌థ‌కాలు అమలులో గ్రామ స‌చివాల‌యాల పాత్ర కీల‌క‌మ‌ని, వీటిద్వారా ప్ర‌జ‌ల‌కు సంతృప్తిక‌ర‌మైన, నాణ్య‌మైన సేవ‌లు అందించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ పేర్కొన్నారు. బుధ‌వారం జాయింట్ క‌లెక్ట‌ర్ క‌ర‌ప మండ‌లంలో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా గొర్రిపూడి, పాత‌ర్ల‌గ‌డ్డ గ్రామాల్లోని స‌చివాల‌యాల‌ను త‌నిఖీ చేశారు. బ‌యో మెట్రిక్ అటెండెన్స్‌, సంక్షేమ ప‌థ‌కాల అర్హ‌త‌లను తెలియ‌జేసే పోస్ట‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌, ల‌బ్ధిదారుల జాబితాల ప్ర‌ద‌ర్శ‌న త‌దిత‌ర తొమ్మిది అంశాల‌ను నిశితంగా ప‌రిశీలించారు. ప్ర‌ధానంగా బియ్య‌కార్డులు, పెన్ష‌న్‌కార్డులు, ఆరోగ్య‌శ్రీకార్డులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన ద‌ర‌ఖాస్తుల‌ను నిర్ణీత ఎస్ఎల్ఏ గ‌డువులో ప‌రిష్క‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌పై సిబ్బందికి పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న ఉండాల‌న్నారు. అదే విధంగా ఎండీయూ ద్వారా ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ (పీడీఎస్‌) స‌రుకుల‌ను ల‌బ్ధిదారుల ఇళ్ల వ‌ద్ద‌కే అందిస్తున్న తీరును జేసీ ప‌రిశీలించారు. పాత‌ర్ల‌గ‌డ్డ డ్రెయిన్‌లో గుర్ర‌పుడెక్క తొల‌గింపు ప‌నులు పూర్త‌యిన నేప‌థ్యంలో డ్రెయిన్‌ను జేసీ ప‌రిశీలించి, ప‌నుల‌పై సంతృప్తి వ్య‌క్తం చేశారు. రైతు సంక్షేమం, వ్య‌వ‌సాయ రంగ అభివృద్ధి ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల ద్వారా పూర్తి ఫ‌లాలు అందించేందుకు వీలుక‌ల్పించే ఈ-క్రాప్ బుకింగ్ ప్ర‌క్రియ క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న తీరును జేసీ ప‌రిశీలించి, స్వ‌యంగా ఓ రైతుకు చెందిన పంట‌ను ఈ-క్రాప్ బుకింగ్ చేశారు. ప‌ర్య‌ట‌న‌లో జేసీ వెంట క‌ర‌ప త‌హ‌సీల్దార్ కేకే విశ్వేశ్వ‌ర‌రావు, మండ‌ల వ్య‌వ‌సాయాధికారి గాయ‌త్రీదేవి, డ్రెయిన్స్ ఏఈ కీర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Karapa

2021-08-04 14:23:37

ప్రమాద రహిత డ్రైవింగ్ శిక్షణతోనే మంచి ఫలితాలు..

 పాడేరు ఘాట్ రోడ్ లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని  జాగ్రత్తగా వాహనాలు నడపాలని   ఐటీడీఏ  ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ  తెలిపారు. బుధవారం స్థానిక ఆర్టీసీ డిపోలో నూతనముగా   డ్రైవింగ్ శిక్షణకు వచ్చిన 16 మంది డ్రైవర్లను  ఉద్దేశించి  ప్రాజెక్టు అధికారి  మాట్లాడారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడిపే రాదని, నిద్ర లేకుండా కూడా నడుపరాదని తెలిపారు. తెల్లవారుజామున ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. వాహనాలు ఓవర్టేక్ చేయు సందర్భంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి కనుక ప్రతి ఒక్కరు ఓవర్టేక్ చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అంతకుముందు ప్రాజెక్టు అధికారి డిపో ఆవరణలో  మామిడి మొక్కను నాటారు.  అనంతరం నూతనముగా 16 మందికి శిక్షణనిచ్చు ఆర్టీసీ బస్సును జండా ఊపి ప్రారంభించారు.   ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్  రోణంకి సీతారామ నాయుడు , మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కెవియస్ఎన్  రాజు,డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎస్ ఉషశ్రీ,, అసోసియేషన్ ప్రతినిధులు, గ్యారేజ్ సిబ్బంది మరియు        ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Paderu

2021-08-04 10:24:00

లంకం గ్రామ సచివాలయం ప్రారంభం..

సచివాలయ సేవలు సద్వినియోగం చేసుకోవాలని శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. లంకం గ్రామంలో రూ. 25 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని మంగళవారం శాసనసభ్యులు ప్రసాదరావు మంళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అట్టడుగున ఉన్న పేద వర్గాలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి సచివాలయ వ్యవస్థను తెచ్చారన్నారు. ఈ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. కస్టమ్ హైరింగ్ సెంటర్ ( సి.హెచ్.సి ) మొదటి ఫేస్ లో 2.5 లక్షలతో ముల్టి గ్రైన్ క్రషర్ , రూ.1.75 లక్షలతో ప్యాడి రెపర్, రూ.35 వేలతో కల్టీ వేటర్ యంత్రాలను అయ్యప్ప రైతు మిత్ర గ్రూప్ కి ధర్మాన అందజేశారు. వాటికి 40 శాతం సబ్సిడీ, 50 శాతం రుణం, 10 శాతం రైతు వాటాగా అందజేయడం జరుగుతుంది. సచివాలయం ప్రాంగణంలో ధర్మాన మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపిడివో అర్.వి.రామన్, ఏమ్మార్వో వెంకటరావు, వ్యవసాయ అధికారి పద్మావతీ, సర్పంచ్ చిట్టి లలిత రవికుమార్, మాజీ ఎంపిపి అంబటి శ్రీనివాస్ రావు, ఏఎంసీ చైర్మన్ ముకళ్ల తాత బాబు, మాజీ జెడ్పిటిసి సభ్యులు చిట్టి జనార్ధన, సర్పంచ్ గెదల చాంగల్ రావు, అల్లు లక్ష్మీనారాయణ, చిట్టి రవికుమార్, యజ్జల గురుమూర్తి, గోండు కృష్ణ, చిట్టి లక్ష్మణ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

లంకం

2021-08-03 14:13:53

సర్వీసు రెగ్యులర్ పరీక్షకు సిద్ధంకండి..

గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న అందరు సిబ్బంది ప్రొబేషన్ తరువాత సర్వీసులను రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వం నిర్వహించనున్న ప్రత్యేక పరీక్షకు సచివాలయ సిబ్బంది సిద్దం కావాలని ఎంపీడీఓ జె.రాంబాబు సూచించారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని సచివాలయం-1లో ఆయన సిబ్బందితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, అక్టోబర్ 2 నాటికి సచివాలయాలు ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతుందని, ఆ మేరకు ప్రభుత్వం ఉద్యోగులందరికీ పెట్టే పరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి సిబ్బంది శ్రమించాలన్నారు. ఇప్పటి వరకూ సిబ్బంది గ్రామ స్థాయిలో మంచి సేవలు అందిస్తున్నారని, ఆ పరీక్ష పాసైతే సర్వీసు రెగ్యులర్ అవుతుందని అన్నారు. ఈ మేరకు ఏఏ శాఖల సిబ్బందికి ఏ రకమైన సిలబస్ ప్రభుత్వం ఆన్ లైన్ లో అందుబాటులో పెట్టిందో ప్రత్యేకంగా తెలుసుకున్నారు. ఒక్కో శాఖ సిబ్బందితో ఈ పరీక్ష విషయమై చర్చిస్తూ పలు కీలక సూచనలు చేశారు. ఇప్పటికీ  ప్రభుత్వం కొంత శిక్షణ ఇచ్చిందనీ, ఆపై మెటీరియల్ అందుబాటులోకి తెచ్చిందనీ. వీటిని కష్టపడి చదువుకుంటే ప్రతీ ఒక్కరూ పరీక్షలో ఉత్తీర్ణులవుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ జూనియర్ సహాయకులు రమణమూర్తి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, వెల్పేర్ సహాయకులు దివాకర్, తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-02 16:33:36

సచివాలయాలను తనిఖీచేసిన ఎంపీడీఓ

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ సచివాలయ సిబ్బంది పనిచేయాలని ఎంపీడీఓ జె.రాంబాబు సూచించారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని మూడు గ్రామ సచివాలయాలను ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం గ్రామస్థాయిలోనే ప్రజలకు సేవలు అందించడానికి వీటిని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఎవరూ మరువకూడదన్నారు. అనంతరం సచివాలయాల తనిఖీ కోసం రూపొందించిన ఆన్ లైన్ ఫార్మాట్ ఆధారంగా సిబ్బంది రికార్డులను తనిఖీ చేశారు. సచివాలయాల్లో మరికొన్ని మౌళిక వసతుల లేమిని ఎంపీడీఓ గుర్తించారు. ప్రతీఒక్కరూ బయోమెట్రిక్ వేయడంతోపాటు, సచివాలయ కార్యదర్శి దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ డ్యూటీ డైరీ తప్పని సరిగా రాయాలన్నారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదన్నారు. ఏ అధికారి సచివాలయ తనిఖీకి వచ్చినా అన్ని శాఖల సిబ్బంది కార్యాలయంలో అందుబాటులో ఉండి రికార్డులను సమర్పించాల్సి వుంటుందన్నారు. ఖచ్చితంగా మూమెంట్ రిజిస్టర్ లో టూర్ వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతీరోజూ స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నదీ లేనిది ఎంపీడీఓ అడిగి తెలుసుకున్నారు. రెవిన్యూ, సర్వే, వ్యవసాయశాఖ సిబ్బంది సచివాలయంలో ఎంపీడీఓ వచ్చేసరికి లేకపోవడంతో కారణాలను తెలియజేస్తూ తనను కార్యాలయంలో కలవాలని కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ జూనియర్ సహాయకులు రమణమూర్తి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, వెల్పేర్ సహాయకులు దివాకర్, తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-02 16:16:05