1 ENS Live Breaking News

పంచాయతీ రికార్డులన్నీ నిర్వహించాలి..

గ్రామ పంచాయతీలు, గ్రామసచివాలయాల్లో ప్రభుత్వ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీఓ ఎస్వీనాయుడు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం రౌతులపూడి గ్రామపంచాయతీలో రికార్డులను ఈ మేరకు ఆయన తనిఖీలు చేశారు. కొత్తగా పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పాటైనందున ఏ కార్యక్రమమైనా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. రికార్డుల నిర్వహణలో తేడాలు వస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సచివాలయాల్లోని సిబ్బంది కూడా ప్రభుత్వం నిర్దేశించిన రికార్డులు అన్నిశాఖల సిబ్బంది నిర్వహించాలన్నారు. కొన్నిచోట్ల గ్రేడ్-1,4 కార్యదర్శిలు రికార్డులు నిర్వహించడానికి మినహాయింపు ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రతీ ఒక్క ఉద్యోగి ఖచ్చితంగా రికార్డులు నిర్వహణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Rowthulapudi

2021-08-30 10:47:35

రేపు రూఢకోటలో ఉచిత వైద్యశిబిరం..

రూడకోట  ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈనెల 31న నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ ఉచిత  మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య సేవలు పొందాలని ఐటీడీఏ ప్రొజెక్టు అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ ఆరోగ్యశ్రీ ఉచిత  మెగా వైద్య శిబిరానికి ప్రత్యేక కంటి వైద్య నిపుణులు, చిన్నపిల్లల వైద్యులు,, ఎముకల వైద్యులు, గుండె సంబంధిత సమస్యల వైద్యులు, చర్మవ్యాధుల వైద్యులు  ఇతరత్ర వ్యాధులకు సంబంధించిన ప్రత్యేక వైద్యులు పాల్గొని చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులు  అందించబడునని, శస్త్ర చికిత్సలు అవసరమైనవారికి జిల్లా ఆసుపత్రులకు తరలించి ఉచితంగా శస్త్ర చికిత్సలు జరిపించి మెరుగైన వైద్యం అందించబడునని తెలిపారు. కావున ఈ శిబిరానికి  పైన తెలిపిన రోగులతోపాటు దీర్ఘకాలిక వ్యాదులతో బాధపడుతున్న  రోగులు తరలివచ్చి వైద్య సేవలు పొందాలని తెలియజేసారు. రోగులు తప్పని సరిగా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని రావాలని తెలియజేశారు.

Paderu

2021-08-30 08:40:59

శంఖవరంలో ఘనంగా జన్మాష్టమి వేడకలు..

శంఖవరం మండల కేంద్రంలో శ్రీక్రిష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. శంఖవరం యాదవ సంక్షేమం గొల్లవీధిలోని శ్రీక్రిష్ణుడి ఆలయంలో వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు చేపట్టారు. కరోనా నేపథ్యంలో భక్తులు నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం వీధిలో ఉట్టికొట్టే కార్యక్రమం చేపట్టినట్టు నిర్వాహకులు శ్రీనివాస్ తెలియజేశారు. జన్మాష్టమి సందర్భంగా ముందు రోజు రాత్రి ఆలయంలతోపాటు, వీధిలోనూ ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేపట్టారు. భక్తులందరికీ తీర్ధ ప్రసాదలు పంపిణీచేశారు.

శంఖవరం

2021-08-30 07:41:06

సోమవారం రౌతులపూడిలో కోవిడ్ వేక్సినేషన్..

రౌతులపూడి మండలంలో సోవారం కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్టు ఎంపీడీఓ ఎస్వీనాయుడు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన రౌతులపూడి మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల కార్యదర్శిలతోనూ టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. సోమవారం క్రిష్ణాష్టమి అయినప్పటికీ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అన్ని గ్రామసచివాలయాల పరిధిలోనూ కోవిడ్ క్యాంపు చేట్టాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశాలు జారీచేశారు.  ప్రభుత్వం ప్రత్యేక కోవిడ్ వేక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నందున క్యాంపులు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం కేసులు అధికంగా ఉన్నందు ఆయా పంచాయతీల పరిధిలో ప్రత్యేక శానిటేషన్ కూడా నిర్వహించాలని ఆయన సిబ్బందికి సూచించారు.

Rowthulapudi

2021-08-29 15:53:04

శంఖవరంలో110 మందికి టీకా పంపిణీ..

శంఖవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 110మందికి కోవిడ్-19 వేక్సిన్ పంపిణీ పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ  తెలియజేశారు. ఈమేరకు ఆదివారం పీహెచ్సీలో  నుంచి ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు.  జిల్లా కేంద్రం నుంచి పీహెచ్సీకి వచ్చిన కోవిడ్ వైల్స్ లో మిగులు డోసులను ఈ రోజు పూర్తిచేసినట్టు చెప్పారు.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన వారితోపాటు, రెండవ డోసులు కూడా ఈ కోవిడ్ వేక్సిక్ డ్రైవ్ లో పంపిణీ చేశామన్నారు.  మండల  కేంద్రంలోని మూడు సచివాలయాలతోపాటు, పీహెచ్సీలోనూ టీకాలు అందించినట్టు డాక్టర్ మీడియాకి వివరించారు. అన్ని కేంద్రాల వద్ద జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేక్సినేషన్ జరుపుతున్నామన్నారు.

శంఖవరం

2021-08-29 11:39:05

ప్రభుత్వ పథకాల యాప్ లు ఆండ్రాయిడ్.. అధికారులు వాడేవి యాపిల్ ఐ ఫోన్లు..

భారత దేశంలో సాంకేతికత విప్లవం తెచ్చిన చిక్కు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మధ్య పరిపాలనకు ప్రధాన అడ్డంకిగా మారుతోంది. అదేంటీ సాంకేతికతతో పరిపాలన పరుగులు పెట్టాలి కానీ, ఎలా అడ్డుపడుతుందనే అనుమానం కలగవచ్చు.. కానీ ఇది అక్షర సత్యం.. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ సమస్య మీరి ఎక్కువగా ఉంది. ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు తమ ప్రెస్టీజిని, హై ప్రొఫైల్ ను ప్రదర్శించడానికి, వినియోగించే యాపిల్ ఫోన్ల వలనే ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం విడుదల చేస్తున్న ఆండ్రాయిడ్ యాప్ లు ఎలా పనిచేస్తున్నాయో కనీసం తెలుసుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇది నిజం.. అధికారులు యాపిల్ ఫోన్లు వడటం వలన వివిధ ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వం కేవలం ఆండ్రాయిడ్ యాప్లను మాత్రమే వినియోగిస్తుంది. వాటిని యాపిల్ ఫోన్లలో వినియోగించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనితో ప్రభుత్వం కేవలం ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ ని మాత్రమే వినియోగిస్తుంది. అయితే అవి ఎలా పనిచేస్తున్నాయో.. అందులోని సాంకేతిక కారణాలు, లోపాలు, సర్వర్ ఇబ్బందులేంటో కలెక్టర్ల నుంచి జిల్లా అధికారుల వరకూ ఎవరికీ తెలియడం లేదు. దానికి కారణం ఒక్కటే ఏ ప్రభుత్వ యాప్ ని కూడా జిల్లా అధికారులు తమ తమ ఫోన్లలో ఇనిస్టాల్ చేసి వినియోగించి పరీక్షచేయరు. ఉదాహరణకు  క్షేత్రస్థాయిలో  దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాలంటే అధికారి అక్కడ పర్యటిస్తేనే సమస్య తెలుస్తుంది.. తద్వారా సమస్యను పరిష్కరించడానికి ఆస్కారం వుంటుంది.  అలాగే అధికారులు కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు అధికారిక కార్యక్రమాల కోసమైనా వినియోగిస్తే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సంక్షేమ పథకాల విషయంలో పడే ఇబ్బందులు తెలుస్తాయి.

ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రభుత్వ శాఖలు, తాజాగా గ్రామ, వార్డు సచివాలయ శాఖలో సిబ్బంది పడే కష్టాలు కూడా అధికారులకు తెలియడం లేదు. ఇచ్చిన లక్ష్యాలను అధిగ మించడంలేదని ఒంటికాలిపై లేస్తున్నారు తప్పితే ప్రభుత్వం విడుదల చేసిన ఆండ్రాయిడ్ యాప్స్ పనిచేస్తున్నాయా లేదంటే అందులో ఏదైనా సాంకేతిక సమస్య, సర్వర్ లోడ్ సమస్య తలెత్తుతున్నాయా అనే విషయాలు తెలుసుకోవడం లేదు. అలాగని సిబ్బంది చెప్పినా ఒక్కొక్కిరి పనిచేసి మీకెందుకు పనిచేయడం లేదని తిరగేసి  సిబ్బంది మీదే తప్పును నెట్టేస్తున్నారు అధికారులు. రాష్ట్ర సచివాలయంలోని వివిధ శాఖ ముఖ్యకార్యదర్శిల దగ్గర నుంచి జిల్లాలోని కలెక్టర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు సైతం అత్యధికంగా యాపిల్ ఫోన్లనే వాడుతున్నారు. ఒక పది శాతం మంది జిల్లా అధికారులు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడినా వారికి టెక్నాలజీ తెలయదు. వినియోగించడం అసలే తెలియదు. దీనితో వారు కాస్త జిల్లా కలెక్టర్లు, జెసిలు సమీక్షా సమావేశంలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. దానితో సమీక్షలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలా అఖిలభారత స్థాయి అధికారుల దగ్గర తిన్న చీవాట్లను తిరిగి వారు కూడా కింది స్థాయి సిబ్బందికి తిరిగి ఇచ్చేస్తున్నారు. అంతేతప్పా సాంకేతిక సమస్య ఎక్కడ వచ్చిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఒక్కోసారి సిబ్బంది మొత్తం మూకుమ్మడికా ఆయా ప్రభుత్వ యాప్ లు సక్రమంగా పనిచేయడం లేదని స్క్రీన్ షాట్ లు పెడితే తప్పా సమస్య ఏంటనేది కలెక్టర్లు గుర్తించకపోవడం దారుణ పరిణామంగా కనిపిస్తుంది. వాస్తవానికి గ్రామ సచివాలయ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ వరకూ అందరూ రాష్ట్రప్రభుత్వంలోని వివిధ పధకాలకు సంబంధించిన యాప్స్ వినియోగంపై అవగాహన ఉండాలి. అలా ఉండాలటే వారంతా ఆండ్రాయిడ్ ఫోన్లనే వినియోగించాలి. కానీ వారి ఫ్రొఫైల్ ను బట్టి చాలా మంది అధికారులు యాపిల్ ఐ ఫోన్లు వినియోగించడంతో ప్రభుత్వ సంక్షేమ పధకాలకు సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్స్ ఎలా వినియోగిస్తున్నదీ ఒక్క అధికారి కూడా తెలుసుకోలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదేమో.

ఈ విషయం అధికారులకు చిన్నదిగా కనిపించినా, రాష్ట్రంలో మాత్రం ఇదొక పరిష్కారం లేని సమస్యగా పరిణమిస్తూ రోజు రోజుకీ పెరిగిపోతుంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే దానికి మార్గం ఒక్కటే..రాష్ట్రస్థాయి అధికారి నుంచి గ్రామస్థాయి సిబ్బంది వరకూ అందరూ ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగిస్తే తప్పా క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యను త్వరితగతిన పరిష్కరించే వీలుండదు. జిల్లా కలెక్టర్లు, జెసీలు, ఇతర జిల్లా అధికారులకు ఈ విషయం చిన్నదిగా కనిపించినా, ప్రధాన సమస్య ఇక్కడే వస్తున్నది. రాష్ట్రప్రభుత్వ శాఖలు రూపొందించిన యాప్స్ లోని సాంకేతిక కారణాలు జిల్లా అధికారులు తెలుసుకోవడానికి వీలులేకుండా పోతుంది. దానిపై ప్రభుత్వానికి ఫిర్యాదు, సిబ్బంది పడే ఇబ్బందులను తెలియజేయడానికి అవకాశం కూడా ఉండటం లేదు. అలాగనీ కలెక్టర్లు, జెసిలు, రాష్ట్రశాఖ కమిషనర్లు, ముఖ్యకార్యదర్శిలకు ఈ విషయం తెలియదా అంటే అందరికీ తెలిసే చేస్తున్నారని ప్రతీ ఒక్కరూ నమ్మితీరేలా అంతా యాపిల్ ఐఫోన్లనే వినియోగిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల పూర్తిస్థాయిలో ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగిస్తే తప్పా..ఈ సమస్యలకు పరిష్కారం కనిపంచే సూచనలు మాత్రం కనిపించడం లేదు. సాంకేతికను వినియోగిస్తూ ప్రజలకు పనికొచ్చే ప్రభుత్వ యాప్స్ లోని సమస్యలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి ఇబ్బందులు తెలుసుకోవడానికి ఇకనైనా ప్రభుత్వం ద్రుష్టిసారిస్తుందో లేదో వేచి చూడాలి మరి..!

తాడేపల్లి

2021-08-29 09:40:56

శంఖవరంలో945 మందికి కోవిడ్ టీకా పంపిణీ..

శంఖవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 945 మందికి కోవిడ్-19 వేక్సిన్ పంపిణీ పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ  తెలియజేశారు. ఈమేరకు శనివారం పీహెచ్సీలో ఆయన మీడియాతో మాట్లాడారు.  జిల్లా కేంద్రం నుంచి పీహెచ్సీకికి 105 వైల్స్ కోవిడ్ డోసులు కేటాయించారని వాటిలో వేశామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన వారితోపాటు, రెండవ డోసులు కూడా ఈ కోవిడ్ వేక్సిక్ డ్రైవ్ లో పంపిణీ చేశామన్నారు.  మండల  కేంద్రంలోని మూడు సచివాలయాలతోపాటు, పీహెచ్సీలోనూ టీకాలు అందించినట్టు డాక్టర్ మీడియాకి వివరించారు. అన్ని కేంద్రాల వద్ద జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేక్సినేషన్ జరిపుతున్నామన్నారు.

Sankhavaram

2021-08-28 15:50:20

2023 నాటికి నిర్మాణాలు పూర్తికావాలి..

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మిస్తున్న వైద్య కళాశాల పనులు ఏడు బ్లాకుల 2023 నాటికి  పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మరియు మౌళిక వసతుల కల్పన వ్యవస్థ మేనేజింగ్ డైరెక్టర్ డి.మరళీ కృష్ణ ఐఎఎస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎపిఎమ్ డిఎమ్ సి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం మెడికల్ కాలేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500కోట్ల రూ.తో నిర్మిస్తున్న వైద్య కళాశాల త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ముందుగా విద్యుత్ లైన్లు  , సెట్టింగ్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆపనులు రెవెన్యూ సహకారంతో చెయ్యాలని అన్నారు. అలాగే కాంపౌండ్ గోడ నిర్మాణం త్వరిత గతిన చేపట్టాలని రెవెన్యూ పరస్పర సహకారంతో పనులు పూర్తి చేయాలని అన్నారు. చింతపల్లి ఏరియా ఆసుపత్రికి స్థలం అడ్డంకులు లేకుండా చూసి  త్వరితగతిన  ఆసుపత్రి (సిహెచ్ సి)
పనులు చేపట్టాలని  అన్నారు. ఈ ఆసుపత్రి పనులు ప్రాజెక్టు అధికారి మరియు సబ్ కలెక్టర్ వారి సహకారం తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని ఆయన అన్నారు. అంతకుముందు ఎమ్డి ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ రోణంకి, సబ్ కలెక్టర్ వి.అభిషేక్ తో కలసి మెడికల్ కళాశాల నిర్మాణం పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్త వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్  ఎపిఎమ్ డిఐసి శివకుమార్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ అచ్చెన్నాయుడు , పాడేరు తహశీల్దార్ ప్రకాశ్ రావ్  తదిత రులు  పాల్గొన్నారు.

Paderu

2021-08-28 10:27:49

కోవిడ్ వేక్సినేషన్ పై అపోహలు వీడండి..

కరోనా కట్టడికి 18 సంవత్సరాలు పైబడిన  ప్రతి ఒక్కరూ విధిగా  వెక్షినేషన్ చేయించుకోవాలని సబ్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా  బొబ్బిలి మునిసిపాలిటీ కళాభారతి ఆడిటోరియంలో శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 18 సంవత్సరాల వయస్సు పై బడి ఉన్న వారికి వెక్షినేషన్ స్పెషల్ డ్రైవ్ ఉదయం ప్రారంభించారు.  ఈ స్పెషల్ డ్రైవ్ వెక్షినేషన్ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ పర్యవేక్షించి, నిర్వహిస్తున్న వెక్షినేషన్ పై ఆరా  తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వెక్షినేషన్ పై అపోహలు వీడీ ప్రతి ఒక్కరూ విధిగా వెక్షినేషన్ చేయించుకోవాలన్నారు. వెక్షినేషన్ పై చాలా మందికి అపోహలు ఉన్నాయి, అపోహలు వీడి వెక్షినేషన్ చేయించుకొని కరోనా కట్టడికి అందరూ సహకరించాలన్నారు.   ఈ పర్యటనలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Bobbili

2021-08-28 10:24:11

కోవిడ్ వేక్సినేషన్ తోనే కరోనా వైరస్ కట్టడి..

 కరోనా కట్టడికి వెక్షినేషన్ తప్పనిసరి, 18 సంవత్సరాలు పైబడిన  ప్రతి ఒక్కరూ విధిగా  వెక్షినేషన్ చేయించుకోవాలి, వెక్షినేషన్ పై అపోహలు విడండి అని ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా  పార్వతీపురం డివిజన్ లో కురుపాం మండలం గుమ్మ,పి. లేవిడి, జి.ఎల్.పురం మండలం కెడారిపురం, తాడికొండ  గ్రామాలలో శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రక్రియలో నిర్దేశిత గ్రామ పంచాయతీలలో 18 సంవత్సరాల వయస్సు పై బడి ఉన్న వారికి వెక్షినేషన్ స్పెషల్ డ్రైవ్ ఉదయం ప్రారంభించారు. గ్రామాలలో  ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్న  వెక్షినేషన్ కార్యక్రమానికి ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పర్యవేక్షించి, నిర్వహిస్తున్న వెక్షినేషన్ పై ఆరా  తీశారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా వెక్షినేషన్ చేయించుకోవాలని, వెక్షినేషన్ పై చాలా మందికి అపోహలు ఉన్నాయి, అపోహలు వీడి వెక్షినేషన్ చేయించుకొని కరోనా కట్టడికి అందరూ సహకరించాలన్నారు. ఈ పర్యటనలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Kurupam

2021-08-28 10:13:00

ఉపాధ్యాయుల శిక్షణ విద్యార్ధులకు ఉపయోగపడాలి..

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇచ్చే ఓరియంటేషన్(కొత్త పాఠ్యపుస్తకాలపై) శిక్షణ విద్యార్ధులకు అందించే విధంగా ఉపాధ్యాయులు తర్పీదు పొందాలని ఎంపీడీఓ ఎస్వీ. నాయుడు పేర్కొన్నారు. శనివారం రౌతులపూడి ఎంఈఓ కార్యాలయంలో జరుగుతున్న ఉపాధ్యాయుల ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రస్తుతం ఇంగ్లీషు మీడియంలో విద్యాభోధన అందిస్తున్న తరుణంలో శిక్షణ పొంది మంచి విద్యను పాఠశాలల్లో కూడా విద్యార్ధులకు అంచాలన్నారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటు ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే అవకాశం ఒక్క ఉపాధ్యాయులకు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో, రీసోర్స్ పర్శన్లు జి.క్రిష్ణ, సోమశేఖర్, రామచంద్రరావు,జి.నాగరాజు, జి.కొండబాబు, 40పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Rowthulapudi

2021-08-28 09:53:51

పూర్తిస్థాయిలో కరోనా వేక్సిన్ అందించాలి..

రౌతులపూడి మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో కోవిడ్ వేక్సినేషన్ చేపట్టాలని ఎంపీడీఓ నాయుడు వైద్యసిబ్బందికి సూచించారు. శనివారం ఈ మేరకు రౌతులపూడి గ్రామసచివాలయం-1 పరిధిలో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, ప్రభుత్వం 18 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ టీకా వేయించాలని ఆదేశించిందని, అదే సమయంలో మొదటి డోసు తీసుకున్నవారికి రెండే డోసు కూడా వేయాలని చెప్పడంతో వాలంటీర్లు, ఆరోగ్యసిబ్బంది ఆదిశగా పనిచేసి అందిరికీ వేక్సిన్ అందించాలన్నారు. అంతేకాకుండ కోవిడ్ వేక్సిన్ వేసే చోట పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు బ్లీచింగ్ చైన్ ఏర్పాటు చేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామసచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Rowthulapudi

2021-08-28 09:53:04

చురుగ్గా గ్రామసచివాలయాల నిర్మాణాలు..

రౌతులపూడి మండలంలోని 26 గ్రామ పంచాయతీల పరిధిలోని 15 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు చురుక్కుగా సాగుతున్నాయని ఎంపీడీఓ నాయుడు తెలియజేశారు. శనివారం ఈ మేరకు రౌతులపూడి ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ 2 గ్రామసచివాలయాలు పూర్తయ్యాయని, మరో 4 భవనాలు నెలాఖరునాటికి పూర్తవుతాయన్నారు. మిగిలిన 11 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది త్వరితగతిన భవనాల నిర్మాణ పనులు చేపడుతున్నారన్నారు. సాధ్యమైనంత త్వరలోనే భవనాలు పూర్తిచేస్తాయని ఎంపీడీఓ నాయుడు వివరించారు.

Rowthulapudi

2021-08-28 08:48:11

వివేకానంద సంస్థకు దేశీయ గోమాత వితరణ..

విశాఖ పాత నగరంలో ఉన్న శ్రీ వివేకానంద  వృద్ధుల, అనాధ ఆశ్రమం కు సింహాచలం అప్పన్న దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు శనివారం దేశీయ గోమాతను అందచేశారు. ఈ సందర్భంగా తొలుత గోమాతకు శ్రీనుబాబు, సంస్థ సభ్యులందరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు,కుంకుమ సమర్పించిన అనంతరం మహిళలు మంగళ హారతిలు ఇచ్చారు అనంతరం ఈ ఆశ్రమానికి గోమాత ను అందజేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, ఈ అనాధ,వృద్ధుల ఆశ్రమానికి ప్రస్తుతం పాలు, పెరుగు కొరత తీవ్రంగా ఉందని, దీంతో ఈ గోమాత ద్వారా ఆ అవసరాలు తీర్చడానికి వెసులుబాటు కలుగుతుందన్నారు, ఇకమీదట పాలు.పెరుగుకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. ఇక ఆశ్రమం లో 30 నుంచి మూడు రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు  చెప్పారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు, సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు మాట్లాడుతూ గోమాత వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, అందులో ప్రత్యేకంగా దేశవాలి గోమాతను పెంచాలనే ఉద్దేశం తోనే ఈ కార్యక్రమాన్ని సంకల్పించామన్నారు.అందుకు సహకరించిన శ్రీనుబాబుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కృష్ణాష్టమి వేడుకలు కూడా సభ్యులు అందరూ జయప్రదం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సోంబాబు,అప్పలకొండ, భానోజిరావు,సభ్యులు  పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-28 07:18:43

ఎపడిమిక్ లో అప్రమత్తంగా ఉండాలి..

ఎపడమిక్ సీజన్ లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఎంతో అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.పి.సరిత వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం శంఖవరం పీహెచ్సీలో వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణతోపాటు, సిబ్బందితో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం జ్వరాలు అధికంగా ఉన్నందున పారామెడికల్ సిబ్బందిని నిత్యం ఫీల్డులోనే ఉంచాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు రక్త పరీక్షలు చేయడంతోపాటు, మందులు ఇచ్చిన తరువాత వ్యాధి తీవ్రత ఎలాంవుందనే విషయంలోనూ పరిశీలన చేయాలన్నారు. అనంతరం ఆసుపత్రిలో మందుల లభ్యతను, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆసుపత్రి ఓపీ రిజర్టర్లు, నిత్యం జరిగే పరీక్షలు, ఫీల్డు సిబ్బంది ఇచ్చే క్షేత్ర స్థాయి సమాచారంపై తీశారు. ఈ సీజన్ ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా, మందులు, మెడికల్ టెస్టుల సామాగ్రి ఇలా ఏది అవసరం వచ్చినా తక్షణమే సంప్రదించాలన్నారు. వైద్యసేవల్లో రాజీపడకూడదన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు..పి.రాజేష్, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2021-08-27 12:50:47