1 ENS Live Breaking News

మత్తు పానీయలపై రాష్ట్రవ్యాప్త కళాజాత..

మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీ నుండి డ్రగ్స్,మత్తు పానీయాల పై  కళాజాత నిర్వహిస్తామని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు.  యువత,విద్యార్థులలో డ్రగ్స్,మత్తు పానీయాల దుష్ఫలితాల పై సాంస్కృతిక కార్యక్రమాలను నవంబర్ 1వ తేదీన కర్నూల్ నుండి ప్రారంభించి 13 జిల్లాలలో పై కళాజాత నిర్వహించి లక్షలాది విద్యార్థిని, విద్యార్థులను చైతన్యవంతులను చేస్తామన్నారు. తన పదవీ కాలాన్ని మరొక ఏడాది పాటు పొడిగించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి లక్ష్మణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.రోటరీ క్లబ్ మాజీ గవర్నర్,గుంటూరు రెడ్ క్రాస్ చైర్మన్ వడ్లమాని రవి ప్రసంగిస్తూ లక్ష్మణరెడ్డి గత నలభై సంవత్సరాలుగా సామాజిక రుగ్మతలపై నిరంతరం పోరాడుతున్నారని,1990 వ దశాబ్దంలో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం,మద్య నియంత్రణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారన్నారు. మద్య నియంత్రణ ఉద్యమంలో రోటరీ క్లబ్ భాగస్వామ్యమౌవుతుందని  పేర్కొన్నారు. గుంటూరు రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు పి.రామచంద్రరాజు ప్రసంగిస్తూ లక్ష్మణరెడ్డి రక్తదాన ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారని,రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా రక్తం కొరత ను తీర్చడానికి తన వంతు బాధ్యత గా కృషి చేస్తూ రెడ్ క్రాస్ కు తోడ్పాటును అందిస్తున్నారని,తన స్వగ్రామమైన కారుమంచి గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారని అన్నారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి ప్రసంగిస్తూ లక్ష్మణరెడ్డి తో గత నలభై సంవత్సరాలుగా సాన్నిహిత్యం ఉందని ప్రజా చైతన్య వేదిక,జనవిజ్ఞాన వేదిక,భారత జ్ఞాన విజ్ఞాన సమితి,జనచైతన్యవేదిక ల ద్వారా సదస్సులు,చర్చాగోష్టు లు,కళాజాత లను నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారని తెలిపారు.మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ గా గత రెండు సంవత్సరాలుగా కళా బృందాల ద్వారా ఇంజనీరింగ్,యూనివర్సిటీ ప్రాంగణాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థినీ,విద్యార్థులను జాగృతలను చేస్తున్నారని తెలిపారు. జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం మాలిక్,రంగం కళా బృందం కార్యదర్శి రాజేష్, అవగాహన సంస్థ నేతలు  శేఖర్,కృష్ణ,రెడ్ క్రాస్ సంస్థ నేతలు రావి శ్రీనివాసరావు,సుబ్బారావులు తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-10-10 11:20:51

సిఎం వైఎస్.జగన్ పర్యటన ఏర్పాట్లు పూర్తి..

ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల తిరుపతి పర్యటన ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ చైర్మన్  వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. ప్రారంభోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈ నెల 11వ తేదీ సోమవారం ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా  తిరుపతిలో రూ 25 కోట్ల ఖర్చుతో నిర్మించిన  చిన్న పిల్లల గుండె జబ్బుల చికిత్సల ఆసుపత్రి  తాత్కాలిక భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు రూ 25 కోట్లతో దాత నిర్మించిన పైకప్పును,  అలిపిరి వద్ద మరో దాత రూ 15 కోట్లతో నిర్మించిన  గోమందిరాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం తిరుమల చేరుకుని గరుడోత్సవం సందర్భంగా శ్రీవారి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. 12వ తేదీ మంగళవారం తిరుమలలో  దాత నిర్మించిన నూతన బూందీపోటును,  శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కన్నడ ,హింది ఛానళ్లను ప్రారంభిస్తారనితెలిపారు. తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి, టీటీడీ  జెఈవోలు  సదా భార్గవి, వీరబ్రహ్మం, వైద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్ర శేఖర రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణ, అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి, సిఎస్ఆర్ఎంఓ శేష శైలేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-10 11:18:32

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం..

మ‌హిళా సాధికార‌త ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తున్నార‌ని, వాటిని స‌ద్వినియోగం చేసుకొని కుటుంబాల‌ను ఉన్న‌తంగా తీర్చిదిద్దుకోవాల‌ని కాకినాడ ఎంపీ వంగా గీత‌, కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే  ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి ల‌బ్ధిదారుల‌కు సూచించారు. వైఎస్సార్ ఆస‌రా రెండో విడ‌త సంబ‌రాల్లో భాగంగా ఆదివారం కాకినాడ అన్న‌మ్మ గాటీసెంట‌ర్ ప్రాంతంలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలోని 20 నుంచి 29వ వార్డు వ‌ర‌కు గ‌ల ప‌ది వార్డుల ప‌రిధిలోని 1,075 స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు 6,94,01,231 రూపాయ‌ల మెగా చెక్‌ను ల‌బ్ధిదారుల‌కు అంద‌జేశారు. ప్ర‌జా సంక్షేమం ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న 31 ప‌థ‌కాల వివ‌రాల‌ను ఈ సంద‌ర్భంగా ఎంపీ వంగా గీత మ‌హిళ‌ల‌కు వివ‌రించారు. ఎమ్మెల్యే చంద్రేశేఖ‌ర‌రెడ్డి మాట్లాడుతూ 2019, ఏప్రిల్ 11 నాటికి ఉన్న పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం సొమ్మును నాలుగు విడ‌త‌ల్లో అందించే వైఎస్సార్ ఆస‌రా కార్య‌క్ర‌మంలో భాగంగా ఇప్పుడు రెండో విడ‌త సొమ్మును ఖాతాల్లో జ‌మ‌చేస్తున్న‌ట్లు వివ‌రించారు. ప‌ది రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఆస‌రా సంబ‌రాల‌ను విజ‌య‌వంతం చేయాల‌న్నారు. ఆస‌రా సొమ్మును ఇంటి నిర్మాణం లేదా సుస్థిర జీవ‌నోపాధి త‌దిత‌రాల‌కు ఉప‌యోగించుకోవాల‌ని ఎంపీ, ఎమ్మెల్యే ల‌బ్ధిదారుల‌కు సూచించారు. కార్య‌క్ర‌మంలో కాకినాడ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళాదీప్తి, డిప్యూటీ మేయ‌ర్‌-2 వెంక‌ట స‌త్య‌ప్ర‌సాద్‌, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, స్థానిక కార్పొరేట‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-10 10:46:43

రీజినల్‌ స్కిల్‌ కాంపిటీషన్‌ వేదికగా విశాఖ..

యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఆవిష్కర్తలుగా నిలపే ప్రయత్నంలో భాగంగా నిర్వహిస్తున్న రీజినల్‌ స్కిల్‌ కాంపిటీషన్‌కు విశాఖ నగరం ఆతిధ్యం ఇవ్వనుంది. ఆరు రాష్ట్రాలకు చెందిన యువత ఈ పోటీలలో భాగమవుతున్నారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వహణపై ఆర్గనైజింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌, హెచ్‌పిసిఎల్‌ జిఎం(హెచ్‌ఆర్‌) కె.నగేష్‌ ఆదివారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో సమావేశమై చర్చించారు. ఇటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం విశాఖ నగరంలో నిర్వహించడం ఎంతో మంచి పరిణామమన్నారు.వర్సిటీ సహకారం, భాగస్వామ్యం దీనిలో అవసరమని నగేష్‌ కోరారు.52 ట్రేడ్‌లలో జరిగే పోటీలలో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల నుంచి 1200 మంది ఈ పోటీలలో పాల్గొనడం జరుగుతుందని, నవంబరు 30 నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు పోటీలు నిర్వహిస్తామన్నారు. నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఏపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించడం జరుగుతోందని వివరించారు.

Visakhapatnam

2021-10-10 10:11:21

పైడితల్లమ్మ ఉత్సవాలకు ఆన్ లైన్లో టిక్కెట్లు..

విజయనగరంలోని శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి తెలిపారు. ఆదివారం  48వ వార్డ్  సచివాలయంలో  ఆన్లైన్ టిక్కెట్లు విక్రయాలను ప్రారంభించారు. అనంతరం ఆమె 400 రూపాయల తో రెండు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ,  రూ.200/- విలువ గల టికెట్లను  ఆదివారం  5వార్డులో  విక్రయించ నున్నట్లు తెలిపారు. సోమవారం నుండి  మండల ప్రధాన కేంద్రాల్లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.  టిక్కెట్లు అమ్మిన సంఖ్యను బట్టి భక్తులకు ఏర్పాట్లను గావిస్తారని త్వరగా భక్త్తులు టిక్కెట్లు కొనుగోలు. చేయాలని అన్నారు.  ఈమాసం అంత పవిత్రమేనని, భక్తులు ఒకే సారి రావద్దని, కోవిడ్ ఉందని గుర్తు పెట్టుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డా.జి.సి కిషోర్ కుమార్, ఆర్.డి.ఓ భవాని శంకర్, ఎన్. ఐ. సి డి.ఐ. ఓ నరేంద్ర, కార్పొరేటర్  ధనలక్ష్మి, అమ్మవారి దేవస్థానం ఈ.ఓ కిషోర్ కుమార్,  ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-10 08:40:14

యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్..

ప్రశాంత వాతవరణంలో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున చెప్పారు. ఆదివారం విశాఖలో జరుగుతున్న సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షలు తీరును  కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. గాయత్రీ విద్యాపరిషత్ డిగ్రీ, అండ్ పీజీ కాలేజీ, విశాఖ వేలీ కేంద్రాలను పరిశీలించి అక్కడి చేసిన ఏర్పాట్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా.మల్లిఖార్జున మాట్లాడుతూ,  కరోనాను ద్రుష్టిలో పెట్టుకొని మాస్కుధారణ, భౌతిక దూరం పాటించడంతోపాటు, పల్స్ స్ర్కీనింగ్, వైద్యసిబ్బందిని నియమించామన్నారు.  పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది విధుల పట్ల కలెక్టర్ సంత్రుప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-10 08:31:46

హనుమ జన్మక్షేత్రం తిరుమల అంజనాద్రి..

తిరుమ‌ల క్షేత్రంలో అంత‌ర్భాగ‌మైన అంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామివారి జన్మస్థలమని  టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ పేర్కొన్నారు. తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో నిర్వ‌హిస్తున్న‌వేంక‌టాచ‌ల మ‌హ‌త్యం, వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యంపై ఉప‌న్యాస కార్య‌క్ర‌మం శ‌నివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ మాట్లాడుతూ మతంగ మహర్షి చెప్పిన విధంగా అంజనాదేవి సంతానం కోసం వేంకటాచలానికి విచ్చేసి ఆకాశ‌గంగ వ‌ద్ద తపస్సు చేసింద‌ని చెప్పారు. దాదాపు 12 నెల‌ల క‌ఠోర త‌ప‌స్సు చేసి వాయుదేవుని అనుగ్ర‌హంతో ఆంజనేయస్వామివారికి జన్మనిచ్చిన‌ట్లు తెలిపారు. త‌రువాత‌ బాలాంజనేయస్వామి సూర్యదేవుని పండుగా భావించి పట్టుకోవడానికి వేంకటాద్రి నుండి లంఘించడం ఇలా అనేక విషయాలు వేంకటాచల మాహాత్మ్యం తెలియ‌జేస్తుంద‌ని వివ‌రించారు.   అనంత‌రం శ‌నివారం రాత్రి శ్రీ‌వారికి క‌న్నుల పండువ‌గా జ‌రిగే ముత్య‌పుపందిరి వాహనం, ఆదివారం ఉద‌యం జ‌రిగే క‌ల్ప‌వృక్ష వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యాన్ని క‌మ‌నీయంగా వ్యాఖ్యానించారు. చివ‌రగా వేంక‌టాచ‌ల మ‌హ‌త్యంలోని స్తోత్రాల‌ను 12 మంది టిటిడి వేద‌పండితులు భ‌క్తుల‌చే పారాయ‌ణం చేయించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.

Tirupati

2021-10-09 16:43:30

టిటిడి ఈవోను కలిసిన ట్రైనీ ఐఏఎస్‌లు..

శిక్షణలో భాగంగా ట్రైనీ ఐఏఎస్‌ల బృందం టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డితో తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం స‌మావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తన ఐఏఎస్ శిక్షణ కాలంలో నేర్చుకున్న విషయాలు ఇప్ప‌టివ‌ర‌కు త‌న ఉద్యోగ ప్ర‌స్థానంలో ఎలా ఉపయోగపడ్డాయన్న  అంశాలను అనుభవాలను ఉదాహరిస్తూ చెప్పారు. ఒక ఐఏఎస్‌ అధికారిగా తన ప్రయాణాన్ని, వివిధ సందర్భాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన తన అనుభవాలను, అభివృద్ధి ప‌నుల‌ను తెలియజేశారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడానికి అభివృద్ధి చెందిన జిల్లాలు మాత్ర‌మే కాకుండా గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాలలో కూడా పని చేయాలని ట్రైనీ ఐఏఎస్‌ల‌కు ఈవో సూచించారు. అదేవిధంగా వారంలో 3 లేదా 4 రోజుల పాటు క్షేత్ర స్థాయిలో సందర్శించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోగ‌లిగితే ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌వ‌చ్చ‌న్నారు. అనంత‌రం టిటిడి అమలుచేస్తున్న ఆధ్యాత్మిక‌, విద్య, వైద్య, సంక్షేమ కార్యక్రమాల గురించి ఈవో ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్‌లకు వివరించారు. ఈ కార్యక్రమంలో అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో  స‌దాభార్గ‌వి, డెప్యూటీ ఈవోలు  దామోదర్,  రమణ ప్రసాద్ పాల్గొన్నారు.

Tirumala

2021-10-09 15:46:48

తిరుపతిలో నెలాఖరున గో మ‌హా స‌మ్మేళ‌నం..

"గో ర‌క్ష‌ణే ధ‌ర్మ‌ర‌క్ష‌ణ " అనే మౌలిక అంశాన్ని స‌మాజంలోనికి తీసుకు వెళ్ళ‌డానికి అక్టోబ‌రు 30,31వ తేదీల్లో తిరుప‌తిలోని తార‌క‌రామ స్టేడియంలో " గో మ‌హా స‌మ్మేళ‌నం " కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య  భ‌వ‌నంలో శ‌నివారం సాయంత్రం యుగ తుల‌సి ఫౌండేష‌న్, శ్రీ గోధాం మ‌హాతీర్ద్, ప‌త్ మేడ వారితో స‌మావేశం నిర్వ‌హించారు.  " గోసేవే గోవిందుడి సేవ " అనే నినాదంతో ధ‌ర్మానికి ప్ర‌తి రూప‌మైన గో సంర‌క్ష‌ణ‌కు టిటిడి అనేక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టి విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఇందులో మొద‌టి రోజు వివిధ జిల్లాల నుండి వ‌చ్చే రైతుల‌తో గో ఉత్ప‌త్తుల‌తో ప్ర‌ద‌ర్శ‌న,  రైతుల‌కు గో ఆధారిత వ్య‌వ‌సాయంపై అవ‌గాన‌ క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు. రెండ‌వ రోజు కంచి శ్రీ‌శ్రీ‌శ్రీ శంక‌ర విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామిజీ, రాజ‌స్థాన్ ప‌త్ మేడ‌కు చెందిన గౌరుషి స్వామి శ్రీ ద‌త్ శ‌ర‌ణానంద్ మ‌హారాజ్‌, ఉడిపి శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యా ప్ర‌స‌న్న స్వామిజీ వంటి 22 మంది  దేశంలోని ప్ర‌ముఖ మ‌ఠాదిప‌తులు, పీఠాదిప‌తులు భ‌విష్య‌త్ త‌రాల‌కు గోవును ఎలా కాపాడుకోవాల‌నే అంశంపై అనుగ్ర‌హ భాష‌ణం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ స‌మ్మేళ‌నంలో కోవిడ్ - 19 నిబంధ‌న‌లు పాటిస్తూ మొద‌టి రోజు వెయ్యి మంది, రెండ‌వ రోజు వెయ్యి మంది రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మ‌రోసారి ఈ స‌మ్మేళనంపై స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈవో తెలిపారు. ఈ స‌మావేశంలో అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు  వీర‌బ్ర‌హ్మం, యుగ తుల‌సి ఫౌండేష‌న్ ఛైర్మ‌న్,  టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు  శివ‌కుమార్‌, విజివోలు  బాలిరెడ్డి,  మ‌నోహ‌ర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2021-10-09 15:42:07

అప్పలాయగుంట ఆలయ అభివృద్ధికి చర్యలు..

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్  వై వి సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం ఆయన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ,  అప్పలాయగుంట ఆలయం వద్ద ఏర్పాటుచేసిన కల్యాణ కట్ట లో భక్తులు అధిక సంఖ్యలో తలనీలాలు సమర్పిస్తున్నారని చెప్పారు. ఆదివారం నుంచి ఈ కల్యాణ కట్టలో  సిబ్బందిని రెట్టింపు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆలయంలో తగినంతమంది అర్చకులను కూడా నియమిస్తామన్నారు.  శనివారం రోజు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందువల్ల స్వామివారి దర్శనం కోసం ఎండలో నిలబడాల్సి వస్తోందని భక్తులు చైర్మన్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన శ్రీ సుబ్బారెడ్డి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నీడ కల్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 11వ తేదీ ముఖ్యమంత్రి  శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. తిరుపతిలో చిన్న పిల్లల గుండె జబ్బు చికిత్స  ఆసుపత్రిని ప్రారంభిస్తారన్నారు. అలిపిరి నుంచి తిరుమలకు దాత నిర్మించిన పైకప్పును,  అలిపిరి వద్ద మరో దాత నిర్మించిన  గోమందిరాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.  12వ తేదీ తిరుమలలో  దాత నిర్మించిన నూతన బూందీపోటును,  శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కన్నడ ,హింది ఛానళ్లను ప్రారంభిస్తారనితెలిపారు.  ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి  బసవ రాజ్ బొమ్మై పాల్గొంటారని తెలిపారు. అంతకు ముందు  సుబ్బారెడ్డి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

Prasanna Venkateswara Temple

2021-10-09 11:52:38

ఘోషా ఆసుపత్రిని మరింత అభివ్రుద్ధి చేస్తాం..

విశాఖ నగరంలోవున్న విక్టోరియా (ఘోషా) ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టరు ఏ.మల్లికార్జున తెలిపారు.  శనివారం నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి చికిత్స కొరకు వచ్చినవారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వుండాలన్నారు.  ఆసుపత్రిలో చేరిన వారికి స్వంత ఇంటిలో వున్న భావన కలగాలని, చికిత్స అనంతరం ఆనందంగా తిరిగి వెళ్లేలా వైద్య సేవలు అదించాలన్నారు.  నాడునేడు పనుల కింద రూ.100 కోట్లతో చేపట్టిన  నూతన భవనం పూర్తయితే అదనంగా 280 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు.  రూ.80 కోట్లు భవన నిర్మాణానికి, రూ.20 కోట్లు పరికరాలకు కేటాయించినట్లు వెల్లడించారు.  ఓపి వేగవంతం చేసేందుకు మరొక కంప్యూటర్, డేటా ఎంట్రీఆపరేటరు, అవసరమని, రేడియాలజిస్ట్,   అంబులెన్స్ డ్రైవరు కూడా మంజూరు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.హేమలతాదేవి కోరగా నియామకాలకు అనుమతించారు. రూ.34 లక్షలతో  పరికరాలు కొనుగోలుకు కూడా ఆమోదించినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. అంతకు ముందు కలెక్టర్ ఆసుపత్రిలో వార్డులను, వివిధ విభాగాలను పరిశీలించారు.  ఆసుపత్రిలో సౌకర్యాలు ఎలా వున్నాయి, చికిత్స, మందులు సక్రమంగా ఇస్తున్నారా, పరిశుభ్రతల గూర్చి రోగులను అడగారు. సేవలు బాగున్నాయని, ప్రతిరోజూ బెడ్ షీట్స్ మార్చుతున్నారన వారు తెలిపారు.  సరఫరా చేస్తున్న ఆహారం పట్ల కూడా రోగులు సంతృప్తిని వ్యక్తం చేశారు. లేబర్ రూమ్, ఐ.సి.యు. రూమ్స్, లాబొరేటరి, పోస్ట్ నాటల్ వార్డు లను పరిశీలించారు.  సమావేశంలో ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్, అనదపు డియంఅండ్ హెచ్ వో  డాక్టర్ విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండింట్ డి.హేమలతాదేవి, డి.సి.హెచ్. ప్రకాశరావు, ఏ.పి.ఎమ్.ఐ.సి. ఈ.ఈ. నాయుడు, ఆసుపత్రి ఓ.ఎస్.  విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-09 11:29:27

కాకినాడ స్మార్ట్ సిటీకి మరింత గుర్తింపు తీసుకువస్తా..

కాకినాడ స్మార్ట్ సిటీకి మరింత గుర్తింపు వచ్చే విధంగా క్రుషి చేసి జిల్లా కీర్తిని రాష్ట్రంలోనే ముందువరసలో నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్‌ అల్లి రాజాబాబు యాదవ్ అన్నారు. శనివారం కాకినాడ కార్పోరేషన్ ఆయన నూతనంగా కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి,  కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమక్షంలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మార్గనిర్దేశకత్వంలో కాకినాడ నగర అభివృద్ధికి పాటుప‌డుతూ రాష్ట్రం, దేశంలో కాకినాడ స్మార్ట్ సిటీకి మంచి గుర్తింపు తీసుకొచ్చేందుకు పాటు పడతానన్నారు. అనంతరం ఉద్యోగులు మర్యాదపూర్వకంగా చైర్మన్ కలిసి పుష్పగుచ్చాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-09 10:57:45

దుర్గమ్మ భక్తులకు లోటు లేకుండా ప్రసాదాలు..

శరన్నవరాత్రులకు వచ్చే భక్తులకు ప్రసాదాలకు ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ అన్నారు. బుద్దావారి గుడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లడ్డూ తయారీ పాక శాలను శనివారం ఇవో డి. భ్రమరాంబ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకునే భక్తులకు అవసరమైన లడ్డూ ప్రసాదాలను సిద్దం చేస్తున్నామన్నారు. ప్రతి రోజు లక్ష 50 వేల లడ్డూ ప్రసాదాలు తయారీ చేసి భక్తులకు విక్రయిస్తున్నామన్నారు.
నవరాత్రుల్లో 10 రోజులపాటు 15 లక్షల 50 వేల లడ్డూలు భక్తులకు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. లడ్డూ నాణ్యత, తూకంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. తయారీ కేంద్రంలోని అన్ని విభాగాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నామన్నారు. నవరాత్రులకు వచ్చే భక్తులకు 11 లడ్డూ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిలో ఆరు కనకదుర్గనగర్ , విఎంసి,పున్నమిఘాట్, స్టేట్‌గెస్ట్‌హౌస్, రైల్వే స్టేషన్, ఓంకార్ మలుపు వద్ద ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచామని ఆలయ కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ తెలిపారు. తయారీ కేంద్రం తనిఖీలో దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమీషనర్ సాగర్‌బాబు, అసిస్టెంట్ డిఇవో రమేష్‌బాబు తదితరులు ఉన్నారు.

Vijayawada

2021-10-09 10:21:32

రాష్ట్రప్రజలపై దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలి..

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు శనివారం ఇంద్రకీలాద్రిపై జగన్మాతగా శ్రీ గాయత్రీదేవి అవతారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మని దర్శించుకుంటున్నట్లు రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీగాయత్రిదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని శనివారం ఉదయం దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ ఎటువంటి శుభకార్యమైన లోకమాత గాయత్రిదేవి ఉపాసనతోనే ప్రారంభిస్తారన్నారు. గాయత్రిమంత్రం సర్వ శుబాలను కల్గిస్తుందన్నారు. అటువంటి మహన్మితమైన గాయత్రిదేవిని భక్తులు దర్శించుకుంటే పుణ్యఫలాలు వారికి లభిస్తాయన్నారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఏర్పాట్లు చక్కగా నిర్వహిస్తున్నామన్నారు. సామాన్య భక్తులకు కూడా 30 నుండి 40 నిమిషాల్లో అమ్మవారి దర్శనం కలుగుతుందన్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా రోజుకు 10 వేల మంది భక్తులను అనుమతించాలని అనుకున్నామన్నారు. అయితే ఆన్‌లైన్‌లో టిక్కట్లు తీసుకోలేక నేరుగా దర్శనానికి వచ్చిన వారికి కూడా దుర్గమ్మ దర్శనం సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆదివారం, సోమవారం మూలా నక్షత్రం రోజులలో వచ్చే భక్తుల రద్దిని దుష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్నప్రసాదవితరణ సక్రమంగా జరుగుతుందన్నారు. ప్రతి రోజు సాయంత్రం అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని లోటుపాట్లను సరిదిద్దుతున్నామన్నారు. ఇందుకు మీడియా కూడా సహకరిస్తుందని ప్రస్తావించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ దసరా ఉత్సవాలు రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలిగిస్తుందని ఆయన ఆకాంక్షించారు.

Vijayawada

2021-10-09 09:34:34

టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యునిగా యం.ఎన్‌.శ‌శిధ‌ర్‌..

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా యం.ఎన్‌.శ‌శిధ‌ర్ శ‌నివారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి  యం.ఎన్‌.శ‌శిధ‌ర్‌చే ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు.  అనంతరం అద‌న‌పు ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అందించారు.  ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు  రమేష్ బాబు,  సుధారాణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

Tirumala

2021-10-09 08:41:52