1 ENS Live Breaking News

సింహాద్రి అప్పన్నకు గంట్ల ప్రత్యేక పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న) స్వామివారిని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు, దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు దర్శించుకున్నారు. బుధవారం ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వం ద్రుష్టికి జర్నలిస్టుల ప్రధాన సమస్యలు తీసుకెళ్లినట్టు చెప్పారు. అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్లు వచ్చేలా క్రుషి చేస్తున్నట్టు శ్రీనుబాబు వివరించారు.

Simhachalam

2021-10-06 05:24:52

పెండింగు బిల్లులు తక్షణమే అప్ లోడ్ చేయాలి..

శ్రీకాకుళం  జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు తక్షణమే అప్ లోడ్ చేయాలని, నెల రోజుల తదుపరి బిల్లులు పెండింగులో ఉంటే ఉపేక్షించేది లేదని  సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గృహ నిర్మాణాలపై ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో జె.సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తొలుత గృహ నిర్మాణాల జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న ఆయన పెండింగు బిల్లులపై దృష్టి సారించాలని అన్నారు. ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణపు పనులకు సంబంధించిన బిల్లులు వారంలోగా వెబ్ సైట్ నందు అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. ఇసుక, సిమెంటు, ఐరన్ సరఫరాపై ప్రతి లబ్ధిదారునికి వివరాలు తెలియజేయాలని, నిధులు లేవనే నెపంతో పనుల్లో జాప్యం జరగరాదని జె.సి స్పష్టం చేసారు. ప్రతి ఏ.ఇ.ఇ కూడా వారి  పరిధిలోని గ్రామ సచివాలయాలను తప్పనిసరిగా పర్యటించాలని, ప్రతి రోజూ 5 నుండి 10 మంది లబ్ధిదారులతో మాట్లాడి వారి గృహ నిర్మాణపు పనులు పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇందుకు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్ స్పెక్టర్లను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.  గృహాలు మంజూరైన స్వయం సహాయక బృందాల్లోని సభ్యులు బ్యాంకుల నుండి రుణాలు పొంది వాటిని పూర్తిచేసుకునే విధంగా విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సిమెంటు సరఫరా ఎక్కువగా ఉన్నచోట పనులు వేగవంతం చేయాలని, ఇసుక కొరత సమస్యను త్వరలోనే పరిష్కరించనున్నట్లు జె.సి వివరించారు. 

తక్కువ గృహ నిర్మాణాలు చేపట్టిన  మండలాల్లో ఏ.ఇ.ఇలు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. త్వరలోనే ప్రతీ మండలాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న గృహనిర్మాణాలను పరిశీలిస్తామని అన్నారు. గృహ లబ్ధిదారుల పేర్లు మరియు వారి సెల్ ఫోన్ నెంబర్లు సంబంధిత ఏ.ఇ.ఇల వద్ద అందుబాటులో ఉండాలని, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సరైన స్పందన లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు పూర్తిచేసిన పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే అప్ లోడ్ చేయాలని, నెల రోజుల తదుపరి పెండింగులో బిల్లులు ఉంటే ఉపేక్షించేది లేదని అన్నారు. గృహ నిర్మాణాల్లో సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. బిల్లులు చెల్లింపులు జరిగితే మరిన్ని నిధులు జిల్లాకు విడుదల అవుతాయని, దానివలన మరిన్ని గృహాలు నిర్మించుకునేందుకు అవకాశం కలుగుతుందని జె.సి ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు ఎన్.గణపతి, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు.  

 

Srikakulam

2021-10-05 14:21:16

త్వరతగతిన కాలువల్లో పూడిక తీయండి..

అనంతపురం నగర పరిధిలోని కాలువల్లో పూడికతీత చేయకపోవడం వల్ల డ్రైనేజీ నీరు రోడ్డుపైకి వస్తోందని వెంటనే కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని నగర మేయర్ మహమ్మద్ వసీం ఆదేశించారు. నగరంలోని 37 డివిజన్ లో మంగళవారం మేయర్  స్థానిక కార్పొరేటర్ అనీల్ కుమార్ రెడ్డితో కలసి పర్యటించారు. డివిజన్ పరిధిలో అనేక ప్రాంతాల్లో మురుగునీరు రోడ్డుపైకి వస్తుండటంతో పాటు కాళీ స్థలాలలో ముళ్ల కంపలు పెరిగిపోయి పందులు వస్తుందటమే కాకుండా పారిశుద్ధ్య సమస్యతో దుర్గంధం వస్తోందని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేయర్ కాలువల శుభ్రతను వెంటనే చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.అదే విధంగా కాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి వాటిని శుభ్రం చేయించేలా చూడాలని సూచించారు. మేయర్ వెంట కార్యక్రమంలో ఈ ఈ రామ్మోహన్ రెడ్డి డి ఈ లు నరసింహులు, రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం

2021-10-05 14:18:12

సాంకేతికను రైతుల వద్దకు తీసుకువెళ్లాలి..

ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని రైతులు అందుకునేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జున ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వ్యవసాయ, పశు సంవర్ధక, ఉద్యానవన, మత్స్యశాఖలకు సంబంధించిన ప్రగతిని ఆయన సమీక్షించారు. గులాబ్ తుఫాను పంట నష్టాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు. ఇప్పటి వరకు నమోదు చేసిన పంట విస్తీర్ణం సాధారణ విస్తీర్ణం లో 86% ఉన్నందున రికన్సిల్ చేసుకోవాలని సూచించారు. ముందుగా ఈ క్రాప్ పూర్తయితేనే పంట నష్టం, బీమా, రైతు భరోసా మొదలైనవన్నీ రైతులు పొందగలరని చెప్పారు. ఎరువులు, పురుగు మందులు రైతులకు అందుబాటులో ఉంచాలని, రైతు శిక్షణలు పెంచాలని క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది పనితనం మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు.
రైతులకు మేలు చేసే కొత్త వంగడాలను గూర్చి అవగాహన కల్పించి ఉద్యానవన పంటలను మరింత అభివృద్ధి చేయాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ కు గల అవకాశాలను పరిశీలించాలన్నారు. పట్టు పరిశ్రమ గిరిజన రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గిరిజన రైతులకు లోతైన సంపూర్ణమైన అవగాహన కలిగించాలని ఆదేశించారు. 
ఎక్కువగా క్షేత్ర పర్యటనలు చేయాలని పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు మొదలైన వాటికి తెగులు రాకుండా ముందుగా వ్యాక్సినేషన్, అవసరమైన జాగ్రత్తల గూర్చి తెలియజేయాలని పశుసంవర్ధక శాఖను ఆదేశించారు. జిల్లాలో మత్స్య పరిశ్రమ గురించి సమీక్షిస్తూ కేజ్ కల్చర్ ను మరింత అభివృద్ధి చేయాలన్నారు హేచరీలలోఉత్ప్రేరకాలను వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎమ్. వేణుగోపాల రెడ్డి, వ్యవసాయ శాఖ జె.డి. లీలావతి, పశుసంవర్ధక శాఖ జె.డి. రామకృష్ణ, మత్స్య శాఖ జే.డీ. లక్ష్మణరావు ఉద్యానవన శాఖ డి.డి.  పట్టు పరిశ్రమ శాఖ జె.డి. తదితరులు పాల్గొన్నారు

Visakhapatnam

2021-10-05 13:39:24

కిశోర బాలికల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం..

కిశోర బాలికల ఆరోగ్యము, పరిశుభ్రతే లక్ష్యంగా స్వేచ్చ అనే కార్యక్రమాన్ని రూపొందిం చడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి   వై.ఎస్. జనన్మోహన రెడ్డి తెలిపారు.  మంగళవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్పరెన్స్ ద్వారా ‘స్వేచ్చ’   కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా 7వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే బాలికలకు నాణ్యమైన బ్రాండెడ్ నాప్కిన్లు నెలకు 10 చొప్పున సంవత్సరానికి 120 నాప్కిన్లు అందజేసే కార్యక్రమంలో జిల్లా పరిషత్ చంద్రంపాలెం, ఉన్నత పాఠశాల నుంచి  పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున, పార్లమెంటు  సభ్యురాలు గొడ్డేటి మాధవి,   ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి మీకు కావలసిన వాటిని అన్నింటిని అందజేస్తున్నారని, మీరు అందరూ బాగా చదువుకుని దేశ అభివృద్దికి  కృషి చేయాలన్నారు. మీ కోసం ‘దిశయాప్’ప్రవేశ పెట్టి బద్రతను కల్పించారన్నారు.  జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ ‘స్వేచ్చ’కార్యక్రమం  ఈ రోజు లాంచింగ్ జరిగిందని,  అందరూ వినియోగించి ఆరోగ్యంగా ఉండాలన్నారు.  ప్రతి పాఠశాలకు ఈ కార్యక్రమం అమలు నిమిత్తం ఒక ‘స్వేచ్చ’నోడల్ అధికారిని నియమిస్తారని తెలిపారు. పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి మాట్లాడుతూ ‘స్వేచ్చ’ఇది ఆడపిల్లలందరికి ఎంతో ఉపయోగపడే కార్యక్రమం అని, మన ముఖ్యమంత్రి ఈ సమస్యను అధిగమించడానికి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.  మనం తీసుకునే జాగ్రత్తలు మనం సంతోషంగా ఆరోగ్యంగా ఉంచుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.ఎమ్.ఆర్.డి.ఎ ఛైర్ పర్సన్  అక్కరమాని విజయనిర్మల,  జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జల్లపల్లి సుభద్ర,  జిల్లా విద్యాశాఖాధికారి,  ప్రాజెక్టు అధికారి, (స్త్రీ శిశు సంక్షేమ శాఖ,) పలువురు విద్యార్ధినులు  పాల్గొన్నారు. 

Chandrampalem

2021-10-05 13:37:00

రైతుల‌ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాలి..

రైతుల‌కు సంబంధించిన ఫిర్యాదుల‌పై, స‌మస్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ జె. వెంక‌ట‌రావు అగ్రిక‌ల్చ‌ర్ అసిస్టెంట్ల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న పాచిపెంట-1, 2 రైతు భ‌రోసా కేంద్రాల‌ను, సాలూరు బీసీ కాల‌నీ, దేవ‌ర‌వీధిలోని రైతు భ‌రోసా కేంద్రాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అక్క‌డ అందుతున్న సేవ‌ల‌పై సిబ్బందిని ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా వివిధ‌ రికార్డుల‌ను ప‌రిశీలించారు. వ్య‌వ‌సాయ సంబంధిత స‌మ‌స్య‌ల‌పై రైతుల వ‌చ్చిన‌ప్పుడు వారితో విన‌యంగా మాట్లాడాల‌ని, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక చొరవ తీసుకోవాల‌ని సిబ్బందికి సూచించారు. విధుల నిర్వ‌హ‌ణ‌లో బాధ్య‌త‌గా మెల‌గాల‌ని పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ రంగానికి ప్ర‌భుత్వం అందిస్తున్న సేవ‌ల గురించి, అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల గురించి ప్ర‌జ‌ల్లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు. ఆయ‌న వెంట స్థానిక అధికారులు, స‌చివాల‌య ఉద్యోగులు, ఇత‌ర సిబ్బంది ఉన్నారు.

జె.వెంకటాపురం

2021-10-05 13:06:36

సీఎం వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన..

తిరుమలలోని శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి చేపట్టనున్న ప్రారంభోత్స‌వాలు ప్ర‌దేశాల‌ను, అక్క‌డి ఏర్పాట్ల‌ను ఇంజినీరింగ్‌, భ‌ద్ర‌తా అధికారుల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ప‌రిశీలించారు. ముందుగా అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో నిర్మాణం పూర్త‌యిన పైక‌ప్పును ప‌రిశీలించారు. అనంత‌రం అలిపిరి పాదాల మండపం వ‌ద్ద ప‌నులు పూర్త‌యిన‌ గోమందిరంలో గోపూజ‌, గోతులాభారం, గోవిజ్ఞాన కేంద్రం ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. గోమందిరం లోప‌లికి వెళ్లేందుకు, వెలుప‌లికి వ‌చ్చేందుకు జ‌రుగుతున్న రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. లైటింగ్‌, వైరింగ్ త‌దితర ప‌నుల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అనంత‌రం ఎస్వీ పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప‌త్రి ప్రారంభోత్స‌వ ఏర్పాట్ల‌పై ఈవో తన ఛాంబ‌ర్‌లో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఆసుప‌త్రి వివ‌రాల‌తో మూడు నిమిషాల నిడివి గ‌ల వీడియో త‌యారు చేయాల‌ని బ‌ర్డ్ అధికారుల‌ను ఆదేశించారు. ఆసుప‌త్రిలో త‌గినంత మంది వైద్య సిబ్బంది, పారామెడిక‌ల్ సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాల‌న్నారు. ఈ స‌మావేశంలో టిటిడి జెఈవో వీర‌బ్ర‌హ్మ‌య్య‌, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ  జ‌గదీశ్వ‌ర్‌రెడ్డి, సిఎంఓ డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌, సిఎస్ ఆర్ఎంవో  శేష‌శైలేంద్ర‌, ప్ర‌త్యేకాధికారి డాక్ట‌ర్ ఆర్‌.రెడ్డెప్ప‌రెడ్డి, డాక్ట‌ర్ శ్రీ‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-05 10:47:23

అప్పన్న నిత్యాన్నధాన పథకానికి రూ.1,00,116

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారి నిత్యన్నధాన పథకానికి విశాఖలోని వేపగుంట అప్పన్నపాలెంకు చెందిన కేవీఆర్వీ లక్ష్మీ, కృష్ణారావు దంపతులు ఒక లక్షా నూట పదహారు రూపాయలు (రూ.1,00,116 ) విరాళమిచ్చారు. ఆ మొత్తాన్ని దేవస్థానంలో సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, తమ పెళ్లిరోజైన ఫిబ్రవరి 24వ తేదీన స్వామివారి సన్నిధిలో అన్నదానం చేయాలని కోరారు. ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘకాలం పనిచేసిన తాము రిటైరయ్యామని స్వామివారి దయవల్ల చల్లగా ఉన్నామని లక్ష్మీ, కృష్ణారావు దంపతులు తెలిపారు. అనంతరం స్వామివారి దర్శినం చేసుకోని, కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ సిబ్బంది స్వామివారి ప్రసాదాలను దాతలకు అందజేశారు.

Simhachalam

2021-10-05 10:28:51

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు..

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణంకు ఊప‌యోగించే దర్భ చాప, తాడును వ‌రా‌హ‌స్వామి అథితి గృహా‌ల వ‌ద్ద ఉన్న టిటిడి అట‌వీ విభాగం కార్యాల‌యం నుండి మంగ‌ళ‌వారం  డిఎఫ్‌వో శ్రీ శ్రీ‌నివాసులు రెడ్డి, సిబ్బంది ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకొచ్చారు. అనంత‌రం శ్రీ‌వారి ఆల‌యం రంగ‌నాయ‌కుల మండ‌పంలోని శేష‌వాహ‌నంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 7వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ధ్వజస్తంభం  మీదకు గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్బతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్బలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో  విష్ణు దర్బ ఉపయోగిస్తారు.  ఇందుకోసం వడమాల పేట పరిసర ప్రాంతమైన చెల్లూరు పంటకాలువల మీద పెరిగే ఈ దర్భను టిటిడి అటవీ సిబ్బంది సేకరిస్తారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెడతారు. ఆ తరువాత దర్బను బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేస్తారు. ధ్వజారోహణంకు 5.5 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు చాప, 175 అడుగుల తాడు అవసరం అవుతాయి.  అయితే అటవీశాఖ ఈ సారి 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో చాప, 211 అడుగుల పొడవు తాడు సిద్ధం చేసింది.   ఈ కార్యక్రమంలో విజివో  బాలిరెడ్డి, ఎఫ్‌ఆర్‌వోలు  ప్ర‌భాక‌ర్‌రెడ్డి,  స్వామి వివేకానంద‌, వెంక‌ట‌సుబ్బ‌య్య‌, ఎవిఎస్వోలు  సురేంద్ర‌, గంగ‌రాజు పాల్గొన్నారు.        

Tirumala

2021-10-05 10:26:45

గృహ నిర్మాణాలకు ఇసుక కొరత ఉండదు..

శ్రీకాకుళంజిల్లాలో గృహ నిర్మాణాలకు, ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఇసుక కొరత ఉండబోదని జేపీ గ్రూప్ స్పష్టం చేసింది. జిల్లాలో ఇసుక పరిస్థితిపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులు, జేపీ గ్రూప్ తో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మంగళవారం ఉదయం సమీక్షించారు. జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ఇసుక కొరత ఎక్కడ ఉండరాదని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత కూడా సృష్టిస్తున్నారు అనే ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇసుక ఉత్పాదనలో ముందు వరుసలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. స్థానిక సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించుకుని ఇసుక సరఫరాలో ఎటువంటి సమస్యలు, లోపాలు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఇసుక రీచ్ లలో లేదా ఇసుక స్టాక్ పాయింట్ లో సమస్యలు, నిర్వహించలేని పరిస్థితి ఉంటే దాన్ని వ్రాతపూర్వకంగా సమర్పించాలని వాటిని అవసరం మేరకు ప్రభుత్వ విభాగాల ద్వారా నిర్వహించుటకు చర్యలు చేపడతామని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 26 రీచ్ లు పనిచేస్తున్నాయని, ఎక్కడ సమస్య ఉన్నా తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి స్టాక్ పాయింట్ వద్ద ప్రభుత్వ భవనాల నిర్మాణం, గృహ నిర్మాణాలకు వచ్చే వాహనాలకు ప్రత్యేక వరుస ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఇసుకకు వచ్చే వాహనాలకు టోకెన్లు ఉండాలని, వెళ్లే సమయం, గమ్యస్థానానికి చేరే సమయం, వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య కూడా టోకెన్ లో ముద్రించాలని ఆయన సూచించారు. ప్రతి రీచ్ వారీగా పక్కాగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. టెక్కలిలో గురు వారం నాటికి స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.  సమస్యలు ఉంటే వాటిని దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉంచరాదని, వాటిని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకు రావడం వలన అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ చెప్పారు. గనుల శాఖ, ఎస్.ఇ.బి సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. 

 జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు ప్రత్యేక వరసలు ఉండటం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.  జేపీ గ్రూప్ సీఈఓ వి.ఎం.విష్ణునాథ్  మాట్లాడుతూ జిల్లాలో 19 రీచ్ లలో మ్యాన్యువల్ నుండి యంత్రాలు  ఉపయోగించుటకు అనుమతులు కోరామన్నారు. గృహ నిర్మాణాలకు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు.జగనన్న గృహ నిర్మాణాలకు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఇసుక కొరత ఉండబోదని ఎప్పటికప్పుడు ఇసుక సరఫరా చేయుటకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. స్టాక్ పాయింట్ వద్ద ఇసుక ప్రదర్శించనున్నారని, అదే అంశాన్ని ప్రజలకు పత్రికల ద్వారా తెలియజేయుటకు కూడా చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. కనీస ధరతో గమ్య స్థానం వరకు చేరుటకు అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. టెక్కలి లో దేవదాయ శాఖ భూమిలో స్టాక్ పాయింట్ నిర్వహించడం జరుగుతుందని, మరో రెండు సంవత్సరాలు నిరభ్యంతర పత్రం జారీ ద్వారా స్టాక్ పాయింట్ నిర్వహించే పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఈబి ఏఎస్పి కే. శ్రీనివాసరావు, గనుల శాఖ ఉపసంచాలకులు సిహెచ్ . సూర్య చందర్రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.గణపతి, ప్రజా ఆరోగ్య శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ పి. సుగుణకరరావు,  వివిధ శాఖల ఇంజనీర్లు, జేపీ గ్రూప్ మేనేజర్ ఎన్. గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-05 09:26:59

పరిశుభ్రత కోసం తల్లుల్లో అవగాహన పెంచాలి..

పరిశుభ్రత కోసం పిల్లలు తమ తల్లుల్లో అవగాహన పరచాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ విద్యార్థులకు సూచించారు.  మంగళవారం స్వేచ్ఛ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభ కార్యక్రమంనకు శ్రీకాకుళంలో ఏవియన్ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల నుండి హాజరైన అనంతరం పాఠశాల విద్యార్థులతో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడారు. పాఠశాలలో రన్నింగ్ వాటర్ వస్తుందా లేదా అని అడుగగా రన్నింగ్ వాటర్ వస్తుందని విద్యార్థులు తెలియజేశారు.  గతంలో ఫ్యాన్ లు ఎన్ని ఉన్నాయని కలెక్టర్ విద్యార్థులను అడుగగా కారుణ్య అనే విద్యార్థి మాట్లాడుతూ  గతంలో రూంలో ఒక ఫ్యాన్ మాత్రమే ఉండేదని, ప్రస్తుతం 8 ఫ్యాన్లు ఉన్నాయని కలెక్టర్ కు వివరించారు.  మేఘన అనే విద్యార్థి మాట్లాడుతూ గతంలో పెయింటింగ్ ఉండేది కాదని, ప్రస్తుతం పాఠశాలలో పెయింటింగ్, బాలికలకు, బాలురకు వేరు, వేరుగా మరుగుదొడ్లు ఉన్నాయని తెలిపారు. పాఠశాల నాడు ఎలా ఉందని, ప్రస్తుతం ఎలా ఉందని విద్యార్థులను అడుగగా  నేడు కలెక్టర్ అడుగగా గతంలో కంటే ప్రస్తుతం చాలా బాగుందని విద్యార్థులు తెలిపారు.  పరిశుభ్రత విషయంలో ఎలాంటి సిగ్గు లేకుండా తల్లులకు కూడా పరిశుభ్రత గూర్చి అవగాహన పరచాలన్నారు.  మొదటి నుండి శుభ్రత పాటస్తేనే వ్యాదులకు దూరంగా ఉండొచ్చునని తెలిపారు.  భోజనాలు ఎలా పెడుతున్నారు, మెనూ అమలు చేస్తున్నారా లేదా అని కలెక్టర్ విద్యార్థులను అడుగగా భోజనాలు బాగున్నాయని, మెనూ కూడా అమలు చేస్తున్నారని విద్యార్థులు కలెక్టర్ కు వివరించారు. భోజనాలు పై ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.  వంద రూపాయలు నోటు తీసుకొని నోటుపై ఎన్ని భాషలు ఉన్నాయో చూడాలని విద్యార్థులకు ఆయన సూచించారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, ఇన్ ఛార్జ్ డిఇఓ జి.పగడాలమ్మ, సమగ్ర శిక్ష అభియాన్ ఏపిసి తిరుమల చైతన్య, పి.ఇందిరామణి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-05 07:52:48

బాలికల ఆరోగ్య పరిశుభ్రతే ప్రభుత్వ ధ్యేయం..

బాలికల ఆరోగ్య పరిశుభ్రతే ధ్యేయం అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చిన్న కారణాల వలన విద్యలో వెనుకబాటు ఉండరాదని, విద్యకు స్వస్తి పలుకరాదని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళ వారం ముఖ్య మంత్రి క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా కిషోర బాలికలకు నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 7 నుండి 12 వ తరగతి వరకు గల కిషోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏదాదికి 120 నాప్కిన్స్ అందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు దాదాపు రు 32 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 23 శాతం మంది బాలికల చదువులు ఆగిపోవడానికి నెలసరి పీరియడ్స్ లో ఏర్పడుతున్న ఇబ్బందులు కారణమని ఐక్యరాజ్య సమితి పారిశుధ్య విభాగం నివేదిక తెలియజేసింది. ఈ అంశాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వయస్సు పరంగా వస్తున్న మార్పుల పట్ల అరోగ్య పరంగా తీసుకోవలసిన సూచనలు, సలహాలు అందించాలని సూచించారు. మహిళా ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, మహిళా పోలీసులు చైతన్యం కల్పించాలని అన్నారు. దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం పట్ల కూడా ప్రతి నెల అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో ఒక మహిళా ఉపాధ్యాయులు, అధ్యాపకులు నోడల్ అధికారిగా నియమించడం జరుగుతోందని చెప్పారు. పర్యావరణ హితంగా డిస్పొజ్ చేయుటకు. రాష్ట్రంలో 6417 ఇన్సినేటర్లు ద్వారా డిస్పోజ్ చేయుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీకాకుళంలో   ఏవియన్ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాకు 22 లక్షల శానిటరీ నాప్కిన్ లు సరఫరా అయ్యాయన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న 5,742, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న 2,731, ప్రాథమిక, ప్రభుత్వ, మున్సిపల్ ఉన్నత పాటశాలల్లో చదువుతున్న 60,391 మంది వెరసి 68,864 మందికి పంపిణీ చేశామన్నారు. శారీరక పరిశుభ్రత గూర్చి అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులను సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, ఇన్ ఛార్జ్ డిఇఓ జి.పగడాలమ్మ, సమగ్ర శిక్ష అభియాన్ ఏపిసి తిరుమల చైతన్య, పి.ఇందిరామణి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-05 07:50:03

శ్రీ సూర్యనారాయణ స్వామివారికి మంత్రి అవంతి పూజలు..

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. సోమవారం అరసవల్లి శ్రీ శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో స్వామి వారికి పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనములు పలికారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్య ప్రకాష్ మంత్రికి సన్మానించి సూర్యనారాయణ స్వామి వారి ఛాయాచిత్ర ఫొటో ను అందజేశారు.  ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ. కిషోర్, తహసీల్దార్ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-04 16:37:18

ఓటరు సవరణకు రాజకీయపార్టీలు సహకరించాలి..

ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ (ఎస్ఎస్ఆర్‌)-2022 కార్య‌క్ర‌మం ద్వారా దోష‌ర‌హిత ఓట‌రు జాబితాల రూప‌క‌ల్ప‌న ప్ర‌క్రియ న‌వంబ‌ర్ 1 నుంచి ప్రారంభం కానుంద‌ని, ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి స‌హ‌క‌రించాల‌ని గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ కోరారు. ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ‌-2022, పోలింగ్ కేంద్రాల హేతుబ‌ద్ధీక‌ర‌ణ, కొత్త‌గా ఓట‌ర్ల న‌మోదు త‌దిత‌ర అంశాల‌పై సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్‌.. అధికారుల‌తో క‌లిసి వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాదుతూ ప్ర‌స్తుతమున్న 4,597 పోలింగ్ కేంద్రాల‌కు అద‌నంగా మ‌రో నాలుగు కేంద్రాల ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు అందిన‌ట్లు తెలిపారు. చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్-ఏపీ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ (ఎస్ఎస్ఆర్‌)-2022 కింద నవంబరు 1వ తేదీన ఇంటిగ్రేటెడ్ ఓటరు జాబితాల ముసాయిదాలను ప్రచురించి, అప్ప‌టి నుంచి నవంబరు 30 వ‌ర‌కు క్లెయిములు, అభ్యంతరాలు స్వీక‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందుకు మాన్యువ‌ల్ విధానంతో పాటు ఎన్‌వీఎస్‌పీ పోర్ట‌ల్‌, ఓట‌ర్ హెల్ప్‌లైన్ యాప్ (వీహెచ్ఏ)ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చ‌న్నారు. 2022, జనవరి 5వ తేదీన ఓటరు జాబితాల తుది ప్రచురణ జ‌ర‌గ‌నుంద‌న్నారు. 2022, జ‌న‌వ‌రి 1 అర్హ‌త తేదీగా కొత్త‌గా ఓట‌రుగా పేరు న‌మోదు చేసుకోవ‌చ్చ‌ని, న‌వంబ‌ర్ 1 నుంచి ఈ ప్ర‌క్రియ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ ఓట‌రుగా న‌మోదు చేయించుకునేలా ప్రోత్స‌హించాల‌న్నారు. న‌వంబ‌ర్ 20, 21 తేదీల‌ను స్పెష‌ల్ క్యాంపెయిన్ డేస్‌గా గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకునేలా ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. 2022, జ‌న‌వ‌రి 1 నాటికి 18 ఏళ్లు నిండ‌నున్న విద్యార్థులు ఓట‌ర్లుగా న‌మోదు చేయించుకునేందుకు వీలుగా అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఈ నెల 7, 27వ తేదీల్లో అన్ని ఉన్న‌త విద్యాసంస్థ‌ల్లో ప్ర‌త్యేక శిబిరాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్రమంపై క‌ళాశాల‌ల విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్‌.. అధికారుల‌ను ఆదేశించారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్ (క‌లెక్ట‌రేట్‌) ఎం.జ‌గ‌న్నాథంతో పాటు కె.పోతురాజు (ఐఎన్‌సీ), సీహెచ్ ర‌మేశ్ (బీజేపీ), టి.మధు (సీపీఐ), ఎం.రాజ‌శేఖ‌ర్ (సీపీఐ-ఎం), టి.ర‌మేశ్ (టీడీపీ), ఆర్‌.వెంక‌టేశ్వ‌ర‌రావు (వైఎస్సార్ సీపీ) త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-04 16:21:58

మానవ వనరుల వినియోగం మరింత పెంచాలి..

గిరిజన సహకార సంస్థలో నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలంటే శతశాతం మానవనరుల వినియోగాన్ని పెంచి ప్రణాళికా ప్రకారం ముందుకి వెళితే ఫలితాలు వస్తాయని జిసిసి చైర్మన్ డా.శోభస్వాతీరాణ పేర్కొన్నారు. సోమవారం విశాఖలోని జిసిసి సమావేశ మందిరంలో  ఎండీ పీఏశోభ, ఇతర డివిజనల్ మేనేజర్లలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన అంశాలను ప్రస్తావించారు. జిసిసి ఉత్పత్తులపై అన్ని వర్గాల ప్రజలకు అపార నమ్మకం వచ్చేవిధంగా నాణ్యతలో రాజీ పడకుండా తయారు చేయాలన్నారు. జిసిసి ద్వారా గిరిజనులకు సకాలంలో నిత్యవసర వస్తువులు అందించాలన్నారు. పెట్రోలు బంకులు, గ్యాస్ ఏజెన్సీల్లో అక్రమాలు జరగకుండా చూడాలని, అలాంటివి గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టు, ఇతర ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రాంతాల వద్ద జిసిసి స్టాల్స్ ను ఏర్పాటు చేసి ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు సరుకులు తరలించే విషయమై సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి కేంద్రాల జాబితా జెసి, ఐటీడీఏ పీఓ ద్వారా సకాలంలో తీసుకొని వాటిపై గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. గిరిజన రైతులకు స్వల్పకాలిక రుణాలు ఇచ్చే విషయంలో సత్వరమే స్పందించి గిరిజనులకు అండగా నిలవాలన్నారు. అటవీ ఫలసాయాల కొనుగోలు 523 లక్షల టార్గెట్ కు 242 లక్షలు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోవడంపై చైర్మన్ అసంత్రుప్తి వ్యక్తం చేశారు. అనుకున్న లక్ష్యం కంటే అధికంగా కొనుగోలు జరిగేలా  చూడాలని జిసిసి ఎండీకి సూచించారు. ఈ కార్యక్రమంలో  డివిజన్ మేనేజర్లు, సొసైటీ మేనేజర్లు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-04 15:28:32