1 ENS Live Breaking News

బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లో చేపలవేట నిషేధం.. ఫిషరీష్ డిడి నిర్మలాకుమారి..

తీరప్రాంత మత్స్యకారులు బంగ్లాదేశ్ సముద్రతీర ప్రాంతంలో అక్టోబరు 4 నుంచి 25వ తేదీ వరకూ చేపల వేటకు వెళ్లకుండా నిషేధించినట్టు మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలియజేశారు. విజయనగరంలో  శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు.  బంగ్లాదేశ్ ప్రభుత్వం తల్లి హిల్సా(పులస) చేపల సంరక్షణ కోసం మదర్ హిల్సా ప్రొటెక్షన్ క్యాంపైన్ 21 రోజులపాటు నిర్వహిస్తున్నదన్నారు. ఆ సమయంలో అక్కడ చేపల వేట, అమ్మకం, రవాణా అన్ని కార్యకాలపాల పైని నిషేధం విధించిందని తెలియజేశారు. ఆ సమయంలో  మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఏపీ మత్స్యశాఖ నుంచి హెచ్చరికలు జారీచేశామన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి బంగ్లాదేశ్ సముద్రజాల్లో ప్రవేశించినా, వేట చేపట్టినా అక్కడి నేవి, కోస్ట్ గార్డ్ దళాలు అరెస్టులు చేసి బోట్లను సీజ్ చేయడంతోపాటు, పెనాల్టీలు కూడా విధిస్తారన్నాని హెచ్చరించారు. మత్స్యకారులు ఈ విషయాన్ని గమనించి ఆ ప్రదేశాల్లో చేపల వేటకు వెళ్లకూడదని  ఆమె సూచించారు.

Vizianagaram

2021-10-08 14:20:28

దిశయాప్ తో మహిళల దశను మార్చవచ్చు..

స్త్రీ, పురుష బేధం లేకుండా ప్రతి ఒక్కరూ దిశా యాప్ డౌన్లోడ్ చేసు కోవడం ద్వారా మహిళల పై దాడులు సంఖ్యను తగ్గించ వచ్చని జిల్లా కలెక్టర్ ఎ సూర్య కుమారి పేర్కొన్నారు. ఎస్.సి, ఎస్.టి దాడుల  నిరోధ చట్టం జాతీయ స్థాయి లో ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో దిశా యాప్ ఉందని అన్నారు.  కలెక్టరేట్ ఆడిటోరియం లో శుక్రవారం ఎస్.సి, ఎస్.టి  దాడుల నిరోధ చట్టం  పై జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.  ఎస్.సి, ఎస్.టి ల పై జరిగిన దాడులకు సంబంధించిన కేస్ లను సమీక్షిస్తూ మహిళల పై దాడులు జరిగేటప్పుడు వెంటనే నిరోధించడానికి దిశా యాప్ ఉపయోగపడుతుందన్నారు. ఇటీవల పూస పాటిరేగ మండలం చౌడువాడ లో ఒక అమ్మాయి పై జరిగిన దాడిని దిశా ద్వారానే వెంటనే ఆపగలిగామని ఉదహరించారు. ఈ కేస్ పట్ల పోలీస్ , ఇతర అధికారులు వెంటనే స్పందించి బాధితురాలును రక్షించినందుకు మొత్తం బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ చౌడువాడ  బాధితురాల పట్ల ఏ విధంగా వ్యవరించింది, రక్షించింది వివరించారు.   దిశా యాప్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని కలెక్టర్ పోలీస్ అధికార్లకు సూచించారు. 
ఎజెండా  వివరాలను  వెల్లడిస్తూ ఈ త్రై మాసికం లో ఎస్.సి, ఎస్.టి ల పై 39 కేస్ లు నమో దైనాయని,  అందులో 9 కేస్ లు రెఫర్ అయ్యాయని, 30 కేస్ కు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయని సోషల్ వెల్ఫేర్ డి డి తెలిపారు. గతం లో నమోదైన 54 కేస్ లకు గాను 81.85 లక్షల పరిహారాన్ని అందించడం జరిగిందన్నారు.  కలెక్టర్ స్పందిస్తూ కేస్ ల సత్వర పరిష్కారానికి కావలసిన కుల ధ్రువ పత్రాలు, లీగల్ ఒపినిఒన్స్ ను త్వరగా ఇవ్వాలని డి.ఆర్.ఓ కు, ఎపిపి  సూచించారు. ఈ చట్టం పై సభ్యులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని,  చట్టం లో ఏ ఏ అంశాలు ఉంటాయో తెలిస్తే సభ్యులు స్పష్టముగా ప్రశ్నిస్తారని అన్నారు. ప్రతి నెల 30 న అన్ని మండలాల్లో పౌర హక్కుల పై సమావేశం నిర్వహించాలని, మండల స్థాయి మినిట్స్ తో  జిల్లా స్థాయి సమావేశానికి హాజరవ్వాలని అన్నారు. ఆ మేరకు తఃసిల్దార్లకు సర్కులర్ ఇవ్వాలని డి.ఆర్.ఓ కు సూచించారు.  ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ ఆసరా జె.వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు. జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-08 08:15:02

లంబసింగి సిగలో చారిత్రిక మణిపూస..

ప్రకృతి సహజ సిద్ధమైన రమణీయ అందాలతో అలరారుతున్న ఆంధ్రా కాశ్మీరం లంబసింగిలో అరుదైన విశేషాలతో అందమైన ఉద్యానవనం మధ్యన రూపుదిద్దుకోనున్న గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు మరో ప్రధాన ఆకర్షణకానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు.విశాఖజిల్లా, చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని తాజంగి గ్రామానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ పాలకులపై సాగించిన సాయుధ పోరాటంలో సుస్థిరమైన స్థానం ఉంది. రక్షిత అడవుల పేరుతో పోడు వ్యవసాయాన్ని నిషేధించిన అప్పటి బ్రిటీష్ పాలకులు ఉపాధి కోల్పోయిన గిరిజనులను లంబసింగి-నర్సీపట్నం రోడ్డు నిర్మాణంలో కూలీలుగా ఉపయోగించుకునేవారు. అయితే గిరిజనులకు సరైన కూలీ కూడా చెల్లించకపోగా వారిపై అత్యాచారాలకు, అకృత్యాలకు పాల్పడేవారు.ఈ నేపథ్యంలోనే బ్రిటీష్ పాలకుల అరాచకాలపై అల్లూరి సీతారామరాజు తాజంగి ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా తిరగబడ్డారు. గాం గంటం దొర, గాం మల్లుదొరలతో కలిసి బ్రిటీష్ పాలకులపై ఇక్కడి నుంచే తిరుగుబాటును లేవనెత్తి బ్రిటీష్ అధికారులను తరిమికొట్టారు. ఈ చారిత్రిక ప్రాశస్థ్యం కలిగి ఉన్న కారణంగానే గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి తాజంగి ప్రాంతాన్ని ఎన్నుకున్నారు.

4 జోన్లుగా ప్రదర్శనలు:
గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థ (టీసీఆర్ టీఎం) ఆధ్వర్యంలో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంను 22 ఎకరాల విస్తీర్ణంలో సముద్ర మట్టానికి 920 మీటర్ల ఎత్తులో రూ.35 కోట్ల రుపాయల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ మ్యూజియం నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయంలో రూ. 20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం, రూ.15 కోట్లను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోంది. దీనిలో మ్యూజియం నిర్మాణాలకు రూ. 13 కోట్లను వినియోగించనున్నారు. ఈ మ్యూజియంకు సంబంధించిన ప్రధాన భవనాన్ని అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరులు గంటందొర, మల్లు దొర చేబట్టిన విల్లు, బాణాలను గుర్తుకు తెచ్చే రీతిలో అధునాతనంగా డిజైన్ చేసారు. యాంపి థియేటర్ తో పాటుగా వివిధ అంశాల ప్రదర్శనలోనూ డిజిటల్ టెక్నాలజీని, ఆడియో, వీడియో విధానాలను రూ.5 కోట్లతో సమకూర్చనున్నారు. మ్యూజియం గోడలను, పై కప్పును సాంప్రదాయకమైన గిరిజన కళాకృతులతో అలంకరించనున్నారు. రూ. 10 కోట్ల వ్యయంతో మ్యూజియం పరిసర ప్రాంతాలను పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే అందమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దనున్నారు. మరో రూ.6 కోట్ల వ్యయంతో పర్యాటకుల కోసం గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఒక ఆధునికమైన రెస్టారెంట్ ను, రిసార్ట్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియంలో ఏ,బీ,సీ,డి అనే నాలుగు జోన్లుగా వివిధ అంశాలను ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన జోన్-ఏ లో ఉండే మూడు గ్యాలరీలలో బ్రిటీష్ ప్రభుత్వం రాకకు పూర్వం ఉన్న గిరిజనుల పరిస్థితులు, అప్పటి గిరిజనుల జీవన విధానం, వారికి సంబంధించిన సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక స్థితిగతులను గురించి తెలియజేసే ప్రదర్శనలు ఉంటాయి. జోన్-బి లో గిరిజనుల జీవితాల్లోకి బ్రిటీష్ పాలకు చొరబడిన కాలమాన పరిస్థితులను ప్రదర్శిస్తారు. వీటి ద్వారా సందర్శకులు ఆనాటి పరిస్థితులను అనుభూతి చెందే విధంగా వృక్ష జంతు జాలాలను కళ్లకు కడుతూ  డిజిటల్ ఆడియో, వీడియో విధానాలను కూడా ఏర్పాటు చేస్తారు. జోన్-సీ లో బ్రిటీష్ పాలకుల అరాచకాలపై గిరిజనుల్లో వచ్చిన తిరుగుబాటు, స్వాతంత్ర్యం కోసం వారు చేసిన పోరాటాలను తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. జోన్-డీ లో స్వాతంత్ర్యానంతరం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గిరిజనుల జీవన ప్రమాణాలను, గిరిజనుల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలను గురించి తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. అక్టోబర్ 8వ తేదీన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఈ మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

2023 మార్చి నాటికి పూర్తి చేస్తాం: పుష్ప శ్రీవాణి
ప్రస్తుతం ఉన్న గిరిజన మ్యూజియంల కంటే భిన్నంగా, అత్యాధునికమైన సాంకేతిక విధానాలతో సర్వ సౌకర్యాలతో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంను నిర్మించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లు దొరలకు సంబంధించిన విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రదర్శించే అంశాలు ఈ మ్యూజియంను సందర్శించే పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని చెప్పారు. 22 నెలల కాలంలో ఈ మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టున్నామని 2023 మార్చి నాటికి ఈ మ్యూజియం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని వివరించారు.

Lambasingi

2021-10-07 16:05:28

జిల్లా ఆర్థికాభివృద్ధికి బ్యాంకులే కీలకం..

ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పథకాలను అందజేయడంలో బ్యాంకులు ముఖ్య భూమికను పోషించాలని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. గురువారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సాంవత్సరిక రుణ ప్రణాళిక (Annual Credit Plan) అమలు పై జరిగిన సమీక్షా  సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో వ్యవసాయ, ఉపాధి, పారిశ్రామిక, డ్వాక్రా, పశుసంవర్ధక, మత్స్య, వాణిజ్య రంగాల స్వయం సమృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.  వివిధ రంగాలకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు బ్యాంకుల తోడ్పాటు గురించి ఆయన సమీక్షించారు. బ్యాంకింగ్ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో గ్రామ స్థాయి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆసరా’ పథకం ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్నారని బ్యాంకులు వీరికి ఇతోధికంగా సహకరించాలన్నారు.  జిల్లాలో నాబార్డ్ చేపడుతున్న కార్యక్రమాలను గూర్చిన కరదీపికను విడుదలచేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాల రెడ్డి, పి.అరుణ్ బాబు, కల్పనా కుమారి పి.డి. డి.ఆర్.డి.ఎ. విశ్వేశ్వరరావు, వ్యవసాయ శాఖ జెడి లీలావతి, మత్స్య శాఖ జెడి లక్ష్మణరావు,  పశుసంవర్ధక జెడి రామకృష్ణ ఉద్యానవన శాఖ డిడి గోపీనాథ్, పరిశ్రమల శాఖ డి.ఎం. రామలింగరాజు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనాథ్ ప్రసాద్ వివిధ బ్యాంకుల   అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-07 14:50:16

రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట..

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ   వారి అభివృద్దికై  ఆర్ధిక చేయూత నందిస్తూ మహిళలను అన్ని రంగాలలో    అగ్రస్థానం లో నిలబెడుతున్నదని  రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక వి.ఎం.ఆర్.డి.ఎ., చిల్డ్రన్ ఎరినాలో  రెండవ విడత  వై.ఎస్.ఆర్. ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఒంగోలులో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి రెండవ విడత  వై.ఎస్.ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించగా  జిల్లా నుండి వీడియో కాన్పరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు.   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి అని నామినేటెడ్, డైరక్టర్ తదితర పోస్టులను మహిళలకే కేటాయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తన పాదయాత్రలో  ఇచ్చిన హామీలను తూ.చ తప్పకుండా పాటిస్తూ  మహిళలకు  ఆర్ధిక చేయూత నందించి వారు  స్వయం శక్తితో  నిలబడే విదంగా  కృషి చేస్తున్నారన్నారు.  గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ సమయంలో  ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికి  తాను ఇచ్చిన మాట ప్రకారం  మొదటి విడత వై.ఎస్.ఆర్ ఆసరా  పథకాన్ని  అమలు చేసారన్నారు. దేశంలో ఎక్కడా లేని  విదంగా  అత్యదిక టెస్టులు, వ్యాక్సినేషన్ వేసిన ఘనత మన రాష్ట్రానిదే అన్నారు.  ఎవరి రికమండేషన్ లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి  కులమతాలు, పార్టీల కతీతంగా సంక్షేమ పథకాలను పారదర్శకంగా నూటికి నూరు శాతం అందజేస్తున్నారన్నారు. రాష్ట్రంలో  23 రకాల పథకాలు ప్రస్తుతం అమలు జరుగుతున్నాయన్నారు. ఈ పథకాలు ద్వారా ప్రతి కుటుంబం సంవత్సరానికి  50 వేల నుండి లక్ష రూపాయల వరకు లబ్ది పొందుతున్నారన్నారు.  దేశంలో ఎక్కడా లేని విదంగా సంక్షేమ కేలండరును అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అని కొనియాడారు. ఆడపిల్ల సంరక్షణకై  దిశ చట్టాన్ని  పెట్టి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు.  జగనన్న విద్యాకానుక  కిట్ అన్ని ప్రభుత్వ పాఠశాలలో  అందిస్తున్నారన్నారు. 
జిల్లా కలెక్టర్  డా.ఎ.మల్లిఖార్టున మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళలకు ఆర్ధిక స్వావలంబన కల్పిస్తున్నారన్నారు.   రెండవ విడత  వై.ఎస్.ఆర్ ఆసరా క్రింద 63,991 ఎస్.హెచ్.జి గ్రూపులకు  రూ.470 కోట్లు  వారి ఖాతాలలో నేరుగా జమ అవుతున్నాయని తెలిపారు.  ఈ సందర్భంగా చెక్కును  రాష్ట్ర మంత్రితో కలిసి అందజెసారు.  నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ  జి.వి.ఎం.సి పరిధిలో సుమారు 22వేల పొదుపు సంఘాలు సుమారు   రూ 156 కోట్ల  ఆర్దిక లబ్ది పొందుతున్నారన్నారు.  స్వయం సహాయక సభ్యులు తరుపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలను తెలియజేసికుంటున్నామన్నారు.  
విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం.వి.వి.సత్యన్నారాయణ మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి  అమలు చేస్తున్న నవరత్నాలులో భాగంగా  అన్ని వర్గాల మహిళలు, వృద్దులకు  పలు  సంక్షేమ పథకాలను  అందిస్తూ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండే విదంగా పరిపాలిస్తున్నారని, ఆయన పరిపాలనలో తాను భాగస్వామ్యం అవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.  వి.ఎం.ఆర్.డి.ఎ. చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల మాట్లాడుతూ  మహిళా సంఘాలకు ముందుగానే దసరా పండుగ వచ్చిందని  మన ప్రియతమ ముఖ్యమంత్రి మహిళలు అప్పులు బారిన పడకుండా  వారిని లక్షాదికారులుగా చేసేందుకు  స్వయం శక్తితో ఉపాధి కల్పిస్తున్నారని  ఈ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు కన్నబాబురాజు, తిప్పల నాగిరెడ్డి, అధీప్ రాజు, కార్పోరేటర్లు, పలు కార్పోరేషన్ల చైర్మన్ లు, అధిక సంఖ్యలో ఎస్.హెచ్.జి. గ్రూపు సభ్యులు హాజరైయారు.  

Visakhapatnam

2021-10-07 14:49:02

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి..

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం కోరారు. గురు వారం ఆమదాలవలస మార్కెట్ యార్డ్ లో వైయస్సార్ ఆసరా రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. వైయస్సార్ ఆసరా రెండో విడత మొత్తాన్ని  డ్వాక్రా మహిళల గ్రూపు సభ్యుల అకౌంట్లో నేరుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వేయటానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల నుండి వచ్చిన అద్భుతమైన పథకం ఆసరా అన్నారు. ఈ పథకం గూర్చి గత ఎన్నికల్లో అక్క చెల్లెమ్మలకు  వాగ్దానం చేశారని ఆయన తెలిపారు. పాద యాత్ర లో అగ్రిగోల్డ్ లో నష్టపోయామని జగన్ ను కలిసి బాధలు తెలియజేసిన అక్క, చెల్లమ్మ లకు ప్రభుత్వం అధికారంలోకి వస్తే  మీ నష్టపరిహారాన్ని చెల్లిస్తానని ఆనాడే వాగ్దానం చేశారని చెప్పారు. డ్వాక్రా సంఘాల చెల్లెమ్మలకు, అగ్రిగోల్డ్ బాధితులకు మాట ఇచ్చి నిలబెట్టుకున్న మహోన్నతమైన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వాగ్దానం ఇస్తే దానిని నెరవేర్చుతారని ఆయన చెప్పారు. ఆనాడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఈనాడు జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థిక స్వావలంబన తో అభివృద్ధి చెందాలని స్పీకర్ తమ్మినేని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస జెడ్ పి టి సి బెండి గోవిందరావు, బూర్జ ఎంపీపీ కర్ణేన దీప, జెడ్ పి టి సి బెజ్జిపూరపు రామారావు, బుడుమూరు సూర్యారావు, పొందూరు జడ్పిటిసి లోలుగు కాంతారావు, బొడ్డేపల్లి రమేష్ కుమార్, జె జే మోహన్ రావు,  మెప్మ పి డి ఎమ్. కిరణ్ కుమార్, తాహసిల్దార్ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, ఆమదాలవలస ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Amadalavalasa

2021-10-07 14:24:25

నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపండి..

నాటుసారా త‌యారీపై ఉక్కుపాదం మోపాల‌ని, పాత నేర‌గాళ్ల‌పై నిశిత నిఘా ఉంచాల‌ని.. పదేపదే నేరాల‌కు పాల్ప‌డుతున్న‌వారిపై పీడీ చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ అధికారుల‌ను ఆదేశించారు. నాటుసారా, అక్ర‌మ మ‌ద్యం నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై గురువారం సాయంత్రం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్.. పోలీస్‌, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్‌, ఫారెస్ట్ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ పోలీస్‌, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్‌, ఫారెస్ట్ అధికారుల‌తో ప్ర‌త్యేక బృందాలు ఏర్పాటుచేసి దాడుల‌ను ముమ్మ‌రం చేయాల‌ని, జిల్లాలో సారా ఆన‌వాళ్లు లేకుండా చేయాల‌ని ఆదేశించారు. సారా త‌యారీ స్థావరాల‌ను గుర్తించి, ధ్వంసం చేయాల‌న్నారు. అట‌వీ ప్రాంతాలు, లంక‌లు, జిల్లా స‌రిహ‌ద్దులు త‌దిత‌ర ప్రాంతాల్లో నిఘా పెంచాల‌ని, అవ‌స‌ర‌మైతే సారా త‌యారీ స్థావ‌రాల‌ను గుర్తించేందుకు అత్యాధునిక డ్రోన్ ప‌రిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. కీలక ప్రదేశాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి అక్ర‌మ మ‌ద్యం ర‌వాణాను నిర్మూలించాల‌ని ఆదేశించారు. స‌ముద్రం, న‌దుల ద్వారా కూడా అక్ర‌మ మ‌ద్యం ర‌వాణా అయ్యే అవ‌కాశ‌మున్నందున ఆ దిశ‌గా కూడా దృష్టిసారించాల‌ని, యానాం, తెలంగాణా స‌రిహ‌ద్దుల‌పైనా నిఘా ఉంచాల‌ని స్ప‌ష్టం చేశారు. దేవీ న‌వ‌రాత్రుల నేప‌థ్యంలో సారా త‌యారీ, ర‌వాణా కార్య‌క‌లాపాలు పెరిగే అవ‌కాశ‌మున్నందున ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో వాటిని అడ్డుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయల పరిధిలోని మహిళా పోలీసులు, కార్యదర్శుల ద్వారా కాపు సారా తయారి, విక్రయాలపై సమాచారాన్ని సేకరించి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.   స‌మావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీశ,  కాకినాడ అద‌న‌పు ఎస్‌పీ క‌ర‌ణం కుమార్‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం అద‌న‌పు ఎస్‌పీ కె.ల‌తామాధురి; డీఎఫ్‌వో ఐకేవీ రాజు, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ ఎస్‌.ల‌క్ష్మీకాంత్‌  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-07 14:22:08

బోధవ్యాధి నియంత్రకు డిఇసి మాత్రలు తప్పనిసరి..

బోద‌వ్యాధి నిర్మూలించేందుకు ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా, డిఇసి మాత్ర‌ల‌ను వేసుకోవాల‌ని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి కోరారు.  స్థానిక డిఎంఅండ్‌హెచ్ఓ కార్యాల‌యం వ‌ద్ద‌, ఫైలేరియా నివార‌ణ మాత్ర‌లను మ్రింగించే కార్య‌క్ర‌మాన్ని గురువారం లాంఛ‌నంగా ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా డిఎంఅండ్‌హెచ్ఓ ర‌మ‌ణ‌కుమారి మాట్లాడుతూ,  జిల్లాలో బోద వ్యాధిని నిర్మూలించేందుకు ప్ర‌తీఏటా డిఇసి మాత్ర‌ల ఉచిత‌ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. ఒకేసారి జిల్లాలోని అంద‌రికీ మాత్ర‌ల‌ను పంపిణీ చేసి, మ్రింగించ‌డం ద్వారా, ఈ వ్యాధి రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. జిల్లాలో కొన్ని చోట్ల ఫైలేరియా వ్యాధి ఉంద‌ని, వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స‌తో పాటు, శ‌స్త్ర‌చికిత్స‌లు కూడా చేస్తున్నామ‌ని చెప్పారు.  వ్యాధి వ‌చ్చిన త‌రువాత బాధ ప‌డేకంటే, ఇది రాకుండా ముంద‌స్తుగా డిఇసి మాత్ర‌ల‌ను తీసుకోవడం మేల‌ని సూచించారు.   జాతీయ కీట‌క నివార‌ణా కార్య‌క్ర‌మం (ఎన్‌విబిడిసిపి) డిప్యుటీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ రామ‌నాధం మాట్లాడుతూ, రెండు సంవ‌త్స‌రాల లోపు వాళ్లు, గ‌ర్భిణిలు, కేన్స‌ర్‌, అల్స‌ర్‌, కిడ్నీ త‌దిత‌ర దీర్ఘ‌కాలిక వ్యాధిగ్ర‌స్తులు మాత్రం ఈ మందులు వాడ‌కూడ‌ద‌ని చెప్పారు. 2-5 ఏళ్లు మ‌ద్య‌వ‌య‌సు వారు ఒక డిఇసి, ఒక ఆల్బెండ‌జోల్‌, 6-14 మ‌ధ్య వ‌య‌సువారు రెండు డిఇసి, ఒక ఆల్బెండ‌జోల్ మాత్ర‌లు, 15 ఏళ్లు పైబ‌డిన‌వారు 3 డిఇసి, ఒక ఆల్బెండ‌జోల్ మాత్ర‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు.  

            జోన‌ల్ మ‌లేరియా అధికారి డాక్ట‌ర్ తిరుప‌తిరావు మాట్లాడుతూ, డిఇసి మాత్ర‌ల‌ను  ఆహారం తీసుకున్న త‌రువాత ఈ మాత్ర‌మే మింగాల‌ని సూచించారు. ఎవ‌రికైనా కొద్దిగా జ్వ‌రం, వాంతులు వ‌చ్చేన‌ట్టు అనిపించినా ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. జిల్లాలో ఈ విడ‌త‌ 23,42,048 మందికి డిఇసి, ఆల్బెండ‌జోల్‌ మాత్ర‌ల‌ను  పంపిణీ చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని చెప్పారు. దీనికోసం ఆశా, అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు, వ‌లంటీర్లు, ఎఎన్ఎంతో 9,472  బృందాల‌ను ఏర్పాటు చేసి, వారికి శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు తెలిపారు. అలాగే ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు 948 మంది ఆరోగ్య‌సిబ్బందిని సూప‌ర్‌వైజ‌ర్లుగా నియ‌మించిన‌ట్లు  తెలిపారు.  ఈ కార్య‌క్ర‌మంలో అడిష‌న‌ల్ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎల్‌.రామ్మోహ‌న్‌, డిఐఓ డాక్ట‌ర్ నారాయ‌ణ‌, జిల్లా మ‌లేరియా అధికారి ఎం.తుల‌సి,  మ‌లేరియా క‌న్స‌ల్టెంట్ రామ‌చంద్రుడు, అర్బ‌న్ ఫైలేరియా యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-07 09:41:20

విశాఖ జిల్లాలోనూ మొబైల్ వేక్సిన్ వాహనసేవలు..

విశాఖ జిల్లాలో అందుబాటులోకి వచ్చిన మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలు (టీకా ఎక్స్ ప్రెస్ లు) సేవలను  సద్వినియోగం చేసుకోవాలని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వాహనాలను (టీకా ఎక్స్ ప్రెస్ లు) ను ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ కేర్ ఇండియా సహకారంతో  జిల్లాకు 3 టీకా ఎక్స్ ప్రెస్ వాహనాలు  అందుబాటులోకి వచ్చాయని, పాడేరు, చింతపల్లి, అరకు ప్రధాన  స్థావరాలుగా ఈ వాహనాలు పని చేస్తాయని తెలిపారు.  ఈ వాహనాల ద్వారా  జిల్లాలోని గిరిజన ప్రాంతాలు, హైరిస్క్ ప్రాంతాలలో  వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున  అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు  మొదటి డోసు, రెండవ డోసు తీసుకోలేని వారితో  పాటు 18 సంవత్సరాలు దాటిన వారందరికి  కోవిడ్ టీకాలు వేయడం జరుగుతుందన్నారు.  వ్యాక్సినేషన్ తక్కువగా అయిన ప్రాంతాలలో మొభైల్ వ్యాక్సనేషన్  ద్వారా ముమ్మరంగా చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజెషన్ అధికారి డా. ఎస్.జీవనరాణి, మాస్ మీడియా అధికారి  జయ ప్రసాద్, రత్నకుమారి,  కేర్ ఇండియా ప్రతినిధి  సుబ్రమణ్యం, గణాంక అధికారి రామచంద్రరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-10-07 09:18:11

ఏపీలో వైద్యరంగం మరింత బలోపేతం..

ఆంధ్రప్రదేశ్ లో వైద్య రంగాన్ని బలోపేతంచేసి  ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గురువారం విశాఖలోని ఛాతి ఆసుపత్రిలో,  పీఎం కేర్స్ ద్వారా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి  ప్రారంభించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల చెస్ట్ ఆసుపత్రిలో ఉన్న 300 బెడ్స్ కు గానూ 100 బెడ్స్ కు ఆక్సిజన్ సౌకర్యం ఉంటుందని అన్నారు. ప్రెషర్ స్వింగ్ అడ్సోప్షన్ (PSA plant) విధానంలో ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లు అవసరం లేకుండా.. ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేలా ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం విశేషమన్నారు. కేంద్రం 80 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల భాగస్వామ్యంతో మొత్తంగా.. 130 కోట్ల రూపాయలతో 1000 LPM సామర్థ్యం తో ఈ ప్లాంట్ నిర్మితమైందని అన్నారు. ఆధునాతనమైన ఈ ప్లాంట్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అన్నారు. తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు వైద్యం కోసం విశాఖపై ఆధారపడి ఉన్నాయని.. ఈ అవసరాలు గుర్తించే నగరంలోని ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుతం అభివృద్ధి చేస్తోందని అన్నారు. మొదటి వేవ్ లో  ఆక్సిజన్ సిలిండర్ల అవసరం అంతగా లేకపోయినా.. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో మరణాలు ఎక్కువగా సంభవించడం బాధాకరమని అన్నారు. థర్డ్ వేవ్ రాకూడదనే కోరుకుందామని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులకు పూర్తి సన్నద్దంగా ఉందని అన్నారు. ప్రజలంతా  కరోనా నిబంధనలు పాటించాలని.. పండుగల సమయం కావడంతో ఎటువంటి అలసత్వానికి ఆస్కారం ఇవ్వొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, వీఎం ఆర్డీఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, వైద్య శాఖ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ( ఐ పి ఎస్.ఎమ్ ఐ డి సి) ,  పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-10-07 07:13:13

టిటిడి ట్రస్టుబోర్డు సభ్యుడిగా జె.రామేశ్వ‌రరావు ..

తిరుమలతిరుపతి దేవస్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా  జె.రామేశ్వ‌ర రావు గురువారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి జె.రామేశ్వ‌ర రావుచే ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం అద‌న‌పు ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు  రమేష్ బాబు,  సుధారాణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-07 04:28:36

విమానాశ్రయ పర్యావరణం స్వచ్చతకు చర్యలు..

విమానాశ్రయ పర్యావరణం, పరిసరాలు  పరిశుభ్రంగా  వుండే విధంగా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు ఏ.మల్లికార్టున అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో నిర్వహించిన విమానాశ్రయ పర్యావరణ నిర్వహణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఎన్ఎస్ డేగ, విమానాశ్రయం, పోర్టు, జివియంసి, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.   విమానాశ్రయం చుట్టుప్రక్కల పరిశుభ్రంగా వుంచాలని, మాంస దుకాణాలు తొలగించాలని, పారిశుధ్యపనులు చేపట్టాలని జివియంసి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు మేఘాద్రిగెడ్డ, కొండగెడ్డల నీరు విమానాశ్రయంలోనికి రాకుండా తగిన నిర్మాణాలు, పూడిక తీత పనులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులు చూసుకోవాలన్నారు.  విమానాశ్రయం లోనికి పందులు, కుక్కలు మొదలైనవి చొరబడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.   ఈ సమావేశంలో  విమానాశ్రయ డైరక్టర్ కె.శ్రీనివాసరావు, ఎజియం స్టాలన్ కుమార్, ఐఎన్ఎస్ డేగ అధికారి శశాంక్ గుప్తా, ఆర్డీవో కె.పెంచలకిషోర్, జివియంసి వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి, ఈ.ఈ. రత్నరాజు, ఇరిగేషన్ ఎస్.ఈ. కె.ఎస్.కుమార్, పోర్టుట్రస్ట్ ఎస్.ఈ. జి.వి.ఎస్.నారాయణ, హెచ్ పి సి ఎల్ అధికారి కమలేష్ సాహు తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2021-10-06 17:11:52

బ్రహ్మోత్సవాల పై ట్రీనీ ఐఏఎస్ లకు శిక్షణ..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ పై  శిక్షణ కోసం ట్రైనీ ఐఏఎస్ లు బుధవారం తిరుపతికి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసేదాకా వారు తిరుమలలో ఉండి అవగాహన కల్పించుకుంటారు. ఇందులోభాగంగా,  తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలన వ్యవహారాలు, ఆలయాల నిర్వహణపై టిటిడి పరిపాలనా భవనం లోని సమావేశ మందిరంలో జేఈవో సదా భార్గవి ట్రైనీ ఐఏఎస్ లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ తో పాటు టీటీడీ లోని అన్ని విభాగాల పరిపాలన గురించి ఆమె తెలియజేశారు.  డిప్యూటీ ఈవోలు  దామోదరం రమణ ప్రసాద్ పాల్గొన్నారు.

Tirumala

2021-10-06 14:26:58

ఎస్సీ, ఎస్టీ కేసులు పెండింగ్ లేకుండా చూడాలి..

విశాఖ జిల్లాలో ఎస్.సి, ఎస్.టి కేసులకు సంబందించి పెండింగ్  లేకుండా పరిశీలించి  వెంటనే  పరిష్కారం  చేయాలని  జిల్లా కలెక్టర్, జిల్లా విజిలెన్స్ మరియు మానటరింగ్ కమిటి చైర్మెన్ డా.ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు.  బుధవారం  స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  డి.వి.ఎం .సి., ఎస్.సి., ఎస్.టి ఎట్రాసిటి  కేసులపై సమావేశాన్ని నిర్వహించారు. 
 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో కులదృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా  పరిశీలించి పెండింగ్ లేకుండా  జారీ చేయాలని ఆదేశించారు. సుదీర్ఝంగా  అపరిష్కృతం కాని కేసులకు సంబందించి  తదుపరి నిర్వహించే సమావేశం లోపల పరిష్కారం చేయాలని  వాటికి సంబందించి ఎటువంటి చర్యలు చేపట్టినది తగు నివేదికను అందజేయాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం  ఎస్.సి., ఎస్.టి ఎట్రాసిటి కేసులకు సంబందించి భాదితులకు సత్వర న్యాయం  చేసే ఉద్దేశ్యంతో    ఆదేశాలు జారీ చేసారన్నారు. భాదిత కేసులకు  పరిహారాన్నిత్వరితగతిన  అందజేయాలన్నారు.  అక్టోబరు నాలుగవ శనివారం డివిజన్  స్థాయి  విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటి సమావేశాన్ని  నిర్వహించి సంబందిత ప్రజా ప్రతినిధులను  ఆహ్వనించాలన్నారు.  జిల్లా కలెక్టర్ స్థాయిలో తాము కూడా పర్యటిస్తామన్నారు. 
అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు బి.సత్యవతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం కోసం, సామాజిక న్యాయం కోసం  పాటు పడుతున్నారని, అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సబ్ డివిజన్ స్థాయి ఎస్.సి., ఎస్.టి మోనటరింగ్ సమావేశాలను ఏర్పాటు చేసినపుడు ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలన్నారు. ప్రతి నెల ‘సివిల్ రైట్స్ డే’ న దళిత గ్రామాలను సందర్శించి అక్కడ ప్రజల సమస్యలను  తెలుసుకొని పరిష్కరించాలన్నారు. 
పాడేరు శాసన సభ్యురాలు కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 2013 నుండి నేటి వరకు పెండింగ్ లో ఉన్న ఎస్.సి., ఎస్.టి  ఎట్రాసిటి కేసులను నిర్దిష్టమైన కాల వ్యవధిలో పరిష్కరించాల్సిందిగా కోరారు.  అదే విదంగా ప్రభుత్వం అందజెస్తున్న జగనన్నతోడు , చేయూత పథకాలకు భగత ఉపతెగ గిరిజన సామాజిక వర్గంలో లేకపోవడం చేత  వారు ఆర్ధిక సహాయాన్ని అందుకోలేక పోతున్నారని, తగు న్యాయం చేయాల్సిందిగా  కలెక్టర్ కు సూచించారు. 
డి.వి.ఎం.సి కమిటి సభ్యులు పి.మల్లేశ్వరరావు, జోసఫ్ మాట్లాడుతూ  ఎస్.సి కార్పోరేషన్ కు సంబందించి నిర్వహిస్తున్న  షాపింగ్ కాంప్లెక్స్ లో 40 సంవత్సరాలు నుండి ఒక్కరికే తక్కువ అద్దేకు  ఇచ్చారని, ఎస్.సి లబ్దిదారులకు చెందిన షాపులను వేరే కులాల వారు అద్దెకు నడుపుతున్నారని, తగు చర్యలు తీసుకోవల్సిందిగా కోరారు. ఎస్.సి., ఎస్.టి బాధితులు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళితే ఎటువంటి స్పందన లేకుండా కేసులను కట్టడం లేదని కనీసం విచారణ కూడా చేపట్టడం లేదని తెలిపారు. పెందుర్తి మండలం నరవలో హౌసింగ్ స్కీమ్ కు సంబందించి స్థలాలను   అగ్ర కులాస్తులు ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ లను కట్టుకొన్నారని తగు చర్యలు తీసుకోవల్సిందిగా కోరారు.  
సాంఘీక సంక్షేమ శాఖ జెడి  రమణమూర్తి మాట్లాడుతూ  జిల్లాలో  (UI) అండర్ ఇన్విస్టి గేషన్ కేసులు  పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో మొత్తం 219 కేసులు  పెండింగ్ కాగా 50 కేసులు పరిష్కారమైయాయని మిగలినవి పెండింగ్ లో ఉన్నాయన్నారు.  PT కేసులు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో 718 పెండింగ్ కాగా  ఒకటి మాత్రమే పరిష్కారమైనదని మిగిలినవి పెండింగ్ లో ఉన్నాయన్నారు. UI కేసులు   146, PT కేసులు 549 పట్టణ సబ్ డివిజన్ పరిధిలో పెండింగ్ లో ఉన్నాయన్నారు.  అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు , చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో UI  కేసులు 78,  PT కేసులు 209 పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  2011 సంవత్సరం నుండి నేటి వరకు లాంగ్ పెండింగ్ లో ఉన్న కేసులను పరిశీలించి సత్వర పరిష్కారం చేయాలన్నారు. 
ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యురాలు  జి.మాధవి, ఎస్.పి బి.కృష్ణారావు,  జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల రెడ్డి, అరుణ్ బాబు, పి.ఓ ఐ.టి.డి.ఎ., గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి.అబిషేక్, విశాఖపట్నం, నర్సీపట్నం ఆర్ డి ఓ లు పెంచల కిశోర్, ఆర్.గోవిందరావు, జిల్లా మరియు  పోలీస్ అధికారులు హాజరైయ్యారు. 

Visakhapatnam

2021-10-06 12:37:52

తరాలు గుర్తుంచుకునేలా వ్యవసాయరంగం అభివ్రుద్ధి..

త‌ర‌త‌రాలు గుర్తుంచుకునేలా రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ప‌టిష్ట వ్య‌వ‌స్థ నిర్మాణం జ‌రుగుతోంద‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార‌, మార్కెటింగ్‌, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు పేర్కొన్నారు. బుధ‌వారం కాకినాడ ర‌మ‌ణ‌య్య‌పేట‌లోని క్యాంపు కార్యాల‌యంలో మంత్రి క‌న్న‌బాబు మీడియా స‌మావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో పెద్దఎత్తున మౌలిక వ‌స‌తుల అభివృద్ధి జ‌రుగుతోంద‌ని, రైతుల‌కు అండ‌గా నిలిచేందుకు వైఎస్సార్ రైతు భ‌రోసా-పీఎం కిసాన్‌, వైఎస్సార్ ఉచిత పంట‌ల బీమా వంటి ప‌థ‌కాల‌ను ప్ర‌భుత్వం అమ‌లుచేస్తోంద‌ని తెలిపారు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఏదైనా విప‌త్తు వ‌ల్ల పంట న‌ష్టం జ‌రిగితే అదే సీజ‌న్‌లో ప‌రిహారం చెల్లిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ముందే చెప్పిన ప్ర‌కారం పెట్టుబ‌డి సాయం ద‌గ్గ‌రి నుంచి పంట న‌ష్ట ప‌రిహారం వ‌ర‌కు ప్ర‌ణాళిక ప్ర‌కారం వివిధ కార్య‌క్ర‌మాల ద్వారా రైతుల‌కు ల‌బ్ధి చేకూర్చుతున్న‌ట్లు వివ‌రించారు. వ్య‌వసాయ విద్యుత్ కనెక్ష‌న్ల‌కు మీట‌ర్లు బిగించ‌డం వ‌ల్ల ఒక్క రూపాయి కూడా రైతుపై భారం ప‌డ‌ద‌ని.. పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో విద్యుత్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ ఉండాల‌నే ఉద్దేశంతో మీట‌ర్ల బిగింపు జ‌రుగుతుంద‌న్నారు. 96 శాతం మంది రైతులు దీనిపై సంతృప్తి వ్య‌క్తం చేశార‌న్నారు. బ‌కాయిలు లేకుండా విద్యుత్ సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లింపులు జ‌రిపేందుకు ఈ విధానం ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ఏ పంట‌కు ఎంత మ‌ద్ద‌తు ధ‌ర అనే స‌మాచారాన్ని రైతు భ‌రోసా కేంద్రాల్లో ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు తెలిపారు. 2020-21లో రాష్ట్రంలో రైతుల నుంచి రూ.15,487 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన‌ట్లు చెప్పారు. గ‌తంలో మాదిరి బీమా ప్రీమియం చెల్లించ‌న‌వ‌స‌రం లేకుండా.. ఈ-క్రాప్ బుకింగ్ చేస్తే చాలు.. పంట బీమా అందుతుంద‌న్నారు. 2019-20, 2020-21 రెండేళ్ల కాలంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నేరుగా రైతుల‌కు మొత్తం రూ.3,716 కోట్ల మేర బీమా చెల్లింపులు చేసిన‌ట్లు తెలిపారు. రూ.15 వేల కోట్ల‌తో గ్రామాల్లో మ‌ల్టీ ప‌ర్ప‌స్ ఫెసిలిటీ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్నామ‌ని.. ఇందులో భాగంగా గ్రామీణ గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌లు, కోల్డ్‌రూంలు,  గ్రేడింగ్ యూనిట్లు త‌దిత‌రాలు ఏర్పాటుకానున్నాయ‌ని వివ‌రించారు. వ్య‌వ‌సాయ, అనుబంధ రంగాల ఉత్ప‌త్తుల‌కు విలువ జోడింపు ల‌క్ష్యంతో ప్ర‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్కటి చొప్పున ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుచేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందుకు దాదాపు రూ.3000 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. వ్య‌వ‌సాయ అడ్వ‌యిజ‌రీ బోర్డుల‌ను ఏర్పాటు చేసి.. ప్ర‌తి నెలా క్ర‌మం త‌ప్ప‌కుండా రాష్ట్ర స్థాయి నుంచి ఆర్‌బీకే స్థాయి వ‌ర‌కు స‌మావేశాలు నిర్వ‌హించి రైతుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటూ వాటి ఆధారంగా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోందంటే రైతుల సంక్షేమంపై ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధి ఏమిటో తెలుస్తోంద‌న్నారు. వైఎస్సార్ రైతు భ‌రోసా-పీఎం కిసాన్ కింద రెండేళ్ల కాలంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.17,030 కోట్ల 23 ల‌క్ష‌లు నేరుగా అందించ‌డం జ‌రిగింద‌న్నారు. రాష్ట్రంలో ఎక్క‌డా ఎరువుల కొర‌త లేద‌ని, ప్ర‌స్తుతం ఏడు ల‌క్ష‌ల 38 వేల ట‌న్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయ‌న్నారు. ఆర్‌బీకేల ద్వారా ఎరువుల స‌ర‌ఫ‌రా జ‌రుగుతున్న‌ట్లు మంత్రి క‌న్న‌బాబు తెలిపారు.
ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ఓ అన్న‌గా ఆలోచించి.. బాధ్య‌త‌తో స్వేచ్ఛ వంటి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ముఖ్య‌మంత్రికి అంద‌రు విద్యార్థినుల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజ‌కీయంగా మ‌హ‌ళ‌ల అభివృద్ధికి ముఖ్య‌మంత్రి కృషిచేస్తున్నార‌న్నారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు, అభివృద్ధికి రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న కార్య‌క్ర‌మాలు, పథ‌కాలు ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా ఉన్నాయ‌న్నారు. మ‌హిళా సాధికార‌త క‌మిటీ త‌ర‌ఫున ఇటీవ‌ల 12 రాష్ట్రాల నుంచి దాదాపు 16 మంది ఎంపీలు విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించార‌ని.. దిశ బిల్లు గురించి తెలుసుకొని, అదే విధంగా రాష్ట్రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను చూసి ఆశ్చ‌ర్యపోయార‌ని తెలిపారు. తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను మెచ్చుకున్నార‌ని ఎంపీ గీత వెల్ల‌డించారు.

Kakinada

2021-10-06 11:56:59