1 ENS Live Breaking News

శాస్త్రోక్తంగా క‌ల్యాణవేంక‌టేశ్వ‌రుని ప‌విత్రోత్స‌వాలు..

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి  పవిత్రోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా జరిగాయి. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హించారు. ఉద‌యం 8.30 నుంచి  10.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఉద‌యం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు,  పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 12 నుండి 1 గంట వ‌ర‌కు స్వామి, అమ్మ‌వారి మూలమూర్తుల‌కు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.  సాయంత్రం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో స్వామి, అమ్మ‌వార్ల ఊరేగింపు నిర్వ‌హించ‌నున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో  పార్వ‌తి, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు  విష్ణుబ‌ట్టాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  నాగ‌రాజు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

Narayanavanam Temple

2021-09-20 09:59:15

హెచ్ఐవీపై యువత అవగాహన పెంచుకోవాలి..

యువ‌త ఆరోగ్యంగా వుంటేనే ఆనందంగా వుంటామ‌నే విష‌యాన్నిగుర్తించి చెడు వ్యస‌నాల‌కు, ప్రలోభాల‌కు లోనుకాకుండా దూరంగా వుండ‌టం ద్వారా త‌మ ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించుకోవాల‌ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్‌.వి.ర‌మ‌ణ కుమారి అన్నారు. హెచ్‌.ఐ.వి. వ్యాప్తి యువ‌త‌లోనే అధికంగా ఉంద‌ని, ఎంద‌రో యువ‌త తెలిసీ తెలియ‌ని వ‌య‌స్సులో ఈ వ్యాధి బారిన ప‌డుతుండ‌టం ఆందోళ‌న‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఇటీవ‌లి కాలంలో హెచ్‌.ఐ.వి. చికిత్సకోసం ఏ.ఆర్‌.టి. కేంద్రాల‌కు వ‌స్తున్న వారిలో 15 నుంచి 30 ఏళ్ల వారే అధికంగా వుంటున్నార‌ని చెప్పారు. యువ‌త ఈ వ్యాధి ప‌ట్ల అప్రమ‌త్తంగా వుండాల‌ని, ఒక‌సారి ఈ వ్యాధికి గురైతే జీవితాంతం మందులు వినియోగించాల్సి వుంటుంద‌ని అందువ‌ల్ల ఈ వ్యాధికి గురికాకుండా స్వీయ‌నియంత్రణ‌తో వుండాల‌న్నారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేర‌కు జిల్లాలో యువ‌త‌కు హెచ్‌.ఐ.వి./ఎయిడ్స్ పై అవ‌గాహ‌న క‌లిగించేందుకోసం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ‌ క‌ళాజాత‌ల ద్వారా చేప‌ట్టిన 20 రోజుల ప్రచార కార్యక్రమాన్ని డి.ఎం.హెచ్‌.ఓ. సోమ‌వారం క‌లెక్టర్ కార్యాల‌యం వ‌ద్ద ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా డా.ర‌మ‌ణ‌కుమారి మాట్లాడుతూ 2030 నాటికి హెచ్‌.ఐ.వి. ర‌హిత దేశంగా నిల‌పాల‌నే ల‌క్ష్యంతో భార‌త ప్రభుత్వం ప‌నిచేస్తోంద‌ని, దీనిలో భాగంగా ప్రజ‌ల్లో దీనిపై వీధినాటిక‌ల ద్వారా అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చేప‌డుతున్నట్టు పేర్కొన్నారు. కోవిడ్ పై కూడా ఈ బృందాలు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ర‌మ‌ణ‌కుమారి కోరారు. ప్రజ‌లు కోవిడ్ బారిన ప‌డ‌కుండా వుండేందుకు త‌ప్పనిస‌రిగా మాస్క్ ధ‌రించ‌డం, భౌతిక‌దూరం పాటించ‌డం, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవ‌డం త‌దిత‌ర అంశాల‌పై ప్రజ‌ల్లో విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కోరారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలు ప‌ర్యవేక్షిస్తున్న అద‌న‌పు వైద్య ఆరోగ్య అధికారి డా.ఎల్‌.రామ్మోహ‌న్ మాట్లాడుతూ రెండు క‌ళాజాత బృందాల ఆధ్వర్యంలో38 వీధినాటిక‌ ప్రద‌ర్శన‌లు నిర్వహించి అవ‌గాహ‌న క‌ల్పిస్తార‌ని పేర్కొన్నారు. ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, వ్యాప్తి చెంద‌కుండా సోక‌కుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాల‌నే అంశంపై క‌ళాబృందాల స‌భ్యులు అవ‌గాహ‌న క‌ల్పిస్తార‌ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ థియేటర్స్‌, స‌హృద‌య న‌ట‌స‌మాఖ్య త‌దిత‌ర రెండు క‌ళా బృందాలు ఈ క‌ళాజాత‌ ప్రద‌ర్శన‌లు నిర్వహిస్తాయ‌ని డి.పి.ఎం. బాలాజీ పేర్కొన్నారు. స‌మాచార శాఖ ఏ.డి. ర‌మేష్‌, జిల్లా పాజిటివ్ నెట్ వ‌ర్కు, వైద్య సిబ్బంది, ఎన్‌.జి.ఓ. ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-20 09:29:07

పూర్ణాహుతితో ముగిసిన అమ్మవారి పవిత్రోత్సవాలు..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల‌పాటు జ‌రిగిన ప‌విత్రో త్స‌వాలు సోమ‌వారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు.ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11.05 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ సంవత్సరం పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తార‌ని చెప్పారు. ప్రతి ఏడాది మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తొంద‌న్నారు. సెప్టెంబ‌రు 18న ప్రారంభ‌మైన పవిత్రోత్స‌వాలు సోమ‌వారం మహాపూర్ణాహుతితో ముగిశాయ‌ని తెలిపారు. కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుగుతున్నందున‌,  ప‌విత్రోత్స‌వాల్లో పాల్గొనాల‌ని భావించే భ‌క్తుల కొర‌కు ఎస్వీబీసి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ సేవ‌లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు వివ‌రించారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ముఖ మండ‌పంలో అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు.  ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో పవిత్రజలాన్ని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శన చక్రాన్ని ముంచి చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి రక్షాబంధనం, ఆచార్య ఋత్విక్‌ సన్మానంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.ఈ కార్యక్రమంలో జెఈవో  స‌దా భార్గ‌వి, ఆలయ డెప్యూటీ ఈవో క‌స్తూరి బాయి, ఏఈవో  ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆల‌య అర్చ‌కులు  బాబుస్వామి, సూపరింటెండెంట్‌  శేష‌గిరి,  టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  రాజేష్ పాల్గొన్నారు.

Tiruchanur

2021-09-20 08:48:12

26, 27 రాష్ట్ర బి.సి. సంక్షేమ కమిటీ పర్యటన..

ఈ నెల 26, 27  తేదీలలో  రాష్ట్ర బి.సి. సంక్షేమ కమిటీ చిత్తూరు  జిల్లాలో పర్యటించ నున్నట్లు  జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్  ఒక ప్రకటన లో తెలిపారు.  రాష్ట్ర బి.సి. సంక్షేమ కమిటీ చైర్మన్  జంగా కృష్ణముర్తి , కమిటీ సభ్యులు (శాసన సభ్యులు)  బొత్సా  అప్పలనరసయ్య,  అన్నమ రెడ్డి అదిప్ రాజు ,  బుర్రా మధుసూదన్ యాదవ్,  ఎన్. వెంకటే గౌడ ,  రమేష్ బాబు సింహాద్రి,   కె. పెద్దిరెడ్డి,   వెంకటరామిరెడ్డి,  బొల్లా బ్రహ్మ నాయుడు, పి. జి. వి. ఆర్. నాయుడు, దువ్వారపు రామారావు ( ఎం ఎల్ సి) లు ఈ నెల 26 న  వెలగపూడి నుండి బయలుదేరి తిరుమల చేరుకొని బస చేస్తారు.  తేది 27 న ఉదయం తిరుమల  శ్రీవారిని దర్శించుకొని, తిరుపతి పద్మావతి  అతిధి గృహం చేరుకుంటారు.  ఉదయం  11.00 గంటల నుండి బి. సి. సంఘాలు, వ్యక్తుల  నుండి  వినతులు స్వీకరించి,  11.30 గంటలకు  టి. టి. డి. లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు ,  మధ్యాహ్నం 2.30 గంటలకు జిల్లా ఉన్నతాదికారులతో అమలు అవుతున్న బి సి సంక్షేమ పథకాలపై  సమీక్ష  నిర్వహించి వై. ఎస్. ఆర్. కడప  బయలు దేరనున్నారని  కలెక్టర్ ఆ ప్రకటన లో తెలిపారు.  

Tirupati

2021-09-20 06:24:36

అప్పన్నకు కాకినాడ ఎంపీ వంగాగీత పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారిని సోమవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ వంగా గీత దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ ఎంపీకి స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎంపీ అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-09-20 03:59:20

తూ.గో. 86 ఎంపీటీసీలు ఏకగ్రీవాలు..4 మరణాలు..

తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం1184 ఎంపీటీసీ స్థానాలు ఉండగా గతంలోనే 86 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఆ తరువాత 4 అభ్యర్ధులు మ్రుతిచెందారు ఆపై 999 స్థానాలకు పోలింగ్ జరిగింది. అందులో వైఎస్సార్సీపీ764 స్థానాలు, టిడిపి 110, జనసేన 93, స్వతంత్రులు 19, బిఎస్పీ1, బిజెపీ 2, సీపీఎం 7, ఐఎన్సీ1, సీట్లు సాధించాయి. ఇకజెడ్పీటీసీలు 61 సీట్లకు వైఎస్సార్సీపీ 58, టిడిపి1, జనసేన1, సమయాభావం, ఓట్లు తడిసిపోవడం ఎంపీటీసీల్లో 2 స్థానాలు, జెడ్పీటీసీల్లో 1 స్థానాలు ఇంకా ప్రకటించాల్సి వుంది. 

Kakinada

2021-09-20 03:42:41

తూ.గో.జి.లో గట్టి పోటీ ఇచ్చిన టిడిపి, జనసేన..

తూర్పుగోదావరి జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీలు బాగానే పోటీ ఇచ్చాయి. టిడిపి అయితే  ఎంపీటీసీల్లో 11శాతం సీట్లును గెలుచుకోగా, జనసేన తొమ్మిది శాతం గెలుచుకున్నాయి. ఇక ఇండిపెండెంట్లు కూడా తమ బలాన్ని నిరూపించుకొని 19 సీట్లను గెలుచుకోగా మిగిలిన స్థానాల్లో సీపీఎం, బిఎస్పీ, ఐఎన్సీ ఒక్కో సీటు గెలుచుకోగా, సీపీఎం ఎప్పటిలోగా 7 సీట్లు,  బీజేపీ 2 సీట్లు గెలుచుకుని అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చాయి.

Kakinada

2021-09-20 02:21:50

తూ.గో.జి.లో వార్ వన్ సైడ్ అయిపోయింది..

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తూర్పోగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. 999 స్థానాలకు వైఎస్సార్సీపీ764 స్థానాలు, టిడిపి 110, జనసేన 93, స్వతంత్రులు 19, బిఎస్పీ1, బిజెపీ 2, సీపీఎం 7, ఐఎన్సీ1, సీట్లు సాధించాయి. ఇకజెడ్పీటీసీలు 61 సీట్లకు వైఎస్సార్సీపీ 58, టిడిపి1, జనసేన1, సమయాభావం, ఓట్లు తడిసిపోవడం ఎంపీటీసీల్లో 2 స్థానాలు, జెడ్పీటీసీల్లో 1 స్థానాలు ఇంకా ప్రకటించాల్సి వుంది. వాటిని అధికారులు ఉదయం 10గంటల తరువాత ప్రకటించే అవకాశం వుందని రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

Kakinada

2021-09-20 02:21:01

కాకినాడ మేయర్ పై అవిశ్వాస తీర్మాణం..

తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో  వైఎస్సార్సీపీలో విభేధాలు రచ్చకెక్కాయి. దీనితో కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్‌పై అక్టోబర్‌ 5న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. నిన్న కలెక్టర్‌ను కలిసిన 33 మంది కార్పొరేటర్లు.. నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ మేరకు మేయర్‌ పావనికి జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ నోటీసులు పంపించారు. నోటీసు తీసుకునేందుకు ఇంట్లో నుంచి మేయర్‌ పావని బయటకు రాకపోవడంతో మేయర్‌ ఇంటి గోడకు అధికారులు నోటీసును అతికించారు. కాకినాడ మేయర్ మార్పు అనివార్యం కానుంది..

Kakinada

2021-09-20 02:19:31

ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్ ప్రక్రియ..

విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌రిష‌త్‌, మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్షులు, ఉపాధ్య‌క్షుల‌ ఎన్నిక‌కు ఆదివారం నోటిఫికేష‌న్ ను జారీ చేసిన‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి చెప్పారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ముగిసిన అనంత‌రం, సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న మండ‌ల ప‌రిష‌త్‌ల‌కు, 25న జిల్లా ప‌రిష‌త్‌కు అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ఆమె ప్రక‌టించారు. జిల్లాలో ప‌రిష‌త్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా ముగిసింద‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. మొత్తం జిల్లాలోని 34 జెడ్‌పిటిసి స్థానాల‌కు గానూ, 3 స్థానాలు ఏక‌గ్రీవంగా వైసిపి గెలుచుకోవ‌డంతో, మిగిలిన‌ 31 స్థానాల‌కు ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టామ‌న్నారు. ఈ 31 స్థానాల‌ను కూడా వైసిపి పార్టీ గెలుచుకుంద‌ని ప్ర‌క‌టించారు. మొత్తం జెడ్‌పిటిసి ఎన్నిక‌ల్లో 9,17,724 ఓట్లు పోల‌య్యాయ‌ని, వాటిని లెక్కించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.
                 జిల్లాలో 549 స్థానాల‌కు గానూ, 55 స్థానాలు ఇదివ‌ర‌కే ఏక‌గ్రీవం అయ్యాయ‌ని, ఎన్నిక‌లు జ‌రిగిన 487 స్థానాల‌కు గానూ పోలైన సుమారు 9,04,302 ఓట్లను ఆదివారం లెక్కించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. వీటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 389 స్థానాల‌ను, టిడిపి 86 స్థానాల‌ను, బిజెపి ఒక స్థానాన్ని, స్వ‌తంత్రులు 11 స్థానాల‌ను గెలుచుకున్నార‌ని చెప్పారు. ఐదుచోట్ల రీకౌంటింగ్ నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. బాడంగిలో ఓట్లు త‌డిచిపోవ‌డంతో, 25 ఓట్ల‌ను ప్ర‌క్క‌కు పెట్ట‌డం జ‌రిగింద‌ని, అయితే అక్క‌డ సుమారు 300 ఓట్ల మెజారిటీతో టిడిపి గెలుపొంద‌డంతో, ఎటువంటి ఇబ్బందీ లేకుండా స‌మ‌స్య ప‌రిష్కారం అయిపోయింద‌ని చెప్పారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు స‌హ‌క‌రించిన రాజ‌కీయ పార్టీల‌కు, ప్ర‌జ‌ల‌కు, అధికారుల‌కు, సిబ్బందికి క‌లెక్ట‌ర్‌ ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీడియా స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-19 15:12:20

టిటిడి ట్రస్టు బోర్డు సభ్యుడిగా టంగుటూరి..

తిరుమల తిరుపతి దేవస్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యుడిగా  టంగుటూరి మారుతిప్రసాద్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీ మారుతిప్రసాద్ కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  రమేష్ బాబు, డెప్యూటీ ఈవో (జనరల్) సుధారాణి, పేష్కార్  శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  

Tirumala

2021-09-19 06:52:54

తూ.గో.జిలో కౌంటింగ్ సర్వం సిద్దం..కలెక్టర్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. శనివారం కాకినాడ అశోక్ నగర్ లో మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కాకినాడ గ్రామీణం, కరప, పిఠాపురం, గొల్లప్రోలు, యూ కొత్తపల్లి మండలాల స్ట్రాంగ్ రూమ్ లను, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ సి.హరికిరణ్, కాకినాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలసి పరిశీలించారు.
   ఈ సందర్భంగా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లేక్కింపు  ప్రక్రియకు సంబంధించి 7డివిజన్ లలో 12 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి అన్ని అంశాల పట్ల శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రాథమిక ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం తుది ఓట్ల లెక్కింపు ప్రారంభించి మూడు రౌండ్లలో లెక్కింపు పూర్తిచేయడం జరుగుతుందని దీనికి అనుగుణంగనే టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 19న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ప్రాథమిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని కలెక్టర్ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల చెందిన కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఎటువైపు నుంచి ఏజెంట్లు, సిబ్బంది రావాలి, బారికేడ్లు ఏర్పాట్లు, తదితర అంశాలపై కలెక్టర్ హరికిరణ్ అధికారులకు పలు సూచనల చేశారు. గొల్లప్రోలు మండలనికి సంబంధించి  శిక్షణకు హాజరయిన కౌంటింగ్ సిబ్బందితో కలెక్టర్ మాట్లాడి, ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన పద్ధతులు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
     అనంతరం కలెక్టర్ హరికిరణ్ రంగరాయ వైద్య కళాశాలలో ఏర్పాటుచేసిన పెదపూడి, సామర్లకోట, తాళ్లరేవు మండలాలకు  సంబంధించిన స్ట్రాంగ్ రూంలను, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
     ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్ని కృష్ణ, డీడీ హార్టికల్చర్ రామ్మోహన్ రావు, సీపీవో పీ.బాలాజీ, ఎమ్ హెచ్వో డా.పృథ్వీచరణ్, కాకినాడ గ్రామీణం  ఎంపీడీవో పీ.నారాయణమూర్తి,
తహసిల్థార్ వీ మురళీకృష్ణ, కరప మండలం ఎంపీడీవో కె.స్వప్న, తహసిల్దార్ విశ్వేశ్వరరావు, పెదపూడి మండలం ఎంపీడీవో పి.విజయభాస్కర్, తహసిల్దార్ టీ.సుభాష్, సామర్లకోట మండల తహసీల్దార్ జితేంద్ర, తాళ్లరేవు మండలం ఎంపీడీవో పి.విజయ్ థామస్, తహసిల్దార్ జీ.చినబాబు, పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-09-18 14:08:37

విశాఖజిల్లాలో కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడండి..

విశాఖజిల్లాలో జడ్పిటిసి ఎంపిటిసి ఓట్ల లెక్కింపు గా చేపట్టి విజయవంతం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఎలా పరిశీలకులు ఎం ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన విశాఖలోని సర్క్యూట్ హౌస్లో జిల్లా పరిషత్ కార్యనిర్వాహణాధికారి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి విశ్వేశ్వరరావు లతో సమావేశమై ఓట్ల లెక్కింపు ప్రక్రియ పై చర్చించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. అనంతరం  ఆయన భీమునిపట్నం ఆనందపురం హలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాట్లను పరిశీలించారు.

Visakhapatnam

2021-09-18 13:48:39

8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కావాలి..

ఎం .పి .టి.సి., జెడ్.పి.టి.సి., ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబందించి అన్ని కౌంటింగ్ హాల్స్ వద్ద ఉదయం 8గంటల కల్లా ప్రారంభించాలని  అందుకు తగిన ఏర్పాట్లుతో సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  ఓట్ల లెక్కింపు    అధికారులను, సిబ్బందిని  ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు  కౌంటింగ్ ఏజెంట్లకు సంబందిత రిటర్నింగ్ అధికారులు గుర్తింపు కార్డులను ఇచ్చి లోపలకు పంపించాలన్నారు.  కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా  సామాజిక దూరం పాటిస్తూ  సీటింగ్ ఏర్పాట్లను చేయాలన్నారు. 
 19వ తేది ఆదివారం ఓట్ల లెక్కింపు పురస్కరించుకొని  శనివారం జిల్లా కలెక్టర్ అనకాపల్లి, మునగపాక, అచ్చుతాపురం మండలాలలో  పర్యటించి  అక్కడ ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ అధికారులు, సిబ్బందితో  కౌంటింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లను  పగడ్భందిగా చేపట్టాలని ఆదేశించారు.  నిరంతర విద్యుత్తు , గాలి, వెలుతురు ఉండాలని  శానిటేషన్, నిరంతర నీటి సౌకర్యం, తదితర మౌళిక వసతులతో సిద్దంగా ఉండాలన్నారు.  అచ్చుతాపురం జెడ్.పి.హెచ్ స్కూల్ లో చదువుతున్న విద్యార్ధులతో కలెక్టర్ మాట్లాడారు. వారితో కలిసి మధ్యాహ్నం బోజనం చేసారు. మెనూ సక్రమంగా అమలు చేస్తున్నదీ లేనిదీ అక్కడి విద్యార్ధులతోను, టీచర్లతోను అడిగి తెలుసుకున్నారు. విద్యార్దులు తమ పాఠశాలలో ఆట స్థలం  పాడైపోయిందని, బాగు చేయించాలని కోరగా అందుకు కలెక్టర్ స్పందిస్తూ నాడు – నేడు పనులలో భాగంగా గ్రౌండుకు మరమ్మత్తులను చేయించాలని  ప్రధానోపద్యాయులను  ఆదేశించారు.  
 కలెక్టర్ పర్యటనలో అనకాపల్లి ఆర్.డి.ఓ., సీతారామరావు, నియోజక వర్గ ప్రత్యేక అధికారులు,ఇతర అధికారులు హాజరైయారు. 

Visakhapatnam

2021-09-18 13:39:49