1 ENS Live Breaking News

తూ.గో.జి.లో 38వేల ఎకరాల్లో బిందుసేద్యం..

తూర్పుగోదావరి జిల్లాలో 38వేల హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం చేపడుతున్నట్టు ఏపీఎంఐపీ పీడి డా.రామ్మోహన్ తెలియజేశారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 30వేల మంది రైతులకు ఈ ప్రాజెక్టును దగ్గర చేశామన్నారు. అన్ని రకాల పంటలకు ఈ సేద్యాన్ని రైతులకు దగ్గర చేయాలనే లక్ష్యంతో ముందుకి వెళుతున్నట్టు ఆయన వివరించారు. త్వరలోనే వీటిని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు చేరువ చేయడంతోపాటు, సామాగ్రిని కూడా అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అన్నిరకాల పంటలకు బిందు, తుంపర సేద్యాన్ని వినియోగించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీఎంఐపీ పీడి వివరించారు.

Kakinada

2021-09-13 06:15:07

తూ.గో.జి.లో 2950 ఎకరాల్లో సెరీకల్చర్ సాగు..

తూర్పుగోదావరి జిల్లాలో 2950 ఎకరాల్లో సెరీకల్చర్ సాగుచేపడుతున్నట్టు సెరీకల్చర్ డెప్యూటీ డైరెక్టర్ బిఎంవీ రామరాజు తెలియజేశారు. సోమవారం కాకినాడ తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పట్టుపరిశ్రమను అభివ్రుద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం నియమించిన 11 మంది(ఒక్క పోస్టు భర్తీకాలేదు) విలేజ్ సెరీ కల్చర్ సిబ్బంది రైతులకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. సాగు వీస్తీర్ణం పెంచేందుకు అన్ని రకాలు చర్యలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా ప్రస్తుతం సాగు చేస్తున్నవారికి ప్రభుత్వం నుంచి అన్నిరకాల రాయితీలు, పథకాలు వర్తింపజేస్తున్నామని సెరీకల్చర్ డిడి వివరిస్తున్నారు.

Kakinada

2021-09-13 05:07:05

2వ రోజు 62 వేల మందికి వ్యాక్సినేష‌న్..

విజ‌య‌న‌గ‌రంజిల్లా వ్యాప్తంగా 81 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల ప‌రిధిలో శ‌ని, ఆదివారాల్లో నిర్వ‌హించిన కోవిడ్ వ్యాక్సినేష‌న్ మెగా డ్రైవ్ కార్య‌క్ర‌మంలో 1.15 ల‌క్ష‌ల మందికి వ్యాక్సినేష‌న్ చేసిన‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి వెల్ల‌డించారు. జిల్లాలో శ‌నివారం మెగా డ్రైవ్ ద్వారా 52,346 మందికి, ఆదివారం సాయంత్రం 7.30 గంట‌ల వ‌ర‌కు 62వేల మందికి వ్యాక్సినేష‌న్ పూర్తిచేయ‌డం జ‌రిగింద‌న్నారు. రెండు రోజుల మెగా డ్రైవ్ అంద‌రి స‌హ‌కారంతో విజ‌య‌వంత‌మైంద‌ని పేర్కొన్నారు. జిల్లాలో క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేసిన వ‌లంటీర్లు, ఆశ కార్య‌క‌ర్త‌లు, ఆరోగ్య కార్త‌క‌ర్త‌లు, గ్రామ స‌చివాల‌య సిబ్బంది, ఎంపిడిఓలు, వైద్యాధికారులు త‌దిత‌రులంద‌రి కృషి కార‌ణంగా రెండు రోజుల్లో సాధించాల్సిన ల‌క్ష్యంలో 11.25 శాతంకు పైగా సాధించ‌గ‌లిగామ‌న్నారు. జిల్లాలో ఒక్క డోసు కూడా వ్యాక్సిన్ తీసుకోనివారు, రెండో డోసు తీసుకోవ‌ల‌సిన వారు క‌ల‌సి 10.18 ల‌క్ష‌ల మంది వున్నార‌ని, వీరంద‌రికీ శ‌త‌శాతం వ్యాక్సిన్ వేసే ల‌క్ష్యంతో మెగా డ్రైవ్ కార్యక్ర‌మం చేప‌ట్టామ‌న్నారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ ఇంకా అందుబాటులో వుంద‌ని, అందువ‌ల్ల వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం త‌దుప‌రి రోజుల్లో కూడా కొన‌సాగుతుంద‌న్నారు. క్షేత్ర‌స్థాయి సిబ్బంది వ్యాక్సిన్ వేయాల్సిన వారంద‌రినీ పెద్ద ఎత్తున స‌మీక‌రించి వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌కు పెద్ద ఎత్తున త‌ర‌లించ‌డం వ‌ల్లే ఒక్క రోజులో 62 వేల మందికి వ్యాక్సిన్ వేయ‌గ‌లిగామ‌ని పేర్కొన్నారు. జిల్లాలో శ‌త‌శాతం వ్యాక్సినేష‌న్ చేసి కోవిడ్ మ‌హ‌మ్మారి బారి నుంచి జిల్లా ప్ర‌జ‌ల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌ని, అపోహ‌లు వీడి ప్ర‌తి ఒక్క‌రూ ఈ వ్యాక్సిన్ వేసుకోవ‌డం ద్వారా జిల్లాకు థ‌ర్డ్ వేవ్ రాకుండా నివారించ‌డంలో స‌హ‌క‌రించాల‌ని కోరారు.

విజయనగరం

2021-09-12 14:33:26

వేక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి..

విశాఖ  జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున వైద్యాధికారులను ఆదేశించారు. ఆధివారం ఉదయం రేసపువాని పాలెం, ఎం.వి.పి.లలో సచివాలయ కేంద్రాలను, జిల్లాకలెక్టర్ పరిశీలించారు. ఆరిలోవలో  ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంను  పరిశీలించి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.  ఆనందపురం, పద్మనాభం మండలాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆనందపురం మండలం గిడిజాల  ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, పధ్మనాభమండలం బి.తాళ్లవలస   ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్ పరిశీలించారు. డాక్టర్లను  వ్యాక్సినేషన్  ప్రక్రియ పై  వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రజలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మీరు వ్యాక్సినేషన్  వేయించుకునేందుకు సెంటర్ లకు ఎలా వచ్చారని అడిగారు . ఎ.ఎన్.ఎం.లు, ఆశావర్కర్లు, వాలంటీర్ల నుండి మెసేజ్ లు, పోన్ కాల్స్ రావడం జరిగిందని వారి సూచనల మేరకు  వచ్చామని ప్రజలు జిల్లా కలెక్టర్ కు తెలిపారు.  లిస్టులో ఉన్న వారందరికి మెసేజ్ పంపి వ్యాక్సినేషన్ పూర్తిగావించాలని  జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిశోర్, జి.వి.ఎం .సి వైద్యాధికారి .డా. శాస్త్రి,  తహసిల్దార్లు, మండల అభివృద్ది అధికారులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-09-12 13:24:21

4వ రోజు శాస్త్రోక్తంగా బాలబింబ స్థాపన..

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాల‌య కార్యక్రమాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం బాలబింబ స్థాపన శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలోని కల్యాణమండపంలో బాలాల‌యం ఏర్పాటుచేసి స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. యాగశాలలో ఉద‌యం శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి బాల‌బింబ స్థాప‌న‌, మ‌ధ్యాహ్నం బింబ‌వాస్తు, మ‌హాశాంతి అభిషేకం చేపట్టారు. సాయంత్రం యాగ‌శాల‌ వైదిక కార్య‌క్ర‌మాలు, శ‌య‌నాధివాసం, హోత్రం, విశేష హోమం చేప‌డ‌తారు. సెప్టెంబ‌రు 13న సోమవారం ఉద‌యం యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి, దివ్య‌ప్ర‌బంధ శాత్తుమొర నిర్వ‌హిస్తారు. ఉద‌యం 9.40 నుండి 10 గంట‌ల మ‌ధ్య తులా ల‌గ్నంలో బాలాల‌య సంప్రోక్ష‌ణం చేప‌డ‌తారు. మ‌ధ్యాహ్నం నిత్య‌క‌ట్ల కైంక‌ర్యం, సాయంత్రం యాగ‌శాల‌ వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు  పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు  వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఎఈవో  ఎం.ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్  ఎ.నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  ఎ.కామ‌రాజు పాల్గొన్నారు.

Tirupati

2021-09-12 13:05:55

కాణిపాక వినాయకుడికి హైకోర్టు చీఫ్ జస్టిస్ పూజలు..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దంపతులు కాణిపాకం లోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకున్నారు. శ్రీ స్వామి వారి దర్శనానికి వచ్చిన  వీరికి  వేద పండితులు స్వాగతం పలికి స్వామి వారి దర్శన ఏర్పాట్లను  కార్యనిర్వహణాధికారి  ఎ.వెంకటేశు చేయించారు.అనంతరం వారికి వేదపండితుల ఆశీర్వచనముతో శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాదాలను,స్వామి వారి చిత్ర పఠమును అందచేశారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర బాబు గారు, డి.ఎస్.పి సుధాకర్ రెడ్డి, ఆలయ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి, ఐరాల ఎమ్మార్వో, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Kanipakam

2021-09-12 10:54:14

ఇప్పటి వరకూ 30లక్షల మందికి వేక్సిన్..

చిత్తూరుజిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 30,78,292 కోవిడ్ వ్యాక్సినేషన్ డోస్ లు పూర్తి చేసినట్లు, ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మరో 2.03 లక్షల డోస్ లు పూర్తి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ పేర్కొన్నారు. గత  రెండు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని, ఇందులో భాగంగా ఈ నెల 11 వ తేది 93,248 రెండవ డోసులు మాత్రమే వేశామని, 12 వ తేది ఆదివారం మొదటి , రెండవ డోస్ లు వేసేందుకు 2.03 లక్షలు డోస్ లు జిల్లాకు అందాయని తెలిపారు. ఈ డోస్ లను 18 సంవత్సరాలు పై బడిన వారందరికి మొదటి, రెండవ డోస్ లు వేస్తున్నామని తెలిపారు. అన్ని మండలాలకు వ్యాక్సినేషన్ మందులు పంపిణీ చేయడమైనదని, ప్రతి మూడు మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్లు వారి పరిధిలో ఒక్కొక్కరు 15 మందిని గుర్తించి వ్యాక్సినేషన్ వేయించాలన్నారు. ఆదివారం ఉదయం నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నానికల్లా 1,25,921 మొదటి, రెండవ డోసు లు అన్ని పి.హెచ్.సి పరిధిలో వేశారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నానికి మిగిలి ఉన్న 97 వేల డోస్ లు రాత్రి లోపు పూర్తి చేసేందుకు మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, చిత్తూరు, తిరుపతి ఆర్.డి.ఓ లు రేణుక, కనకనరసా రెడ్డి లను, మండల స్పెషల్ ఆఫీసర్లు, తాహాసిల్ధార్లు, ఎం.పి.డి.ఓ లు, మునిసిపల్ కమిషనర్ లను ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ లేకుండా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఆదివారo నాడు జిల్లా వ్యాప్తంగా వేస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు మానిటర్ చేయడంతో మండల, జిల్లా అధికారులను వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు హెల్త్ కేర్ వర్కర్ లకు సంబందించి మొదటి డోసు 46,819 మందికి, రెండవ డోస్ 45,356 మందికి. ఫ్రంట్ లైన్ వర్కర్ లకు మొదటి డోస్ 1,07,125 మందికి, రెండవ డోస్ 97,536 మందికి వ్యాక్సినేషన్ ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చి అవగాహన కల్పించి వేశామని తెలిపారు. అలాగే 18-45 సంవత్సరాల వయసు వారికి మొదటి డోస్ 7,38,979 మందికి, రెండవ డోస్ 1,31,481 మందికి వెరసి 8,70,460 డోసులు, అలాగే 45 వయసు దాటిన వారికి మొదటి డోస్ గా 11,26,620 మందికి, రెండవ డోస్ 7,29,306 మందికి, వెరసి 18,55,926 ఇన్ని డోస్ లు  పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.  

Chittoor

2021-09-12 10:52:27

ఏజెన్సీలో వాల్మీకిల సమస్య పరిష్కరించండి..

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని వాల్మీకి షెడ్యూల్ తెగ ను నవశకం వెబ్ సైట్ లో నమోదు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలోని వాల్మీకి తెగ ఎస్టీ జాబితాలో ఉండగా రాష్ట్రంలోని వివిధ కులాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నవశకం లో ఏజెన్సీ లోని ఎస్టీ తెగల జాబితా నుంచి వాల్మీకి తెగను తొలగించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కాంతిలాల్ దండే తో ఫోన్లో మాట్లాడారు.  నవశకం వెబ్ సైట్ లో వాల్మీకి తెగ ను ఎస్టీ కులాల జాబితాలో చేర్చడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జరిగిన ఈ పొరపాటు కు కారణం ఏమిటో తెలుసుకోవాలని కోరారు. నవశకం వెబ్ సైట్ నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించేలా చూస్తామని ఈ సందర్భంగా కాంతిలాల్ దండే ఉప ముఖ్యమంత్రి కి హామీ ఇచ్చారు. కాగా ఈ విషయం గా వాల్మీకి తెగకు చెందిన గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. 

Visakhapatnam

2021-09-12 10:45:28

శ్రీవారి తీర్థ కైంకర్యపరుడు శ్రీ తిరుమలనంబి..

పాండిత్యం కన్నా భగవంతుడి సేవనే మిన్నగా భావించి శ్రీవారికి తీర్థ కైక‌ర్యం చేసిన తిరుమ‌ల ప్ర‌థ‌మ పౌరుడు శ్రీ తిరుమలనంబి ప్రముఖ స్థానం పొందారని తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు ఆచార్య చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్‌ పేర్కొన్నారు. టిటిడి అఖిల‌ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయ ప్రాంగణంలో 1048వ అవతార మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆచార్య చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్‌ కీలకోపన్యాసం చేస్తూ శ్రీవారి కైంకర్యాలు చేసేందుకు శ్రీ తిరుమలనంబి 973వ సంవత్సరంలో తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. ఆయన తన తాతగారు అయిన యమునాచార్యుల ఆజ్ఞతో తిరుమలకు వచ్చి పాపవినాశనం తీర్థం నుండి ప్రతిరోజూ జలాన్ని తీసుకువ‌చ్చి శ్రీవారిని అభిషేకించేవారన్నారు. వృద్ధాప్యంలో కూడా పాపనాశనం తీర్థం నుండి  తీసుకువస్తున‌ప్పుడు స్వామివారు జాలిపడి అంజనాద్రిలో ఉద్భవింపచేసిన ఆకాశగంగ తీర్థంతో అభిషేకం చేయవలసిందిగా ఆజ్ఞాపించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. తిరుమలనంబి స్వామివారికి పుష్ప కైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేద‌పారాయ‌ణ కైక‌ర్యం,  ఇతర కైంకర్యాలను చేస్తూ తిరుమలలో ఉంటూ అపరభక్తుడిగా నిలిచాడని చెప్పారు. శ్రీ తిరుమలనంబి స్వయాన శ్రీభగవద్‌ రామానుజులవారికి మేనమామ అన్నారు. శ్రీమద్‌ రామానుజాచార్యులకు రామాయణంలోని రహస్యార్థాలను చెప్పి, విశిష్టాద్వైత మతానికి పునాది వేశారని తెలియజేశారు. ఇంతటి పాండిత్యం గల తిరుమలనంబి తన జీవితం మొత్తాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేసి శ్రీవారి చేత తాత అని పిలిపించుకున్నారని, ఈ కారణంగానే వారికి తాతాచార్య వంశీయులుగా పేరు వచ్చిందని వివరించారు. అనంతరం " తిరుమంగై ఆళ్వారుల పాశురాల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌రుడు " అనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 16 మంది పండితులతో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, తిరుమలనంబి వంశీకులు  కృష్ణమూర్తి తాతాచార్యులు, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేట‌ర్ పురుషోత్తం, తాతాచార్య వంశీయులు పాల్గొన్నారు.

Tirupati

2021-09-12 09:48:59

నగరంలో సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలి..

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్.వి.సన్యాసిరావు  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన 6వ జోన్ 86వార్డు పరిధిలోని  కుమ్మరపాలెంలోని శాతవాహన నగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.  వార్డులో ఆర్. పుష్పకు డెంగ్యూ వచ్చినందున ఆ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వర్షపు నీరు, ఇళ్లలో వాడే నీరు ఎక్కువ రోజులు నిలువ ఉండటం వలన, దోమలు వృద్ధి చెందుతాయని, నీటి నిల్వలు లేకుండా చూడాలని వారంలో మంగళవారం, శుక్రవారం “డ్రై డే”పాటించాలని సూచించారు. డెంగ్యూ కేసు నమోదైన ఇంటి పరిసరాలలో 200 మీటర్ల పరిధిలో ఫాగింగ్, స్క్రీనింగ్ చేయాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు. మలేరియా సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు కలిసి మలేరియా పై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మలేరియా సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి వారి యోగక్షేమాలు అడిగి ఇంటి గోడ పై సంతకం చేయాలని ఆదేశించారు.  విధుల పట్ల అలసత్వం ప్రదర్శించరాదని మలేరియా సిబ్బందిని హెచ్చరించారు. వార్డు సచివాలయ శానిటరీ కార్యదర్శులు ప్రతిరోజు ఉదయం వార్డుల్లో పర్యటించి కాలువలను శుభ్రం చేయించాలని, కాలువలలో అడ్డంకులను తొలగించి వర్షపు నీరు,  మురుగునీరు సాఫీగా పోయే విధంగా చూడాలని ఆదేశించారు.   పిన్ పాయింట్ వారీగా పారిశుద్ధ్య కార్మికులను సర్దుబాటు చేసి ఎవరికి నిర్దేశించుకున్న పనిని వారిచే చేయించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త కనిపించకూడదని, డోర్ టు డోర్ చెత్త నిర్వహణ పక్కాగా జరగాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు.   ఈ పర్యటనలో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్, మలేరియా సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-11 14:34:30

విద్యా విధానంలో రాష్ట్రం కొత్త పుంతలు..

రాష్ట్రంలోవిద్యా విధానంలో కొత్త పుంతలు తొక్కుతోందని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస మండలం తొగరం, కలివరం గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పీకర్ శని వారం పాల్గొన్నారు. తొగరం గ్రామంలో మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.18 లక్షల నిధులతో పనులు పూర్తి చేశారు. కలివరం గ్రామంలో మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.16.50 లక్షల నిధులతో పనులు పూర్తి చేసారు. సుమారు రూ. 22 లక్షల నిధులతో పనులు పూర్తి చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశం ఆయన మాట్లాడుతూ స్వగ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. నేటికి 15 సంవత్సరాలు నుంచి గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని, పల్లెల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకు వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసారు. విద్యా విధానం చూస్తే కొత్త పుంతలు తొక్కుతోందని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ధనికులు చదువుతున్నారని, పేదవాడి చదువు అందని ద్రాక్షలా ఉందని అందుకే పేదవాడికి కార్పొరేట్ విద్యను అందించాలని ముఖ్య మంత్రి ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు చదువు పేరు చెప్పి లక్షలు దోపిడీలు చేస్తున్నాయని ఆయన చెప్పారు. వాటిని నిలువరించడానికి ప్రభుత్వ విద్యాలయాలు కార్పోరేట్ కు దీటుగా తయారుచేసి ఇంగ్లీష్ విద్యా విధానం అమలు పరుస్తున్నారని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాల క్యాలెండర్ను విడుదల చేసి అమలుపరుస్తున్న ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అభివృద్ధి గురించి చర్చకు రావాలని స్పీకర్ తమ్మినేని అన్నారు.  ఈ కార్యక్రమంలో తొగరాం సర్పంచ్ వాణి సీతారం., తమ్మినేని చిరంజీవి నాగ్, స్థానిక నాయకులు తమ్మినేని శ్రీరామమూర్తి, బెండి గోవిందరావు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, పిఎసిఎస్ చైర్మన్, అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-11 12:15:10

ప్రతీ మంగళవారం బ్లడ్ డొనేషన్ క్యాంపులు..

బ్లడ్ డొనేషన్ క్యాంపులను వారంలో  ప్రతీ మంగళవారం, శుక్రవారం జిల్లాలో ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులలో వస్తున్న మార్పుల వలన డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధులు ఇంకా రెండు, మూడు నెలలు పెరిగే అవకాశం ఉన్నందున ఆయా వ్యాధులను నియంత్రించడానికి పటిష్టమైన చర్యలను చేపట్టాలన్నారు. ప్యాండమిక్ సీజన్ వలన జిల్లాలో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించలేకపోయినందున బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు తగ్గిపోయాయన్నారు. బ్లడ్ డొనేషన్ కు సంబంధించి అన్ని విధాల సహకారం అందిస్తామని కలెక్టరు తెలిపారు. కాబట్టి అత్యవసరంగా రక్తదాన కేంద్రాలను ఏర్పాటు చేయాలనన్నారు.  డెంగ్యూ వ్యాధి నియంత్రణకుసంబంధించి ప్లేట్లెట్స్ అవసరమని, సింగిల్ బ్లడ్ డోనర్స్ ను గుర్తించి ప్లేట్లెట్స్ సేకరణ చేయాలన్నారు. రక్త దాతల లిస్టును దగ్గర పెట్టుకుని రక్తం అవసరమైన పరిస్థితులలో వారికి ఫో్ను చేసి రప్పించే ఏర్పాటు చేయాలన్నారు.  రేర్ బ్లడ్ గ్రూపు, ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూపు వారిని ప్రోత్సహించి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి రక్తం అవసరం ఏర్పడినప్పుడు దాతలు ముందుకు వచ్చే విధంగా గ్రూపులో మెసేజ్ పెట్టాలన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏరోజు పెడుతున్నది ప్రసార మాధ్యమాల ద్వారా విసృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రవేటు ఆసుపత్రులు, స్వచ్చంధ సంస్థలు సేకరించిన రక్త నిధులలో 30 శాతం కె.జి.హెచ్ కు అందజేయాలన్నారు. సింగిల్ డోనార్స్ ఉంటే కె.జి.హెచ్ కు పంపించాలన్నారు.  పాడేరులో రెడ్ క్రాస్ సొసైటి ఒక బ్లడ్ బ్యాంకును ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డా.సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 5 ప్రభుత్వ ఆసుపత్రులు, 5 స్వచ్ఛంధ సంస్థలు, 10 ప్రైవేటు ఆసుపత్రులలో బ్లడ్ బ్యాంకులు ఉన్నాయని తెలిపారు. విక్టోరియా, అనకాపల్లి, పాడేరు ఏరియా ఆసుపత్రులలో కాంపోనెంట్ సెపరేషన్ యూనిట్లు లేవని, సంబంధిత టెక్నికల్ సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారని తెలిపారు. అందుకు కలెక్టరు స్పందిస్తూ తగు ఏర్పాట్లు చేస్తామన్నారు. బ్లడ్ స్టోరేజి యూనిట్లు నర్సీపట్నం, చింతపల్లి, చోడవరం, అరకు, కోటపాడు, నక్కపల్లి , అగనంపూడి లలో ఉన్నాయని తెలిపారు.  ఈ సమావేశంలో ఎ.ఎం.సి. ప్రిన్సిపాల్ డా.సుధాకర్, కె.జి.హెచ్ బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా.శ్యామల, డిఎల్ఒ డా.సత్యవాణి,ఎ.ఎస్.రాజా, ఎన్.టి.ఆర్, రోటరీ, లయన్స్, రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్  బ్యాంకుల ప్రతినిధులు, నగరంలో గల పది ప్రవేటు ఆసుపత్రుల బ్లడ్ బ్యాంకు ప్రతినిధులు హాజరయ్యారు.

Visakhapatnam

2021-09-11 11:59:31

టీటీడీ ఆస్తులను పరిశీలించిన ఈవో ..

రిషికేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తులను ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శనివారం పరిశీలించారు.  తొలుత ఆంధ్రా ఆశ్రమంలోని  శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి  దర్శనం చేసుకున్నారు. అనంతరం అక్కడి భవనాలను పరిశీలించి, అభివృద్ధి  కార్యక్రమాల గురించి చర్చించారు. బిగ్ గార్డెన్,  చుంగి గార్డెన్ లోని టీటీడీ ఆసులను పరిశీలించి,  వాటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఈవో అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్టేట్ విభాగం ప్రత్యేక అధికారి మల్లిఖార్జున,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహమూర్తి తో పాటు స్థానిక అధికారులు  ఉన్నారు.  అనంతరం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి రుషికేష్ లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందస్వామి వారిని కలిశారు.

Tirumala

2021-09-11 11:58:05

అప్పన్నకు మంత్రి అవంతి పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారిని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ మంత్రికి స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి కుంటుంబం అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2021-09-11 11:03:37

అప్పన్న ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామి వారి దేవస్థానానికి ISO 9001:2015 (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ) సర్టిఫికెట్ లభించడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఈ మేరకు దేవస్థానానికి వచ్చిన గుర్తింపుని ఈఓ ఎంవీ సూర్యకళ మంత్రికి చూపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వామి వైభవం అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం ఆయన మహిమేనన్నారు. "ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చేలా కృషిచేసిన దేవస్థానం ఈఓ సూర్యకళ, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఈఓ మాట్లాడుతూ, ఆలయానికి చెందిన అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని హెచ్ వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్   సంస్థ ఈ గుర్తింపునిచ్చింది.  ఈ సర్టిఫికెట్ ను... రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్, దేవస్థానం ఈఓ సూర్యకళ అందుకున్నారు. ఈఓ మాట్లాడుతూ, మంత్రి చేతులమీదుగా ఈ అవార్డును స్వీకరించడం చాలా శుభ పరిమాణం అన్నారు. ఫుడ్ అండ్ సేఫ్టీ ఆడిటింగ్ ప్రస్తుతం దేవస్థానంలో జరుగుతోందని.. ఆ రంగంల్లోనూ ఐఎస్ఓ సర్టిఫికెట్ వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. గత ఆర్నెళ్ల నుంచి దేవస్థానంలో ఉద్యోగుల నాణ్యమైన సేవల గురించి ఆడిటర్ ద్వారా అంతర్జాతీయ సంస్థకు సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చామని, అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించే దేవస్థానంగా ఇపుడు గుర్తింపు పొందామని అన్నారు. కాగా  ప్రసాద్ స్కీం ద్వారా రూ.54 కోట్లు మంజూరయ్యాయని కరోనా సెకెండ్ వేవ్ వల్ల నిధులు రావడం కాస్త ఆలస్యమైందని మంత్రి వివరించారు. ఇప్పుడు ఆ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-09-11 10:52:05