1 ENS Live Breaking News

జర్నలిస్టులకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ..

వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా తమ సభ్యులందరికీ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు ఫోరమ్ అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు బుదవారం తెలిపారు. ఈ మేరకు వీరు మాట్లాడుతూ గురువారం  ఉదయం 10 గంటల నుంచి సీతమ్మ దార విజేఎఫ్ వినోద వేదిక,నార్లవెంకటేశ్వరరావు భవన ప్రాంగణంలో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. జర్నలిస్ట్ లుకు వినాయక విగ్రహాలతో పాటు వ్రతకల్ప పుస్తకం, వివిధ రకాల పూలమొక్కలు అందజేస్తామన్నారు.
పర్యావరణానికి పెద్ద పీట వేస్తూనే నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.. క్లబ్ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని వినాయక విగ్రహాలు తదితర సామాగ్రి స్వీకరించవలసిందిగా కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే జర్నలిస్టులు కూడా అన్ని పండుగలు నిర్వహించుకోవాలని, అందరు కలిసి మెలిసి సుఖసంతోషాలతో ఉండాలన్నదే వైజాగ్ జర్నలిస్టుల ఫోరం పాలకవర్గం లక్ష్యమన్నారు.  సీనియర్ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ దియేటర్ సౌజన్యం తో ఉదయం నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వీరు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యలు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-08 07:47:23

విద్య మానవ జీవితాలనే మార్చేస్తుంది..

జీవితంలో మార్పును తీసుకొని రాగలిగే శక్తి విద్యకు మాత్రమే ఉందని.. పేద ప్రజలు చీకటిలో చదవకుండా వారు మంచి వాతా వరణంలో చదివేలా రాష్ట్ర ప్రభుత్వం మన బడి నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ అన్నారు. బుధవారం ఉదయం డి.ఆర్.డి ఏ సమావేశ మందిరంలో నాడు – నేడు రెండవ విడత చేపట్టనున్న కార్యక్రమాలకు సంబందించి శిక్షణా కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంబించారు.  ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో 1533 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, 95 శాతం పాఠశాలల స్థితి గతులు మార్చి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడం జరిగిందని, మిగతా పాఠశాలల్లో చిన్న చిన్న మార్పులు కూడా చేస్తున్నారని పాఠశాలలకు వెళ్లినప్పుడు విధ్యార్ధుల తల్లి దండ్రులు, విధ్యార్ధులు, ఉపాద్యాయులు కూడా పాఠశాలల్లో చేపట్టిన పనులకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం ఇరిగేషన్, రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి పారుదల సర్వ శిక్ష అభియాన్ కు చెందిన ఇంజినీరింగ్ అధికారులు రెండవ విడతలో 1671 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. మనం చేస్తున్న ఈ కార్యక్రమం నిండు మనసుతో విధ్యార్ధుల భాయిషత్తు కోసం చేయాలని, రాష్ట్ర భవిష్యతే దేశ భవిష్యత్ అని ఈ రెండింటిని ముందుకు తీసుకో పొగలిగినది విధ్యార్ధుల భవిష్యత్ కోసం మనం కృషి చేస్తున్న విషయం మరువ కూడదన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని అనుకోవడం సహజమని రాష్ట్ర ప్రభుత్వం అందరి భావిషత్ కోసం మార్పులు తీసుకొని రావాలని భావించిందన్నారు. 
జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) వి.వీర బ్రహ్మo మాట్లాడుతూ చదువు ఎటు వారినైనా ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని అటువంటి ఉజ్వల భవిష్యత్ కల్పించే పాఠశాలల రూపు రేఖలు మార్చే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావించి పనులు చేయించాలని ప్రధానంగా పాఠశాలలు 12 అంశాలను ప్రాధాన్యతగా భావించాలని ఇందులో మరుగు దొడ్లు ఏర్పాటు అందుకు నీటి సరఫరా, ఆర్.ఓ సిస్టమ్ ద్వారా మంచి నీటి సరఫరా, చిన్న లేదా పెద్ద రిపేర్లు, విధ్యుత్ సౌకర్యం తో పాటు ఫ్యాన్ లు, ట్యూబ్ లైట్లు ఏర్పాట్లు, విధ్యార్ధులకు, ఉపాద్యాయులకు ఫర్నిచర్, గోడలకు అందమైన పెయింటింగ్, గ్రీన్ చాక్ బోర్డు, ఇంగ్లీషు ల్యాబ్, వంట గది, కాంపౌండ్ వాల్స్, అదనపు గదుల నిర్మాణం, పాఠశాలలకు అనుబందంగా ఉన్న అంగన్ వాడి కేంద్రాల రిపేర్లు, నాణ్యతగా చేయాలని అన్నారు. ఎస్.ఎస్.ఎ.ఎ.పి.సి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ గతంలో మొదట 1517 పాఠశాలలను ఇవ్వడం జరిగిందని కొన్ని మార్పుల అనంతరం 1533 పాఠశాలలను ఇచ్చారని దాదాపుగా అన్ని పాఠశాలల రూపు రేఖలు మార్చామని రానున్న కాలం లో రెండవ విడత 1671 పాఠశాలల రూపు రేఖలను మార్చేందుకు అనుమతి ఇచ్చారన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం తరువాత మండల స్థాయిలో జరిగే శిక్షణ అందరూ సంబందిత మండల అధికారులు పాల్గొనాలని ఎ.పి.సి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) వి.వీరబ్రహ్మo, ఎస్.ఎస్.ఎ.ఎ.పి.సి వెంకట రమణ రెడ్డి, ఆర్.డబ్ల్యూ.ఎస్.ఈ విజయ్ కుమార్, డి.ఈ.ఓ పురుషోత్తంలతో పాటు వివిధ శాఖల ఇంజినీర్లు పాల్గొన్నారు. 

Chittoor

2021-09-08 07:34:08

అంబేద్కర్ నగర్ ను అన్నివిధాలా అభిరుద్ది చేస్తాం..

అనంతపురం అంబేద్కర్ నగర్ ను అన్ని విధాలా అభిరుద్దీ చేస్తామని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని 21 వ డివిజన్ పరిధిలో  పారిశుద్ధ్య పనులను బుధవారం నగర మేయర్  నగరంలోని అంబేద్కర్ నగర్ లో డిప్యూటీ చైర్మన్ కొగటం విజయ్ భాస్కర్ రెడ్డి, నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి, స్థానిక కార్పొరేటర్ సాకే చంద్రలేఖ తో కలసి పర్యటించారు. డివిజన్ లో పలుచోట్ల డ్రైనేజీలు లేఖ మురుగునీరు రోడ్డుపైకి వస్తున్న విషయాన్ని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు.పేదలు అధికంగా నివసిస్తున్న అంబేద్కర్ నగర్ లో డ్రైనేజీలు, రోడ్లు సరిగా లేక దోమలు ప్రబలుతున్నాయని తద్వారా తరచూ స్థానికులు రోగాల బారిన పడుతున్నారని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన అంబేద్కర్ నగర్ అభిరుద్దీ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అనీల్ కుమార్ రెడ్డి, స్థానిక వైకాపా నాయకులు కుల్లాయి స్వామి,ఏ ఈ నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-09-08 06:19:24

అప్పన్నకు వైశ్యకార్పోరేషన్ చైర్మన్ పూజలు..

సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రిఅప్పన్న) స్వామి వారిని బుధవారం రాష్ట్ర వైశ్య వెల్ఫేర్, డవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్  కుప్పం ప్రసాద్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆయనతోపాటు ట్రస్టుబోర్డు సభ్యురాలు గరుడ మాధవి, ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, 32వ వార్డు (విశాఖ) కార్పొరేటర్ డా. కందుల నాగరాజు స్వామివారిని దర్శించుకున్నారు. వైశ్వ కార్పొరేషన్ ఛైర్మన్ కు స్థలపురాణాన్ని, ఈఓగా సూర్యకళ బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ట్రస్టుబోర్డు సభ్యురాలు గరుడ మాధవ వివరించారు. నరసింహ అవతారాలను శుభ్రపరిచిన తీరు, ఆలయం బయట సుందరీకరణను వివరించారు. నరసింహ అవతారాలు తెలిసేలా బోర్డులు పెట్టడం అందర్నీ ఆకట్టుకుంది.  దేవస్థానంలో ఈఓ సూర్యకళ చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలను గరుడ మాధవి వివరించారు.  సింహాద్రి అప్పన్న ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని కుప్పం ప్రసాద్, డా.కందుల నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-09-08 05:55:13

రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం(చిత్తూరు జిల్లా వారికి మాత్రమే) టోకెన్లు జారీ చేయాలని భక్తుల నుంచి వస్తున్న కోరిక మేరకు సెప్టెంబరు 8 వ తేదీ బుధ  వారం  ఉదయం 6 గంటల నుండి రోజుకు 2 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. అలిపిరి లోని భూదేవి కాంప్లెక్స్ లోని కౌంటర్లలో చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ప్రయోగాత్మకంగా టోకెన్లు జారీ చేస్తారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టోకెన్లు పొందేందుకు సహకరించాలని టీటీడీ విజ్ఞపి చేస్తోంది.

Tirumala

2021-09-07 12:53:22

ప్రభుత్వ ప్రోత్సాహంతో జీవన ప్రమాణాలు పెంచుకోవాలి..

ప్రభుత్వం రాయతీపై సరఫరా చేస్తున్న చేపపిల్లలను పెంపకం చేసి మత్స్యకారులు తమ యొక్క జీవన ప్రమాణాలును మరింతగా పెంపొందించుకోవాలని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపు నిచ్చారు. బుధవారం పార్వతీపురం మండలం, పెద బొండపల్లి గ్రామం, తామర చెరువులో సబ్సిడీపై సరఫరా చేసిన ఫింగర్ లింగ్ సైజు గల 50వేల చేపపిల్లలను మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎన్.నిర్మల కుమారితో కలిసి విడుదల చేసారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మత్స్యకారుల సంక్షేమం, అభివ్రుద్ధికోసం వైఎస్. జగనన్న ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎన్.నిర్మల కుమారి మాట్లాడుతూ, సుస్థిరమైన, భాద్యతాయుతమైన మత్స్య అబివృద్ధి కోసం 2020-21నుంచి  2024-25వరకు 5ఏళ్లలో అమలు పరిచేవిధంగా  ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.  ఆక్వా రైతులుకు అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సాగర మత్స్యకారులకు వేట నిషేద భ్రుతిని రూ. 4,000/-లు నుండి రూ. 10,000/-లు పెంచడంతో పాటు..  50 సంవత్సారాలు దాటిన మత్స్యకారులందరికి మత్స్యకార ఫించను అందజేయడం, ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులు ఎక్ష్ గ్రేషియాను రూ. 5.00 లక్షలు నుంచి రూ. 10.00లక్షలుకు పెంచడం, ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ అందజేస్తున్న విషయాన్ని తెలియజేశారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి, నాణ్యమైన సీడ్, ఫీడ్ మరియు ఆక్వా కల్చర్ అనుమతులు సరళంగా, త్వరితగతిన పొందడం కోసం ఏర్పాటు చేసిన 3చట్టాలును (ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ 2020,  ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్)(సవరణ) యాక్ట్ 2020, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ది సంస్థ చట్టం 2020) లను ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. జిల్లాలో స్థానిక మత్స్య ఉత్పత్తులపై వాడకం పెరగటం కోసం మత్స్యశాఖ చేస్తున్న కృషి వలన ఆక్వా రైతులకు మధ్యవర్తుల బెడద లేకుండా మంచి గిట్టుబాటు ధర దొరకడం అభినందనీయమని ఎమ్మెల్యే అలజంగి జోగారావు పేర్కొన్నారు. మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో  మత్స్య శాఖ సహాయ సంచాలకులు పి. కిరణ్ కుమార్, మత్స్య శాఖ అభివృద్ధి అధికారి టి. నాగమణి, జిల్లా స్వదేశీ మత్స్యకార సహకార సంఘ ఉపాధ్యక్షులు దాసరి లక్ష్మణ రావు, నర్సిపురం స్వదేశీ మత్స్యకార సహకార సంఘ అధ్యక్షులు తిరుపతి, మత్స్యకార సహకార  సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Parvathipuram

2021-09-07 11:29:03

భూసేక‌ర‌ణ జిల్లాలో త్వరగా పూర్తిచేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వివిధ ప్రాజెక్టుల‌కోసం సేక‌రిస్తున్న  భూసేక‌ర‌ణ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. భూసేక‌ర‌ణ‌కు సంబంధించి, రెవెన్యూ, ఆర్ అండ్ బి, ఇరిగేష‌న్‌, అట‌వీ, విద్యుత్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో మంగ‌ళ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిని పెట్టుకొని భూసేక‌ర‌ణ పూర్తి చేయాల‌న్నారు. మూడో రైల్వేలైన్‌, తోట‌ప‌ల్లి, తార‌క‌రామ‌తీర్ధ‌సాగ‌ర్‌, ఆర్ ఓ బి, డంపింగ్ యార్డు, జాతీయ‌ ర‌హదారుల‌కు సేక‌రిస్తున్న భూముల‌కు సంబంధించి, ప్యాకేజీల‌వారీగా స‌మీక్షించారు. వాటి స్థితిని తెలుసుకున్నారు. ప‌నిలో నిర్లక్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తే స‌హించేది లేద‌ని, యుద్ద‌ప్రాతిప‌దిక‌న భూసేక‌ర‌ణ ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు.ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్ భావ‌న‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, భూసేక‌ర‌ణ‌ స్పెష‌ల్ డిప్యుటీ క‌లెక్ట‌ర్ ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్లు, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-07 10:46:30

తూ.గో. 16 పశువైద్యుల పోస్టులు ఖాళీలు..

తూర్పుగోదావరి జిల్లాలో 16 పశు వైద్యుల పోస్టులు ఖాళీలు ఉన్నట్టు పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డా.ఎస్.సూర్యప్రకాశరావు తెలియజేశారు. మంగళవారం ఆయన కాకినాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 64 మండలాల పరిధిలో పశువైద్యలు లేని చోట ఉన్నవైద్యులకే అదనపు బాధ్యతలు అప్పగించామన్నారు. వారికి సహాయంగా గ్రామీణ పశువైద్య సహాయకులు పనిచేస్తున్నారని చెప్పారు. గతంలో కంటే ఇపుడు పశువైద్యం పూర్తిస్థాయిలో మెరుగు పడిందని, మందులు కూడా కూడా లభ్యం అవుతున్నాయన్నారు. పాడి రైతులు తమ పశువుల కోసం ఏ విధమైన సహాయమైనా రైతుభరోసా కేంద్రాలు,  వెటర్నరీ డిస్పెన్సరీల ద్వారా పొందవచ్చునని ఆయన సూచించారు.

Kakinada

2021-09-07 05:48:22

ద్యానవన పంటలకు 40% ఈ-క్రాప్ బుకింగ్..

తూర్పుగోదావరిజిల్లాలో ఉద్యాన వన పంటలకు ఈ-క్రాపింగ్ ఇప్పటి వరకూ 40శాతం పూర్తయినట్టు డిప్యూటీ డైరెక్టర్ రమ్మోహన్ తెలియజేశారు. మంగళవారం కాకినాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 64 మండలాల్లో ఉద్యానవన పంటలు 4లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం అన్ని గ్రామ సచివాలయాల పరిధిలోని గ్రామీణ ఉద్యాన సహాయకులు ఈ-క్రాపింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈనెలాఖరు నాటికి ఈ క్రాపింగ్ పూర్తయ్యే అవకాశాలున్నాయని డిడి వివరించారు.

Kakinada

2021-09-07 05:47:07

తూ.గో. 16 పశువైద్యుల పోస్టులు ఖాళీలు..

తూర్పుగోదావరి జిల్లాలో 16 పశు వైద్యుల పోస్టులు ఖాళీలు ఉన్నట్టు పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డా.ఎస్.సూర్యప్రకాశరావు తెలియజేశారు. మంగళవారం ఆయన కాకినాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 64 మండలాల పరిధిలో పశువైద్యలు లేని చోట ఉన్నవైద్యులకే అదనపు బాధ్యతలు అప్పగించామన్నారు. వారికి సహాయంగా గ్రామీణ పశువైద్య సహాయకులు పనిచేస్తున్నారని చెప్పారు. గతంలో కంటే ఇపుడు పశువైద్యం పూర్తిస్థాయిలో మెరుగు పడిందని, మందులు కూడా కూడా లభ్యం అవుతున్నాయన్నారు. పాడి రైతులు తమ పశువుల కోసం ఏ విధమైన సహాయమైనా రైతుభరోసా కేంద్రాలు,  వెటర్నరీ డిస్పెన్సరీల ద్వారా పొందవచ్చునని ఆయన సూచించారు.

Kakinada

2021-09-07 03:27:27

తూ.గో. 55ఆర్బీకేలు నిర్మాణాలు పూర్తి..

తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకూ 55 రైతేభరోసా కేంద్రాలు నిర్మాణం పూర్తైందని వ్యవసాయశాఖ జాయింట్ డైక్టర్ ఎన్.విజయ్ కుమార్ తెలియజేశారు. మంగళవారం కాకినాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం జిల్లాకు 1204 రైతుభరోసాకేంద్రాలను మంజూరుచేసిందన్నారు. వాటిలో 720 నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. డిసెంబరు నాటికి మొత్తం ఆర్బీకేల నిర్మాణాలు పూర్తికానున్నాయని, నిర్మాణాలు వేగం పుంజుకున్నాయని ఆయన వివరించారు.

Kakinada

2021-09-07 03:22:22

విద్య, వైద్యరంగాలకే అధిక ప్రాధాన్యత..

ప్ర‌ధానంగా విద్య‌, వైద్య రంగాల‌పై దృష్టిసారించ‌డంతో పాటు ప్ర‌భుత్వ ప్రాధాన్య ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల అమ‌ల్లో జిల్లాను ముందు నిలిపేందుకు కృషిచేయ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ చేవూరి హ‌రికిర‌ణ్ పేర్కొన్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్‌లో ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా ప్ర‌తినిధుల‌తో జ‌రిగిన కాఫీ విత్ క‌లెక్ట‌ర్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ పాత్రికేయుల‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా అభివృద్ధి, సంక్షేమం ప‌రంగా ప్రాధాన్య కార్య‌క్ర‌మాల‌ను, ప్ర‌ణాళిక‌ల‌ను క‌లెక్ట‌ర్ వివ‌రించారు. గ్రామాల్లో స‌చివాల‌యాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, డిజిట‌ల్ లైబ్ర‌రీలు ఇలా వివిధ ప్ర‌భుత్వ ప్రాధాన్య శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాల ద్వారా సంప‌ద సృష్టితో పాటు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా ప్ర‌భుత్వ సేవ‌ల పంపిణీ స‌జావుగా జరుగుతోంద‌ని పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ ప్రాధాన్య‌త‌ను దృష్టిలో ఉంచుకొని పంట కాల్వ‌లు, డ్రెయిన్ల ఆధునికీక‌ర‌ణ‌కు ప్ర‌తిపాద‌నలు రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు. అప్ ల్యాండ్ ప్రాంతంలో కొత్త‌గా ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌న్నారు. అదే విధంగా ఏలేరు, తాండ‌వ అనుసంధానంపైనా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని వివ‌రించారు. ముంపు స‌మ‌స్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో డ్రెయిన్లలో డీసిల్టింగ్‌, డ్రెడ్జింగ్ వంటి ప‌నులు చేప‌ట్టడం జ‌రుగుతుంద‌న్నారు. న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం అమ‌ల్లో ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వం ఇస్తున్న రూ.1,80,000కు అద‌నంగా స్వ‌యం స‌హాయ‌క సంఘాల లింకేజీ రుణాల కింద మ‌రో రూ.50,000 ఆర్థిక స‌హాయం అందేలా చూస్తున్నామ‌న్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ర‌హ‌దారులు, వంతెన‌లు త‌దిత‌రాలకు సంబంధించి మౌలిక వ‌స‌తుల‌ను అభివృద్ధి చేయ‌డం ప్ర‌ధాన‌మ‌ని, అనుమ‌తుల మేర‌కు వీటిపై దృష్టిసారించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ప్ర‌కృతి సౌంద‌ర్యానికి నిల‌య‌మైన జిల్లాను ప‌ర్యాట‌కంగా మ‌రింత అభివృద్ధి చేసేందుకు అవ‌కాశ‌ముంద‌ని, మారేడుమిల్లి, కోన‌సీమ ప్రాంతాల్లో ర‌హ‌దారులు, నీటి సౌక‌ర్యాలు క‌ల్పిస్తే చాలు.. మ‌రిన్ని రిసార్టుల ఏర్పాటుకు చాలామంది సిద్ధంగా ఉన్నార‌న్నారు. జిల్లాలో ఆయిల్, గ్యాస్‌, మ‌త్స్య త‌దిత‌ర రంగాల్లో ప్ర‌ముఖ పారిశ్రామిక సంస్థ‌లు ఉన్నాయ‌ని.. కార్పొరేట్ సామాజిక బాధ్‌ాత (సీఎస్ఆర్) ద్వారా ఈ సంస్థ‌ల‌ను జిల్లా అభివృద్ధి కార్యాచ‌ర‌ణ‌లో భాగ‌స్వాముల‌ను చేయ‌డంపై దృష్టిసారిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. పారిశ్రామికంగానూ జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లాలోని ఏడెనిమిది ఇసుక డిపోల్లో 5-6 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల ఇసుక అందుబాటులో ఉంద‌ని, ఇసుక స‌ర‌ఫ‌రాకు ఆటంకం లేకుండా చూస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. బోట్స్‌మెన్ సొసైటీల‌కు కూడా అనుమ‌తులు ఇచ్చిన‌ట్లు తెలిపారు.
  
ఆసుప‌త్రుల్లో మౌలిక వ‌స‌తుల అభివృద్ధి
కోవిడ్ మ్యుటేష‌న్స్ నేప‌థ్యంలో స‌న్న‌ద్ధ‌తా చ‌ర్య‌ల్లో భాగంగా జిల్లాలో ఆసుప‌త్రుల‌ను మౌలిక వ‌స‌తుల ప‌రంగా అభివృద్ధి చేస్తున్నామ‌ని, పీఎస్ఏ యూనిట్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. రోజుకు అయిదు వేల నుంచి ఆరువేల వ‌ర‌కు కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని, ప్ర‌స్తుతం కాకినాడ‌లో ఉన్న వీఆర్‌డీఎల్ ల్యాబ్‌కు అద‌నంగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, అమ‌లాపురంలోనూ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్న‌ట్లు తెలిపారు. రంప‌చోడ‌వ‌రంలోనూ ల్యాబ్ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. పోల‌వ‌రం నిర్వాసిత ప్రాంతాల్లో ఆర్ అండ్ ఆర్ కాల‌నీల్లో ఇళ్ల నాణ్య‌తపైనా దృష్టిసారిస్తున్నామ‌ని, థ‌ర్డ్‌పార్టీ డిపార్ట్‌మెంట్‌తో నాణ్య‌తా ప్ర‌మాణాల‌ను త‌నిఖీ చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. నిర్వాసిత గ్రామాల స‌ర్పంచ్‌ల భాగ‌స్వామ్యంతో ప్రాజెక్టు లెవెల్ మానిట‌రింగ్ క‌మిటీ (పీఎల్ఎంసీ)ని ఏర్పాటు చేశామ‌ని, ఈ నెల 17న క‌మిటీ తొలి స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు. 

పాత్రికేయుల స‌మ‌స్య‌ల‌పై దృష్టి
స‌మావేశంలో వివిధ మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధులు.. ఇళ్ల స్థ‌లాలు, ప్ర‌మాద బీమా, కోవిడ్ కార‌ణంగా మ‌ర‌ణించిన జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం, అక్రిడిటేష‌న్లు త‌దిత‌ర అంశాల‌ను క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకురాగా.. జిల్లాలో పాత్రికేయుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేయ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. కోవిడ్ కార‌ణంగా మ‌ర‌ణించిన పాత్రికేయ కుటుంబాల సంక్షేమానికి చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలిపారు. జిల్లాలో 2021-2022 ద్వైవార్షిక కాలానికి జిల్లాలో వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్, న్యూస్ ఏజెన్సీ మీడియా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 555 మంది అర్హులైన జర్నలిస్ట్ లకు మీడియా అక్రిడిటేషన్లు జారీ చేసామని జిల్లా కలెక్టర్  తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ జి.ఓ నెం.142లోని నిర్థేశాల ప్రకారం గత డిశంబరు నెలలో జరిగిన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో 261 మంది జర్నలిస్ట్ లకు అక్రిడిటేషన్లు జారీ చేయగా, ఈ నెల 3వ తేదీన జరిగిన కమిటీ సమావేశంలో మరో 294 మందికి అక్రిడిటేషన్లు జారీ చేసామని ఆయన తెలియజేశారు. సమావేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, న్యూస్ ఏజెన్సీల జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Kakinada

2021-09-06 14:20:14

అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి..

జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద ప్రకటించబడిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల పేర్లులో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 9లోగా  తెలియజేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీచేసారు. జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద డెంటల్ హైజినిస్ట్, ఆడియోలజిస్ట్, సైకాలజిస్ట్, కార్డియాలజిస్ట్, సైక్రాటిస్ట్, జనరల్ మెడిసిన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, మరియు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -  ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనియున్న అభ్యర్ధుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్టులను శ్రీకాకుళం జిల్లా అధికారిక వెబ్ సైట్ www.srikakulam.ap.gov.in వెబ్ పోర్టల్ నందు అభ్యర్ధుల సౌకర్యార్ధం ఉంచినట్లు చెప్పారు. కావున సదరు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనియున్న అభ్యర్ధులు వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ నందు వారి పేర్లు మరియు మెరిట్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని చెప్పారు. వీటిపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నచో సెప్టెంబర్  9లోగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంనకు వచ్చి వారి అభ్యంతరాలను తెలియజేసి సరిచేసుకోవలసినదిగా ఆయన ఆ ప్రకటనలో కోరారు.

Srikakulam

2021-09-06 14:15:07

సంక్షేమ పథకాలు పూర్తిగా అమలుచేయాలి..

రాష్ట్ర ప్రభుత్వం  పేద ప్రజలు సంక్షేమం  కోసం పలు అభివృద్ది ఫథకాలను అమలు చేస్తున్నదని వాటిని సక్రమంగా అమలు చేయాల్సిన భాద్యత అధికారులదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు జిల్లా ఇన్ చార్జిమంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు.  శనివారం వి ఎం .ఆర్ డి ఎ చిల్డ్రన్ ఎరినాలో  జిల్లా లో అమలు జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.  జి.వి.ఎం .సి,  వి.ఎం .ఆర్ డి ఎ లలో జరుగుతున్న అభివృద్ది పనులు, ఇరిగేషన్, ఆరోగ్యం, నాడు – నేడు పనులు ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలైన, సచివాలయాలు, ఆర్.బి.కె.లు, డిజిటల్ లైబ్రేరీలు, అంగన్వాడీ భవన నిర్మాణాల పనులు, వై ఎస్ ఆర్ అర్బన్, విలేజ్ హెల్త్ క్లినిక్ లు, మెడికల్ కాలేజీలు, పి.హెచ్ సిలు, సి.హెచ్.సిలు, వ్యవసాయ మరియు అనుబంధశాఖలలో నూతన ప్రాజెక్టుల వివరాలు, గృహనిర్మాణాల పనులు, పరిశ్రమలలో నూతన మెగా ప్రాజెక్టులు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో  రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి, జిల్లా కలెక్టర్ .డా.ఎ.మల్లిఖార్జున,పార్లమెంటుసభ్యులుబి.సత్యవతి,ఎం.వి.వి.సత్యన్నారాయణ, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, నగర మేయర్ జి.హరివెంకటకుమారి, వి.ఎం.ఆర్.డి.ఎ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, వి.ఎం .ఆర్ .డి.ఎ. కమిషనర్ రమాణారెడ్డి, జి.వి.ఎం .సి కమిషనర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్లు  ఎం .వేణుగోపాల రెడ్డి, పి.అరుణ్ బాబు,   శాసన సభ్యులు గొల్లబాబురావు, కన్నబాబురాజు, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ , గుడివాడ అమర్ నాద్, అధీప్ రాజు, కె.భాగ్యలక్ష్మి, వాసుపల్లి గణేష్ కుమార్, పలు కార్పోరేషన్ల చైర్మన్ లు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరైయారు. 
ఈ సందర్భంగా ఇన్ చార్జి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా వరకు కోవిడ్ ఉదృతి తగ్గిందని ఇక అభివృద్ది సంక్షేమ పథకాలపై అధికారులు దృష్టి పెట్టి పనులను వేగవంతం చేయాలన్నారు.  మన ముఖ్యమంత్రి విశాఖపట్నానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ పలు కార్పోరేషనులకు చైర్మన్ లను ఏర్పాటు చేసారన్నారు.   సంబందిత చైర్మన్ లు వారికి అప్పగించిన కార్పోరేషన్ల అభివృద్దికి పాటు పడాలన్నారు. కొండవాలు ప్రాంతాలు, డ్రైనేజి కాలువలకు రిటైనింగ్ వాల్సు పనులకు సంబందించి  జోనల్ కమిషనర్లు, కార్పోరేటర్లతో  చర్చించి పనులను చేపట్టాలన్నారు. వార్డు సెక్రటేరియట్ సిబ్బంది సక్రమంగా పని చేయటం లేదని పిర్యాదులు అందుతున్నాయన్నారు. 
అన్ని సచివాలయాల సిబ్బంది సంక్షేమ పథకాల డేటా పై అవగాహన కలిగి ఉండాలని , రిజిష్టరు ను మెయింటైన్  చేయాలన్నారు. ఇంజనీరింగు అధికారులు సచివాలయాలను తనిఖీ చేసి  సిబ్బంది చేస్తున్న ఫిర్యాదులను పరిశీలించాలన్నారు.  100 గజాల లోపు స్థలాలలో  ఇళ్లు నిర్మించుకుంటున్న పేదవాళ్ల ఇళ్లను పడగొట్టి ఇబ్బంది  పెట్టవద్దని వారికి తగు న్యాయం చేయాల్సిందిగా  కమిషనర్ కు సూచించారు.   మురికి వాడలలో నివసిస్తున్న వారికి పట్టాలు ఇచ్చి  ఇళ్ల నిర్మాణాలను  చేపట్టి మురికివాడల రహిత ప్రాంతాలగా తీర్చి దిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాదన్నారు. 
రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో జరిగే అభివృద్ది కార్యక్రమాల శంఖుస్థాపనలు, ప్రారంబోత్సవాలకు  తప్పని సరిగా ప్రొటోకాల్ నిబందనలను పాటించాలని,  కార్పోరేటర్లు,  నియోజక వర్గ ప్రజా ప్రతినిధులను  నిర్లక్ష్యం చేయకుండా  అహ్వనించాలన్నారు.   ప్రొటోకాల్ ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తీసుకోవల్సిందిగా కలెక్టర్ కు  స్పష్టం చేశారు.   జి.వి.ఎం .సి పరిధిలో  ఉండే షాపుల అద్దెలకు సంబందించి  ఇటీవల కాలంలో చాలా ఫిర్యాదులు అందుతున్నాయని ప్రభుత్వ ఉత్తర్వువులు  వచ్చిన తదిపరి తగు చర్యలు తీసుకోవల్సిందిగా జి.వి.ఎం .సి కమిషనర్ కు  సూచించారు.  అదే విదంగా   షాపుల లీజులను సంబందించి  కార్పోరేటర్లతో సబ్ కమిటి వేసి నివేదిక వచ్చిన తరువాత కౌన్సిల్ లో 15 రోజుల్లో చర్చించి ముందుకు వెళ్లాల్సిందిగా తెలిపారు. 
రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి  ఇళ్ల లేని ప్రతి నిరుపేదకు గృహ నిర్మాణాలను అందజేస్తూ వారికి మౌళిక వసతులను కల్పిస్తున్నారన్నారు. మధురవాడ ప్రాంతంలో వీధిలైట్లు, త్రాగునీరు, శానిటేషన్ సమస్య అధికంగా ఉందని సమస్యలను పరిష్కరించాల్సిందిగా జి.వి.ఎం .సి కమిషనర్ కు ఆదేశించారు.   
జి.వి.ఎం.సి లో జరుగుతున్న ప్రాజెక్టుల అభివృద్ది పనులకు సంబందించి కమిషనర్ జి.సృజన పవర్ పాయింట్ ప్రజన్టేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. అనంతరం వి.ఎం .ఆర్ .డి.ఎ., కమిషనర్  ఎన్ .ఎ. డి ప్లైఓవర్, సిరిపురం లో మల్టీ లెవెల్ కారు పార్కింగ్,  మరియు కమర్షియల్ కాంప్లెక్స్, బీచ్ రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్, కైలాసగిరిలో 380 ఎకరాలలో అభివృద్ది పనులు, ఎన్ హెచ్ 16, అచ్చుతాపురం, చుక్కవానిపాలెం నుండి నాతయ్యపాలెం వరకు  మాష్టర్ ప్లాన్ రోడ్డు కనెక్షన్  తదితర పనులను గూర్చి మంత్రులకు వివరించారు. 
కోవిడ్ ను ఎదుర్కోవడంలో రాష్ట్రం తీసుకున్న చర్యలకు ప్రత్యేక ప్రశంసలు లభించాయని మంత్రి కన్నబాబు తెలిపారు.  కోవిడ్ మూడవ వేవ్ వచ్చినట్లయితే ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్దంగా వుందని మంత్రి వెల్లడించారు.   సంసిద్దత, చేపట్టిన చర్యలను గూర్చి జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు వివరించారు.  
జిల్లాలో జివియంసి, అర్బన్ హెల్త్ సెంటర్లు, కెజిహెచ్ లలో కరోనా సమయంలో విధులను నిర్వహించిన తాత్కాలిక ఎఎన్ఎం, టెక్నీషియన్స్ తదతర వైద్య ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిందిగా  విజయసాయి రెడ్డిని,  మంత్రులను అభ్యర్ధించగా  వారికి ఉద్యోగ భద్రత కొరకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. 

Visakhapatnam

2021-09-06 13:49:29

ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటుచేసే వారికి స‌హ‌కారం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అనువైన సానుకూల వాతావ‌ర‌ణం క‌ల్పిస్తామ‌ని, ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చే వారికి జిల్లా యంత్రాంగం ద్వారా త్వ‌ర‌గా అవ‌స‌ర‌మైన అనుమ‌తులు మంజూరుచేసి పూర్తిస్థాయిలో స‌హ‌కారం అందిస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి చెప్పారు. పారిశ్రామిక వేత్త‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలియ‌జేస్తే వాటిని త‌మ స్థాయిలో వున్న వాటిని వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు సిద్ధంగా వున్నామ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి ప‌రిశ్ర‌మ‌లు, ఎగుమ‌తుల ప్రోత్స‌హ‌క క‌మిటీ స‌మావేశం జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో జ‌రిగింది. ప‌రిశ్ర‌మ‌లు, కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి, విద్యుత్‌, గ‌నులు, అగ్నిమాప‌క, పుర‌పాల‌క‌, పంచాయ‌తీరాజ్ శాఖ‌ల‌తో పాటు ఇత‌ర శాఖ‌ల‌కు చెందిన అధికారులు, బ్యాంకు అధికారులు జిల్లాలోని ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు, యాజ‌మాన్య ప్ర‌తినిధులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. పారిశ్రామిక వేత్త‌లు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి జిల్లా ప‌రిశ్ర‌మ‌ల ప్రోత్సాహ‌క క‌మిటీ సమావేశాన్ని ఒక వేదిక‌గా వినియోగించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. వివిధ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప్ర‌తినిధులు ప‌రిశ్ర‌మ‌ల‌కు అందించాల్సిన ప్రోత్సాహ‌కాల‌పై వ్య‌క్తం చేసిన అభిప్రాయాల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్క‌రించేందుకు కృషిచేస్తామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

ఈ సంద‌ర్భంగా జిల్లాలో పారిశ్రామిక రాయితీల కోసం వ‌చ్చిన 44 ద‌ర‌ఖాస్తుల్లో రెండు మిన‌హా 42 ద‌ర‌ఖాస్తుల్లో ఆయా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం నుంచి రూ.1.67 కోట్ల‌ రాయితీల కోసం సిఫార‌సు చేస్తూ స‌మావేశంలో నిర్ణ‌యించారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం అనుమ‌తుల మంజూరుకోసం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో పెండింగులో వున్న 14 ద‌ర‌ఖాస్తుల‌పై క‌లెక్ట‌ర్ స‌మీక్షించి, కాలుష్య నియంత్ర‌ణ  వంటి శాఖ‌ల అధికారుల‌తో మాట్లాడి వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకోసం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో 8 ద‌ర‌ఖాస్తులు తిర‌స్క‌ర‌ణ‌కు గురికాగా వాటికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. ద‌ర‌ఖాస్తు చేసిన వారు ఏవైనా డాక్యుమెంట్లు స‌మ‌ర్పించాల్సి వ‌స్తే వారికి త‌గిన అవగాహ‌న క‌ల్పించి వారు వాటిని స‌మ‌కూర్చుకునేలా వారికి సంబంధిత శాఖ‌లు స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

చిన్న‌ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వ అధికారి జివిఆర్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో ప‌ది ర‌కాల ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని త‌మ శాఖ గుర్తించింద‌ని పేర్కొన్నారు. మామిడి తాండ్ర‌, జీడి, రైస్ మిల్లులు, గ్రానైట్ ఉత్ప‌త్తులు, జ‌న‌ర‌ల్ ఇంజ‌నీరింగ్‌, కాయిర్‌, చేనేత జౌళి సంబంధ ప‌రిశ్ర‌మ‌లు, సంగీత వాద్య ప‌రిక‌రాలు, తేనె, చింత‌పండు ప్రాసెసింగ్‌, కూర‌గాయ‌లు ఆధారిత ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటుకు జిల్లాలో సానుకూల ప‌రిస్థితులు వున్న‌ట్లు చెప్పారు.

ఈ రంగాల్లో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వ‌చ్చిన‌ట్ల‌యితే జిల్లా యంత్రాంగం ప్రోత్స‌హిస్తుంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు చెప్పారు.

జిల్లాలో రాష్ట్ర పారిశ్రామిక మౌళిక వ‌స‌తుల సంస్థ వ‌ద్ద ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకోసం కేటాయించేందుకు 625 ఎక‌రాల భూములు సిద్ధంగా వున్నాయని ఏపిఐఐసి జోన‌ల్ మేనేజ‌ర్ ఆర్‌.పాపారావు వివ‌రించారు. బొబ్బిలి గ్రోత్ సెంట‌ర్‌లో 383 ఎక‌రాలు, రామ‌భ‌ద్ర‌పురం స‌మీపంలోని కొట్టక్కి వ‌ద్ద అభివృద్ధి చేయ‌ని 187 ఎక‌రాల భూములు, భోగాపురం మండ‌లం కొంగ‌వానిపాలెం వద్ద అభివృద్దిప‌ర‌చ‌ని 12.37 ఎక‌రాలు, కొత్త‌వ‌ల‌స మండ‌లం బ‌లిఘ‌ట్టం వ‌ద్ద 43 ఎక‌రాలు ఎం.ఎస్‌.ఎం.ఇ. పార్కు కోసం సిద్దంగా వున్న‌ట్టు చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు త‌మ స‌మ‌స్య‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు. డెక్క‌న్ ఫెర్రో ఎల్లాయిస్ ప‌రిశ్ర‌మ ఎం.డి., రాష్ట్ర ఫెర్రో ఎల్లాయిస్ ఉత్ప‌త్తి దారుల సంఘం ఉపాధ్య‌క్షుడు పి.ఎస్‌.ఆర్‌.రాజు మాట్లాడుతూ త‌మ ప‌రిశ్ర‌మ‌ల‌కు విద్యుత్ రాయితీలే కీల‌క‌మ‌ని, 2014 నుంచి త‌మ‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రాకు సంబంధించి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రాయితీలు విడుద‌ల చేసి త‌మ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆదుకోవాల‌ని కోరారు. జిల్లాలో 16 యూనిట్ల‌కు గాను 12 ప‌రిశ్ర‌మ‌లే ప్ర‌స్తుతం న‌డుస్తున్నాయ‌ని, వాటిని కొన‌సాగించేందుకు రాయితీలను విడుద‌ల చేయ‌డం త‌క్ష‌ణావ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు.

జూట్ ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌క‌టించిన రాయితీల్లో రెండు రోజుల క్రితం కొంత‌మేర‌కు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌ని, మిగిలిన‌వి కూడా వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆ పరిశ్ర‌మ‌ల త‌ర‌పున హాజ‌రైన సునీల్ బ‌వారియా కోరారు.

ప‌రిశ్ర‌మ‌ల‌కు ఫిక్స్‌డ్ చార్జీల నుంచి మిన‌హాయింపు ఇస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని, అయితే ఆ ఆదేశాలు ఇంకా అమ‌లు కాలేద‌ని, వాటిని వెంట‌నే అమ‌లుచేసి చిన్న‌ప‌రిశ్ర‌మ‌ల‌కు ఊర‌ట క‌ల్పించాల‌ని చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్ర‌తినిధి రామ‌లింగ‌స్వామి కోరారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌ళిత పారిశ్రామిక వేత్త‌ల‌కోసం జ‌గ‌న‌న్న బ‌డుగు వికాసం ప‌థ‌కాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంద‌ని, ఈ ప‌థ‌కం అమ‌లులో భాగంగా ఔత్సాహికులైన ద‌ళిత పారిశ్ర‌మిక వేత్త‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వెంట‌నే ఒక అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించాల‌ని డిక్కీ(ద‌ళిత పారిశ్రామిక వేత్త‌ల సంఘం) ప్ర‌తినిధి కోరారు.

జిందాల్ సంస్థ ప్ర‌తినిధి మాట్లాడుతూ ఎస్‌.కోట మండ‌లంలో త‌మ పారిశ్రామిక సంస్థ‌కు మంజూరు చేసిన 1168 ఎక‌రాల్లో చిన్న‌ప‌రిశ్ర‌మ‌ల పార్కును ఏర్పాటు చేస్తున్న‌ట్టు ఆ సంస్థ ప్ర‌తినిధి వివరించారు. డిసెంబ‌రు 2023 నాటికి 2000 కోట్ల విలువైన పెట్టుబ‌డులు వ‌చ్చేలా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు పేర్కొన్నారు. ఈ పార్కులో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకోసం అవ‌స‌ర‌మైన అనుమ‌తులు వెంట‌నే మంజూరు చేయాల‌ని కోరారు.

స‌మావేశంలో జిల్లా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం జన‌ర‌ల్ మేనేజ‌ర్ జి.ఎం.శ్రీ‌ధ‌ర్‌., జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఎల్‌.డి.ఎం. శ్రీ‌నివాస‌రావు, సాంఘిక సంక్షేమ డి.డి. సునీల్ రాజ్ కుమార్‌, అగ్నిమాప‌క శాఖ అధికారి జె.మోహ‌న‌రావు, భూగ‌ర్భ జ‌ల‌శాఖ ఏ.డి. ర‌మ‌ణ‌మూర్తి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-06 13:46:58