గర్భస్థ పిండ ఆరోగ్య పరిశీలనకు నిర్థేశించిన పరీక్షలను లింగ నిర్థారణ కొరకు దుర్విని యోగం కాకుండా ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై గట్టి నిఘా, రహస్య డెకాయ్ ఆపరేషన్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో ఆడ శిశువుల పట్ల వివక్షను తొలగించేందుకు ఏర్పాటు చేసిన గర్భధారణక పూర్వ, గర్భస్థ పిండ పరీక్షల దుర్వినియోగ నివారణ ( పిసి, పిఎన్డిటి) చట్టం అమలుపై జిల్లా స్థాయి ఆధారిటీ, అడ్వయిజరీ కమీటీ సమావేశం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆయన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ యం.రవీంద్రనాద్ బాబు, 4వ అడిషనల్ జడ్జి ఎన్.శ్రీనివాసరావు లతో కలిసి వైద్య అధికారులు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టం పటిష్ట అమలుకు చేపట్టవలసిన చర్యలపై విస్తృతంగా సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆడ శిశువుల పట్ల వివక్షతతో జరిగే భ్రూణ హత్య వంటి అమానుష ధోరణుల వల్ల సమాజంలో స్త్రీ, పురుష నిష్పత్తిలో సంతులనం లేకుంటే విపరీతమైన పరిణామాలకు దారితీస్తుందని, దీనిని నివారించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను కోరారు. గర్భస్థ పిండ ఆరోగ్య పరిశీలన కొరకు ఆధునిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ వైద్య పరీక్షల ప్రక్రియ పుట్టబోయేది మగ లేక ఆడ అనే లింగ నిర్థారణకు దుర్వినియోగం చేయడం నేరమని, జిల్లాలో అటుంవంటి అక్రమాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన తీవ్ర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గర్భస్థ పిండ పరీక్షలు నిర్వహణ నిర్వహించే స్కానింగ్ సెంటర్లకు జిల్లా స్థాయి అధారిటీ అనుమతి తప్పని సరిగా ఉండాలని, అలాగే ప్రభుత్వం నిర్థేశించిన నియమావళిని ఈ సెంటర్లు ఖచ్చితంగా పాటించాలన్నారు. స్కానింగ్ పరీక్షలు పిండ లింగ నిర్థారణ వెల్లడికి దుర్వినియోగం కాకుకండా జిల్లాలో రిజిష్టర్ అయిన 276 స్కానింగ్ సెంటర్ల పై డివిజనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఈ సెంటర్ల కార్యకలాపాలను రహస్య ఆపరేషన్లతో గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. డెకాయ్ ఆపరేషన్లలో గర్బస్థ లింగ నిర్థారణ వెల్లడిక పాల్పడిన కేసులను నిరూపణ చేసిన బృందానికి 50 వేలు నగదు ప్రోత్సాహకాన్ని అందించడంతో బాటు, రాష్ట్ర స్థాయి ప్రశంసా పురస్కారాలకు ప్రతిపాదిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో గడచిన ఏడాది కాలంలో జరిగిన ప్రసవాలలో మగ, ఆడ శిశువుల గణాంకాలను విశ్లేషించి, లింగ అసమతౌల్యం గమనించిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టం గురించి, స్కానింగ్ పరీక్షలను దుర్వినియోగం చేసే వారి సమాచారం అందించేందుకు జిల్లా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబరు 1800-425-3365 గురించి ప్రజలకు విస్తృత ప్రచారం ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. జిల్లాలో కృత్రిమ గర్భదారణలు నిర్వహిస్తున్న ఐవిఎఫ్ సెంటర్ల కార్యకలాపాలపై కూడా ప్రత్యక నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఐవిఎఫ్ ఫెసిలిటీల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని కోరారు. జిల్లాలో రిజిష్టరైన సెంటర్ల రెన్యూవళ్లు, రిజిస్ట్రేషన్ కొరకు క్రొత్తగా అందిన ధరఖాస్తులపై చట్టపరమైన నిర్థేశాలను ఏవిధంగా అమలు చేస్తున్నదీ సమగ్రంగా పరిశీలించిన తరువాతే ఆమోదిస్తామని, పూర్తి సమాచారం, రికార్డులు, ఫోటోలతో తదుపరి సమావేశానికి రావాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ యం.రవీంద్రనాద్ బాబు మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లపై నిర్వహించే రహస్య ఆపరేషన్లు మరింత ఫ్రోఫెషనల్ శైలిలో నిర్వహించాల్సి ఉందని, ఇందుకు పోలీస్ యంత్రాంగం అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు డెకాయి ఆపరేషన్లలో మహిళా పోలీస్ సిబ్బంది సేవలను వినియోగిస్తామని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, రంపచోడవరం సబ్ కలెక్టర్ కె.సింహాచలం, డిఎంహెచ్ఓ కె.గౌరీశ్వరరావు, డిసిహెచ్ఎస్ రమేష్ కిషోర్, జిజిహెచ్ రేడియాలజిస్ట్ డా.అనూరాధ, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు వై.పద్మలత్, ఎస్.అప్పలనాయుడు, కె.వెంకటేశ్వరరావు, డిప్యూటీ డిఎంహెచ్ఓలు పాల్గొన్నారు.