1 ENS Live Breaking News

తూ.గో. 16 పశువైద్యుల పోస్టులు ఖాళీలు..

తూర్పుగోదావరి జిల్లాలో 16 పశు వైద్యుల పోస్టులు ఖాళీలు ఉన్నట్టు పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డా.ఎస్.సూర్యప్రకాశరావు తెలియజేశారు. మంగళవారం ఆయన కాకినాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 64 మండలాల పరిధిలో పశువైద్యలు లేని చోట ఉన్నవైద్యులకే అదనపు బాధ్యతలు అప్పగించామన్నారు. వారికి సహాయంగా గ్రామీణ పశువైద్య సహాయకులు పనిచేస్తున్నారని చెప్పారు. గతంలో కంటే ఇపుడు పశువైద్యం పూర్తిస్థాయిలో మెరుగు పడిందని, మందులు కూడా కూడా లభ్యం అవుతున్నాయన్నారు. పాడి రైతులు తమ పశువుల కోసం ఏ విధమైన సహాయమైనా రైతుభరోసా కేంద్రాలు,  వెటర్నరీ డిస్పెన్సరీల ద్వారా పొందవచ్చునని ఆయన సూచించారు.

Kakinada

2021-09-07 03:27:27

తూ.గో. 55ఆర్బీకేలు నిర్మాణాలు పూర్తి..

తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకూ 55 రైతేభరోసా కేంద్రాలు నిర్మాణం పూర్తైందని వ్యవసాయశాఖ జాయింట్ డైక్టర్ ఎన్.విజయ్ కుమార్ తెలియజేశారు. మంగళవారం కాకినాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం జిల్లాకు 1204 రైతుభరోసాకేంద్రాలను మంజూరుచేసిందన్నారు. వాటిలో 720 నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. డిసెంబరు నాటికి మొత్తం ఆర్బీకేల నిర్మాణాలు పూర్తికానున్నాయని, నిర్మాణాలు వేగం పుంజుకున్నాయని ఆయన వివరించారు.

Kakinada

2021-09-07 03:22:22

విద్య, వైద్యరంగాలకే అధిక ప్రాధాన్యత..

ప్ర‌ధానంగా విద్య‌, వైద్య రంగాల‌పై దృష్టిసారించ‌డంతో పాటు ప్ర‌భుత్వ ప్రాధాన్య ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల అమ‌ల్లో జిల్లాను ముందు నిలిపేందుకు కృషిచేయ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ చేవూరి హ‌రికిర‌ణ్ పేర్కొన్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్‌లో ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా ప్ర‌తినిధుల‌తో జ‌రిగిన కాఫీ విత్ క‌లెక్ట‌ర్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ పాత్రికేయుల‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా అభివృద్ధి, సంక్షేమం ప‌రంగా ప్రాధాన్య కార్య‌క్ర‌మాల‌ను, ప్ర‌ణాళిక‌ల‌ను క‌లెక్ట‌ర్ వివ‌రించారు. గ్రామాల్లో స‌చివాల‌యాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, డిజిట‌ల్ లైబ్ర‌రీలు ఇలా వివిధ ప్ర‌భుత్వ ప్రాధాన్య శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాల ద్వారా సంప‌ద సృష్టితో పాటు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా ప్ర‌భుత్వ సేవ‌ల పంపిణీ స‌జావుగా జరుగుతోంద‌ని పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ ప్రాధాన్య‌త‌ను దృష్టిలో ఉంచుకొని పంట కాల్వ‌లు, డ్రెయిన్ల ఆధునికీక‌ర‌ణ‌కు ప్ర‌తిపాద‌నలు రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు. అప్ ల్యాండ్ ప్రాంతంలో కొత్త‌గా ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌న్నారు. అదే విధంగా ఏలేరు, తాండ‌వ అనుసంధానంపైనా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని వివ‌రించారు. ముంపు స‌మ‌స్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో డ్రెయిన్లలో డీసిల్టింగ్‌, డ్రెడ్జింగ్ వంటి ప‌నులు చేప‌ట్టడం జ‌రుగుతుంద‌న్నారు. న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం అమ‌ల్లో ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వం ఇస్తున్న రూ.1,80,000కు అద‌నంగా స్వ‌యం స‌హాయ‌క సంఘాల లింకేజీ రుణాల కింద మ‌రో రూ.50,000 ఆర్థిక స‌హాయం అందేలా చూస్తున్నామ‌న్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ర‌హ‌దారులు, వంతెన‌లు త‌దిత‌రాలకు సంబంధించి మౌలిక వ‌స‌తుల‌ను అభివృద్ధి చేయ‌డం ప్ర‌ధాన‌మ‌ని, అనుమ‌తుల మేర‌కు వీటిపై దృష్టిసారించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ప్ర‌కృతి సౌంద‌ర్యానికి నిల‌య‌మైన జిల్లాను ప‌ర్యాట‌కంగా మ‌రింత అభివృద్ధి చేసేందుకు అవ‌కాశ‌ముంద‌ని, మారేడుమిల్లి, కోన‌సీమ ప్రాంతాల్లో ర‌హ‌దారులు, నీటి సౌక‌ర్యాలు క‌ల్పిస్తే చాలు.. మ‌రిన్ని రిసార్టుల ఏర్పాటుకు చాలామంది సిద్ధంగా ఉన్నార‌న్నారు. జిల్లాలో ఆయిల్, గ్యాస్‌, మ‌త్స్య త‌దిత‌ర రంగాల్లో ప్ర‌ముఖ పారిశ్రామిక సంస్థ‌లు ఉన్నాయ‌ని.. కార్పొరేట్ సామాజిక బాధ్‌ాత (సీఎస్ఆర్) ద్వారా ఈ సంస్థ‌ల‌ను జిల్లా అభివృద్ధి కార్యాచ‌ర‌ణ‌లో భాగ‌స్వాముల‌ను చేయ‌డంపై దృష్టిసారిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. పారిశ్రామికంగానూ జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లాలోని ఏడెనిమిది ఇసుక డిపోల్లో 5-6 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల ఇసుక అందుబాటులో ఉంద‌ని, ఇసుక స‌ర‌ఫ‌రాకు ఆటంకం లేకుండా చూస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. బోట్స్‌మెన్ సొసైటీల‌కు కూడా అనుమ‌తులు ఇచ్చిన‌ట్లు తెలిపారు.
  
ఆసుప‌త్రుల్లో మౌలిక వ‌స‌తుల అభివృద్ధి
కోవిడ్ మ్యుటేష‌న్స్ నేప‌థ్యంలో స‌న్న‌ద్ధ‌తా చ‌ర్య‌ల్లో భాగంగా జిల్లాలో ఆసుప‌త్రుల‌ను మౌలిక వ‌స‌తుల ప‌రంగా అభివృద్ధి చేస్తున్నామ‌ని, పీఎస్ఏ యూనిట్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. రోజుకు అయిదు వేల నుంచి ఆరువేల వ‌ర‌కు కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని, ప్ర‌స్తుతం కాకినాడ‌లో ఉన్న వీఆర్‌డీఎల్ ల్యాబ్‌కు అద‌నంగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, అమ‌లాపురంలోనూ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్న‌ట్లు తెలిపారు. రంప‌చోడ‌వ‌రంలోనూ ల్యాబ్ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. పోల‌వ‌రం నిర్వాసిత ప్రాంతాల్లో ఆర్ అండ్ ఆర్ కాల‌నీల్లో ఇళ్ల నాణ్య‌తపైనా దృష్టిసారిస్తున్నామ‌ని, థ‌ర్డ్‌పార్టీ డిపార్ట్‌మెంట్‌తో నాణ్య‌తా ప్ర‌మాణాల‌ను త‌నిఖీ చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. నిర్వాసిత గ్రామాల స‌ర్పంచ్‌ల భాగ‌స్వామ్యంతో ప్రాజెక్టు లెవెల్ మానిట‌రింగ్ క‌మిటీ (పీఎల్ఎంసీ)ని ఏర్పాటు చేశామ‌ని, ఈ నెల 17న క‌మిటీ తొలి స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు. 

పాత్రికేయుల స‌మ‌స్య‌ల‌పై దృష్టి
స‌మావేశంలో వివిధ మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధులు.. ఇళ్ల స్థ‌లాలు, ప్ర‌మాద బీమా, కోవిడ్ కార‌ణంగా మ‌ర‌ణించిన జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం, అక్రిడిటేష‌న్లు త‌దిత‌ర అంశాల‌ను క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకురాగా.. జిల్లాలో పాత్రికేయుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేయ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. కోవిడ్ కార‌ణంగా మ‌ర‌ణించిన పాత్రికేయ కుటుంబాల సంక్షేమానికి చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలిపారు. జిల్లాలో 2021-2022 ద్వైవార్షిక కాలానికి జిల్లాలో వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్, న్యూస్ ఏజెన్సీ మీడియా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 555 మంది అర్హులైన జర్నలిస్ట్ లకు మీడియా అక్రిడిటేషన్లు జారీ చేసామని జిల్లా కలెక్టర్  తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ జి.ఓ నెం.142లోని నిర్థేశాల ప్రకారం గత డిశంబరు నెలలో జరిగిన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో 261 మంది జర్నలిస్ట్ లకు అక్రిడిటేషన్లు జారీ చేయగా, ఈ నెల 3వ తేదీన జరిగిన కమిటీ సమావేశంలో మరో 294 మందికి అక్రిడిటేషన్లు జారీ చేసామని ఆయన తెలియజేశారు. సమావేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, న్యూస్ ఏజెన్సీల జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Kakinada

2021-09-06 14:20:14

అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి..

జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద ప్రకటించబడిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల పేర్లులో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 9లోగా  తెలియజేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీచేసారు. జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద డెంటల్ హైజినిస్ట్, ఆడియోలజిస్ట్, సైకాలజిస్ట్, కార్డియాలజిస్ట్, సైక్రాటిస్ట్, జనరల్ మెడిసిన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, మరియు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -  ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనియున్న అభ్యర్ధుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్టులను శ్రీకాకుళం జిల్లా అధికారిక వెబ్ సైట్ www.srikakulam.ap.gov.in వెబ్ పోర్టల్ నందు అభ్యర్ధుల సౌకర్యార్ధం ఉంచినట్లు చెప్పారు. కావున సదరు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనియున్న అభ్యర్ధులు వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ నందు వారి పేర్లు మరియు మెరిట్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని చెప్పారు. వీటిపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నచో సెప్టెంబర్  9లోగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంనకు వచ్చి వారి అభ్యంతరాలను తెలియజేసి సరిచేసుకోవలసినదిగా ఆయన ఆ ప్రకటనలో కోరారు.

Srikakulam

2021-09-06 14:15:07

సంక్షేమ పథకాలు పూర్తిగా అమలుచేయాలి..

రాష్ట్ర ప్రభుత్వం  పేద ప్రజలు సంక్షేమం  కోసం పలు అభివృద్ది ఫథకాలను అమలు చేస్తున్నదని వాటిని సక్రమంగా అమలు చేయాల్సిన భాద్యత అధికారులదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు జిల్లా ఇన్ చార్జిమంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు.  శనివారం వి ఎం .ఆర్ డి ఎ చిల్డ్రన్ ఎరినాలో  జిల్లా లో అమలు జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.  జి.వి.ఎం .సి,  వి.ఎం .ఆర్ డి ఎ లలో జరుగుతున్న అభివృద్ది పనులు, ఇరిగేషన్, ఆరోగ్యం, నాడు – నేడు పనులు ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలైన, సచివాలయాలు, ఆర్.బి.కె.లు, డిజిటల్ లైబ్రేరీలు, అంగన్వాడీ భవన నిర్మాణాల పనులు, వై ఎస్ ఆర్ అర్బన్, విలేజ్ హెల్త్ క్లినిక్ లు, మెడికల్ కాలేజీలు, పి.హెచ్ సిలు, సి.హెచ్.సిలు, వ్యవసాయ మరియు అనుబంధశాఖలలో నూతన ప్రాజెక్టుల వివరాలు, గృహనిర్మాణాల పనులు, పరిశ్రమలలో నూతన మెగా ప్రాజెక్టులు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో  రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి, జిల్లా కలెక్టర్ .డా.ఎ.మల్లిఖార్జున,పార్లమెంటుసభ్యులుబి.సత్యవతి,ఎం.వి.వి.సత్యన్నారాయణ, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, నగర మేయర్ జి.హరివెంకటకుమారి, వి.ఎం.ఆర్.డి.ఎ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, వి.ఎం .ఆర్ .డి.ఎ. కమిషనర్ రమాణారెడ్డి, జి.వి.ఎం .సి కమిషనర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్లు  ఎం .వేణుగోపాల రెడ్డి, పి.అరుణ్ బాబు,   శాసన సభ్యులు గొల్లబాబురావు, కన్నబాబురాజు, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ , గుడివాడ అమర్ నాద్, అధీప్ రాజు, కె.భాగ్యలక్ష్మి, వాసుపల్లి గణేష్ కుమార్, పలు కార్పోరేషన్ల చైర్మన్ లు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరైయారు. 
ఈ సందర్భంగా ఇన్ చార్జి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా వరకు కోవిడ్ ఉదృతి తగ్గిందని ఇక అభివృద్ది సంక్షేమ పథకాలపై అధికారులు దృష్టి పెట్టి పనులను వేగవంతం చేయాలన్నారు.  మన ముఖ్యమంత్రి విశాఖపట్నానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ పలు కార్పోరేషనులకు చైర్మన్ లను ఏర్పాటు చేసారన్నారు.   సంబందిత చైర్మన్ లు వారికి అప్పగించిన కార్పోరేషన్ల అభివృద్దికి పాటు పడాలన్నారు. కొండవాలు ప్రాంతాలు, డ్రైనేజి కాలువలకు రిటైనింగ్ వాల్సు పనులకు సంబందించి  జోనల్ కమిషనర్లు, కార్పోరేటర్లతో  చర్చించి పనులను చేపట్టాలన్నారు. వార్డు సెక్రటేరియట్ సిబ్బంది సక్రమంగా పని చేయటం లేదని పిర్యాదులు అందుతున్నాయన్నారు. 
అన్ని సచివాలయాల సిబ్బంది సంక్షేమ పథకాల డేటా పై అవగాహన కలిగి ఉండాలని , రిజిష్టరు ను మెయింటైన్  చేయాలన్నారు. ఇంజనీరింగు అధికారులు సచివాలయాలను తనిఖీ చేసి  సిబ్బంది చేస్తున్న ఫిర్యాదులను పరిశీలించాలన్నారు.  100 గజాల లోపు స్థలాలలో  ఇళ్లు నిర్మించుకుంటున్న పేదవాళ్ల ఇళ్లను పడగొట్టి ఇబ్బంది  పెట్టవద్దని వారికి తగు న్యాయం చేయాల్సిందిగా  కమిషనర్ కు సూచించారు.   మురికి వాడలలో నివసిస్తున్న వారికి పట్టాలు ఇచ్చి  ఇళ్ల నిర్మాణాలను  చేపట్టి మురికివాడల రహిత ప్రాంతాలగా తీర్చి దిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాదన్నారు. 
రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో జరిగే అభివృద్ది కార్యక్రమాల శంఖుస్థాపనలు, ప్రారంబోత్సవాలకు  తప్పని సరిగా ప్రొటోకాల్ నిబందనలను పాటించాలని,  కార్పోరేటర్లు,  నియోజక వర్గ ప్రజా ప్రతినిధులను  నిర్లక్ష్యం చేయకుండా  అహ్వనించాలన్నారు.   ప్రొటోకాల్ ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తీసుకోవల్సిందిగా కలెక్టర్ కు  స్పష్టం చేశారు.   జి.వి.ఎం .సి పరిధిలో  ఉండే షాపుల అద్దెలకు సంబందించి  ఇటీవల కాలంలో చాలా ఫిర్యాదులు అందుతున్నాయని ప్రభుత్వ ఉత్తర్వువులు  వచ్చిన తదిపరి తగు చర్యలు తీసుకోవల్సిందిగా జి.వి.ఎం .సి కమిషనర్ కు  సూచించారు.  అదే విదంగా   షాపుల లీజులను సంబందించి  కార్పోరేటర్లతో సబ్ కమిటి వేసి నివేదిక వచ్చిన తరువాత కౌన్సిల్ లో 15 రోజుల్లో చర్చించి ముందుకు వెళ్లాల్సిందిగా తెలిపారు. 
రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి  ఇళ్ల లేని ప్రతి నిరుపేదకు గృహ నిర్మాణాలను అందజేస్తూ వారికి మౌళిక వసతులను కల్పిస్తున్నారన్నారు. మధురవాడ ప్రాంతంలో వీధిలైట్లు, త్రాగునీరు, శానిటేషన్ సమస్య అధికంగా ఉందని సమస్యలను పరిష్కరించాల్సిందిగా జి.వి.ఎం .సి కమిషనర్ కు ఆదేశించారు.   
జి.వి.ఎం.సి లో జరుగుతున్న ప్రాజెక్టుల అభివృద్ది పనులకు సంబందించి కమిషనర్ జి.సృజన పవర్ పాయింట్ ప్రజన్టేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. అనంతరం వి.ఎం .ఆర్ .డి.ఎ., కమిషనర్  ఎన్ .ఎ. డి ప్లైఓవర్, సిరిపురం లో మల్టీ లెవెల్ కారు పార్కింగ్,  మరియు కమర్షియల్ కాంప్లెక్స్, బీచ్ రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్, కైలాసగిరిలో 380 ఎకరాలలో అభివృద్ది పనులు, ఎన్ హెచ్ 16, అచ్చుతాపురం, చుక్కవానిపాలెం నుండి నాతయ్యపాలెం వరకు  మాష్టర్ ప్లాన్ రోడ్డు కనెక్షన్  తదితర పనులను గూర్చి మంత్రులకు వివరించారు. 
కోవిడ్ ను ఎదుర్కోవడంలో రాష్ట్రం తీసుకున్న చర్యలకు ప్రత్యేక ప్రశంసలు లభించాయని మంత్రి కన్నబాబు తెలిపారు.  కోవిడ్ మూడవ వేవ్ వచ్చినట్లయితే ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్దంగా వుందని మంత్రి వెల్లడించారు.   సంసిద్దత, చేపట్టిన చర్యలను గూర్చి జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు వివరించారు.  
జిల్లాలో జివియంసి, అర్బన్ హెల్త్ సెంటర్లు, కెజిహెచ్ లలో కరోనా సమయంలో విధులను నిర్వహించిన తాత్కాలిక ఎఎన్ఎం, టెక్నీషియన్స్ తదతర వైద్య ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిందిగా  విజయసాయి రెడ్డిని,  మంత్రులను అభ్యర్ధించగా  వారికి ఉద్యోగ భద్రత కొరకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. 

Visakhapatnam

2021-09-06 13:49:29

ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటుచేసే వారికి స‌హ‌కారం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అనువైన సానుకూల వాతావ‌ర‌ణం క‌ల్పిస్తామ‌ని, ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చే వారికి జిల్లా యంత్రాంగం ద్వారా త్వ‌ర‌గా అవ‌స‌ర‌మైన అనుమ‌తులు మంజూరుచేసి పూర్తిస్థాయిలో స‌హ‌కారం అందిస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి చెప్పారు. పారిశ్రామిక వేత్త‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలియ‌జేస్తే వాటిని త‌మ స్థాయిలో వున్న వాటిని వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు సిద్ధంగా వున్నామ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి ప‌రిశ్ర‌మ‌లు, ఎగుమ‌తుల ప్రోత్స‌హ‌క క‌మిటీ స‌మావేశం జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో జ‌రిగింది. ప‌రిశ్ర‌మ‌లు, కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి, విద్యుత్‌, గ‌నులు, అగ్నిమాప‌క, పుర‌పాల‌క‌, పంచాయ‌తీరాజ్ శాఖ‌ల‌తో పాటు ఇత‌ర శాఖ‌ల‌కు చెందిన అధికారులు, బ్యాంకు అధికారులు జిల్లాలోని ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు, యాజ‌మాన్య ప్ర‌తినిధులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. పారిశ్రామిక వేత్త‌లు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి జిల్లా ప‌రిశ్ర‌మ‌ల ప్రోత్సాహ‌క క‌మిటీ సమావేశాన్ని ఒక వేదిక‌గా వినియోగించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. వివిధ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప్ర‌తినిధులు ప‌రిశ్ర‌మ‌ల‌కు అందించాల్సిన ప్రోత్సాహ‌కాల‌పై వ్య‌క్తం చేసిన అభిప్రాయాల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్క‌రించేందుకు కృషిచేస్తామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

ఈ సంద‌ర్భంగా జిల్లాలో పారిశ్రామిక రాయితీల కోసం వ‌చ్చిన 44 ద‌ర‌ఖాస్తుల్లో రెండు మిన‌హా 42 ద‌ర‌ఖాస్తుల్లో ఆయా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం నుంచి రూ.1.67 కోట్ల‌ రాయితీల కోసం సిఫార‌సు చేస్తూ స‌మావేశంలో నిర్ణ‌యించారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం అనుమ‌తుల మంజూరుకోసం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో పెండింగులో వున్న 14 ద‌ర‌ఖాస్తుల‌పై క‌లెక్ట‌ర్ స‌మీక్షించి, కాలుష్య నియంత్ర‌ణ  వంటి శాఖ‌ల అధికారుల‌తో మాట్లాడి వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకోసం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో 8 ద‌ర‌ఖాస్తులు తిర‌స్క‌ర‌ణ‌కు గురికాగా వాటికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. ద‌ర‌ఖాస్తు చేసిన వారు ఏవైనా డాక్యుమెంట్లు స‌మ‌ర్పించాల్సి వ‌స్తే వారికి త‌గిన అవగాహ‌న క‌ల్పించి వారు వాటిని స‌మ‌కూర్చుకునేలా వారికి సంబంధిత శాఖ‌లు స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

చిన్న‌ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వ అధికారి జివిఆర్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో ప‌ది ర‌కాల ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని త‌మ శాఖ గుర్తించింద‌ని పేర్కొన్నారు. మామిడి తాండ్ర‌, జీడి, రైస్ మిల్లులు, గ్రానైట్ ఉత్ప‌త్తులు, జ‌న‌ర‌ల్ ఇంజ‌నీరింగ్‌, కాయిర్‌, చేనేత జౌళి సంబంధ ప‌రిశ్ర‌మ‌లు, సంగీత వాద్య ప‌రిక‌రాలు, తేనె, చింత‌పండు ప్రాసెసింగ్‌, కూర‌గాయ‌లు ఆధారిత ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటుకు జిల్లాలో సానుకూల ప‌రిస్థితులు వున్న‌ట్లు చెప్పారు.

ఈ రంగాల్లో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వ‌చ్చిన‌ట్ల‌యితే జిల్లా యంత్రాంగం ప్రోత్స‌హిస్తుంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు చెప్పారు.

జిల్లాలో రాష్ట్ర పారిశ్రామిక మౌళిక వ‌స‌తుల సంస్థ వ‌ద్ద ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకోసం కేటాయించేందుకు 625 ఎక‌రాల భూములు సిద్ధంగా వున్నాయని ఏపిఐఐసి జోన‌ల్ మేనేజ‌ర్ ఆర్‌.పాపారావు వివ‌రించారు. బొబ్బిలి గ్రోత్ సెంట‌ర్‌లో 383 ఎక‌రాలు, రామ‌భ‌ద్ర‌పురం స‌మీపంలోని కొట్టక్కి వ‌ద్ద అభివృద్ధి చేయ‌ని 187 ఎక‌రాల భూములు, భోగాపురం మండ‌లం కొంగ‌వానిపాలెం వద్ద అభివృద్దిప‌ర‌చ‌ని 12.37 ఎక‌రాలు, కొత్త‌వ‌ల‌స మండ‌లం బ‌లిఘ‌ట్టం వ‌ద్ద 43 ఎక‌రాలు ఎం.ఎస్‌.ఎం.ఇ. పార్కు కోసం సిద్దంగా వున్న‌ట్టు చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు త‌మ స‌మ‌స్య‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు. డెక్క‌న్ ఫెర్రో ఎల్లాయిస్ ప‌రిశ్ర‌మ ఎం.డి., రాష్ట్ర ఫెర్రో ఎల్లాయిస్ ఉత్ప‌త్తి దారుల సంఘం ఉపాధ్య‌క్షుడు పి.ఎస్‌.ఆర్‌.రాజు మాట్లాడుతూ త‌మ ప‌రిశ్ర‌మ‌ల‌కు విద్యుత్ రాయితీలే కీల‌క‌మ‌ని, 2014 నుంచి త‌మ‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రాకు సంబంధించి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రాయితీలు విడుద‌ల చేసి త‌మ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆదుకోవాల‌ని కోరారు. జిల్లాలో 16 యూనిట్ల‌కు గాను 12 ప‌రిశ్ర‌మ‌లే ప్ర‌స్తుతం న‌డుస్తున్నాయ‌ని, వాటిని కొన‌సాగించేందుకు రాయితీలను విడుద‌ల చేయ‌డం త‌క్ష‌ణావ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు.

జూట్ ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌క‌టించిన రాయితీల్లో రెండు రోజుల క్రితం కొంత‌మేర‌కు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌ని, మిగిలిన‌వి కూడా వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆ పరిశ్ర‌మ‌ల త‌ర‌పున హాజ‌రైన సునీల్ బ‌వారియా కోరారు.

ప‌రిశ్ర‌మ‌ల‌కు ఫిక్స్‌డ్ చార్జీల నుంచి మిన‌హాయింపు ఇస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని, అయితే ఆ ఆదేశాలు ఇంకా అమ‌లు కాలేద‌ని, వాటిని వెంట‌నే అమ‌లుచేసి చిన్న‌ప‌రిశ్ర‌మ‌ల‌కు ఊర‌ట క‌ల్పించాల‌ని చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్ర‌తినిధి రామ‌లింగ‌స్వామి కోరారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌ళిత పారిశ్రామిక వేత్త‌ల‌కోసం జ‌గ‌న‌న్న బ‌డుగు వికాసం ప‌థ‌కాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంద‌ని, ఈ ప‌థ‌కం అమ‌లులో భాగంగా ఔత్సాహికులైన ద‌ళిత పారిశ్ర‌మిక వేత్త‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వెంట‌నే ఒక అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించాల‌ని డిక్కీ(ద‌ళిత పారిశ్రామిక వేత్త‌ల సంఘం) ప్ర‌తినిధి కోరారు.

జిందాల్ సంస్థ ప్ర‌తినిధి మాట్లాడుతూ ఎస్‌.కోట మండ‌లంలో త‌మ పారిశ్రామిక సంస్థ‌కు మంజూరు చేసిన 1168 ఎక‌రాల్లో చిన్న‌ప‌రిశ్ర‌మ‌ల పార్కును ఏర్పాటు చేస్తున్న‌ట్టు ఆ సంస్థ ప్ర‌తినిధి వివరించారు. డిసెంబ‌రు 2023 నాటికి 2000 కోట్ల విలువైన పెట్టుబ‌డులు వ‌చ్చేలా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు పేర్కొన్నారు. ఈ పార్కులో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకోసం అవ‌స‌ర‌మైన అనుమ‌తులు వెంట‌నే మంజూరు చేయాల‌ని కోరారు.

స‌మావేశంలో జిల్లా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం జన‌ర‌ల్ మేనేజ‌ర్ జి.ఎం.శ్రీ‌ధ‌ర్‌., జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఎల్‌.డి.ఎం. శ్రీ‌నివాస‌రావు, సాంఘిక సంక్షేమ డి.డి. సునీల్ రాజ్ కుమార్‌, అగ్నిమాప‌క శాఖ అధికారి జె.మోహ‌న‌రావు, భూగ‌ర్భ జ‌ల‌శాఖ ఏ.డి. ర‌మ‌ణ‌మూర్తి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-06 13:46:58

రైతుల కోటాప్రకారం ఎరువులు సరఫరా చేయాలి..

రైతుల అవ‌స‌రాల మేర‌కు జిల్లా అధికారులు నివేదించిన‌ కోటా ప్ర‌కారం ఎరువులు స‌ర‌ఫ‌రా చేయాల‌ని, త్వ‌రిత‌గ‌తిన స‌ర‌కు తెప్పించాల‌ని వివిధ కంపెనీల ప్ర‌తినిధుల‌ను జేసీ కిశోర్ కుమార్ కోరారు. ఇండెంట్ ప్ర‌కారం కంపెనీలు ఎరువుల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌క‌పోవ‌టం వ‌ల్ల‌ ఇబ్బందులు త‌లెత్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఎరువుల స‌మ‌స్య‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించి కంపెనీల ప్ర‌తినిధులు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. జిల్లాలో ఖ‌రీఫ్ మొద‌లైన క్ర‌మంలో ఎరువుల అందుబాటు, స‌ర‌ఫ‌రా, నిల్వ‌లు త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించేందుకు గాను సోమ‌వారం త‌న ఛాంబ‌ర్‌లో జేసీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు రాకుండా ఎరువులు అంద‌జేయాల్సిన బాధ్య‌త ఇటు అధికారులు, అటు కంపెనీల ప్ర‌తినిధుల‌పై ఉంద‌ని పేర్కొన్నారు. జిల్లాలోని తాజా ప‌రిస్థితిని యాజ‌మాన్యాల దృష్టికి తీసుకెళ్లి అవ‌స‌రమైన మేర‌కు యూరియా, డీఏపీ ఎరువుల‌ను త్వ‌రిత‌గ‌తిన ర‌ప్పించాల‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా ఈ నెల రెండో వారం లోపు 2550 ట‌న్నుల యూరియా, 1000 ట‌న్నుల డీఏపీ రానుంద‌ని కంపెనీల ప్ర‌తినిధులు చెప్పారు. అవ‌స‌రం ఉన్న స‌మ‌యంలో స్పందించి ఎరువులు తెప్పించాల్సిన బాధ్య‌త ప్ర‌తీ కంపెనీపైనా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా జేసీ పేర్కొన్నారు. నిర్ణీత స‌మ‌యంలో ఎరువుల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌ని కంపెనీల యాజ‌మాన్యాల‌కు లేఖ‌లు రాయాల‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌ను జేసీ ఆదేశించారు.

హోల్ సేలర్స్‌, డీల‌ర్లు ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటించాల‌ని, ప్ర‌భుత్వం సూచించిన ధ‌ర‌ల‌కే ఎరువుల‌ను విక్ర‌యించాల‌ని ఆదేశించారు. వ్యాపారులు వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించినా.. నిబంధ‌న‌లు అతిక్రమించినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జేసీ హెచ్చ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌సాయ శాఖ జేడీ ఆశాదేవి, డీడీ ఆనంద‌రావు, వివిధ ఎరువుల కంపెనీల‌ ప్ర‌తినిధులు ఇత‌ర అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-09-06 13:44:53

వాటర్ ప్లాంట్ల నిర్వహణపై ద్రుష్టిపెట్టాలి..

విజ‌య‌న‌గ‌రం  జిల్లాలోని వాట‌ర్ ప్లాంట్ల నిర్వ‌హ‌ణ‌పై దృష్టి పెట్టాల‌ని, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా)జె.వెంక‌ట‌రావు ఆదేశించారు. వాట‌ర్‌ ప్లాంట్లకు అనుమ‌తులు, నిర్వ‌హ‌ణ‌తో ముడిప‌డి ఉన్న వివిధ శాఖ‌ల అధికారుల‌తో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమ‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జెసి వెంక‌ట‌రావు మాట్లాడుతూ, జిల్లాలో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రించే వాట‌ర్ ప్లాంట్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ప్ర‌స్తుతం జిల్లా మొత్తంమీద 8 వాట‌ర్ ప్లాంట్ల‌కు మాత్ర‌మే ప్ర‌భుత్వ ప‌రంగా అన్నిర‌కాల అనుమ‌తులూ ఉన్నాయ‌ని చెప్పారు. అనుమ‌తులు లేని 24 ప్లాంట్ల‌ను మూసివేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. అయితే జిల్లా అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని, ఈ ప్లాంట్లు ప్ర‌భుత్వం నుంచి అన్ని ర‌క‌లా అనుమ‌తుల‌ను తెచ్చుకొనేందుకు అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని సంబంధిత శాఖ‌ల‌కు సూచించారు. ఈ నెల 8న వాట‌ర్ ప్లాంట్ య‌జ‌మానుల‌తో స‌మావేశాన్ని ఏర్పాటు చేసి, వారికి అవ‌స‌ర‌మైన‌ మార్గ‌ద‌ర్శ‌కాలను, ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను, ధ‌ర‌ఖాస్తు చేసే విధానాన్ని వివ‌రించాల‌ని జెసి ఆదేశించారు.   ఈ స‌మావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-06 13:43:09

ఉపకారవేతనముల కోసం ధరఖాస్తుల ఆహ్వానం..

మైనారిటీ విధ్యార్ధులకు ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కం మీన్స్ జాతీయ ఉపకార వేతనముల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు  జిల్లా కలక్టరు ఎ.సూర్యకుమారి ప్రకటనలో తెలిపారు. భారత మైనారిటీ మంత్రిత్వ శాఖ,  దేశం లోని మైనారిటీ కులములకు ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్ఖులు, బౌద్దులు, పార్సీలు, జైన్లు చెందిన  విద్యార్ధులకు 2021 - 22 విద్యా సంవత్సరములో ‘జాతీయ ఉపకార వేతన పధకం’ద్వారా ఉపకార వేతనాలు అందించుటకు ధరఖాస్తులను తే.23.08.2021ది నుండి ప్రీ మెట్రిక్,  తే.15.11.2021ది లోగా, పోస్ట్ మెట్రిక్  మెరిట్  కం మీన్  30.11.2021ది లోగా  ఆన్ లైన్ ద్వారా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.  కావున విజయనగరం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు వృత్తి విద్యా, సాంకేతిక విద్యా సంస్థలు  https://nsp.gov.in లో ఆన్ లైన్ ద్వారా ముందుగా e-KYC రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొని, తదుపరి ఆయా విద్యా సంస్థల లో చదువుకొంటున్న మైనారిటీలకు చెందిన విద్యార్ధులు సదరు పోర్టల్ National Scholarship Portal www.scholarshipsgov.in.in ద్వారా ఆన్ లైన్ లో పెట్టిన ధరఖాస్తులను పరిశీలించి ఆమోదించడం జరుగుతుందన్నారు.  
మైనారిటీ విద్యార్దులకు మూడు విదములుగా ఉపకార వేతనములు మంజూరుకు భారత ప్రభుత్వం(మైనారిటీ మంత్రిత్వ శాఖ) నిర్ణయించినారని, ప్రీమెట్రిక్ ఉపకార వేతనములు, పోస్టు మెట్రిక్ ఉపకార వేతనములు, మెరిట్ కం మీన్ ద్వారా మైనారిటీల విద్యార్ధులు (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్ఖులు, బౌద్దులు, పార్సీలు, జైన్లు) ఉపకార వేతనం పొందుటకు అర్హులని అన్నారు.

Vizianagaram

2021-09-06 06:18:04

తూ.గో.జిలో 303 విఏహెచ్ఏ పోస్టులు ఖాళీలు..

తూర్పుగోదావరి జిల్లా 303 గ్రామ పశుసంవర్ధ సహాయకుల(వీఏహెచ్ఏ) పోస్టులు భర్తీకాలేదని పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎస్.సూర్యప్రకాశరావు తెలియజేశారు. ఈమేరకు సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం జిల్లాకి 987 పశుసంవర్ధ సహాయకుల పోస్టులు మంజూరు చేయగా అందులో కేవలం 684 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయన్నారు. అర్హులైన వారు లేకపోవడం వలన మిగిలిన పోస్టులు భర్తీకాలేదన్నారు. వచ్చే నోటిఫికేషన్ లో ఈ పోస్టులు భర్తీచేసే అవకాశం వుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వీరంతా వారికి కేటాయించిన ప్రదేశాల్లో పాడి రైతులకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.

కాకినాడ

2021-09-06 06:12:21

తూ.గో.జి.కి లక్షా 10వేల కోవిడ్ డోసులు..

తూర్పుగోదావరి జిల్లా లక్షా 10వేకోవిడ్ టీకాలు ప్రభుత్వం కేటాయించందని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.గౌరీశ్వర్రావు తెలియజేశారు. ఆదివారం కాకినాడ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మొత్తం 90వేల కోవీషీల్డ్ టీకాలు, 20వేలు కోవాగ్జిక్ టీకాలు మంజూరు చేసిందన్నారు. వీటిని జిల్లాలోని 64 మండలాలకు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. జిల్లాలోని శాస్వత కోవిడ్ వేక్సినేషన్ కేంద్రాలతోపాటు, జిల్లావ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కూడా సోమవారం కోవిడ్ వేక్సినేషన్ జరుగుతుందన్నారు. 18ఏళ్లు నిండిన వారికి, మొదటిడోసు పూర్తయి84 రోజులు దాటిన వారికి 2వ వడోసు కూడా వేస్తారని డిఎంహెచ్ఓ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని కోవిడ్ నియంత్రణలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతీఒక్కరూ కోవిడ్ వేక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించాలని ఆ ప్రకటనలో కోరారు.

Kakinada

2021-09-05 15:29:21

జాతీయ పద్మశాలీ సంఘంలో కొప్పలకు చోటు..

విశాఖకు చెందిన కొప్పల రామ్ కుమార్ నుఅఖిల భారత పద్మశాలి సంఘంలో యువజన విభాగానికి జాతీయ వైస్-చైర్మన్ గా నియమిస్తూ జాతీయ అధ్యక్షులు సుంకర్వర్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొప్పల రామ్ కుమార్ ప్రస్తుతం బీజేపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ గా బాద్యతలు నిర్వహిస్తున్నారు. రాజీకియాలలో క్రియ శీలంగా వుంటూనే చేనేత సామాజిక వర్గం సమస్యల పట్ల, పద్మశాలియుల అభ్యుదయానికి నిరంతరం కృషి చేస్తున్నారు. "పద్మశాలి ఆత్మీయ సేవ సంగం" పేరిట దిగువ తరగతి పద్మశాలియుల కుటుంబాలకు సహాయ సహకారాలు అందించటం, వారికి నిరంతరం అందుబాటులో వుండటం, వారితో మమేకం కావడం వల్ల వారికి కుల బాంధవుడుగా గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించిన అఖిల భారత పద్మశాలి సంఘం లో కీలక పదవిని కట్టబెట్టం పట్ల చేనేత వర్గీయులంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా  రామ్ కుమార్ మాట్లాడుతూ, తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ పదవి కట్టబెట్టిన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. ఇకపై మరింత శ్రమించి చేనేత సామాజిక వర్గ అభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని చెప్పారు. 

Visakhapatnam

2021-09-05 11:16:10

ఏయూలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం..

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఏయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద నున్న సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహాలకు ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి పూలమాల వేసి వివాళి అర్పించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ దార్శినికతతో పనిచేసారని, విశ్వవిద్యాలయం అభ్యున్నతికి పూర్తిస్తాయిలో పనిచేసారని గుర్తుచేసుకున్నారు. ఆయన సేవలను విశ్వవిద్యాలయం చిరస్థాయిగా గుర్తుంచుకుంటుందన్నారు. 
కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ప్రిన్సిపాల్స్‌ ఆచార్య కె.శ్రీనివాస రావు, పేరి శ్రీనివాస్‌, పి.రాజేంద్ర కర్మార్కర్‌, ఎస్‌.సుమిత్ర, కె.విశ్వేశ్వర రావు, వై.రాజేంద్ర ప్రసాద్‌, పాల కమండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, క్రిష్ణమంజరి పవార్‌ డీన్‌ ఆచార్య టి.షారోన్‌ రాజు, ఎన్‌.ఏ.డి పాల్‌, డాక్టర్‌ హెచ్‌.పురుషోత్తం, పేటేటి ప్రేమానందం, సిఎస్‌ఓ మహ్మద్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-05 09:32:15

హైకోర్టు న్యాయమూర్తికి ఘనస్వాగం..

ఒక్క రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లాకు విచ్చేసిన‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ బ‌ట్టు దేవానంద్‌కి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. స్థానిక జ‌డ్పీ అతిథి గృహానికి చేరుకున్న ఆయ‌న‌కి జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి గుత్త‌ల గోపి, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి, ఎస్పీ దీపికా ఎం పాటిల్‌లు పుష్ప‌గుచ్ఛాలు అంద‌జేసి సాద‌రంగా స్వాగతం ప‌లికారు. పోలీసులు గౌర‌వం వంద‌నం స‌మ‌ర్పించారు. అనంత‌రం ఆయ‌న‌ అతిథి గృహంలోకి చేరుకొని కాసేపు న్యాయ అధికారులు, జిల్లా అధికారుల‌తో మాట్లాడారు. కొద్దిసేపు విశ్రాంతి అనంత‌రం జ్యుడీషియ‌ల్ అధికారుల స‌మావేశంలో పాల్గొనేందుకు జిల్లా కోర్టుకు వెళ్లిపోయారు. అద‌న‌పు జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి శిరీషా, జాయింట్ క‌లెక్ట‌ర్లు జి.సి. కిశోర్ కుమార్, జె. వెంక‌ట‌రావు, డీఆర్వో ఎం. గ‌ణ‌ప‌తిరావు, ఆర్డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌, విజ‌య‌న‌గ‌రం త‌హ‌శీల్దార్ ప్ర‌భాక‌ర్‌, న్యాయ అధికారులు, ఇత‌ర అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, న్యాయ‌వాదులు త‌దిత‌రులు స్వాగ‌తం ప‌లికిన వారిలో ఉన్నారు.

Vizianagaram

2021-09-05 09:23:09

పోర్టిఫైడ్ బియ్యంపై అపోహలు పెట్టుకోవద్దు..

ప్రభుత్వం పంపిణీ చేసే పోర్టిఫైడ్ బియ్యంపై ప్లాస్టిక్ బియ్యం అనే అపోహను వీడాలని జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని మీడియాతో ఆయన ఆదివారం జూమ్ కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. పోషకాలు నేరుగా బియ్యంతో కలిపి అందించాలనే ఉద్దేశ్యంతో బియ్యానికే పోషకాలను కలిపి అంస్తున్నదన్నారు. ఆ బియ్యాన్ని కడిగే టపుడు ముందు తేలిపోతాయని, ఆ సమయంలో చాలా మంది వీటిని ప్లాస్టిక్ బియ్యంగా అనుకొని పాడేస్తున్నారని అన్నారు. అలాకాకుండా రెండు మూడు సార్లు కడిగితే బియ్యం సాధారణంగా ఉంటాయన్నారు. ప్రజలు అపోహలు వీడి ఎంతో విలువైన పోషకాలున్న పోర్టిఫైడ్ బియ్యాన్ని వినియోగించాలని, ఈ విషయంలో ప్రజలు చైతన్యం అయ్యేలా మీడియా సహకరించాలని జెసి కోరారు.

Kakinada

2021-09-05 08:13:09