1 ENS Live Breaking News

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల అభివృద్ధి..

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని టీటీడీ ఆలయాల్లో శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జోహార్ రెడ్డి చెప్పారు.  ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి తో కలిసి మంగళవారం ఆయన జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని ఆలత్తూరు, కలికిరి కొండ, కార్వేటినగరం ఆలయాలను సందర్శించారు. ఆలయాల్లో స్వామి వార్ల దర్శనం అనంతరం వీరు అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా కార్వేటినగరం పుష్కరిణి వద్ద జరిగిన సమావేశంలో ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి  మాట్లాడుతూ,  ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి తన నియోజకవర్గంలోని  టీటీడీ ఆలయాల్లో  పలు అభివృద్ధి పనులు చేయాలని కోరినట్లు చెప్పారు. ఇందుకోసం తనను ఆలయాలను పరిశీలించాలని కోరారని,  కోవిడ్  వల్ల పర్యటన ఆలస్యమైందని చెప్పారు. ఆలత్తూరు లోని శ్రీ వరద వేంకటేశ్వర స్వామి ఆలయం, కార్వేటినగరం వేణుగోపాల స్వామి,  ఆలయం కలిగిరి కొండ శ్రీవారి ఆలయాలను మంగళవారం పరిశీలించామని చెప్పారు.  కలికిరి కొండ వెళ్లే భక్తులకు తిరుమలకు వెళ్లిన అనుభూతి కలుగుతుందన్నారు. ఈ కేంద్రాన్ని ఆధ్యాత్మిక,  పర్యాటక పరంగా అభివృద్ధి చేయొచ్చని చెప్పారు. నియోజకవర్గంలోని టీటీడీ ఆలయాలకు సంబంధించిన అభివృద్ధి పనులను శ్రీ వాణి ట్రస్ట్ సమావేశంలో చర్చించి మంజూరు చేస్తామని చెప్పారు. ఎస్వీబీసి ద్వారా టీటీడీ ప్రతిరోజు ప్రసారం చేస్తున్న భగవద్గీత, గరుడ పురాణం లాంటి అనేక కార్యక్రమాలను ప్రజలు వీక్షించి ఆధ్యాత్మిక అలవాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ,  ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో హిందూ ఆలయాలను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.  కార్వేటినగరంలో  వేణు గోపాల స్వామి కోనేరు మధ్యలో నిర్మిస్తున్న నీరాలి మండపాన్ని మరింత వెడల్పు చేయాలని కోరారు. టిటిడి కళ్యాణ మండపం లో వంటగది, మరుగుదొడ్లు, వసతి గదులు అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని కోరారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు తో పాటు ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ శివరామకృష్ణ, మనోహర్ పలువురు అధికారులు ఉన్నారు.

Nellore

2021-09-14 11:20:03

పౌష్టికాహారం తక్కువచేస్తే ఫిర్యాదు చేయండి..

ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై బలవర్ధక ఆహారంతోపాటు, పాలు కూడా యాప్ ద్వారా అందించనున్నట్టు ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జివి సత్యవాణి తెలియజేశారు. మంగళవారం కాకినాడలో తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 28 ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీలకు యాప్ వినియోగంపై శిక్షణ ఇచ్చామన్నారు. ఇకపై తల్లులు కూడా ఖచ్చితంగా కేంద్రాని వెళ్లే ఆహారం తీసుకోవాల్సి వుంటుందన్నారు. అదే సమయంలో బలవర్ధక ఆహారంలో తేడాలు వచ్చినా, తక్కువగా అంగన్వాడీలు ఇచ్చినా సిడిపిఓలకు ఫిర్యాదు చేయాలన్నారు.

Kakinada

2021-09-14 11:05:50

హౌసింగ్ లక్ష్యాలను సత్వరమే పూర్తిచేయాలి..

వైయస్సార్ జగనన్న గృహ నిర్మాణాలు అర్హులైన పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా నిర్దేశించిన  లక్ష్యాల  మేరకు త్వరిత గతిన పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ డా ఎ మల్లిఖార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుండి గృహ నిర్మాణ పనులపై వారంతపు సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలు, లేఅవుట్లు కు సంబంధించి గ్రౌండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇసుక కొరత ఉంటున్నదని దానిని అధిగమించటానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలు గృహ నిర్మాణ పనులలో బాధ్యత వహించాలని ఎల్లవేళల పనుల పర్యవేక్షణ చేయాలన్నారు. కొన్ని మండలాల్లో జీరో గ్రౌండింగ్ లేఅవుట్ లున్నాయని వాటిలో గ్రౌండింగ్ పనులను మొదలు పెట్టాలన్నారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణాలకు  సంబంధించి  ఎం జి ఎన్ ఆర్ఈ జి ఎస్ ఫండ్స్ ద్వారా వేగవంతంగా పనులను చేయాలన్నారు.
గ్రామ పంచాయత్, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు జనరల్ ఫండ్స్ ను బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. వాటికి సంబంధించిన ఎస్టిమేట్స్ ను తయారు చేసి నివేదికను వెంటనే పంపించాల్సిందిగా ఆదేశించారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు ఇతర లేఅవుట్ లలో ఉన్నా కూడా సంబంధిత నివేదికను తయారుచేసి రెండు రోజుల్లో పంపిస్తే నిధులను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జీరో గ్రౌండింగ్ లేఔట్లకు సంబంధించి వచ్చే మీటింగ్ నాటికి కొంత పురోగతి కనిపించాలన్నారు. లేఅవుట్లలో భూముల చదును కు సంబంధించి పనులను వేగవంతం చేయాలన్నారు. కొన్ని మండలాలలో పనులు పూర్ పెర్ఫార్మెన్స్ గా ఉందనీ,కాబట్టి  అలసత్వం వహించవద్దన్నారు. పి ఎం ఏ వై వైయస్సార్ గృహ సముదాయాలకు  మ్యాపింగ్ చేసి పనులను మొదలు పెట్టాలన్నారు. లేఅవుట్ లలో ఇంకా జియో ట్యాగింగ్ చేయని వాటికి వెంటనే చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన గైడ్లైన్స్ ప్రకారం  500 పైబడి  లబ్ధిదారులు ఉన్న పెద్ద లేఅవుట్లలో వర్కర్ల కొరకు షెడ్డు నిర్మించాల్సి ఉంటుందనీ, సంబంధిత నిధులను మంజూరు చేయడం జరుగుతుందని దాని నిర్మాణం పై కూడా దృష్టి పెట్టాలన్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న లేఅవుట్లు, గృహ నిర్మాణాలలో నిరంతరం నీటి సరఫరా, విద్యుత్తు సౌకర్యం, ఏర్పాటు చేయాలని ఇసుక, సిమెంటు ,ఐరన్ అందుబాటులో ఉంచాలన్నారు.
          ఈ సమావేశం లో జాయింట్ కలక్టర్ హౌసింగ్ కల్పనా కుమారి, పీ డి హౌసింగ్ శ్రీనివాస రావు, జెడ్ పీ సి ఈ వో నాగార్జున, ఆర్  డబ్ల్యుఎస్ ఎస్ ఈ రవి కుమార్, పీ ఆర్, ట్రాన్స్ కో, మైన్స్ తదితర శాఖ ల అధికారులు హాజరయ్యారు.

Visakhapatnam

2021-09-14 10:59:38

వాకర్స్ సమస్యల పరిష్కారానికి కృషి..

అనంతపురంలో వాకర్స్ సమస్యల పరిష్కారంకు కృషిచేస్తానని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. మంగళవారం మేయర్ , డిప్యూటీ మేయర్ కొగటం విజయ్ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అనంత చంద్రారెడ్డి లతో కలసి పిటీసీ లో పర్యటించారు. వాకర్స్ తోపాటు క్రీడాకారులతో వారు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పిటీసీ గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని,త్రాగునీటి సౌకర్యం కల్పించాలని వారు కోరారు. అదే విధంగా  వాకింగ్ కోసం వచ్చే వారి కోసం పిటీసీ కి ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలంలో పార్క్  ఏర్పాటు చేయాలని,వాకర్స్ సౌకర్యం కోసం లైట్లు ఏర్పాటు చేయాలని మేయర్ ను కోరారు. దీనిపై మేయర్ వసీం ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానికంగా శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అనంత చంద్రారెడ్డి మేయర్,డిప్యూటీ మేయర్ లు సమావేశమై వారి శిక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో  కార్పొరేటర్లు చంద్రమోహన్ రెడ్డి,కమల్ భూషణ్,  అనిల్ కుమార్ రెడ్డి , పార్టీ నాయకులు ఖాజా , స్పోర్ట్స్ కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం

2021-09-14 10:58:17

14 నుంచి ఎలుకల నియంత్రణ కార్యక్రమం..

తూర్పుగోదావరి జిల్లాలోని 64 మండలాల్లో సెప్టెంబరు 14 నుంచి 16వ తేదీ వరకూ సామూహిక ఎలుకల నియంత్రణ కార్యక్రమం చేపడుతున్నట్టు అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయ్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన కాకినాడలో తన కార్యాయంలో మీడియాతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన సందర్భంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే అన్ని మండలాల వ్యవసాయ అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. పొలంబడి కార్యక్రమం ద్వారా కార్యక్రమం చేపట్టి రైతులకు అవగాహన కల్పించనున్నట్టు జెడి మీడియాకి వివరించారు.

Kakinada

2021-09-13 15:50:48

మల్టీకలర్ లో శ్రీవారి స‌ప్త‌గిరి మాసప‌త్రిక..

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో టిటిడి ఆర్ష ధ‌ర్మ ప్ర‌భోదం కోసం 1949వ సంవ‌త్స‌రంలో స‌ప్త‌గిరి ప‌త్రిక‌ను బులెటిన్‌గా ప్రారంభించింద‌ని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. 1970వ సంవ‌త్స‌రం నుండి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, ఆంగ్లం, హిందీ  భాష‌ల్లో, 2014వ సంవ‌త్స‌రం నుండి సంస్కృత భాష‌లో ముద్ర‌ణ ప్రారంభ‌మైంద‌న్నారు. 2016వ సంవ‌త్స‌రం నుంచి స‌ప్త‌గిరిని పూర్తిగా రంగుల్లో పాఠ‌కుల‌కు అందిస్తున్నామ‌న్నారు.ఇప్ప‌టికి 50 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని ఆధ్యాత్మిక ప‌త్రిక‌ల్లో అగ్ర‌గామిగా ఉంద‌న్నారు. స‌ప్త‌గిరి మాస ప‌త్రిక ఆరు భాష్ల‌ల్లో పునఃప్రారంభ‌మైంద‌ని, ఇందులో అనేక కొత్త శీర్షిక‌ల‌తో, ధారావాహిక‌ల‌తో పాఠ‌కుల‌కు నిరంత‌రాయంగా అందుతుంద‌ని చెప్పారు. అంత‌కుముందు అగ‌ర‌బ‌త్తుల త‌యారీ ప్లాంట్ వ‌ద్ద శ్రీ‌వారి చిత్ర‌ప‌టానికి ఛైర్మ‌న్‌, ఎమ్మెల్యే,  ఈవో, అద‌న‌పు ఈవోలు  పూజ‌లు నిర్వ‌హించి ప్లాంట్‌ను ప్రారంభించారు. త‌రువాత ప్లాంట్‌లో అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసే యంత్రాల ప‌నితీరును ప‌రిశీలించారు.  ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి,  సూళ్ళూరుపేట యం.ఎల్.ఏ  సంజీవ‌య్య‌, ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి డా.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, టీటీడీ సిఇ నాగేశ్వ‌ర‌రావు, గో సంర‌క్ష‌ణ శాల డైరెక్డ‌ర్ డా.హ‌ర‌నాథ‌ రెడ్డి, ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ప్రతినిధులు  శ్రీ‌నివాస్‌, ఆశోక్‌,  హ‌ర్ష, సప్తగిరి మాస పత్రిక ముఖ్య సంపాదకులు  రాధా రమణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2021-09-13 14:27:29

విజయనగరం స్పందనకు 396 వినతులు.. 

విజయనగరం జిల్లాలో  ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కు సోమవారం 396 వినతులు అందాయి.  ఈ వినతులను సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిశోర్  కుమార్,  మయూర్ అశోక్ , జే. వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు లు  స్వీకరించారు.  డి.ఆర్.డి.ఎ. శాఖకు 70 వినతులు  ముఖ్యంగా పించన్లు, రెవెన్యూ శాఖకు 296  ముఖ్యంగా ఇంటి స్థలాలు,  రేషన్ కార్డు లు, డిసిహెచ్ఎస్ కు 20 వినతులు, డిఎం అండ్ హెచ్ ఓకు వికలాంగు పింఛన్లు తదితర అంశాల పై దరఖాస్తులు అందాయి.  ఆయా శాఖల అధికారులకు పంపుతూ  వెంటనే పరిష్కరించాలని సూచించారు. 

Vizianagaram

2021-09-13 13:39:17

స్పెషల్ డ్రైవ్ లో 1.32లక్షల మందికి కోవిడ్ వేక్సిన్..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈనెల 11 నుంచి నేటి వ‌ర‌కు నిర్వ‌హించిన మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ లో 1.32 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ వేయ‌డం జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి వెల్ల‌డించారు. సోమ‌వారం రోజు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 14 వేల మందికి వ్యాక్సిన్ వేసిన‌ట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేసుకోని వారికి, రెండో డోసు అవ‌స‌ర‌మైన వారికి క‌ల‌సి మొత్తం 10.18 లక్ష‌ల డోసుల  వ్యాక్సిన్ వేసేందుకు ల‌క్ష్యంగా నిర్దేశించామ‌ని, సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు ఈ ల‌క్ష్యంలో 13శాతం సాధించామ‌న్నారు. ల‌క్ష్యం మేర‌కు శ‌త‌శాతం వ్యాక్సినేష‌న్ చేసేందుకు త‌దుప‌రి ద‌శ‌ల్లో కూడా వ్యాక్సినేష‌న్ ప్ర‌త్యేక డ్రైవ్‌లు చేప‌డ‌తామ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

Vizianagaram

2021-09-13 13:38:37

17 నుంచి నూతన వార్డు సభ్యులకు శిక్షణ..

తూర్పుగోదావరి జిల్లాలో  సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 5 వరకు మూడు దశలలో 1,103 పంచాయతీలలో నూతనంగా ఎన్నికైన సుమారుగా 11,773 మంది వార్డు సభ్యుల శిక్షణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పంచాయ‌త్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఏపీఎస్ఐఆర్‌డీ) డైరెక్టర్ జె.మురళి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకుసోమవారం విజయవాడ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీ వార్డు స‌భ్యుల శిక్షణ కార్యక్రమానికి సంబంధించి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి ఎన్‌వీవీ సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, ఇతర అధికారులు  హాజరయ్యారు. కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీఎస్ఐఆర్‌డీ డైరెక్టర్ జె.మురళికి జడ్పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ వివరించారు. ఈ వీసీలో జిల్లా పరిషత్ పరిపాలనాధికారి సుబ్బారావు, కాకినాడ గ్రామీణ మండలం ఎంపీడీవో పి.నారాయణ మూర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-09-13 13:34:24

ఏన్సిడెంట్ జిల్లాలో త్వరగా పూర్తి చేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో ఏన్సిడెంట్ త్వరగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో   జిల్లాలో మంజూరైన  సచివాలయాల పోస్టులు, మొదటి దశ, రెండవ దశల్లో విధులలో చేరిన అభ్యర్థులు, వారి ఏన్సిడెంట్ వివరాలు, శాఖా పరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వివరాలు, తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. మెమో తీసుకున్న, ఇఓఎల్ పెట్టిన వారిని ఎవరికి ప్రొహిబిషన్ డిక్లర్ చేయవద్దని ఆదేశించారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి అన్ని పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఓ లక్ష్మీపతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రనాయక్, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్,  పశు సంవర్థక శాఖ జెడి కిషోర్, మత్య్స శాఖ జెడి శ్రీనివాసరావు, సర్వే శాఖ ఎడి కుంచె ప్రభాకరరావు, సెరికల్చర్ ఎడి అలజంగి విక్టర్ సాల్మన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-13 13:24:07

రైతుల సంక్షేమం కోసమే గ్రామాల్లో ఆర్బీకేలు..

రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల సంక్షేమం కోసం 10,788 రైతు భ‌రోసా కేంద్రాల‌(ఆర్‌బీకే)లను నిర్మిస్తోందని   రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార‌, మార్కెటింగ్‌, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు పేర్కొన్నారు. సోమ‌వారం కాకినాడ ర‌మ‌ణ‌య్య‌పేట క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటుచేసిన మీడియా స‌మావేశంలో మంత్రి మాట్లాడారు. నాణ్య‌మైన విత్త‌నాలు, ఎరువులు, పురుగు మందులు త‌దిత‌రాల స‌ర‌ఫ‌రాతో పాటు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల ఫ‌లాల‌ను రైతుల‌కు 100 % అందించ‌డంలో ఆర్‌బీకేలు కీల‌క‌పాత్ర పోషిస్తున్నాయన్నారు. అదే విధంగా ఆర్‌బీకేలు విజ్ఞాన కేంద్రాలుగా మారాయ‌ని, వాటిని కొనుగోలు కేంద్రాలుగా కూడా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌తి గ్రామంలోనూ వ్య‌వ‌సాయ, ఉద్యాన‌, మ‌త్స్య‌, ప‌శుసంవ‌ర్థ‌క స‌హాయ‌కుల‌ను నియ‌మించి, రైతుల‌కు వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాల సేవ‌ల‌ను అందిస్తున్న‌ట్లు వివ‌రించారు. ఆర్‌బీకేల ద్వారా అందుతున్న సేవ‌లతో ప్ర‌స్తుతం దేశం మొత్తం మ‌న రాష్ట్రం వైపు చూసే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. రూ.3,000 కోట్ల‌తో ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధిని, అదే విధంగా రూ.2,000 కోట్ల‌తో ప్ర‌కృతి విప‌త్తుల స‌హాయ నిధిని ప్ర‌భుత్వం ఏర్పాటుచేసింద‌ని వివ‌రించారు. క‌ల‌లోకూడా ఊహించని విధంగా నేడు రాష్ట్రంలో రైతు భ‌రోసా-పీఎం కిసాన్‌, వైఎస్సార్ ఉచిత పంట‌ల బీమా త‌దిత‌ర ప‌థ‌కాలు రైతుల‌కు అందుతున్న‌ట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించినవి కాకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం స్వ‌యంగా అర‌టి, ప‌సుపు, బ‌త్తాయి, ఉల్లి త‌దిత‌ర ఏడు పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌(ఎంఎస్‌పీ)ల‌ను ప్ర‌క‌టించింద‌ని, రైతుల సంక్షేమంపై ప్ర‌భుత్వానికికున్న చిత్త‌శుద్ధికి ఇది నిద‌ర్శ‌న‌మ‌న్నారు. పొగాకు రైతులు న‌ష్ట‌పోతున్న ప‌రిస్థితిని చూసి రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే జోక్యం చేసుకొని మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన‌ట్లు తెలిపారు.  గ‌తంలో మాదిరి కాకుండా ప్ర‌భుత్వ సిబ్బందే నేరుగా రైతులు ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఈ-క్రాప్ బుకింగ్ చేస్తున్నార‌ని, ఈ స‌మాచారం వివిధ ప‌థ‌కాలను పార‌ద‌ర్శ‌కంగా,  జ‌వాబుదారీత‌నంతో అమ‌లుచేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని పేర్కొన్నారు. ఎక్క‌డా అవినీతికి తావులేకుండా నేరుగా సంక్షేమ ఫ‌లాల‌ను ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ (డీబీటీ) ద్వారా రైతుల‌కు అందిస్తోంద‌న్నారు. రాష్ట్రంలో ఎక్క‌డా ఎరువుల కొర‌త లేద‌ని, బ‌ఫ‌ర్ స్టాక్‌ను సైతం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. రైతుల‌కు ప‌గ‌టిపూట తొమ్మిది గంట‌ల నాణ్య‌మైన విద్యుత్‌ను ప్ర‌భుత్వం అందిస్తోంద‌ని, రూ.1700 కోట్ల‌ను ఫీడ‌ర్ల ఆధునికీక‌ర‌ణకు కేటాయించిన‌ట్లు మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు తెలిపారు. 

ఇన్‌పుట్ రాయితీకి సంబంధించి గ‌త బ‌కాయిల‌ను కూడా చెల్లించ‌డ‌మే కాకుండా ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఏ సీజ‌న్‌లో జ‌రిగిన పంట న‌ష్టానికి అదే సీజ‌న్‌లో ఆర్థిక స‌హాయం అందిస్తోంద‌ని వివ‌రించారు. రైతులు బ్యాంకుల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా ప్ర‌తి ఆర్‌బీకేలోనూ బిజినెస్ క‌ర‌స్పాండెంట్ల సేవ‌ల‌ను అందుబాటులో ఉంచుతున్న‌ట్లు తెలిపారు. కౌలు రైతులకు కూడా ల‌బ్ధి చేకూర్చేందుకు 4,93,000 క్రాప్ క‌ల్టివేట‌ర్ రైట్స్ కార్డ్స్ (సీసీఆర్‌సీ కార్డులు)ను అందించామ‌ని, వారికి కూడా రైతు భ‌రోసాను ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రాష్ట్రంలో రూ.1300 కోట్ల‌తో పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేష‌న్‌కు ఊత‌మివ్వ‌నున్న‌ట్లు తెలిపారు. రైతులు వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ ద్వారా ప్ర‌యోజ‌నం పొందేందుకు వీలుగా ఆర్‌బీకే ప‌రిధిలో క‌స్ట‌మ్ హైరింగ్ కేంద్రాల (సీహెచ్‌సీ)ను రైతు బృందాల‌తో ఏర్పాటుచేసిన‌ట్లు వెల్ల‌డించారు. రైతుల‌కు నాణ్య‌మైన విత్త‌నాలు, పురుగుమందులు మాత్ర‌మే అందాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రీ టెస్టింగ్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేస్తోంద‌ని, ఇప్ప‌టికే తొలిద‌శ‌లో 60 ల్యాబ్‌ల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల ప్ర‌యోజ‌నాలు ల‌క్ష్యంగా ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేస్తోంద‌న్నారు. అదే విధంగా తొలిద‌శ‌లో రూ.212 కోట్ల‌తో మార్కెట్‌యార్డుల‌ను నాడు-నేడు న‌మూనాలో అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలిపారు. కోవిడ్ క్లిష్ట స‌మయంలోనూ చెప్పిన విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించిన‌ట్లు మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు పేర్కొన్నారు.

Kakinada

2021-09-13 13:21:27

శ్రీకాకుళం స్పందనకు 299 అర్జీలు..

శ్రీకాకుళంజిల్లాలో సోమవారం నిర్వహించిన స్పందన వచ్చిన అర్జీలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, ఆసరా జెసి శ్రీరాములు నాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి అర్జీదారులు నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ, పింఛన్లు, వ్యవసాయం, విద్యా శాఖ, రేషన్ కార్డులు, తదితర సమస్యలు పై 299 అర్జీలు స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-13 10:11:53

తూ.గో.జి.లో 29 సిడిపీఓ పోస్టులు ఖాళీలు..

తూర్పుగోదావరి జిల్లాలోని  29 సిడిపిఓ పోస్టులు ఖాళీలు ఉన్నట్టు ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జివిసత్యవాణి తెలియజేశారు. సోమవారం కాకినాడలో తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 28 ప్రాజెక్టుల పరిధిలో 49 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా, ప్రస్తుతం 20 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. ఖాళీగా వున్న 29 పోస్టుల భర్తీకై ప్రభుత్వానికి నివేదిక పంపామని ఆమె తెలియజేశారు. మిగిలిన వారితో కొన్ని కేంద్రాలు ఇన్చార్జిలుగా పనిచేయిస్తున్నామన్నారు. ప్రభుత్వం చిన్నారులు, గర్భిణీ స్త్రీల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన అన్ని పథకాలు పూర్తిస్థాయిలో అందిస్తున్నట్టు ఆమె వివరించారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాల అమలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.

Kakinada

2021-09-13 10:09:34

కోవిడ్ వాక్సిన్ లక్ష్యాలను పూర్తి చేయాల్సిందే..

కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం లక్ష్యాలు పూర్తి చేయాల్సిందేనని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం మెలియాపుట్టి మండలం లింగుడుపురం గ్రామంలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం భారీ ఎత్తున చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో చేపట్టాలని ఆయన పేర్కొంటూ మెలియాపుట్టి మండలంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగడం పట్ల అధికారులను ప్రశ్నించారు. పదివేల మందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉండగా జాప్యం చేస్తున్నారని, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో లక్ష డోసుల వాక్సిన్ లభ్యంగా ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ వేయాలని ఆయన ఆదేశించారు. లక్ష్యాలు పూర్తి చేయని వారిపై చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. వాక్సినేషన్ కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ చేయించాలని ఆయన పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మూడవ దశ కోవిడ్  నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా తోడ్పడగలదని ఆయన పేర్కొంటూ దీనికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన పొందాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చెప్పారు. కోవిడ్ మహమ్మారి నివారణకు వ్యాక్సినేషన్ అత్యుత్తమ పరిష్కారమని గుర్తించాలని శ్రీకేష్ వివరించారు. వ్యాక్సినేషన్ వేసుకున్నప్పటికీ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రాథమిక సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాస్కులు వినియోగం పట్ల పూర్తిస్థాయి చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాక్సినేషన్ వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వాక్సిన్ వేయించుకోవడం వలన జిల్లాను కోవిడ్ వ్యాప్తి కాకుండా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-13 08:44:06

వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

వంశధార నది పరీవాహక ప్రాంతమైన ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదీ ప్రవాహ పరిస్థితిపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సోమవారం రాత్రికి నదిలో 40వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుందన్న సమాచారంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఉత్తర కోస్తా చీఫ్ ఇంజనీర్ ఎస్. సుగుణాకర్, వంశధార ఎస్ఈ డోల తిరుమల రావు తదితరులతో జిల్లాలో ప్రస్తుత ప్రాజెక్టులలో ఉన్న నీటిమట్టం పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఒడిస్సాలో కాట్రగడ్డ, గుడారి, మోహన, మహేంద్ర గడ, గుణపూర్,  కాశీనగరం తదితర ప్రాంతాల్లో 31.55 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైందని ఫలితంగా వంశధార నదికి భారీగా వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు చేరినట్లు వివరించారు. వరద నీటిని కాట్రగడ్డ సైడ్ వియ్యర్ ద్వారా వంశధార ప్రధాన (హిరమండలం) జలాశయంలోకి మళ్లించాలని సూచించారు. జలాశయం సామర్థ్యం 19 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.5 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉందని, ఈ వరద నీటితో మరో టీఎంసీని ఇప్పుడు నిలవ చేయగలమని అధికారులు పేర్కొన్నారు. ప్రధాన జలాశయాన్ని పూర్తి సామర్థ్యంతో నిల్వ చేయాలంటే నేరేడి బ్యారేజ్ మాత్రమే శాశ్వత పరిష్కారం కావడంతో ప్రతిపాదనలు ఏ దశలో ఉన్నాయని అడిగారు. ఒడిస్సా భూభాగంలో మునిగిపోతున్న నూట ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు, ఇంకా సర్వే, ఇన్వెస్టిగేషన్, డిజైన్ల రూపకల్పన కోసం రూ.68 కోట్లు ఖర్చు కానున్నాయని ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వంశధార ఎస్.ఇ వివరించారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం పొందిన తర్వాత బ్యారేజి నిర్మాణం కోసం రూ.600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని చేరవేసి వీలైనంత త్వరగా నేరడి నిర్మాణానికి ప్రజా ప్రతినిధులంతా కృషి చేస్తామని కృష్ణదాస్ చెప్పారు. వంశధార ప్రాజెక్టు కుడి,ఎడమ ప్రధాన కాలువల గట్ల పటిష్టం కోసం ఉపాధిహామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు రూ.15 కోట్లు మంజూరు చేశామని, మిగిలిన కాలువల్లో పూడిక తీత పనులకు మరో రూ. 3 కోట్లు మంజూరయ్యాయని, నిధులు వెనక్కి వెళ్లక ముందే వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.

Srikakulam

2021-09-13 06:33:30