1 ENS Live Breaking News

వైఎస్సార్ కాలనీలు వేగవంతం కావాలి..

వైఎస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం అయ్యేలా విద్యుత్, నీరు తదితర మౌళిక సౌకర్యాల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో సత్తెనపల్లి, మంగళగిరి, పెదకూరపాడు నియోజకవర్గలలో  నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణ ప్రగతి పై సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలి  అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాలలోని లే అవుట్ల వారీగా మౌళిక సదుపాయాల పెండింగ్ పనులపై, ఇళ్ళ నిర్మాణం జరుగుతున్న తీరు సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్) అనుపమ అంజలి, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబుతో కలిసి సమీక్షించారు. లే అవుట్లో పెండింగ్లో ఉన్న విద్యుత్, నీటి సౌకర్యం పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇళ్ళ నిర్మాణంకు అనుగుణంగా అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనుము సరఫరాకు ప్రతిపాదనలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, జియోట్యాగింగ్, ఇళ్ళ మ్యాపింగ్ నూరు శాతం పూర్తి చేయాలన్నారు.

 ఇళ్ళ నిర్మాణంకు అవసరమైన ఇసుక శాండ్ రీచ్ల ద్వారా ప్రత్యేక క్యూలైన్లు, స్లాట్ టైం కేటాయించేలా హౌసింగ్ అధికారులు రీచ్ నిర్వహుకులకు సూచించాలన్నారు.  ఇళ్ళ నిర్మాణం వేగవంతం అయ్యేందుకు హౌసింగ్ అధికారులు సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు. మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణం వేగంగా జరుగుతున్న లే అవుట్లకు వెంటనే   సిమెంట్, ఇనుము  సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లే అవుట్లలో పెండింగ్లో ఉన్న మౌళిక సౌకర్యాలు వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి, మంగళగిరి, పెదకూరపాడు నియోజకవర్గల హౌసింగ్, రెవెన్యూ, పంచాయితీ, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-08-06 16:37:05

బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించండి..

బలహీన వర్గాలకు అన్యాయం జరగకుండా నిబంధనల ప్రకారం జిల్లాలోని వివిధ శాఖలలో  ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ పోస్టులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులకు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని డీఆర్సీ హాలులో రిజర్వేషన్ ఇన్ రిక్రూట్మెంట్స్, రోస్టర్ పాయింట్స్ మరియు  మెయిన్టెన్స్ ఆఫ్ రోస్టర్ రిజిస్టర్స్ పై నిర్వహించిన వర్క్షాపులో  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బ్యాక్ లాగ్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీని ప్రకారం జిల్లాలోని వివిధ శాఖలు భర్తీ చేయాల్సిన పోస్టులపై అందించిన ప్రతిపాదనలపై కొన్ని అభ్యంతరాలను గుర్తించటం జరిగిందన్నారు. శాఖలలో ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల  బ్యాక్ లాగ్ల పోస్టులను ప్రభుత్వ నిబంధన ప్రకారం గుర్తింపు చేసే విధానం పై అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించటానికి ప్రత్యేకంగా  వర్క్షాపు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ వర్క్షాపుల వలన శాఖలో రోస్టరు పాయింట్ల గుర్తింపు, రోస్టర్ రిజస్టర్ల నిర్వహణకు  అధికారులకు, సిబ్బందికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వర్క్షాపును సద్వినియోగం చేసుకొని ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రతిపాదనలను సక్రమంగా అందించాలన్నారు. అదే విధంగా శాఖలలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల రోస్టర్ పాయింట్ల పై కలెక్టర్ కార్యాలయం నుంచి అందించిన 1ఏ, 1బి, 1సీ ఫార్మేట్ ప్రకారం నివేదికలు అందించాలన్నారు. వర్క్షాపులో రిజర్వేషన్ ఇన్ రిక్రూట్మెంట్స్, రోస్టర్ పాయింట్స్ మరియు  మెయిన్టెన్స్ ఆఫ్ రోస్టర్ రిజిస్టర్స్ పై సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదనరావు, జిల్లా పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ విజయ సారధి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు.  కార్యక్రమంలో  ప్రభుత్వ శాఖలకు సంబంధించిన హెచ్వోడీలు, సూపరింటెండెట్లు, సంబంధిత సీటు ఉద్యోగులు పాల్గొన్నారు.

Guntur

2021-08-06 16:34:53

అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ సస్పెన్షన్..

విశాఖలోని సింహాచలం, మాన్సాస్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై దేవదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ కే. రామచంద్ర మోహన్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఈ భూములకు సంబంధించి దేవదాయ ధర్మాదాయ శాఖ విశాఖపట్నం ఉపకమిషనర్ ఈ.వి.పుష్పవర్ధన్ సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా రామచంద్ర మోహన్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇదివరలోనే ఆయనను దేవదాయ శాఖ ప్రభుత్వానికి సరెండర్ చేసిన సంగతి తెలిసిందే.ఈ భూములు. కాపాడ్డంలో భాద్యతలు సక్రమంగా నిర్వర్తించని ఇప్పటి సింహాచలం దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పటి జిల్లా సహాయ కమీషనర్ ఎన్. సుజాత ను సస్పెండ్ చేస్తూ దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జి.వాణి మోహన్ ఆదేశాలు జరీచేసారు. ప్రస్తుతం ఈ ఉత్తర్వులు దేవాదాయశాఖలో ప్రకంపనలు స్రుష్టిస్తున్నాయి.

Simhachalam

2021-08-06 16:30:17

సెలవుల్లో బీచ్ రోడ్డు ప్రవేశం నిషేధం..

విశాఖలోని శని,ఆదివారాలు, ప్రభుత్వ సెలవు  రోజులలో రామక్రిష్ణా బీచ్ రోడ్డులో ప్రవేశం నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు.  ఈనెల 4వతేదీన పర్యాటక  శాఖ మంత్రి ముత్తoశెట్టి శ్రీనివాసరావు 3వదశ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు,అధికారులతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి జిల్లా కలెక్టర్ నిషేధం ఉత్తర్వులు  జారీ చేశారు. ఈమేరకు శుక్రవారం  ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రభుత్వ సెలవు దినాలు, శనివారం, ఆదివారం రోజులలో  సాయంత్రం 5.30 గంటల నుండి మరుసటిరోజు ఉదయం వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. మూడవ దశ కొవిడ్ నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతిఒక్కరూ బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగామాస్క్ ధరించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Visakhapatnam

2021-08-06 16:25:05

కేంద్ర మంత్రి పర్యటన ఏర్పాట్లుపూర్తి..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 7వ తేదీన జిల్లాకు రానున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ శుక్రవారం పొందూరులో ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 7 వ తేదీన  జాతీయ చేనేతకారుల దినోత్సవం అని, ఆ కార్యక్రమంలో పాల్గొనటానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వస్తున్నారని వివరించారు. పొందూరులో జాతీయ చేనేతకారుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. పొందూరులో ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ది సంఘం సంస్థను సందర్శిస్తారని అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమం, వివిధ పథకాల క్రింద సహాయక కార్యక్రమాల పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుందని ఆయన చెప్పారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలో ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు 50 ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కే.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్, అర్. శ్రీరాములు నాయుడు, ఆర్డీఓ ఐ.కిషోర్, డిఎస్పి ఎం. మహేంద్ర, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, డిఅర్డిఏ పిడి బి.శాంతి, ఎల్.డి.ఎం జివిబిడి హరిప్రసాద్, డిఎంహెచ్ఓ కే. సి. చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-06 16:13:22

వాతావరణ సమతుల్యతకై మొక్కలు నాటాలి..

వాతావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని స్థానిక శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. శుక్రవారం అంపోలు వద్ద గల జిల్లా జైల్ ఆవరణలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను నాటి  కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అవసరమైన మేరకు అటవీ ప్రాంతం లేదని, తద్వారా వాతావరణంలో అనేక మార్పులు సంబవిస్తున్నాయని చెప్పారు. అందువలన ప్రతి ఒక్కరు మొక్కలను పెద్దఎత్తున నాటాలని, దీని వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయని వివరించారు. నానాటికీ పెరుగుతున్న ఉష్ణ తాపానికి కూడా అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు. మొక్కలను నాటడంతోనే పని అయిపోదని,వాటిని సంరక్షించుకోవలసిన భాద్యత కూడా మనపై ఉందని తెలిపారు. మొక్కలను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తెరగాలని, మొక్కలను నాటడమే కాకుండా ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత కూడా మన పైనే ఉందని  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఎమ్.రాజు కుమార్, జైలర్లు దివాకర్ నాయుడు, ఉదయ్ భాస్కర్, డిప్యూటీ జైలర్ జోసెఫ్, రాష్ట్ర అగ్రిమిషన్ సభ్యులు గోండు రఘురాం, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ మూర్తి, మాజీ ఎంపిపి అంబటి శ్రీనివాస్ రావు, సర్పంచ్ జయరాం, పీస శ్రీహరి, గోలివి వెంకట రమణ మూర్తి, అల్లు లక్ష్మీనారాయణ, పిఎసియస్ డైరెక్టర్ గోండు కృష్ణ, ఏమ్మార్వో జన్ని రామారావు, స్పెషల్ ఆఫీసర్ గుతి రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-06 16:12:23

శ్రీకాకుళం జిల్లాకి రాష్ట్ర మంత్రుల రాక..

శ్రీకాకుళం జిల్లా పర్యటనకు రాష్ట్ర మంత్రులు శనివారం రానున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శనివారం జిల్లాకు రానున్నారు. శని వారం ఉదయం విశాఖపట్నంలో బయలు దేరి పొందూరు చేరుకుంటారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనలో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ పొందూరులో జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొంటారు. పొందూరు కేంద్రంగా పని చేస్తున్న ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవనాన్ని సందర్శిస్తారు. అచ్చటనే ఖాదీ ప్రక్రియను పరిశీలిస్తారు. అచ్చట నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జరిగే కార్య్రమంలో లబ్ధిదారులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను ఆమె పరిశీలిస్తారు.  భోజనానంతరం బయలుదేరి విశాఖపట్నం వెళతారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి కూడా విశాఖపట్నం వెళతారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మబుగాం వెళతారు.

Srikakulam

2021-08-06 16:11:23

ఉద్యోగులకు అక్షయపాత్ర వితరణ..

కోవిడ్ నేపథ్యంలో సతమతమవుతున్న నిరుపేదలకు అక్షయ పాత్ర పంపిణీచేసే కిరాణా సరుకులను  సెక్రటేరియట్ హౌస్ కీపింగ్  ఉద్యోగులకు రాష్ట్ర  విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర  పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు శుక్రవారం అందజేశారు.  ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో సచివాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది హౌస్ కీపింగ్ ఉద్యోగులకు తొమ్మిది రకాల  కిరాణా సరుకులతో కూడిన సంచులను మంత్రులు పంపిణీ చేశారు.  బియ్యం, కందిపప్పు, పుట్నాలపప్పు, గోదుమ పిండి,  పంచదార, ఆయిల్, పసుపు, కారం, సాంబార్ పొడి తదితర తొమ్మిది రకాల కిరాణా సరుకులతో  కూడిన  సంచులను పంపిణీచేయడం జరిగింది.  ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అద్యక్షులు  కె.వెంకట్రామిరెడ్డి, అక్షయ  పాత్ర పౌండేషన్ వైస్ ప్రెసిడెంట్  శ్రీ వంశీధరరాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tadepalle

2021-08-06 16:10:30

నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు ..

 పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు శానిటరీ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన నాలుగవ జోన్ 30వ వార్డులోని రెల్లి వీధి, అఫీషియల్ కోలనీ, కె.జి.హెచ్. తదితర ప్రాంతాలో పర్యటించారు. ఈ సందర్భంలో అదనపు కమిషనర్ మాట్లాడుతూ వార్డులో ఎక్కడా చెత్త కనిపించకూడదని, పారిశుధ్య కార్యక్రమాలు, బయోమెట్రిక్ హాజరు  అయిన వెంటనే ప్రధాన రహదారులు శుభ్రపరచిన తరువాత డోర్ టు డోర్ చెత్త సేకరించాలని, అనంతరం ప్రధాన కాలువలు, వీధి కాలువలు శుభ్రపరచాలని ఆదేశించారు. పారిశుధ్య సిబ్బంది చెత్త సేకరించే విధానాన్ని పరిశీలించి వారికి తగు సూచనలు ఇచ్చారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని, చెత్త వేసే వారిపై నిఘావుంచి వారి వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని, పక్కాగా యూజర్ చార్జీలు వసూలు చేయాలని, చెత్త తరలించే వాహనాలను మూడు ట్రిప్పులు తిరిగేటట్లుగా చూడాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాదులైన మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, దోమలు ప్రబలకుండా ఉండేందుకు ఫాగింగు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితారులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-08-06 16:08:27

విశాఖలో గెడ్డలను ఆధునీక రించండి..

మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని రానున్న వర్షాకాలన్ని ద్రుష్టిలో పెట్టుకొని గెడ్డలను చెత్త లేకుండా శుభ్రపరచి ఆధునీకరించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె 5వ జోన్ 43వ వార్డు పరిధిలోని మాదేటి గార్డెన్స్, అక్కయ్యపాలెం, పోస్ట్ ఆఫీస్ రోడ్డు, నందగిరి నగర్, శ్రీనివాస్ నగర్ తదితర ప్రాంతాలలో వార్డ్ కార్పొరేటర్ పి. ఉషశ్రీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డులోని ప్రధాన రహదార్లు సరిగా శుభ్రపరచడం లేదని, వెంటనే శుభ్ర పరచాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. కాలువల మీద ఉన్న పైపులైనులను ఒక క్రమ పద్ధతిలో కాలువల అంచున క్లిప్పుల ద్వారా బిగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వార్డులలో పలు చోట్ల త్రాగునీరు చాలా చిన్న దారగా వస్తుందని స్థానిక ప్రజలు తెలపగా కమిషనర్ స్పందిస్తూ పరిశీలించి దార వేగం పెంచాలని సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ ను ఆదేశించారు. జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం. కాలనీ దగ్గర బోరు పనిచేయడం లేదని, దానిని రిపేర్ చేయించాలని ఆదేశించారు. శ్రీనివాస నగర్, నందగిరి నగర్లో ఉన్న మూడు రహదరి వంతెనలు శిధిలావస్థలో ఉన్నందున, నూతనంగా నిర్మించుటకు అంచనాలు తయారు చేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాత పోస్ట్ ఆఫీస్ రోడ్ లో ఉన్న గెడ్డపై చిన్న బ్రిడ్జిని 40 అడుగుల వెడల్పుతో పెంచాలని కార్పొరేటర్ కమిషనర్ దృష్టికి తీసుకురాగా కమిషనర్ దాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మూడు నెలల్లో వర్షాకాలంని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలని, డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మలేరియా పై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సును పరిశీలించి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి,  ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, ఎ.శ్రీనివాస రావు, ఎసిపి మధుకుమార్, ఎఎంఒహెచ్ రాజేష్, శానిటరీ సూపర్వజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.     

Visakhapatnam

2021-08-06 16:07:39

ఇతర పంటల వైపు మొగ్గు చూపాలి..

దేశంలో అవసరాలకు మించిన ఉత్పత్తి వరి లో వస్తుందని, కనుక వరి నుంచి ఇతర పంటల  వైపు రైతులు మొగ్గు చూపాలని శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. వరికి బదులుగా మొక్క జొన్న, సోయా, నూనె గింజలు లాంటి పంటలు సాగు చేయాలని సూచించారు. మారుతున్న పరిస్థితులు తగ్గట్టుగా రైతులు కూడా మారాలని, దానికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు ఆయా ప్రాంతాల రైతులకు కొత్త పంటల కోసం తెలుపుతూ.. మెలకువలు నేర్పడం, భూమిని సారవంతం చేయడం వంటి చర్యలు చేపట్టాలని అని అన్నారు. శుక్రవారం అంపోలు  వ్యవసాయ మార్కెట్ కమిటీలో రూ.40లక్షల అంచనా విలువతో నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్ కమిటీ కార్యాలయం భవనం మొదటి అంతస్థు పనులకు, రూ.27 లక్షలతో నిర్మిస్తున్న   బీ. టి రోడ్డు పనులకు శాసనసభ్యులు  ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  ధర్మాన మాట్లాడుతూ గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ కమిటీకి స్థలం కేటాయించి, కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రైతు సంక్షేమం, వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగా ఇన్ని పథకాలు అందిస్తున్నమన్నారు. పంట వేసే దశ నుంచి పంట అమ్ముకునే దశ వరకు పలు రకాల పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. గ్రామంలోనే ఆర్బీకే లు ఏర్పాటు చేసి రైతులకు కల్తీలేని నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. వంశధార రెండో ఫేజ్ పూర్తయితే మండు వేసవిలో నీరు అందించి, తద్వారా వరి తో పాటుగా ఇతర పంటలు కూడా పండించవచ్చని తెలిపారు, ఒడిశా తో ఉండే వివాదం కొలిక్కి రావడం, ట్రిబ్యునల్ తీర్పు అనుకూలంగా రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చాలా పట్టుదలతో ఉండడంతో నెరడీ బెరేజీ పూర్తవుతుందని అన్నారు.  నాటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.ఆర్ ప్రారంభించిన వంశధార ప్రోజెక్టు ను పూర్తి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏమ్మార్వో జన్ని రామారావు, ఎంపిడివో రాం మోహన్, ఎడీఎ రవి ప్రకాష్, మండల ప్రత్యేక అధికారి గుత్తి రాజారావు.ఏఎంసీ చైర్మన్ ముకళ్ల తాత బాబు, అగ్రి మిషన్ సభ్యులు గోండు రఘు రాం, తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్, జెడ్పి మాజీ చైర్మన్ వై.వి సూర్య నారాయణ, డిసిఎంయస్ మాజీ చైర్మన్ గోండు కృష్ణ మూర్తి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎమ్.వి పద్మావతీ, మాజీ ఎంపిపి అంబటి శ్రీనివాసరావు, మాజీ ఎఎంసి చైర్మన్ బోరా చిన్నంనాయుడు, ఎఎంసి వైస్ చైర్మన్ లాలబహుధుర్ శాస్ట్రీ, చల్లా శ్రీనివాసరావు, కొనర్క్ శ్రీనివాసరావు, సుంకరి కృష్ణ కుమార్, సర్పంచ్ గోండు జయరాం, బరాటం రామ శేషు, పీస శ్రీహరి, యాల్లా నారాయణ, అల్లు లక్ష్మీ నారాయణ, చిట్టి రవికుమార్, చాంగల్ రావు, బాన్నా నర్సింగరావు, పొన్నాడా ఋషి, యజ్జల గురుమూర్తి, బొచ్చెన రాజేష్, నాయుడు, ఎఎంసి సెక్రటరీ రవి కిరణ్, ఎఎంసి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Srikakulam

2021-08-06 15:07:31

ఆర్బీకేల ద్వారానే సలహాలు, సూచనలు..

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సూచనలు, సలహాలు ఇస్తారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్ మేషన్ ప్రాజెక్టు రెండు రోజుల కన్సల్టేటివ్ వర్క్ షాప్ లో వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనేజ్ అనే సంస్థ తో వ్యవసాయ శాఖ భాగస్వామ్యం అయినట్లు తెలిపారు. రైతులు ఎలాంటి వంగడాలు వేయాలి, విత్తనాలు వేయాలనే సమాచారం ఇస్తాయని పేర్కొన్నారు. దీని వలన పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందన్నారు.  యాంత్రీకరణ పరికరాలు, తదితర వాటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. పండించే పంటలు నష్టపోతే రైతు భీమా పథకం ఉందన్నారు.  పండించే పంటలకు సరియైన ధర రాకపోవడం వలన రైతుల్లో అసంతృప్తి ఉందని తెలిపారు. వ్యవసాయం అనేది వ్యాపారం, లాభసాటిగా ఉండాలన్నారు. ప్రతి గ్రామ పరిధిలో రైతుల కోసం గొడౌన్లు, పండించే పంటలు ఆరబెట్టుకోడానికి ప్లాట్ ఫారం లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మార్కెట్ లో డిమాండ్ కు అనుగుణమైన పంటలు పండించే విధంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం నుండి ఎఫ్.పి.ఓ.లకు కావలసిన సహాయ సహకారాలు ఉంటాయన్నారు.  మేలైన వంగడాలు, విత్తనాలు సరఫరా చేస్తామని పేర్కొన్నారు.  ఎఫ్. పి. ఓ లుగా గురించిన వారికి 90 శాతం సబ్సిడీతో ప్రాసెసింగ్ యూనిట్లు ఇస్తామన్నారు.  రైతులకు శిక్షణ తో పాటు క్షేత్ర స్థాయి సందర్శన ఉంటుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్ మేషన్ ప్రాజెక్టు సంచాలకులు కె. సి. గుమ్మ గోల్ నాథ్ రోల్ మోడల్, ఎఫ్.పి.ఓ.లు మంచి వ్యాపార అనుసంధానాలు పై వివరించారు. వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్ మాట్లాడుతూ భవిష్యత్తులో మార్కెటింగ్ పై ఉన్న డిమాండ్ కు అనుగుణంగా ఉన్న పంటలను పండించాలన్నారు. ఉత్పత్తి దారులు దీనిపై దృష్టి సారించాలని చెప్పారు. ఫైనాన్స్ మేనేజ్ మెంట్, మార్కెటింగ్ అప్రోచ్ లపై వివరించారు.

కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస నుండి వచ్చిన చిన్నంనాయుడు మార్కెట్ యొక్క ప్రాముఖ్యత, కెపాసిటీ బిల్డింగ్ గూర్చి, నాబార్డు బిడిఎం హరీష్ రావు బిజినెస్ ఓరియంట, ఎఫ్. పి. ఓ  మోటివేషన్, ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ పైన మాట్లాడారు. రెండు రోజు ల అధ్యాపకులు బిజినెస్ ఎక్స్పెర్ట్, బెంగుళూరు ప్రొ. వెంకటరెడ్డి, ఎన్. ఐ. ఆర్ డి, హైదరాబాద్ ఫ్యాకల్టీ సభ్యులు ఆర్. దివాకర్, మేనేజ్ అధ్యాపకులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఎఫ్ పిఓ సిఇఓ లు, నాబార్డు ఎజిఎంలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
 

Srikakulam

2021-08-06 15:05:49

సిబ్బంది సమయపాలన పాటించాల్సిందే..

అనంతపురము నగర పాలక సంస్థ పరిధి లోని 22, 23 సచివాలయలను  నగరపాలక సంస్థ కమిషనర్ పి వి వి ఎస్ మూర్తి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇందులో  బాగంగా  కోవిడ్ వాక్సినేషన్ డ్రైవ్, వాక్సినేషన్ మీద ప్రజలు అపోహలు తొలిగింపు పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క సచివాలయం సిబ్బంది బయో మెట్రిక్ హాజరు ను తప్పని సరిగా వేయాలని సూచించారు,  పలు రికార్డ్ లను తనిఖీ చేశారు, , శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, సచివాలయం సిబ్బంది సమయ పాలన పాటించాలని హెచ్చరించారు. నగరం లో మనం ఏమి పని చేస్తున్నాం, ఏమి మార్పు తెస్తున్నాం అని ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలిపారు, అంతే కాక ప్రతి కార్యదర్శి వారి యొక్క “జాబ్ చార్ట్ “ నియమాల ప్రకారం ప్రతి రోజు ఉదయం మరియు సాయంకాలం రెండు లేదా ఒక గంట పాటు పర్యటన చేస్తేనే వార్డు లోని సమస్యలు , ప్రగితి ఇతర విషయాలతో పాటు ప్రజలలో మమేకమయ్యే అవకాశం వస్తుందని అప్పుడే తమ తమ వ్రుత్తి కి న్యాయం చేసిన వారు అవుతారన్నారు... కార్యక్రమములో వార్డు కర్పోరటర్ మల్లికార్జున గారు, డి ఈ సుధారాణి , ఎ.ఈ నాగజ్యోతి మరియు తదితరులు పాల్గొన్నారు..

Anantapur

2021-08-06 15:03:53

వ్యాక్సినేషన్ ను పరిశీలించిన మేయర్..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్  గొలగాని హరి వెంకట కుమారి శుక్రవారం మల్కాపురం ఎఫ్.ఆర్.యు. కేంద్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు వాక్సినేషన్ చురుగ్గా జరగాలని మేయర్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. నేడు స్పెషల్ డ్రైవ్ ద్వారా జివిఎంసి పరిధిలోని అన్ని పట్టణ ప్రాథమిక కేంద్రాలలోనూ సచివాలయాలలో లక్ష మందికి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని, సాయంత్రానికి ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 45 సంవత్సరాలు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లులకు, టీచర్స్ కు వేయడం జరుగుతుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకుని, వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద సిబ్బందికి సహకరించి, ఒక క్రమ పద్ధతిలో వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎఫ్.ఆర్.యు. కేంద్రంలోని పరిసరాలను, మరుగుదొడ్లను పరిశీలించి వాటిని ఉపయోగించిన వెంటనే శుభ్రపరచాలి శానిటరీ అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేదని వాటిని శుభ్రపరచి ఫినాయిల్ వాడాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పూర్ణశ్రీ,  పి.వి.సురేష్, గేదెల లావణ్య, ప్రధాన వైద్యాధికారి డా.కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి,  జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు,  ఇతర అధికారులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-08-06 14:38:02

తల్లిపాలే బిడ్డలకు శ్రీరామ రక్ష..

తల్లిపాలే బిడ్డలకు శ్రీరామ రక్ష అని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. శుక్రవారం ఆరిలోవ  గాంధీ నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ తల్లి పాలు పట్టడం వలన బిడ్డకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వారిలో చురుకు తనము ఎదుగుదల బాగుంటుందని,  పాలు బిడ్డకు ఇవ్వడం వలన తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరవని, పిల్లలకు వైఎస్ఆర్ కిట్లు అందించడం జరుగుతుందని మేయర్  అక్కడికి హాజరైన  తల్లులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా. అనితా, సి.డి.పి.ఓ. వెంకటరమణకుమారి తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-08-06 14:37:24