1 ENS Live Breaking News

20 వరకే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు..

శ్రీకాకుళం జిల్లాలో రబీ సీజనులో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్ధతు ధరకు కొనుగోలు చేసేందుకు ఈ నెల 20 వరకే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు తెరచిఉంటాయని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేసారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన జారీచేసారు. రబీలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్ధతు ధరకు కొనుగోలు చేసేందుకు గాను జిల్లాలో 57 ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందని జె.సి తెలిపారు. 2020 – 21 రబీలో పండించిన ధాన్యాన్ని రైతులు విక్రయించేందుకు వీలుగా         మే నెల 18న కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించామని, నాటి నుండి రైతుల నుండి కొనుగోళ్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కొనుగోలు కేంద్రాలు ఈ నెల 20 వరకు తెరచి ఉంటాయని, కావున  రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని తమ సమీప కొనుగోలు కేంద్రం లేదా రైతు భరోసా కేంద్రానికి తీసుకువెళ్లి విక్రయించుకోవలసినదిగా ఆయన కోరారు.  జూలై 20లోగా రైతులు ఎవరూ ధాన్యం విక్రయించేందుకు ముందుకు రాకపోతే రైతుల వద్ద ధాన్యం నిల్వలు లేనట్లుగా భావించి కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరుగుతుందని వివరించారు.  కావున  జిల్లాలోని రైతులు ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వద్ద ఉన్న ధాన్యాన్ని ఈ నెల 20లోగా విక్రయించి గిట్టుబాటు ధరను పొందాలని జె.సి ఆకాంక్షించారు. 

Srikakulam

2021-07-15 16:19:16

అనంత ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం..

అనరంతపురం నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో తోడ్పాటు అందిస్తామని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా కె ఎస్ ఆర్ జూనియర్ కాలేజీ,  చర్చి ముందర డివైడర్ బ్లాక్ లను గురువారం ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటు ప్రక్రియను నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం, మున్సిపల్ కమిషనర్ పి వి వి ఎస్ మూర్తి, ట్రాఫిక్ డిఎస్పి ప్రసాద్ రెడ్డిలు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం  కార్పొరేషన్ తరపున పూర్తి సహకారం అందిస్తామని మేయర్ పేర్కొన్నారు. ఆక్రమణలు తొలగింపుతోనే ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లో కార్పొరేటర్లు బాలాంజినేయులు, అనిల్ కుమార్ రెడ్డి , సెక్రెటరీ సంగం శ్రీనివాసులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలసుబ్రమణ్యం ట్రాఫిక్ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం సిటీ

2021-07-15 16:17:40

దసరా నాటికి రోడ్లు నిర్మాణాలు పూర్తికావాలి..

జీవీఎంసీ, భీమిలీ రూరల్ నియోజకవర్గ అధికారులతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సీతమ్మధారలోని  క్యాంప్ కార్యాలయం లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరంపాలెం, రేవులపాలెం రోడ్లను దసరా పండగకి పూర్తి చేయాలని ఆదేశించారు. భీమిలి నియోజకవర్గంలో మంచినీటి సమస్య లేకుండా.. స్వచ్ఛమైన నీరు అందించేలా చూడాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. కొమ్మాది, మధురవాడ ప్రాంతాల్లో ఆక్రమణలు జరుగకుండా.. ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. 6వ వార్డులో పవర్ కట్ లేకుండా చూడాలని అన్నారు. జీవీఎంసీకి సంబంధించి హార్టికల్చర్, పార్క్స్, ప్లాంటేషన్ పై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పార్క్ సైట్స్ ఆక్రమణలకు గురి కాకుండా బయో ఫెన్సింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జీవీఎంసీ చీఫ్ విప్, 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక,  ఇంజనీరింగ్ ఎస్ఈలు సామ్ సన్, రవి, రాజారామ్, భీమిలీ నియోజకవర్గ ఉడా ఎస్ఈ రామ్ మోహన్.. ఇతర అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-07-15 15:49:23

ప్రజల అర్జీలు సత్వరమే పరిష్కరించాలి..

గుంటూరు నగరంలోని స్ధానిక అమరావతి రోడ్డు  44వ డివిజన్ పరిధిలో  ఉన్న 137, 138, 180 వార్డు సచివాలయాలను గురువారం ఉదయం  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత 137, 138 సచివాలయాల్లో  సిబ్బంది వారి డెస్క్ వద్ధ పేరు,  హోదాలతో కూడిన స్టిక్కర్ ను   ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  సచివాలయ ఉద్యోగుల హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్ మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పోస్టర్లు  ఏర్పాటు  చేసిన విధానాన్ని  జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్  పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఇప్పటివరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను సిచివాలయ సెక్రటరీల ద్వారా కంప్యూటర్ లో నమోదు చేసిన డేటా ప్రత్యక్షంగా పరిశీలన చేశారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల జాబితాను పరిశీలించి ఎంతమంది  రోగులు సచివాలయానికి వచ్చారు. ఎంతమందికి ఎక్కడికి రెఫర్ చేశారు వంటి వివరాలను వార్డు హెల్త్ సెక్రటరీని అడిగి తెలుసుకున్నారు. బియాండ్ ఎస్ ఎల్ ఏకి వెళ్లకుండా వచ్చిన అర్జీలను ప్రతీరోజు ప్రజా సమస్యలు/ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్ ఆదేశించారు. వార్డు సచివాలయం పరిధిలో ఎంతమంది వ్యాక్సిన్ చేయించుకున్నారు, 45 సంవత్సరాల పైబడిన వారికి ఎంతమందికి వ్యాక్సిన్ వేశారు, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారు, ఇంకా రెండవ డోస్ ఎంతమంది వేయించుకోవాలి వంటి వివరాలను జిల్లా కలెక్టర్  అడిగి తెలుసుకున్నారు. వైయస్సార్ బీమా, కాపు నేస్తం, నేతన్న నేస్తం పథకాలకు సంబంధించి సోషల్ ఆడిట్ కంప్లీట్ చేశారా లేదా అని అధికారులను ప్రశ్నించారు. వారి వివరాలను నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించాలని వెల్ఫేర్ అసిస్టెంట్ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం గోరంట్ల పరిధిలోని  సున్నం బట్టీల సెంటర్ 180 వ వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వెల్ఫేర్ క్యాలెండర్ డిస్ ప్లే చేశారా అని  ఆరాతీశారు. సంక్షేమ పధకాలు అమలవుతున్న తీరుని అడిగి తెలుసుకొని,  వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సచివాలయంలో మొత్తం ఎంతమంది విధులు  నిర్వహిస్తున్నారని ఆరా తీశారు. మొత్తం 10 మంది సిబ్బంధిలో ఎనిమిది మంది విధుల్లో ఉన్నట్లు గుర్తించారు. వార్డు రెవెన్యూ సెక్రటరీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీలు విధుల్లో లేకపోవడంతో ఎందుకు విధులకు హాజరుకాలేదని  జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు. వార్డు రెవెన్యూ సెక్రటరీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని జ్వరం రావడంతో తహాశీల్ధార్ కు ఫోన్ ద్వారా తన అనారోగ్య సమాచారాన్ని తెలిపినట్లు జిల్లా కలెక్టర్ కు వివరించారు. సెలవు పత్రాన్ని ఇవ్వకపోవడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని  ఆదేశిస్తూ  రిజస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. వార్డు ఉమెన్ ఫ్రొటెక్షన్ సెక్రటరీ కార్యాలయంలో లేరు కానీ తన విధుల మూమెంట్ రిజిష్ట్రర్ లో నల్లపాడులో శిక్షణకు వెళుతున్నట్లు రాసిఉండటాన్ని జిల్లా కలెక్టర్ కు అధికారులు వివరించారు. ప్రజలకు అందించే సేవలు, ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలు విషయంలో అలసత్వంగా ఉండవద్దని హితవు పలికారు.  ప్రభుత్వం జారీచేసిన నిర్ణీత సమయంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని, ఏ విభాగంలోనూ పనులు పెండింగ్ లో ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక కమీషనర్ చల్లా అనురాధ, డిప్యూటి కమీషనర్ శ్రీనివాసరావు, వెంకట కృష్ణయ్య, 44 వ డివిజన్ కార్పోరేటర్ వి.హేమలత, సాంకేతిక వ్యవస్థ జిల్లా అధికారి కె.వి. రత్నం, వార్డు  సచివాలయాల సెక్రటరీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Amaravati

2021-07-15 15:32:50

స్వచ్ఛ విశాఖ అందరి లక్ష్యం కావాలి..

విశాఖను అత్యంత స్వచ్ఛంగా తీర్చిదిద్దడంలో మహావిశాఖ నగర పాలక సంస్థ ఉద్యోగులు శక్తివంచనలేకుండా శ్రమించాలని మేయర్ గొలగాని హరివెంకటకుమారి పిలుపునిచ్చారు. గురువారం జివిఎంసి సమావేశ మందిరంలో హెచ్.పి.ఎల్.సి. ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వచ్ఛ భారత్ “ప్రతిజ్ఞ” కార్యక్రమం జివిఎంసి కమిషనర్ డా.జి. సృజన, హెచ్.పి.సి.ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నదాస్ తో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ స్వాతంత్ర సాధన తో పాటు పరిశుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారని వారి కలలను మనం నెరవేర్చాలని, అందుకు ప్రతి ఒక్కరూ సంవత్సరములో వంద రోజులు, ప్రతి వారంలో రెండు గంటలు శ్రమదానం చేసి, పరిసరాల పరిశుభ్రత పాటుపడాలని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, తమ వీధిని పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని,  అప్పుడే మన సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని తెలిపారు. హెచ్.పి.సి.ఎల్ యాజమాన్యం వారు రూ.48లక్షలతో మల్కాపురం, శ్రీహరిపురం, గొల్లపాలెం, యారాడ ప్రాంతాలలో నిర్మించిన కంటైనర్లతో కూడిన ప్రజా మరుగుదొడ్లను మేయర్, కమిషనర్ కలసి ప్రారంభించారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు హెచ్.పి.సి.ఎల్ వారు చాలా సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారని అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ,  ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారిని కోరారు. 

అనంతరం, జివిఎంసి కమిషనర్ డా. జి.సృజన మాట్లాడుతూ, స్వచ్ఛభారత్ మిషన్ లో హెచ్.పి.సి.ఎల్ వారు కొన్ని సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు “ప్రతిజ్ఞ” కార్యక్రమంను దాదాపు 18వేల మంది యాప్ ద్వారా వీక్షించి, “ప్రతిజ్ఞ”లో పాల్గొన్నారని తెలిపారు. పరిసరాలు శుభ్రంగా ఉంచాలని,  ఇందుకు ప్రజల్లో పరిసరాల  పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఎంతో కృషి చేయడం జరుగుతుందని, స్వచ్ఛభారత్ లో జివిఎంసికి ఎన్నో ర్యాంకులు సాధించి ఉన్నాయంటే ఆ ఘనత విశాఖ ప్రజలు,  వివిధ సంస్థలు, ఆర్.డబ్ల్యూ.ఎ.ఎస్., మహిళా సంఘాలు సహకారం వల్లనే సాధ్యమైనదని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించి, గుడ్డ సంచులు ఉపయోగించాలని సూచించారు. ఎస్.ఎం.ఎస్, వాట్సాప్ ల ద్వారా, స్వచ్ఛ భారత్ పై సమాచారం పంపిన వారికి, నిమిషం పాటు ప్రసంగించిన స్కూలు పిల్లలకు, డ్రాయింగ్ తదితర కార్యక్రమాలను నిర్వహించి వారిలో పోటీతత్వం పెంపొందించి బహుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. పరిశుభ్రతపై 8 ఆర్.టి.సి. బస్ డిపోలను పరిశీలించగా అందులో విశాఖపట్నం, వాల్తేరు, మధురవాడ, గాజువాక డిపోలను ఎంపిక చేసి బహుమతులు ఇవ్వడం జరిగినది. 

హెచ్.పి.సి.ఎల్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ జివిఎంసి సౌజన్యంతో ప్రతి సంవత్సరము స్వచ్ఛభారత్ పక్వాడ నిర్వహించడం జరుగుతుందని, జివిఎంసి భాగస్వామితో స్వచ్ఛభారత్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, పలుచోట్ల ప్రజా మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందని,   తడి-పొడి మరియు ప్రమాధకరమైన వ్యర్ధాలను వేరువేరుగా ప్రజలు ఇవ్వడం కొరకు 30 వేల మూడు రంగుల చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరుగుతుందని, ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి చెప్పి ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వాడాలని ఉద్దేశ్యంతో వాటిని పంపిణీ చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరు స్వచ్ఛత పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి,  డా. వి. సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-07-15 15:06:56

అర్భన్ పీహెచ్సీలను త‌నిఖీ చేసిన జెసి..

విజ‌య‌న‌గ‌రం అర్భన్ లో నూత‌నంగా నిర్మిస్తున్న ప‌లు ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్ర భ‌వ‌నాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు బుధ‌వారం త‌నిఖీ చేశారు. న‌గ‌రంలోని గాజుల‌రేగ‌, కొత్త‌పేట‌, ప్ర‌శాంతి న‌గ‌ర్‌, ఎల్‌.బి.కాల‌నీలో నిర్మిస్తున్న అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ భ‌వ‌నాల‌ను, లంకాప‌ట్నంలో మ‌ర‌మ్మ‌త్తులు చేప‌డుతున్నఅర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ భ‌వ‌నాన్ని జె.సి. వెంక‌ట‌రావు మునిసిపల్ ఇంజ‌నీర్ కె.దిలీప్ తో క‌ల‌సి ప‌రిశీలించారు. అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ భ‌వ‌నాల నిర్మాణం ఎప్ప‌టికి పూర్త‌య్యేదీ మునిసిప‌ల్ ఇంజ‌నీర్‌ను అడిగి తెలుసుకున్నారు. నాణ్య‌త విష‌యంలో  రాజీలేకుండా ఈ భ‌వ‌నాల‌ను నిర్మించాల‌ని, భ‌వ‌న నిర్మాణం త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని జె.సి. వెంక‌ట‌రావు సూచించారు. మునిసిప‌ల్ ఇంజ‌నీరింగ్ శాఖ ఆధ్వ‌ర్యంలో న‌గ‌రంలో 7 అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్  భ‌వ‌నాల‌ను ఒక్కొక్క‌టి రూ.80 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మిస్తున్నామని, నాలుగు అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ భ‌వ‌నాల‌కు ఒక్కొక్క‌టి రూ.10 ల‌క్ష‌ల‌తో మ‌ర‌మ్మ‌త్తులు చేప‌ట్టామ‌ని మునిసిప‌ల్ ఇంజ‌నీర్ దిలీప్ వివ‌రించారు. మొత్తం రూ.6 కోట్ల వ్య‌యంతో న‌గ‌రంలో వైద్య ఆరోగ్య వ‌స‌తుల మెరుగుకోసం ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. గాజుల‌రేగ‌, కొత్తపేట‌, ప్ర‌శాంతిన‌గ‌ర్‌, వి.టి.అగ్ర‌హారం(బి.సి.కాల‌నీ), స్టేడియంపేట‌, కె.ఎల్‌.పురం, ఎల్‌.బి.కాల‌నీ ప్రాంతాల్లో కొత్త భ‌వ‌నాలు నిర్మిస్తుండ‌గా, లంకాప‌ట్నం, పూల్‌బాగ్ కాల‌నీ, విటి అగ్ర‌హారం, రాజీవ్ న‌గ‌ర్‌ల‌లో పాత అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ భ‌వ‌నాల మ‌ర‌మ్మ‌త్తులు చేప‌డుతున్న‌ట్టు చెప్పారు.

Vizianagaram

2021-07-15 14:27:57

22నుంచి నూతన సర్పంచ్ లకు శిక్షణ..

 కొత్త‌గా ఎన్నికైన స‌ర్పంచుల‌కు ఈ నెల 22 నుంచి  శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు ప్రారంభం కానున్నాయి. ఒక్కో స‌ర్పంచ్‌కు మూడు రోజుల‌పాటు శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. డివిజ‌న్ల వారీగా ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు.   స‌ర్పంచుల‌ శిక్ష‌ణా కార్య‌క్ర‌మానికి చేయాల్సిన ఏర్పాట్ల‌పై, జాయింట్ క‌లెక్ట‌ర్లు, వివిధ శాఖ‌ల అధికారుల‌తో గురువారం త‌న ఛాంబ‌ర్‌లో క‌లెక్ట‌ర్ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, స‌ర్పంచుల శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల‌ని ఆదేశించారు. డివిజ‌న్ల వారీగా సుమారు వంద మంది స‌ర్పంచ్‌ల‌ను ఒక బ్యాచ్‌గా విడ‌దీసి, బ్యాచుల‌వారీగా మూడురోజుల చొప్పున రెసిడెన్షియ‌ల్ శిక్ష‌ణ ఇవ్వాల‌ని సూచించారు. విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ ప‌రిధిలోని స‌ర్పంచుల‌కు, స్థానిక మ‌హిళా ప్రాంగ‌ణంలో, పార్వ‌తీపురం డివిజ‌న్ స‌ర్పంచుల‌కు వైటిసిలో శిక్ష‌ణ ఏర్పాటు చేయాల‌ని ప్రాధ‌మికంగా నిర్ణ‌యించారు. వీరికి మూడు రోజులు ఉండేందుకు వీలుగా అన్ని ర‌కాల వ‌స‌తుల‌నూ, సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. వివిధ చ‌ట్టాలు, నిబంధ‌న‌లు, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు సంబ‌ పుస్త‌కాల‌ను కూడా వారికి అంద‌జేయాల‌న్నారు. ప్ర‌తిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని సూచించారు.

          శిక్ష‌ణ ప్రారంభ‌, ముగింపు కార్య‌క్ర‌మాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, భోధ‌నాప‌ర‌మైన అంశాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, ఆతిథ్యానికి సంబంధించిన ఏర్పాట్ల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆసరా) జె.వెంక‌ట‌రావు ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలిపారు. స‌ర్పంచుల‌కు పాల‌న‌కు సంబంధించిన అంశాల‌ను బోధించ‌డ‌మే కాకుండా, సామాజిక సేవ ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. ఇందులో భాగంగా శిక్ష‌ణా స‌మ‌యంలో స‌ర్పంచుల‌ను చెరువుల శుద్ది, ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త మొద‌లగు కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వాముల‌ను చేయాల‌ని ఆదేశించారు. స‌ర్పంచులు శిక్ష‌ణా కేంద్రానికి చేరుకొనేందుకు వీలుగా వాహ‌న సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పించాల‌న్నారు. శిక్ష‌ణానంత‌రం ప్ర‌తీఒక్క‌రికీ స‌ర్టిఫికేట్‌, గ్రూప్ ఫొటోను అంద‌జేయాల‌ని సూచించారు. శిక్ష‌ణ‌లో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌డ‌మే కాకుండా, శానిటైజ‌ర్లు, మాస్కుల‌ను అంద‌జేయాల‌ని, అవ‌స‌ర‌మైన‌వారికి కోవిడ్ వేక్సిన్‌లు వేయాల‌ని సూచించారు. అలాగే కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌డంపై స‌ర్పంచులంద‌రికీ, నిపుణులైన వైద్యుల చేత అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని డిఎంఅండ్‌హెచ్‌ను క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు.

         ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, పార్వ‌తీపురం స‌బ్‌క‌లెక్ట‌ర్ భావ‌న‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆసరా) జె.వెంక‌ట‌రావు, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, డిపిఓ సుభాషిణి, సిపిఓ జె.విజ‌య‌ల‌క్ష్మి, డిఎంఅండ్ హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డివిజ‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అధికారులు కె.రామ‌చంద్ర‌రావు, రాజ్‌కుమార్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-15 14:24:13

పచ్చదనం ప్రాధాన్య అందరూ గుర్తించాలి..

ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త ప్రాధాన్యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గుర్తించి వాటి సాధ‌న‌కోసం త‌మ వంతు కృషిచేస్తేనే  ఆరోగ్య‌క‌ర స‌మాజం రూపొందుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. మొక్క‌లు నాటేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని పేర్కొంటూ ఈ సీజ‌నులోనే వీలైనంత‌గా మొక్క‌లు నాటి వాటిని ప‌రిర‌క్షించే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. క‌లెక్ట‌రేట్ కాంప్లెక్స్ స‌మీపంలోని ఆర్ధిక శాఖ‌ల భ‌వ‌న స‌ముదాయం ప్రాంగ‌ణంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. క‌లెక్ట‌ర్‌ తానే స్వ‌యంగా మొక్క‌లు నాటేందుకు గుణ‌పంతో గుంత‌లు త‌వ్వి, మొక్క‌లు నాటి వాటికి నీరు పోశారు. హ‌రిత విజ‌య‌న‌గ‌రం స‌భ్యుల‌తో క‌ల‌సి ఈ ప్రాంగ‌ణంలో సుమారు వంద అలంక‌ర‌ణ మొక్క‌లు నాటారు. బ్యూటిఫికేష‌న్ కార్పొరేష‌న్ ఈ మొక్క‌లు అంద‌జేసింది.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ న‌గ‌రంలో ప‌చ్చ‌ద‌నాన్ని పెంచే మొక్క‌ల‌తో పాటు ఆయా ప్రాంతాల సుంద‌రీక‌ర‌ణ కోసం అలంక‌ర‌ణ మొక్క‌లు  కూడా నాటుతున్న‌ట్టు క‌లెక్ట‌ర్ చెప్పారు. నాటిన ప్ర‌తి మొక్క‌కు ర‌క్ష‌ణ‌గా ట్రీ గార్డు ఏర్పాటుచేసి ప‌దికాలాల పాటు స‌జీవంగా ఉండేలా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్రాంగ‌ణంలో పెరిగిన క‌లుపు మొక్క‌ల‌ను, విష‌పూరిత మొక్క‌ల‌ను క‌లెక్ట‌ర్ హ‌రిత విజ‌య‌న‌గ‌రం స‌భ్యుల‌తో క‌ల‌సి తొల‌గించే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా సామాజిక అట‌వీ అధికారి బి.జాన‌కిరావు, హ‌రిత విజ‌య‌న‌గ‌రం కో ఆర్డినేట‌ర్ రామ్మోహ‌న్ రావు, డా.వెంక‌టేశ్వ‌ర‌రావు, ఏ.పి.ఇ.డ‌బ్ల్యు.ఐ.డి.సి. కార్య‌నిర్వాహ‌క ఇంజ‌నీర్ శామ్యూల్‌, డి.ఇ. స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-15 14:22:12

జిల్లాలో 1528 మంది పిల్లలు గుర్తింపు..

శ్రీకాకుళంజిల్లాలో 1528 మంది ప్రత్యేక అవసరాల పిల్లలుగా గుర్తించడం జరిగిందని సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త యస్.తిరుమల చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీచేసారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల గల పిల్లల నమోదు మరియు బడిబయట పిల్లలను ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైంది. అందులో భాగంగా 06-18 సం.ల లోపు ప్రత్యేక అవసరాల గల పిల్లలు తప్పనిసరిగా  పాఠశాలల్లో నమోదుచేయడం లక్ష్యంగా ఉందని, మార్చిలో జరిగిన సర్వేలో బడి బయట పిల్లలు 1528 మందిని గుర్తించడం జరిగిందని తెలిపారు. వీరిలో 802 ప్రాథమిక స్థాయిలో, 726 మంది సెకండరీ స్థాయిలో గుర్తించామని, వీరందరిని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేసినట్లు ఆయన చెప్పారు. 1528 మంది పిల్లలో 101 మంది స్వయంగా నమోదుచేసుకున్నారని, 38 మంది దివ్యాంగ పిల్లలు,  97 మంది కె.జి.బి.వి పిల్లలు, 138 మంది ఆవాస సహిత ప్రత్యేక శిక్షణ కేంద్రం పిల్లలు, 428 మంది ఆవాస రహిత ప్రత్యేక శిక్షణ కేంద్రం పిల్లలు, 726 మంది ఓపెన్ స్కూల్ పిల్లలు వెరశి 1528 మంది పిల్లలుగా గుర్తించినట్లు చెప్పారు. జిల్లాస్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారి, అదనపు పథక సమన్వయకర్త, ఉపవిద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారి మరియు సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేసినట్లు ఆయన తెలిపారు.

          ప్రత్యేక అవసరాల గల పిల్లలు సర్వే మరియు బడి బయట పిల్లలు సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, అదనపు పథక సమన్వయకర్త యస్.తిరుమల చైతన్య, సహిత విద్యా సమన్వయకర్త్లు యస్.అనురాథ, సిహెచ్.సుధాకర్, ప్రత్యామ్నాయ పాఠశాల సమన్వయకర్త డి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-15 14:19:28

కోవిడ్ నిబంధనలు అమలుకావాల్సిందే..

కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలు, 144 సెక్షన్ ఉల్లంఘించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుం టామని జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. కోవిడ్ నివారణా చర్యలపై గురువారం స్థానిక ప్రకాశం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  పబ్లిక్ స్థలాల్లో మాస్కు ధరించకుండా సంచరించే వారికి రూ. 100 రూపాయలు జరిమాన విధించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. నెం: 370, 371 విడుదల చేసిందన్నారు. వైరస్ వ్యాప్తని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేస్తామన్నారు. వాణిజ్య సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాలలోకి మాస్కు లేనివారిని అనుమతిస్తే రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమాన విధిస్తామన్నారు. మూడు రోజుల వరకు దుకాణాలు వాణిజ్య సముదాయాలను సైతం మూత వేస్తామన్నారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు కోవిడ్ కర్ఫ్యూ, 144 సెక్షన్ ఈనెల 21వ తేదీ వరకు అమలులో ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 3.5 శాతం కోవిడ్ కేసులు
నమోదవుతున్నాయని చెప్పారు. వైరస్ వ్యాప్తి అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జి.ఓ. విడుదల చేసిందన్నారు.

           నూతన ఉత్తర్వుల ప్రకారం జరిమాన విధించే అధికారాలను పోలీసులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని కలెక్టర్ తెలిపారు. రెవిన్యూ, మున్సిపాలిటీ, పోలీసులు బృందాలుగా ఏర్పడి జి.ఓ.ను అమలు చేస్తారన్నారు. గడిచిన మూడు రోజుల్లో 149 గ్రామ పంచాయతీలలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై 750 కేసులు నమోదు చేశామన్నారు. వారికి రూ. 65 వేలు జరిమానా విధించామన్నారు. కోవిడ్ కేసుల నమోదు తగ్గక పోవడంపై ప్రతిరోజు సమీక్షిస్తున్నామని ఆయన వివరించారు. వివాహాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల నిర్వహణలో కోవిడ్ నిబంధనలు ప్రజలు పాటించడం లేదన్నారు. క్వారీలు, మార్కెట్ సముదాయాల వద్ద కూలీలు సమూహంగా పనులకు వెళ్లే పరిస్థితులలో వైరస్ వ్యాప్తి జరుగుతోందన్నారు. వైద్యశాలలను సిద్ధ పరిచామని, ఐ.సి.యు. బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, వైద్య పరికరాలు, ఔషధాలు సిద్ధంచేస్తున్నామని ఆయన వివరించారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళికతో యంత్రాంగం ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు.

            కోవిడ్ మూడవ దశ రాకుండా జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ నివారణ టీకా పొందడానికి హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్, ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులు, 45 సంవత్సరాలు దాటిన వారంతా అర్హులన్నారు. 11 లక్షల 55 వేల 580 మందికి టీకా వేయాలనే లక్ష్యం కాగా ప్రస్తుతం 9 లక్షల 81 వేల 666 మందికి టీకా మొదటి డోసు వేశామన్నారు. 85.5 శాతం లక్ష్యానికి చేరుకున్నామని మిగిలిన వారికి టీకా వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం 1,046 గ్రామ పంచాయతీలలో ప్రతిరోజు 10 వేలకు తగ్గకుండా కోవిడ్ పరీక్షలు చేస్తున్నామని, గడిచిన 14 రోజులలో 1,34,051 మందికి పరీక్షలు చేశామన్నారు. ప్రస్తుతం 20 మండలాలలోని 20 పి. హెచ్.సి.ల పరిధిలో ఐదు శాతానికి మించి కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని వివరించారు. ఈ నేపధ్యంలో కోవిడ్ నిబంధనలపై రూపొందించిన గోడపత్రాలు, కరపత్రాలను 7.22 లక్షల గృహాలలో అందజేశామన్నారు. గడిచిన రెండు రోజుల్లో 46 వేల మందిని చైతన్య పరిచామన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో ప్రచార బోర్డులు, సచివాలయాల వద్ద గోడ పత్రాలు ఉంచామన్నారు. కోవిడ్ మూడవ దశ రాకుండా జిల్లా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

            కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జి.ఓ.ను కఠినంగా అమలు చేస్తామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్.పి. మాలికా గార్గ్ చెప్పారు. వైరస్ సోకిన కేసుల నమోదులో ప్రకాశం జిల్లా ఐదో స్థానంలో ఉందన్నారు. జిల్లాలో కోవిడ్ నివారణపై రెవిన్యూ, పోలీస్ శాఖలు సమస్వయంతో ఉద్యమంలా పనిచేస్తామని ఆమె తెలిపారు. కోవిడ్ నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, వ్యాప్తి అరికట్టడానికి సమర్థంగా చర్యలు తీసుకుంటమని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) టి.ఎస్. చేతన్, కోవిడ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి డాక్టర్ తిరుమల రావు, తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-07-15 14:05:12

ఉన్నత స్థానాలు అధిరోహించాలి..

శ్రీకాకుళం సమాచార పౌర సంబంధాల శాఖలో జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేసిన యల్.రమేష్ అదే శాఖలో సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందడం ఆనందంగా ఉందని, ఆయన మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ విభాగం అధ్యాపకులు ఆకాంక్షించారు. సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందిన రమేష్ కు డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ విభాగం అధ్యాపకులు దుశ్శాలువ, పుష్పగుచ్ఛం, జ్ఞాపికతో గురువారం ఆయన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్స్ విభాగానికి యల్.రమేష్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబరుగా కొనసాగుతున్నారని, అటువంటి సభ్యులకు పదోన్నతి రావడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అధ్యాపక బృందం అభిలషించారు. ఈ కార్యక్రమంలో డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ విభాగం అధ్యాపకులు డా. రెడ్డి తిరుపతిరావు, డా. జి.లీలావరప్రసాద్, డా. వై.డి.రామ్ దాస్, డా. పి.పద్మ తదితరులు పాల్గొన్నారు.   

Srikakulam

2021-07-15 14:00:15

రూ.7 లక్షల మోనిటర్లు అందజేత..

శ్రీకాకుళం జిల్లాలో థర్డ్ వేవ్ వస్తే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వంతో పాటు పలు స్వచ్చంద సంస్థలు, కంపెనీలు, ఇతర రంగాలు ముందుకువస్తున్నాయని ఇది శుభపరిణామమని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. కలెక్టర్ ఛాంబరులో 7 లక్షల రూపాయలు విలువైన ఆక్సీజెన్ కాన్సంట్రేటర్లు, పేషేంట్ మోనిటర్లను జిల్లా కలెక్టర్ కు ఐ.సి.ఐ.సి.ఐ  బ్యాంక్ సిబ్బంది గురువారం అంద జేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫస్ట్, సెకెండ్ వేవ్ లో వచ్చిన కరోనాను సమర్ధంగా ఎదుర్కొ న్నామని, గతంలో వచ్చిన చిన్నపాటి లోపాలను దృష్టిలో ఉంచుకుని థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొ నేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు సమకూరుస్తున్న సామాగ్రితో పాటు స్వచ్ఛంద సంస్థలు,పలు కంపెనీలు ముందుకువచ్చి తమ సహాయ సహకారాలను అందించడం ఆనందంగా ఉందన్నారు. ఇదేబాటలో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు సిబ్బంది రూ.7లక్షల విలువైన ఆక్సీజెన్ కాన్సం ట్రేటర్లు, పేషేంట్ మోనిటర్లను అందజేయడం సంతోషకరమని కలెక్టర్ తెలిపారు. వీటిని అవసరమైన ప్రభుత్వ ఆసు పత్రులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మెట్ట చంద్రశేఖర్, డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ దుంగ సౌమ్య, రిలేషన్ షిప్ మేనేజర్ ఎం.సేతుపతి, అకౌం ట్స్ ఆఫీసర్ ఎస్.పృథ్వి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-15 13:37:39

సింహాద్రినాధుడికి రూ.లక్ష విరాళం..

సింహాచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారికి విశాఖలోని పెందుర్తి చిన్న ముషిడివాడకు చెందిన గుల్లిపల్లి సత్యనారాయణ లక్షా ఒక్క రూపాయలు విరాళం ఇచ్చారు. గురువారం ఈ మేరకు దాతలు దేవస్థానం పీఆర్వో ఆఫీసులోని లో చెక్ అందించారు.  గుల్లిపల్లి నారాయణమ్మ, గుల్లిపల్లి శ్యామల,గౌరునాయుడు సంస్మరణార్థం 17-07-21న అన్నదానం చేయాలని దేవస్థాన సిబ్బందిని కోరారు. అనంతరం స్వామివారి వారిని దర్శించుకుని కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. దాతలకు ఆలయ సిబ్బంది తీర్ధ ప్రసాదాలను అందజేశారు. దాతలు మాట్లాతూ, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నామన్నారు.

Simhachalam

2021-07-15 13:33:26

అప్పన్నకు రూ.1,01,116 విరాళం ..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి విశాఖపట్నం మధురవాడ ప్రాంతానికి చెందిన లక్ష్మీరామ్ నాయుడు లక్షా 1116 రూపాయలు విరాళమిచ్చారు. ఈ మేరకు గురువారం పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ కౌంటర్లో  నగదు సమర్పించారు. వెంటనే నిత్యన్నదానం  బాండ్, రిసీప్ట్ స్వీకరించారు. తన పుట్టినరోజైన సెప్టెంబర్ 19వ తేదీన స్వామివారి సన్నిధిలో భక్తులకు అన్నదానం చేయాలని లక్ష్మీరామ్ నాయుడు ఆలయ అధికారులను కోరారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు ప్రసాదం అందించారు. 

Simhachalam

2021-07-15 13:30:32

థర్డ్ వేవ్ పైప్రజలను చైతన్యపరచాలి..

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో ప్రాజెక్టు పునరావాస కాలనీలను ఆయన మంగళవారం పరిశీలించారు. వేములకోట పునరావాసకాలనీని ఆయన పరిశీలించారు. అనంతరం గొట్టిపడియ  నిర్వాసితులు కూడా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. పునరావాస కాలనీల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. కాలనీలో అంతర్గత రహదారులు నిర్వహిస్తామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి సచివాలయాల చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ చెప్పారు. పెద్దారవీడు మండలంలోని వేముల కోట-1 సచివాలయాన్ని, దేవరాజుగట్టు సచివాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది, వాలంటీర్ల హాజరు పట్టిక, అనుబంధ దస్త్రాలను ఆయన పరిశీలించారు. కరోనా వైరస్ మూడవ దశ రాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ముఖ్యంగా వలస కూలీలు వస్తే వారికి కోవిడ్ పరీక్షలు చేయాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రజలలో చైతన్యం రావాలని ఆయన సూచించారు. ఇందుకోసం అవగాహనపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు.  కోవిడ్ నివారణ టీకాలు లక్ష్యం మేరకు వేగంగా పూర్తి చేయాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన చెప్పారు. గ్రామ స్థాయిలోకి పరిపాలన తీసుకు వెళ్లాలని ఆయన వివరించారు. వాలంటీర్ల పనితీరును పరిశీలించి నివేదిక పంపాలన్నారు. సచివాలయాల భవనాలు వేగంగా పూర్తి అయ్యేలా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పర్యవేక్షించాలన్నారు.  ఆయన వెంట మార్కాపురం ఆర్డిఓ లక్ష్మీశివజ్యోతి, భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్ సరళ వందనం, ఉప కలెక్టర్ గ్లోరియా, తాసిల్దార్ నాగార్జునరెడ్డి, తదితరులు ఉన్నారు.

Peddaraveedu

2021-07-13 15:44:47