1 ENS Live Breaking News

పందుల సంచారాన్ని అరికట్టండి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి సోమవారం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలసి ఐదవ జోన్, 70వ వార్డు పరిధిలోని చట్టివానిపాలెం, శ్రీనివాస నగర్, ఎర్ర గెడ్డ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  హైవే పై ఉన్న ఎలెక్ట్రికల్ పోల్స్ ను తొలగించి సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వార్డులో పందులు అధికంగా ఉన్నాయని, వాటిని ఈ రోజే తొలగించాలని ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు. చట్టివానిపాలెం లోని కాలువలు, రోడ్డులు “ఐలా” వారి అధీనంలో ఉన్నాయని, “ఐలా” కమిషనర్ ను సంప్రదించి రోడ్డులు, కాలువలు శుభ్రం చేసేలా మాట్లాడతానని వార్డు కార్పొరేటర్ కు తెలిపారు. రోడ్డు మధ్య భాగంలో భూగర్భ డ్రైనేజ్ కొరకు తవ్విన గోయ్యలను సరిగా పూడ్చక పోవడంతో రోడ్డు గుంటలుగా ఉన్నాయని, వాటిని వెంటనే పూడ్చి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మహిళా సంక్షేమ భవనం ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో పార్కు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని, అంగడివాడి సెంటర్ ను ప్రాధమిక ఆరోగ్య కేంద్రంగా ఉపయోగిస్తున్నందున, అంగన్వాడి కేంద్రాన్ని మరో చోటుకు మార్చాలని, శ్రీనివాస్ కాలనీ, ఎర్రగెడ్డ ఏరియాలో మంచినీటి పైపు లైను వేయాలని కార్పొరేటర్ మేయర్, కమిషనర్ కు తెలుపగా, వాటిని పరిశీలిస్తామని, మంచినీటి పైపు లైను కు ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో 70వ వర్డు కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్ర రావు, వార్డు వై.ఎస్.ఆర్.సి.పి. ఇంచార్జ్ తిప్పల దేవాన్ రెడ్డి, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీధర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు  ప్రసాద్ బాబు, చిరంజీవి, వెంకట రావు, శ్రీనివాస్, ఉప  కార్యనిర్వాహక ఇంజినీర్ తదితర అధికారులు పాల్గొన్నారు.              

విశాఖ సిటీ

2021-07-05 14:52:45

స‌చివాల‌యాన్ని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌..

విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ప‌రిధిలోని రెండు స‌చివాల‌యాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ సోమ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. పాత‌బ‌స్టాండ్‌, నాగ‌వంశ‌పు వీధి స‌మీపంలోని 25,26 స‌చివాల‌యాల‌ను ఆయ‌న సంద‌ర్శించి, అటెండెన్స్ రిజిష్ట‌ర్‌ను త‌న‌ఖి చేశారు. మూవ్‌మెంట్ రిజ‌ష్ట‌ర్‌ను ప‌రిశీలించారు. ఆన్‌లైన్ విన‌తులు, ఇత‌ర పెండింగ్ ప‌నుల‌పై వాక‌బు చేశారు. ఆయా డివిజ‌న్ల‌లో అమ‌లు జ‌రుగుతున్న ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల వివ‌రాల‌ను తెలుసుకున్నారు. సిబ్బంది అంతా స‌కాలంలో విధుల‌కు హాజ‌రు కావాల‌ని, బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా మూవ్‌మెంట్ రిజిష్ట‌ర్‌లో న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. వ‌చ్చిన అర్జీల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించాల‌ని, ప‌రిష్క‌రించ‌లేని వాటిని, అందుకు గ‌ల కార‌ణాల‌ను అర్జీదారునికి తెలియ‌జేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

Vizianagaram

2021-07-05 14:43:00

మన్నెం వీరుడు అల్లూరికి ఘన నివాళి..

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టర్‌ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి  పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన యోధులలో అల్లూరి ఒకరని తెలిపారు.  మన్యం ప్రజల హక్కుల కోసం, వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం చివరికి వారి ప్రాణాలను రక్షించడానికి తన ప్రాణాలు సైతం అర్పించి మన్యం గుండెల్లో గిరిపుత్రుల జీవితాల్లో అల్లూరి సీతారామరాజు శాశ్వతంగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్‌ (ఆసరా , సంక్షేమం) కే శ్రీధర్‌ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారిణి దుర్గాబాయి, ఎస్‌ఎస్‌ఏ పీవో యం.వెంకటప్పయ్య, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు అమర సుబ్బయ్య, సత్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు. 

Guntur

2021-07-04 14:30:32

శ్రీ సోమేశ్వర ఆలయానికి భూమిపూజ..

వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం అహోబిలాపురం గ్రామంలోని భానుకోట శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి  వెల్లం పల్లి శ్రీనివాస్, టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డిలు ఆదివారం భూమి పూజ  శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణపతి పూజతో ఈ కార్యక్రమాలు ప్రారంభించి వాస్తుహోమం, నవగ్రహ ఆరాధన, నవరత్న స్థాపన, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు అర్చన, నైవేద్యం, హారతి సమర్పించారు.  ఈ ఆలయంలో రూ.3.54 కోట్ల వ్యయంతో టిటిడి అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో త్రితల రాజగోపుర నిర్మాణం, శివాలయం, అమ్మవారి ఆలయం, ముఖమండపం పునర్నిర్మాణం, ధ్వజస్తంభం, బలిపీఠం ఏర్పాటు, వినాయక స్వామివారి ఆలయ నిర్మాణం, ఆలయ ప్రాకారం నిర్మాణం తదితర పనులు ఉన్నాయి.

రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందిన ఒక్క సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వమని దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం సోమేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆలయాలకు చెందిన భూముల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. మరమ్మత్తులకు గురైన ఆలయాల జీర్ణోద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో  ఎంపి ఆవినాష్ రెడ్డి,  ఎమ్మెల్సీ  బిటెక్ రవి, జిల్లా కలెక్టర్  హరి కిరణ్, జాయింట్ కలెక్టర్  గౌతమి, రావుల కొలను సర్పంచ్   మహేశ్వర రెడ్డి,టీటీడీ సిఈ  నాగేశ్వరరావు, ఎస్ఈ  జగదీశ్వర రెడ్డి, డిప్యూటి ఈవో రమణ ప్రసాద్, పడ ఓఎస్డీ 
అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Ahobilam

2021-07-04 13:32:21

సి.ఎం వైఎస్.జగన్ పర్యటనకు పటిష్ట భద్రత..

రాష్ట్ర ముఖ్యమంత్రి  వై ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 8, 9నజిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయం లో జిల్లాలోని డి.ఎస్.పి లు, సి.ఐ లతో  సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ, కడప, ఇడుపులపాయ, పులివెందుల, బద్వేలు లలో సి.ఎం పర్యటన ఉంటుందన్నారు. బద్వేలు కు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. హెలిపాడ్, రూట్ బందోబస్త్, పబ్లిక్ మీటింగ్ వద్ద అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మైదుకూరు డి.ఎస్.పి విజయ్ కుమార్ ను ఆదేశించారు. కడప నగరానికి సంబంధించి ఆర్ట్స్ కళాశాల మైదానం, మహావీర్ సర్కిల్, సి.పి బ్రౌన్ లైబ్రరీ, వై.ఎస్.రాజా రెడ్డి క్రికెట్ స్టేడియం వద్ద, రిమ్స్ హెలిప్యాడ్, కడప విమానాశ్రయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే పులివెందులలోని సి.ఎం పర్యటించే ప్రాంతాలు, ఇడుపులపాయ వై.ఎస్.ఆర్ ఘాట్ వద్ద, సి.ఎం నివాసం వద్ద చెక్ పోస్టు లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

ఇడుపులపాయ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి అణువణువూ క్షుణ్ణంగా జల్లెడ పట్టాలని ఆదేశించారు. పులివెందుల టౌన్ లో హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి సి.ఎం వెళ్లే రూట్ మొత్తం బ్యారికేడ్లతో పాటు బస్ స్టాండ్ సర్కిల్, పూలంగళ్ల సర్కిల్ వద్ద, బహిరంగ సభాస్థలి వద్ద తగినంత బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.   సందులు, గల్లీల్లో పోలీసులను మొహరించాలని ఆదేశించారు. బాంబు డిస్పోజల్ టీం లు సి.ఎం పర్యటించే ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. డి.ఎఫ్.ఎం.డి (డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ), హెచ్.హెచ్. ఎం.డి (హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ ) లతో అందరినీ తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలన్నారు. సమావేశంలో ఎస్.బి డి.ఎస్.పి బి.వెంకట శివారెడ్డి, ఏ.ఆర్ డి.ఎస్.పి రమణయ్య, మైదుకూరు డి.ఎస్.పి విజయ్ కుమార్, పులివెందుల డి.ఎస్.పి శ్రీనివాసులు, రాయచోటి డి.ఎస్.పి శ్రీధర్, జమ్మలమడుగు డి.ఎస్.పి నాగరాజు, రాజంపేట డి.ఎస్.పి శివభాస్కర్ రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డి.ఎస్.పి చెంచుబాబు, ఎస్సి, ఎస్టీ సెల్ డి.ఎస్.పిలు సుధాకర్, రవికుమార్, సి.ఐ లు పాల్గొన్నారు.

Kadapa

2021-07-04 12:21:29

అల్లూరి ఆశయ సాధనకు కృషి..

స్వాతంత్య్ర సమరయోధులు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకై ఈ ప్రభుత్వం కృషిచేస్తుందని గృహనిర్మాణ శాఖ సంయుక్త కలెక్టర్ హిమాంశు కౌశిక్ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు 124వ జయంతి వేడుకలు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా జరిగాయి. తొలుత అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి జె.సి,  రెవిన్యూ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి పోరాట స్ఫూర్తి అందరికి ఆదర్శమని, అతి చిన్న వయసులోనే మహోజ్వల శక్తిగా అల్లూరి ఎదిగారని కొనియాడారు. ఆయన చేసిన సాయుధ పోరాటం స్వతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని అభివర్ణించారు. ఆయన స్పూర్తితో భగత్ సింగ్ వంటి వీరులు ముందుకు వచ్చారని గుర్తుచేశారు. గిరిజన హక్కుల కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తి ఇప్పటికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గిరిజనులకు విద్య, వైద్యంతో పాటు సమాన హక్కులు, ఆర్.ఐ.డి.ఎఫ్ పట్టాలు, ఇళ్ల పట్టాలు, గృహానిర్మాణాలు  వంటి కార్యక్రమాలను ప్రతీ సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలో ఒక ఐ.ఏ.ఎస్ అధికారి ద్వారా చేపడుతున్నట్లు వివరించారు. అల్లూరి వంటి మహనీయులు గిరిజనుల అభివృద్ధి కోసం ఏమి ఆశించారో వాటన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి సిహెచ్.రాజేశ్వరరావు, ఇతర అధికారులు, కలెక్టర్ కార్యాలయ విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-04 10:25:00

మెగా గ్రౌండింగ్ లో జిల్లానే ప్రథమం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించిన మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో 200 శాతానికి పైగా ఇల్లు నిర్మాణాలను ప్రారంభించి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్ వెల్లడించారు. ఈ మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమం విజయవంతం కావడానికి  వాలంటీరు దగ్గర నుండి అధికారుల వరకు నిర్విగ్నంగా కృషిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ఈ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించేందుకు మార్గ నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, సంయుక్త కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, గృహ నిర్మాణ శాఖ సంయుక్త కలెక్టర్ హిమాంశు కౌశిక్ లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఇంత భారీస్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా కేంద్ర కార్యాలయం నుండి ప్రత్యేక అభినందనలు లభించాయని చెప్పారు. జూలై 3న పొన్నాడలో నిర్వహించిన గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వీడియో కాలింగ్ ద్వారా నేరుగా లబ్దిదారులతో  మాట్లాడి జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను తెలుసుకొని సంతోషాన్ని వ్యక్తపరిచారని చెప్పారు. లబ్ధిదారులు ఇంకా ఎవరైనా ముందుకు వస్తే వాటిని కూడా గ్రౌండింగ్ చేయించి ఇదే వేగంతో, ఇదే స్ఫూర్తితో భూమి పూజ మొదలుపెట్టి ఇల్లు పూర్తయ్యేంత వరకు భాద్యత వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీస్తున్నారని, ఆయన ఆశయ సాధనకు అందరు అధికారుల సహకారంతో ఈ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో జిల్లాను గౌరవ ప్రధమైన స్థానంలో నిలిపి ప్రభుత్వం నిర్దేశించిన 92 వేల గృహాలను పూర్తిచేసి ,  ఫేజ్ - 2 క్రింద మిగిలిన 30 వేలు గృహాలను కూడ తీసుకువచేందుకు కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Srikakulam

2021-07-04 10:22:58

అప్పన్నకు అరకేజీ చందనం సమర్పణ..

 శ్రీశ్రీశ్రీ  శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) వారికి విశాఖ బుచ్చిరాజుపాలెం గవరవీధికి చెందిన భక్తుడు మారిశెట్టి లీలాఈశ్వరరావు, సూర్యకళ దంపతులు ఆదివారం  అరకేజీ చందనం సమర్పించారు. ట్రస్టు బోర్డు సభ్యుడు సూరిశెట్టి సూరిబాబు, దినేష్ రాజు ఆధ్వర్యంలో  చందనం సమర్పించారు.  ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ కు రూ. 10,116 (పదివేల నూట పదహారు)ను సమర్పించి చందనం చెక్కను ప్రసాదంగా పొందారు. అనంతరం స్వామివారిని దర్శించుకుకొని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. స్వామివారిని దర్శించుకుని ఇక్కడే చందనం సమర్పిస్తే వెంటనే చందనం చెక్కను ప్రసాదంగా ఇస్తామని రాఘవ కుమార్ వివరించారు.

Simhachalam

2021-07-04 07:39:23

అప్పన్నకు ICDSజెడీ శ్రీలత పూజలు..

సింహాచలం  శ్రీశ్రీశ్రీ  శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) వారిని మహిళా శిశు సంక్షేమశాఖ జాంట్ డైరెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ఆర్.శ్రీలత తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి చేరుకున్నవారికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన సింహాద్రి అప్పన్నకు ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ప్రసాదం అందజేయగా, వేద పండితులు ఆశీర్వాదం అందించారు. జెడీతోపాటు పెందుర్తి సిడిపిఓ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

Simhachalam

2021-07-04 06:56:40

రాజమండ్రి పాత బ్రిడ్జికి అల్లూరి పేరు..

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి-కొవ్వూరు పాత వంతెనకు ప్రభుత్వం శ్రీ అల్లూరి సీతారామరాజు వంతెనగా నామకరణం చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వంతెన  ఫోటో పెడుతూ, కోట్స్ రాశారు. 2021వ సంవత్సరానికి అల్లూరి జన్మించి 124 సంవత్సరాలు పూర్తవుతుంది. నాటి నుంచి నేటి వరకూ అల్లూరి పేరుతో చారిత్రక చిహ్నాలు ఏమీలేవు.  74ఏళ్ల స్వాంత్ర్య భారత దేశంలో తెల్లవాడిని మట్టికరిపించి తెలుగువాడి పౌరుషాన్ని ప్రదర్శించిన అల్లూరి ఏ ప్రభుత్వమూ సముచిత స్థానాన్ని ఇవ్వలేదు. ఆయన పేరు, జీవిత చరిత్రతో మ్యూజియం, క్రిష్ణదేవిపేట, విశాఖ జిల్లాలను అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా మారుస్తామన్నహామీలు కూడా నెరవేరలేదు. కానీ ఎప్పుడో బ్రిటీషు కాలంలో నిర్మించిన కొవ్వూరు-రాజమండ్రి వంతెనకు మాత్రం అల్లూరి పేరు పెడుతున్నట్టు ప్రకటించడం నేడు చర్చనీయాంశం అవుతుంది.

Rajahmundry

2021-07-03 15:25:40

అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు..

శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యశ్రీ నిబంధనలను అతిక్రమించి అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సంయుక్త కలెక్టర్, ఆరోగ్యశ్రీ అదనపు ముఖ్యకార్యనిర్వహణాధికారి డా. కె.శ్రీనివాసులు హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ నిబంధనలు ఉల్లంఘించి వసూళ్లకు పాల్పడిన రాగోలు జెమ్స్ ఆసుపత్రి అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీచేసారు. జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పౌందిన పేషెంట్ నుండి డబ్బులు వసూలు చేసినట్లు రుజువైనందున జిల్లా క్రమశిక్షణ కమిటీ ద్వారా వసూలు చేసిన డబ్బులు కంటే పదిరెట్లు అధికంగా ఒక లక్షా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల పది రూపాయలు ( రూ.1,29,410/-లు ) జరిమానా విధించినట్లు జె.సి తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స పొందిన వారి దగ్గర నుండి ఆసుపత్రి వర్గాలు ఎటువంటి వసూళ్లకు పాల్పడరాదని, పాల్పడినట్లు రుజువైతే ఆయా ఆసుపత్రుల అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Srikakulam

2021-07-03 15:04:45

శానిటేషన్ విధులు నిర్వర్తించాల్సిందే..

రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పురపాలక శాఖల్లో- ఏర్పాటు చేసిన వార్డు శానిటేషన్,  పర్యావరణ కార్యదర్శులకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వర్తించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. జి.ఒ.నెం.650 ప్రకారం వార్డు శానిటరీ కార్యదర్శులకు కొన్ని విధులు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ముఖ్యంగా సచివాలయం పరిధిలో కనీసం 3 గంటలు అవుట్ డోర్ వర్క్ లకు  వెళ్లడం,  తడి-పొడి చెత్త 100% సేకరణ చేయించడం, బహిరంగ ప్రదేశాల్లో,  కమ్యూనిటీ హాల్ లోనూ,  ప్రజా మరుగుదొడ్లు మొదలైన చోట్ల పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు.  ఆన్ లైన్ బల్క్ వెస్ట్ మేనేజ్మెంట్ సిష్టం అమలు, ప్రతి ఇంట్లో, బయట వేస్ట్ జనరేటర్ లకు అవసరమైన సాంకేతిక సహాయం అందించాలన్నారు. సేంద్రియ ఎరువుల తయారుచేయు పద్ధతుల పై మహిళలకు అవగాహన కల్పించడంతోపాటు  రోడ్లపై పశు  సంచారం లేకుండా చూడాలన్నారు. సచివాలయ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలోని రోగులకు వివరాల సేకరణ, నిషేధిత ప్లాస్టిక్ ను అమ్మకాలు జరగకుండా చూడాలని, లైన్ డిపార్ట్మెంట్ వారితో కలసి వెస్ట్ మేనేజ్మెంట్ అమలుకు అవసరమైన సమాచారం ఇవ్వాలన్నారు. నగరంలో 100% చెట్లు బ్రతికే విధంగా చర్యలు  తీసుకోవడంతో పాటు వార్డులోని సమస్యలను అధికారులకు తెలియజేయాలన్నారు.   వారికి ప్రభుత్వం 15 సాధారణ సెలవులు,  పబ్లిక్ సెలవులు  వర్తిస్తాయని అన్నారు.  వార్డు శానిటేషన్,  పర్యావరణ కార్యదర్శులు వారి విధి నిర్వహణ నిమిత్తం  జివిఎంసి  లోని  ప్రజా ఆరోగ్య శాఖకు  అనుసంధానం చేయబడ్డారన్నారు. వారంతా కేటాయించిన విధులు ప్రకారం ఉదయం 6 గంటల నుంచి పనివేళలు మొదలవుతాయని కమిషనర్ స్పష్టం చేశారు.

GVMC office

2021-07-03 15:02:51

5నుంచి మంత్రి బొత్స జిల్లా ప‌ర్య‌ట‌న‌..

రాష్ట్ర పుర‌పాల‌క పట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి  బొత్స స‌త్య‌నారాయ‌ణ జూలై 5 నుంచి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. జిల్లా క‌లెక్ట‌ర్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం పుర‌పాల‌క మంత్రి 4వ తేదీ ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు విజ‌య‌న‌గ‌రంలోని త‌న నివాసానికి చేరుకుంటారు. 5న ఉద‌యం 11 గంట‌ల‌కు న‌గ‌రంలోని మునిసిప‌ల్ కార్పారేష‌న్ కార్యాల‌యం రెండు, మూడో అంత‌స్థుల‌ను ప్రారంభిస్తారు. మ‌ధ్యాహ్నం 3-00 గంట‌ల‌కు చీపురుప‌ల్లిలో మోడ‌ల్ డిగ్రీ క‌ళాశాల‌ను ప్రారంభిస్తారు. చీపురుప‌ల్లి మండ‌లం క‌ర్లాంలో సొసైటీ భ‌వ‌నానికి శంకుస్థాప‌న చేస్తారు. ఇదే గ్రామంలో ఇంటింటికీ తాగునీటి స‌ర‌ఫ‌రా చేసే ప‌థ‌కాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం విజ‌య‌న‌గ‌రం చేరుకుంటారు. 6న బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తారు. ఉద‌యం 10 గంట‌ల‌కు తెర్లాం మండ‌లం పెరుమాలిలో, 11 గంట‌ల‌కు బొబ్బిలి మండ‌లం పారాదిలో గ్రామ స‌చివాల‌య భ‌వ‌నాల‌ను ప్రారంభిస్తారు. కార్య‌క్ర‌మాల అనంత‌రం మ‌ధ్యాహ్నం విజ‌య‌న‌గ‌రం చేరుకుంటారు. 7,8 తేదీల్లో జిల్లాలో ఏర్పాట‌య్యే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Vizianagaram

2021-07-03 14:09:09

అప్పన్నకు చందనం సమర్పణ..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామికి శనివారం గాజువాకకు చెందిన కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, ఐశ్వర్య- అవినాష్ దంపతులు  రూ.10.116, కాకి గోవింద రెడ్డి చెరో అరకేజీ చందనం కోసం రూ.10.116  అరకేజీ చొప్పున చందనం సమర్పించారు. ట్రస్టు బోర్డు సభ్యుడు దినేష్ రాజు ఆధ్వర్యంలో చందనం సమర్పించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన చందనం సమర్పించే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. చందనం సమర్పించిన భక్తుల తరపున దినేష్ రాజుకి  చందనం ముక్కతోపాటు ఆలయ ఏఈఓ రాఘవ కుమార్  ప్రసాదాన్ని అందించారు.  ఈ కార్యక్రమంలో ట్రస్టుబోర్డు సభ్యుడు సూరిశెట్టి సూరిబాబు పాల్గొన్నారు.

Simhachalam

2021-07-03 13:12:16

అప్పన్న ఆలయంలో భద్రత కట్టుదిట్టం..

 విశాఖలోని  సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ (సింహాద్రి అప్పన్న)స్వామి వారి దేవస్థానంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా ఇక్కడ పనిచేసే గార్డుల వద్ద మొబైల్ -మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆలయంలోకి మొబైల్స్ పోన్స్ తీసుకెళ్లడం నిషేధించారు. వాటిని భద్రపరిచేందుకు ఆలయం వద్దే  కౌంటర్లు ఏర్పాటుచేశారు. అయినా కొంతమంది భక్తులు తెలియక మొబైల్స్ స్విచాఫ్ చేసి బ్యాగుల్లో వేసి తీసుకెళ్లడం దేవస్థానం ఈఓ సూర్యకళ స్వయంగా తెలుసుకున్నారు. దీంతో సెక్యూరిటీ గార్డులను డిటెక్టర్లు ఇచ్చి దేవస్థానం లోపల మొబైల్ నిషేధాన్ని తప్పకుండా అమలుచేయాలని ఆదేశించారు. శనివారం వీటి పరిశీలన మొదలైంది. ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ స్వయంగా వాటిని తనిఖీ చేశారు. మొబైల్స్ తో ఎవర్నీ లోపలకు వదలొద్దని భద్రతా సిబ్బందిని, క్యూలైన్ల దగ్గరున్న పోలీసులను ఆదేశించారు. 

Simhachalam

2021-07-03 13:00:32