విశాఖ లోని ప్రైవేటు ఆసుపత్రులలో పేషెంట్ల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయాడాన్ని అరికట్టాలని వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరములో కోవిడ్-19 నివారణ, జివియంసి, విఎంఆర్డిఎ ప్రాజెక్టులపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు వి. విజయ సాయి రెడ్డి, నగర మేయర్ జి. వెంకట హరి కుమారి, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, ప్రభుత్వ విప్ బూడిముత్యాల నాయుడు, జె.సి.లు, ఇతర అధికారులతో సుధీర్ఝంగా సమీక్షించారు. మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్యానికి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, అలాంటి ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. ఈ విషయమై నోడల్ అధికారులు స్ట్రాంగ్ గా ఉండాలన్నారు. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రుల వద్ద నుండి 70 లక్షల రూపాయలు వసూలు చేయడమైనదని, వాటిని ప్రభుత్వానికి జమ చేస్తామని జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు. ఆరోగ్య శ్రీ పథకంలో క్యాస్ లెస్ వైద్యం జరుగుతోందన్నారు. కెజిహెచ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలుపైన అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ మెటీరియల్ ఏ ఏ పి.హెచ్.సి. లకు కావాలో కనుక్కొని వారికి అందజేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ కు మరింత మెరుగ్గా వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కెజిహెచ్ లో నాన్ కోవిడ్ వైద్య సేవలు అందిస్తున్నారా లేదా అని సూపరింటెండెంట్ డా. మైథిలిని ఆయన అడుగగా నాన్ కోవిడ్ వైద్య సేవలు ఉన్నట్లు తెలిపారు. ఆసుపత్రులకు అవసరమైన ఎక్వీప్ మెంట్ ల కోసం ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. క్రిటికల్ కేర్ యూనిట్లు పై ఆసుపత్రుల సూపరింటెండెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ENT, CHEST, VIMS ఆసుపత్రులపైన సమీక్షించి విమ్స్ లో వైద్యులు ఎంత మంది వైద్యులు ఉన్నారని డైరక్టర్ ను అడుగగా వైద్యులందరూ డెప్యుటేషన్ పై పనిచేస్తున్నట్లు తెలిపారు. రాజ్య సభ సభ్యులు వి. విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ విమ్స్ ఆసుపత్రిలో వైద్యులు, కాంట్రాక్టు సిబ్బందిల పై జిల్లా కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఎంఎన్ఒ, తదితరులను శాశ్వతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడమైనదని, వైద్యులు డెప్యుటేషన్ పై పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ జిల్లాలో 74 నోటిఫై చేసిన ఆసుపత్రుల్లో కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యలు, ఆక్సిజన్ సరఫరా, నిల్వ, బ్లాక్ ఫంగస్ కు చేస్తున్న వైద్యం, వ్యాక్సినేషన్, తదితర విషయాలపైన, మొబైల్ టీంలు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ద్వారా చేస్తున్న పరీక్షలు, మందులు పై వివరించారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో జిల్లా కలెక్టర్, ఎఎంసి ప్రిన్సిపల్, కెజిహెచ్ సూపరింటెండెంట్ లకు ఏ సమయంలో ఫోన్ చేసినా రెస్పాండ్ అయి సమస్యను పరిష్కరించే వారని తెలిపారు.
జివిఎంసిలో ప్రస్తుతం నడుస్తున్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కన్నబాబు జివియంసి కమీషనర్ కు చెప్పారు. నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన పనులను వేగవంతం చేయాలన్నారు. రూ.552 కోట్లతో ప్రస్తుతం జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు, వాటర్ పైపు లైన్లు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. జివియంసి కమీషనర్ సృజన మాట్లాడుతూ అనకాపల్లి, గాజువాక, హనుమంతవాకలలో పైపులైన్ పనులు జరుగుతున్నాయని, కోర్టు సమస్య పూర్తి అయినందు వలన వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలియజేశారు. రోడ్డ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి చెప్పగా భూ గర్భ విద్యుత్ లైన్ పనులు వలన రోడ్డు పనులు జాప్యం జరుగుతుందని కమీషనర్ మంత్రికి వివరించారు. అవసరమైన పార్క్ లు, తదితర డిపిఆర్ లు అందజేస్తే గ్రాంట్లు కేటాయించనున్నట్లు రాజ్య సభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి చెప్పారు. సామాజిక భవనాలు, కమ్యూనిటి హాల్ లు, శ్మశానాలు, రైతు బజార్ లకు భూమి కేటాయించాలని కమీషనర్ కు తెలిపారు. నగర మేయర్ జి. వెంకట హరి కుమారి మాట్లాడుతూ ఆరిలోవలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని మంత్రి కన్నబాబును కోరగా జాయింట్ కలెక్టర్ భూమి కేటాయిస్తే నిధులు తక్షణమే విడుదల చేయనున్నట్లు మంత్రి చెప్పారు. వీధి లైట్లు, శానిటేషన్, తదితర అంశాలపై పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కమీషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
బీచ్ రోడ్ ను కలిపే విశాఖ వేలీ స్కూలు రహదారి, లా కాలేజి , ITSEZ పెద్ద ఋషికొండ రహదారి, 380 ఎకరాల కైలాసగిరి పై రీ స్టోరేషన్ అండ్ రీ డెవలప్ మెంట్ (వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ ప్రాజెక్టు), రాం నగర్ లో వాణిజ్య సముదాయం, బీచ్ రోడ్ లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం అండ్ టూరిజం కాంప్లెక్స్, కైలాసగిరిపై ప్లానెటోరియం, తదితర ప్రాజెక్టులపై ప్రస్తుతం చేపడుతున్న, చేపట్టబోయే ప్రాజెక్టులపైన విఎంఆర్డిఎ కమీషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ప్రాజెక్టులు నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని చెప్పారు. రాజ్య సభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కైలాసగిరి నుండి భోగాపురం వరకు 6 లైన్ల రహదారి విఎంఆర్డిఎకే వస్తుందని, ఇందుకు సంబంధించి ఒక డిపిఆర్ తయారు చేయాలని కమీషనర్ కు సూచించారు. ఎపిఇపిడిసిఎల్ సిఎండి నాగలక్ష్మి భూగర్భ విద్యుత్ లైన్ పురోగతిపై వివరించారు. నగరానికి సంబంధించిన ప్రాజెక్టులపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనులకు సంబంధించిన సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించుకునేందుకు అవకాశం ఉంటుందని, శాఖల మద్య సమన్వయం చేసుకొని ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి గావించాలన్నారు.
సమావేశానంతరం పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.వి. ప్రసాద్ మృతికి ఘనంగా నివాళులు అర్పించారు. సమావేశానికి ముందు కోవిడ్ తో మృతి చెందిన వారికి తమ సంతాపాన్ని తెలిపారు.
ఈ సమావేశంలో సమావేశంలో శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్, అదీప్ రాజ్, వాసుపల్లి గణేష్ కుమార్, ఉమాశంకర్ గణేష్, జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, జివియంసి కమీషనర్ సృజన, ఎపిఇపిడిసియల్ సిఎండి నాగలక్ష్మి, తదితర అధికారులు పాల్గొన్నారు.