1 ENS Live Breaking News

చివరి సాగుభూమి నీరందిస్తాం..

విజయనగరం  జిల్లాలోని  సాగుభూమి అంతటికీ నీరందేలా చర్యలు చేపట్టినట్టు  జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవాహర్ లాల్  తెలిపారు.   అందుకోసం నీటి పారుదల శాఖ ఒక ప్రణాళికను తయారు చేసిందని అన్నారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  జిల్లా ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు  ఆధ్వర్యం లో బుధవారం జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం వర్చువల్ విధానం లో  జరిగింది. ఈ సమావేశం లో జిల్లాకు చెందిన శాసన సభ్యులు, శాసన  మండలి సభ్యులు వర్చువల్ గా పాల్గొన్నారు. జిల్లా నీటి వనరుల వివరాలను, సాగు నీటి ప్రణాళికలను ఎస్.ఈ తొలుత వివరించారు.  ఈ సందర్భంగా   జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  జిల్లాలో  5,03,250 ఎకరాల ఆయకట్  కు  నీరందించవలసి ఉందని,  భారీ , మధ్య , చిన్న తరహా నీటి పారుదల వనరుల ద్వారా 35.75 టి.ఎం.సి ల నీటి నిల్వ  సామర్ధ్యం  ఉందని,  ప్రస్తుతం 8.272 టి.ఎం.సి ల నీరు నిల్వ ఉందని  తెలిపారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున  సాగు నీటికి ఇబ్బంది ఉందని భావిస్తున్నామన్నారు.   వర్షాలతో పాటు అన్ని జలాశయాలను, చప్టా లను, కల్వర్ట్  లను మరమ్మతులు చేసి  నీటి సామర్ధ్యాన్ని పెంచడానికి  తగిన ప్రణాళికలు తయారు చేశామన్నారు. 
బొబ్బిలి శాసన సభ్యులు శంబంగి వెంకట  చిన్న అప్పల నాయుడు  మాట్లాడుతూ ప్రొజెక్టులకు సంబంధించిన భూ సేకరణ  చెల్లింపులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే రైతులకు చెల్లించే ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ 14.80 కోట్ల కు గాను 10.80 కోట్ల బకాయిలు చెల్లించడం జరిగిందని, మిగిలిన మొత్తం కూడా సి.ఎఫ్.ఎం.ఎస్. లో బిల్ పెట్టడం జరిగిందన్నారు.  పార్వతిపురం శాసన సభ్యులు అలజంగి జోగా రావు మాట్లాడుతూ   నీటిని నెల రోజుల ముందుగానే విడుదల చేయాలని కోరారు. సాగు నీటి సామర్ధ్యాన్ని పెంచడానికి  మైనర్ ఇరిగేషన్ టాంక్ ల సామర్ధ్యాన్ని పెంచవలసి ఉందని కలెక్టర్ ను కోరారు. నీటి విడుదల కోసం ఆయా ప్రజా ప్రతినిధులతో చర్చించి,  తేదీలను ఖరారు చేస్తామని అన్నారు.  మైనర్ టాంక్ ల అభివృద్ధి కోసం  ఇప్పటికే 50 కోట్ల విలువ గల పనుల కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.   సాలూరు శాసన సభ్యులు రాజన్న దొర మాట్లాడుతూ పెద్ద గెడ్డ  పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.   
జంఝావతి రబ్బర్ డ్యామ్ అంతర్ రాష్ట్ర  సమస్యను  పరిష్కరించడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయి లో చర్చ జరగవలసి ఉందని, దీనిని ప్రభుత్వ దృష్టికి తేవడం జరిగిందని అన్నారు.  ఈ ప్రాజెక్టు  పనుల కోసం 3.8 కోట్ల తో అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.  ప్రపంచ బ్యాంక్  నిధులతో 20 పనులు మంజూరు కాగా 17 పనులు పురోగతి లో ఉన్నాయని తెలిపారు. ఈ ఖరీఫ్ కు ప్రతి ఏకరాకు సాగు నీరు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 
ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ లో  జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ పోలేశ్వర రావు, ,  బొబ్బిలి ఎస్.ఈ రాంబాబు, ఈ ఈ లు  అప్పల నాయుడు, రామచంద్ర రావు, తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.  

Vizianagaram

2021-06-02 12:47:09

వైద్య, ఆరోగ్యానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత..

రాష్ట్రంలో ప్రజలందరికీ అత్యాధునిక వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన చర్యలతో రాష్ట్రం ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’ గా మారుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సేవలకు సిఎం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్రంలో 95శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యాన్ని ఉచితంగా అందించడంతో పాటుగా వేల కోట్ల రుపాయల వ్యయంతో కొత్త మెడికల్ కాలేజీలు, హెల్త్ హబ్ లు, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు.
పార్వతీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక వైద్యశాలను బుధవారం ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు 104 కాల్ సెంటర్  ద్వారా అవసరమైన సహాయ సహకారాలను అందించడం జరుగుతోందని చెప్పారు. కోవిడ్ నియంత్రణ కోసం సిఎం చేపట్టిన చర్యలను కేంద్ర మంత్రులు కూడా ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు. రాష్ట్ర జనాభాలో 95శాతం మంది ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఉండగా వారికి అవసరమైన చికిత్సలన్నింటినీ పూర్తి ఉచితంగా అందించడానికి, కోవిడ్ ఆస్పత్రుల్లోనూ 50శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పథకానికి చెందిన రోగులకే కేటాయించడానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు. అధిక ఫీజులను గుంజుతున్న ఆస్పత్రులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కూడా కార్పొరేట్ వైద్యసేవలు అందించడం ద్వారా పేదలకు ఆరోగ్యభరోసాను కల్పించారని కితాబిచ్చారు. కరోనా తో పాటుగా బ్లాక్ ఫంగస్ వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి వాటికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని పేర్కొన్నారు. అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందించడంతో పాటుగా చికిత్సానంతరం రోగి విశ్రాంతికాలంలోనూ ఇబ్బంది పడకుండా నెలకు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని వైయస్సార్ ఆరోగ్య భరోసాగా అందిస్తున్నారని చెప్పారు. అత్యాధునికమైన వైద్య సేవలను పొందడానికి రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలలోని నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా 16 హెల్త్ హబ్ లను ఏర్పాటు చేయడానికి చర్యలను తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక వైద్య కళాశాల, 500 పడకల అత్యాధునిక ఆస్పత్రి ఉండేలా రూ.8 వేల కోట్ల వ్యయంతో ఒకేసారి 16 కొత్త మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన కూడా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి ప్రస్తావించారు. ఇప్పటికే ప్రతి మండలంలోనూ 108 ఆంబులెన్స్ వాహనాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేసారు. ఇది కాకుండా రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రజల ముంగిళ్లలోకే వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల ఫలితంగా రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మారుతోందని పుష్ప శ్రీవాణి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగారావుతో పాటుగా పార్వతీపురం మున్సిపల్ ఛేర్ పర్సన్ బోన గౌరీశ్వరి కూడా పాల్గొన్నారు.

Parvathipuram

2021-06-02 12:45:33

పంపిణీకి సిద్ధమైన పాఠ్యపుస్తకాలు..

విజయనగరం జిల్లాలోని అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థుల‌కు పంపిణీ చేసేందుకు పాఠ్య‌పుస్త‌కాలు సిద్ద‌మ‌య్యాయి. జిల్లాలో ఈ ఏడాది సుమారు  26ల‌క్షాల‌, 66వేల‌, 378 పుస్త‌కాలు అవ‌స‌ర‌మ‌ని అంచ‌నా. కాగా వీటిలో మొద‌టి విడ‌త‌గా 5ల‌క్ష‌ల‌, ఒక వెయ్యి, 471 పుస్త‌కాలు వ‌చ్చాయి. వీటిని ఆయా ప్రాంతాల్లోని గోదాముల్లో భ‌ద్ర‌ప‌రిచారు. ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా విద్యార్థుల‌కు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగ‌మ‌ణి తెలిపారు. కరోనా కేసుల ద్రుష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకొని విద్యార్ధులందరికీ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు డిఈఓ తెలియజేశారు.

Vizianagaram

2021-06-02 12:43:56

జగనన్న గోరుముద్ది విద్యార్ధులకు రక్ష..

జ‌గ‌న‌న్న గోరుముద్ద ప‌థ‌కం క్రింద విద్యార్థుల‌కు డ్రై రేష‌న్ స‌రుకుల‌ను, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ పంపిణీ చేశారు. క‌లెక్ట‌రేట్‌లో బుధ‌వారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప్రాధ‌మిక పాఠ‌శాల విద్యార్థుల‌కు 4.5 కిలోలు, ప్రాధ‌మిక‌, ప్రాధ‌మికోన్న‌త పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు 6.5 కిలోలు చొప్పున కందిప‌ప్పును అంద‌జేశారు.  ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, జ‌గ‌న‌న్న గోరుముద్ద ప‌థ‌కం క్రింద‌ ప్ర‌భుత్వం పౌష్టికాహారం అంద‌జేయ‌డ జ‌రుగుతోంద‌న్నారు. క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో, పాఠ‌శాల‌లు మూసివేయ‌డం వ‌ల్ల‌, విద్యార్థుల‌కు ప్ర‌స్తుతం డ్రైరేష‌న్ స‌రుకుల‌ను పంపిణీ చేస్తున్నామ‌న్నారు. సెప్టెంబ‌రు 2020 నుంచి జ‌న‌వ‌రి 2021 వ‌ర‌కూ, ఐదు విడ‌త‌ల రేష‌న్ స‌రుకుల‌ను ప్ర‌స్తుతం అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు. జిల్లాలో  మొత్తం 1,95,187 మంది విద్యార్థుల‌కు కందిప‌ప్పును త్వ‌ర‌లోనే పూర్తిగా పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. ఇవి కాకుండా బియ్యం, గుడ్లు, చిక్కీల‌ను కూడా ఇప్ప‌టికే జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.  ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగ‌మ‌ణి, ఏడి జ్యోతి, ఇత‌ర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-02 12:41:11

రేపు కోవిడ్ వేక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్..

విశాఖ జిల్లాలో బుధవారం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. ఉదయం 7 గంటల నుండి జిల్లా వ్యాప్తంగా 35 పి.హెచ్.సి.కేంద్రాలలో కోవాక్సిన్, కొవిషీల్డ్  వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందన్నారు. 25 కేంద్రాలలో కోవ్యాక్సిన్, 10 కేంద్రాలలో కొవిషీల్డ్   45 సంవత్సరాలు దాటిన వారికి వేస్తారని తెలిపారు.  గ్రామ సచివాలయ సెక్రటరీలు, వాలంటీర్లు వారి పరిధిలో ఉన్న అర్హులైన వారందరికీ వ్యాక్సిన్లు వేయించాలని ఆదేశించడం జరిగింది అన్నారు. మిగతా గ్రామీణ పిహెచ్ సిలు, గిరిజన ప్రాంతంలోని పి. హెచ్ సిలలో లభ్యత బట్టి వాక్సినేషన్ జరుగుతుందని. 45 సం. లు  దాటిన వారికి మాత్రమే వాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. కోవాక్సిన్ మొదటి రెండవ డోసులు కూడా వేస్తున్నారని పేర్కొన్న కలెక్టర్  కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు మాత్రమే వేస్తారని చెప్పారు.  జిల్లాలో ఇంకా  వ్యాక్సిన్ వేయించుకోని వారు   ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

విశాఖ రూరల్

2021-06-01 16:28:33

జగనన్న ఇళ్లకు ఇసుక కొరత రాకూడదు..

అనంతపురం జిల్లాలో జూన్ 3 నుంచి ప్రారంభం కానున్న జగనన్న ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గుంతకల్లు పట్టణంలో నిర్మించనున్న అర్బన్ లే ఔట్ ను సందర్శించారు.  ఈనెల3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించనున్న సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ గుంతకల్లుకు రానున్నారు. ఈ నేపథ్యంలో అర్బన్ లే ఔట్ వద్ద నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించారు. 
లేఅవుట్ వద్ద మీడియా ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 2,23,000 మంది జగనన్న ఇళ్ల పట్టాలు పొందారని, వాటిలో 1,11,000 మంది ఇళ్ల నిర్మాణాలను పేజ్-1 లో చేపట్టనున్నామన్నారు. జూన్ 3న జిల్లాలో 8,000 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తామన్నారు. గుంతకల్లు ఆర్బన్ లే అవుట్ లో 143 ఇళ్లకు పునాది వేయనున్నామని తెలిపారు. 
ఆరు నెలల్లోగా ఫేజ్-1 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పేజ్-1లో చేపట్టనున్న లక్షకు పైగా నిర్మాణాలకు కావాల్సిన ఇసుక, సిమెంట్, ఇతర సామగ్రి గురించి అంచనాలు సిద్ధం చేశామన్నారు. ఆ మేరకు సామాగ్రి కొరత రాకుండా చూసేందుకు ప్రణాళిక  చేపట్టడం జరిగిందని  తెలిపారు.
సొంతంగా ఇళ్లు నిర్మించుకునే వారికి 20 టన్నుల ఇసుక  శ్రీకారం చుడుతున్నారని్పు వరకూ నిర్మాణం సమయంలో 5 టన్నులు, ఇంటి ఫినిషింగ్ పనులకు మరో 5 టన్నులు ఇవ్వడం జరుగుతుందన్నారు. 
అన్ని వసతులతో సర్వాంగ సుందరంగా జిల్లా వ్యాప్తంగా 1045 జగనన్న కాలనీలను ఏర్పాటు  శ్రీకారం చుడుతున్న మని తెలిపారు ఇప్పటికే నీటి వసతి కోసం బోర్లు వేయించామని, విశాల మైన రోడ్లు, పచ్చదనం మొక్కలు, ఆట స్థలం వంటి వసతులతో పాటు రెండు వేల పైన జనాభా లే ఔట్లలో ఉంటే పాఠశాలలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను కూడా మంజూరు చేయనున్నామన్నారు.
నూతన ఇసుక విధానం ద్వారా జిల్లాలో జేపీ గ్రూప్ ద్వారా ఇసుక తవ్వకాలు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ఉన్న 18 ఇసుక రీచులకు అదనంగా రీచులకు అనుమతుల కోసం పర్యావరణ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపామని, ఇసుక కొరత రానివ్వమని అన్నారు. 
రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం కోసం 53,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయనుందని, ఆ రకంగా కరోనా కష్టకాలంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం కానుందన్నారు.

ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్లు సిరి. నిశాంత్ కుమార్., ట్రైనింగ్ కలెక్టర్ సూర్య తేజ, ఆర్డీవో   గుణ భూషణ రెడ్డి. గుంతకల్ మున్సిపల్ కమిషనర్  బండి శేషన్న, హౌసింగ్ పీడీ చంద్రమౌళి ఈశ్వర్ రెడ్డి విద్యుత్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ వర కుమార్ ఆర్డబ్ల్యూఎస్, ఎమ్మార్వో రాము, మున్సిపల్ శాఖ ఇంజనీర్లు విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు.,.

Guntakal

2021-06-01 16:23:39

2021-06-01 16:19:21

జూన్ 10 వరకూ జిల్లాలో కర్ఫ్యూ..

కోవిడ్‌-19 విప‌త్తు నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల మేర‌కు జిల్లాలో ప్ర‌స్తుతం ప్ర‌తిరోజూ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ఉద‌యం ఆరు గంట‌ల వ‌ర‌కు అమ‌ల‌వుతున్న క‌ర్ఫ్యూను జూన్ 10 వ‌ర‌కు కొన‌సాగించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. ఈ మేర‌కు మంగ‌ళవారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. జిల్లా వ్యాప్తంగా క‌ద‌లిక‌ల‌కు అనుమ‌తించిన స‌మ‌యంలోనూ 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంటుంద‌ని, అయిదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.  ఆసుప‌త్రులు, డ‌యాగ్నోస్టిక్ ల్యాబ్‌ల‌కు, ఫార్మ‌సీలతో పాటు అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల పంపిణీతో ముడిప‌డిన వాటికి క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపు ఉంటుంద‌ని తెలిపారు. కోవిడ్ వైర‌స్ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లుచేయాల‌ని క‌లెక్ట‌ర్ అధికారుల‌ను ఆదేశించారు.

Kakinada

2021-06-01 16:14:17

కోవాగ్జిన్ టీకా కోసం ప్రత్యేక ఏర్పాటు..

కోవాగ్జిన్ రెండవ డోసు టీకా వేయించుకునేందుకు యిపుడు ఆన్ లైన్ ల్లో  బుక్ చేసుకునే సదుపాయం ఉందని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి  ఒక ప్రకటన లో తెలియజేశారు. రాజమండ్రి, కాకినాడ అర్బన్ లో ఆన్ లైన్లో   https://selfregistration.cowin.gov.in/ లింక్ లో నమోదు చేసుకుని స్లాట్ ప్రాకారం నేరుగా వేక్సినేషన్ కేంద్రానికి  వెళ్లి టీకా వేయించు కోవచ్చునని తెలియజేశారు. ఇది సెకండ్ డోస్ టీకా లకు మాత్రమే ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. తొలిడోసు కోవాగ్జిన్ వేసుకున్నవారు రెండవ డోసు వేసుకోవడానికి ఎక్కడికీ వెళ్లలకుండానే ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని నేరుగా ఆన్ లైన్ లో తెలిపిన కేంద్రాలకు వెళ్లి వేక్సిన్ వేయించుకోవచ్చునని కలెక్టర్ ఆ ప్రకటనలో సూచించారు.

Kakinada

2021-06-01 16:11:31

కరోనా కట్టడికి అంతా కలిసిరావాలి..

కోవిడ్ మ‌హ‌మ్మారిని పూర్తి స్థాయిలో అరిక‌ట్ట‌డానికి జిల్లాలోని స్వ‌చ్ఛంద సంస్థ‌లన్నీ క‌లిసి రావాల‌ని.. అధికార‌ యంత్రాంగంతో సమ‌న్వ‌యంగా వ్య‌వ‌హ‌రించి స‌హాయ స‌హాకారాలు అందించాల‌ని జెసి మహేష్ కుమార్ పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్ర‌స్తుతం క‌రోనా నియంత్ర‌ణ ద‌శ‌లో ఉంద‌ని... దాన్ని పూర్తిగా క‌ట్టడి చేసేందుకు స్వ‌చ్ఛంద సంస్థ‌ల సేవ‌ల‌ను విస్తృతి చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన సుమారు 400 ఐసోలేష‌న్ కేంద్రాల్లో అవ‌స‌ర‌మైన మేర‌కు సేవ‌లందించాల‌ని కోరారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జిల్లా యూత్ కో-ఆర్డినేట‌ర్ విక్ర‌మాధిత్య ఆధ్వ‌ర్యంలో జిల్లాలోని స్వ‌చ్ఛంద సంస్థ‌ల నిర్వాహ‌కులు, స‌భ్యుల‌తో మంగ‌ళ‌వారం జరిగిన స‌మావేశంలో జేసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క‌రోనా క‌ట్ట‌డికి అనుస‌రించాల్సిన ప‌ద్ధ‌తులు, అమ‌లు చేయాల్సిన విధానాల‌పై మాట్లాడారు. క్షేత్ర‌స్థాయిలో క‌రోనా రోగుల‌ను గుర్తించి వారిని ఐసోలేష‌న్ కేంద్రాల‌కు త‌ర‌లించ‌టంలో స్వ‌చ్ఛంద సంస్థ‌ల సభ్యులు కీల‌క‌పాత్ర పోషించాల‌ని సూచించారు. వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని ఐసోలేష‌న్ కేంద్రాల‌కు, ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉన్నవారిని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌టంలో స‌హాయ‌ప‌డాల‌ని కోరారు. మండ‌ల స్థాయిలో నియ‌మించే నోడ‌ల్ అధికారుల‌తో సమ‌న్వ‌యంగా వ్య‌వ‌హరిస్తూ ఫ‌ల‌వంత‌మైన సేవ‌లందించాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం జిల్లాలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని కానీ గ్రామాల్లో అవ‌గాహ‌న లేక ప్ర‌జ‌లు బ‌య‌ట తిరిగేస్తున్నార‌ని.. ల‌క్ష‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ టెస్టులు చేయించుకోకుండా, జాగ్ర‌త్త‌లు వ‌హించ‌కుండా సంచ‌రిస్తున్నార‌ని పేర్కొన్నారు. అలాంటి వారిలో అవ‌గాహ‌న క‌ల్పించి క‌రోనాను నియంత్రించ‌టంలో స్వ‌చ్ఛంద సంస్థ‌లు భాగ‌స్వామ్య‌మ‌వ్వాల‌ని జేసీ ఈ సంద‌ర్భంగా సూచించారు. ఈ క్ర‌మంలో ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌ల నిర్వాహ‌కుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించారు. కార్యక్ర‌మంలో జిల్లా యూత్ కో-ఆర్డినేట‌ర్ విక్ర‌మాధిత్య‌, జిల్లా ప‌రిష‌త్ సీఈవో వెంకటేశ్వ‌ర‌రావు, జిల్లాలోని ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌ల నిర్వాహ‌కులు, స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-06-01 14:43:51

పించను పంపిణీలో విజయనగరం జిల్లా నెంబర్ 1..

వైఎస్సార్ పింఛన్ కానుక పథకం కింద, పేదలకు పింఛన్లు పంపిణీ చేయడంలో విజయనగరం జిల్లా మరోమారు తన రికార్డును నిలబెట్టుకుంది. ఈ నెల కూడా, తొలిరోజే సాయంత్రం 6 గంటల సమయానికి సుమారు 92.34 శాతం మందికి పింఛన్లు అందజేసి, రాష్ట్రంలో నెంబర్ 1 గా నిలిచింది. ఈ నెలకు గానూ 3,33,476 మందికి పింఛన్లు మంజూరు చేయగా, మొదటి రోజు మంగళవారం నాడే ఏకంగా, 3,07,941 మందికి పింఛన్ అందజేశారు. మన జిల్లా తరువాత స్థానంలో చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలు నిలిచాయి.  జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటలకే పింఛన్ పంపిణీ ప్రారంభమయ్యింది. వలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేశారు. అనారోగ్యంతో ఉన్నవారికి కూడా పింఛన్ ఇచ్చారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్డీఏ పిడి కె.సుబ్బారావు పర్యవేక్షించారు. వివిధ మండలాల్లో ప్రత్యేకాధికారులు, ఎంపిడివోలు పింఛన్ పంపిణీని పరిశీలించారు.

Vizianagaram

2021-06-01 14:29:42

రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకూడదు..

గుంటూరు జిల్లాలో వ్యవసాయ, సాగు నీటి పారుదల వంటి అంశాలలో రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిగూడెం నుండి వర్చువల్ విధానంలో జూమ్ యాప్ ద్వారా జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధ్యక్షతన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి, జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో సలహా మండలి చైర్ పర్సన్ నల్లమోతు శివరామకృష్ణ, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, నరసరావుపేట శాసన సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, మాచర్ల శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరి శంకర రావు, పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్యలు పాల్గొన్నారు. కలక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్,  సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవిన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్, వ్యవసాయ శాఖ సంయక్త సంచాలకులు విజయ భారతి, నాగార్జున సాగర్ కుడి కాలువ చీఫ్ ఇంజనీర్ గంగరాజు, నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ బాబురావు సమావేశానికి హాజరైనారు.  వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ మొక్కజొన్న పంటను కారుమంచి కొనుగోలు కేంద్రంలో ఒక్కో రైతు నుండి 25 క్వింటళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు.  అంతకంటే ఎక్కువ పండించిన పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలనే రైతుల విన్నపాన్ని పరిశీలించాలని కోరారు.  శనగ పంటను కూడా కొనుగోలు కేంద్రంలో ఇంకొన్ని రోజుల పాటు కొనసాగించాలని సూచించారు.  జింక్, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను రైతులకు రాయితీ పై అందించాలని విజ్తప్తి చేశారు.          నరసారావుపేట శాసన సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రొంపిచర్ల మండలంలోని కొన్ని భూములు వెబ్ లాండ్ లో తమ పేర్లు నమోదు కాలేదని రైతులు తెలిపారన్నారు. రైతుల వద్ద   ఎటువంటి పత్రాలు లేనందు వలన ఈ – పంట  పోర్టల్ లో రైతుల పేర్లు నమోదు కావడం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరారు.


 

          పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరి శంకర రావు మాట్లాడుతూ  జిల్లాలో ఆర్మర్ రకం మిరప విత్తనాలకు ఎక్కువ డిమాండ్ రైతుల నుండి వస్తున్నదన్నారు. జిల్లాకు ఆర్మర్  రకాన్ని తెప్పించి ఆర్ బి కె కేంద్రాల ద్వారా రైతులకు సరఫరా అయ్యేలా చూడాలని కోరారు.సలహా మండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు అధిక దిగుబడులను ఇస్తున్న  ఇతర మిరప పంట రకాలను ఎంచుకునేటట్లు ఆర్బికె ల ద్వారా ఆవగాహన కల్పించాలన్నారు.


          సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రాధాన్యం లేని వరి కొనుగోలుకు ఎంఎల్ఆర్ -145, ఎంటియు -1010, ఎంటియు – 1001 వంటి రకాలను రైతులు సాగు చేయకుండా చూడాలన్నారు.  అధిక దిగుబడులను ఇచ్చే ఇతర వరి రకాలను సాగు చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు, మండల మరియు ఆర్బికే  స్థాయి సలహా మండలి సభ్యులు రైతులను చైతన్య పరచాలని సూచించారు. 


           సాగునీటి అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చర్చించారు. ఈ సమావేశంలో శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా నీటి పారుదల శాఖలోని అభివృద్ది పనులు, రాబోయే ఖరీఫ్ పంటకు నీటి విడుదల మరియు ఇతర విషయాలపై చర్చించడం జరిగింది.  గోదావరి లోని నీటి లభ్యతను బట్టి కృష్ణా పశ్చిమ డెల్టా రైతులకు జూలై 1 వ తేదీన మరియు నాగార్జున సాగర్ ప్రాజెక్టు లోని నీటి నిల్వ సామర్ధ్యాన్ని బట్టి నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు ఆగష్టు 15 వ తేదీన నీటిని విడుదల చేయుటకు తీర్మానించడమైనది. కృష్ణా పశ్చిమ డెల్టాలోని నాన్ నోటిఫైడ్ డ్రైయిన్ల మరమ్మత్తులను   ఏం జి ఎన్ ఆర్ ఇ జి ఎస్ ద్వారా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయవాల్సిందిగా నీటి యాజమాన్య సంస్థ  అధికారులను సభ్యులు కోరడం జరిగింది.  కాలువలు మరియు డ్రైయిన్ల లో వార్షిక మరమ్మత్తులు జూన్ 15 వ తేదీ లోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెలాఖరు నాటికి పనులను పూర్తి చేసి ఖరీఫ్ పంట నీటి విడుదలకు ఆటంకం లేకుండా చూడవలసిందిగా ఇరిగేషన్ అధికారులను కోరడం జరిగింది.  డ్రైయిన్ల అభివృద్ది కొరకు నాబార్డ్ పధకం క్రింద రూ. 465 కోట్లతో పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం వారి ఆమోదం పొందే విధంగా తగు చర్యలు తీసుకోవలసిందిగా ఇరిగేషన్ అధికారులను సమావేశంలో కోరడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు లోని వివిధ కాలువలకు సంబంధించిన వార్షిక మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేసి కాలువలను నీటి విడుదలకు సిద్దంగా వుంచ వలసిందిగా సమావేశంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులను కోరడం జరిగింది. 


          కార్యక్రమంలో జిల్లా స్థాయి సలహా మండలి సభ్యులు శ్రీనివాస రెడ్డి, అనుబంధ రంగాల అధికారులు తదితరులు వర్చువల్ విధానం ద్వారా జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.  

Guntur

2021-06-01 14:27:33

సింహగిరిపై ఈఓ సూర్యకళ సాహసం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో ఈఓ ఆమె..చిటికేస్తే అధికారులు ఉరుకులు పరుగులపై వెళ్లి పనులు చేస్తారు..కానీ అవేమీ ఆ అధికారిణికి ఇష్టం వుండవు..తానే స్వయంగా వెళ్లి నిర్ధారిస్తే తప్పా చర్యలకు ఉపక్రమించరు..దానికోసం ఎలాంటి ప్రదేశాలనైనా నేరుగా సందర్శిస్తారు..అందులో భాగంగానే మంగళవారం ఈఓ సూర్యకళ సింహగిరిపై ఔరా అనేలా సాహసం చేశారు. మెట్ల మార్గంలోని ఆకాశధార, చాకిధార, హనుమంతధార, చక్రధార, శంకధార, పిచ్చుక ధార, వేగవతి ధారలను పరిశీలించారు. ఆ సమయంలో సుమారు 30 అడుగులకు పైనే వున్న ట్యాంకు నిచ్చెనను అలవోక గా ఎక్కి మరీ అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. భక్తులు ఇచ్చిన ఫిర్యాదులపై ఈఓ చేసిన సుడిగాలి తనిఖీలు అధికారులకు మెచ్చెటలు పట్టించాయి.. చక చకా కొండగుట్టలు ఎక్కేస్తూ..వాయు వేగంతో చేసిన పర్యటనలతో సిబ్బంది కంగారు పడ్డారు. అన్ని ప్రాంతాల్లోని సమస్యలను నిశితంగా పరిశీలించి అధికారులను సత్వరమే వాటి పరిష్కరించాలని ఆదేశించారు అంతేకాకుండా సహజసిద్దంగా వస్తున్న నీటిలో ఎన్నో ఔషద గుణాలు దాగి వున్నాయని అలాంటి మంచినీటిని వ్రుధా కాకుండా ఒడిసి పట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈరోజు ఎండలు చాలా అధికంగా ఉన్నప్పటికీ లెక్కచేయకుండా సింహాచలం దేవస్థానంలోని అన్ని ప్రధాన ప్రాంతాలను, మెట్లమార్గాన్ని తనిఖీలు చేశారు. ఒక మహిళా అధికారిణి చేసిన ఈ పర్యటన ఒక్కసారిగా సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది..

Simhachalam

2021-06-01 13:44:27

ప్రభుత్వ కట్టడాలు, ఇళ్లు వేగవంతం కావాలి..

ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు, పేదలందరికీ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతం చేసేలా సంబంధిత శాఖల జిల్లా అధికారులు డివిజన్, మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్వివేక్యాదవ్అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కాంప్ కార్యాలయం నుండి ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు, పేదలందరికీ ఇళ్ళ పథకం, ఖరీఫ్వ్యవసాయ పనులపై జిల్లా కలెక్టర్వివేక్యాదవ్, సంయుక్తకలెక్టర్‌ (రైతుభరోసా, రెవెన్యూ) ఎఎస్దినేష్కుమార్, సంయుక్త కలెక్టర్‌ (సచివాలయాలు, అభివృద్ధి)                        పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం)తో కలిసి సబ్కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్అధికారులు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో జూమ్కాన్ఫరెన్స్ద్వారా  సమీక్ష నిర్వహించారు. సంర్భంగా జిల్లా కలెక్టర్వివేక్యాదవ్మాట్లాడుతూ  ప్రభుత్వ భవనాలకు ఇప్పటికే స్థలాలు కేటాయించిన గ్రామాలలో వెంటనే స్థలాలు సేకరించి సంబంధిత శాఖలకు అందించాలన్నారు. పట్టణ ప్రాంతాలలో అంగన్వాడీ కేంద్రాల భవనాలు నిర్మాణంకు అవసరమైన స్థలాలు సేకరించేలా కమిషనర్లు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారురైతుభరోసా కేంద్రాలు, సచివాలయాల, భవనాల నిర్మాణ పనులు నాణ్యతతో రాజీ పడకుండా వేగంగా చేపట్టాలన్నారు. పట్టణ ప్రాంతాలలో స్థలాలు కేటాయించిన అర్బన్హెల్త్క్లినిక్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా రానున్న వారం రోజుల్లో జిల్లాలో 10 వేల ఇళ్ళ నిర్మాణం ప్రారంభించాలని లక్ష్యం నిర్దేశించినందున, దానికి అనుగుణంగా లే అవుట్లు వారీగా ఇళ్ళ నిర్మాణంకు లబ్ధిదారులను సిద్దం చేయాలన్నారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్,  జియోట్యాగింగ్పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ రఖాస్తులను వెంటనే పరిష్కారించాన్నారు. అర్హత ఉన్న వారికి అనుగుణంగా స్థలాల సేకరణపై ప్రతిపాదనలు అందించాలన్నారు. ఖరీఫ్పంటల సాగు కు అనుగుణంగా రైతుభరోసా కేంద్రాలలో విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. నాసిరక విత్తనాలు అమ్మకాలు జరగకుండా మండల స్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక టీంల ద్వారా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులు పురోగతి స్పష్టంగా కన్పించేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన సూచనలు అందించాలన్నారు.

 

          సంయుక్త కలెక్టరు (రైతుభరోసా, రెవెన్యూ) ఎఎస్దినేష్కుమార్మాట్లాడుతూ ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను సబ్కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్అధికారులు పర్యవేక్షించాలన్నారు. బల్క్మిల్క్చిల్లింగ్యూనిట్లు, ఆటో మిల్క్కలెక్షన్సెంటర్ల నిర్మాణానికి, మల్టీపర్పస్కేంద్రాల నిర్మాణానికి వెంటనే స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాందున కౌలు రైతులందరికీ సీసీఆర్సీ కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

          సంయుక్త కలెక్టరు(సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్ళ పథకం లబ్ధిదారులు రిజిస్ట్రేషన్, జియోట్యాగింగ్వెంటనే పూర్తి చేయాలన్నారు. రానున్న వారం రోజుల్లో జిల్లాలో 10,000 ఇళ్ళ నిర్మాణంకు లే అవుట్లు వారీగా నిర్దేశించిన విధంగా ఇళ్ళ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Guntur

2021-06-01 13:20:23