1 ENS Live Breaking News

నర్సుల సేవలు సమాజానికి అవసరం..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్స్ ల సేవలతోనే కోవిడ్ రోగులకు పునర్జన్మ కలుగుతోందని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. బుధవారం విశాఖని విమ్స్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంజిలిన్ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవలు అందిస్తున్నారని అన్నారు. సమాజానికి నర్సులు సేవలు ఎంతో అవసరని అన్నారు.  స్టాఫ్ నర్సులు,నర్సింగ్ సిబ్బందికి మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. కేకు కట్ చేసి మేయర్ స్వయంగా స్టాఫ్ నర్స్ లకు తినిపించారు. ఉత్తమ సేవలు అందిచిన నర్సులు కు ఘనంగా సన్మానం చేశారు.  విమ్స్  డైరెక్టర్ డా రాంబాబు మాట్లాడుతూ  నర్సుల దినోత్సవ విశిష్టత ను వివరించారు. కరోనా ప్రారంభం నుంచి నర్సులు అందిస్తున్న సేవలు అద్భుతమని వారిని గౌరవించాలని మేయర్ రావటం సత్కరించటం స్ఫూర్తి దాయకం అన్నారు. మేయర్ చేసిన ఈ సన్మాన కార్యక్రమం ద్వారా అనేక నెలలుగా నిస్సత్తువ తో వున్న నర్సింగ్ సిబ్బందికి నూతన ఉత్తేజం కలిగిందన్నారు. ఈ సందర్భంగా మేయర్  ఆలోచనలు కు, ఆమె అభిమానానికి  వైద్యులు, నర్సులు అభినందనలు కురిపించారు.  ఈ కార్యక్రమములో గొల గాని శ్రీనివాస్,అధిక సంఖ్యలో వైద్య సిబ్బంది నర్సులు పాల్గొన్నారు.

VIMS Hospital

2021-05-12 15:37:45

జిల్లాలో టీకా వేసే పీహెచ్సీలు ఇవే..

విశాఖజిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ గుర్తించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే కోవిడ్ వేక్సిన్ 2వ డోసు వేస్తున్నట్టు డీఎంహెచ్ఓ డా.పతివాడ సత్యసూర్యనారాయణ తెలియజేశారు. కోవీషీల్డ్ రెండవ డోసు అందుబాటులో ఉండే పీహెచ్సీ/సామాజిక ఆరోగ్య కేంద్రాలు వివరాలను ఆయన తెలియజేశారు. అనందపురం, అనంతగిరి, అచ్చుతపురం,బుచ్చయ్యపేట,చీడికడ, చింతపల్లి, చౌడువాడ, జి.మాడుగుల, గోలుగొండ, గూడెంకొత్తవీధి, కెజె పురం, మాకవరపాలెం, మునగపాక, నాతవరం, పాయకరావుపేట, పేదబయలు,ఆర్.తల్లవలస,రాంబిల్లి,రావికమతం రేవిడి, సబ్బవరం, వేములపూడి,అరకు,దేవరపల్లి, డుంబ్రిగుడా,గవరవరం, గొడిచెర్ల, కశింకోట,క్రిష్ణదేవిపేట,కేవిపురం,ముంచింగ్ఫుట్,హుకుంపేట, పెనుగోళ్ళు,పాడేరు,రావికమతం పీహెచ్సీల పరిధిలోని ప్రజలు రెండవ డోసు కోసం పై పీహెచ్సీలను సంప్రదించాలన్నారు.

విశాఖ రూరల్

2021-05-12 15:36:00

42 రోజులు దాటిన వారికే రెండో డోసు..

కోవిషీల్డ్ మొదటి డోసు వేసుకొని 42 రోజులు దాటిన వారికి మాత్రమే రెండోడోసు వేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిబంధనలు ప్రకారం, కోవిషీల్డ్ మొదటి డోసు వేసిన ఆరు వారాలు లోపు వేక్సిన్ వేయడం జరగదని స్పష్టం చేశారు. అందువల్ల మొదటి డోసు వేసుకొని 42 రోజులు పూర్తి అయినవారు మాత్రమే గురువారం నుంచి వేక్సిన్ కేంద్రానికి వెళ్లాలని సూచించారు. వేక్సిన్ వేయాల్సిన వారికి ముందుగానే ఏఎన్ఎం ద్వారా సమాచారం అందుతుందని, ఒకవేళ సమాచారం రానప్పటికీ, 42 రోజులు పూర్తి అయినవారు, తమ ఆధార్ కార్డు తీసుకొని వెళ్లి వేక్సిన్ వేయించుకోవచ్చని తెలిపారు. ఇంతకుముందు మొదటి డోసు వేసుకున్న కేంద్రాలకు అనుబంధంగా, వాటికి సమీపంలోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలలో వేక్సిన్ వేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి కోవెగ్జిన్ స్టాకు లేదని, వచ్చిన తరువాత, ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేసిన ఆయా వేక్సిన్ కేంద్రాలలో 28 రోజులు దాటినవారికి రెండో డోసు వేయడం జరుగుతుందని ఒక ప్రకటన ద్వారా జేసీ తెలిపారు.

Vizianagaram

2021-05-12 15:34:49

జీవిఎంసీ పరిధిలో టీకా వేసే పీహెచ్సీలివే..

మహావిశాఖ నగర పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ గుర్తించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే కోవిడ్ వేక్సిన్ 2వ డోసు వేస్తున్నట్టు డీఎంహెచ్ఓ డా.పతివాడ సత్యసూర్యనారాయణ తెలియజేశారు. అల్లిపురం,బుచ్చిరాజుపాలెం, వన్ టౌన్,రామమూర్తి పంతులు పేట,సాగర్ నగర్,తగరపువలస,విద్యుత్ నగర్, గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ద్రోణంరాజు కళ్యాణమండపం,డ్రైవర్స్ కాలనీ),మధురవాడ,.పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం.అనకాపల్లి..చినవాల్తేరు, స్వర్ణభారతి,అరిలోవ,శ్రీహరిపురం, పెందుర్తి పీహెచ్సీల పరిధిలోని ప్రజలు కేవలం టోకెన్లు పొందిన లేదా మెసేజ్ వచ్చిన వారు రెండవ వేక్సిన్ వేయించుకోవడానికి మాత్రమే రావాలని ఆయన కోరారు.

Visakhapatnam

2021-05-12 15:32:39

ఆక్సిజన్ ప్లాంట్ పనులు వేగవంతం..

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు.  సర్వజన ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. నాగార్జున అగ్రికమ్ సౌజన్యంతో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఎన్. ఏ.సి.ఎల్ లో ప్రస్తుతం ఉన్న ప్లాంటుకు ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా రూ.25 లక్షల ఖర్చుతో ఎన్. ఏ.సి.ఎల్ మార్పులు చేసింది. ఆ యూనిట్ ని సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిజిహెచ్ లో ప్లాంటు నిర్మాణ పనులను జాతీయ రహదారుల సంస్థకు అప్పగించారు. జిజిహెచ్ లో ప్లాంటుకు విద్యుద్దీకరణ, పైపులు అమర్చే పనులు జరుగుతున్నాయి. డ్యూయల్ లైట్ అనే అనుసంధాన (అబ్జార్వెంట్) పరికరం టాటా కెమికల్స్ నుండి తెప్పిస్తున్నారు. ఈ ప్లాంటు ద్వారా గంటకు 40 వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఆక్సిజన్ ప్లాంట్ త్వరిత గతిన నిర్మాణం చేపట్టే దిశగా కాంట్రాక్టర్ కి  సలహాలు సూచనలు ఇవ్వాలని ఎన్. ఏ.సి.ఎల్ ఉపాధ్యక్షులు సి.వి.రాజులును కోరారు. ఈ సందర్భంగా జిజిహెచ్ లో నావల్ డాక్ యార్డు ఆధ్వర్యంలో అమర్చిన పైపు లైన్లను,  ఆక్సిజన్ సరఫరా తీరును పనితీరును కలెక్టర్ నివాస్ పరిశీలించారు. ఆక్సిజన్ ప్లాంట్ సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సిబ్బందికి  సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు  సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, ఏపిఈడబ్ల్యూఐసి ఇఇ కె.భాస్కరరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సి.హెచ్.కృపావరం, సహాయ డిఎఫ్ఓ శ్రీను బాబు, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.ఏ.కృష్ణ మూర్తి, ఏపిఎంఐడీసీ డిఇ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-12 15:31:17

కరోనాలో నర్సులే అసలైన కుటుంబ సభ్యులు..

కరోనా సమయంలో నర్సులే రోగులందరికీ కుటుంబ సభ్యులై ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారని జివిఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని బుధవారం  11వ వార్డు ఆరిలోవలోని ఎఫ్.ఆర్.యు. ఆసుపత్రి నర్సులు, సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రపంచ స్థాయిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నర్సులు కోవిడ్ పేషంట్లకు చేస్తున్న సేవలకు ప్రణమిల్లాలని, ఇదే స్ఫూర్తితో మరింత మంది కోవిడ్ పేషంట్లకు సేవలు అందించాలని మేయర్ తెలిపారు. అనంతరం, వైద్యాధికారి డా. అనిత ఆధ్వర్యంలో నర్సులు, సిబ్బందికి సన్మానించారు. డా. అనిత, నర్సింగు సిబ్బంది మాట్లాడుతూ , వ్యాక్సినేషన్, కోవిడ్ సేవలతో నెలలు తరబడి అవిశ్రాంతంగా గడుపుతున్న తమ సిబ్బందికి మేయర్ సత్కరించడం, శుభాకాంక్షలు తెలుపడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరిలోవ ఎఫ్.ఆర్.యు. వైద్యాధికారి డా. అనిత, నర్సింగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.   

Visakhapatnam

2021-05-12 15:28:13

అందరి సహకారంతోనే దేవస్థానం అభివృద్ధి..

అందరి సహకారం, సమిష్టి కృషితోనే దేవాలయాల అభివృద్ధి సాధ్యమ వుతుందని సింహాచలం దేవస్థానం ఈవో ఎంవీ సూర్య కళ అన్నారు. బుధవారం సింహ గిరిపైన ఆనందనిలయంలో అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుల పదవీ ప్రమాణ బాధ్యతలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో సూర్య కళ ప్రత్యేక ఆహ్వానితులు అందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. చందనోత్సవం పర్వదినం  ముందు స్వామి ధర్మ కర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులు కావడం, ఉత్సవము ముందు బాధ్యతలు స్వీకరించడం అంతా స్వామి వారి కృప గా పేర్కొన్నారు. భవిష్యత్తులో అందరం కలిసి ఆలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేద్దామని ఈఓ పిలుపునిచ్చారు. సింహాద్రి నాధుడు ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు, మేడిది మురళీకృష్ణ, యండమూరి విజయ, డి.మాణిక్యాలరావు ఎస్ ఎన్ రత్నం, లను ఘనంగా సత్కరించి  ఈఓ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులు అంతా మాట్లాడుతూ, తాము పూర్తిస్థాయిలో స్వామివారి సేవకు  అంకితమవుతామని చెప్పారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పారు.  అనంతరం ప్రత్యేక ఆహ్వానితులు అంతా కలిసి సింహాచలం అన్నదానం, గోసంరక్షణ పథకానికి లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కులు ఆలయ ఈవోకు ఇచ్చి త్వరలో మరిన్ని పధకాలు కి తమ వంతు విరాళాలు అంద చేస్తామని చెప్పారు.

పూర్వ జన్మ సుకృతము
..గంట్ల శ్రీనుబాబు

సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులు కావడం ఎంతో సంతోషం కలిగించింది అని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు.  గతంలో తాను సింహాచలం దేవస్థానం చందనోత్సవం కమిటీ సభ్యునిగా స్వామి సోదరి శ్రీ పైడితల్లి అమ్మవారి
ఉత్సవ కమిటీ సభ్యుడిగా పలు మార్లు సేవలు అందించామన్నారు. అంతే కాకుండా మరో సోదరి శ్రీ సత్తమ్మ  తల్లి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా  ఉన్నప్పటికీ కూడా స్వామి ధర్మ కర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులు కావడం పూర్తి పూర్తిస్థాయిలో సంతోషం కలిగించిందన్నారు. ఈ కార్యక్రమం లో ఆలయ ఏఈ వో కేకే రాఘవ కుమార్రమణమూర్తి,చిట్టి తదితరులు పాల్గొన్నారు.

సింహాచలం

2021-05-12 08:24:44

రైతు బజార్ల వద్ద జర భద్రం సుమీ..

కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా వున్న తరు ణంలో రైతుబజార్లకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్తలు పాటించాలని అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి కోరుతున్నారు. ఈమేరకు బుధవారం ఆమె మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ ఉద్రుతి అధికంగా ఉన్నందున ప్రతీ ఒక్కరూ డబుల్ లేయర్ వున్న మాస్కులు ధరించాలన్నారు. బౌతిక దూరం పాటిస్తూ, రైతుబజార్లలో కావాల్సిన కూరగాయలు కొనుగోలు చేసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకూ హేండ్ గ్లౌజులు, శానిటైర్లు వినియోగించడం ద్వారా వైరస్ నుంచి రక్షణ పొందడానికి ఆస్కారం వుంటుందన్నారు. జనసాంధ్రత సాధారణంగా అత్యధికంగా వుండే ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలుపడుతుందన్నారు. వారానికి సరపడే కూరగాయలన్నీ ఒకేసారి కొనుగోలు చేసుకోవడం ద్వారా నిత్యం రైతు బజార్లకు వెళ్లే అవకాశం వుండదని, అదే సమయంలో బయటకు వెళ్లే అవసరం కూడా తప్పుదందని తహశీల్దార్ సూచిన్నారు. అదే సమయంలో కొనుగోలు చేసిన కూరగాయలను  కూడా ఇంటి బయటనే ఒక సారి ముందుగా మంచినీటితో శుభ్రం చేసుకొని అపుడు మాత్రమే ఇంటిలోకి తీసుకెళ్లాలన్నారు. 60ఏళ్లు దాటిన వారు జనసాంధ్రత ఉన్న ప్రదేశాలకు పంపడం మానుకోవాలని జ్నానవేణి నగరవాసులకు సూచిస్తున్నారు.

Visakhapatnam

2021-05-12 05:56:22

విశాఖకు ఆక్సిజన్ రైలు నడపాలి..

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఆక్సిజన్‌ రవాణాకు తగినన్ని ట్యాంకర్లు అందుబాటులో లేనందున ఒడిషా నుంచి రాష్ట్రానికి ప్రాణవాయువు తరలించడానికి ప్రత్యేక ఆక్సిజన్‌ రైళ్ళను నడపాలని వైఎస్సార్‌సిపి  పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి రైల్వే బోర్డు చైర్మన్‌ సునీత్ శర్మకు విజ్ఞప్తి చేస్తూ మంగళవారం లేఖ రాశారు.  ఒడిషా నుంచి ఆక్సిజన్ రవాణాలో ఎదురవుతున్న ఆటంకాలు, ఇబ్బందులను ఆయన లేఖలో వివరించారు. సకాలంలో ఆక్సిజన్ రవాణా ద్వారా వేలాది మంది కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో భారతీయ రైల్వేలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఆక్సిజన్ రైళ్ళు విజయవంతం అయ్యాయని గుర్తుచేశారు.  రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్‌లో నమోదైన అత్యధిక కోవిడ్‌ కేసుల కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో కేసులు ఇప్పుడు రాష్ట్రాన్ని చుట్టుముట్టాయని.. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ అవసరం అపరిమితంగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో ఆక్సిజన్‌ ఆవశ్యకత కీలకంగా మారిందని..  తగినంత ఆక్సిజన్ సరఫరా కేటాయింపు, రవాణా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సాయంపైనే ఆధారపడిందని విజయసాయి రెడ్డి తన లేఖలో వివరించారు. ఆపత్కాలంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ ఇప్పటికే తాను ఢిల్లీలోని అనేక మంది ఉన్నతాధికారుల సహాయాన్ని అర్థించానని చెప్పారు. ఒడిషా నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్‌ రవాణా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పరిశ్రమలు, వాణిజ్యం) ఆర్. కరికాల్ వలవన్‌తో ఆక్సిజన్‌ రైళ్ళ నిర్వహణను సమన్వయం చేసుకునేలా రైల్వే జీఎంలకు తగిన సూచనలు చేయవలసిందిగా  విజయసాయి రెడ్డి రైల్వే బోర్డు చైర్మన్‌కు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Visakhapatnam

2021-05-11 15:05:32

బుధవారం కోవిడ్ వేక్సినేషన్ రద్దు..

విశాఖజిల్లాలో బుధవారం కోవిడ్ వేక్సినేషన్ రద్దు చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పతివాడ సత్యసూర్యనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. బుధవారం జిల్లాలో కోవిడ్ వేక్సినేషన్ రద్దు చేసిన అంశాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. వేక్సినేషన్ తిరిగి ఎప్పుడు ప్రారంభించేది ప్రకటిస్తామని అంత వరకూ మొదటి టీకా వేయించుకున్నవారు బయటకు రావొద్దని డిఎంహెచ్ఓ కోరారు.  వాలంటీర్లు, వైద్య సిబ్బంది, మీడియా ద్వారా వేక్సినేషన్ ప్రక్రియను తెలియజేస్తామని ఆయన వివరించారు.

Visakhapatnam

2021-05-11 14:56:27

కోవిడ్ పై యుద్దంలో నోడలధికారులే కీలకం..

కోవిడ్ పై యుద్ధం చేస్తున్నామని, నోడల్ ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించి ఈ యుద్ధంలో ప్రజలను గెలిపించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఏడీసీసీ బ్యాంకులోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం నందు ఆక్సిజన్ సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సమీక్ష నిర్వహించారు.ఆసుపత్రుల నిర్వహణలో నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలన్నారు. టెక్నికల్ అంశాల గురించి పూర్తి అవగాహన కలిగివుండి అనుకోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ విపత్తు సమయంలో కరోనా వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత నోడల్ ఆఫీసర్ల మీద ఉందని గుర్తుంచుకోవాలన్నారు. 

నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు ప్రతి రోజూ ఉదయం ఆసుపత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించుకుని ఆరోజు విధులను వివరించాలన్నారు. ఎప్పటికప్పుడు కరోనా గురించి ప్రభుత్వం విడుదల చేస్తున్న నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఐదు గంటలకోసారి ఆసుపత్రిలను సందర్శించి సిబ్బంది విధులను సమీక్షించాలన్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిని వెంట వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆసుపత్రి సూపరింటెండ్లకు ఆదేశించారు. 

ఆక్సిజన్ నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సర్వజన, సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ ఆసుపత్రుల నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లను జిల్లా కలెక్టర్ అదేశించారు.  
అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించుకునేందుకు అవసరమైన కూలీలను నిరంతరం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వారికి వసతి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. లిక్విడ్ ఆక్సిజన్ ను ఆక్సిజన్ ప్లాంట్ల దగ్గరనుంచి అవసరమైనప్పుడు తెచ్చుకునేందుకు వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 

లిక్విడ్ ఆక్సిజన్ పైనే పూర్తిగా ఆధారపడకుండా ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. జీజీహెచ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో వెంటిలేటర్లన్నీ ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ వృథాను తగ్గించేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ మానిటరింగ్ టీములు వెంటనే విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పీవీవీఎస్ మూర్తిని ఆదేశించారు. 

ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితుల సహాయకులు ఎక్కువగా ఉంటున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. సహాయకుల సంఖ్య నియంత్రించాలని అదేశించారు.

మెరుగైన వైద్య సేవలందించండి: ఎంపీ తలారి రంగయ్య


సమావేశంలో ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ కరోనా వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు నోడల్ అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ సరఫరా వినియోగంపై నిరంతరం సమీక్షించుకుంటూ ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు వార్డులను సందర్శించి కరోనా బాధితులకు మనోధైర్యాన్ని నింపాలన్నారు.

ఆక్సిజన్ మానిటరింగ్ సెల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రుల నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు ఏ మేరకు ఉన్నాయి, ఎంత మందికి ఎంత సమయం పాటు అందించగలం, తిరిగి ఖాళీ ఆక్సిజన్ ప్లాంట్లు నింపేందుకు ట్యాంకులు ఏ సమయానికి చేరుకోగలవో నిరంతరం సమీక్షించుకుంటూ ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లిక్విడ్ ఆక్సిజన్ తో పాటు ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లను కూడా ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. 


సమావేశంలో  డీఎఫ్ఓ జగన్నాథ్ సింగ్, సర్వజన/సూపర్ స్పెషాలిటీ/క్యాన్సర్ ఆసుపత్రుల నోడల్ ఆఫీసర్లు మరియి సూపరింటెండెంట్లు, డ్రగ్స్ ఏడీ రమేశ్ రెడ్డి, ఏపీ ఎస్ఎమ్ ఐడీసీ ఇంజినీర్లు, ఆనంతపురము ఆర్డిఓ గుణభూషణ్ రెడ్డి, డాక్టర్ నవీద్ తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-05-11 14:30:49

కోవిడ్ బాధితులకు మెరుగైన సేవలు..

ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చితే ఇక్కడ కోవిడ్ బాధితుల‌కు మెరుగైన సేవ‌లందించ‌ గ‌లుగుతున్నామ‌ని, మ‌ర‌ణాల రేటును గ‌ణ‌నీయంగా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగామ‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్టర్ల‌తో స్పంద‌న వీడియో కాన్ఫ‌రెన్స్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కోవిడ్ రెండో ద‌శ నివార‌ణ‌, నియంత్ర‌ణ‌, బాధితుల‌కు వైద్య స‌హాయం, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు; గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు, ఆర్‌బీకేలు త‌దిత‌రాల‌కు శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాలు; ఖ‌రీఫ్ స‌న్న‌ద్ధ‌త త‌దిత‌ర అంశాల‌పై ముఖ్య‌మంత్రి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ 104 కాల్ సెంట‌ర్ వ్య‌వ‌స్థ చాలా కీల‌క‌మైంద‌ని, వ‌చ్చే ప్ర‌తి కాల్‌కూ సంతృప్తిక‌ర స్థాయిలో స‌మాధాన‌మిచ్చి, వీలైనంత త్వ‌ర‌గా సేవ‌లు అందేలా చూడాల‌న్నారు. కోవిడ్ వైర‌స్ తీవ్ర‌త అధికంగా ఉన్నవారిని ర‌క్షించేందుకు అవ‌స‌ర‌మైన మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఒడిశా రాష్ట్రాల్లోని ఎనిమిది పాయింట్ల నుంచి తీసుకొస్తున్నామ‌ని, వేగంగా ఆక్సిజ‌న్‌ను తీసుకొచ్చేందుకు ఖాళీ ట్యాంక‌ర్ల‌ను విమానాల్లో పంపుతున్నామ‌ని వెల్ల‌డించారు. 15 వేల ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లను బుక్ చేశామ‌ని, ఈ నెల చివ‌రి నుంచి వాటి డెలివ‌రీ మొద‌ల‌వుతుంద‌ని, కోవిడ్ కేర్ కేంద్రాల‌కు వీటిని అందించ‌నున్న‌ట్లు తెలిపారు. న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు లేఅవుట్ల‌లో మౌలిక వ‌స‌తుల అభివృద్ధిని వేగ‌వంతం చేసి, ఇళ్ల నిర్మాణాల‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రైస్‌కార్డు, ఆరోగ్య‌శ్రీ కార్డు, పెన్ష‌న్ కార్డు, ఇళ్ల ప‌ట్టాల‌కు సంబంధించి గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌ను నిర్దేశ ఎస్ఎల్ఏలో ప‌రిష్క‌రించేలా చూడాల‌న్నారు. మే 13న వైఎస్సార్ రైతు భ‌రోసా, మే 18న మ‌త్స్య‌కార భ‌రోసా, మే 25న పంట బీమా ప‌థ‌కం ద్వారా ల‌బ్ధిదారుల ఖాతాల్లో నేరుగా న‌గ‌దు జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాల‌కు ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

East Godavari

2021-05-11 14:29:01

సీసీసీల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి..

తూర్పుగోదావరి జిల్లాలోని జేఎన్‌టీయూ, బొమ్మూరు, బోడ‌స‌కుర్రు కోవిడ్ కేర్ కేంద్రాల్లో ప్ర‌స్తుతం 1369 మంది ఉన్నార‌ని జేసీ (డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి తెలిపారు. మంగళవారం వర్చువల్ విధానలో జెసి మీడియాతో మాట్లాడారు. కోవిండ్ కేర్  కేంద్రాల్లో అవ‌స‌రం మేర‌కు వైద్య సేవ‌లు అందించ‌డంతో పాటు ఆహారం, పారిశుద్ధ్యం విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు విషాదం చోటుచేసుకుంటే భౌతిక‌కాయాన్ని త‌ర‌లించేందుకు జిల్లాలో 32 మ‌హాప్ర‌స్థానం వాహ‌నాలు ఉన్నాయ‌ని, వీటి సేవ‌లు పొందేందుకు పైసా కూడా చెల్లించ‌న‌వ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. గౌర‌వ‌ప్ర‌దంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు కూడా ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఎవ‌రైనా ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. జిల్లాస్థాయి క‌మాండ్ కంట్రోల్‌రూంకు ఫోన్‌చేసి, ఫిర్యాదు చేయొచ్చ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) రాజ‌కుమారి సూచించారు.

Kakinada

2021-05-11 14:25:55

మొదటి డోస్ తీసున్నవారికే వ్యాక్సిన్..

ప్ర‌స్తుతం రెండో డోస్ పెండింగ్ ఉన్న‌వారికి మాత్ర‌మే టీకా పంపిణీ చేయ‌నున్నామ‌ని గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. మంగళవారం ఆమె వర్చువల్ విధానంలో మీడియాతో మాట్లాడారు. రోజువారీ వ్యాక్సినేష‌న్‌కు సంబంధించి మీడియా ద్వారా స‌మాచారం ఇవ్వ‌నున్న‌ట్లు జేసీ  తెలిపారు. దాదాపు 67 వేల మందికి రెండో డోస్ పెండింగ్ ఉంద‌ని, ప్రాధాన్య‌త ఆధారంగా వాలంటీర్ల ద్వారా వీరికి టోకెన్లు అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసును 6-8 వారాల స‌మ‌యంలో వేసుకోవ‌చ్చ‌ని, ల‌బ్ధిదారులు ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని సూచించారు. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో తొలి డోసు వేసుకున్న‌వారికి ప్ర‌భుత్వ కేంద్రాల్లో రెండో డోసు వేయ‌నున్న‌ట్లు తెలిపారు. వ్యాక్సినేష‌న్‌పై ఏవైనా సందేహాలుంటే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాన్ని సంప్ర‌దించాల‌ని సూచించారు. ఆసుప‌త్రుల సామ‌ర్థ్యం, చికిత్సా విధానాల‌కు అనుగుణంగా రెమిడెసివిర్ ఇంజెక్ష‌న్ల‌ను అందిస్తున్న‌ట్లు జేసీ తెలిపారు.

కాకినాడ

2021-05-11 14:25:01

అవ‌స‌రం మేర‌కు ఆక్సిజ‌న్ నిల్వ‌లు..

తూర్పుగోదావరి జిల్లాలో ప్ర‌స్తుతం రోజువారీ మెడిక‌ల్ ఆక్సిజ‌న్ వినియోగం 42-45 కిలో లీట‌ర్లు కాగా.. 85 కిలో లీట‌ర్ల మేర‌కు నిల్వ‌లు ఉన్న‌ట్లు జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. మంగళవారం జెసి వర్చువల్ విధానంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాకు ఒడిశా, విశాఖ‌ప‌ట్నం నుంచి ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా అవుతోంద‌ని, ఈ ఆక్సిజ‌న్ రీఫిల్లింగ్ ప్ర‌క్రియ‌తో పాటు ఆసుప‌త్రుల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌డం, స‌క్ర‌మంగా వినియోగించేలా చూసేందుకు ప్ర‌త్యేక బృందాలు ప‌నిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆక్సిజ‌న్‌కు కొర‌త ఉంద‌నే మాట రాకుండా చూస్తున్నామ‌ని, ఇదే స‌మ‌యంలో ఆసుప‌త్రులు ఆక్సిజ‌న్ వృథా కాకుండా చూడాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. జిల్లాలో రైతు భ‌రోసా కేంద్రాలు, ధాన్యం సేక‌ర‌ణ కేంద్రాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తూ రైతుల నుంచి మ‌ద్ద‌తు ధ‌ర‌కు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. సోమ‌వారం 16,337 ట‌న్నుల మేర కొనుగోలు చేయ‌గా, మంగ‌ళ‌వారం దాదాపు 19 వేల ట‌న్నుల ధాన్యం కొనుగోలు జ‌రిగిన‌ట్లు తెలిపారు. బోండాలు ర‌కం ధాన్యం కొనుగోలులో ఎక్క‌డా స‌మ‌స్య‌లు లేవ‌ని, ఏవైనా సందేహాలు ఉంటే ఆర్‌బీకేలోని ధాన్యం కొనుగోలు స‌హాయ‌కుడిని సంప్ర‌దించాల‌ని సూచించారు. ఖ‌రీఫ్ స‌న్న‌ద్ధ‌త‌లో భాగంగా వారం రోజుల పాటు జిల్లా, డివిజ‌న్‌, మండ‌ల‌, గ్రామ స్థాయి అడ్వ‌యిజ‌రీ క‌మిటీల స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నామ‌ని తెలిపారు. విత్త‌నాలు, ఎరువుల‌ను అవ‌స‌రం మేర‌కు ఆర్‌బీకేల వ‌ద్ద అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు జేసీ డా. జి.ల‌క్ష్మీశ వెల్ల‌డించారు.

Kakinada

2021-05-11 14:20:08