1 ENS Live Breaking News

కోవిడ్ ఆసుపత్రుల ఆక్సిజన్ కి రూ.80 లక్షలు..

విశాఖ జిల్లాలో కోవిడ్ ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపడుతున్న వివిధ జాగ్రత్తలలో భాగంగా దివీస్ ల్యాబ్ నుండి వివిధ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ కు జనరల్ మేనేజర్ కోటీశ్వరరావు సుమారు 80 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.  సోమవారం కలెక్టరేట్ లోని ఆయన చాంబర్ లో అందించి, విశాఖ ఇండస్టియల్ గ్యాసెస్ నుండి వివిధ ఆసుపత్రులకు ఇప్పటికే 350 సిలిండర్లు సరఫరా చేసినట్లు తెలిపారు.  కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బలిటీ కింద ఈ ఆక్సిజన్ సిలిండర్లు ను సరఫరా చేస్తున్నట్లు వివరించారు.దివీస్ ల్యాబ్ లేటరీ నుండి సి.ఎస్.ఆర్. మేనేజర్ డి. సురేష్ కుమార్, పి. అశోక్ మరియు సీనియర్ లైజన్ కన్సల్టెంట్  వరహాలరెడ్డి గారు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-03 14:00:46

కోవిడ్ వార్డులో మెరుగైన సేవలు..

కె జి.హెచ్ కోవిడ్ వార్డులో  కోవిడ్ బాధితులకు  మెరుగైన వైద్య సేవలు అందించాలని కోవిడ్  నోడల్ అధికారి ,ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు సోమవారం కేజీహెచ్ నోడల్ అధికారిగా గారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా  కోవిడ్ విభాగం అధికారులతో సమీక్షించారు.
కోవిడ్ పేషేంట్లకు నాణ్యమైన  ఆహారపదార్థాలు అందించాలన్నారు. తాగునీటి ని ఎప్పటికప్పుడు సరఫరా చేయాలని సూచించారు. అన్ని కోవిడ్ వార్డుల్లో అవసరమైన వెంటిలేటర్ లు ,బెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పేషెంట్ బంధువులు ఎక్కువమంది రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పేషేంట్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సహాయక కేంద్రానికి అందించాలని పేర్కొన్నారు.
నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టి వార్డులను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి షిప్టులోను60 మంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహించాలని చెప్పారు
ఇటీవల కోవిడ్ సేవలకు నియమించిన డాక్టర్లు, సిబ్బంది వెంటనే విధులకు చేరాలన్నారు.కోవిడ్ బాధితులకు నిరంతరం ఆక్సిజన్ అందించాలన్నారు. సి ఎస్ ఆర్ బ్లాక్ లో ఏర్పడ్డ చిన్న చిన్న మరమ్మతులు చేయాలని  ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ పేషెంట్ మృతి చెందితే 30 నిమిషాల్లో వార్డ్ నుంచి బయటకు తరలించాలని చెప్పారు. కోవిడ్ పరిక్షలకు నమూనాలను సేకరించి కేజీహెచ్లోనే పరీక్షలు నిర్వహించి జాప్యం చేయకుండా ఫలితాలు వెల్లడించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సూపరింటెండెంట్ మైథిలి ఏ సి పి శిరీష  తదితరులు పాల్గొన్నారు.

కెజీహెచ్

2021-05-03 13:58:35

సీఎస్ఆర్ బ్లాక్ లో ల్యాబ్ ఏర్పాటు చేయండి..

కె.జి.హెచ్ సి.ఎస్.ఆర్. బ్లాకులో కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు అందించడంలో ఎటువంటి లోటు పాట్లు వుండరాదని. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద కనపరచాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్  వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరు సి.ఎస్.ఆర్.బ్లాకులో వైద్య సేవలు, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ల డిశ్చార్జి, ఎక్వీప్ మెంటు , టెస్టింగ్ ఏజెన్సీ  ఏర్పాట్లు గావించిడం, తదితర అంశాలపై  చర్చించారు. సి.ఎస్.ఆర్ బ్లాకు ప్రత్యేకాధికారిగా  ఎస్. వెంకటేశ్వర్, పి.ఒ.ఐ.టి.డి.ఎ.పాడేరు ను  కలెక్టరు నియమించారు. సి.ఎస్.ఆర్.బ్లాకు లో వైద్యసేవలు, కోలుకుంటున్న పేషెంట్లు డిసార్చి గావించడం అన్ని విషయాలపై  ప్రత్యేక శ్రద్ద వహించాలని పి.ఒ. ఐ.టి.డి.ఎ.ను ఆదేశించారు. పేషెంట్లసు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పి.పి.పి. క్రింద టెస్టింట్ ఏజెన్సీని గుర్తించాలని ఆదేశించారు. ఈ టెస్టింగ్ ఏజెన్సీని సి.ఎస్.ఆర్.బ్లాకు లోనే ఏర్పాటు గావించాలన్నారు.  పేషెంట్లను చేర్చుకునే విషయంలో టెస్టింగ్ ముఖ్యం కాదని, కోవిడ్  లక్షణాలు  వుంటే చేర్చుకుని అవసరమైన వైద్యసేవలు అందించాలని సూచించారు.  ఇ.సి.జి., ఎక్స్ రే , డయాలసిస్ మొదలగు టెక్నీషియన్స్ ను నియమించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు –2 పి.అరుణ్ బాబు, ఆంధ్రా మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డా.పి.వి.సుధాకర్,  పి.ఒ. ఐ.టి.డి.ఎ. ఎస్ .వెంకటేశ్వర్ , తదితరులు హాజరయ్యారు.

హెల్త్ సిటీ, విమ్స్ లకు ఆక్సిజన్ సరఫరా 
జిల్లాలో హెల్త్ సిటీలోని ఆసుపత్రులు కోవిడ్  పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నాయని,  వాటికి ఆక్సిజన్ సరఫరాకు ఎటువంటి  ఇబ్బంది లేకుండా చూడాలని  డ్రగ్ ఇన్స్పెక్టర్లు రజిత, కళ్యాణిలను జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు. హెల్త్ సిటి ఆసుపత్రులకు  ఆక్సిజన్ అవసరాలను  దృష్టిలో  పెట్టుకొని తగు ఏర్పాట్లు గావించాలన్నారు.  విమ్స్ ఆసుపత్రిలో అన్ని పడకలకు ఆక్సిజన్ సరఫరాకు తగు ఏర్పాట్లు చేయాలని ఎ.పి.ఎమ్.ఎస్.ఐ.డి.సి. ఇ.ఇ.డి.ఎ.నాయుడును ఆదేశించారు. ఈ విషయంపై కలెక్టరు ఎ.పి.ఎమ్.ఎస్.ఐ.డి.సి. ఇ.ఇ. డి.ఎ.నాయుడును, ప్రత్యేకాధికారి ఎస్.ఎస్.ఎ.పి.ఒ.లతో చర్చించారు.

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులనన్నింటిని  ప్రతిరోజూ పరిశీలన గావించి కోవిడ్ పేషెంట్లకు అవసరమైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ డి.సి.హెచ్.ఎస్. లక్ష్మణ్ ను ఆదేశించారు. సదరు ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్ , సేవలు, వివరాలను తెలియజేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సి.హెచ్.సి.లలో వున్న పల్మనాలజిస్టలను  కె.జి.హెచ్.కు డెప్యూట్ గావించాలన్నారు.  ప్రైవేటు ఆసపత్రులను  తనిఖీ నిర్వహించాలని, నిబంధనలు ప్రకారం ఖాళీ పడకల వివరాలను 104 కాల్ సెంటర్ ఇంచార్జికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని  డి.ఎమ్ అండ్.హెచ్.ఒ.ను  ఆదేశించారు.  ప్రైవేటు ఆసుపత్రులకు  ఇచ్చిన నోటీసులపై వారి వివరాలను వెంటనే అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.సూర్యనారాయణ, జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా.రాజేష్ పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-03 13:56:02

అప్పన్న ఆలయం నిత్యం పరిశుభ్రం..

కరోనా వైరస్ కేసులు అధికంగా పెరుగుతున్న సమయంలో సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని అధికారులు అనునిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్నారు. భక్తుల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకొని హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. అంతేకాకుండా సామాజిక దూరాన్ని అమలు చేస్తూ..స్వామివారి దర్శనాన్ని కలిగిస్తున్నారు. వీటి కోసం దేవస్థానంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీనితో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ భక్తులు దేవస్థానంలో స్వామిని దర్శించుకుంటున్నారు.

సింహాచలం

2021-05-02 07:56:33

కరోనాను మనోధైర్యంతోనే తిప్పికొట్టాలి..

విశాఖలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ ప్రభుత్వ అధికారులు ప్రజలను అనుక్షణం అప్రమత్తం చేస్తున్నారు..జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సూచనలతో ప్రతీ ఒక్క అధికారి ప్రజలను కరోనా వైరస్ నుంచి రక్షించడానికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్ణానవేణి కరోనా వైరస్ పట్ల ప్రజలను చైతన్య పరచడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతూనే పలు సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా వైరస్ ను దైర్యంగా జయించడానికి ప్రతీ ఒక్కరూ మనోధైర్యంతో ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తాను స్వయంగా చెప్పడంతోపాటు, తన కింది స్థాయి అధికారులను కూడా ప్రజల్లోకి వెళ్లే సమయంలో వారిలో దైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలకు సేవలు అందించడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని, అవసరం లేకుండా ఎవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. కుటుంబాల్లోని వయసు మళ్లిన వారిని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు. కరోనా ఉన్నంత కాలం కాచిన నీళ్లను తాగాలని, మాస్కును తీయకుండా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని, ఏ పనిచేసినా చేతులు సబ్బుతో పరిశుభ్రంగా చేసుకోవాలని, ఎలాంటి కరోనా లక్షణం ఉన్నా వెంటనే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారు హోం ఐసోలేషన్ కిట్లను తీసుకొని ఇంట్లో గానీ, పరిస్థితి బాగోలేకపోతే  ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించే వైద్య సహాయాలు పొందాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ కార్యాయాలకు వచ్చే ప్రజలను కూడా ఈమె తరచుగా అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. తన కార్యాలయంలో శానిటైజర్లు ఏర్పాటు చేయడంతోపాటు, ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను అమలు చేస్తున్నారు. విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్ణానవేణి కరోనా వైరస్ పట్ల చేస్తున్న ఈ ఆదర్శవంతమైన చైతన్యం, సూచనలతో పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభించడం విశేషం.

విశాఖపట్నం

2021-05-02 04:28:15

అప్పటి వరకూ ఆర్టీఓ పనులకు బ్రేక్..

 విజయనగరం రవాణా శాఖ కార్యాలయంలో, లెర్నర్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన సంబంధిత ఫిట్నెస్,  ఇతర పనులు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు రవాణా శాఖ ఉప కమిషనర్ సి.హెచ్. శ్రీదేవి తెలిపారు. కరోనా రెండో విడత విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా కమిషనరు ఆదేశాలు జారీ చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ సోమవారం అనగా 3.5.2021 నుంచి 31.5.2021 వరకూ రవాణా శాఖ కార్యాలయంలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఉన్నత అధికారుల నుంచి వచ్చే తదుపరి ఆదేశాల మేరకు కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆమె వివరించారు. ప్రజలకు అవసరమైన సమాచారం కోసం ఆదినారాయణ ఆర్టీవో  9154294202,  కృష్ణమోహన్ ఏవో 9848528305, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ జె.రాంకుమార్ 9154294411 , ఎం.బుచ్చిరాజు 9154294412 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.

విజయనగరం

2021-05-01 16:35:38

కోవిడ్ బిల్లులు సమర్పించాలి..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ మొదటి విడత బిల్లులు తక్షణం సమర్పించాలని జిల్లా కలెక్టర్   జె నివాస్ ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేస్తూ మొదటి విడత కోవిడ్ సమయంలో వివిధ సామగ్రి పంపిణీ చేసిన ఏజెన్సీలు బిల్లులు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ బిల్లులు సమర్పించాలని కోరడం జరిగిందని, అయితే ఇప్పటి వరకు కొన్ని ఏజెన్సీలు బిల్లులు సమర్పించలేదని ఆయన అన్నారు. బిల్లులు సమర్పించుటకు చివరి అవకాశం కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. బిల్లులను మే 5వ తేదీ నాటికి సమర్పించాలని, గడువు దాటిన తరువాత సమర్పించిన బిల్లులు పరిగణనలోకి తీసుకోవడం జరగదని ఆయన స్పష్టం చేసారు.

శ్రీకాకుళం

2021-05-01 16:32:55

పిల్లల ఆరోగ్యం కోసమైనా వాయిదా వేయండి..

ఆంధ్రప్రదేశ్ లో విపరీతంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో 10వ తరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని సామాజికవేత్త, ప్రముఖ న్యాయవాది రహిమున్నీసాబేగమ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా కేసులు అధికంగా మారుతున్న వేళ విద్యార్ధుల పరీక్షలను రద్దు చేయాలని, కుదరకపోతే వాయిదా వేయాలన్నారు. ప్రస్తుతం రోజుకు వేలల్లో కేసులు, పదుల సంఖ్యలో మరణాలు పెరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు. విశాఖలో సాధారణ ప్రజలతోపాటు చిన్నపిల్లలు కూడా కరోనా వైరస్ భారిన పడి మ్రుత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం ప్రభుత్వం. ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయడం ద్వారా విద్యార్ధులు మరింతగా పరీక్షలకు సిద్ధం కావడానికి కూడా ఆస్కారం వుంటుందని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. పెద్దలను వెంటాడుతున్న కరోనా రేపు పిల్లలను కూడా పట్టి పీడిస్తుందని, ప్రభుత్వం తక్షణమే పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలన్నారు. చాలా చోట్ల ఉపాధ్యాయులు కూడా ఈ కరోనా భారిన పడి మరణిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సత్వరమే నిర్ణయం వెనక్కి  తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆమె కోరారు.

విశాఖపట్నం

2021-05-01 16:10:07

మధ్యాహ్నాం 2.30 వరకే అప్పన్న దర్శనం..

కరోనా కేసులు అధికంగా పెరుగుతున్న ద్రుష్ట్యా మే2వ తేది నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని   శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనాలు ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నాం 2.30 వరకే అనుమతిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. శనివారం దేవస్థానంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. మొత్తం 22 మంది ఆలయ అర్చకుల్లో 14 మంది అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్నారన్నారు. కరోనా కాకపోయినా ఆ లక్షణాలు ఉన్నా జాగ్రత్తల కోసం సెలవుల్లో ఉన్నారని వివరించారు. ఉద్యోగులకు, అర్చకులకు కరోనీ పరీక్షలు చేశారని ఇంకా ఫలితాలు రావాల్సి వుందన్నారు. కాగా స్వామివారికి నిర్వహించే సేవలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తారని వివరించారు. భక్తులు స్వామివారి ఆలయ దర్శనం సమయాలను గమనించి కేవలం ఉదయం పూట మాత్రమే రావాలన్నారు. 

సింహాచలం

2021-05-01 15:51:35

కరోనా కట్టడికి ప్రభుత్వం విశేష కృషి..

తూర్పుగోదావ‌రి జిల్లాలో కోవిడ్ క‌ట్ట‌డికి, బాధితుల‌కు పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు  జిల్లా యంత్రాంగం, ప్ర‌జాప్ర‌తినిధులు ఎంతో కృషిచేస్తున్నార‌ని  డిప్యూటీ సీఎం ఆరోగ్య‌ శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. శ‌నివారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వ‌రూప్‌, వ్య‌వ‌సాయ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ, ప్ర‌భుత్వ విప్ దాడిశెట్టి రాజా, స్పెష‌ల్ ఆఫీస‌ర్ జె.శ్యామ‌ల‌రావు, క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి, ఎస్‌పీ అద్నాన్ న‌యీం అస్మీ త‌దిత‌రుల‌తో క‌లిసి జిల్లాలోని కోవిడ్ నియంత్ర‌ణ‌, నివార‌ణ చ‌ర్య‌ల‌పై వైద్య‌, ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో డిప్యూటీ సీఎం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. తొలుత క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. జిల్లాలో డివిజ‌న్ల వారీగా ప్ర‌స్తుత పాజిటివిటీ, కోవిడ్ టెస్టింగ్‌, బాధితుల‌కు వైద్య స‌హాయం, వ్యాక్సినేష‌న్‌; ఆక్సిజ‌న్ నిల్వ‌లు, వినియోగం; మేనేజ్‌మెంట్‌, కోవిడ్ కేర్ కేంద్రాలు, ఆసుప‌త్రుల నిర్వ‌హ‌ణ‌, ఆసుప‌త్రుల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ‌, రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్ల స‌ర‌ఫ‌రా, హోం ఐసోలేష‌న్, క్షేత్ర‌స్థాయి కార్య‌క‌లాపాలు త‌దిత‌రాల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. గ‌తేడాది తొలిద‌శ‌లో ఆగ‌స్టులో అత్య‌ధికంగా అమ‌లాపురం డివిజ‌న్‌లో 26.04 శాతం పాజ‌టివిటీ న‌మోదు కాగా.. రెండోవేవ్‌లో గ‌త‌వారం రోజుల్లో ఈ డివిజ‌న్‌లో 28.26 శాతంగా ఉంద‌ని తెలిపారు. గ‌రిష్టంగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం డివిజ‌న్‌లో 34.30 శాతం పాజిటివిటీ న‌మోదైన‌ట్లు వివ‌రించారు. ప్ర‌స్తుతం జిల్లాలో 76 ఆసుప‌త్రుల్లో 4,461 ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని, వీటిలో ఐసీయూ ప‌డ‌క‌లు 788 కాగా, 2328 ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లు ఉన్న‌ట్లు తెలిపారు. అదే విధంగా రోజువారీ ఆక్సిజ‌న్ సామ‌ర్థ్యం 74 కిలో లీట‌ర్లు కాగా, వినియోగం 45 కిలో లీట‌ర్లుగా ఉంద‌న్నారు. బాధితుల అవ‌స‌రాల మేర‌కు ఆక్సిజ‌న్‌కు కొర‌త లేకుండా ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ రూపొందించి అమ‌లుచేస్తున్నామ‌ని, ఆసుప‌త్రులు ఇచ్చే ఇండెంట్ ప్ర‌కారం రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ప్ర‌క్రియ కోసం క‌మాండ్ కంట్రోల్ రూంలో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశామ‌న్నారు. ప్ర‌తి కోవిడ్ ఆసుప‌త్రికి నోడ‌ల్ అధికారిని నియ‌మించామ‌న్నారు. గ్రామ‌, మునిసిప‌ల్ ప్రాంతాల స్థాయిలో కోవిడ్ క‌ట్ట‌డికి ప్ర‌త్యేకంగా క‌మిటీలు ఏర్పాటు చేశామ‌ని, వీటికి 21 రోజుల ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పించామ‌ని తెలిపారు. రోజుకు స‌గ‌టున 4,060 ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని వివ‌రించారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారికి కిట్ల‌ను వైద్య స‌ల‌హాలు అందించ‌డంతో పాటు సైక‌లాజిక‌ల్ హెల్ప్‌లైన్ ద్వారా సేవ‌లందిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు.

కాకినాడ

2021-05-01 15:31:35

ఆపరేటర్ల పట్ల అర్భన్ తహశీల్దార్ ఉదారత..

విశాఖలో కరోనా వైరస్ కేసులు విస్తారంగా పెరుగుతున్న వేళ అర్భన్ తహశీల్దార్ జ్ణానవేణి  ఎంతో ఉన్నతంగా మంచి మనసుతో ఎండీయు ఆపరేటర్ల పట్ల తన సేవగుణాన్ని చాటుకున్నారు.. ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసే వారు ఎప్పుడూ ఆరోగ్యంగా, కరోనా వైరస్ కి దూరంగా ఉండాలనే ఆలోచనతో వారందరికీ శానిటైజర్లు, గ్లౌజులు, మాస్కులు, స్వీట్ బాక్సులు, కిట్లను మేడే సందర్భంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ జ్ణాణవేణి మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తున్న సమయంలో కూడా ఆపరేటర్లు ప్రజలకు ఎంతో దైర్యంగా సేవలు అందిస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించాలనే ఆలోచనతో తనవంతుగా ఈ సహాయం చేసినట్టు  చెప్పారు. , ప్రజలంతా కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరం ఉంటే తప్పా ఎవరూ బయటకు వెళ్లవద్దని సూచించారు. నిత్యం మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న  కరోనా వేక్సినేషన్ ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న ఆమె, ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించినా దగ్గర్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా వైరస్ ను దైర్యంగా తిప్పికొట్టడంలో విశాఖనగర ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

విశాఖ

2021-05-01 15:23:10

ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ జెడిగా డా..వైవి ర‌మ‌ణ‌..

విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ సంయుక్త సంచాల‌కులుగా ఆ శాఖ డిప్యుటీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ శ‌నివారం అద‌న‌పు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ప్రస్తుతం జెడిగా పనిచేస్తున్న  డాక్ట‌ర్ ఎంవిఏ న‌ర్సింహులు ఏప్రెల్ 30న ఉద్యోగ విర‌మ‌ణ చేశారు. దీంతో అదేశాఖ‌లో డిప్యుటీ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న వైవి ర‌మ‌ణ‌, జెడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.  అనంత‌రం, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

విజయనగరం

2021-05-01 07:57:45

విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకూడదు..

కోవిడ్ లాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన ఆక్సిజన్ ను సరఫరా చేయాలని లైఫ్ ఆక్సిజన్ ప్లాంట్ యాజమాన్యాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. గురువారం శింగనమల మండలంలోని చక్రాయపేట గ్రామ పరిధిలోని లైఫ్ ఆక్సిజన్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆక్సిజన్ అత్యవసరంగా మారిందని, జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఇందులో భాగంగానే  లైఫ్ ఆక్సిజన్ ప్లాంట్ సేవలు ఉపయోగించుకుం టున్నామన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ లో ప్రతి రోజూ ఎంత కెపాసిటీ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది, ఎన్ని సిలిండర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తారు, ఇక్కడినుంచి ఎక్కడెక్కడకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు, తదితర అన్ని రకాల వివరాలను  జిల్లా కలెక్టర్  యాజమాన్య ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ లో ఆక్సిజన్ ఉత్పత్తికి ఎలాంటి యంత్రాలను ఉపయోగిస్తున్నారు అని పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు 7 - 8 క్యూబిక్ కేజీల సామర్థ్యం గల 350 సిలిండర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తున్నామని, తాడిపత్రి పరిధిలోని పరిశ్రమల అవసరాలకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కు యాజమాన్యం సభ్యులు వివరించారు. ఆక్సిజన్ ను డైరెక్ట్ గా సిలిండర్ కు ఫిల్ చేస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ అక్కడ పనిచేస్తున్న వర్కర్లతో మాట్లాడి ఆక్సిజన్ ను సిలిండర్లకు ఫిల్ చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.  ఆక్సిజన్ సరఫరాలో ఏ స్థాయిలో ఎటువంటి చిన్న సమస్య ఉన్నా తనకు వెంటనే సమాచారం అందించాలన్నారు.వెంటనే పరిష్కార దిశగా  చర్యలు తీసుకుంటామన్నారు.అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ ఉత్పత్తిని బాగా చేస్తున్నారని లైఫ్ ఆక్సిజన్ ప్లాంట్ యాజమాన్యాన్ని కలెక్టర్ మెచ్చుకున్నారు. లైఫ్ ఆక్సిజన్ ప్లాంట్ కు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎఫ్ ఓ జగన్నాథ్ సింగ్, ఆర్డీఓ గుణభూషన్ రెడ్డి, తహసీల్దార్ విశ్వనాథ్, ఎంపీడీఓ ఉమాదేవి, పరిశ్రమల శాఖ  జీఎం  అజయ్ కుమార్, లైఫ్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రతినిధులు భీమ లింగారెడ్డి, జయసింహా రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

singanamala

2021-04-29 12:15:07

తాత్కాలిక అంబులెన్సులుగా మార్చండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ రేషన్ సరుకుల కోసం వినియోగిస్తున్న మినీ వ్యాన్ లను తాత్కాలిక అంబులెన్సులుగా మార్చి అత్యవసర కోవిడ్ రోగుల ప్రాణాలు కాపాడాలని సామాజికవేత్త, ప్రముఖ న్యాయవాది రహిమున్నీసాబేగమ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా కేసులు అధికంగా మారుతున్న వేళ రేషన్ సరఫరా చేసే మినీ వ్యాన్లను అంబులెన్సులుగా మార్చడం ద్వారా సత్వరమే అత్యవసర కోవిడ్ రోగులను ఆసుపత్రులకు తరలించడానికి అవకాశం వుంటుందన్నారు. అదేవిధంగా ఆసుపత్రుల్లో ప్రతీ పడకకి ఒక ఆక్సిజన్ సిలెండర్ కిట్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ రేషన్ సరుకులు ఇచ్చే సమయంలో ప్రజలంతా గుమిగూడకుండా చూడాలన్నారు. రోజుకి కొద్ది మందికి మాత్రమే సరుకులు ఇచ్చేవిధంగా వాలంటీర్ల ద్వారా సేవలు అందించాలన్నారు. మినీ వ్యాన్లను తాత్కాలిక అంబులెన్సులుగా ఏర్పాటు చేయడం ద్వారా సత్వరమే కోవిడ్ రోగులకు వైద్య సహాయం కోసం ఆసుపత్రులకు తరలించే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ విషమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సత్వరమే నిర్ణయం తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆమె కోరారు.

Visakhapatnam

2021-04-28 15:05:14

అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు..

కోవిడ్ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరల కన్నా అధిక ఫీజులు వసూలు చేస్తే జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హెచ్చరించారు. ఆదివారం కోవిడ్ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్లు, పెనుకొండ సబ్ కలెక్టర్  ఆర్ డి వో లు, నోడల్ ఆఫీసర్ లతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం వెళితే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఒక హాస్పిటల్లో రెమిడెసివిర్ ఆరు డోసులకు లక్షన్నర రూపాయలు వసూలు చేసినట్లు తెలిసిందన్నారు. రెమిడెసివిర్ కు రూ..2500 ల చొప్పున 6 డోసులకు , మిగిలిన అన్ని ఛార్జీలు కలుపుకున్న రూ.20వేల నుండి రూ.30 వేల వరకు ఖర్చవుతుందని, అయితే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు.. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కన్నా ఒక రూపాయి ఎక్కువ వసూలు చేసినా అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.   హెల్ప్ డెస్క్ మేనేజర్లు ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలోనూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ప్రదర్శించాలని, ఏ చికిత్సకు ఎంత డబ్బులు వసూలు చేయాలో అంత మాత్రమే వసూలు చేసేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అధికంగా డబ్బులు వసూలు చేయరాదన్నారు. ఈ ఆస్పత్రుల్లో ఎన్ని పడకలు ఉన్నాయి, ఎన్ని ఐసీయూ, నాన్ ఐసీయూ పడకలు ఉన్నాయి, ఎన్ని అందుబాటులో ఉన్నాయి అనే వివరాలను కూడా ప్రదర్శించాలన్నారు. అందుకు సంబంధించిన ఫోటో లను తనకు పంపించాలన్నారు

కోవిడ్ మేనేజ్మెంట్ పై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి

కోవిడ్ మేనేజ్మెంట్ పై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కొన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా సరిగా లేదని, శాని సరిగా లేదని తన దృష్టికి వస్తున్నాయన్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా  అన్ని అంశాలకు సంబంధించిన నోడల్ అధికారులు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీవో లు కోవిడ్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా, భోజనం ఏర్పాట్లు, శానిటేషన్ ఏర్పాట్లు తదితర అంశాలలో ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. కరోనా సోకిన వారికి పాజిటివ్ వచ్చాక వారితో మాట్లాడడం, ఏఎన్ఎం, ఆశావర్కర్లు పాజిటివ్ వచ్చిన వారి వద్దకు వెళ్లి సమాచారం సేకరించడం, వారికి అవసరమైన కిట్లు అందించడం చేయాలని, మెడికల్ ఆఫీసర్లు యాక్టివ్ గా పని చేయాలన్నారు. సబ్ కలెక్టర్, ఆర్డీవోలు పాజిటివ్ రిజల్ట్ వచ్చాక ఎక్కడెక్కడ పాజిటివ్ కేసులు వచ్చాయి, మెడికల్ అధికారులు,ఏఎన్ఎం, ఆశావర్కర్లు వారి వద్దకు వెళ్తున్నారా లేదా అనేది పరిశీలించాలన్నారు. పాజిటివ్ వచ్చినవారిని హోమ్ ఐసోలేషన్ లో పెట్టాక వారికి మెడికల్ కిట్స్ ఇచ్చారా లేదా అనే దాని పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 

ఆస్పత్రుల నోడల్ అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలి

ప్రతి హాస్పిటల్ కు నోడల్ అధికారిని నియమించామని , ఆయా హాస్పిటల్ లకు నియమించిన నోడల్ అధికారులు హాస్పిటల్ లో కోవిడ్ మేనేజ్మెంట్ పై పూర్తి స్థాయి పర్యవేక్షణ చే సేలా చర్యలు తీసుకోవాలని   హాస్పిటల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి వరప్రసాద్ ను ఆదేశించారు.ఆస్పత్రిలో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు , బెడ్స్ అందుబాటు తదితర సమాచారాన్ని సంబంధిత నోడల్ అధికారులు  తెలియజేయాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి భోజనం సమయం వరకు హాస్పిటల్ నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన ఆస్పత్రుల్లో ఉండాలని, లేకపోతే వారిపై  కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రులకు నోడల్ ఆఫీసర్లు సరిగా వెళ్లడం లేదని, సక్రమంగా స్పందించడం లేదని రాష్ట్ర స్థాయి నుంచి, కంట్రోల్ రూం నుంచి ఫోన్లు వస్తున్నాయని, అలాకాకుండా నోడల్ ఆఫీసర్లు ఆసుపత్రులకు సక్రమంగా వెళ్లాలని సూచించారు.హెల్ప్ డెస్క్ మేనేజర్లు సక్రమంగా పనిచేసేలా చూడాల ని హాస్పిటల్ నోడల్ అధికారులను ఆదేశించారు.. 

నోడల్ ఆఫీసర్ లు సమన్వయం చేసుకుని పని చేయాలి

కోవిడ్ నేపథ్యంలో టెస్టింగ్, కేర్ అండ్ కౌన్సిలింగ్, కోవిడ్ కేర్ సెంటర్లు, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇలా అన్ని రకాల అంశాలకు సంబంధించి నోడల్ ఆఫీసర్ లను నియమించామని, నోడల్ అధికారులు అంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. పాజిటివ్ వచ్చాక కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి ఫోన్ చేసి హోమ్ ఐసోలేషన్ లో ఉంటారా లేక కోవిడ్ కేర్ సెంటర్ కి వెళ్తారా, లక్షణాలనుబట్టి ఆస్పత్రికి తరలించాలా అనేది నిర్ణయించాలని, ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో మెడికల్ అధికారులు, తహసీల్దార్ ల నుంచి సహకారం అందించాలన్నారు.

ఆక్సిజన్ వృధాను అరికట్టాలి

కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఆసుపత్రికి సంబంధించి  ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేశామని, పాజిటివ్ వచ్చినవారికి ఎంత స్థాయిలో ఆక్సిజన్ అవసరం అని గైడ్ లైన్స్ ప్రకారం  పెట్టాలన్నారు. కొన్ని చోట్ల ఆక్సిజన్ మాస్క్ ను పెట్టేసి అలా వదిలేసి వెళ్ళడం లేక పోతే పాజిటివ్ వ్యక్తులు మాస్క్ తీసేసి పక్కన పెట్టినా చూసుకోక పోవడం వల్ల ఆక్సిజన్ చాలా వృధా జరుగుతోందన్నారు.ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోతున్నారని పరిస్థితిని అర్థం చేసుకుని ఆక్సిజన్ వృధాను అరికట్టాలని సూచించారు. 

104 కాల్ సెంటర్ గురించి అందరికీ తెలియజేయాలి 

కరోనా నేపథ్యంలో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ గురించి ప్రజలందరికీ తెలియజేయాలని, కరోనా గురించి ఏ సమాచారానికైనా, ఎలాంటి వివరాలు కావాలన్నా 104 కి కాల్ చేస్తే వైద్యానికి సంబంధించిన ఏ సమాచారం అయినా అందుతుందన్న విషయాన్ని  ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.  కరోనా లక్షణాలు ఉంటే ఏం చేయాలి టెస్ట్ కు ఎక్కడికి వెళ్ళాలి, డాక్టర్లతో మాట్లాడించడం, హోమ్ ఐ సొలేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అన్ని సలహాలు,సమాచారం 104కు ఫోన్ చేస్తే అందుతుంద న్న విషయాన్ని ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు.. కరోనా  నివారణకు టీమ్ అనంతపురం బాగా పని చేయాలని, కరోనాని అరికట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

అనంతపురం

2021-04-25 13:49:15